12, సెప్టెంబర్ 2018, బుధవారం

తాత మానవుడి చిన్న కధలు (25 )
















తాత మానవుడి చిన్న కధలు (25 )
రచయత: మలాప్రగడ రామకృష్ణ 

తాత నా స్నేహితుడొచ్చాడు వాడికి కొన్ని ప్రశ్నలకు సమాధానములు కావాలి వాటి గురించి వివరాలు తెలుసుకొని రమన్నాడు వాల్ల నాన్న గారు.      
తాతగారు మానాన్నగారు 7 వస్తువులు చూపించి వాటి వివరాలు తేలుకుంటే నీవు వక్రమార్గం వెళ్లకుండా ఉపయోగ పడతాయి అన్నారు. అవి నాకు చూపించాడు నాకు అర్ధ కాలేదు మీకు తెలుస్తే వివరించండి. 
ఇంతకీ ఆ వస్తువులేమిటి " సూది,  దారం, రబ్బర్ , పెన్సిల్, ఓ జెమ్ క్లిప్, ఓ టీ బేగ్, ఒసెల్ " ఉన్నాయ్ 
తాతగారు ఇవి చూసి మీనాన్నగారు ఒక సందేశమ్ వేళ్ళ బుచ్చారు అది వివరంగా వివరిస్తాను, మనవుడా నీవుకూడా విను. 
సూది: అనేది బెజ్జములు చేయుటకు ఉపయోగ పడుతుంది తప్ప అది దేనికి పనికి రాదు కానీ దానికి తోడుగా సూది చివర బెజ్జంలో దారం దూర్చితే ఉపయోగం ఎక్కువా. ఏవైనా చిరుగులు కుట్ట టానికి వీలు ఉంటుంది అట్లాగే ప్రతిఒక్కరు రొక్కరి సహాయంతో మంచి పనులు చేయగలరనే సందేశం                        
రబ్బర్: మనం చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని ఇది గుర్తు చేస్తుంది. మనకు ఎంతటి సమస్య వచ్చిన దానికి అనుగుణంగా సాగాలి కానీ లొంగి పోయి విడిపోకూడదని గుర్తు చేస్తుంది. 
పెన్సిల్ : కొత్త విషయాలను తెలుసుకొని వ్రాసు కోవటానికి ఉపయోగ పడును. చెక్కినకొద్దీ ములుకు బయట పడును అట్లాగే కొత్త విషయాలు తెలిసికొన్న కొద్దీ మన మేధస్సు పెరుగును. 
ఓ జెమ్ క్లిప్: కాగితాలు చెల్లా చెదర కుండా కలిపి ఉంచుతుంది. అట్లాగే మనుషులంతా సముఖ్యంగా ఉండాలని అర్ధం.         
ఓ టీ బేగ్: వేడినీళ్ళల్లో టీ బేగ్ కాగి టీ రసాన్ని అందిస్తుంది అట్లాగే కష్టాలు పేట వారికీ కూడా క్షమించి ఉన్నదంతా పంచటమే ఇందులోని అర్ధం.
తాత సెల్ గురించి నేను చెపుతా 
చెప్పురా మనవుడా : ఎంచక్క సినిమాలు చూడచ్చు, వార్తలు వినవచ్చు కదా తాత
అంటే కాదు తెలుసుకోవాలన్న విషయాన్నీ అందు టైపు చేస్తే సమాధానము వెంటనే  దొరుకుతుంది. 
అట్లయితే " ఇప్పుడు నేను ఏంచేస్తున్నానో చెప్పు అంటే వస్తుందా అడిగాడు మనవుడు
ఖచ్చితంగా వస్తుంది ఆడి అడిగిన సమాధానములను వరుసగా చెప్పుకుంటూ పోతే. 
తాత ఈరోజు చాలా మంచి విషయాలు చెప్పావ్ సంతోషంగా ఉన్నది. 
మా స్నేహితుణ్ని పంపి ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళాడు మనవుడు.          
--((**))--
Image may contain: 1 person, mountain, sky, outdoor and nature
తాతమనవుడి చిన్న కధలు (24) 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

తాత నమ్మకం అంటే ఏమిటి ?  
మనవుడా నమ్మకం కలిగించే మాటలు మనిషి హృదయాన్ని కదిలిస్తాయి. అవే దేవుని మాటలుగా నమ్మి కొలుస్తారు.
   
అనగా అనగా ఒక పురాణశాస్త్రులు ఉండేవాడు. సాయం సమయాలలో ఆయన ప్రవచనాలను చెప్తు  ఉండేవాడు. ప్రక్క ఊళ్ళనుంచి పెరుగు అమ్ముకునే కొందరు స్త్రీలు ఒకరోజున ఈయన మంచి మాటలను విన్నారు వాటి సారాంశం - 'భగవంతుడిని నమ్ముకుంటే నీళ్ళమీద నడిచేయగలం' అని! ఈ మాట వాళ్ళకి బాగా పట్టింది; ఆ రోజునుండి వాళ్ళు దేవుణ్ణి తలచుకుంటూ, ఆయనమీదే భారంవేసి నడిచేయగలిగారు. ఇలా కొన్నాళ్ళు గడిచాక, వాళ్ళలో ఒకామె అంది కదా - ' ఈ పంతులుగారు మనకి పడవ ప్రయాణం ఖర్చు తగ్గించాడు కాబట్టి ఒక పంచెల జత ఇచ్చి గౌరవించుదాం' - అని; సరే అన్నారు మిగిలినవాళ్ళు. మరుసటిరోజున శాస్త్రులవారిని వాళ్ళ ఊరికి పిలిచారు. ఈయనా సరేనన్నాడు. తీరా నది దగ్గరకొచ్చాక, 'పడవేది?" - అని అడిగాడీయన. 'అదేంటయ్యవారూ! మీరే కదా అన్నారు - దేవుణ్ణి నమ్మితే పడవ అక్కర్లేకుండానే నదులను దాటేయవచ్చు- అని!' అన్నారు వాళ్ళు. అయినా, ఈయనకేమో నమ్మకం కలగలేదు అప్పటికీ! ' ఏదీ! నడిచి చూపించండి?' అనడిగాడు. వాళ్ళు నిస్సంకోచంగా నడిచి అటువైపుకి వెళ్ళిపోయారు, ఈయనేమో తటపటాయిస్తూ మొదటి అడుగు వేశాడు గానీ నీళ్ళలోకి పడిపోయాడు!
చెప్పెనవారికి చేతకాలేదు, నమ్మిన వారు నీటిపై నడిచి వెళ్లగలిగినారు అదే దేవుడి లీల   
దీనినుండి మనం తెలుసుకోదగ్గ విషయా లేమిటంటే (నీకు తోచినవి చెప్పు మనవుడా )

1) నమ్మకం మనలను చాలా దూరం తీసుకెళ్తుంది.
ఏ మతంలోనైనా ముఖ్యమైనవి - పవిత్రమైన ఆలోచనలు, క్రమశిక్షణ, సర్వాత్మభావం, వేరే మనుషులను ఇబ్బంది/బాధపెట్టకుండా మన పనులను మనం చేసుకుపోతూండడం, “అంతా దేవుడి అధీనంలో ఉంది, ఆయనే అధికారి కాబట్టి మనకు ఏయే ఫలాలనివ్వాలో ఆయనకే బాగా తెలుసు..” అనే నమ్మకం. ఇవి చాలు. ఆర్భాటం, హడావుడి, దంభం అక్కర్లేదు.
ఆడుతూ, పాడుతూ, అట్టహాసంలేకుండా మన ధర్మాన్ని మనం నిర్వర్తించుకోవచ్చు.

2) చెప్పింది చేయలేనివాడికి/చెప్తున్నదాంట్లో నమ్మకం లేనివాడికి మహా వస్తే ‘భుక్తి వస్తుంది కానీ ముక్తి రాదు.’

3) ఇంకా ముఖ్యమైనది: 'ఎంతోమంది స్వాములు, దేవదూతలు, భూతవైద్యుల్లాగ మేకప్పులు చేసుకుని మాట్లాడే పరాన్నభుక్కులు' - ఎన్నెన్నో అంటూంటారు/బోధిస్తూంటారు. వాళ్ళు చెప్పేదాంట్లో మనకి పనికొచ్చేవి కూడా చాలా ఉంటాయి. వాటిని మాత్రమే మనం స్వీకరించి లాభం పొందచ్చు. వాళ్ళలో మాత్రం చాలామందికి ఆ ప్రయోజనం కలగకపోవచ్చు. అలాంటివాళ్ళను మూర్ఖంగా ఆరాధించక్కర్లేదు - జాలిపడి వదిలేద్దాం.
ఇవే కాకుండా నమ్మకమే మనస్సుకు ప్రశాంతత కల్పిస్తుంది.
అవును తాత మీరు చెప్పే మాటలు, కధలు నా మనస్సుకు నమ్మకం కలిగిస్తాయి.

మనిషి నమ్మకమే బ్రతుకు, దేవునిపై నమ్మకమే జీవితం అని గుర్తుంచుకో 

--((**))--
  



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి