24, సెప్టెంబర్ 2018, సోమవారం

నేటి సూక్తులు





పోతన పద్య మధురి.!
.
శీలికి, నీతిశాలికి, వశీకృతశూలికి, బాణ హస్త ని
ర్మూలికి, ఘోర నీరదవిముక్త శిలాహతగోపగోపికా
పాలికి, వర్ణధర్మపరిపాలికి నర్జునభూజయుగ్మ సం
చాలికి, మాలికిన్, విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్.
.
భావము:

శీలవంతుడికి; నీతిమంతుడికి; త్రిశూలధారియైన శివుణ్ణి వశం చేసుకున్నవాడికి; బాణాసురుని బాహువులు ఖండించిన వాడికి; ఇంద్రుని పంపున మేఘాల నుండి కురిసిన రాళ్ల జల్లుకు చెల్లా చెదరైన గోపాలురను, గోపికలను కాపాడినవాడికి; వర్ణాశ్రమ ధర్మాలను ఉద్ధరించిన వాడికి; జంట మద్ది చెట్లు పెల్లగించినవాడికి; వనమాల ధరించు వాడికి; సైంధవ సంహార సమయాన తన చేతి చక్రంతో సూర్యమండలాన్ని కప్పివేసినవాడికి.

నేటి సూక్తులు 

శ్లో === సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాతా దయా సఖా |
శాంతిహ్ పత్నీ క్షమా పుత్త్ర శ్శాడేతే మమ బాంధవః ||


భావము === సత్యమే తల్లీ, జ్ఞానమే తండ్రి, ధర్మమే సోదరుడు, దయయే మిత్రుడు, శాంతియే భార్య, ఒరిమియే కొడుకు, ఈ ఆరుగురు ధర్మనకు బంధువులు.

--((**))__

ధనము లేకపోతె 

శ్లో === మాతా విన్దతి నాభినన్ధతి పితా భ్రాతాన సంభాషతే | 
భ్రుత్యః కుష్యతి నాను గచ్చతి సుతః కాన్తా పి నాలింగతే || 
అర్ధప్రార్ధన శజ్కయా నా కురుతే సల్లపమాత్రం సుహ్రు | 
త్తస్మా న్నైతిక మర్ధమార్జయ శృణు సఖే హ్యర్దేన సర్వే వశాః|| ......   1

భావము === తల్లీ తూలనాడుతుంది. తండ్రి సంతో షింపడు. అన్నదమ్ముల మాట్లాడరు. నౌకరు కూడా విసుక్కొనును. కొడుకు సహాయపడడు. భార్య కౌగిలివ్వదు. అప్పు అడుగు తాడని స్నేహితుడు మాట్లాడడు. కాబట్టి ధర్మ యుక్తంగా మంచి మార్గంలో ధనాన్ని సంపాదించాలి. ధనముచే అందరూ లొంగుదురు. లేనిచో పరిస్థితి పైవిధముగా నే యుండును .

శ్లో === అర్ధానా మార్జానే దుఃఖ మార్జితానాం చ రక్షణే |
అయే దుఃఖ వ్యయే దుఃఖం ధీ గర్ధం దుఃఖ భాజనమ్ ||

భావము === ధనము సంపాదిమ్చేటప్పుడు కష్టనష్టాలు వస్తాయి. అనగా దుఃఖము కలుగుతుంది. సంపాదించిన ధనము కాపాడు కోవటానికి దుఃఖము దానిమీద ఇంకనూ ఆదాయము రాలేదని దుఃఖము, ఖర్చు అవుతుంటే దుఃఖము ఇన్న దుఃఖము లను ధనము కలుగ చేస్తుంది, కావున ధనేమే దుఃఖ హేతువని గ్రహించాలి.

డబ్బుకు లోకం దాసోహం, ధనమేరా ఇదం జగత్ , డబ్బులేనిదే డప్పుకు కూడా కొఱగాడు, ధనం  ఉంటె పట్టిందల్లా  బంగారం,   

గీ === పరపజ్జను పస్సిస్సా నిచ్చం ఉజ్ఘాన సజ్జనో,
అసవా తస్స్ పద్దన్తి అరా సో అసవక్ఖయా                      ..... 2


భావము === ఇతరుల దోషములను వెదుకుచు, తన్నావా మానంచినట్లు పరులపై చిరచిర లాడువానికి విషయ వికారములు వృద్ది నొందును. అట్టి వానికి విషయ వికారములు త్వరగా తగ్గవు.


ఆశపరులకు, అనుమాన పరులకు, ఏ పరిస్థితుల్లోనూ నిద్ర రాదు. ఇతరుల దోషములను లెక్కించుటకు పాండిత్యము అక్కరలేదు. తన తప్పుల తెలిసి కొనుట చాల కష్టము. కాని ఇతరుల దోషములను పొట్టువలె తూర్పార పట్టును. మోసగాడగు జూదరి పాచికను బోలె తనదోష మును దాచి కొనును.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి