15, సెప్టెంబర్ 2018, శనివారం

ఆరాధ్య ప్రేమ లీల -6


0.0
0000000000000
ఆరాధ్య ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ప్రేమంటే చెప్పుకోలేని, చూపలేని, తియ్యని చిన్ని బాధ   
- ప్రేమంటే కక్క లేని ఇముడ్చు కోలేని నల్గె వెర్రి బాధ   

ప్రేమంటే మనస్సును నిల్వనియ్యదు ఆశతో పిచ్చి బాధ  
- ప్రేమంటే నూనెలోన నాని వెలుగు నందించే వత్తి బాధ 

ప్రేమంటే రాళ్ల దెబ్బల్తో రక్తం కారి మారని ఈతి బాధ  
- ప్రేమంటే మాటలు లేక మౌనంతో పొందే పిచ్చి అగ్గి బాధ  

ప్రేమంటే గాత్రంతొ హృదయాన్ని  రంజింప చేసే గీత బాధ 
- ప్రేమంటే సుఖ దుఖాల కలయిక తో  బ్రహ్మ రాత భాధ  

ప్రేమ అందరిలో సుఖం లాంటి బాధ 
ప్రేమ తాపత్రయ బ్రహ్మ చర్య బాధ 
ప్రేమ జిహ్వచాపల్యంతో నలిగే బాధ 
సృష్టి,స్థితి,లయ,అంతర్ధానం, పునరుత్పత్తి 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--



ఆరాధ్య ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

మనసులోని మాట తెల్పలేక ఎలా ఎలా నొప్పింతువు 
- ఆలోచించక తొందర పడి మనిషి నెలా నొప్పింతువు 

మౌనాన్ని గమనించక నీవు స్వరంతో ఎలా నొప్పింతువు 
- నిజం తెలిసి అబద్దాన్ని నిజమని ఎలా నొప్పింతువు 

అతనెవరో, ఎక్కడివాడో తెలిసి ఎలా నొప్పింతువు  
- నేనే నీవు, నీవే నేను అని పాటలా ఎలా నొప్పింతువు 

చూసి ఉండలేవు, చెప్పలేవు అయినా ఎలా నొప్పింతువు   
- ప్రాణం లేని మనిషిగా ఉండక శ్వాస నెలా నొప్పింతువు 

మగతనం లేక భార్యనెలా నొప్పింతువు 
శీలం అర్పించాక భర్త నెలా నొప్పింతువు 
పామై ఉండి పక్కలో ఎలా నొప్పింతువు 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--




ఆరాధ్య ప్రేమ లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ప్రేమ పక్షుల ఆరాటం - కొత్త జీవం పురుడు పోసుకోవాలని అల్లుకోగా 
- అలల గాలి కారాటం - కడలి పొంగు సమస్త ఖనిజాలను అల్లుకోగా 

చినుకు పూల కారటం - పుడమిని చేరి విత్తుల మొక్కలను అల్లుకోగా   
- కోపావేశాల కరాటం - నమ్మకంతో అనుకున్నది పొందేందుకు అల్లుకోగా 

చిత్త శుద్ధికి ఆరాటం - జ్ఞానము పొందే విజ్ఞానాన్ని పంచేందుకు అల్లుకోగా 
- భావ జలధి కారాటం - రాగం తానం పల్లవితో అనురాగము అల్లుకోగా 

ఇంద్ర ధనువు కరాటం - నింగి నెల సప్త రంగులతో కాంక్షగా అల్లుకోగా 
- ప్రణయగీతం ఆరాటం - తనువూ తనువూ తమకంతో దీక్షగా అల్లుకోగా 

ఆరాటం లేనిదే పోరాటం ఉండదు 
శ్వాస వాణి అల్లుకోగా ఇరకాటం 
భందమైన గంధాలే జీవితం 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా    
-=-((**))--





ఆరాధ్య ప్రేమ లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ     

కనువిందౌ మసక చీకటి - కనులకు మాయను కమ్మిన వేళ   
- కళ్ళ కేమో తెలియని పోటి - కమ్ముకున్న వేలుగుపంచేవేళ

అనుకోని త్రుప్తి చెందే పోటి - కమ్ముకున్న చీకటి తరిమే వేళ      
- అంగాంగ స్పర్సలతో పోటి - దేహవాంచ కర్గి చల్లపడే వేళ

వచ్చి వాలి ముంగిట్లో పోటి - ఇరువురు ఆలింగనం పొందేవేళ      
- మచ్చికతో మత్తుగా పోటి - నువ్వా నేనా అంటూ తృప్తి పర్చే వేళ  

నచ్చిన పని ఒత్తుగా పోటి -  వళ్ళు గుల్ల గుల్లగా మారే వేళ
- ప్రేమ సంతృప్తి చెందే పోటి - జీవితాన్ని సుఖంగా మార్చిన వేళ
     
పువ్వులో మత్తు - నవ్వులో చిత్తు 
కొవ్వులో ఒత్తు  - రివ్వులో ఎత్తు 
జీవితరంగం - ఒక చదరంగం 
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--



ఆరాధ్య ప్రేమ లీల 
రచయత: మల్లాప్రగ్గడ రామకృష్ణ 

ఎక్కువ విని, తక్కువ మాట్లాడే అర్ధాల పరమార్ధమే జీవితం
- మౌన వీణ శృతి చిక్కక మనో గతభావం చెప్పఁటమే జీవితం 

పున్నమి వెన్నలను ఆస్వాదించి సంసారం చేయటమే జీవితం    
- కలువ పువ్వులా విచ్చుకొని శ్రమించి సుఖం పొందటమే జీవితం

సత్యం భోధపడక, సహజత్వం వీడలేక ఉండటమే జీవితం 
- మతి తప్పి, బుద్ధి వికసించి, ధనం చుట్టు తిరగడమే జీవితం

అవసరం లేని ప్రశ్నలు ఆలోచించి బుధ్ధి మార్చటమే జీవితం
- ప్రేమ అనే ఆకలితో పోరాడి మృత్యువుతో పోరాటమే  జీవితం       

కంటికి జోడు, చేతికి కర్ర 
 క్షిణించే శక్తి , హీన స్వరం  
పండ్లు ఊడి, దేహమస్తిరం
దైవప్రార్థనే యవ్వన సుఖం 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి