3, అక్టోబర్ 2018, బుధవారం

ఆరాధ్య లీల (ఛందస్సు ) *




 ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ: - శ్రీ కృష్ణాయనమ:
Indian art
అందరి ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం  

నేటి కవిత 
ప్రాంజలి ప్రభ 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ

నేను రెండు కళ్ళ భూతాన్ని
కళ్ళతో చూసి నిజం తెల్ప లక్ష్యం 
నేను ధరిస్తా యజ్నోవేతాన్ని
అది నాకు కుల ధర్మ కవచం

నేను వ్రాసేది వైప్లవ్వ గీతాన్ని
మనసుకు కల్గించు ఉపశమనం
నేను వింటాను పద్యప్రవచనాన్ని
తెలుసు కోవటమే నిత్య ధర్మం

నేను ఉపయోగిస్తా శరళ స్వరాన్ని
మనస్సు హత్తుకొనే పద జాలం
నేను అందిస్తా సాహిత్య నైవేద్యాన్ని
అది నాకు కల్గించు ఉజ్వల తేజం

అవసరాన్ని బట్టి అస్రనైపుణ్యాన్ని
అధర్మాన్ని అరికట్ఠే తర్పణం
నేను యెప్పుడు చూపను ఉద్రేకాన్ని
నాలో శాంతి సమ్మోహ సమూహం

నేను ఏర్పరుచు కున్నా దుర్గాన్ని 
దిక్దేవతలకు నిత్యం ఆహ్వనం
నేను ఏర్పరుచు కున్నా స్వర్గాన్ని
అదినాకు నిత్య ప్రేమా దివ్య నిలయం
--((*))--

Half saree

క్రిష్ణ లో పడవ ప్రయాణం చేస్తున్నారు కొత్తగా పెళ్లి అయిన "బాలు", "స్నిగ్ధూ"...కూడా అతని తల్లి కూడా వుంది!! 
స్నిగ్ధ పడవలో ,అన్దరూ "స్నిగ్ధ" కేసే చూస్తున్నారు !! 
ఇంతలో పడవ అటూ ఇటూ వూగిసలాడిన్ది !! 
జనం ఖంగారు పడ్డారు !! 
"ఏమండీ!! ఒక వేళ పడవ మునిగి పొతే, మీరు మీ అమ్మగారినే ముందు రక్షించండి !!" 
"అదేమిటీ స్నిగ్ధ....మరి నువ్వో!!....నిన్నే రక్షిస్తాను లే ..." 
"వద్దు వద్దు ...ఎం పర్వాలేదు ముందు మీ అమ్మని రక్షించుకోండి!!" 
"మా అమ్మని రక్షిస్తూ కూర్చుంటె మరి నువ్వు మునిగి పోతావ్ కదా!!?" 
"నాదేముంది ...నేను నీళ్ల లో పడిపోతే ఈత రాని వాళ్లు కూడా దూకుతారు నన్ను కాపాడడానికి....

సేకరణ 

హనుమంతుని శరీరానికి సింధూరం ఎందుకు ఉంటుంది? 
ఒంటి మీద సింధూరం వర్ణం లేని హనుమంతున్ని విగ్రహం అరుదు. ఇంతకి ఆంజనేయుడు సింధురపు రంగులో ఎందుకు ఉంటాడు! అనే సందేహం వెనుక ఓక ఆదర్శవంతమైన కథ ఉంది..అదేమిటంటే 
ఓక రోజు హనుమంతుల వారు శ్రీరాముని అంతఃపురం లోకి ప్రవేశించాడు..అలా ప్రవేశించే సమయంలో సీతమ్మ తన పాపిట సింధురాన్నీ అద్దుకోవడం గమనించాడు ఆంజనేయుడు...సీతమ్మ వారు అలా పాపిట సింధురాన్నీ అలముకోవడం చూసి ఆయనకు భలే ఆశ్చరయం వేసింది.... 

సీతమ్మ చెంతకు అడుగులో అడుగు వేసుకుంటూ అమ్మా మీరు నుదుటిన ఆ సింధురాన్నీ ఎందుకు ధరిస్తున్నారు అని అడిగాడు..హనుమా! నా స్వామికి సంతోషాన్ని కలిగించేందుకు ఇలా రోజు సింధురాన్నీ ధరిస్తాను పైగా ఇలా పాపిట సింధురాన్నీ ధరించడం వల్ల ఆయనా దీర్ఘాయుష్షులుగా ఉంటారన్నది నా నమ్మకం! అంటూ చిరు నవ్వుతో సెలవిచ్చింది జానకి.. 
సీతమ్మ మాటలు విన్న హనుమంతుని సంతోశానికి 
అవధులు లేకుండా పోయాయి...సీతమ్మ పాపిట వెనుక తన స్వామి శ్రేయస్సు,సంతోషం ఉన్నాయా?అనుకొని మురిసిపోయాడు...వెంటనే ఆయన మనసులో ఓక ఉపాయం మెదిలింది..ఈ కాస్త సింధురాన్నీ ధరిస్తేనే స్వామి వారి ఆయుష్షు పెరుగుతుంది అంటే...మరి ఒంటి నిండా సింధురాన్నీ ధరిస్తే తిరుగేముంది అనుకున్నాడు...అనుకున్నదే ఆలస్యం తన ఒంటి నిండా నూనె కలిపిన సింధురాన్నీ ధరించాడు... 
శిరస్సు నుంచి పాదాల వరకు మెరిసిపోతున్న ఆంజనేయుడు...నేరుగా రాముని దర్భారులో ప్రవేశించాడు..ఆ స్థితిలో హనుమంతున్ని చుసిన రాముడు ఆశ్చర్యానికి అవదులు లేకపోయాయి.. 
ఏంటి హనుమా! ఒంటి నిండా ఏమిటి ఆ రంగు' అని చిరునవ్వుతో అడిగాడు... 
స్వామీ సీతమ్మ తన పాపిట సింధూరం దరిస్తే మీకు సంతోషమూ, ఆయుష్షు వృద్ది చెందుతాయని సెలవిచ్చారు....మరి నేను ఒంటినిండా సింధూరాన్ని అలముకుంటే మరెంత కలుగుతుందోకదా అందుకనే ఇలా...'అంటూ చెప్పుకొచ్చాడు... 
హనుమంతునికి తన మనస్సులో తన పట్ల ఉన్న ఆరాదనని గమనించిన రాముని సంతోషానికి అవదులు లేకుండా పోయాయి...హనుమ నువ్వు నా భక్తులందరికీ మరొక సారీ ఆదర్శంగా నిలిచావు.. 
ఇక మీదట నీ సింధురాన్నీ ఎవరైతే ధరిస్తారో...వాళ్లు నీ అనుగ్రహానికే కాదు , నా అనుగ్రహానికి కూడా పాత్రులవుతారు ' అంటూ ఆశీర్వదించారు... 
అదిగో అప్పటి నుంచీ హనుమంతుల వారు నిత్యం సింధూర వర్ణంలో మెరిసిపోవడం , ఆయన సింధూరాన్ని మనమూ కాస్త నుదిటిన అద్దుకోవడం ఆనవాయితీగా వస్తోంది...ఆయన అనుగ్రహమూ భక్తులకు లభిస్తుంది.. 

ఈ కథను ప్రతీ హిందువు చదవ వలసిందిగా కోరుతున్నాను... 
జై శ్రీరామ్..🙏🙏

ఏమోయ్ పానకాలు! 
అప్పు తీసుకుని ఆరు నెలలైంది, 
తీర్చేదేమైనా వుందా అని అడుగుతున్నాను! 
అదేమిటి మాష్టారూ! మీరు నాకు డబ్బిచ్చినప్పుడే చెప్పేను కదా! 
ఏం చెప్పవోయ్? 
మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనని

"శెహబాష్! నేను నిద్రిస్తున్న సమయంలోనే నాకు తెలీకుండానే గెడ్డం గీసేసావ్, ఏం కావాలో కోరుకోవోయ్" 

మీరు మాట తప్పరుగా మహాప్రభో" 

"పీక పోయినా మాట తప్పనోయ్ " 

"ఐతే నాకు మంత్రి పదవి కావాలి ప్రభూ " 
*************** 
టూరింగ్ టాకీసులు -- మొక్కులు !! 

ఆ ఆడపిల్లలు ఇద్దరూ ఏడేళ్ళు దాటలేదు. 
ఏడు గంటల సినిమాకి వెళ్లారు. 

ఆ టూరింగ్ టాకీసులో సినిమా చూస్తున్నప్పుడు కరెంటు పొతే తిరుమలలో తలనీలాలు ఇస్తానని మొక్కుకుంది అక్కయ్య . 

వెంటనే కరెంటు వచ్చింది. 

అరగంట సినిమా చూశారు. 
మళ్ళీ కరెంటు పోయింది. 

ఈసారి ఏం మొక్కుతుంది? పక్కన చెల్లెలు ఉన్నది కదా !! 

చెల్లెలును మొక్కుకోమని చెప్పింది. 
పాపం అక్క చెప్పింది కదా !! పైగా సినిమా ? 
కత్తి కాంతారావు సినిమా !! చెల్లెలు మొక్కుకుంది. 

మన ఏడుకొండల స్వామి భక్త సులభుడు కదా !! 

వెంటనే కరెంటు వచ్చింది. 

అక్కా చెల్లెళ్ళు మరి బ్రేక్ లేకుండా సినిమా చూసి ఇంటికొచ్చి 

అమ్మకి తమ మొక్కుల సంగతి చెప్పారు. 

ఆవిడ " ఓసి మీ అమ్మ కడుపు బంగారం కాను ! మనింట్లో కొబ్బరి చెట్లు బాగా ఉన్నాయి కదర్రా!! కొబ్బరి కాయలు మొక్కుకో పొయినారా? 

! ఈసారి అలాంటి మొక్కులు మొక్కండి." అంటూ మరుసటి రోజే 

తిరుపతి ప్రయాణమయ్యి, ఇద్దరి ఆడపిల్లల తలనీలాలు స్వామి కి 

ఇచ్చి మొక్కు తీర్చుకు వచ్చింది. 

వాళ్లిద్దరూ బామ్మలయ్యారు. 

మన స్వామి పై అదే భక్తి !! 

ఆపద మొక్కుల వాడా !! వెంకట రమణ గోవిందా !! గోవిందా !!

బామ్మర్దీ! కొత్తగా పెళ్ళయినవాడివి కదాని ఓ ముఖ్యమైన పాయింట్ చెబుతున్నా,జాగ్రత్త 

చెప్పండి బావగారు 

ఓరేయ్.. ఏది మర్చిపోయినా మీ ఆవిడ పుట్టిన రోజును మాత్రం మర్చిపోకు.. 

అంత కచ్చితంగా గుర్తుపెట్టుకోవడం ఎలా బావగారూ..? 

ఓహో! అలాగా 
ఏమీ లేదు.. ఒక్కసారి మర్చిపో చాలు.. ఆపైన జీవితాంతం గుర్తుండిపోతుంది..!


--((**))--


*అయ్యప్ప బంధనం కథ*

మిగిలిన దేవతామూర్తులతో పోలిస్తే శ్రీ అయ్యప్పస్వామివారు యోగాసనంలో కూర్చుని, చిన్ముద్ర ధారియై భక్తులకు అభయమిస్తుంటారు. అయ్యప్పస్వామి వారి మోకాళ్ల చుట్టూ ఒక బంధనం ఉంటుంది. దాన్ని ‘పట్టు బంధనం’ అంటారు.

 పందళ రాజు వద్ద పన్నెండు సంవత్సరములు పెరిగిన శ్రీ మణికంఠుడు తాను హరిహర సుతుడనని, ధర్మాన్ని శాసించుట కోసం ఆవిర్భవించానన్న సత్యాన్ని నారద మహర్షి ద్వారా తెలుసుకుంటారు.

మహిషిని వధించిన తర్వాత శబరిమల ఆలయంలో చిన్ముద్ర దాల్చి యోగాసన పద్ధతిలో జ్ఞాన పీఠముపై కూర్చుని భక్తులను అనుగ్రహిస్తుంటారు. శబరిగిరిపై ఆలయం కట్టించి, స్వామి ఆభరణములను మోసుకుంటూ పద్దెనిమిది మెట్లెక్కి పందళరాజు వస్తారు. తండ్రి అయిన పందళరాజు రాకను గుర్తించిన స్వామివారు యోగాసనం నుంచి లేచి నిలబడటానికి ప్రయత్నిస్తారు. అంతట పందళరాజు స్వామివారిని నిలువరించి తన భుజాన ఉన్న పట్టు వస్త్రంతో శ్రీస్వామివారి మోకాళ్లకు ఆ వస్త్రం చుట్టి బంధిస్తారు. తాను ఇక్కడ అయ్యప్పస్వామిని ఏ విధంగానైతే చూసి తరించిపోయానో అదేవిధంగా మిగిలిన భక్తులు ఇదే రూపంలో స్వామివారిని చూసి తరించిపోవాలని అయ్యప్పస్వామిని ప్రార్థించగా, ఆయన అనుగ్రహించారట. అలా కట్టి ఉన్నదానిని పట్టు బంధం అంటారు. దీన్ని శివకేశవులను ఐక్య పరిచిన బంధమని కూడా అంటారు.
--((**))--


*శ్రీ  తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారికీ  నిత్యమూ అలంకరించే దండలు-*

*1.శిఖామణి* :- కిరీటం మీదనుంచి రెండు భుజాలమీది వరకూ అలంకరింపబడే ఒకే ఒక దండను శిఖామణి అంటారు. ఇది 8 మూరల దండ.

*2. సాలిగ్రామ మాల* :- శ్రీవారి భుజాల నుండి ఇరువైపులా పాదాలవరకు వేలాడుతూ వున్న సాలిగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు.. ఇవి రెండుమాలలు. ఒక్కొక్కటీ సుమారు 4 మూరలు.

*3. కంఠసరి* :- మెడలో రెండు పోర్వలుగా రెండు భుజాలమీదికి అలంకరింపబడే దండ- ఇది సుమారు మూడున్నర మూరలు.

*4. వక్షఃస్థల లక్ష్మిః* :- శ్రీ స్వామివారి వక్షః స్ధలంలో వున్న శ్రీదేవి భూదేవులకు రెండు దండలు. ఒక్కొక్కటి సుమారు ఒకటిన్నర మూర.

*5. శంఖు చక్రాలకు*:- రెండు దండలు.. ఒక్కొక్కటి ఒక మూర.

*6. కఠారిసరం*:- శ్రీ స్వామివారి బొడ్డునవున్న నందక ఖడ్గానికి అలంకరించే దండ ఒకటి 2 మూరలు.

*7.తావళములు*:- రెండు మోచేతులకింద, నడుమునుండి మోకాళ్ళపై హారాలుగా మోకాళ్ళ నుండి పాదాలవరకూ జీరాడుతూ వ్రేలాడదీసే మూడు దండలు వరుసగా-మూడుమూరలు, మూడున్నర మూరలు, 4 మూరలు.

*8. తిరువడి దండలు*:- శ్రీ స్వామివారి పాదలపై చుట్టూ అలంకరించే రెండు దండలు. ఒక్కొక్కటి ఒక్క మూర.

*9.పూలంగి సేవ*: ప్రతీ గురువారం సాయంత్రం జరిగే పూలంగిసేవలో మాత్రమే శ్రీ స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి, పైన పేర్కొన్న మాలలతో పాటు నిలువెల్ల స్వామివారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు.

ఇక ఉత్సవమూర్తులకు నిత్యమూ అలంకరించడానికి *20* పూల దండలు, బేడీ ఆంజనేయస్వామి తో సహా తిరుమల కొండపై గల ఇతర విగ్రహమూర్తులకు నిత్యం అలంకరించడానికి దాదాపు *14* పూలదండలు, కొనేటి గట్టు ఆంజనేయస్వామికి ప్రతీ ఆదివారం ఒకదండ కూడా ఈ *పూలఅర*లో కూర్చబడతాయి.



ఇంతమాత్రమే గాక శ్రీ స్వామివారి నిత్యకల్యాణోత్సవం- వసంతోత్సవం-ఊరేగింపులకు కూడా ప్రత్యేక పూలమాలలు ఈ *పూలఅర*లో కూర్చబడతాయి..


--((**))--


నేటి సాహిత్యము  
*అష్టవిధ బ్రాహ్మణులు*

ధర్మశాస్త్రాలు బ్రాహ్మణుని స్థాయిని బట్టి 8 విధాలుగా వర్ణించాయి. 
అవి:
*1 మాత్రుడు:* బ్రాహ్మణకులంలో జన్మించినా, ఉపనయనము, అనుష్ఠానమూ లేని వాడు.

*2 బ్రహ్మణుడు:* వేదాలను కొంతమేరకే అధ్యయనం చేసినవాడు. అయితే, ఆచారమూ, శాంతి, సత్యము, దయ కల వాడు, ఆ బుద్ధి కలిగినవాడు.

*3 శ్రోత్రియుడు:* కనీసం ఒక వేదం శాఖను, కల్ప సూత్రాలతో, షడంగములతో,అధ్యయనం చేసి, యజ్ఞాది షట్కర్మలను చేసేవాడు.

*4 అనుశాసనుడు:* వేదాలను, ఉపనిషత్తులను అధ్యయనం చేసి అర్థం చేసుకున్నవాడు; నిర్మలమైన చిత్తం కలిగి శ్రోత్రియుడి లక్షణాలు కలవాడు.

*5 బ్రూణుడు:* యజ్ఞయాగాదులు, వేదాధ్యయనము, వ్రతాలు చేస్తూ, ఇంద్రియాలను జయించినవాడు; అనుశాసనుడి లక్షణాలు కలవాడు. 

*6 ఋషికల్పుడు:* వైదిక, లౌకిక వ్యవహారములు తెలిసి, గృహస్థుగా వున్నవాడు; బ్రూణుడి లక్షణాలు కలవాడు.

*7 ఋషి: తపస్వి;* కామమూనూ, ఆకలినీ జయించినవాడు, సత్యసంధత కలిగినవాడు; వరములను, శాపములను ఇవ్వగలిగినవాడు.

*8 ముని:* అరిషడ్వర్గములను, ఇంద్రియములను, జయించినవాడు;

వస్తుసంపదలపై మోహము లేనివాడు; మౌనియై సమాధి స్థితి పొందినవాడు.

నేటి ఆద్యాత్మిక కధ 

వేదాలు స్త్రీలను తొక్కేశాయని, స్త్రీలకు స్వేఛ్ఛనివ్వలేదని చాలా ఆరోపణలు చేస్తుంటారు. విద్యార్ధుల పాఠశాల చదువుల్లో, ఐఏఎస్ అభ్యర్ధులకు, ఇతర ఉద్యోగార్ధులకు నిర్వహించే పరీక్షల్లో ఉండే చరిత్రలో కూడా ఇదే వాదన కనిపిస్తుంది. ఇక తమను తాము సంఘ సంస్కర్తలమనీ, అభ్యుదయవాదులమని చెప్పుకునే కొందరు కుహనా మేధావులు ఈ విషయంలో వైదిక సంస్కృతిపై దుమ్మెత్తిపోస్తుంటారు. అసలు వేదాలు స్త్రీల గురించి ఏమన్నాయో కొన్ని విషయాలు చూద్దాం.

*స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి - యజుర్వేదం 10.03*

*స్త్రీలు మంచి కీర్తి గడించాలి - అధర్వణవేదం 14.1.20*

*స్త్రీలు పండితులవ్వాలి - అధర్వణవేదం 11.5.18 (స్త్రీలు 
కూడా విద్యాబోధన చేయాలని చెప్తోంది)*

*స్త్రీ అందరిని జ్ఞానవంతుల్ని చేయాలి - అధర్వణవేదం 14.2.74*

*స్త్రీ ఎప్పుడూ సంపదలతో సుఖంగా ఉండాలి - అధర్వణవేదం 7.47.2*

*స్త్రీలు ఎప్పుడూ జ్ఞానవంతులై, తెలివిగలవారై ఉండాలి - అధర్వణవేదం 7.47.1*

*పరిపాలన విషయంలో స్త్రీలు*
పరిపాలనకు సంబంధించిన సభలు, సమావేశాల్లో స్త్రీలు కూడా పాల్గినాలి - *అధర్వణవేదం 7.38.4*
దేశపరిపాలన, సామాజిక సంస్కరణలు, ప్రభుత్వ కార్యకలాపాలను స్త్రీలు ముందుండి నడిపించాలి- 

*ఋగ్వేదం 10.85.46*
ఈ రోజుక్కూడా ప్రపంచంలో స్త్రీలు పైకి రాకుండా అణిచివేస్తున్నారు. కానీ వేదం ఎంతో స్పష్టంగా స్త్రీల నాయకత్వం గురించి వివరించింది.
ఆస్తిహక్కు

పిత్రార్జితం (తండ్రి కూడబెట్టిన ఆస్తి) లో కుమారుడితో కుమార్తెకు కూడా సమానమైన హక్కు ఉంది- 

*ఋగ్వేదం 3.31.1*
కుటుంబం
సమాజానికి, కుటుంబానికి స్త్రీ రక్షకురాలిగా వ్యవహరించాలి- *అధర్వణవేదం 14.1.20*
స్త్రీ సంపదను, ఆహారాన్ని అందించాలి. శ్రేయస్సును కలిగించేదై ఉండాలి- *అధర్వణవేదం 11.1.17* 
(స్త్రీకి సంపాదన ఉన్నప్పుడే ఆమె కుటుంబానికి సంపదను చేకూర్చగలుగుతుంది)

నీ భర్తకు సంపాదించే మార్గాలు నేర్పించు- *అధర్వణవేదం 7.46.3*
ఉద్యోగాల్లో

*స్త్రీలు కూడా రధాలను నడపాలి- అధర్వణవేదం 9.9.2*

*స్త్రీలు యుద్ధంలో పాల్గొనాలి-యజుర్వేదం 16.44*(ఈ విషయంలో దుర్గాదేవియే స్త్రీలకు ఆదర్శం.
స్త్రీలు బయటకు రాకూడదని వైదిక ధర్మం చెప్పిందంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కానీ వేదం స్త్రీలను యుద్ధంలో కూడా పాల్గొనవలసిందిగా చెప్పింది. కైకేయి దీనికి ఉదాహరణ కదా! 

(శ్రీ రామాయణంలో కైకేయి అడిగిన వరం వల్లనే రాముడు వనవాసానికి వెళతాడు. దశరధుడితో కలిసి శత్రువులపై యుద్ధం చేసిన సమయంలో, ఆమె పరాక్రమం చూసి ఆమెను వరం కోరుకోమనగా, సమయం వచ్చినపుడు అడుగుతానంటుంది. ఇతిహాసంలో అదే పెద్ద ఉదాహరణ).
కమాండర్ తరహాలో స్త్రీ సభలను ఉద్ద్యేశించి ప్రసంగించాలి- 

*ఋగ్వేదం 10.85.26*
విద్యా విషయాల్లో
ఓ స్త్రీలారా! పురుషులతో సమానంగానే మీకు ఈ మంత్రాలు ఇవ్వబడ్డాయి. మీ భావాల్లో సామరస్యం ఉండుగాక! మీరు ఎటువంటి వివక్ష చూపక, అందరికి జ్ఞానాన్ని పంచుదురుగాక! మీ మనసు, చైతన్యం సమన్వయంతో పనిచేయాలి. నేను (ఋషి) పురుషులతో సమానంగా మీకు ఈ మంత్రాలను ఇవ్వడమేగాక, వీటిని అర్థం చేసుకునే శక్తిని మీకు ప్రసాదిస్తున్నాను-

*ఋగ్వేదం 10-191-3*
వేదాల్లోనే మైత్రేయి, గార్గి, లోపాముద్ర వంటి దాదాపు 30 పైగా మంత్రద్రష్టలైన స్త్రీ ఋషుల గురించి చెప్ప బడింది. ఒక్క హిందూ ధర్మంలో తప్ప మరే ఇతర మతంలోనూ స్త్రీదేవతలు ఉండరు. అన్యమతాల్లో ఎక్కడా కూడా స్త్రీలకు భగవంతుడు తన దివ్య సందేశం ఇచ్చినట్టుగా లేదు.

*వివాహం -విద్యాభ్యాసం*


ఓ వధువా! (వధువు అంటే పెళ్ళికూతురు) వైదికజ్ఞానం నీకు అన్ని దిశల నుండి కలగాలి. వేదాల్లో ఉన్న జ్ఞానం పొందిన తరువాతనే నీవు జీవితానికి సంబంధించిన విషయాల మీద నిర్ణయం తీసుకో. నీవు మంచి కీర్తి గడించి, నీకు భర్తకు శుభాలను కలుగచేసేదానివిగా ఉండు. నీ అత్తవారింట్లో గౌరవప్రదమైన జీవితం గడుపు, నీ జ్ఞానంతో వారి ఇంటిని వృద్ధిపరుచు - *అధర్వణవేదం 14-1-64* (ముందు విద్యను పొందండి, ఆ తర్వాతే వివాహం చేసుకోండని స్త్రీలకు ఈ మంత్రంలో భగవంతుడు నిర్దేశించాడు).


ఓంకారం
చాలామంది నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. అలాగే ఎందరో శ్రవణానందం కలిగించే శబ్దాన్ని సంగీతంగా ఇష్టపడతారు.

పంచభూతాల్లో శబ్దం ముందు ఉంది. ఆ శబ్దం ఆకాశం నుంచి వస్తుంది. శబ్దానికి ఆధారం ఓంకారమే!



ఓంకారం దేహంలో ఉంది. ‘ఓం’ అని శబ్దం చేయగానే, ఆ తరంగాలతో దేహం పులకితమవుతుంది. దివ్య ప్రకంపనలు శరీరాన్ని చుట్టుముడతాయి. అప్పుడు శరీరం సహజ ధ్యానంలోకి అత్యంత సహజంగా వెళుతుంది. ఆ తరవాత నిశ్శబ్దంలో ఓలలాడుతుంది.



ఓంకారానికి, ఓంకారానికి మధ్య ఏర్పడుతున్న నిశ్శబ్దాన్ని సాధకుడు గమనించాలి. అక్కడ మనసు ఆగిపోతుంది. ఆ నిశ్చలత్వమే ఓంకారాన్ని ఉద్దీపింపజేస్తుంది. ప్రయత్నపూర్వకంగా ప్రతి రోజూ ఓంకారాన్ని జపిస్తే, కొంతకాలం గడిచాక మనసులో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది.



‘ప్రశాంతత కావాల్సినవారు ఓంకార ధ్యానం చేయాలి’ అంటారు ఓషో. నమ్మకం ఉన్నవారైనా, లేనివారైనా ఓంకారాన్ని జపిస్తూ అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ‘అ’కార, ‘ఉ’కార, ‘మ’కారాలు కలిసి ‘ఓంకారం’ అయిందని పండితులు చెబుతారు.



ఔషధాన్ని నమ్మనివారైనా, దాన్ని తీసుకున్నప్పుడు దాని పని అది చేస్తుంది. ఓంకారమూ అంతే! ఆ శబ్దాన్ని ఉచ్చరించడం మొదలుపెట్టగానే, అది సాధకుల్ని చక్కగా పట్టుకుంటుంది. ఆరోగ్యం కలిగించేవరకు అది విడిచిపెట్టదు- అంటారు యోగ నిపుణులు.



వేదభూమికి ఆధారం ఈశ్వరుడు. ఆయనకు శబ్దరూపం ఓంకారం. ఓంకారంతో ధ్యానంలోకి ప్రవేశిస్తే చాలు. ఆనందం కోసం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం లేదని ఉపనిషత్తులు చెబుతున్నాయి.

ఓంకారం అంటే, ఆనంద స్వరూపం. అది ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, ఆనందమయ కోశాల్ని దాటి వెలుగులీనుతూ ఉంటుంది అది. ఎవరు ఆ ప్రణవ శబ్దం చేస్తారో, వారితో సులువుగా కలుస్తుంది. వారిని తనలో కలుపుతుంది.

నిశ్శబ్దానికి నేపథ్యంగా ఉండేది ఓంకారమే. అది విశ్వంలో ఆత్మగా ఉంది. ఓంకారం- పిలిస్తే పలుకుతుంది. రుషుల చుట్టూ తిరుగుతుంది. ధ్యానుల శరీరాల్ని డమరుకాలు చేస్తుంది. జ్ఞానుల దేహాల్ని పాంచజన్యాలుగా మారుస్తుంది. శ్రీకృష్ణుడి మురళిలోకి ప్రవేశించిన ఓంకారం బృందావనమంతా విహ రించిందని పురాణ గాథలు చెబుతాయి.

ఓంకారం ప్రాణం. చైతన్యం, సత్యం, ఆనందం... అన్నీ ఓంకారమే.
శివుడి మాటలకు భాష ఓంకారం. ఆ శివతాండంలో ఓంకారం ప్రణవ నాదమవుతుంది. ముల్లోకాలూ ఆనంద సాగరంలో తేలియాడేలా చేస్తుంది. ఓంకారమే ప్రకృతిని నడిపిస్తుంది. ఆ ఓంకారాన్ని ఆహ్వానించి, ఆవాహన చేసుకున్న మానవ జన్మ ధన్యమైనట్లే!

ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ... ఇలా ప్రతి నామం ముందూ ఓంకారం భూషణమై వెలుగుతుంది. ప్రతి స్తోత్రమూ ఓంకారంతోనే ప్రారంభమవుతుంది. ప్రతి శ్లోకమూ ఓంకారంతోనే జీవిస్తుంది. ఓంకారంతోనే విశ్వం ప్రారంభమైంది. అది చివరికి ఓంకారంలోనే లీనమవుతుంది. ‘ఓం’ అని ధ్యానిస్తే పరమశివుడికి మోకరిల్లినట్లే!

సకల జీవులూ ఓం తోటలో పూచిన పుష్పాలు. ఓంకార వర్షంతోనే అవి పెరుగుతాయి. ఓంకార కాంతిలోనే అవి హాయిగా జీవిస్తాయి. ఓంకారం వాటికి ప్రాణవాయువు. వాటికి శక్తి, ధైర్యం, శాంతి ఓంకారమే. అందుకే అందరూ ‘ఓం’కారాన్ని శాంతితో జతచేస్తారు. శాంతిలో ‘ఓం’ చూస్తారు.

‘సమస్తం ఓంకారం నుంచే ఉద్భవించింది’ అంటారు కబీర్‌. దైవం ఓంకార ప్రేమ స్వరూపం. ఆయన రూప రహితుడు, నాశన రహితుడు, నిర్గుణుడు. ఆయనతో ఐక్యం కావడానికి యత్నించు. సమస్తమూ ఆయన ఆనందంలోనే ఉంది’ అని చాటిన కబీర్‌ మాటలు అక్షర సత్యాలు!
Urban farming

మహాకవి శ్రీశ్రీ గారి కావ్యము 

స్వర్గనరకముల ఛాయా దేహళి, 
తెలి, నలి తలుపులు తెరచి, మూసికొని 
సర్గ విలయ హేమంత వసంత 
ధ్వాంత కాంతి విక్రాంతి వేళలో, 
చావు పుట్టుకల పొలిమేరలలో 
ఆవులించె నొక చితాగ్ని కుండం! 
అనాధజీవుల సమాధులన్నీ 
అఘోరించి ఘోషించాయి! 
ఇదేమి! లోకం హిరణ్యనేత్రుని 
పదాఘాతమున ప్రతిధ్వనించగ, 
కురుక్షేత్రమున క్రుద్ధవృకోదరు 
గదాఘాతమున గజగజలాడగ, 
జాతి జాతి నిర్ఘాత పాత సం 
ఘాతహేతువై, కాలకేతువై 
అదె సంవర్తపు తుపానుమేఘం 
తొలి గర్జించిన తూర్యవిరావం! 
ప్రదీప్తకీలా ప్రవాళమాలా 
ప్రపంచవేలా ప్రసారములలో, 
మిహిరవాజితతి! మఖవ ధనుర్ద్యుతి! 
పుడమికి నేడే పుట్టిన రోజట!

--((**))--

మహాకవి శ్రీశ్రీ గారి కావ్యము 

అలకలన్నీ ఆట్టకట్టిన, 
బొమికలన్నీ ప్రోవుపట్టిన, 
కాగితంవలె పలచబారిన 
వెర్రివాడా! కుర్రవాడా! 
వీధికంతా వెక్కిరింతగ, 
ఊరికంతా దిష్టిబొమ్మగ, 
తూముప్రక్కన ధూళిలోనే 
తూలుతున్నావా! 
నీవు చూసే వెకిలిచూపూ, 
నీవు తీసే కూనిరాగం, 
మాకు తెలియని నీ ప్రపంచపు 
మహారణ్యపు చిక్కుదారులు! 
వెర్రివాడా! కుర్రవాడా! 
నిన్ను చూసీ చూడనట్లె 
తెలివిమీరిన పెద్దమనుషులు 
తొలగిపోతారు! 
వెర్రివాడా! కుర్రవాడా! 
క్షమిస్తావా? సహిస్తావా? 
బుద్ధిమంతులు నీకు చేసిన 
దురన్యాయాన్ని! 
అట్లు చూడకు, అట్లు పాడకు, 
మమ్ము వేళాకోళ మాడకు! 
వెర్రివాడా! కుర్రవాడా! 
వేడుకుంటాము.

--((**))--
దాశరధీ శతకము నుండి శ్రీ కంచర్ల గోపన్న కవి విరచిత 
ఉ.=== పట్టితి భట్టరార్య గురుపాదము; లిమ్మెయి నూర్ధ్వ పుండ్రంముల్ 
పెట్టితి; మంత్రరాజ మొడిబేట్టితి; నియమ కింకరాలికిం 
గట్టితి బొమ్మ; మీ చరణ కంజము లందు దలంపు పెట్టి పో 
దట్టితి బాప పుంజముల దాశరధీ ! కరుణా పయోనిధీ! 
భావము === రామా! దయాసముద్రా! నేను భట్టరార్యుడను పేరుగల గురువర్యుని పాదములను బట్టితిని. ఈ విధముగా - ఈ మేను నూర్ధ్వ పుండ్ర ములను బెట్టితిని. విష్ణు భక్తుడనైతిని. మంత్ర శ్రేష్టమగు రామనామం నవలంభిం చితిని . ఆ యమ భటులు సమూహము నవమానిమ్చితిని మీ పాద పద్మములను ధ్యానించు చు బాపసమూహమును బారద్రోలితిని.

--((**))--
Photo


నేటి హాస్య కధ

ఒకసారి దువ్వూరి వెంకటరమణశాస్త్రిగారు బెజవాడ నుంచి బందరుకి రైల్లో వెడుతూ ఉండగా రెండు మూడు స్టేషన్లు దాటిన తర్వాత పక్కనున్నాయనని "తరువాత వచ్చే స్టేషన్ ఏమిటండీ?" అని అడిగారట. ఆయన "తరిగొప్పుల" అని చెప్పాడట.

కొంచెం సేపయిన తర్వాత మళ్ళీ "వచ్చే స్టేషన్ పేరు?" అని అడిగితే పక్కనున్నాయన సమాధానం "ఇందుపల్లి" అని. కాస్సేపయిన తరువాత మళ్ళీ ఇప్పుడు వచ్చే స్టేషనేమిటి" అని అడగ్గానే :)

ఆ ప్రక్కనే కూచున్న ఇంకొక ఆయనకి విసుగు పుట్టి ,

"ఏవండీ మీకు సంస్కృతం వచ్చునా?" అని అడిగారట.

దువ్వూరివారు మహాపండితులు,

అప్పుడు ఆయన "ఏదో కొద్దిగా వచ్చులెండి" అని అన్నారు. అప్పుడు ఆ పక్కనున్నాయన "అయితే ఈ శ్లోకం రాసుకోండి - స్టేషన్ల పేర్లన్నీ గుర్తుంటాయి" అని ఇలా చెప్పాడట -:)

" బెరాని ఉత ఇందోగు నూక

వప్పెచిమాః క్రమాత్

స్టేషన్సు బెబం శాఖాయాం

నూక్రాస్యాదితి నిర్ణయః "

అప్పుడు శాస్త్రి గారు రాసుకుని చదువుకున్నారు

బె = బెజవాడ

రా = రామవరప్పాడు

ని = నిడమానూరు

ఉ = ఉప్పులూరు

త = తరిగొప్పుల

ఇం = ఇందుపల్లి

దో = దోసపాడు

గు - గుడ్లవల్లేరు

నూ = నూజెళ్ళ

క = కవుతరం

వ = వడ్లమన్నాడు

పె = పెడన

చి = చిలకలపుడి

మ = మచిలీపట్నం

బెబం = బెజవాడ బందరు మధ్య స్టేషన్లు

కానీ "నూక్రాస్యాత్" అనే పదం అర్థం కాక ఏమిటి అని ఆ పక్కాయన్ని కదిపితే వెంటనే ఆయన

" నూజెళ్ళలో క్రాసింగ్ అవుతుంది " అని చెప్పి దిగిపోయాట్ట.

ఇంతకీ ఈ శ్లోకం చెప్పిన మహానుభావుడి నామధేయం మాత్రం ఎవరికీ తెలీదు...మీకు తెలిస్తే చెప్పండి.

Photo

గజల్ . 

అసలుప్రేమ గూటికి నను..చేర్చిందే నీవు..! 
స్నేహానికి అద్దంలా..నిలచిందే నీవు..! 

నీవు మూగపోతే ఇక..పాటకెంత బాధ.. 
అక్షరాల గమకవనం..చూపిందే నీవు..! 

అమాయకతా శిల్పమే..నీ చల్లని మనసు.. 
నన్ను మౌన కావ్యంగా..మలచిందే నీవు..! 

గోర్వెచ్చని నా శ్వాసను..అల్లుకున్న హాయి.. 
గుండెలయల పాత్రలోన..నింపిందే నీవు..! 


అందమైన సెలయేఱే..నీ కమ్మని నవ్వు.. 
నాకోసం పూలదారి..వేసిందే నీవు..! 

నా కన్నుల కదలాడే..మాధవుడా చూడు.. 
నా యుగాల వేదననే..కాల్చిందే నీవు..!
--((*))--

నేటి హాస్యం 
స్వామీ! వివాహము చేసుకోవాలా వద్దా శెలవీయండి! 
సంఘ జీవిగా వివాహము నీ అనివార్యము నాయనా! 
మంచి చెడుల గురించి విశదీకరించండి ప్రభో! 
ఏముంది నాయనా! 
దాంపత్య జీవితంలో అన్ని పాళ్ళు, సమ పాళ్ళల్లో అనుకూలిస్తే నీ గడపలోనే స్వర్గం! 
అనుకూలించకపోతేనో? 
అతి పిన్న వయసులోనే వైరాగ్యము నాయనా!

--((**))--

నేటి హాస్యం 

హలో పతంజలి! ఏమిటి ఇప్పుడింత రాత్రివేళ ఫోన్ చేశావు! 
క్షమించండి మాష్టారూ! 
ఈ రోజు స్కూల్లో చెప్పిన పాఠం ఇప్పుడు ఒకసారి చెప్పరా ప్లీజ్? 
వావ్ ! చదువు మీద ఇంత శ్రద్ధ వున్న పిల్లలంటే నాకు ప్రాణమోయ్! సరే శ్రద్ధగా విను! 
........................ 
.......................... 
......................... 
......................... 
......................... 

మాష్టరు! ధన్యోహం! ఇక చాలు సార్! 
నిద్ర ముంచుకొచ్చేస్తోంది! 

ఐదు నిమిషాలలో ఐపోతుంది, వినవోయి పతంజలి! 

లేదు సార్! 
నిద్ర పట్టడం లేదు, మీరు పాఠం మొదలు పెట్టగానే నాకు నిద్ర పట్టేయడం ఆనవాయితీ అయిపోయింది, అందుకే ఈ రాత్రప్పుడు మీకు ఫోన్ చేయాల్సోచ్చింది, పని అయిపోయిందిగా, శెలవ్ మాష్టారూ!
--((**))--
Chloe grace moretz

నేటి : విశ్లేషణం 
ప్రాంజలి ప్రభ 

నవ్వినా ఏడ్చినా అది ఓఅక సౌందర్యం 
మురిపాల ముచ్చట్లు ముగ్ద సౌందర్యం 
ముద్దు ముద్దు మాటలు మనోహర సౌందర్యం 
బాలకృష్ణుని గుణ గణాలను వర్ణించటం ఎవరితరం 

వర్ణనలలో ఉన్న అర్ధాన్ని తెల్లుపేది సౌందర్యం 
గుణాలను తెలిపేది జీవన మధుర  సౌందర్యం 
పిల్లలు చేసే మధ్రుమైన చేష్టలు కుఉడా సౌందర్యం 
బాల ముగ్ధత్వాన్ని మురిసే లోకమంతా సౌదర్యం 

నోరన్ జేతులు రెండు గ్రుక్కుకొనుచున్మోమెల్ల బాష్పాంజన 
స్మేరంబై తిలకింపనేర్చుచు, బొరిన్ మీజేతులన్ గన్నులిం 
పారం దోముచు, చేవబూని పిఱుదొయ్యన్ మీది కల్లార్చుచున్ 
శ్రీరమ్యాంఘ్రియుగంబు గింజుకొనుచున్ జెల్వంబు రెట్టింపగన్ 

పాపం ఈ పసివాడిని ఏ బూచాడో భయపెట్టాడు కాబోలు. గుక్కపెట్టి ఏడవడం మొదలుపెట్టాడు! నోటిలో రెండు చేతులు కుక్కుకొంటూ మరీ ఏడుస్తున్నాడు. ఆ ఏడుపుకి అతని మొగమంతా ‘బాష్పాంజన స్మేరంబు’ అయ్యింది. కన్నీటికి కరిగిన కాటుక ఆ పాపాయి ముఖమంతా అలముకొన్నది. ఎంత చిక్కని పదమో అంత చక్కని పదచిత్రం! మాటిమాటికీ మీజేతులతో (అంటే చేతుల పైభాగం) కన్నులు నులుముకొంటున్నాడు. చేవబూని – అంటే కాస్త బలం తెచ్చుకొని, పిఱుదు మెల్లిగా పైకి లేపే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పసివాని పాదాలు శ్రీరమ్యంగా ఉన్నాయి. అంటే ఎంతో శోభతో మనోహరంగా ఉన్నాయి. ఆ లేలేత పాదాలను గింజుతూ తంతూ ఉంటే అతని అందం రెట్టింపవుతోంది! 

స్తనదుగ్ధామృత మారగించుచు బొరిం జారుస్మితోల్లాస మా 
ననబింబంబు నలంకరింప వికసన్నాళీకపత్రాభలో 
చనదీప్తుల్ జననీముఖేందువు పయిన్ సంప్రీతి బర్వంగ నొ 
ప్పు నిజాభీప్సితకల్పశాఖి గనియెన్ బుత్రుం బవిత్రోదయున్ 

ఆ నందనందనుడు నందగోపునికి కనిపించిన తీరిది. స్తన్యమనే అమృతాన్ని ఆస్వాదిస్తున్నాడు. అందమైన చిరునవ్వొకటి ఆతని మోమును వెలిగిస్తోంది. విచ్చుకున్న తామరాకుల్లాంటి కన్నుల కాంతులు అమ్మవైపు ప్రీతితో ప్రసరిస్తున్నాయి. దానివల్ల ఆమె ముఖం చంద్రబింబంలా ప్రసన్నంగా ఉంది. ఇంతటి పసిబాలుడు, ప్రసన్నమూర్తి, కొద్ది క్షణాల ముందొక పెద్ద రక్కసుణ్ణి సంహరించాడంటే ఎవరు నమ్మగలరు! 
--((**))--



నేటి హాస్యం 

నాన్నగారూ రేపు నా స్కూల్ లో చిన్న గెట్ టుగెదర్ వుంది. మీరు తప్పకుండా రావాలి 
ఎవరితో కన్నా? 
ఆఁ! ఎవరూ కాదు 
మీరూ, నేనూ, మా ప్రిన్సిపల్ గారు 

ఏమిటి విశేషం? 
ఏమీ లేదు! క్లాస్ మొత్తం మీద నేనోక్కణ్ణే ఈ సంవత్సరం అన్ని పరీక్షల్లో, అన్ని సబ్జెక్టు లలో 
వెరీ గుడ్ 
మీరు పూర్తిగా వినండి మరి 
చెప్పు మరి! 
ఫెయిలయ్యాను
--((**))--

సుదర్శన్ గారి అమ్మాయి హాస్టల్ లో వుండి చదువుతున్న కాలేజీ స్టూడెంట్, 
ఉమెన్స్ హాస్టల్ వార్డెన్ ఆమె. 

అమ్మాయిని శెలవులకి ఇంటికి తీసుకు వెళదామని ధంపతులు వెళ్ళారు! 

అమ్మాయి బట్టలున్న బాగ్ లు రెండు బయట కారులో సర్ధేశారు! 

వార్డెన్ పర్మిషన్ కోసం తండ్రీ, తనఖా వెళ్ళారు! 

భార్యను కొద్దిసేపు హాస్టల్ ముందున్న పార్కు లో వైట్ చెయ్యమని చెప్పేరు! 
************ 

అప్పటిదాకా కూతురుకి అన్ని క్రెడిట్స్ ఉన్నాయని పాపం సుదర్శన్ గారికి మాత్రం ఏం తెలుసు! 

ఆమె చండ శాసనురాలని, కనీసం అరగంట క్లాసు కి ప్రిపేర్ కమ్మని ముందుగానే కూతురు సిద్దం చేసింది. అందుకే లోక్యం గా తండ్రినే పిలుచుకు వెళ్లింది. 
***************** 

“మీరెనా? ఫాదర్? “ అందామే. 
సుదర్శన్ గారు చుట్టూ కలియ చూశారు, నాటకీయంగా.. 
ఆ రూములో మగ పురుగుని ఆయనొక్కడే! 
.. 
“మేడమ్ ఔట్ పాస్ కావాలి . పేరెంట్స్ తో సెలవులకి వెళ్తున్నాను” అమ్మాయి ఎలియన్స్ తో మాట్లాడినంత జాగర్తగా అంది. .. 
.. 
“కూర్చోండి “ అందామే. 

ఆమె రూములో ఎదురుగా సి సి కెమెరా మానిటర్స్ ఉండటం గమనించారాయన! 

ఎక్కడ ఏమూల ఏమి జరిగినా ‘ఆమెకి’ తెలియకుండా ఉండటం అసాద్యం... 
.. 
ఇక ఆమె పాప లీలలు చెప్పటం మొదలెట్టింది. 
“ వై ఫై పాస్వర్డ్స్ హక్ చెయ్యటం, 
శాకాహార హాస్టల్ లోకి ‘పార్సిల్స్’ తేవటం. .. 
ఒక గాంగ్ ని మైన్టైన్ చెయ్యటం, 
హాస్టల్ లో వంటలకి సాకులు పెట్టటం, 
టి‌వి రూము టైమింగ్స్ మీద అల్లరి చెయ్యటం .. 
ఇలా చాలా “ 
****************** 

అమ్మాయి మోస్ట్ ఇన్నోసెంట్ మొహం తోను తండ్రి మాటల గారడీ తోను మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు! 
.. 
ఇంతలో అమ్మాయి తండ్రిని మోచేత్తో పొడిచింది. 
మానిటర్ చూడమన్నట్టు కళ్ళతో సైగ చేసింది... 
.. 
సరిగ్గా కెమెరా ఉన్న చోటే నిలబడి వాళ్ళావిడ 
పూల మొక్కలు పీకి తనతో తెచ్చుకున్న కారి బాగ్ లో సర్దుతుంది ! 

పాపం! ఆ సీన్ ఎలా పండిందో, చివరాఖరుకి ఏమైందో మరి నేను వివరించలేనండీ బాబూ!




శీర్షిక: "ఒంటరిని కాను"
వచ్చిన దారి పొడవునా
జారిపోయిన అనుభూతులు
కొన్ని జ్ఞాపకాలై వెంటనడుస్తున్నాయి
కలం ఊతముతొ నడుస్తున్నవాణ్ణి
జ్ఞాపకాల మిత్రుల్లారా
అనుభవాలుగా తోడై నడవరూ!?
అభ్యర్ధన కనుమతించి
అనుభవాల గుమిగట్టి
అడుగులో అడుగు కలుపుతున్నాయి
అండగలిగిన వాణ్ణి
అడ్డెవాళ్ళని అడ్డగించి పోరాడడానికి
నేనిప్పుడు వంటరిని కాను
నా వేగం ద్విగుణీకృతం
అక్షర క్షీరాన్ని పంచుతూ
చైతన్య పదాల్ని నిర్మిస్తూ
ముందుకు సాగి
లక్షిత గమ్యాన్ని చేరుకోవడం
నాకిప్పుడు సులభ సాధ్యం
ఈ వేగం చాలదు
గమనమార్గంలో
ఆశలునిండిన కళ్ళతో
ఎన్నో యెదురుచూపులు
వేగం పెంచాలి.... ఇంకా
భయంలేదు
నేనిప్పుడు ఒంటరిని కాను.
ససైన్యంతో వస్తున్నా.

* * *
అన్వేషి. // తను - నేను 40 //

తనని కప్పుకున్న కాసేపే నేను
ప్రపంచానికి వెలుగుతూ కనిపిస్తాను
మలిసంధ్యల్లో తన చివరిస్పర్శ
నను నాలా మార్చేస్తుంటే
కన్నీటితీరంలో తడి్ఇసుకలా కొన్ని
క్షణాలను కప్పుకుని తిరిగి రాతిరిగా మారిపోతుంటాను...
రేపటివేకువై తను మళ్ళీ నన్ను ఆక్రమించుకుంటుందని...

రాతిరిగా మారిన నను
గుర్తించడంలో తనకి సహాయం చేయడానికి
కొన్ని తలపులను అక్కడక్కడా తారలుగా పొదువుతాను దారంతా...
పెదవులపై నిరంతరాయంగా ఒక లైట్ హౌస్ వెలిగిస్తూ...

తను వచ్చేలోగా నిదురతో పోరాడిన ఒక మౌనం కొన్ని అక్షరాలను చుట్టుకుని కాగితంపై రాలుతుంటుంది..
రెప్పలు దాటివచ్చేసాననే తత్తరపాటులో కొన్ని మెలికలు తిరుగుతూ..

కాగితంపై చివరి మౌనక్షణం జారుతున్నపుడు తను వెచ్చని వేకువై
నను కౌగిలించుకుంటుంది...
కాగితం చివర తన నవ్వుల సంతకం చేస్తూ...

నేను మళ్ళీ వెలుగుతూ
కనపడతాను ప్రపంచానికి...తనలా 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి