27, అక్టోబర్ 2018, శనివారం

ఆరాధ్య లీల (కాలచేక్రం)





ఆరాధ్య లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

సుధలు పొంగేటి యధరాలు పిలుస్తున్నాయి 
నిదుర పోయేటి నెలవంక కలువమన్నాది       
ఎదురు చూసేటి నయనాలు పిలుస్తున్నాయి 
బదులు రానట్టి మరు మాయ కలువమన్నాది 

మదిని రేపేటి కధనాలు పిలుస్తున్నాయి 
కదలి రావాలి మను బేల కలువమన్నది    
ఎదను పర్చాను మునగంగ పిలుస్తున్నాయి 
బెదురు పోవద్దు మనసంత కలువమన్నది        

మనసు రమ్మంది రణరంగ పిలుస్తున్నాయి    
వయసు పిల్చింది తనువంత కలువమన్నది  
మమత చూపంగ మమకార పిలుస్తున్నాయి  
సోగసు రాగాలు పిలవంగ కలవమన్నది  

రసకేళి ఆడుట - మాధుర్యం పంచుట 
సంతసము పొందుట - సహచరించుట  
ఇది వేణు గోపాల ప్రేమ సుమా  

--((**))--



ఆరాధ్య ప్రేమ లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
  
అలంకార ప్రియమైన అందముంటే చాలు
పరిమళించు చెలి మనసు ఉంటే చాలు    

పలక రించే చెలిమి గాలి  ఉంటే చాలు
పద్యానికి అర్ధము ఛందస్సు ఉంటే చాలు  

సౌందర్యానికి వర్ణనా భావం ఉంటే చాలు 
నేనే గొప్ప అనే భావం అంత మైతే చాలు 

మాట కన్నా వెన్న లాంటి నవ్వు ఉంటే చాలు 
వెన్ను తట్టే శాంతి  గుణం తోడు ఉంటే చాలు

చూపుల విందుతో  సంతోషంగా ఉంటే చాలు 
నీ మానవత్వం ఆభరణంగా ఉంటే చాలు 

పాడుకొనే ముచ్చటేదో స్వరం ఉంటే చాలు 
నిత్య వైభోగం పచ్చ పచ్చగా ఉంటే చాలు 

ఆశపడే మనసు సొంతమై ఉంటే చాలు 
ఒక్కరైణ పోరాడి గెలుస్తూ ఉంటే చాలు 

తల్లి తండ్రులు గురుదీవెన ఉంటే చాలు
దేవుడు కుటుంబానికి తోడు ఉంటే చాలు 

చాలు అనుకుంటే ఆంతా మేలు 
ఆంతా మేలు అనుకుంటే శాంతి 
శాంతి ఏలు తూను ఉంటే కాంతి 
కాంతి ఉంటే చీకటి రాణే రాదు   
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))-- 



Street Art
ఆరాధ్య లీల (కాలచేక్రం) 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 

1. పనికి రాని వారు ఉండరు 
    పనిచేయించుకొనే వారు ఉండరు
    గడియారంలా కదులుతుంటారు
    గడియారంలా రెండుసార్లు కలుసుకుంటారు 

పెద్దముళ్లు, చిన్న ముల్లు లా 
పుణ్య, పాపములులా 
స్త్రీ పురుషులు ఏకమయ్యేవిధానములా 
కాలచక్రం గమనించా లంటారు 

2 పేదరికంలో సలహాలిస్తుంటారు 
    సంపాదనలో ఆశపెడుతుంటారు 
.   సంపాదించాక దొచు కుంటారు  
    మన:శాంతి లేకుండా చేస్తారు 

స్నేహితులు శత్రువు లయ్యేలా 
శత్రువులు స్నేహితు లయ్యేలా 
ఆరోగ్య సంరక్షణ కరు వయ్యేలా   
ధనం చుట్టూ తిరిగే వారుంటారు 

3. నవ్వి నవ్విస్తూ ఉండ మన్నారు 
    నవ్వులో అపార్ధాలు తొలుగు తాయంటారు 
    నవ్వుతో ఆరోగ్యమే మార్పంటారు
    నవ్వుతు బతికి నవ్వుతూ చావాలంటారు 
     
మకరందాన్ని పొందేందుకు నవ్వాలా
శత్రువు పోయాడని నవ్వాలా 
భార్య కోరికతో ఏడుస్తూ నవ్వాలా 
నవ్వేవారిని చూసి మోస పోవద్దంటారు 

4 .దొరికేది దోచుకో మంటారు  
    దోరకంది దాచుకోమంటారు 
    దొరికేది ఎక్కువకాలం ఉండదంటారు 
    ఎక్కువకాలం ఉండేది దొరకదంటారు

దొరికిన దానితో సంతృపి చెందాలా
పొందిన దానిలో సంతృపి వెతకాలా
శాశ్వితమనేది లేదని తెలుసుకోవాలా
ఉన్నదానితో తృపి చెందితే గొప్పంటారు 

5. జరిగే వణ్ణి మనమంచికే అంటారు 
    జరగని వణ్ణి మనవి కావంటారు        
    మంచి చెడు, చూడాలంటారు     
    ప్రేమ, స్నేహం తెల్సుకో మంటారు 

మానవత్వాన్ని మరచినవి చూడాలా 
మానవత్త్వమే లేదని పోరాడాలా 
మనసుని మార్చుకొని బ్రతకాలా  
ప్రతిదీ తేలిక భావం ఉంటే మంచి అంటారు 

6. రోగాలు కుందేలులా వస్తాయంటారు 
    రోగాలు తాబేలులా పోతాయంటారు 
    ధనం తాబేలులా  వస్తా యంటారు    
    కుందేలులా పోతా యంటారు 

వెంటనే వచ్చే రోగం తాగించాలా 
నిదానంగా పోయేరోగాన్ని తొలగించాలా 
వచ్చిన ధనం వేగంగా పోతుందని తెలుసు కోవాలా 
ధనమే రోగమని తెలుసు కొంటె మేలంటారు 

7. చిన్న మాటలో మర్మం తెల్సుకోమంటారు 
    మాటల ఆనందాన్ని పంచు కోమంటారు 
    పెద్ద మాటాలు వద్దన్నా వస్తాయంటారు 
     మాటలను తూటాలుగా వాడే వారుంటారు

చిన్న పిల్లల మాటలు అనుకరించాలా 
చిన్న మాటలని ఉపేక్షించాలా
మాటల పట్టింపు లేకుండా ఉండాలా       
మాట మాట పెరిగితే జీవితమే లేదంటారు 

8. సుఖాలలో దేవుడ్ని గమనించరు 
    కష్టాలలో దేవుడేమి చేయలేదంటారు 
    కష్టసుఖాలు కావడి కుండలంటారు  
    కోరికలను తీర్చేది దేవుడని తెలుసుకోలేరు 

హమేషా దేవుణ్ణి ప్రార్ధిస్తూ ఉండాలా
దేవుడే సర్వం ఇస్తాడని ఉండాలా 
శ్రమకు తగ్గ ఫలితమని తెల్సుకొని ఉండాలా 
దేవుడిపై నమ్మకమే బ్రతుకంటారు   

--((**))--



ఆరాధ్య లీల 
మల్లాప్రగడ రామకృష్ణ 

ప్రేమయు తుంచె ప్రాణమును    
కామము పెంచె వేషమును 
కాలము మార్చె మోసమును 
మానుటయే నవోదయమూ 

యాచన చేయు మార్గమును
మౌనము వీడు శోధనను  
కోపము చేర్చు వాదమును
మానుటయే నవోదయమూ 

కోమలి కామ చూపులను 
దోసిట పట్టు యాచనను 
ఆకలి తీర్చు కోరికను 
మానుటయే నవోదయమూ

సాధ్యము కాని మాటలను 
ఆశలు రేపె పల్కులను   
నష్టము తెచ్చె వాక్కులను  
మానుటయే నవోదయమూ

పాపము వచ్చె కార్యమును  
శాపము తెచ్చె సౌర్యమును 
దాహము పెంచె ధైర్యమును 
మానుటయే నవోదయమూ

--((**))--


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి