ఆరాధ్య ప్రేమ లీల (మనసైన మగుఉంటే)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
తొలి పొద్దు మేలు గొలుపు మలి రాత్రి ముద్దు సలుపు
తొలి కాంతి ఆశ మెరుపు మలి హాయ్ సద్దు వలపు
తొలి సేవ నిత్య మెరుపు మలి మాయ వద్దు గెలుపు
తొలి పూజ భక్తి తలపు మలి వెన్నె లద్ది మలుపు
తొలి వేళ వెచ్చ దనము మలి నీడ చల్ల దనము
తొలి గంధ పచ్చ దనము మలి మౌన సేవ తనము
తొలి హంస పంచు దనము మలి హంస ప్రేమ తనము
తొలి వంట ఇచ్చు తనము మలి పంట వెచ్చ తనము
కాంతి కిరణం చల్లదనం తరుము
ప్రేమ మాధుర్యం కోపం తరుము
సంసార సౌఖ్యం సంతాన భాగ్యము
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
నేటి కవిత
రచయత: మల్లాప్రగడ రాంకిష్ణ
లక్షల లక్షల లక్ష్యమ్ము తో ధైవమ్ము తలచియూ
కక్షల కక్షల బేధమ్ము తో ప్రేమమ్ము మరచియూ
శిక్షల శిక్షల ధర్మమ్ము తో ద్వేషమ్ము వగచి యూ
రక్షణ రక్షణ సత్యమ్ము తో సాయమ్ము పిలిచెయే
కష్టము కష్టము కష్టమ్ము తో కాయమ్ము తొలచి యూ
నష్టము నష్టము నష్టమ్ము తో భారమ్ము మోపితి యూ
ఇష్టము ఇష్టము ఇష్టమ్ము తో వాదమ్ము చెసితి యూ
అష్టమి కష్టము ఇష్టమ్ము తో చేయమ్ము తలిచి యే
అల్లము అల్లము అల్లమ్ము తో పైత్యమ్ము తొలగి యూ
బెల్లము బెల్లము బెల్లమ్ము తో దాహమ్ము తొలగి యూ
ఉల్లము ఉల్లము ఉల్లమ్ము తో తాపమ్ము తొలగి యూ
గొళ్ళెము గొళ్ళెము గొళ్ళెమ్ము తో కామము తొలగి యే
--((**))--
శీతాంశ - భ/త/భ/త/భ/త/భ/గ UII UUI UII UUI - UII UUI UIIU
22 ఆకృతి 1730983
ఆరాధ్య లీల (తత్వము )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ఆకలనే ఆశ పాశము ఆనంద మివ్వక ఆదుర్ద ఆదరణే
ఉండియు ఆరాట పోరును ఆలోచనా మది భావాలు వర్ణములే
మానస మందుండు కోరిక ఆరోగ్య దాహము వెన్నంటి వచ్చినవే
బంధము నీతోడు పావనమే నాకు నిత్యము నారాయణా మృతమే
రాతలు రాసేందు కానతి కారుణ్య భావము శోభించు వెన్నెలలో
వేణువు నూదంగ హాయిగా నీవేళ ప్రేమయు పంచేందు మన్ననతో
మానస సంచార రాగాలు ఆలోచనామృత లానంద పూర్ణములే
బంధము నీతోడు పావనమే నాకు నిత్యము నారాయణా మృతమే
చిందులు నేవేతు చిత్రపు నృత్యాలు జిత్తము రంజిల్లు జొక్కముగా
ఆటలు నేనాడు పందెము చేయంగ నిత్యము శోభిల్లు నిక్కముగా
శ్రీమతి నావెంట ఉండగ నిత్యానురాగము వర్ధిల్లు మన్ననగా
బంధము నీతోడు పావనమే నాకు నిత్యము నారాయణా మృతమే
ఎక్కడ నున్నాడు చక్కని మారాజు చిక్కఁడు వెంటాడు వేదముగా
మక్కువతో నేను మిక్కిలి ప్రేమాను రాగము చూపంగ దేహముగా
చిక్కులతో నేను తన్మయ సేవాను రాగము చేయంగ బంధువుగా
బంధము నీతోడు పావనమే నాకు నిత్యము నారాయణా మృతమే
నాకు నిత్యము నారాయణా మృతమే, నాకు నిత్యము నారాయణా మృతమే
నాకు నిత్యము నారాయణా మృతమే, నాకు నిత్యము నారాయణా మృతమే
--((**))--
ఆరాధ్య లీల - అమ్మ (1) Pranjali Prabha.com
రచయత" మల్లాప్రగడ రామకృష్ణ
అమ్మ అంటే అమ్ముల పొదిలో ఉండేటి అస్త్రం
అమ్మ అంటే అక్షర సత్యాన్ని తెలిపే అస్త్రం
అమ్మ అంటే ఆకలి తీర్చేటి అమృత అస్త్రం
అమ్మ అంటే అవ్యాజ ప్రేమను పంచేటి అస్త్రం
అమ్మ అంటే ఆశయ లక్ష్యము తెల్పేటి అస్త్రం
అమ్మ అంటే ఆరాట పోరాటం తగ్గించే అస్త్రం
అమ్మ అంటే ఆనంద పరిచే సంతోష అస్త్రం
అమ్మ అంటే అంబర సంతృప్తి పుడమి అస్త్రం
అమ్మలేని ఇల్లు చుక్కాని లేని నావ
అమ్మలేని ఇల్లు దైవమే లేని గుడి
అమ్మలేని ఇల్లు గురువే లేని బడి
ఇది వేణు గోపాల పేమ సుమా
--((**))--
ఆరాధ్య ప్రేమ లీల (2) హాయ్
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
మౌన వనం లో మల్లెల గంధం హాయ్
- ప్రేమ వనము లో చిందులు పంతం హాయ్
విరహంలో విందులు చేసే మైకం హాయ్
- ప్రమిదలో వెన్నెల నీడ వెల్గు హాయ్
తడబడు అడుగుల నవ్వుల హాయ్
- ఆరని నిప్పు కోవెల సందడి హాయ్
అంబర మేఘమాల కరుగుట హాయ్
- తల్లితండ్రులు ప్రేమ పంచుటలో హాయ్
గాలిలా ఆవహిస్తే హాయ్
వెల్గులా ప్రవహిస్తే హాయ్
నింగిలా భరిస్తే హాయ్
ఇది వేణుగోపాల ప్రేమలీల
--((**))--
ఏతండ్రి (సాహిత్యం)
ఏతండ్రి కోపతాపేతి హాస ప్రేమాబ్ది
విందార వల్లియై కందళించె
ఏ తండ్రి తన్మాత్ర ఆనతికాలము నుండి
అంబా స్రవంతియై పొంగిపొరలె
ఏ తండ్రి మాత మమస్సే కలల ఘనా
ఘన ప్రేమదారియై ఘనత కెక్కె
ఏ తండ్రి ప్రేమ భావంతొ మక్కువ చూపి
నిండారు పండువెన్నెలలు గురిసె
ఆ తండ్రి శివాంస సంభూత ఆశయమున రాజు
విశ్వకళ్యాణ రాజు ప్రవీణ పాణి
తియ్యనగు తెల్గుతండ్రితో వియ్యమంది
నాదు వాక్కుల నటనం బొనర్చుగాక !
--((**))--
ఏ వాణి వేదశాస్త్రేతిహాసమహాబ్ధి
మందారవల్లియై కందళించె
ఏ వాణి వాల్మీకి హిమగిరీంద్రమునుండి
గంగా స్రవంతియై పొంగి పొరలె
ఏ వాణి వ్యాసమునీశాన గళ ఘనా
ఘన వర్షధారయై ఘనత కెక్కె
ఏ వాణి కాళిదాసేందుబింబమునుండి
నిండారు పండువెన్నెలలు గురిసె
ఆ యమ్మరవాణి హంసవాహనుని రాణి
విశ్వకళ్యాణి వీణా ప్రవీణపాణి
తియ్యనగు తెల్గువాణితోవియ్యమంది
నాదు వాక్కుల నటనం బొనర్చుగాక !
jamjaala paapayya sasstri
--((**))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి