నేటి కవిత
ఇదేనా రాజ నీతి
జనం జనం వెల్లువాయే
- గతాన్ని మరిచి గొప్ప లెందుకోయ్
మనం మనం ఒక్కటాయే
- గతాన్ని మరచి తిట్టు లెందుకోయ్
బలం గళం గర్వమాయే
- జనాన్ని తుడిచి పెట్టు టెందుకోయ్
ప్రజా భజా అల్వాటాయే
- మౌనాన్ని విడిచి గుట్టు ఎందుకోయ్
హోదా మరచి వీధి కుక్కలా మొరగకోయ్
- ప్రక్క రాష్ట్రంపై ఎందుకు పడతావోయ్
గుర్వే మరచి నక్క జిత్తులా కూయకోయ్
- ప్రక్క మంత్రిపై బూతులు కడతావోయ్
మత్తే పెరిగి పిచ్చి తోడేళ్లా దూకకోయ్
- ఉన్న రాష్ట్రాన్ని చూడక వదిలావోయ్
ఉండే పదవి విడ్చి గొర్రల్లా మారకోయ్
- ప్రక్క వాళ్ళనే తిట్టుట మరవాలోయ్
అనుభవాలెన్నెన్ని అలికితే
జీవం బ్రతికే మార్పు తెలుసుకోవోయ్
తరుముకొచ్చెవెన్ని తెలిపితే
కాలం కలిపే మార్పు తెలుసుకోవోయ్
మనసు కాల్చెవెన్ని నలిపితే
మనం నడిచే మార్పు తెలుసు కోవోయ్
జలము మార్చెవెన్ని కలిపితే
విషం వెతికే మార్పు తెలుసు కోవోయ్
--((**))--
Pranjali Prabha.com
ఆరాధ్య లీల (ఛందస్సు)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
నిన్న రాబోదు, ఇల్లి రాలేదు, ఉన్నదే నీది
అన్న మాటేదొ, మల్లి జాలేదొ, అన్నదే నీది
కన్న తళ్లేదొ, జాలి పల్కేదొ, కన్నదే నీది
ఉన్న సేవేదొ, తాళి బర్వేదొ, ఉన్నదే నీది
చిన్న ప్రేమేదొ, పెద్ద ప్రేమేదొ, చింతనే నీది
విన్న వింతేదొ, సొమ్ము చింతేదొ, కానదే నీది
దున్న చేసేదొ, మన్ను చేసేదొ, లేనిదే నీది
యన్న పల్కేదొ, చన్ను చుపేదొ, కాలమే నీది
నీది నాది అనేది లేదు
నాది నీది కానిది లేదు
ఏది ఇది కనేది లేదు
వేణు గోపాల ప్రేమ సుమా
-((**))--
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
సుఖం అందించని తరుణి మనసేందుకే
విషం చిందించిన మగువ తలపేందుకే
ధనం సాధించని మగణి విసుకెందుకే
గళం పొంగించని వనిత తెగువెందుకే
ఋణం ఇప్పించని కలువ దిగులెందుకే
ఫలం అందించని చిలుక సొగసేందుకే
జయం లభించని చెలిమి బెదురెందుకే
కులం వీడిందని మమత గుబులెందుకే
కలం తో వ్రాతతొ సమత జరిపేందుకే
భయం తో లాభము నడక పెరిగేందుకే
జనం తో భేదము భజన చేసినందుకే
జపం తో శాంతము కలిగి సంత సించుటే
--((**))--
ఆరాధ్య లీల (చందస్సు)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ప్రతి గొప్ప విజయం వెనుకా అంతులేని సమరం
ప్రతి మంచి చరణం వెనుకా అంతులేని దహనం
ప్రతి నీతి పయనం వెనుకా కానరాని నయనం
ప్రతి మాట వినయం వెనుకా చెప్పలేని ప్రణయం
ప్రతి శక్తి నిలయం వెనుకా ఒప్పలేని తరుణం
ప్రతి వేద ఫఠనం వెనుకా మార్పు రాని సమయం
ప్రతి కావ్య కధనం వెనుకా తీర్పు లేని నటనం
ప్రతి రక్ష కవచం వెనుకా అమ్మ ప్రేమ అభయం
ప్రేమ హృదయం వెనుకా - పెళ్లి కధనం వెనుకా
తల్లీ మధనం వెనుకా - వచ్చే ప్రళయం వెనుకా
వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి