ఆరాధ్య ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
నిండు పున్నమిలో వెలిగే జాబిల్లి
జాబిల్లి కోసం మెరిసే మరుమల్లి
మెరిసే మనుమల్లి కోసం శ్రీవల్లి
శ్రీ వల్లే మనసు మార్చే సిరిమల్లి
సిరిమల్లె చేర ఊహ ఆశ లొల్లి
వయసు పరువంతో మనసు జల్లి
తపనతో అర్పించి తెప్పరిల్లి
కంటి పాపగా కౌగిట్లో చిక్కే లిల్లి
నదికి సంద్రం, పుడమికి అంబరం
భార్యకు భర్త ఆధారం, భర్తకు భార్య ఆధారం,
మల్లికి జాబిల్లి,ఆలింగనమే అందరికి అధరం
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
ఆరాధ్య ప్రేమ లీల
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ
అల్లం పైత్యం తగ్గించి ఇచ్చు సంతోషము
బెల్లం పానకం త్రాగితేను ఉత్సాహము
గొళ్ళానికి తాళం వేస్తె ఇల్లు భద్రము
ఉల్లము జల్లు మనెను ఆలింగనము
కల్ల లాడ బోకు కలలందు సైతము
తల్లి తోడ నీవు తగవు లిడకుము
ఎల్ల జగము కలసి పోరిడినాము ,
తల్లి పూజ లోని బలము తెలుపుము
ఉల్లి చేయు మేలు తల్లి చేయదు
తల్లి చేయు మేలు తండ్రి చేయడు
అల్లం బెల్లం చేయు మేలు మర్వలేము
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
ఆరాధ్య లీల
మల్లాప్రగడ రామకృష్ణ
తల్లి తండ్రులను చూడని పిల్లల తత్వం
మనసెరగని మమతల మానవత్త్వం
బరువు బాధ్యతలు చూపలేని పౌరసత్వం
పరువు ప్రతిష్ట చదువు లంటూ వృద్ధ తత్త్వం
మరచి పోతున్న నడవడికల గుణతత్వం
ఈర్ష్య ద్వేషాలతో నలిగిపోతున్న మిత్రత్వం
ధన మదంతో విర్రవీగుతున్న బంధుత్వం
విలువలు లేని విల విల లాడే ప్రేమత్వం
ఏమిటి ఈ లోకం ఎందుకు ఈ శాపం
ఎవరికీ ఏవారో తెలియని తీరు
సుఖం లేక ఇందుకీ సంపాదన జోరు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
ఆరాధ్య శాకాల లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
విఫణి యందు కొనలేకున్నాము శాకములు
ధరలు యందు కొనపోతే నక్షత్రాల కలలు
వంగకాయలు కొన బెంగ పెర్గే
దొండకాయలు కొన పండు బారే
బీరకాయలు కొన దారి లేదే
బెండ కాయలు కొన తాండ వించే
దోసకాయలు కొన చేదు ఉండే
పొట్లకాయలు కొన పొట్టి కుండే
సొరకాయలు కొన గడ్డు పెర్గే
మిర్పకాయలు కొన గొడ్డు కారం
గుమ్మడి కాయ కొన గుండె గుబేల్
చిక్కుడు కాయ కొన పుచ్చు భయాల్
మామిడి కయ కొన మాడు పగుల్
అరటి పువ్వు కొన ఆశ తెగుల్
కంద దుంపలు కొన దుర్ద తగుల్
ఆలు గడ్డలు కొన లోన పుచ్చుల్
చేమ దుంపలు కొన జిడ్డు పట్టున్
బీటు క్యారెట్ కొన రక్తం పారున్
ధరణి యందు ధరలు దారుణ మాయె
ప్రజలు యందు కలలు నీరుగ మారె
విఫణి యందు కొనలేకున్నాము శాకములు
ధరలు యందు కొనపోతే నక్షత్రాల కలలు
--((**))--
ఆరాధ్య ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ప్రేమించుట వల్లనే మనసైనది హృదయ వీణ
ద్వేషించుట వల్లనే తనువైనది హృదయ వీణ
తపించుట వల్లనే బ్రతుకైనది హృదయ వీణ
స్నేహమిచ్చుట వల్లనే తోడైనది హృదయ వీణ
దాహం తీర్చుట వల్లనే ప్రేమైనది హృదయ వీణ
ద్వేషం తగ్గించుట వల్లనే సైఅంది హృదయ వీణ
కామించుట వల్లనే బరువైనది హృదయ వీణ
శాసించుట వల్లనే తరువైనది హృదయ వీణ
ప్రేమించిన, ద్వేషించన,
స్నేహమిచ్చిన, శాసించిన,
స్త్రీ బతుకే హృదయ వీణ
పురుష నీతి హృదయ వీనే
వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--
ఆరాధ్య ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
కళ్ళు చూపుల్తో రోగం ఆటకేక్కుతుంటే స్వర్గం
కాలం నమ్ముకొని నడిస్తే జీవితమే స్వర్గం
కుళ్ళు తగ్గించి నిర్మలంగా ఉంటే స్వర్గం
సాయం చేస్తూ ఉంటే నీ మనస్సుకే స్వర్గం
పళ్ళు తగు విధంగా భుజిస్తే నిత్యం స్వర్గం
ప్రాణం పోస్తూ ఉంటే కాల మయం స్వర్గం
వళ్ళు జాగర్తగా, మంచి బుద్ధిన ఉంటే స్వర్గం
ప్రేమ పంచుతూ ఉంటే నిత్య వయస్సు స్వర్గం
కళ్ళద్వారా చూసింది
పళ్ల ద్వారా తిన్నది
వెళ్లద్వారా చేసింది
వళ్ళు ద్వారా పొందింది
ఏదైనా అంతా స్వర్గం
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి