6, అక్టోబర్ 2018, శనివారం

ఆర్.కె. మల్లాప్రగడ (ప్రకృతి ఛందస్సు)* పద్యాలు -1

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీకృష్ణాయనమ:
ఆర్.కె. మల్లాప్రగడ (ప్రకృతి ఛందస్సు) పద్యాలు 

నీ కంటిలో నలత వేలుగు నైనాను  
నీ మాటలో మమత మాధవ నైనాను 
నీ ఆటలో అలుపు ఆశగ నైనాను 
నీ వేటలో అలుక  ఆకలి నైనాను ........ 


మదిలో మమకారం మరిగి మకుటాన్ని పక్కకు తీసా   
ఇలలో సహకారం జరిగి శకటాన్ని పక్కకు తీసా  
కలలో సుమబాణం తగిలి వికటాన్ని పక్కకు తీసా  
వలలో కలయానం వగచి సుముఖాన్ని పక్కకు చూపా .....      
 

నేను నేననుకుంటే యద అంతా చీకటి  
నాది నీదియు నాది శుభ  మంతా చీకటి 
ఆశ పాశము  వేట భయ మంతా చీకటి 
ప్రేమ రోషము మత్తు సెగ అంతా చీకటి    ....... 


ధన సంపాదన అనే ఆశ మూఢునిగా మార్చు  
కధ సందేహము అనే మాట మౌఢునిగా మార్చు 
కళ నీ పాఠము  అనే విద్య వైద్యునిగా మార్చు
ఓక సంపాదన అనే  తృప్తి దక్షునిగా మార్చు  ........... 




ఏడు కొండల పైన దైవ మొక్కటే
ఏడు జన్మల బంధ ప్రేమ ఒక్కటే  
ఏడు ప్రేమల జన్మ కర్మ ఒక్కటే 
ఏడు రాత్రుల వీధి ఆట ఒక్కటే .......




మనసు మోనం గతియానం మమత ధర్మం
వినతి వైనం యువ జాలం వయసు ధర్మం
వలపు గుణం సతి మయం సొగసు ధర్మం
తనువు మార్గం పతి వరం తెగువు ధర్మం     ............  



వాంఛ లన్నీ వాయులీనం అవ్వాలి 
ప్రేమ లన్నీ బంధలీనం అవ్వాలి    
స్వేస్చ లన్నీ స్నేహలీనం అవ్వాలి
 శ్వాస లన్నీ  దైవ లీనం అవ్వాలి  .........



విశ్వాసముగా స్నేహాన్ని చూపి గుట్టు రట్టు చేయు    
అన్నంపెడితే స్నేహాన్ని చూపి దొంగ పట్టి వేయు 
ఇంట్లో పెడితే  స్నేహాన్ని చూపి ఇల్లు దోచి వేయు  
ప్రేమే కలగా స్నేహాన్ని చూపి వళ్ళు గుల్ల చేయు   ......    




ప్రాత: సంధ్యా మార్గ మెరుపు తట్టు 
మధ్య సంధ్యా ప్రాంత తలపు తట్టు 
సాయ సంధ్యా స్వేస్చ మలుపు తట్టు 
రాత్రి సంధ్యా  స్నేహ కలుపు తట్టు .......


మాట ఎప్పుడును తూలకు బాధ తడి తూగుచున్     
బాట ఎప్పుడును మార్చకు కొత్త మడి వచ్చుచున్ 
కోట ఎప్పుడును నిల్వదు  వింత వేడి వచ్చినన్ 
కాట ఎప్పుడును ధర్మము వెంట ఆడి జర్గుచున్   ......     




మదగజము వలే వయసు నందు మదించా  
గురువులకు సెవా చెయక  తూల  నడానే   
మనసులకు మదీ భయము చూపి నటించా 
పలుకులతొ కళ వదలి మాయ జయించా 


అనుభవాలెన్నెన్ని అలికితే జీవం బ్రతికే 
మార్పు తెలుసుకోవోయ్    
తరుముకొచ్చెవెన్ని తెలిపితే కాలం కలిపే
 మార్పు తెలుసుకోవోయ్ 
మనసు కాల్చెవెన్ని నలిపితే మనం నడిచే
 మార్పుతెలుసు కోవోయ్
జలము మార్చెవెన్ని కలిపితే విషం  వెతికే
 మార్పుతెలుసు కోవోయ్ .. .....  




ఆరాధ్యము అనేది మానవత్వాన్ని నిలబెడుతుంది 
జ్ఞానంమన సమాజ సామరస్యాన్ని నిలబెడుతుంది  
సేవాగుణ మదీయ ప్రేమతత్వాన్ని నిలబెడుతుంది  
స్నేహాలయ మనోమయే లయత్వాన్ని నిలబెడుతుంది  


క్షమాపణ అనేది అలసత్వాన్ని తెల్పుతుంది 
క్షమాపణ అనేది పొగరత్వాన్ని తెల్పుతుంది   
క్షమాపణ అనేది సహజత్వాన్ని తెల్పుతుంది 
క్షమాపణ అనేది మానవత్వాన్ని తెల్పుతుంది  




""మానసంబున ప్రేరనే ప్రెమా పొందుట కొరకై"" 
""మారుపల్కిన వెంటనే కధా మార్చుట కొరకై""   
""సేకరించిన మంచినే సదా తెల్పుట కొరకై""  
“”ఆచరించిన మంచిదే గదా అందరి కొరకై”” ......  


జనాకర్షణకు దూషణ కావాలా రాజనీతిలో  
ధనాకర్షణకు పోషణ  కావాలా  రాజనీతిలో   
కళాకర్షణకు భూషణ కావాలా   రాజనీతిలో 
రమాకర్షణకు భీషణ కావాలా  రాజనీతిలో 



మనసు ఆర్తితో రమించటం రమ్యమేగా  
హృదయ  నావతో శ్రమించటం రమ్యమేగా 
పకృతి ప్రేమతో ద్రవించటం  రమ్యమేగా  
వికృతి ప్రేమతో కోపించటం రమ్యమేగా 

















వేటు వేయుమన్నా యాచించుట ఎందుకన్నా   
పోటు చూపకన్నా భోధించుట మానకన్నా 
కాటు వేయకన్నా, సాధించుట ఒప్పుదన్నా 
మాట మార్చకన్నా, పోషించుట తప్పదన్నా 



దేశ భవిత మార్పు అందరి ఓటు తీర్పు 
ప్రేమ చరిత మార్పు సుందరి కాట తీర్పు 
నేర చరిత మార్పు కొందరి వేట తీర్పు 
నేత చరిత మార్పు ఒంటరి ఆట తీర్పు 



నమ్మగ నవ్వులిచ్చు నయవంచకులు 
కమ్మగ మాటలిచ్చు జయభక్షకులు 
సమ్మగ కోతలిచ్చు మదిసోధకులు   
నిమ్ముగ పల్కులిచ్చు పలుపోషకులు 



మౌనిరాకను, పూజ సేయక మౌనమొందగ నంతటా
కాణిపాకము సేవ చేయక దీనబాధలు నంతటా
వాణివేదము ప్రశ్న వేయక ప్రేమపంచుట నంతటా
కానిమాటకు ఆక లేయక వాదవేదన అంతటా 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి