25, అక్టోబర్ 2018, గురువారం

ఆరాధ్య ప్రేమ లీల





ఆరాధ్య  ప్రేమ లీల 
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ 

కాలానికి అతీతమై తంగా పలికి నలిగి చూస్తూ ఉంది 
మొహానికి అతీతమై మనసు కరిగి చూస్తూ ఉంది 

సహనానికి అతీతమై దీపము వెలిగి చూస్తుంది 
హృదయానికి అతీతమై జరిగి నిలిచి చూస్తుంది

ప్రాణానికి అతీతమై తకిలి తిరిగి చూస్తుంది
స్నేహానికి అతీతమై ఆకలి ఎదురు చూస్తుంది 

మౌనానికి అతీతమై అరచి కఱచి చూస్తుంది
వేదానికి అతీతమై చదవు మరచి చూస్తుంది 
  
యుగయుగాల ప్రేమ 
తరతరాల భ్రమ  
కలికాలం నిజం 
వేణుగోపాల ప్రేమ సుమా 
--((**))--



ఆరాధ్య  లీల (తాగొద్దురా )   
రచయత మల్లాప్రగడ రామకృష్ణ 

తాగొద్దురా బాబు తాగొద్దురా
తాగితే బాబు చెలిమి చెడునురా
తాగితే బాబు కలమి పోవునురా
తాగితే బాబు బలిమి తగ్గనురా
అందుకే తాగొద్దురా బాబు తాగొద్దురా

తాగొద్దురా బాబు తాగొద్దురా
తాగితే అప్పులు పెరిగి పోవునురా
తాగితే తప్పులు జరిగి పోవునురా
తాగితే ఒప్పులు మనసు కెక్కవురా
అందుకే తాగొద్దురా బాబు తాగొద్దురా

తాగొద్దురా బాబు తాగొద్దురా
తాగితే హద్దులు మార్పు వచ్చురా
తాగితే పద్దులు చెర్గి పోవురా
తాగితే ముద్దులు తొల్గి పోవురా
అందుకే తాగొద్దురా బాబు తాగొద్దురా

తాగొద్దురా బాబు తాగొద్దురా
తాగితే వళ్ళు గుళ్ళగ మారురా
తాగితే పళ్ళు నొప్పిగ ఉండురా
తాగితే కళ్ళు తిర్గుచు నుండురా
అందుకే తాగొద్దురా బాబు తాగొద్దురా

తాగొద్దురా బాబు తాగొద్దురా
తాగితే రక్త నాళాలు చెడునురా
తాగితే వక్త వేషాలు తెల్వవురా
తాగితే యుక్త నేరాలు పెర్గునురా
అందుకే తాగొద్దురా బాబు తాగొద్దురా

తాగొద్దురా బాబు తాగొద్దురా
తాగితే ఒట్టు మరచి పోవునురా
తాగితే గట్టు విడిచి పోవాలిరా
తాగితే పట్టు సడలి ఉండునురా
అందుకే తాగొద్దురా బాబు తాగొద్దురా





ఆరాధ్య ప్రేమ లీల (మనోరమ)


ఉషోదయ కిరణాలు భాసించె సుందర సుమాలెన్నో   
ఉహాపర విజయాలు సాధించె వందన కళ  లెన్నో    
ఉపాసన రుతురాగ హేమంత  పుష్పము హొయలెన్నో  
ఉమాపతి మురిపాల సౌగంధ పార్వతి ప్రేమలెన్నో 

సుముద్దుల సరి చేసె చామంతి పుష్పము రంగులెన్నో 
సుపొద్దుల  కనులారా సేవించు కల్పపు శోభలెన్నో          
సుహద్దుల ప్రతి గుండె ప్రేమించు ధన్యపు భోధలెన్నో 
సుపద్దుల  ఉదయానె ధర్మంగ  వ్రాయుట రోజులెన్నో 

సుహాసిని సుమమాయె ఆశించె సౌక్యపు సేవలెన్నో     
విలాసిని అనురాగ ఆనంద భాష్పపు  ప్రేమలెన్నో 
వినోదిని  వినురాగ వేదాంత వాద్యపు  త్రోవలెన్నో 
మనోరమ మనువాద మాధుర్య మాంద్యపు మాత్రలెన్నో 


--((**))--  

ఆరాధ్యలీల (విమలజలా ) 
రచాయ: మల్లాప్రగడ రామకృష్ణ 

రాధికను మరుతువా  - మదిలోని కధలివే  
బాధలను తొలచవా - యదలోని వెతలివే
కారణము వలదుగా - మనసే మనముగా 
ధైర్యమును కలపగా - సుఖమాయె మనసే 

వాదములు వలదులే - సరిలేని తరుణమే 
వేదముల పలుకులే - మతిమాయ సుమములే
కావ్యముల కధలులే - సుమమాల సుగుణమే 
ప్రేమమును కలుపవా - నవమోహన సువిధా 

స్థానములు మెరుపులే - కలలోని కతలులే 
భారములు బరువులే - కళ కోస పరువమే 
నేత్రముల పిలుపులే - సుమమాల వదువువే 
దేహమును కలుపగా - మనసాయె మనుగడే         

నదీ (అరి) - భ/న/లగ UIII IIIU 127 
విమలజలా - స/న/లగ IIUI IIIU 124
UIII IIIU  - IIUI IIIU



ఆరాధ్య లీల - ఉందెక్కడ  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

మనసు లోతు కనుగొను సూత్రము ఉందెక్కడ 
వయసు పెర్గు తెలుసుకొ సూత్రము ఉందెక్కడ  

సొగసు పంచు మనసుకు సూత్రము ఉందెక్కడ   
తపసు  చేయు మగువకు సూత్రము ఉందెక్కడ  

నయన చుక్క కడలికి సూత్రము ఉందెక్కడ  
మెరుపు వెల్గు పుడమికి సూత్రము ఉందెక్కడ    

కలల అమ్మ మనుగడ సూత్రము ఉందెక్కడ  
కళల తండ్రి పలుకుకు సూత్రము ఉందెక్కడ  
  
ఆత్మకు రూపం, ప్రేమకు అర్ధం 
జీవికి మోక్షం, శ్రమకు సాక్ష్యం 
అమ్మ ఆరాటం, నాన్న పోరాటం 
స్నేహానికి సూత్రము ఉందెక్కడ
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
-((**))--




ఆరాధ్య ప్రేమ లీల (శ్రీమతి)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  

నామనమ్మందు హాయికల్పించి నవ్వులన్ పంచు ప్రేమ రూపా   
ప్రేమతో నన్ను ఊరడించేటి మత్తులన్  మాపె శక్తి రూపా          

దాహమంతాను తీర్చి సంతోష పువ్వులే పంచు ముగ్ద రూపా        
దేహమంతాను పర్చి మాధుర్య మంజులానంద పర్చె రూపా      

తామసమ్మందు ఉన్న నన్నుయు చక్కగన్ మార్చు శ్వేత రూపా
దివ్యకావ్యమ్ము వ్రాయు నింగితొ వేడుకన్ చేయు పృద్వి రూపా

మంచిభోజ్జ్యమ్ము పెట్టి ఆకలి తీర్చియున్ కామ  తృప్తి రూపా 
మంచి భాగ్యమ్ము  ఇచ్చి ఆశయ కల్పియున్ దీప భాగ్యరూపా 

జీవితాంతంము నందు సఖ్యత నిల్పియున్ ప్రేమ సాక్షి రూపా 
ప్రేమ ఆలింగ నంతొ సభ్యత కల్పియున్ ప్రేమ తీర్పు రూపా 

ద్వేషభావంబు మార్చె సద్గుణ నేర్పుయున్ దివ్య భవ్య రూపా 
భక్తి ఆరాధ నందు భాద్యత తెల్పియున్ పూజ్య భావ రూపా            

భర్త ఆనందం తనకర్తవ్యమనీ 
మనసా వాచా కర్మణా చేస్తాననీ   
ముక్కోటి దేవతలసాక్షిగా 
కల్సిఉంటామని వచ్చిన భార్య రూపా 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా   

--((**))--
            
నడక - మిశ్రగతి (5,3 లేక 3,5 మాత్రలు), అష్టమాత్రలు
కామపుష్ప - త/ర/య/జ/త/ర/గ UIUUI UIUUI - UIUUI UIUU 
19 అతిధృతి 84563

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి