ఆరాధ్య లీల (ప్రకృతి- వికృతి) (తత్వము )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ, Pranjali Prabha.com
ఇష్టము అనిష్టము తలపేలా నిత్య రోగముతో
సత్యము అసత్యము పలుకేలా సత్య భావముతో
పుణ్యము అపుణ్యము అననేలా పుణ్య రాగముతో
కార్యము అకార్యము సెగయేలా కార్య సాధనతో
రాగము అరాగము వలపేలా పూజ్య రాగముతో
నాట్యము అనాట్యము నటనేలా నాట్య భంగిమతో
నాదము అనాదము అననేలా శబ్ద నాదముతో
కాలము అకాలము కననేలా అంత: వాదముతో :
నిత్యము అనిత్యము అనుటేలా నిత్య తాపముతో
కావ్యము అకావ్యము చదువేలా కావ్య వ్రాతలతో
కాంతయు అకాంతయు వగలేలా కాంత మోహముతో
శాంతము అశాంతము సుఖమేలా కొంత పంతముతో
ఆరాటానికి అన్వేషణతో ప్రేమకి త్యాగమునతో
హాస్యం అపహాస్యముతో జణనానికి మరణముతో చెలిమి తప్పదు
idi వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--
ఆరాధ్య లీల (తత్వము )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ఆకలనే ఆశ పాశము ఆనంద మివ్వక ఆదుర్ద ఆదరణే
ఉండియు ఆరాట పోరును ఆలోచనా మది భావాలు వర్ణములే
మానస మందుండు కోరిక ఆరోగ్య దాహము వెన్నంటి వచ్చినవే
బంధము నీతోడు పావనమే నాకు నిత్యము నారాయణా మృతమే
రాతలు రాసేందు కానతి కారుణ్య భావము శోభించు వెన్నెలలో
వేణువు నూదంగ హాయిగా నీవేళ ప్రేమయు పంచేందు మన్ననతో
మానస సంచార రాగాలు ఆలోచనామృత లానంద పూర్ణములే
బంధము నీతోడు పావనమే నాకు నిత్యము నారాయణా మృతమే
చిందులు నేవేతు చిత్రపు నృత్యాలు జిత్తము రంజిల్లు జొక్కముగా
ఆటలు నేనాడు పందెము చేయంగ నిత్యము శోభిల్లు నిక్కముగా
శ్రీమతి నావెంట ఉండగ నిత్యానురాగము వర్ధిల్లు మన్ననగా
బంధము నీతోడు పావనమే నాకు నిత్యము నారాయణా మృతమే
ఎక్కడ నున్నాడు చక్కని మారాజు చిక్కఁడు వెంటాడు వేదముగా
మక్కువతో నేను మిక్కిలి ప్రేమాను రాగము చూపంగ దేహముగా
చిక్కులతో నేను తన్మయ సేవాను రాగము చేయంగ బంధువుగా
బంధము నీతోడు పావనమే నాకు నిత్యము నారాయణా మృతమే
నాకు నిత్యము నారాయణా మృతమే, నాకు నిత్యము నారాయణా మృతమే
నాకు నిత్యము నారాయణా మృతమే, నాకు నిత్యము నారాయణా మృతమే
--((**))--
ఆరాధ్య లీల ( తత్త్వం ) Pranjali Praha.com
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
కాలమే నీది కావ్యమే నీది - కానిదందేది లేదులేలే
సాయమే నీది సామ్యమే నీది - సాధు జీవంగ సాగలేలా
ప్రేమయే నీది భాగ్యమే నీది - భావమేమీలె పాండురంగా
స్నేహమే నీది చిహ్నమే నీది - సత్యమే రంగా పండు రంగా
ప్రేమతో పిల్వ సంతసించేటి - సన్నిధానంలొ సామరస్యం
చూపుతో సేవ భాగ్యమందేటి - నవ్వులన్ జిందు నాదరూపా
ప్రేమమ్ము నందు ప్రేమగా వెల్గి - ప్రేమ రాజిల్లు ప్రేమరూపా
తామసం ఉంది మాయగా తొల్చి - సంసయాలన్ని తీర్చు రంగా
భావ దీపమ్ము వెల్గు గీతమ్ము - ప్రేమ పాశమ్ము నీ మనస్సే
ఈ వసంతమ్ము ప్రేమ పుష్పమ్ము - దివ్య కావ్యమ్ము నీ మనస్సే
మౌన రూపమ్ము నాద రూపమ్ము - నాంది వేదమ్ము నీ మనస్సే
సాయమే చేయు దాన రూపమ్ము - భక్తి బావమ్ము తెల్పు రంగా
దారియే లేదు ఆకలీ లేదు - బాధయే మమ్ము కమ్మి ఉంటే
ఆశయే లేదు ప్రేమయూ లేదు - కాలమే మమ్ము కమ్మి ఉంటే
సాయమూ లేదు ధర్మమూ లేదు - పాశమే మమ్ము కమ్మి ఉంటే
వేకువే లేచి వేగమే వచ్చి - వేదనే మాపు రంగ రంగా
వేదనే మాపు రంగ రంగా , వేదనే మాపు రంగ రంగా , వేదనే మాపు రంగ రంగా
--((**))--
నడక - మిశ్రగతి (5,3 లేక 3,5 మాత్రలు), అష్టమాత్రలు
కామపుష్ప - త/ర/య/జ/త/ర/గ UIUUI UIUUI - UIUUI UIUU
19 అతిధృతి 84563
ఆరాధ్య ప్రేమ లీల
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ
నవ్వుల చూపుయు చక్కగ ఉన్నది
- మానవ సేవయు ఆశగా ఉన్నది
కత్తుల వంతెన చిక్కగ ఉన్నది
- పొత్తుల మత్తుయు వత్తుగా ఉన్నది
ఆశల హారతి నిండుగ ఉన్నది
- బొమ్మల ఆటల పండుగ ఉన్నది
మాటల పొంతన వింతగఁ ఉన్నది
- వీడని బంధము తీయగా ఉన్నది
ఏటికి దాహం , నీటికి మొహం
ప్రేమకు కామం, సేవకు ప్రాణం
స్త్రీలకు శీలం, ఆశకు మౌనం
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
ఆరాధ్య ప్రేమ లీల
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ
మనసెంత ఆరాటపడిన కాలం నీది కాదు
వయసెంత ఉడికిపోయిన ప్రాణం నీది కాదు
తనువెంత అలసి పోయిన సేవా నీది కాదు
మమతెంత మరిగిపోయిన ప్రేమా నీది కాదు
జపమంత కలసి చేసిన స్నేహం నీది కాదు
కళలంత వలచి చేసిన లక్ష్యం నీది కాదు
కరువంత కలసి మాపిన ధ్యేయం నీది కాదు
జనమంత కలసి వచ్చిన తీర్పు నీది కాదు
ప్రయత్నిమ్చటం మానవులవంతు
అనుభవించటం ఆత్మీయులవంతు
వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--
ఆరాధ్య లీల - తత్త్వం
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
లక్షల లక్షల లక్ష్యమ్ము తో ధైవమ్ము తలచియూ
కక్షల కక్షల బేధమ్ము తో ప్రేమమ్ము మరచియూ
శిక్షల శిక్షల ధర్మమ్ము తో ద్వేషమ్ము వగచి యూ
రక్షణ రక్షణ సత్యమ్ము తో సాయమ్ము పిలిచెయే
కష్టము కష్టము కష్టమ్ము తో కాయమ్ము తొలచి యూ
నష్టము నష్టము నష్టమ్ము తో భారమ్ము మోపితి యూ
ఇష్టము ఇష్టము ఇష్టమ్ము తో వాదమ్ము చెసితి యూ
అష్టమి కష్టము ఇష్టమ్ము తో చేయమ్ము తలిచి యే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి