ఒక చిన్న కథ
అది ద్వాపరయుగం. ఒకసారి కృష్ణార్జునులు కలిసి వెళుతున్నారు. వారికి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు. చూసి జాలిపడిన అర్జనుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచీ నిండుగా బంగారు నాణేలు ఇచ్చాడు. సంతోషంగా తీసుకువెళుతున్న ఆ యాచకుడిని మార్గంమధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు.
మళ్లీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చేయసాగాడు. మళ్లీ ఓరోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జనుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు.
ఆ యాచకుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి గదిలో మూలన ఉన్న, వినియోగంలో లేని ఒక కుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు. తెల్లారింది. చూస్తే భార్య లేదు. అంతేకాదు ఆ కుండ కూడా లేదు. పరుగెట్టుకుంటూ నదీతీరం వద్దకు వెళ్లాడు.
భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు. కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు. నదిలో నీళ్ల కోసం వంచినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్లీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్లాడు.
మళ్లీ కృష్ణార్జునులు అతన్ని విచారించారు ఏమైందని. ఇంక ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా, ఇతనెవరో పరమ దురదృష్ణవంతుడిలా ఉన్నాడు. అన్నాడు అర్జనుడు శ్రీ కృష్ణుడితో. లేదు అర్జున. ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం అని బ్రాహ్మణుడి చేతిలో రెండు బంగారు నాణేలు పెట్టాడు శ్రీకృష్ణుడు.
ఒకప్పుడు సంచీడు బంగారు నాణేలు, విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు. ఈ రెండు నాణేలేమైనా నా తలరాతను మారుస్తాయా నా పిచ్చికానీ అనుకుంటూ ఇంటికెళుతున్నాడు ఆ బ్రాహ్మణుడు.
దారిలో ఒక జాలరి వలకి చిక్కి విలవిలలాడుతున్న చేపను చూశాడు. అతని హృదయం ద్రవించింది. కృష్ణుడు నాకిచ్చిన రెండు నాణేలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు. పాపం మూగజీవి దాని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గరున్న రెండు నాణేలూ ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి తీసుకెళ్లి ఒక నీళ్ల గిన్నెలో ఉంచాడు.
అతని భార్య ఆ చేపను చూసి అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుంది అండీ అందుకే గిలగిలా కొట్టుకుంటోంది అని పిలిచింది. ఇద్దరు కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుకున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు. నదిలో తాము జారవిడుచుకున్న వజ్రం. ఆనందంతో ఉక్కిరిబిక్కిరై “దొరికింది...దొరికింది. నా చేతికి చిక్కింది”అని గావుకేకలు పెట్టాడు.
అదే సమయంలో అతనింట్లోకి ప్రవేశించిన *ఓ దొంగ ఈ పేద బ్రాహ్మణుడిని చూసి కంగారుపడ్డాడు. గతంలో అతన్ని దారిదోపిడి చేసి బంగారు నాణేలా సంచి దొంగలించాను,* నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టాను, నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడు అనుకుని వణికిపోయాడు.
ఆ బ్రాహ్మడు దగ్గరకి వచ్చి నీకు దణ్ణం పెడతాను, నీ బంగారు నాణేలు నువ్వు తీసేసుకో నన్ను రక్షకభటులకు మాత్రం పట్టివ్వద్దు అని ప్రాధేయపడ్డాడు. ఇప్పుడు నివ్వెరపోవడం బ్రాహ్మణుడి దంపతుల వంతయింది. తాము పోగొట్టుకున్న రెండు విలువైన వస్తువులూ తమకు చేరాయి. పరుగు పరుగున అర్జునుడి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పాడు.
కృష్ణా, నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణేలు, వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు. కానీ నీవిచ్చిన రెండు నాణేలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించాడు అర్జునుడు.
అర్జునా, అతని వద్ద బంగారం, వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తను, తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు. అదే రెండు నాణేలు ఉన్నప్పుడు మరో జీవి మంచిచెడులు, ఈతిబాధలు, కష్టసుఖాలు గురించి ఆలోచించాడు.
నిజానికి అది దేవుడి చేయాల్సిన పని. తనూ పంచుకున్నాడు. అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను. ఇది అతని ధర్మ ఫలం అని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ.
ప్రాంజలి ప్రభ (ప్రకృతి ఛందస్సు ) పద్యాలు -౩
రచయాత: మల్లాప్రగడ రామకృష్ణ
ఎంత సేవచేసినా అదేంటో మౌనమే
ఎంత ప్రేమచూపినా అదేంటో మాయయే
ఎంత కల్పుకొన్ననూ అదేంటో ఆశయే
ఎంత బాధతీర్చినా అదేంటో ఆకలే
ఎంత వ్రాసినా అదేంటో ప్రేమ లేఖే
ఎంత పాడినా అదేంటో దు:క్ఖ గీతే
ఎంత త్రాగినా అదేంటో చేదు నీరే
ఎంత మ్రొక్కినా అదేంటో దేవమాయే
ఎంత పొందినా ఇంకా పొందే ఆరాటమే
ఎంత చూసినా చూద్దామని ఆరాటమే
ఎంత ఓర్పున ఉన్నా ఇంకా పోరాటమే
ఎంత నేర్పును చూపినా ఇంకా లోపమే
--((**))--
ప్రాంజలి ప్రభ (ప్రకృతి ఛందస్సు ) పద్యాలు -౩
రచయాత: మల్లాప్రగడ రామకృష్ణ
ఎవరో అన్నవి ఎవరో విన్నవి ఈ లోకంలో
ఎవరో కన్నవి ఎవరో తిన్నవి ఈ లోకంలో
ఎవరో పుట్టగ ఎవరో పొంగిరి ఈ లోకంలో
ఎవరో చావగ ఎవరో కుంగిరి ఈ లోకంలో
చెప్పుకోలేని మనసు గాయానికి మందు ఏది
భావమే రాగమై పల్లవించు
స్నేహమే రోగమై దొర్లుచుండు
ప్రేమయే భోగమై పొర్లుచుండు
దైవమే దివ్యమై వెల్గుచుండు
--((**))--
చుక్క నైతే ఈ బెడద తప్పునే
మొక్కనైతే ఈ వగపు తప్పునే
వక్క నైతే ఈ వగరు తప్పునే
ముక్క నైతే ఈ సెగలు తప్పునే
ఊగులాడు కెరటాలు నాపుకొను
సాగులాడు తరగల్లు నిల్పుకొను
జూదమాడు పరవళ్లు తల్చుకొను
మాటాలాడు మగువళ్ళు ఆశకొను
సున్నితత్వము మనసుకు శోభ నొసగు
కర్మ తత్వము వయసుకు ప్రేమ నొసగు
ధర్మ తత్వము వరుసకు వెల్గు నొసగు
న్యాయ తత్వము పలుకుకు తెల్వి నొసగు
--((**))--
Pranjali Prabha.com
కష్టపడితేనే తిన్నది అరుగు
ఇష్టపడితేనే విన్నది జరుగు
నష్టపడితేనే ఉన్నది పెరుగు
తృప్తిపడితేనే ఆకలి కలుగు
పాట పాడుట సులువే కానీ నచ్చేదేందరకో
గాధ తెల్పుట సులువే కానీ నమ్మేదేందరినో
మౌన మెప్పుడు సులువే కానీ నిల్చేడెందరిలో
బోధ చేయుట సులువే కానీ నచ్చేదేందరికో
మనసును బట్టి నడుచుట సులువే కానీ గర్వం పోదు
వయసును బట్టి కలియుట సులువే కానీ లక్ష్యం పోదు
సొగసును బట్టి కులుకుట సులువే కానీ ధర్మం కాదు
తనువుని బట్టి పలుకుట సులువే కానీ బంధం కాదు
--((**))--
Pranjali Prabha.com
(ప్రకృతి ఛందస్సు ) పద్యాలు -౩
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
జత గూడ రమ్మంటు జాగు చేసి
విధి నాట కమ్మంటు కొంగు చూపి
జప చేయ వద్దంటు చీర చూపి
కళ చూపి ముద్దంటు ఆశ చూపె
పులకించి పోయాను సన్నజాజి నడుము చూసి
ఎలుగెత్తి చాటాను చందమామ మెరుపు చూసి
పరుగెత్తి పాడాను పంజరాన చిలక చూసి
విసుగొచ్చి ఆడాను మదిలోన మగువ చూసి
కనురెప్పల కాపు గాచి కరిగి పోయాను
వినుమాటను తెల్పి వేచి విసిగి పోయాను
వలపన్నది నేర్పి వచ్చి తిరిగి పోయాను
తెగువన్నది చూప లేక నలిగి పోయాను
--((**))--
అదుపు లేని నోరు - రాజకీయములో వద్దు
కధలు చెప్పె నోరు - రాజ నీతులలో వద్దు
అసలు మూగనోరు - కీచు లాటలలో వద్దు
మనసు నొచ్చు నోరు - విద్య బోధలలో వద్దు
తాళం లేని ఇల్లు - పశువుల
పూజా లేని ఇల్లు - కరువుల దొడ్డే
దానం లేని ఇల్లు - ముడుపుల దొడ్డే
పాపం లేని ఇల్లు - మగువుల దొడ్డే
--((**))--
లలితా - భ/ర/న/ర/న/గ UIIU IUIII - UIUI IIU
16 అష్టి 30167
నేటి రాజకీయం
కాలమనే నవీనయుగ మాయ మర్మ మనుటే
సేవ అనే సభా పరము మాట తీర్పు యనుటే
ఓటు అనే ప్రజా వరము గొప్ప మార్పు అనుటే
మాట లతో నిరంతరము ప్రేమ ఓటే అనుటే
మానస సంచరే మనిషి ధర్మ చూపు ఒకటే
ప్రాణము ఉండుటే మనిషి సత్య మాట ఒకటే
బాధయు పొందుటే మనిషి నిత్య ప్రేమ ఒకటే
సాధన చెయుటే మనిషి కాల తత్త్వ మొకటే
ఆలయమే గదా మదియు - నమ్మ నిన్ను నిలుపన్
శ్రీలలితా దయాకలిత - ప్రేమతోడఁ గనుమా
మేలిడుమా నిరంతరము - మేము నీదు నిసుఁగుల్
పూలివిగో పదమ్ములకుఁ - బూజ సేయ నిపుడే
చారుమతీ సరోజముఖి - చంద్ర సూర్య నయనా
తీరని మా విచారములఁ - దీర్చు మమ్మ గరుణన్
వేఱెవ రీప్రపంచమునఁ - బ్రేమఁ జూపఁగలరే
శ్రీరమణీ కళామయము - సేయవమ్మ బ్రతుకున్
మీటుము నీ విపంచిఁ గల - మెట్లపైన మృదువై
పాటలతో జపించు వర - వారిజాక్షి కృపకై
మాటలతో స్మరించు మన-మందు భక్తి విరియన్
నాటక మీ చరాచరము - నాట్య మామె సలుపున్
--((**))--
విధేయుడు - జెజ్ఝాల కృష్ణ మోహన రావు

కళ్ళు తెరచి కళ్ళు మూసే లోపు కాలం జరుగు
ఉండి లెకయె లేక ఉన్నాకోప కాలం పెఱుగు
ప్రేమ తెలియ ప్రేమ పొందే తాప కాలం తరుగు
కాల మెపుడు రక్ష నిచ్చే తీపి భావం తెలుపు
--((**))--
రాత్రి కలకు కునుకు లేదు వసంత గాలి కమ్మింది
నేటి కళకు ఎదురు లేదు సమంత గాలి కమ్మింది
రేపు చదువు కొదువ లేదు అనంత గాలి కమ్మింది
ప్రీతి మగువ వలపు లేదు మనస్సు గాలి కమ్మింది
నీ వాదన వేదన ఎప్పుడైనా భరించక తప్పదు
నీ గర్వము కోపము ఎప్పుడైనా తపించక తప్పదు
నీ ఆకలి దాహము ఎప్పుడైనా ఒడించక తప్పదు
నీ సాధన శోధన ఎప్పుడైనా శపింపక తప్పదు
నేటి కళకు ఎదురు లేదు సమంత గాలి కమ్మింది
రేపు చదువు కొదువ లేదు అనంత గాలి కమ్మింది
ప్రీతి మగువ వలపు లేదు మనస్సు గాలి కమ్మింది
నీ వాదన వేదన ఎప్పుడైనా భరించక తప్పదు
నీ గర్వము కోపము ఎప్పుడైనా తపించక తప్పదు
నీ ఆకలి దాహము ఎప్పుడైనా ఒడించక తప్పదు
నీ సాధన శోధన ఎప్పుడైనా శపింపక తప్పదు
చెప్పుకోలేని మనసు గాయానికి మందు ఏది
కల్సుకోలేని మనిషి కాలానికి మందు ఏది
ఒప్పుకోలేని వయసు కామానికి మందు ఏది
తప్పుకోలేని వలపు నేరానికి మందు ఏది
మర్చిపోలేని సొగసు చిత్తానికి మందు ఏది
ఓర్చుకోలేని వెలుగు దీపానికి మందు ఏది
మార్పుతేలేని తెలుగు పద్యానికి మందు ఏది
తీర్పుతేలేని పలుకు సత్యానికి మందు ఏది
భావమే రాగమై పల్లవించు
స్నేహమే రోగమై దొర్లుచుండు
ప్రేమయే భోగమై పొర్లుచుండు
దైవమే దివ్యమై వెల్గుచుండు
"" తరతమ నడక చూడక మనస్సును ఏ ""
"" భయమున పడక మానస వయస్సును ఏ ""
"" తపము పలుకులు మార్చునొ యశస్సు కల్గున్ ""
“” వెనుకబడి నడచు వారె ఘన విజ్ఞులగున్””
--((**))--
కన్న తల్లి కరుణ మరువ లేనిది
కన్న తండ్రి ధనము మరువ లేనిది
కన్న వారి ఋణము మరువ;లేనిది
ఉన్నవారి తెగువ మరువ లేనిది
కళల అనగానె సరిపోదు నిత్య సాధన గావలె
కలలు కనగానె సరిపోదు నిత్య శోధన కావలె
కధలు లిఖగానే సరిపోదు సత్య వాదన కావాలె
పలుకు వినగానే సరిపోదు సత్య ప్రేమయు కావాలె
--((**))--
కన్న తల్లి కరుణ మరువ లేనిది
కన్న తండ్రి ధనము మరువ లేనిది
కన్న వారి ఋణము మరువ;లేనిది
ఉన్నవారి తెగువ మరువ లేనిది
కలలు కనగానె సరిపోదు నిత్య శోధన కావలె
కధలు లిఖగానే సరిపోదు సత్య వాదన కావాలె
పలుకు వినగానే సరిపోదు సత్య ప్రేమయు కావాలె
--((**))--
చుక్క నైతే ఈ బెడద తప్పునే
మొక్కనైతే ఈ వగపు తప్పునే
వక్క నైతే ఈ వగరు తప్పునే
ముక్క నైతే ఈ సెగలు తప్పునే
ఊగులాడు కెరటాలు నాపుకొను
సాగులాడు తరగల్లు నిల్పుకొను
జూదమాడు పరవళ్లు తల్చుకొను
మాటాలాడు మగువళ్ళు ఆశకొను
కర్మ తత్వము వయసుకు ప్రేమ నొసగు
ధర్మ తత్వము వరుసకు వెల్గు నొసగు
న్యాయ తత్వము పలుకుకు తెల్వి నొసగు
Pranjali Prabha.com
ఇష్టపడితేనే విన్నది జరుగు
నష్టపడితేనే ఉన్నది పెరుగు
తృప్తిపడితేనే ఆకలి కలుగు
పాట పాడుట సులువే కానీ నచ్చేదేందరకో
గాధ తెల్పుట సులువే కానీ నమ్మేదేందరినో
మౌన మెప్పుడు సులువే కానీ నిల్చేడెందరిలో
బోధ చేయుట సులువే కానీ నచ్చేదేందరికో
మనసును బట్టి నడుచుట సులువే కానీ గర్వం పోదు
వయసును బట్టి కలియుట సులువే కానీ లక్ష్యం పోదు
సొగసును బట్టి కులుకుట సులువే కానీ ధర్మం కాదు
తనువుని బట్టి పలుకుట సులువే కానీ బంధం కాదు
--((**))--
Pranjali Prabha.com
(ప్రకృతి ఛందస్సు ) పద్యాలు -౩
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
విధి నాట కమ్మంటు కొంగు చూపి
జప చేయ వద్దంటు చీర చూపి
కళ చూపి ముద్దంటు ఆశ చూపె
పులకించి పోయాను సన్నజాజి నడుము చూసి
ఎలుగెత్తి చాటాను చందమామ మెరుపు చూసి
పరుగెత్తి పాడాను పంజరాన చిలక చూసి
విసుగొచ్చి ఆడాను మదిలోన మగువ చూసి
కనురెప్పల కాపు గాచి కరిగి పోయాను
వినుమాటను తెల్పి వేచి విసిగి పోయాను
వలపన్నది నేర్పి వచ్చి తిరిగి పోయాను
తెగువన్నది చూప లేక నలిగి పోయాను
--((**))--
అదుపు లేని నోరు - రాజకీయములో వద్దు
కధలు చెప్పె నోరు - రాజ నీతులలో వద్దు
అసలు మూగనోరు - కీచు లాటలలో వద్దు
మనసు నొచ్చు నోరు - విద్య బోధలలో వద్దు
తాళం లేని ఇల్లు - పశువుల
పూజా లేని ఇల్లు - కరువుల దొడ్డే
దానం లేని ఇల్లు - ముడుపుల దొడ్డే
పాపం లేని ఇల్లు - మగువుల దొడ్డే
--((**))--
లలితా - భ/ర/న/ర/న/గ UIIU IUIII - UIUI IIU
16 అష్టి 30167
నేటి రాజకీయం
కాలమనే నవీనయుగ మాయ మర్మ మనుటే
సేవ అనే సభా పరము మాట తీర్పు యనుటే
ఓటు అనే ప్రజా వరము గొప్ప మార్పు అనుటే
మాట లతో నిరంతరము ప్రేమ ఓటే అనుటే
మానస సంచరే మనిషి ధర్మ చూపు ఒకటే
ప్రాణము ఉండుటే మనిషి సత్య మాట ఒకటే
బాధయు పొందుటే మనిషి నిత్య ప్రేమ ఒకటే
సాధన చెయుటే మనిషి కాల తత్త్వ మొకటే
ఆలయమే గదా మదియు - నమ్మ నిన్ను నిలుపన్
శ్రీలలితా దయాకలిత - ప్రేమతోడఁ గనుమా
మేలిడుమా నిరంతరము - మేము నీదు నిసుఁగుల్
పూలివిగో పదమ్ములకుఁ - బూజ సేయ నిపుడే
చారుమతీ సరోజముఖి - చంద్ర సూర్య నయనా
తీరని మా విచారములఁ - దీర్చు మమ్మ గరుణన్
వేఱెవ రీప్రపంచమునఁ - బ్రేమఁ జూపఁగలరే
శ్రీరమణీ కళామయము - సేయవమ్మ బ్రతుకున్
మీటుము నీ విపంచిఁ గల - మెట్లపైన మృదువై
పాటలతో జపించు వర - వారిజాక్షి కృపకై
మాటలతో స్మరించు మన-మందు భక్తి విరియన్
నాటక మీ చరాచరము - నాట్య మామె సలుపున్
--((**))--
విధేయుడు - జెజ్ఝాల కృష్ణ మోహన రావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి