ఆరాధ్య లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ఆనాడు ఈనాడు నా మనసు ఒకటే మారదయ్య
సర్దుకొనే సత్వ గుణము ఎప్పటికీ మారదయ్య
చిన్న చిన్న తప్పులు చేశాను ఎందుకు మాటలయ్య
“అంత కోపం ఎందుకయ్యా అపుడునా వయసైదయ్య”
లేలేత బుగ్గలను చూసి నీ చేతితో నిమిరావు
విరిసి విరియని మందార మొగ్గనని చూడక
ఉక్కిరి బిక్కిరి చేసీ ఉడికించి ఏడిపించావు
“అంత కోపం ఎందుకయ్యా అపుడునా వయసైదయ్య”
అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో ఏమో నాకు తెలియదు
అమ్మ లందరిలో మా అమ్మను చూస్కొని కొలిచాను
మా అమ్మను కనుగొన్నాక నన్ను వదలి పోయేను
“అంత కోపం ఎందుకయ్యా అపుడునా వయసైదయ్య”
చిన్ని కృష్ణునిలా వేషం వేసి వెన్నను దొంగిలించా
ఆవు పాలిళ్లను నోటిలో ఉంచుకొని పాలు త్రాగా
అప్పుడు మా అయ్యా కొంటెవేషా మానమని కొట్టే
అంతకోపం ఎందుకయ్యా అపుడునావయసైదయ్య.
ముద్దు చేసి మత్తు గొల్పే కలువ పూవును చంద్రయ్య
వెన్న వంటి చల్లఁ నైనా మరులు గొల్పెను మౌనయ్య
కోర్క తీర్చి సద్దు చేసీ చలువ పందిరి కన్నయ్య
అంత కోపమ్ ఎందుకయ్యా అపుడు నావయసైదయ్య
ఆరాధ్య ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ప్రసవ వేదము, బ్రతుకు వాదము
కవుల కల్పన, అధర ప్రేమము
జనని కష్టము, జనక ధైర్యము
మెతుకు రోదము, పలుకు భావము
కలత రాగము , మధుర నాదము
యువత మోహము, మహిళ మౌదము
చిలిపి హాసిని, హృదయ లాలన
మమత పోషణ, సమత సాధన
పుస్తక, మస్తక ఫలమే
చదివి వినుట శుభమే
మనసు శాంతియు కల్పమే
కవుల కధల ధ్యేయమే
వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--
ఆరాధ్య ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
పుడమి తల్లికి నీరు పెట్టి విత్తనాలు నాటాలి
కడలి పొంగుల గాలి చేను చేర కుండ చూడాలి
సుగుణ వల్లికి ప్రేమ చేసి సద్దు చేసి కోరాలి
మగణి మాటకి మాయ వీడి మంచి చేసి తీరాలి
అరకు ఆశను తీర్చి వేటు నుంచి మార్పు తేవాలి
చెరకు తీపియు చూసి ఘాటు ప్రేమ తీర్పు ఇవ్వాలి
మమత అంతయు చూపి కాల మార్పు అందు కోవాలి
కలల పంతము మాని అన్న దాత ప్రేమ పండాలి
నిట్టూర్పు ఊబినుండి
కర్షక స్వేదం నుండి
ఎండిన ఎద నుండి
ప్రతి జీవి బతికి తీరాలి
వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--
ఆరాధ్య ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
కత్తులు దూసినా ప్రేమికులను విడ దీయ లేవు
అందము చూపినా నమ్మికులను పడ వేయలేవు
కన్నులు తెర్చినా కామికులను సరి చేయలేవు
మౌనము వీడినా ప్రేమికులను దరి చేర్చలేవు
మోహము కమ్మినా అంబరముతొ జల మియ్యలేవు
కోపము వచ్చినా దాహములను గతి మార్చ లేవు
శ్వాసయు పంచినా దేహములను మతి కూర్చ లేవు
వెన్నెల వచ్చినా మారని మోము జత చేర్చ లేవు
అగ్నికి ఆహుతి ఎదో
ప్రేమకి జాగృతి ఎదో
ఆశకు పద్దతి ఎదో
ప్రేమకి కళ్ళు లేవు అంతా మాయ
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి