నేటి సాహిత్యం , Pranjali Prabha.com
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ
పారిజాత పరిమళాల పిలుపుకై మతి
వికసించిన విరజాజి సౌరభాలు స్థితి
పరువసించించే పరువాల పిలుపు గతి
పరవశించే ప్రణయునకు ప్రసాంత గీతి
స్వరపరిచి సరిగమ పదనిస ధాటి
సరసలయలను సాకిన సయోధ్య సాటి
చెంతను చేరి చెమ్మ చెక్కలాటలలో పోటి
పరవశించే ప్రణయునకు ప్రసాంత గీతి
సరస చూపులతో తరుణి కరుణ చూపి
బిగి కౌగిలిలో మదనుని మురిపించేసి
వల తలపు వగరు పొగరు చూపించేసి
పరవశించే ప్రణయునకు ప్రసాంత గీతి
పిల్లగాలి పరవ సించి తణువంత సాగి
చలించిన చెలిమి కలవరింత కరిగి
అరుణ కిరణ సోకగా తరించే సుందరాంగి
పరవశించే ప్రణయునకు ప్రసాంత గీతి
--((**))--
ఎందఱో మహానుభావులు అందారికి వందనమ్ములు
18-10- 2 0 1 8 " నాడు ప్రాంజలి ప్రభ వారు " సమస్యాపూరకముగా "అప్పి చ్చేవాడు వైధ్యుడు, అప్పు తెచ్చేవాడు తండ్రి"
స్పందించి కొన్ని కవితలు పంపినవి, మీకు పొందు పరుస్తున్నా " మీ సభ్యులలో telugu పండితులు లున్నట్లైతే మీ అభిప్రాయాలు తెలపండి. బహుమతి మీకే రావచ్చు "పంపేవారు చిరునామా ఫోన్ నెమ్బర్ తెలపగలరు "
ఎంత వింత మానసమో నుదుటి వ్రాత మార్చవా,
అప్పిచ్చువాడు వైద్యుడే ఎక్కడైనా చూపిస్తావా.,
అప్పుచేయని తండ్రిని ఎక్కడైనా చూపిస్తావా,
కాలమెప్పుడు సొంత ఇల్లు అనుకోకు అందుకే,
"అప్పిచ్చేవాడు వైధ్యుడు అప్పు తెచ్చేవాడు తండ్రి"
అనారోగ్యాన్ని క్షణములో తగ్గించేది వైద్యుడు
పిల్లల చదువుకు పెళ్ళికి అప్పు తెచ్చేవాడు
తండ్రి,కుటుంబ మన:శాంతి నిచ్చేవారు కావున
"అప్పిచ్చేవాడు వైధ్యుడు, అప్పు తెచ్చేవాడు తండ్రి" ....
రోగి గుండె తీసి గుండె పెట్టి బ్రతికించే బ్రహ్మ,
భార్యప్రేమ పొంది పంచి బిడ్డలను పెంచే శివ,
నిత్యమూ వృత్తి ధర్మాన్ని పాటించే తండ్రే వైద్యుడు,
"అప్పి చ్చేవాడు వైధ్యుడు, అప్పు తెచ్చేవాడు తండ్రి"
కన్న బిడ్డ ప్రాణం కోసం తహ తహ లాడు తల్లి,
కన్న బిడ్డ జీవితం కోసమే పాకు లాడు తండ్రి,
ప్రాణం కోసం అప్పు తెచ్చిన నమ్మిన స్నేహితుడు,
"అప్పి చ్చేవాడు వైధ్యుడు, అప్పు తెచ్చేవాడు తండ్రి"
--((**))--
| |||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి