ఆరాధ్య నాయక లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
రాష్ట్రాభివృద్ధి గమనించేవాడు నాయకుడు
ఆసరాన్ని బట్టి పార్టీని మార్చు నాయకుడు
ప్రజల నాడి గమనించేవాడు నాయకుడు
ఇచ్చుపుచ్చుకొంటూ షరతుపెట్టె నాయకుడు
త్రాసులా ప్రజా హృదయాన్ని తట్టే నాయకుడు
భీష్ముడిలా రాజ్యాన్ని కాపాడేది నాయకుడు
నమ్మకాన్ని వమ్ముచేయని వాడే నాయకుడు
చేసింది చెయ్యాల్సింది చెప్పేవాడే నాయకుడు
మాట గంధం కత్తెర తెల్వి గల నాయకుడు
పదవి భోగం కొద్ది కాలం పొందే నాయకుడు
ప్రజలకు విశ్వ ప్రేమను పంచే నాయకుడు
అనునిత్యం సమస్యలను తీర్చే నాయకుడు
విశ్వ మైత్రి తో కార్య సాధకుడే నాయకుడు
ప్రజా పరమార్ధం గ్రహించే వాడే నాయకుడు
చిత్తశుద్ధి దృఢ సంకల్పం ఉండే నాయకుడు
మంచిని పంచి అభిమానం పొందే నాయకుడు
ధనాశకు పోక, స్వార్ధం వీడి
ప్రజల నమ్మకాన్ని నిజం
చేసేవాడే నిజమైన నాయకుడు
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--
ఆరాధ్య మాయ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
చూసింది చెప్పలేం, చెపితే మనకు ఏ మొచ్చునో తంటా
విన్నది పల్కలేం, పల్కితే తప్పులు ఏ మొచ్చినా తంటా
చెప్పే మాట నిజాయితీ ఉన్నా, గుర్తించక పోతే తంటా
“తలచి చూడగన్ మనము చేయు మాయాజాలమే గదా”
వయసు వేడుకన్ మనము చేస్తూ పొతే ఖర్చులే కదా
సొగసు వేడుకన్ పంచుతూ పొతే అనారోగ్యమే కదా
తపసు చేసినన్ ఫలితం రాకపోతే అ శాంతే కదా
“తలచి చూడగన్ మనము చేయు మాయాజాలమే గదా”
సంపాదించే వారు ఒకరు, అనుభవించే వా రొకరు
చదివించే వారు ఒకరు, అర్ధం గ్రహించే వా రొకరు
ధనమున్న వారు ఒకరు, దానం చేయించే వా రొకరు
“తలచి చూడగన్ మనము చేయు మాయాజాలమే గదా”
ఒక గొర్రె పక్కకు పొతే అన్నీ గొర్రెలు పోయినట్లే
ఒక మంత్రి ఆశకు పొతే మంత్రు లందరు పోయినట్లే
ఒక గంట ఆలస్యం ఐతే కార్యం లన్నియు మారినట్లే
“తలచి చూడగన్ మనము చేయు మాయాజాలమే గదా”
--((**))--
ఆరాధ్య లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
చిరునవ్వుల చిన్మయ ధాత్రి
తొలిపువ్వుల శోభల ధాత్రి
పలుపూజల వెల్గెటి ధాత్రి
మనువంతయు కల్పన ధాత్రి
కలిమాయ ఛేదన ధాత్రి
మనుమాయ తెంచిన ధాత్రి
పలుమాయ కూల్చిన ధాత్రి
సిరిమాయ కాల్చిన ధాత్రి
కళను వృద్ధి పరచిన ధాత్రి
కలల శాప తొలచిన ధాత్రి
వెతలు తీర్చె పలుకుల ధాత్రి
నడక నేర్పె మమతల ధాత్రి
మేలుకొలుపు తలిపే ధాత్రి
తేట తెలుగు పలికే ధాత్రి
వేట మలుపు చలికే ధాత్రి
మాట పదును తెలిపే ధాత్రి
రామ నామ నిత్య జప ధాత్రి
ప్రేమ చూపు సత్య నిజ ధాత్రి
ధర్మ మార్గ రామ దయ ధాత్రి
కావ్య శ్రావ్య దూత రమ ధాత్రి
ధాత్రి=ఆంజనేయస్వామి
అనుగ్రహమే మాకు బలం
ఆశీర్వాదమే మాక్ జయం
ఈశ్వరార్పణమే మాకు ధర్మం
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
ఆరాధ్య లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
మనసారా అమ్మను వేడుకొనగా
మాలిన్య మది వీడి మరలి పోగా
నిత్యమూ వేదాలను పఠియించంగా
అమ్మ కృపతో వాక్చాతుర్యం ప్రభగా
కర్తవ్య ధర్మసూక్ష్మాలు భోధించగా
అమ్మ చరణమ్ము పూజా ఫలమేగా
తల్లి తండ్రుల గురు సేవ చేయంగా
అమ్మ జ్ఞానమున్ సమకూర్చే జ్ఞప్తిగా
స్వార్థమ్ము వదలి
తరులువలే పరులను మేల్కొల్పి
మన: శాంతి కల్పించుటే
వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--
ఆరాధ్య ప్రేమ లీల
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
గల గలగా అలల నురగలు
గబగబగా పరుగు పరుగులు
తెలతెలగా ఉదయ వెలుగులు
ఘుమఘుమగా కలువ సొగసులు
చెకచెకగా పుడమి తలపులు
కళకళగా పడతి పలుకులు
సహచరిగా మగణి కొలువులు
అనుకరిగా మమత మలుపులు
ప్రకృతి ప్రేమ గమనించు
ఆకృతి ఆశ వదిలించు
జాగృతి మది తలపించు
ఇది వేణు గోపాల ప్రేమసుమా
--((**))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి