ఆరాధ్య కాఫీ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
అందరి జీవితం సాగాలి సాఫీ
అందుకు త్రాగాలి నిత్యము కాఫీ
అది నీలో నేర్పును ఫిలాసఫీ
నీకు ఎదురులేదు అదే మాఫీ
ఎత్తైన మెడ జంతువు జిరాఫీ
నాకు ఇష్టం చెక్కర పాల బర్ఫీ
నాకు ఎప్పుడూ ఉండును బార్ తారిఫ్ (మన:సాక్షి)
అందుకే నే చేసే ధర్మబోధ ఫ్రీ
కాలం అందిస్తుంది వనరులు ఫ్రీ
పుడమితల్లి లో ఖనిజాలు ఫ్రీ
ఆకాశ మేఘాల వర్షం మనకు ఫ్రీ
కానిదంటూ లేదు స్త్రీ పొందు ఫ్రీ
అందరి జీవితం సాగాలి సాఫీ
అందుకు త్రాగాలి నిత్యము కాఫీ
ఆరాధ్య సంసార లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
కాలమనే నావలో, భూమి యనే సంద్రం లో
ప్రేమనే జీవిలో, మనసనే సంసారం లో
అణువణువు ప్రకంపనలే
తనుతనువు తపస్సులులే
కనకనువు ఊగిసలులే
తడి పొడులు సరాగములే ...... కా
వయసులో పెరుగు ఉబలా టలే
మమతలో మరుగు కీచులాటలే
తనువులో జరుగు కుమ్ములాటలే
బ్రతుకులో నలుగు జంజలాటలే ...... కా
ఆశాపాశము లో చిక్కి తన్నులాటలే
ధనమదములో నల్గి అనారోగ్యులే
తన్వా కర్షణలో మర్గి వళ్ళు గుల్లలే
పుణ్యపాపాలలో చిక్కి బొమ్మలాటలే ...... కా
ఉన్నది లేనిది, లేనిది ఉందని వాదనలే
మంచే చెడని చెడె మంచిని నీ నా వాదనలే
నీవు గొప్ప నేను ఒప్ప నీవు దిబ్బ వాదనలే
జీవితం లో నీవు నేను వాదం ఏకం తప్పఁదులే ...... కా
కాలమనే నావలో భూమి యనే సంద్రం లో
ప్రేమనే జీవిలో మనసనే సంసారం లో
--((**))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి