*ఆరాధ్య భక్తి లీల*
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ఉపవాస వ్రతములు, నీ కోసం చేస్తూ, ధర్మ బోధ చేస్తా
సుమపూజ జపములు, నీకోసం చేస్తూ, న్యాయ బోధ చేస్తా
సమ భావ తపములు, నీకోసం చేస్తూ, సత్య బోధ చేస్తా
నిను చేరి కరములు, జోడించే ప్రార్థిస్తూ, నిత్య బోధ చేస్తా
నియమాను సరముగ, దీపాలూ వేల్గిస్తూ, దీప బోధ చేస్తా
కనుపాప పరముగ, కాపాడే చూపిస్తూ, జ్ఞాన బోధ చేస్తా
మదిలోన మమతగ, ప్రేమమ్మే కల్పిస్తూ, ముక్తి బోధ చేస్తా
పురవాస తరుణము, నష్టమ్మే కాకుండా, శక్తి బోధ చేస్తా
నయనాల సొగసులు కష్టమ్మే పోళ్చటం, యుక్తి బోధ చేస్తా
తరుణాన వయసుకు భోగమ్మే మార్చటం, భక్తి బోధ చేస్తా
అనురాగ తలుపుకు భోజ్యమ్మే కారుణ్యం, రక్తి బోధ చేస్తా
అపురూప మహిమల భాగ్యమ్మే మాధుర్యం, వెంకటేశా జపిస్తా
--((**))--
ఆరాధ్య భక్తి లీల
రచయత: అల్లాప్రగడ రామకృష్ణ
సంద్రంలో నది కలియుట సహజమన్నావు
నది కాన రాకుండా ఏ మాయ చేసావో వేంకటేశా
బ్రహ్మంలో సరి గమనము సహజమన్నావు
సరి తెల్ప కుండా ఏ మాయ చేసావో వేంకటేశా
వాదంలో విధి వివరణ సహజమన్నావు
విధి తేల్చకుండా ఏ తీరు చేసావో వేంకటేశా
వేదంలో కలి వితరణ సహజమన్నావు
కలి ముప్పు కూడ ఏ తీరు చేసావో వేంకటేశా
ధర్మంలో దయ కరుణలు సహజమన్నావు
దయ దాచ కుండా ఏ చోటు చూసావో వేంకటేశా
న్యాయంలో బతుకు జడలు సహజమన్నావు
జాడ కాన కుండా ఏ చోటు చూసావో వేంకటేశా
సత్యంలో పలుకు బెదురు సహజమన్నావు
భయ జాడ కూడా ఏ మత్తు చేసావో వేంకటేశా
స్నేహంలో తలచు కలిమి సహజమన్నావు
మతి తేడ కుడా ఏ మత్తు చేసావో వేంకటేశా
ధైర్యంలో జగతి వెలుగు సహజమన్నావు
దడ ఓర్పు కూడా ఏ మార్పు చేసావో వేంకటేశా
ధ్యానంలో మనసు కధలు సహజమన్నావు
కళ తీర్పు కూడా ఏ మార్పు చేసావో వేంకటేశా
గమ్యంలో ఒడుదుడుకులు సహజమన్నావు
దిశ నేర్పు కూడా ఏ ఓర్పు చేసావో వేంకటేశా
దానంలో పతి సతి కధ సహజమన్నావు
తిది ఆశ కూడా ఏ ఓర్పు చేసావో వేంకటేశా
--((**))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి