*ఆరాధ్య భక్తి లీల *
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ
కణకణము వెలుగు నీ చలవే - హృదయం లో దివ్యమైన జ్యోతిగా
మదితలపు పిలుపు నీ చలవే- ఉదయం లో అందమైన జ్యోతిగా
అడుగడుగు మలుపు నీ చలవే - సమయం లో నిత్యమైన జ్యోతిగా
లతకులుకు తెలుపు నీ చలవే - తరుణం లో భవ్యమైన జ్యోతి గా
సరిగమలు పలుకు నీ చలవే - ఫలితం లో రమ్యమైన జ్యోతిగా
తడిపొడిల తపన నీ చలవే - నిలయం లో సాక్ష్యమైన జ్యోతిగా
కలిసికొన మెరుపు నీ చలవే - నయణం లో నాణ్యమైన జ్యోతిగా
చిరునగవు కొలువు నీ చలవే - పయనం లో శ్రావ్యమైన జ్యోతిగా
అఖండ హారతి జ్యోతి గా
ఆరోగ్య ఉదర జ్యోతిగా
అనంత పరమాత్మ జ్యోతిగా
శ్రీవేంకటేశ్వరుని జ్యోతి
ఇది వేణు గోపాల ప్రేమ సుమ
--((**))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి