28, నవంబర్ 2018, బుధవారం

ఆరాధ్య భక్తి లీల-*



ఆరాధ్య భక్తి లీల
రచయత:  మల్లాప్రగడ రామకృష్ణ

భావము :లాభనష్టాలు, చావుపుట్టుకలు ఈశ్వరుని మాయలే. మరి మన కర్తవ్యం మాయలసృష్టి కర్త పరమేశ్వరుని ధ్యానించటం.

లాభ నష్టాలకు, చావు పుట్టుకలకు, జింతించినట్లు  
ఇందుకు మూలం, ఈశ్వరునియొక్క మాయ కళలైనట్లే         

కొబ్బరి కాయలో, నీరుపోయక నీరు వచ్చి నట్లు   
శుభం అనేది, ఎవ్వరు తలవ కుండా వచ్చినట్లే 
గజం తిన్న వెలగపండులో, గుజ్జు మాయ మైనట్లు 
మన నుంచి పోవలసినది, విడిచి పోయి నట్లే 

శ్వేత అద్దంలో నీడ స్పష్టముగా కన బడినట్లు 
జీవులు ప్రేమ సందడిలో పుట్టుకలు వచ్చినట్లే  
చెట్టుకు పండిన పండు తెగి నేలపై పడినట్లు 
కాలము వెంబడించిన జీవులు మరణించినట్లే 

రాతిపై కడవను పెట్టగా, కుదుట పడినట్లు 
జీవి ఏకాగ్రతతో, మనసు కుదుట పడినట్లే 
ఉదయ భానుని వెలుగుకే, మంచుకరిగి నట్లు 
పరమేశ్వరుని  ప్రార్ధించితే, పాపాలు పోయినట్లే 

లాభ నష్టాలకు, చావు పుట్టుకలకు, జింతించినట్లు  
ఇందుకు మూలం ఈశ్వరుని యొక్క మాయ కళలైనట్లే         

--((**))--



ఆరాధ్య ఓటు లీల
రచయత:  మల్లాప్రగడ రామకృష్ణ
  
మనసును నమ్మి నడవండి 
మమత బట్టి ప్రవర్తించండి
వయసు బట్టి ఓటు వేయండి   
ఓటు గుర్తించేవాని కేయండి   

మనలో ఏది ఉంటే దాన్నే ప్రపంచంలో చూస్తాం 
దృష్టి సమంగా ఉంటే అంతా పవిత్రంగా చూస్తాం
సంకల్పం తో మనస్సనే భూతద్దంలో చూస్తాం 
మనస్సుపై పొర తొలిగితే నిజాలు చూస్తాం ..... మ    

అజ్ఞాన బింబం జ్ఞాన బింబముగా మార్చి చూస్తాం  
జ్ఞాన బింబాన్ని ఆశ వలయంగా మార్చి చూస్తాం
సంస్కారం బట్టి సాంద్రతను గమనించి చూస్తాం 
సంప్రదాయ గుణాన్ని మనో దర్పణంలో చూస్తాం.... మ 

చెట్టు నీడ గాలి అందించి చితి దాకా చూస్తాం 
ప్రతిఫలము ఆశించక మనసుతో  చూస్తాం  
హితాన్నికోరే మంచి స్నేహాన్ని వెంటాడి చూస్తాం 
బతుకుకు  సహకరించే ఓటు వేసి చూస్తాం ..... మ   

మనసును నమ్మి నడవండి 
మమత బట్టి ప్రవర్తించండి
వయసు బట్టి ఓటు వేయండి   
ఓటు గుర్తించేవాని కేయండి   

--((**))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి