14, నవంబర్ 2018, బుధవారం

ఆరాధ్య టి లీల





ఆరాధ్య భక్తి లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

నా కష్టార్జితం అని విర్ర వీగుతున్నాను 
నిన్ను మరచి వెర్రివాడి వలె ఉన్నాను  
నీ దయ లేనిదే నేను కదలనూ లేను 
వేంకటేశా అని ప్రార్ధించడం చేయలేను  

అంతరాత్మలో ఉన్నవాని తెల్సుకోలేను  
చమత్కారముతో అహంకరిస్తూ ఉంటాను
లోకాలన్నీ ఏలే దైవాన్ని తెల్సుకోలేను   
నేనే పాలించే దొరణని ముర్సి పోతాను  

అందరికి నీవే తల్లి తండ్రివై ఉన్నను 
నాబిడ్డలకు తల్లి తండ్రి నేనే నంటాను  
సంపదలిచ్చి బ్రతుకు నేర్పిస్తున్నను 
సంపాదనంతా నాదే నని అనుకుంటాను  

భోగభాగ్యా లందించి కదలక ఉన్నను   
నేనుచేసిన తపస్సని అనుకుంటాను 
వేంకటేశా మహిమలు తెలియ కున్నాను   
కరుణించి కాపాడుతావని ఆశిస్తున్నాను  
--((**))--


ఆరాధ్య టి లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

ఏమిటి టి టి టి అంటా వేమిటి 
కటిక చీకటి లో తెరువవా కిటికీ   

గాణుకేద్దులా తిరుగుతా వేమిటి
వెన్నెల సౌరభాన్ని చూడ వేమిటి 
మల్లెల పరిమళాల్ని ఆస్వాదించవేమిటి 
కలలు నిజమని మోసపోతా వేమిటి....  ఏ 

సమయం వ్యర్థం చేస్తావేమిటి 
సమర్ధత చూపక తప్పుకుంటా వేమిటి 
తల్లితండ్రుల మాట గమనించ వేమిటి     
పెద్దలు గురువులు మాట వినవేమిటి ..... ఏ 

నటి నటన మేటి అది నీ మనసుకు భేటీ 
అది నిన్ను చేస్తుంది లూటీ,   
విధిలో పెరుగుతుంది నీకు పోటీ 
మాటిమాటికి గెలవలేక చేస్తావు చీటీ ..... ఏ 

మహిళా సొగసుకు లోగుతావేమిటి 
అది క్షణిక ఆకర్షణని తెలుసుకో వేమిటి 
వయసు ఉడుకును చల్లపరుచుకో వేమిటి
నిజాలు తెలుసుకోలేక చీకట్లో బతుకుతావేమిటి .... ఏ 
       
ఏమిటి టి టి టి అంటా వేమిటి 
కటిక చీకటి లో తెరువవా కిటికీ   
--((**))--


ఆరాధ్య భక్తి లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

దేవా నీవు కల్పించిన ధర్మాలివి   
కార్మా కర్త క్రియా చెయు ధర్మాలివి     

శాంతి కలవానికి పాపము రాదు   
విరక్తి కలవానికి భయం లేదు
గురుసేవ చేసేప్పుడు కోపం రాదు 
సత్య బోధకులకు దోషం ఉండదు.. దే   

పుట్టు బ్రహ్మచారికి బుద్ధి చెడదు 
ఆశ లేని వానికి అలుపు రాదు  
జ్ఞాన మున్నవానికి దుఃఖము లేదు 
మౌనం పాటిస్తె ఏది కలహం కాదు  ... దే 

సమదృష్టికి చలించటం ఉండదు
నిర్మల మనస్సుకు లోపం తెల్వదు   
వేంకటేశా అనిన మాయ ఉండదు 
జీవితంలో సుఖమే భారం తెల్వదు ... దే 

దేవా నీవు కల్పించిన ధర్మాలివి   
కార్మా కర్త క్రియాచెయు ధర్మాలివి ....(2 )     

--((**))-- (ఇది అనంతపురం నుండి పోస్టు చేసినది) 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి