*ఆరాధ్య భక్తి లీ ల*
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
(01)
నాకు నీవు నీకు నేను, ఒకరికొకరం, కలసిపోయే బంధమాయె
ఏమి సోధ్యమో, ఏమి ఫలమో ఎఱుకలేను శ్రీ శ్రీ శ్రీ వేంకటేశా
దండము పెట్టుట నావంతు - తప్పుల రక్షణ నీవంతు
ధర్మము పల్కుట నావంతు - అర్ధము చెప్పుట నీవంతు
కప్పము కట్టుట నావంతు - శక్తిని ఇచ్చుట నీవంతు
దైవము కొల్చుట నావంతు - అల్పుని దీవెన నీవంతు ---నా
అండగ ఉండుట నావంతు - బంధన ముక్తియు నీవంతు
దాసుగ పండుట నావంతు - కర్తను గాచుట నీవంతు
స్మరణ జొచ్చుట నావంతు - కర్మను తీర్చుట నీవంతు
పూలతొ పూజించు నావంతు - సంపద పంచుట నీవంతు --- నా
మోక్కులు తీర్చుట నావంతు - శాంతిని ఇచ్చుట నీవంతు
కోరిక చెప్పుట నావంతు - మాటను నిల్పుట నీవంతు
దేశము రక్షణ నావంతు - ధైర్యము ఇచ్చుట నీవంతు
ప్రేమను పంచుట నావంతు - సోఖ్యము ఇచ్చుట నీవంతు -- నా
పరమపురుష శ్రీపతివి పరిపూర్ణ లక్ష్మీ పతివి భక్తులకు పరమాత్మవి
ఈర్ష్యలేని శ్రీ వెంకటేశ్వరుడివి మమ్ము ఆదుకొనే లోకపాలకుడివి
నాకు నీవు నీకు--- నేను, ఒకరికొకరం, కలసిపోయే బంధమాయె
ఏమి సోధ్యమో, ఏమి ఫలమో ఎఱుకలేను శ్రీ శ్రీ శ్రీ వేంకటేశా
నమో నమో తిరుమల తిరుపతి శ్రీనివాస, గోవిందా గోవిందా గోవిందా
--((**))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి