24, నవంబర్ 2018, శనివారం

ఆరాధ్య భక్తి లీల



శ్రీ కృష్ణాష్టమి సందర్భముగా అందరికి శుభాకాంక్షలు 

రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  
భావము : భగవంతుడు కావలనుకుంటే శరణు కోరడమే ముఖ్యోపాయము  

నిన్నూ, చేరుకునే, సత్య ఉపాయము ఏదయ్యా 
ఆది, నంత్యము లేని, అచ్యుత మూర్తి నీవయ్యా 

నీ గుణాల్ని పొగడి నిన్నూ చేరాలనుందయ్యా  
నీవు గుణాలను దాటిన గుణ రహితుడ వయ్యా  
నిన్నూ నా మనసులో నిల్పుకోవాలినుందయ్యా 
నీవు అంతులేని మహిమగల విశ్వవ్యాప్తుడయ్యా 

చేతులారా పూజిస్తూ, ప్రార్ధించాలని ఉందయ్యా 
నీవేమో, అనంత శరీరం తో, వి స్వవ్యాప్తుడవయ్యా   
నీ కోరిక ఏదన్నా ఉంటే, తీర్చాలనీ ఉందయ్యా 
నీ వేమో, సమస్త కోరికలు తీరిన వాడవయ్యా 

నిన్నూ కనులారా చూసి, తరిద్దామని ఉందయ్యా 
నీ వేమో చూపుకే దొర్కని, ఆగోచర మూర్తివయ్యా 
ఉపాయంతో నిన్నూ చేరలేనని, అర్ధం ఆయిందయ్యా 
శ్రీనివాసుని శరణు కోరటమే, నాకు దిక్కయ్యా 

నిన్నూ, చేరుకునే, సత్య ఉపాయము ఏదయ్యా 
ఆది, నంత్యము లేని, అచ్యుత మూర్తి నీవయ్యా 
అందుకే అన్యధా శరణం నాస్తి. తమ్వేవ శరణం గోవిందా.
--))**((--

సీతా రామాంజనేయులపై ప్రేమ
 
రామ సీతారామ రావయ్యా 
రామ జానకీరామ రావయ్యా 
రామ అయోధ్య రామ రావయ్యా 
రామ పట్టాభి రామ రావయ్యా 

నిన్ను, చేరుకునే, దారికి   
సత్య ఉపాయము ఏదయ్యా 
నిత్య సత్యపు దారికి  
అచ్యుత మూర్తి నీవయ్యా 

గుణాల్ని పొగిడా నీదరికి  
నిన్నూ చేరాల నుందయ్యా  
గుణాల రావులే  నీదరికి  
గుణ రహితుడ వయ్యా 
 
నిన్నూ నా మనసులో 
నిల్పుకోవాలినుందయ్యా 
అంతు చూడుటలో   
మహిమగల విశ్వవ్యాప్తుడయ్యా 

చేతులారా పూజిస్తూ, 
ప్రార్ధించాలని ఉందయ్యా 
నీ కోరిక ఏదన్నా తీరుస్తూ  
బతకాలని ఉందయ్యా 

నిన్నూ కనులారా చూసి, 
తరిద్దామని ఉందయ్యా 
నీ వేమో చూపుకే దొర్కని, 
ఆగోచర మూర్తివయ్యా 

ఉపాయంతో నిన్నూ చేరలేనని, 
అర్ధం ఆయిందయ్యా 
శ్రీ సీతారామ శరణు కోరటమే, 
నాకు దిక్కై౦దయ్యా 

రామ సీతారామ రావయ్యా 
రామ జానకీరామ రావయ్యా 
రామ అయోధ్య రామ రావయ్యా 
రామ పట్టాభి రామ రావయ్యా 

విధేయుడు  మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
--))**((--



ఆరాధ్య భక్తి లీల 
రచయత"మల్లాప్రగడ రామకృష్ణ "
భావము : మోక్ష ప్రాప్తికి జీవుడు చాలా కష్టపడాలి. గట్టి ప్రయత్నం చేయాలి

ఊరకే దొరకునా, ఉన్నతోన్నత సుఖమూ
ఆశలొదలి శ్రమిస్తే, మోక్షమే సులభమూ 

చింతల వలయం నుండే, బయటకు రమ్మూ   
శాంతి ఉన్నప్పుడే తృప్తితో,  కల్గును మోక్షమ్మూ    
కలుషిత కర్మల నుండీ,  బయటకు రమ్మూ  
మన జన్మ జన్మల పుణ్య మార్గమ్మే మోక్షమ్మూ  

మాలిన్యం తొలిచీ, నిర్మల మనస్సుతో రమ్మూ 
శ్రీనివాసుని హృదయంతో, స్మరిస్తే మోక్షమ్మూ   
చదివిన చదువులో ఉన్న, శాంతితో రమ్మూ  
శ్రీ వేంకటేశ్వరుని దాస్యము ఉంటె, మోక్షమ్మూ 

చిమ్మ చీకటిని తరిమే, వెలుగులా రమ్మూ  
నిత్యమూ ధైర్యంతో, దైవాన్ని పూజిస్తే మోక్షమ్మూ  
సంసార సాగరము, ఒడ్డు చేర్చుటకు రమ్మూ  
కష్టాన్ని తొలగించి, శాంతి కల్పిస్తే మోక్షమ్మూ  

ఊరకే దొరకునా, ఉన్నతోన్నత సుఖమూ
ఆశలొదలి శ్రమిస్తే, మోక్షము సులభమూ 

--((**))--



సీతారాములపై ప్రేమ (9 )

రామ నీవే సర్వాత్మకుడవు
రామ నీవే లోకరక్షకుడవు 
రామ మమ్మేలు నాయకుడవు 
రామ క్షమించే గుణపరుడవు 

చూడక మానవు చూచేటి కన్నులు
నవ్వక మానవు చూచేటి పెదాలు 
నావెంట చుట్టెను నీ నీడలు రామ 
నీ చూపులే మాపై ఉంచు సీతా రామ 

ఏమీ కోరను  యితరములు
నీడల నింతా నీ రూపములు 
నిద్రలో నిన్నే కలవరింతలు      
ఏమని చేప్పాలి సీతా రామ 
              
మారక మానదు పాపపు మనుషులు 
ప్రేమ రసములతో చిక్కిన బంధాలు 
నీరజాక్షయిది నీమయమేయని ఆశలు 
ఏ రీ తున నిను కొలిచెదము సీతా రామ                      

కలుగక మానవు కాయపు సుఖములు
ఎరుగలేని మానవుని నిత్యా బతుకులు 
అలరిన వారికి అనంతసౌఖ్యమిచ్చు రామ  
ఆదమరవక నిన్నే కోరుతున్నా సీతా రామ 

రామ నీవే సర్వాత్మకుడవు
రామ నీవే లోకరక్షకుడవు 
రామ మమ్మేలు నాయకుడవు 
రామ క్షమించే గుణపరుడవు 
--(())--

ఆరాధ్య భక్తి లీల
ఓం శ్రీరామ - శ్రీ మాత్రేనమ:
 రచయత"మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ "

భావము :ఈ కీర్తనలో జ్ఞానులకు అజ్ఞానులకు కల భేదం 


జ్ఞానులకు, అజ్ఞానులకు మధ్య భేదం 

 సందర్భాన్ని బట్టి, తెలిపే ఓ మనసా 

మితిమీరిన పనులు వచ్చినా చలించక 

పర్వతమ్ వలే స్థిరం ఉండేవాడు యోగీంద్రుడు
కోపం తెచ్చే పరిస్థితి వచ్చిన చలించక              
ప్రశాంత హృదయముతో పల్కేవాడే ధీరుడు .... జ్ఞా ..  

సూదులువంటి మాటల్ని విన్ననూ చలించక

వాదులతో వాదము పెట్టని వాడే దేవుడు  
సంసారంలో వచ్చేటి చిక్కులకు చలించక 
నిగ్రహంగా సమర్ధించిన వాడే పుణ్యాత్ముడు .... జ్ఞా .. 

గాలం వంటి కొందరి ఆశలకు చలించక  

ఓర్పు వహించి నిలబడ్డ వాడే గొప్పవాడు  
ఏ పరిస్థితిలో ధైర్యం కోల్పోయి చలించక 
నిగ్రహం తో శ్రీనివాసుని కొలిచే నిత్యుడు  .... జ్ఞా ..

జ్ఞానులకు, అజ్ఞానులకు మధ్య భేదం 

 సందర్భాన్ని బట్టి, తెలిపే ఓ మనసా 


--((**))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి