7, డిసెంబర్ 2018, శుక్రవారం

ఆరాధ్య రక్తి లీల ****


ఆరాధ్య రక్తి లీల (ఛందస్సు ) 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
(1) UIU UIU - IIUI UUIU.

భావ రాగం రమా  - సుమభావ సౌందర్యతా 
మాట సోద్యమ్ రమా - సమభావ సంస్కారితా 
వేద విద్వాన్ రమా - నవపారిజాతామృతా  
ప్రేమ తత్వ రమా - సారాలా సౌభాగ్యతా   

జాలమేలా ప్రియా - చలిలోన వేసారితిన్ 
చాలు చాలా కథల్ - సరసాలఁ జాలించరా 
పూల నెత్తావులన్ - బులకించ వేళయ్యెరా 
పాలు చల్లారురా - ఫల మారగించంగ రా 

కాలమే నీదిరా - సుమమాల నీ దేనురా 
కోపమే వద్దురా - మధుపాత్ర పొందాలిరా
తాపమూ తీర్చరా  - మురిపాల ముత్తావురా  
లాస్యమూ చేయకూ  - సరసాలు చూపాలిరా  

ప్రాణమే నీదిరా - ప్రణయం లొ నీ దేనురా 
భోగమే నీదిరా - బ్రమలం త భోజ్యమ్మురా 
రాజ్యమే నీదిరా - రమనీ తొ  రంగేళిరా           
ధ్యేయమే నీదిరా - దయచూపి దంచేయరా  

--((**))--


ఆరాధ్య రక్తి లీల - 3
ప్రాంజలిప్రభ 
మల్లాప్రగడ రామకృష్ణ 

చక్కనమ్మ విన్యాసమునకు 
చక్కెరబొమ్మ చక్కదనమునకు 
చంద్రముఖి ముఖమార్పులకు 
చంచలాక్షి కళ్ళు తిప్పులకు 
లొంగని వారెవ్వరు లేరులే 

చక్కెర కనురెప్పలకు
చంద్రవదన వలపుకు 
చంచరీకచికుర ఊపుకు 
ముద్దు ముచ్చట్లకు 
లొంగని వారెవ్వరు లేరులే

చాన మహా మాయలకు 
చామ మహా శక్తి పిలుపుకు 
చారులోన చలిమ్పునకు 
చిగురుటాకుబోడి కులుకుకు 
లొంగని వారెవ్వరు లేరులే

చెలి చెలించె చాతుర్యానికి 
చెలియ చేయూత చేష్టలకు
చిగురబోడి శృంగార వలపుకు 
చెలువ అధరామృతమునకు
లొంగని వారెవ్వరు లేరులే
      
కొమ్మ మక్కువ చూపుకు
కోమ అలక పాన్పుకు 
కొమరాలు కోపమునకు  
కొమిరె ఊయల ఊపుకు
లొంగని వారెవ్వరు లేరులే 

కోమలాంగి అవయవసౌష్టముకు
కొమలి చీర కుచ్చిల్లు సవరిమ్పుకు 
క్రాలుగంటి పాదాల మోపుకు 
కొమ నడుమవాల్చిన కైపుకు 
లొంగని వారెవ్వరు లేరులే 

గజయాన గమత్తులకు
గరిత గలగల మాటలకు    
గర్త సువార్త భాష్యాలకు           
గుబ్బలాడి గుబాళింపుకు 
లొంగని వారెవ్వరు లేరులే

గుబ్బెత గుమ్మడికాయలకు  
గుమ్మ మత్తు గమ్మత్తులకు
గోతి గోచీను చూసి ఉడికింపుకు 
గోల గోల చేసి గందరగోళంకు 
లొంగని వారెవ్వరు లేరులే

--((**))--

ఆరాధ్య రక్తి లీల - 2  
ప్రాంజలిప్రభ 
మల్లాప్రగడ రామకృష్ణ 

ఎలతీగబోడి మర్మ రహస్యాలకు  
ఎలనాగు మెలికల చూపుకు   
కనకాంగి కొరకొర చూపుకు 
కన్నుల కలికి కవ్వింపుకు  
లొంగని వారెవ్వరు లేరులే

కంజముఖి మోహమునకు 
కంబుకంఠ దాహమునకు 
కంబుగ్రీవ తాపమునకు  
కర్పూరగంది పరిమళకు  
లొంగని వారెవ్వరు లేరులే

కలకంఠి కంటినీరుకు 
కమలాక్షి కోర చూపుకు 
కలికి కవ్వింపు కైపుకు  
కరబోరువు ఉద్వేగముకు 
లొంగని వారెవ్వరు లేరులే

కలువకంటి కనికరమునకు
కళింగ యుద్ధవిన్యాసాలకు 
కలశస్తిని కాపు చూపులకు   
కంట చిద్విలాసమునకు 
లొంగని వారెవ్వరు లేరులే 

కించిద్ద్విలగ్న అయిస్కాంతముకు 
కిన్నెరకంఠి కుచద్వయమునకు 
కురంగానయన కుమ్ములాటకు
కురంగాక్షి బిత్తర చూపులకు 
లొంగని వారెవ్వరు లేరులే

కూచి దోబూచిలాటలకు
కేశిని కేశాల పాన్పుకు
కువలయాక్షి తిప్పుడు చూపుకు
కృపమధ్యమ సహాయముకు  
లొంగని వారెవ్వరు లేరులే
       


-((**))--


ఆరాధ్య రక్తి లీల-1
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

అంగన సౌష్టాకర్షణకు    
అంబుజాలోచన తెల్వికి
అంబుజాక్షి సామర్ధ్యముకు   
అంబురుహాక్షి మెరుపుకు 
లొంగని వారెవ్వరు లేరులే 

అన్ను తలపు పిలుపుకు
అతివ వోర చూపులకు 
అబల చేయూత కొరకు  
అలివేణి పర్గు తళుకు     
లొంగని వారెవ్వరు లేరులే

అక్క తెలివి తేటలకు 
అవ్వ మనస్సు కధలకు  
అబ్జనయన పిలుపుకు 
అలరుబోడి సలహాకు 
లొంగని వారెవ్వరు లేరులే

ఇందుముఖి ఈప్సిత చూపులకు  
ఇంతి వయ్యారపు వలపులకు 
ఇభయాన దీపావళి తల్కుకు     
ఇదీవరాక్షి ఆనంద కుక్కుకు   
లొంగని వారెవ్వరు లేరులే    

ఇందువదన సఖ్యతకు 
ఇగురాకుబోణి పిల్పుకు
ఇందునిబాష్య పాదాలకు      
ఇగురాకుబోడి మాలకు 
లొంగని వారెవ్వరు లేరులే

ఉజ్వలాంగి భగభగలకు  
ఉగ్మిలి ఉన్నతోత్తమునకు 
ఉవిధ ఊరించి మనసుకు  
ఊసిరి వెల్లిలా మార్పుకు   
లొంగని వారెవ్వరు లేరులే

--((**))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి