18, డిసెంబర్ 2018, మంగళవారం



శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దివ్యక్షేత్రము.... కాళేశ్వరం 
కాళేశ్వరం, కరీంనగర్ జిల్లా, మహాదేవపూర్ మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామంలో సుప్రసిద్ధమైన శివాలయం ఉంది. త్రిలింగమనే మూడు సుప్రసిద్ధమైన శైవక్షేత్రాల్లో కాళేశ్వరం కూడా ఒకటి. త్రిలింగాల నడుమన ఉండే ప్రాంతం కనుకే త్రిలింగమనే పదం నుంచి తెలుగు అనే పదం పుట్టిందని కొందరు పండితుల భావన. కాళేశ్యర క్షేత్రము శివుడి ఆలయానికి ప్రసిద్ధి. ఇక్కడ సరస్వతి దేవి ఆలయం కూడ ఉన్నది. ఇక్కడి శివాళయం ప్రత్యేకత నాలుగు ద్యారల మద్య నాలుగు ముకాల శివలింగం ఉంటుంది. ఈ ఆలయంలో యమకోణం ఉన్నది, భక్తులు ఆ యమకోణం నుండి వెల్లినట్లయితే తమకున్నటువంటి యమగండాలు తొలగి పొతాయని నమ్ముతారు. ఈ ఆలయం గోదావరి నదీ ఒడ్డున ఉండటం వలన పుణ్యస్నానానికి ప్రజలు ఎక్కువ సంక్యలో వచ్చి స్నానాలు చేసి దైవ దర్శనం చేసుకొని వెలతారు. 
ఇక్కడికి వెళ్లుటకు ఆర్.టి.సి. బస్సు సౌకర్యము మంథని నుండి కలదు. రైలు సదుపాయం పెద్దపల్లి లేదా రామగుండం లొ దిగి మల్లి బస్సు ద్వారా వెల్లాలి. 
ప్రస్తుతం ఈ నది మీద వంతెన నిర్మాణం జరుగుతున్నది. ఈ వంతెన పూర్తి అయినట్లయితే మహారాష్ర్ట కి రోడ్డు మార్గం చాలా దగ్గరవుతుంది. అలాగే రామగుండం, మంచిర్యాల నుండి విశాఖపట్టణం వెళ్లుటకు రోడ్డు మార్గం దాదాపు 400 కి.మీ. తగ్గుతుంది. 
కాళేశ్వర మహాక్షేత్రం లో గోదావరి, ప్రాణహిత నదులు అంతర్వాహిని గా సరస్వతీ నది ప్రవహిస్తున్న త్రివేణీ సంగమ ప్రదేశం లో స్వయంభువుగా వెలసిన స్వామి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి. కాశీలో మరణిస్తే కైలాసప్రాప్రి కలుగుతుందని చెపుతారు. కాని ఈ క్షేత్రంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరుని దర్శిస్తేనే కైలాస ప్రాప్తి కలుగుతుందని స్థలపురాణం చెపుతోంది. 
ఇది అత్యంత పురాతన మైన పుణ్య స్థలం గా ప్రసిధ్ధి కెక్కింది. దేశంలో ఎక్కడా లేని విథంగా ఈ ఆలయం లో ఒకే పానమట్టం పై రెండు శివలింగాలను మనం దర్శించవచ్చు. ఆంధ్రదేశానికి త్రిలింగ దేశమని పేరు రావడానికి కారణ మైన మూడు లింగాలలో ఇది ఒకటి. మిగినవి రెండు ద్రాక్షారామ భీమేశ్వరుడు, శ్ర్రీశైల మల్లిఖార్జుడు. ఈ మూడులింగాల మథ్య నున్న ప్రదేశాన్ని త్రిలింగదేశమని, ఇందు నివసించే వారిని తెలుంగులు అని వ్యవహరించబడతున్నారని కాకతి ప్రతాపరుద్రుని ఆస్థాన విద్వాంసుడగు విద్యానాథుని శాసనాన్నిఉటంకిస్తూ, పండితులు వ్రాశారు. 
" యద్దేశస్త్రిభిరేష యాతి మహతాం ఖ్యాతిం త్రిలింగాఖ్యయా! 
శ్రీశైల కాళేశ్వర ద్రాక్షారామ నివాసిన: ప్రతిదినం త్వచ్ఛ్రేయసే జాగ్రతు !! " 
* స్థలపురాణం 
ఒక పర్యాయము యమధర్మరాజు తన లోకమునకు పాపులెవ్వరు రాకపోవుట, యమభటులందరు పనిలేక కూర్చుండుటను చూచి కోపించి, కారణమేమని ప్రశ్నించాడు. “ ఓ యమధర్మరాజా ! భూలోకమందు జనులందరు కాళేశ్వరమునకు వెళ్లి, త్రివేణీ సంగమం లో స్నానమాచరించి, ముక్తీశ్వరుని దర్శించి ముక్తులగుచున్నారు. అందుచే పాపాత్ములే లేని కారణం చేత మాకు పని లేకుండా పోయినదని విన్నవించారు” యమభటులు. అదే సమయంలో అక్కడకొచ్చిన నారదునితో ఈ విషయాన్ని ప్రస్తావించాడు యమధర్మరాజు. ఆ మాటలు విన్న నారదమహర్షి” ఆ ముక్తీశ్వరుడే నీకు మార్గం చూపగలడు” అని చెప్పి వెళ్లి పోయాడు. 
తన ఆధిపత్యానికి భంగమేర్పడుతోందని భయపడిన యముడు, బ్రహ్మ లోకానికి వెళ్లి,విషయాన్నివివరించి, ఆయనతో కలసి కైలాసానికి వెళ్లి శంకరుని తో తన గోడు వెళ్ల బోసుకున్నాడు. మందస్మిత వదనుడైన మహాదేవుడు” ఓ యమధర్మరాజా. నీవు దేవతలతో కూడి వెళ్లి, కాళేశ్వరములోని నే నున్న పానమట్టము నందే నీ స్వహస్తాలతో కాళేశ్వర లింగాన్ని ప్రతిష్ఠ చెయ్యి. నీ చే ప్రతిష్ఠించబడిన కాళేశ్వర లింగము సర్వజనులను మోహపరవశులను చేయును. అంతే కాకుండా – 
" కాళేశ్వరం తిరస్కృత్య మమపూజాం కరోతి య: ! 
తే సర్వే నరకం యాంతి సందేహోనాస్తి నిశ్చయం !! " 
శివలింగాలన్నీ ఒకటే కదా యని మాయామోహగ్రస్తులైన ప్రజలు ముందుగా కాళేశ్వరుని పూజింపక, ముక్తీశ్వరుని పూజింతురో వారందరు నీ లోకమునకు వచ్చెదరని” వరమిచ్చెను. అందువలన ఈ క్షేత్రములో ఒకే పానమట్టము మీద రెండు లింగములు దర్శవమిచ్చు చున్నవి.ముందుగా కాళేశ్వరుని పూజించి, ఆ తరువాత ముక్తీశ్వరుని పూజించవలయును. లింగము పైభాగములో రెండు రంధ్రములతో నున్నలింగము ముక్తీశ్వరుడు గా మనము ఎఱుక కలిగి ఉండాలి. 
ఒకపర్యాయము యమధర్మరాజు కార్యార్ధియై స్వర్గలోకానికి వెళ్లాడు.ఇంద్రలోకములోని వైభవాలను చూచి, జనమంతా ఇక్కడి భోగాలను అనుభవిం చడానికే యమలోకానికి రావడానికి ఇష్టపడక స్వర్గం కోసం ఈశ్వరుని ప్రార్థిస్తున్నారు. నా యమలోకము, మరియు స్వర్గలోకమును మించిన మరొకలోకాన్ని నిర్మించాలనే సంకల్పం తో యమధర్మరాజు విశ్వకర్మ ను కలసి,” స్వామీ ! స్వర్గలోకాన్ని మించి సర్వసౌఖ్యములు కలిగిన ఒక సుందర నగరాన్ని నిర్మించమని” ప్రార్థించాడు. 
అంతట విశ్వకర్మయమధర్మరాజు కోరిక మేరకు కల్పవృక్షములతోడను, శోభాయమాన మైన మణిమయప్రాకారములు కలిగిన రత్నమయ సౌథములతోడను, గోదావరిప్రాణహిత సంగమ ప్రదేశమున దక్షిణముగా ఒక సుందర పట్టణమును నిర్మించి, ఇచ్చెను. కాలుని కొరకు నిర్మాణము చేయబడిన,ఈశ్వరుడు వెలసిన క్షేత్రము గనుక దీనికి కాళేశ్వరమను పేరు వచ్చినది. ఈ క్షేత్రమునకు నైరుతి యందు దిశ యందు యమగుండ మను తీర్థరాజమును కూడ విశ్వకర్మ నిర్మించి ఇచ్చెను. 
విశ్వకర్మ చే నిర్మించి ఇవ్వబడిన కాళేశ్వర క్షేత్రమును,యమగుండమును చూచి మిక్కిలి ఆనందించిన యమధర్మరాజు. ఈ గుండమునందు స్నానమాడిన వారికి మణికర్ణికా ఘట్టము నందు స్నానమాడిన ఫలము కలుగుటకు గాను శివుని గురించి తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శివుడు “ఈ గుండము రెండవ మణి కర్ణిక గా పిలువబడి, ఇందులో స్నానము చేసిన వారి పాపములు నశించి పుత్రపౌత్రులు కల్గి వర్థిల్లుదురని” వరమిచ్చెను. 
* క్షేత్ర ప్రాశస్త్యము 
కాళేశ్వరము నందు నివసించినను, స్మరించినను, దర్శించినను, జ్ఞానాజ్ఞాన జనితములు , మనోవాక్కాయజములైన సర్వపాపములు నశించి, దీర్ఘాయురారోగ్య ఐశ్వర్య పుత్రపౌత్రాభివృద్ధి కల్గి దేహాంతమున ముక్తీశ్వరస్వామి కృపవలన ముక్తి కలుగునని కాళేశ్వర యాత్రాఫలమున చెప్పబడినది. 
తస్య దర్శన మాత్రేణ భవేన్ముక్తిర్న సంశయ:! 
ముక్తీశ: పరమోదేవ: పార్వత్యా సహితో విభు : !! 
కాళేశ్వరేపి వసతాం ముక్తి దద్యాన్మహేశ్వర:! 
దర్శనమాత్రం చేతనే శుభానందాసహిత ముక్తీశ్వరుడు సర్వజీవులకు మోక్షమునిచ్చును. కాశీనగరము నందు మరణించిననే కాశీవిశ్వేశ్వరుడు ముక్తినిచ్చును కాని కాళేశ్వరమున నివసించు సర్వ ప్రాణులకు ముక్తి లభించును. కావున కాశీక్షేత్రము కన్న కాళేశ్వరము వరిముల్లు వాసి ఎక్కువని ప్రతీతి. 
* దివ్యదర్శనం 
ఈ కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రంలో ఒకే పానమట్టం మీద రెండు లింగాలు ఉండటమే కాక ముక్తీశ్వర స్వామి కి రెండు నాసికా రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రములలో అభిషేక జలము ఎన్ని పోసినను ఒక్కచుక్క కూడ బయటకు రాకుండా భూమార్గం గుండా ప్రవహించి, సరస్వతీ నది రూపం లో గోదావరి ప్రాణహిత నదుల సంగమంలో కలియుచున్నది. 
ఈ విషయమును నమ్మని భోంస్లే మహారాజు(నాగపూర్ ) ఈ వింతను పరీక్షించడానికి తన పరివారముతో పరిసరగ్రామాలనుండి వేలకొలది బిందెల పాలను తెప్పించి శ్రీ స్వామివారి నాసికా రంధ్రములలో పోయించెనట. ఆ విధంగా పోసిన పాలన్నియు కానరాకుండా పోయి నందుకు ఆశ్చర్య పోయిన మహారాజు గ్రామస్తులతో కలిసి గోదావరికి వెళ్లి చూడగా ఆ పాలు ప్రణీత, గోదావరి సంగమములో కలియుటను గమనించి, తప్పును అంగీకరించి,శ్రీ స్వామిని క్షమాపణ వేడుకున్నాడట. 
* ఉపాలయాలు 
ఇచ్చట శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారల ప్రధాన ఆలయముతో పాటు శుభానందాదేవి (పార్వతీ దేవి ), మహాసరస్వతి,కోదండరామాలయము, ఆది ముక్తీశ్వర స్వామి, సంగమేశ్వర, దత్తాత్రేయ , సూర్యదేవాలయాలు కలవు. 
త్రిలింగ క్షేత్రాల మధ్య ప్రదేశం కావడం వల్లనే తెలంగాణకు ఆ పేరు వచ్చింది. త్రిలింగ క్షేత్రాలు మూడు. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం. శ్రీశైలం, ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా, కాళేశ్వరం తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా మహదేవపూర్‌ మండలంలో ఉంది. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ రాషా్ట్రల సరిహద్దులో గోదావరి, ప్రాణహిత, సరస్వతీ (అంతర్వాహిని) మూడు నదుల కలయికతో కూడింది ఈ క్షేత్రం. ఎంతో ప్రాచీనమైన ఇక్కడి దేవాలయంలో ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉన్నాయి. అవి కాలుడు (యమధర్మరాజు), ఈశ్వరుడు (శివుడు). ప్రపంచంలో మరెక్కడా ఈ విధంగా ఒకే పానవట్టంపై రెండు లింగాలు కనిపించవు. అందుకే ఈ క్షేత్రము కాళేశ్వర క్షేత్రంగా పిలువబడుతోంది. 
* కాళేశ్వరంలోని చూడవలసిన ప్రదేశాలు.. 
* ప్రపంచంలో మరెక్కడా లేని ఒకే పానవట్టంపై శివుడు, కాలుడి విగ్రహాలు : 
* త్రివేణి సంగమం : గోదావరి, ప్రాణహిత, సరస్వతి (అంతర్వాహినిగా)ల సంగమ క్షేత్రం 
* యమకోణం : ఆలయ ఆవరణలోని యమ కోణంలో నుంచి దూరితే బాధలు తొలుగుతాయని భక్తుల విశ్వాసం. 
* అష్ట తీర్థాలు: కాళేశ్వరంలో అష్ట(8) తీర్థాలు ఉన్నా యి. బ్రహ్మతీర్థం, చిత్సుక తీర్థం, జ్ఞానతీర్థం, పక్షి(వాయుస) తీర్థం, సంగమ తీర్థం, నృసింహ తీర్థం, హనుమ తీర్థం, వ్యాస తీర్థం. 
* స్వామి వారి నాసికా రంధ్రాలు: ప్రధాన ఆల యంలోని ముక్తీశ్వరునికి రెండు నాసికా రంధ్రాలు న్నాయి. ఈ నాసికా రంధ్రాల్లో అభిషేకానికి ఎన్ని పాలు లేదా నీళ్లు పోసినా లోనికి పోతూనే ఉంటాయి. 
* హైదరాబాద్‌ టు కాళేశ్వరం 
* హైదరాబాద్‌ నుంచి కాళేశ్వరం సుమారు 260 కి.మీ దూరంలో ఉంది. 
* వరంగల్‌ నుంచి 120 కి.మీ దూరంలో ఉంది. 
* జిల్లా కేంద్రమైన కరీంనగర్‌ నుంచి 140 కి.మీ దూరంలో ఉంది. 
* బస్సు సౌకర్యం : 
వరంగల్‌ నుంచి పరకాల, భూపాలపల్లి, కాటారం మీదుగా కాళేశ్వరంనకు చేరుకోవచ్చు. 
హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌, పెద్దపల్లి, మంథని, మహదేపూర్‌ నుంచి కాళేశ్వరం వెళ్లొచ్చు. 
కాళేశ్వరంనకు హన్మకొండ నుంచి ఉదయం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు గంటకో బస్సు ఉంది. 
హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌ నుంచి రోజూ ఉద యం, రాత్రి 8.30 ని.లకు కాళేశ్వరంనకు బస్సు సౌకర్యం ఉంది. 
కరీంనగర్‌, గుంటూరు, మెట్‌పల్లి, సిరిసిల్ల వేము లవాడ, పెద్దపల్లి తదితర పట్టణాల నుంచి ప్రతీరోజు బస్సు సౌకర్యం ఉంది. 
రైలు మార్గం : 
కాళేశ్వర క్షేత్రానికి నేరుగా రైలు సౌకర్యం లేదు. 
కాజిపేట, వరంగల్‌ స్టేషన్‌ల వరకు రైలులో వచ్చి అక్కడి నుంచి బస్సులో 120కి.మీ ప్రయాణించి కాళేశ్వరం చేరుకోవచ్చు. 

హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ మీదుగా పెద్దపల్లి, రామగుండం స్టేషన్‌ల వరకు రైలులో అక్కడి నుంచి 100 కి.మీ బస్సులో ప్రయాణిస్తే కాళేశ్వరం వస్తుంది.
--((**))--

రాతి గుహలో పాతాళ గణపతి ..... 
భూకైలాసంగా విరాజిల్లుతున్న వాయులింగక్షేత్రం.. శ్రీకాళహస్తి. ఎంతో మహిమాన్విత చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రం.. తల్లిదండ్రులతో పాటు.. తానూ భక్తులకు వరాలిస్తున్నాడు గణేశుడు. ఇతర ప్రాంతాలతో పోల్చితే.. విభిన్నంగా ఇక్కడ భూగర్భంలో గణపతి కొలువు తీరడం విశేషం. అందుకే.. ఈయన పాతాళ గణపతిగా ఖ్యాతి గడించాడు.. భక్తుల కొంగు బంగారంగా వినుతికెక్కాడు. 
శైవక్షేత్రాల్లో ప్రత్యేకమైనవి పంచభూత లింగ క్షేత్రాలు. వీటిలో నాలుగు లింగాలు తమిళనాడులో ఉంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదో దివ్య లింగ క్షేత్రం శ్రీకాళహస్తి. ఇక్కడ పరమేశుడు వాయులింగేశ్వరునిగా, పార్వతీదేవి జ్ఞానప్రసూనాంబికగా పూజలందుకుంటున్నారు. రాహుకేతు పూజలకూ దేశంలోనే ఎంతో ప్రత్యేకమైన ఆలయంగా ఈ క్షేత్రం భక్తుల నీరాజనం అందుకొంటోంది. ఇక్కడ రాహుకేతు పూజలు చేసి వాయులింగేశ్వరుడిని దర్శించుకుంటే సర్వదోషాలు తొలిగిపోతాయన్నది భక్తుల విశ్వాసం. 
ఆదిదంపతులిద్దరూ కొలువు దీరిన ఈ ఆలయం సమీపంలోనే.. తానూ వెలిసి.. భక్తులను అనుగ్రహిస్తున్నాడు దేవగణాధిపతి వినాయకుడు. భూతలానికి 40 అడుగుల దిగువన ఓ రాతి గుహలో వినాయుకుడు ఉండడం ఇక్కడ విశేషం. పాతాళవినాయకుని దర్శనం తర్వాతనే..శ్రీకాళహస్త్తీశ్వరుడి అనుగ్రహం లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. నలభై అడుగుల లోతున దర్శనమిస్తుండడంతో.. పాతాళగణపతిగా ఆయన్ను పూజిస్తున్నారు భక్తులు. 
రాహుకేతుల పూజలకు నిలయమైన శ్రీకాళహస్తిలో అభిషేకాలు ఏవైనా..పాతాళవినాయకుడుదర్శనం చేసుకున్నవారికే ఫలప్రదం అవుతాయని ప్రతీతి. తరచు పనులు వాయిదా పడుతు ఉంటే. ఇక్కడ పాతాళం లో కోలువైఉన్న వినాయకుడ్ని దర్శించుకుని ఆతర్వాత మెదలుపెడితే ఆకార్యం సిద్దిస్తుందంటారు భక్తులు. ఇంతటి ప్రసిద్దిచెందిన పాతాళవినాయకుడు గురించి వందల ఏళ్లనాటి కావ్యాల్లోనూ ప్రస్తావన ఉంది. అష్టదిగ్గజాల్లో అగ్రగణ్యుడు ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహాత్యంలోను, శ్రీనాధుడు రచించిన హరవిలాసం, శివపురాణంలోను పాతాళవినాయకుడు గురించి వర్ణన ఉంది. 
పాతాళ వినాయకుడిని ఒక్కసారి దర్శించుకుంటే.. అన్ని విఘ్నాలు తొలిగిపోతాయని ప్రతీతి. దీంతో.. ఇటీవలి కాలంలో స్వామిని దర్శించుకోవడానికి వీఐపీలు, సినీతారలు, దర్శకులు బారులు తీరుతున్నారు. స్వామిదర్శనానికి కర్ణాటక,తమిళనాడు..ఆంద్రప్రదేశ్ నలుమూలలు నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. మహాశివరాత్రి, వినాయకచవితి రోజుల్లో ఇక్కడ భక్తుల కోలహాలం అంతా ఇంతా కాదు. రాతి గుహలో ఉన్న స్వామిని దర్శించుకోవాలంటే..వంపులు తిరిగి ఉండే 30 మెట్లను జాగ్రత్తగా దిగాల్సి ఉంటుంది. ఆలయప్రవేశద్వారం కూడా చాలా చిన్నగా ఉంటుంది. విగ్రహం దగ్గర పూజారులు కూడా ఎవరు ఉండరు. భక్తులే వెళ్లి స్వామివారికి కర్పూర హరతి అర్పించి రావడం ఆనవాయితీ. ఒక్కసారి పదిమంది భక్తులను మాత్రమే లోపలకి అనుమతిస్తారు. వారు తిరిగి వచ్చాకే.. మరో పదిమంది వెళ్లాల్సి ఉంటుంది. శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శనంతో పాటు.. పాతాళగణపతి అనుగ్రహాన్ని పొందితేనే.. కోరిన కోర్కెలు తీరతాయంటారు భక్తులు. 
శ్రీకాళహస్తిలో పాతాళ గణపతికి ఆసక్తికరమైన చరిత్ర ఉంది. సాక్షాత్తూ అగస్థ్య మహాముని కారణంగానే.. ఈ పాతాళ గణపతి కొలువు తీరారన్న కథనం ప్రాచుర్యంలో ఉంది. వాయులింగేశ్వరుడు వెలిసిన శ్రీకాళహస్తిలో ఒక్కప్పుడు నీటికోసం ఇబ్బంది ఉండేదట. ఎంతో పుణ్యక్షేత్రమైన ఈ ప్రాంతంలో ఓ జీవనదిని ప్రవహింపచేయాలని తలిచిన అగస్త్యుడు పరమశివుడికోసం తపస్సు చేసినట్లు స్థలపురాణం చెబుతుంది. అగస్త్యుని తపోబలానికి పరమశివుని అనుగ్రహం తోడై స్వర్ణముఖి నది ఆవిర్భవించింది. నది ఏర్పడింది కాని.. అందులో నీళ్లు మాత్రం రాలేదట. దీంతో.. తీవ్రంగా విచారించిన అగస్త్య మహాముని.. తప్పు ఎక్కడ జరిగిందా అని ఆలోచించారట. అయితే.. సకల శుభాలకు మూలాధారమైన ఆదిగణపతి ఆరాధన చేయకుండా తసస్సుకు పూనుకున్న విషయం ఆయనకు గుర్తుకు వచ్చింది. దీంతో.. పార్వతి పుత్రుడి అనుగ్రహం కోసం మళ్లీ తపస్సు చేశారట.. అసుర సంహారం చేసి పాతాళమార్గం ద్వారావస్తున్న వినాయకస్వామి అగస్త్యుమహాముని గమనించి అతనికి దర్శనమిస్తాడు. స్వర్ణముఖిలో జలధార కురిపిస్తాడు. అయితే.. తనకు దర్శనమిచ్చిన చోటే కొలువుతీరమని విఘ్నేశ్వరుడిని వేడుకొంటారు అగస్తుడు. ఆయన కోరిక మన్నించి.. అదే గుహలో పాతాళ గణపతిగా ఆయన అవతరించాడు. అంతటి మహిమాన్విత చరిత్ర ఉన్న పాతాళ గణపతిని దర్శించుకోవడం పునర్జన్మ సుకృతం అంటారు భక్తులు. 
అంతేకాదు.. స్వర్ణముఖినది తూర్పుగట్టుకు..స్వామి కొలువైన చోటు రెండు సమాంతరంగా ఉంటాయన్నది భక్తులు విశ్వాశం. గతంలో చాలా మంది రుషులు వ్రతం చేసి స్వామి అనుగ్రహం పొందినట్లు పురాణాల్లో ఉంది. ఒకప్పుడు స్వర్ణముఖినదిలో నీటిమట్టం ఎంతపెరిగితే..స్వామిదగ్గర అంతే ఎత్తులో నీళ్లు ఊరేవట..ఆ ఊటలోనే స్వామిని దర్శించుకునేవారట భక్తులు..కానీ ఇప్పుడు టైల్స్ వేసి గుహను ఆధునీకరించడంతో నీటిజాడలే కనుమరుగు అయ్యాయి. పాతాళ గణపతిగానే కాదు.. శ్రీకాళహస్తిలోనే స్వర్ణముఖీనదీ తీరాన జలవినాయకుడుగానూ భక్తులకు దర్శనమిస్తున్నాడు పార్వతీతనయుడు. శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చే భక్తులు ఇక్కడ ప్రత్యేకంగా స్వామిని దర్శించుకుని తమ మనసులోని కోర్కెలు చెప్పుకుంటారు. స్వర్ణముఖి నదికి వరద నీరు ఎక్కువగా వచ్చినపుడు ఇక్కడే వినాయకుడు పూర్తిగా జలంతో నిండిపోతారు.. ఆలయం ముందు ఉన్న నాలుగోమెట్టు వద్దనుంచే ఆ సమయంలో పూజలను అందుకుంటాడాయన. అందుకే.. జలవినాయకుడిగా ఖ్యాతి గడించాడు. అటు పాతాళగణపతిగా.. ఇటు జలవినాయకుడిగా శ్రీకాళహస్తిలో భక్తులను కరుణిస్తున్నాడు గణనాథుడు. వాయులింగేశ్వరుడిని దర్శనంతో పాటు.. ఈ వినాయకులిద్దరినీ దర్శించుకుంటే.. కోరిన కోర్కెలు సిద్ధిస్తాయంటారు భక్తులు.


దక్ష మహాదేవ్ కోవెల.....హరిద్వార్...

మన పురాణాలు చెప్పినదాని ప్రకారం మన దేశంలో మోక్షాన్ని ఇచ్చే ఏడు అతిపవిత్ర నగరాలు ఉన్నాయి.అవి అయోధ్య,మధుర,మాయా,కంచి,కాశి,అవంతిక,ద్వారమతి. వీటిలో మాయా అనే నగరమే ఇప్పటి హరిద్వార్.హరిద్వార్ కి గంగా ద్వార్ అని మరో పేరుకూడాఉంది.హిమాలయాల్లో కైలాస పర్వత పాదం వద్ద పుట్టి గంగోత్రి వద్ద మనకి దర్శనం ఇచ్చే గంగ మాత మొట్టమొదట ఈ హరిద్వార్ లోనే భూమిమీద అడుగుపెడుతుంది.

హరిద్వార్ ఒక పవిత్ర హిందూ పుణ్యక్షేత్రం. ఇది ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నది. హిందువుల పుణ్యక్షేత్రం. ద్వారం అంటే లోపలకు ప్రవేశించే దారి. హరి అంటే విష్ణువు హరిద్వార్ అంటే హరిని చేరే దారి. .ఇది ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం. హరిద్వార్ అమృతం చిందిన నాలుగు క్షేత్రాలలో ఒకటి. మిగిలిన మూడు అలహాబాద్ లోని ప్రయాగ, ఉజ్జయిని మరియు గోదావరి జన్మ స్థలమైన నాసిక్. సాగరమథనం తరువాత గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకొని వచ్చే సమయంలో అమృతం నాలుగు ప్రదేశాలలో చిందినట్లు పురాణ కథనం. ప్రస్తుతం ఇవి పుణ్యక్షేత్రాలుగా మారాయి. 12 సంవత్సరాల కాలానికి ఒక సారి ఈ క్షేత్రాలలో కుంభమేళా జరుగుతుంది. 3 సంవత్సరముల వ్యవధిలో ఒక్కొక్క క్షేత్రంలో కుంభమేళా జరపడం ఆనవాయితీ. ప్రయాగలో జరిగే మహాకుంభమేళాకు భక్తులు, యాత్రీకులు ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడ కూడి వేడుక జరపడం ఆనవాయితీ. ఈ సమయంలో భక్తులు గంగా తీరంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు. కుంభమేళా సందర్భంగా హరిద్వార్‌ సమీపంలోని జ్వాలాపూర్‌ లో జరిగే భారీ ఊరేగింపులో పాల్గొనేందుకు విచ్చేసిన హిందూ మత నాయకులూ, సాధు, సంత్‌లకు సంప్రదాయం ప్రకారం అంజుమన్‌ కామ్‌ గంధన్‌ పంచాయత్‌ కు చెందిన ముస్లిం పెద్దలు సాదర స్వాగతం పలుకుతారు. హిందూ స్వాములకు ముస్లిం పెద్దలు భక్తి పూర్వకంగా దక్షిణలు సమర్పించి వారి ఆశీస్సులు పొందుతారు. అందుకు ప్రతిగా హిందూ స్వాములు ముస్లిం పెద్దలను ఆలింగనం చేసుకుని వారిని ఆశీర్వదిస్తారు. ముస్లింలకు ప్రసాదాలు అందజేస్తారు. కుంభమేళాలో పెష్వాయ్‌ సందర్భంగా హిందూ మత నాయకులను ఇలా సత్కరించడం,అలాగే,ముస్లింల ఉత్సవాలకూ,పండుగలకూ ఇక్కడి హిందూ నాయకులు శుబాకాంక్షలు తెలపడం, సత్కరించడం సంప్రదాయంగా వస్తోంది.తరతరాలుగా ఈ ప్రాంతంలో మత సామరస్యం వెల్లివిరుస్తోంది.
హరి ద్వార్ లో ఒక స్నాన ఘట్టం
హరిద్వార్ ప్రకృతి ఆరాధకుల స్వర్గసీమ. హరిద్వార్ భారతీయ సంత్రదాయానికి, నాగరికతకు ప్రతి బింబం. పురాణాలలో ఇది కపిస్థాన్ గానూ, మాయాపురి మరియు గంగాపురిగా వర్ణించబడింది. ఉత్తరఖాండ్‌లో ఉన్న ఈ నగరం చార్ ధామ్ అని పిలవబడే గంగోత్రి, యమునోత్రి, కేదారినాథ్ మరియు బదరీనాథ్ లకు ప్రవేశ ద్వారం. శైవులు దీనిని హరద్వార్ గానూ వైష్ణవులు దీనిని హరిద్వార్ గానూ పిలుస్తుంటారు. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు అని అర్ధం. క్రీ.పూ 1700 నుండి 1300 మధ్య జీవించిన ప్రజలు టెర్రాకోట్టా (బంకమన్ను తో తయారుచేసిన వస్తువులను భట్టీలలో కాల్చి ఉపయోగించే) సంస్కృతి (అనగా, సిరామిక్ వస్తువులను ఉపయోగించేవారు) కలిగివున్నారని పూరాతత్వ పరిశోధనలు ఋజువుచేస్తున్నాయి. క్రీ.శ 629లో భారత దేశంలో పర్యటించిన చైనా హ్యూయన్ త్సాంగ్ రచనల్లో దీని వర్ణన ఉండటం వ్రాత పూర్వకంగా మొదటి సాక్ష్యంగా గుర్తించ బడినది. 16వ శతాబ్దంలో అక్బర్ పరిపాలనలో అబుల్ ఫజల్ చే వ్రాయబడిన ఆయిన-ఎ-అక్బరీ గ్రంథంలో హరిద్వార్ మాయాపురిగా సూచింపబడింది. జహంగీర్ చక్రవర్తి (1596-1627)పరిపాలనా కాలంలో ఈ ప్రదేశాన్ని సందర్శించిన ఆంగ్లేయ యాత్రికుడు థోమస్ కోర్యాట్ హరిద్వార్‌ని 'హరద్వారా' శివుని రాజధానిగా సూచించాడు. కపిల ముని ఇక్కడ ఆశ్రమం నిర్మించుకుని నివసించడం వలన ఇది కపిస్థాన్ గా కూడా పిలువబడినట్లు పురాణ కథనం. సత్య యుగంలో శ్రీ రామచంద్రుని పూర్వీకుడూ సూర్య వంశరాజు అయిన సరుని కుమారులలో ఒకడైన భగీరథుడు కపిల ముని శాపగ్రస్తులైన తన పితృదేవతలకు 60,000 మందికి ముక్తిని ప్రసాదించగోరి స్వర్గంనుండి గంగా దేవిని ఇక్కడకు రప్పించినట్లు హిందూ పురాణాల వర్ణన. ఈ కారణంగా హిందువులు మరణించిన తమ పితరుల ముక్తి కోసం వారి చితాభస్మం ఇక్కడకు తీసుకు వచ్చి గంగానదిలో కలపడం ఆనవాయితీ. విష్ణుమూర్తి తన పాదముద్రలను ఇక్కడ హరి కి పురి లో వదిలి వెళుతున్నానని చెప్పినట్లు పురాణ కథనం. సదా ఈ పాదముద్రలు గంగానదిచే తడపబడటం విశేషం. 1399 జనవరి 13 న టర్కీ రాజు 'తిమూర్‌ లాంగ్'(1336-1405) దండయాత్రలో హరిద్వార్ తిమూర్ లాంగ్ వశమైంది. సిక్కు గురువు 'గురునానక్'(14469-1539)హరిద్వార్ లోని 'కుష్వన్ ఘాట్' లో స్నానం చేసిన సందర్భం వార మతగ్రంథాలైన 'జన్మసఖి'లో చోటుచేసుకుంది. హరిద్వార్ పురాతన సంస్కృతికి, సంప్రదాయాలతో సుసంపన్న మైన ఆధ్యాత్మిక నగరం. ఆధ్యాత్మిక వారసత్వం కలిగిన హరిద్వార్‌లో ఇప్పటికీ చాలా హవేలీలు,మఠాలు పురాతన చిత్రాలు,శిల్ప సంపదతో విలసిల్లుతున్నాయి. హరిద్వార్ పురాణ కాలంనుండి ప్రస్తుత కాలం వరకు తన పుతారన్త్వాన్ని,ఆధ్యాత్మిక వైభవాన్ని నిలుపుకుంటూ అభివృద్ధి పధంలో పయనిస్తున్న భారతీయ నగరాలలో ఒకటి.హరిద్వార్ బౌద్దుల కాలందాటి,ఆగ్లేయుల పరిపాలన చవిచూసి ప్రస్తుత ఆధునిక కాలంలో కూడా భక్తులను ఆధ్యాత్మికంగా ఆకర్షిస్తూ కొనసాగుతున్న ప్రముఖ హిందూ పుణ్య క్షేత్రాలలో ఒకటి.
ఇక్కడ చూడవలసిన ఇతర ప్రదేశాలు
కేబుల్ కారు
మహారాజు విక్రమాదిత్యుడు తన సోదరుడు భర్తృహరి మరణానంతరం అతని జ్ఞాపకార్ధంగా గంగా నది తీరంలో స్నానఘట్టం కట్టించాడని ప్రతీతి. భర్తృహరి ఈ ప్రదేశంలో పవిత్ర గంగానది తీరాన తపసు చేసి ఇక్కడే తనువు చాలించిన కారణంగా అతని పేరుతో ఈ నిర్మాణాన్ని చేపట్టినట్లు ఇక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. తరవాతి కాలంలో 'హరి కా పురి'గా నామాంతరం చెందిది.ఈ పవిత్ర స్నాన ఘట్టం బ్రహ్మ కుండ్‌గా కూడా పిలుస్తారు.సాయంకాల సమయంలో గంగాదేవి హారతి ఇచ్చే ఆచారం ఉంది.తరవాత భక్తులు పితృదేవతా ప్రీత్యర్ధం నదీ జలాలలో తేలిపోయే దీపాలను వదులుతుంటారు ఈ దృశ్యం మనోహరంగా ఉండి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. చండీ దేవి ఆలయం. చండీ దేవి ఆలయం కాశ్మీర్ రాజు సుచత్ సింగ్ చే1929లో గంగానది అవతలి తీరంలో నీల పర్వత శిఖరం పైన నిర్మించబడింది. ఇది చండీ ఘాట్‌కు 3 కిలో మీటర్ల దూరంలో నీల్ పర్వత శిఖరంపైన ఉంది. రాక్షసరాజులైన సుంభ-నిశుంభుల సైన్యాధిపతి చండ-ముండ ఈ ప్రదేశంలో చంఢీ దేవిచే సంహరించ బడినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఆ కారణంగా ఆ ప్రదేశం చంఢీ ఘాట్ పిలువబడుతుంది. ఈ దేవిని ఆదిశంకరాచార్యులు కీ.పూ 8 వ శతాబ్ధంలో ప్రతిష్టించినట్లు పురాణ కథనం. ఈ దేవాలయాన్ని ఉదయం 8.30 నుండి సాయంత్రం 6 గంటలవరకు కాలిబాటన లేక రోప్ వే ద్వారా చేరవచ్చు. మశాదేవి ఆలయం. మంశాదేవి కోవెల బిల్వ ప్రర్వత శిఖరంపైన ఉంది. మంశాదేవి అంటే మనసులోని కోరికలను తీర్చేదేవి అని అర్ధం. ఇది భక్తుల ఆకర్షణీయ కోవెలలలో ఒకటి. ఈ కోవెలను చూడటానికి కేబులు కారులో ప్రయాణం చేయడం ద్వారా ఊరంతటినీ చూడటం భక్తులకు ఆనందమైన అనుభవం.ఈ కోవెలలో రెండు ప్రధాన ఆలయంలో 5 చేతులు మూడు ముఖాలు కలిగిన విగ్రహం ఒకటి, 8 చేతులు కలిగిన విగ్రహం ఒకటి మొత్తం రెండు విగ్రహాలు ఉన్నాయి 11వ శతాబ్దంలో నిర్మించినట్లు అంచనా. ఇది ఆదిశక్తి ఆలయం. ఇది సిద్ధ పీఠాలలో ఒకటి. ఈ ప్రదేశంలోసతీదేవి హృదయం నాభి పడినట్లు పురాణ కథనం. హరిద్వార్ లో భైరవ ఆలయం నారాయణీ శిలా ఆలయం తో ఇది కూడా పురాతన ఆలయాలలో ఒకటి. దక్షమహాదేవ్ కోవెల
హరిద్వార్‌కి దక్షిణంలో ఉన్న కంకాళ్ అనే ఊరిలో సతీదేవి తండ్రి అయిన దక్షుడి ఆలయం ఉంది. పురాణాల ఆధారంగా సతీ దేవి తండ్రి దక్షుడు తలపెట్టిన యాగానికి త్రిమూర్తులలో ఒకడు తన అల్లుడూ అయిన మహాశివునికి ఆహ్వానం పంపలేదు. సటీదేవి పుట్టింటి మీద మమకారాన్ని వదులుకోలేక తన తండ్రిని భర్త అయిన శివుని ఎందుకు పిలవలేదని అడగటానికి పిలవక పోయినా యగ్జానికి వెళుతుంది. అఖ్ఖడ తన భర్త అయిన శివుని ను పిలవకుండా యాగం చేయడం అపరాధమని తన తండ్రిని హెచ్చరిస్తుంది. దురహంకార పూరితుడైన దక్షుడు తన కుమార్తెను అవమానించి అల్లుడైన శివుని దూషిస్తాడు. అది భరించలేని సతీదేవి అదే యజ్ఞకుండంలో దూకి ప్రాణ . సతీదేవి ప్రాణత్యాగం తెలుసుకున్న శివుడు తన ఆగ్రహంతో వీరభద్రుని సృష్టించి దక్షుణ్ణి సంహరించమని పంపిస్తాడు. వీరభద్రుని చేతిలో మరణించిన దక్షుణ్ణి దేవతలు, దక్షిని భార్య కోరిక పై తిరిగి దక్షుని శరీరానికి మేక తలను అతికించి బ్రతికిస్తాడు. ఈ పురాణ సన్నివేశానికి గుర్తుగా ఇక్కడ దక్ష మహాదేవ్ కోవెల నిర్మించారు.

పళని క్షేత్రం
తమిళనాడులో శివమహాదేవునికి, ఆ స్వామి మహితపరివారమైన అర్థాంగి పార్వతీదేవి, పెద్దకుమారుడు గణేశుడు, చిన్న కుమారుడు సుబ్రహ్మణ్యులకు ఉన్న ప్రాచుర్యం, ప్రాధాన్యం, ప్రసిద్ధి ఇతర దైవాలకు, వారి కుటుంబాలకు లేదనడం అత్యంత సహజోక్తి.
ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి విషయానికి వస్తే చిన్న స్వామి అయిన ఈ ముద్దు మురిపాల ముగ్ధమోహన స్వామికి ఘనమైన చరిత్రే కలదు. సుబ్రహ్మణ్యుని పేర్ల విషయానికి వస్తే అవి చాలా ఉన్నాయి. కుమార, కుమరన్, కుమార స్వామి, స్కంద, షణ్ముఖ, షన్ముగం, శరవణ, శరవణన్, గుహ, గుహన్ మురుగ, మురుగన్ - ఇలా ఎన్నో పేర్లు కలదు.
తమిళనాడులో సుబ్రహ్మణ్యస్వామి గల వైభవ ఆలయాలలో 'పళని' ప్రముఖమైంది.
పళనిలోని మురుగన్ ఆలయం సహజ సిద్దమైన ప్రకృతి శోభలతో విలసిల్లే కన్నుల పండుగైన కొండపై నిర్మితమైంది!. దీనిని 'మురుగన్ కొండ' అని కూడా అంటారు. ఆలయ సందర్శనకు 659 మెట్లను ఎక్కవలసి ఉంది. అంత శక్తి లేని వారి కోసమై 'ఏరియల్ రోప్ - వే' ఏర్పాటు చేయబడింది. గిరి ప్రదక్షిణకోసమై కొండ చుట్టూరా చక్కని రోడ్డు వేయబడింది. సాధారణంగా భక్తులు ముందు గిరిప్రదక్షిణ చేసి ఆ తర్వాత కొండ ఎక్కుతారు!.
మెట్లన్నీ ఎక్కి కొండపై భాగం చేరగానే చుట్టూరా కనిపించే సుందర ప్రకృతి దృశ్యాలు మనసును పులకింపజేస్తాయి. మొట్ట మొదట మనకు మనోహరమైన రాజగోపురం దర్శనమిస్తుంది. గోపుర ద్వారం గుండా కాస్త ముందుకు వెలితే వరవేల్ మండపం కనిపిస్తుంది. ఈ మండప స్థంబాలు అత్యంత సుందరమైన శిలా చిత్రాలతో మంత్రముగ్ధులుగావిస్తాయి. ఈ మండపం తర్వాత నవరంగ మండపం ఉంది. ద్వారం వద్ద ద్వారపాలకుల విగ్రహాలు ఆకర్షణీయంగా మలచబడ్డాయి.
గర్భగుడిలో ప్రతిష్టితమైన కమనీయ కుమారస్వామి విగ్రహం 18 మంది సిద్ధులలో ప్రముఖుడైన భోగార్ పర్వవేక్షణంలో రూపొందింపబడిందని, ఇది ఔషధ గుణాలు కలిగిన అపురూప విగ్రహమని చెబుతారు. దీనిని 'నవ పాషాణం' అనే విశేషమైన శిలనుమలచి తయారు చేశారని, ఇందులో శక్తివంతమైన మూలికా పదార్థాలను నిక్షిప్తం గావించారని అంటారు.
ఈ విగ్రహం విశిష్టత ఏమంటే, స్వామి పూజల సందర్భంగా ధూప, దీప సమర్పణల సమయాలలో వెలువడే ఉష్ణానికి విగ్రహంలోని సునిశితమైన మూలికా పదార్థం క్రియాశీలమై ఒక విధమైన వాయువులను వెలువరిస్తుందని, వాటిని పీల్చిన వారికి కొన్నివ్యాధులకు సంబంధించిన దోషాలు హరించుకుపోతాయని ఆరోగ్యవంతులవుతారని చెబుతారు!.
మూలస్థానంలో కొలువు దీరిన కుమారస్వామి భక్తజన సంరక్షకుడుగా, కోరిన వరాలు ప్రసాదించే కొండంత దేవుడుగా అపురూప దివ్య దర్శన భాగ్యాన్ని అందజేస్తారు. కృత్తికా సూనుడైన కుమారునికి ప్రతి నెల కృత్తికా నక్షత్రం నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆషాడకృత్తిక సందర్భంగా విశేష వైభవ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.

స్థలపురాణం :

పార్వతీ పరమేశ్వరులకు కుమారులైన బొజ్జ వినాయకుడు, చిన్న సుబ్రహ్మణ్యుడులో విఘ్నాలకు ఎవరిని అధిపతి చేయాలి అని ఆలోచనలో పడ్డారు. ఒకనాడు పార్వతీపరమేశ్వరులు తమ కుమారులను పిలిచి ఒక పరీక్షను నిర్వహిస్తారు. అదేమిటంటే.. ‘‘ఈ భోలోకం మొత్తం చుట్టి, అన్ని పుణ్యనదులలో స్నానం చేసి, ఆ క్షేత్రాలను దర్శించి ఎవరైతే ముందుగా వస్తారో... వారిని విఘ్నాలకు అధిపతి చేస్తాం’’ అని శంకరుడు చెబుతాడు.

అప్పుడు చిన్నవాడయిన షణ్ముఖుడు తన వాహనమైన నెమలిని తీసుకొని భూలోకం చుట్టిరావడానికి బయలుదేరుతాడు.

కానీ పెద్దవాడయిన వినాయకుడు తన తల్లిదండ్రులైన పార్వతీపరమేశ్రుల చుట్లూ మూడుసార్లు ప్రదక్షిణలు చేస్తాడు. ఇలా ప్రదక్షిణలు చేయడంవల్ల సకల నదులలో స్నానం చేసిన పుణ్యం వస్తుందనే సత్యాన్ని తెలుసుకుని, కైలాసంలోనే ప్రదక్షిణలు చేస్తుంటాడు.

అయితే భూలోకానికి చుట్టిరావడానికి బయలుదేరిన సుబ్రహ్మణ్యుడు ఏ క్షేత్రానికి వెళ్లినా.. అప్పటికే అక్కడ వినాయకుడు చేరుకుని వెనుతిరిగి వస్తున్నట్లు కనబడుతుంటాడు. ఈ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు.

ఇలా ఓడిపోయిన సుబ్రహ్మణ్యుడు తన తల్లిదండ్రులమీద అలకతో కైలాసం వదిలి, భూలోకంలోకి వచ్చి ఒక కొండ శిఖరం మీద నివాసం వుంటాడు. అప్పుడు శివపార్వతులు ఇద్దరూ షణ్ముఖుని బుజ్జగించడం కోసం భూలోకంలో అతడు వున్న కొండ శిఖరానికి చేరుకుంటారు. అక్కడ పరమశివుడు సుబ్రహ్మణ్యుడిని ఎత్తుకుని ‘‘నువ్వే సకలజ్ఞాన ఫలానివి’’ అని ఊరడిస్తారు. దీంతో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు శాశ్వతంగా ఆ కొండమీదే కొలువు వుంటానని అభయం ఇస్తారు. (సకల జ్ఞాన ఫలంలో (తమిలంలో పలం), నీవు (తమిళంలో నీ) - ఈ రెండూ కలిపి పళని అయ్యింది.)

విషయాలు :

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి క్షేత్రాలలో ప్రఖ్యాతి గాంచిన క్షేత్రం ఈ పళని. ఇది ఎంతో పురాతనమైన క్షేత్రం. క్రీస్తుశకం ఏడవ శతాబ్దంలో కేరళరాజు అయిన చీమన్ పెరామాళ్ దీనిని నిర్మించారు. ఆ తరువాత పాండ్యులు ఈ మందిరాన్ని అభివృద్ధి చేశారు.

ఇక్కడ పళని మందిరంలోని గర్భగుడిలో వున్న స్వామివారి మూర్తిన నవషాషాణములతో చేయబడింది. ఇటువంటి స్వరూపం మరెక్కడా లేదు. దీనిని సిద్ధభోగార్ అనే మహర్షి చేశారు. తొమ్మిదిరకాల విషపూరిత పదార్థాలతో దీనిని తయారుచేశారు.

తమిళనాడులో వున్నవాళ్లు ఈయనను ‘‘పళని మురుగా’’ అనే పేరుతో కీర్తిస్తారు.

ఈయన స్వరూపం చాలావరకు భగవాన్ శ్రీరహణ మహర్షితో కలుస్తుంది. చాలామంది పెద్దలు భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య అవతారం అని చెబుతుంటారు.

ఇది తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో, మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో వుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి