ఆరాధ్య రక్తి లీల
మల్లాప్రగడ రామకృష్ణ
పడతి పవలింపుకు
పద్మాక్షి ముఖారవిందముకు
పద్మముఖిగుభాళింపుకు
పాటుగ పిలుపుకు
లొంగని వారెవ్వరు లేరులే
పర్వందుముఖి గగుర్పాటుకు
పల్లవాధర ఆదరణమునకు
పల్లవోష్ఠి సంభాషణకు
పాటలగంధి పాటలకు
లొంగని వారెవ్వరు లేరులే
పుత్తడిబొమ్మ మెరుపుకు
పువ్వారుబోడి చతురతకు
పుచ్చడిక పుకారుకు
పుష్కరాక్షి విరహమునకు
లొంగని వారెవ్వరు లేరులే
త్రిదర్శిని ఆకర్షణకు
ప్రమద ప్రమోదముకు
ప్రియ వాక్కులకు
ప్రోడ ప్రోత్సాహముకు
లొంగని వారెవ్వరు లేరులే
బంగారు కోడి గంతులకు
బాగులాడి బాగోగులకు
బాగరి గుర్తింపునకు
బింబాధర అధరముకు
లొంగని వారెవ్వరు లేరులే
ఆరాధ్య రక్తి లీల
మల్లాప్రగడ రామకృష్ణ
నవల నవభావ నటనకు
నళినాక్షి గాజుకళ్ళకు
నళినలోచన దృష్టికి
ననబోడి నకనకలకు
లొంగని వారెవ్వరు లేరులే
నాచి నంగనాచి మాటకు
నాతి తికమక పలుకుకు
నాంచారు నవ్వులకు
నాతుక ఆతురతకు
లొంగని వారెవ్వరు లేరులే
నారి నారి నడుమ మాటకు
నితంబవతి పంతమునకు
నితంబని చురుకుతనముకు
నీరజాక్షి వాలు చూపులకు
లొంగని వారెవ్వరు లేరులే
నెలతుక కవ్విపు చేష్టలకు
నెలఁత నమ్మకపు నటనకు
నెచ్చెలి చల్లని చూపుకు
నీలవేణి అలుకకు
లొంగని వారెవ్వరు లేరులే
--((**))--
ఆరాధ్య రక్తి లీల -8
ప్రాంజలిప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ
మండయంతి ముద్దులకు
మగువ మోము పొందుటకు
మచ్చకంటి చూపులకు
మొదటి పెట్టె పేచీలకు
లొంగని వారెవ్వరు లేరులే
మడతుక మడత పేచీకి
మత్తకాశిని మత్తు చూపులకు
మదిరినయన వేదింపునకు
మదిరాక్షి మనుగడకు
లొంగని వారెవ్వరు లేరులే
లతాంగి పరిమళమునకు
లతాతన్వి వీరత్వమునకు
లతకూన మేలికౌగలింపుకు
రోచన రూపలావణ్యమునకు
లొంగని వారెవ్వరు లేరులే
రూపసి శృంగార చేష్టలకు
రుచిరాంగి రాసాస్వేదముకు
రూపరి పవళింపు పిలుపుకు
రమణి రంజిల్లు చూపుకు
లొంగని వారెవ్వరు లేరులే
--((**))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి