16, డిసెంబర్ 2018, ఆదివారం





శ్రీ విద్యా శంకర దేవాలయం, శృంగేరి,
చిక్కమగుళూర్ జిల్లా, కర్ణాటక.

విభాణ్డక మహర్షి పుత్రుడైన ఋష్యశృంగుని ఆశ్రమం ఒక పర్వతం పైన ఉండేది. ఆ పర్వతం పై అంతటి మహానుభావుడు ఆశ్రమం ఉన్నంత మాత్రముచే ఆ పర్వతం నకు శృంగ పర్వతమనీ, ఆ పర్వత పరిసర ప్రాంతంను శృంగేరి గా పిలవడమైనది.

ఇక్కడ ఈ ఆలయ విశిష్టత ఏమనగా ఆలయ అంతర్మంటపం నందు ద్వాదశ స్తంభాలు పై ద్వాదశ రాశులు చెక్కబడి ఉంటాయి. ఆలయ నిర్మాణం, గవాక్షాల ఏర్పాటు చేసిన విధానం, సూర్య కిరణాలు నేరుగా ఆ గవాక్షాల మార్గం ద్వారా ఒక్కొక్క మాసంలో ఆయా రాశులపై ప్రసరించేటట్టు నిర్మించారు.


--((**))--

తన కిరణాలతో అద్భుతాలు చేసే అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి 

ప్రసిద్ధమైన అరసవిల్లి సూర్యనారాయణస్వామి దేవాలయం అరసవిల్లి శ్రీకాకుళం పట్టణానికి 1 కి.మీ దూరములో ఉంది. పూర్వము శ్రీకాకుళం జిల్లాలో, శ్రీకాకుళం మండలంలో ఉన్న గ్రామం. 

శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానము ద్వారా బహుళ ప్రసిద్ధి చెంది ఉంది. ఒకప్పుడు ఈ గ్రామాన్ని "హర్షవల్లి" అనేవారని క్రమ క్రమంగా "అరసవిల్లి" అయిందని చెపుతారు. 

* దేవాలయ చరిత్ర 

ఇక్కడి సూర్యదేవాలయంలో కల ఈ స్వామిని స్వయంగా దేవేంద్రుడే ప్రతిష్ఠించాడని స్థలపురాణం ద్వార తెలియుచున్నది. ఇక్కడ లభించిన శాసనాలు క్రీ.శ. 7 వ శతాబ్థానికి చెందినవి. అందువల్ల యిది ప్రాచీన దేవాలయం అని చెప్పవచ్చు. భారతదేశంలో ఉన్న కొద్ది సూర్యదేవాలయాలలో ఇది ఒకటి. (ఒరిస్సాలో సుప్రసిద్ధమైన కోణార్క్ సూర్యదేవాలయంలో సైతం ఇక్కడి మాదిరిగా ఇప్పుడు నిత్యపూజలు జరగడంలేదు. ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ నిర్మించినట్లు కొందరు పురావస్తు శాస్త్రజ్ఙులు పేర్కొన్నారు. 

ఈ ప్రాంతం 17 వ శతాబ్దంలో నిజామునవాబు పాలన క్రిందికి వచ్చింది. ఈ ప్రాంతానికి సుబేదారుగా నియమించబడ్డ షేర్ మహమ్మద్ ఖాన్ పరిపాలనా కాలంలో ఈ ప్రాంతంలోని దేవాలయాలను అనేకం ధ్వంసం చేశాడు. ఆ విషయాన్ని అతనే పర్షియన్ లిపిలో ఒక శిలాశాసనం ద్వారా ప్రకటించుకున్నాడు. అలా నాశనం చేయబడిన అనేక దేవాలయాలలో అరసవిల్లి కూడా వుంది. 

సుబేదారుకు హిందువుల న్యాయశాస్త్రం గురుంచి, మనుస్మృతి గురించి చెప్పడానికి నియమించబడిన పండితుడు సీతారామ శాస్త్రి అరసవిల్లి దేవాలయంపై జరగనున్న దాడిని గురించి ముందుగా తెలుసుకొని ఎలాగో స్వామి మూలవిరాట్టును పెకలించి ఒక బావిలో పడవేయించాడట. 150 సంవత్సరాల క్రితం ఎలమంచి పుల్లజీ పంతులు అనే ఆయన బావిలోనుంచి ఆ విగ్రహాన్ని తీయించాడట. దేవాలయాన్ని ఇప్పుడున్న రీతిలో నిర్మించి, అందులో బావిలో లభించిన విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ఈ దేవాలయం క్రమక్రమముగా అభివృద్ధి చెందుతూ, అశేషంగా భక్తులనెందరినో ఆకర్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రముగా వెలుగొందుతూ వుంది. 

ప్రతి సంవత్సరం రథసప్తమినాడు స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. 

* ఆలయ విశేషాలు 

ఈ దేవాలయంలోని ఒక మహత్తరమైన విషయం, సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయసంధ్యలో మూలవిరాట్టు పాదాలకు సోకేలా ఈ దేవాలయం నిర్మించబడటం. దేవాలయ వాస్తులో యిదో ప్రత్యేకత. కంచి లోని కామేశ్వరాలయంలో కూడా యిలాంటి ఏర్పాటు వుంది. 

ఆంద్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం సమీపంలో గల అరసవిల్లి పుణ్యక్షేత్రం లో ప్రతి ఏటా రెండు సార్లు ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. అదేమిటంటే, సంవత్సరంలో మాత్రం ప్రభాత భాస్కరుని కిరణాలు నేరుగా ఆలయం ముఖ ద్వారం నుండి ప్రవేశించి స్వామి వారైన ఉషా, చాయా, పద్మినీ సమేత శ్రీ సూర్య నారాయణ స్వామి వారి పాదాలను తాకుతాయి. ఈ ఘట్టం ఉదయం 6.00 నుండి 6.15 మధ్య కేవలం ఒక అయిదు నిముషాలు మాత్రమె వుంటుంది. తదుపరి సూర్య కిరణాలు గర్భ గుడి నుండి నిష్క్రమిస్తాయి. ఈ అద్భుతాన్ని చూడడానికి ఎందఱో స్థానిక భక్తులు, దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఆలయానికి వేకువనే వచ్చి ఈ వింత చూడటానికి ఎదురు చూస్తారు. 

సుమారు ఏడవ శతాబ్దంలో ఈ కోవెలను సూర్యుని గమనాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మించడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మార్చిలో, అక్టోబరు లో వచ్చే ఈ శుభ దినాలు ఉత్తరాయనాన్ని, దక్షిణాయనాన్ని సూచిస్తాయి. ఈ దినం ప్రసరించే సూర్య కిరణాలలో శరీర ఆరోగ్యాన్ని మెరుగు పరచే మహిమ వుందని అందరి భక్తుల నమ్మకం. ఆ విధంగా ప్రత్యక్ష దైవమైన సూర్యుడు తన కిరణాలతో అద్భుతాలు చేస్తూ ప్రాణికోటి కంతటికీ జీవనాధారమౌతున్నాడు. 

" సప్తాశ్వ రథమారూఢమ్ ప్రచండమ్ కశ్యపాత్మజమ్ 
శ్వేత పద్మధరమ్ దేవమ్ తమ్ సూర్యమ్ ప్రణమామ్యహమ్ "

==((**))---

పరమశివుడు కొలువుదీరిన పంచభూత స్థలాలు

తిరువణ్ణామలై, శ్రీకాళహస్తి,కాంచీపురం, చిదంబరం మరియు తిరువనైకోవిల్ లు పరమశివుడు కొలువుదీరిన పంచభూత స్థలాలు

01. తిరువణ్ణామలై లో పరమేశ్వరుడు అరుణాచలేశ్వరుడు గా వెలిసాడు. అరుణాచలేశ్వరుడు ఇక్కడ అగ్ని లింగం రూపం లో దర్శనమిస్తాడు.

02. శ్రీకాళహస్తి లో పరమేశ్వరుడు వాయు లింగ రూపం లో దర్శనమిస్తాడు.

03. కాంచీపురం లో ఏకామ్రేశ్వర్ గా కొలువై పృధ్వి లింగ రూపం లో దర్శనమిస్తాడు.

04. చిదంబరం లో ఆకాశ (నిరాకార) రూపం లో దర్శనమిస్తాడు.

05. తిరువనైకోవిల్ (జంబుకేశ్వర్)లో జల లింగం రూపం లో దర్శనమిస్తాడు.

తిరువణ్ణామలై, కాంచీపురం, చిదంబరం మరియు తిరువనైకోవిల్ లు తమిళనాడు లో ఉంటే, శ్రీకాళహస్తి మాత్రం ఆంధ్ర ప్రదేశ్ లో ఉంది.
పరమశివుడు కొలువుదీరిన పంచభూత స్థలాలు

తిరువణ్ణామలై, శ్రీకాళహస్తి,కాంచీపురం, చిదంబరం మరియు తిరువనైకోవ...

--((**))--

ఓం శ్రీ రామ్ - శ్రీమాత్రేనమ:
తిరుచ్చి తిరుచురాపల్లి 

ప్రపంచంలోని అతి ప్రాచీన గణపతి దేవాలయం... 
‘రాక్ ఫోర్ట్’ గణపతిదేవాలయం 
ఉచ్ఛ (పిళ్ళైయార్) గణపతి ---తిరుచురాపల్లి 

ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన వినాయక దేవాలయం, తమిళరాడు రాష్ర్టంలోని తిరుచ్చి (తిరుచురాపల్లి) పట్టణంలో, కావేరీనదీ తీరానికి దగ్గరగా ఉన్న ఒక చిన్న కొండమీద ఉంది. 83 మీటర్లు ఎత్తుగా ఉండే ఈ కొండమీద ఉన్న ఈ వినాయక దేవాలయాన్ని సుమారు ఏడవ శతాబ్దంలో పల్లవ రాజులు పునర్నిర్మించారని చరిత్రకారులు చెప్తారు. ఈ ఆలయాన్ని ‘ఉచ్చ పిళ్ళైయార్’ ఆలయం అంటారు. తమిళ భాషలో ‘ఉచ్ఛ’ అంటే ‘ఎత్తున’అని అర్థం. ఇక ‘పిళ్ళై..యర్’ అంటే ‘పిల్లవాడు ఎవరు’ అని అర్థం. శివుడు పార్వతీదేవి మందిరంలో ప్రవేశించబోతున్న సమయంలో, పార్వతీదేవి కాపలాగా ఉంచిన బాలుడు అడ్డగించగా, శివుడు కోపగించి ఆ బాలుని తల ఖండించి లోపలకు వెళ్ళడు. 

శివుడు, పార్వతిని కలవగానే అడిగిన మొదటి ప్రశ్న ‘పిళ్ళైయార్’. అంతవరకూ ఈ బాలునకు పేరే లేదు. ఆనాటి నుండి వినాయకునకు ‘పిళ్ళైయార్’ అనే పేరు స్ధిరపడిపోయింది. అందుకు ఈ ఆలయాన్ని ‘ఉచ్చ పిళ్ళైయర్ ఆలయం’ అంటారు. ఈ ఆలయం ఉన్న కొండ సుమారు 3800 మిలియన్ల సంవత్సరాలకు పూర్వందని చరిత్రకారుల అంచనా. ఈ ఆలయానికీ..శ్రీరంగం లోని రంగనాథస్వామి ఆలయానికీ ఎంతో అవినాభావ సంబంధం ఉంది. దానికి సంబంధించిన కథ ఏమిటంటే.... త్రేతాయుగ కాలంలో, శ్రీరామచంద్రుడు వానరులతో కలసి రావణుని మీదకు యుద్ధానికి వెళ్లినప్పుడు రావణ సోదరుడైన విభీషణుడు ఎంతో సాయం చేసాడు. 

ఫలితంగా శ్రీరాముడు రావణుని సంహరించాడు. అందుకు కృతఙ్ఞతగా శ్రీరాముడు.. విభీషణునకు శ్రీమహావిష్ణువు అవతారమైన ‘శ్రీరంగనాథస్వామి’విగ్రహాన్ని బహూకరిస్తూ ‘విభీషణా.., లంకలో ఈ విగ్రహం ప్రతిష్ఠిచే వరకూ ఈ విగ్రహాన్ని నేలమీద పెట్టవద్దు’ అని చెప్పాడు . ఆ విగ్రహం తీసుకుని విభీషణుడు లంకకు బయలుదేరాడు. అయితే విభీషణుడు ఆ విగ్రహాన్ని లంకలో ప్రతిష్ఠించడం దేవతలకు ఇష్టం లేదు. అందుచేత దేవతలంతా వినాయకుని ప్రార్థించి తమ కోరిక చెప్పారు. 

వినాయకుడు వారికి సహకరిస్తానని చెప్పి ఒక పశువుల కాపరి వేషం వేసుకుని, విభీషణునికి ఎదురుగా వస్తున్నాడు. అది సాయం సమయం. అస్తమయ సూర్యునకు అర్ఘ్యప్రదానం ఇవ్వాలని విభీషణుడు తలచి తన చేతిలోనున్న విగ్రహాన్ని నేల మీద పెట్టకూడదని, తనకు ఎదురుగా వస్తున్న పశువుల కాపరిని చూసి, దగ్గరకు రమ్మని పిలిచి, తన చేతిలోనున్న విగ్రహాన్ని ఆ పిల్లవాని చేతిలో ఉంచి ‘ నేను పూజ పూర్తి చేసుకుని వచ్చే వరకూ ఈ విగ్రహాన్ని నేల మీద పెట్టకు’ అని చెప్పాడు. మాయా గణపతి సరే అన్నాడు. విభీషణుడు కావేరీనదిలో దిగి సంథ్యావందనం చేస్తున్నాడు. ఆ సమయం చూసి, విభీషణుడు ఎంత వద్దని చెప్తున్నా వినకుండా, ఆ విగ్రహాన్ని నేలమీద ఉంచి పరుగు తీసాడు. 

విభీషణుడు ఆ బాలుని తరుముతున్నాడు. ఆ బాలుడు కావేరీనది ఒడ్డున ఉన్న కొండ ఎక్కాడు. విభీషణుడు ఆ బలుని పట్టుకుని నుదుటి మీద గట్టిగా కొట్టాడు. (ఆ దెబ్బ తాలూకు మచ్చ ఇప్పటికీ ‘ఉచ్చ పిళ్ళైయార్’ విగ్రహానికి ఉండడం భక్తులు గమనించవచ్చు) అప్పుడు వినాయకుడు నిజరూపంతో విభీషణునికి దర్శనమిచ్చి, ‘శ్రీరంగనాథస్వామి విగ్రహం ‘శ్రీరంగ’ క్షేత్రంలో ప్రతిష్ఠితమౌ గాక. మన ఇద్దరి కలయికకూ గుర్తుగా నేను ఈ కొండమీద ఉంటాను’ అని వరమచ్చి ‘సూక్ష్మ గణపతి’గా ఆ కొండమీద వెలిసాడు. విభీషణుడు ఆ ‘సూక్ష్మ గణపతి’కి ఆలయం నర్మించాడు. 

ఆ ఆలయమే పల్లవుల కాలంలో అభివృద్ధి చెందింది. అదే ప్రపంచంలోని అతి ప్రాచీన వినాయక దేవాలయం. తిరుచ్చిలోని ‘రాక్ ఫోర్ట్’ మీదవున్న ఈ ఆలయాన్ని దర్శించాలంటే 437 మెట్లు ఎక్కి వెళ్లాలి. ఈ మెట్లుకూడా చాలా ఎత్తుగా ఉంటాయి. రాక్ హిల్ ఎక్కి,ఈ ఆలయం దగ్గర నుంచి చూస్తే, తిరుచ్చి నగరం, కావేరీనది, శ్రీరంగం లోని ‘శ్రీరంగనాథస్వామి’ ఆలయం స్పష్టంగా కనిపిస్తాయి. ఇక, వినాయకుడు నేలమీద ఉంచిన ‘శ్రీరంగనాథుని’ విగ్రహాన్ని చోళరాజు కనుగొని ఆ విగ్రహాన్ని ‘శ్రీరంగం’లో ప్రతిష్ఠిచాడు. అదే శ్రీరంగం లోని ‘శ్రీరంగనాథస్వామి’ ఆలయం. ఈ ఆలయ ప్రతిష్ఠ జరిగిన తర్వాతే..‘ఉచ్చ గణపతి’ దేవాలయ ప్రతిష్ఠ జరిగింది. ఈ రెండు దేవాలయాలే ప్రపంచంలోని అతి ప్రాచీన దేవాలయాలు.



--((**))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి