29, డిసెంబర్ 2018, శనివారం

(పాఠశాల ల్లో హాస్యం) (2)


అబ్బబ్బ వెధవ బండి' 💥

(వ్యాకరణం (తెలుగు) తెలిసిన వారికి విందు భోజనం)
🌺🌺🌺🌺🌺🌺

👉🏿ఈ సంఘటన చాలా పాతకాలం నాటిది. ఒక పండితుడు వేరొక పండితుడి గ్రామానికి బస్సులో వస్తున్నానని కబురు చేశాడు. తన ఇంటికి వస్తున్న పండితుడిని ఆహ్వానించి, ఇంటికి తీసుకెళ్లడానికి ఎడ్లబండి కట్టుకొని బస్సు వచ్చే చోటికి వెళ్లాడు.

👉🏿బస్ స్టాండ్ గ్రామానికి 3, 4 మైళ్ళ దూరంలో ఉంది. అందునలన, వేరే బండివాడిని తీసుకరాకుండా, తానొక్కడే ఎద్దులను కట్టి, బండి తోలుకుంటూ బస్టాండ్ కు వచ్చాడు. బస్సు దిగిన సోదర పండితుడిని సాదరంగా ఆహ్వానించి, బండిలో కూర్చోబెట్టుకొని తన గ్రామానికి బయలుదేరాడు.

👉🏿పల్లెటూరుకు వెళ్లే త్రోవ కాబట్టి, అంత బాగా ఉండదు. నల్లేరు మీద బండి నడక కాకుండా, ఎగుడు దిగుడు బండల మీద త్రోవ వల్ల, ఎద్దుల బండి బాగా కుదుపులతో వెళుతూవుంది.
కుదుపులు ఎక్కువ ఉండడం వలన పోరుగూరి నుంచి వచ్చిన పండితుడు 'అబ్బబ్బ వెధవ బండి' అన్నాడు.

👉🏿దానికి, బండి యజమానియైన పండితుడు, ఏమండీ మీరంటున్నది షష్టీ తత్పురుషమా! లేక కర్మధారయమా! అన్నాడు నవ్వుతూ. షష్టీ తత్పురుషము అయితే 'వెధవ యొక్క' బండి అనే అర్థము వస్తుంది. అదే కర్మధారయమైతే 'వెధవ (యైన) బండి' అనే అర్థము వస్తుంది. (బండి యొక్క యజమాని వెధవనా? బండి వెధవదా?).

👉🏿
దానికి పొరుగూరి పండితుడు నవ్వుతూ, "యేదీ కాదు చతుర్థీ తత్పురుషము లెండి" అన్నాడు. (అంటే వెధవ కొఱకు బండి) అని. ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. ఆ కాలంలో పండితులు మాటల్లో కూడా అలాంటి చెణుకులు విసురుకొని ఆనందించేవారు.

*****

ఇంకొక చమత్కార సంభాషణను ఆస్వాదిద్దాం.
👉🏿ఒక శిష్యుడు, గురువుగారి దగర విద్య అభ్యసించి,
పెళ్ళి చేసుకొని ఊరికి వెలుపల ఇల్లు కట్టుకొని స్థిరపడ్డాడు. ఒకరోజు గురువుగారు ఎడ్లబండి మీద శిష్యుడి గ్రామం దారిలో వెళుతూ, ఒకసారి చూసి వెళ్దామని, శిష్యుడి యింటికి వచ్చాడు.

👉🏿రాక రాక వచ్చిన గురువు గారికి, శిష్యుడూ, అతడి భార్య చక్కని ఆతిథ్య మిచ్చి, తాంబూల సహిత పంచలచాపు యిచ్చి పాదాలకు నమస్కారం చేశారు. అప్పుడు గురువు గారు, ఒక శార్దూల వృత్తంలో (పద్యము), వేదమంత్రము వచ్చేట్టుగా చెప్పి ఆశీర్వదించారు.

👉🏿అప్పుడు చమత్కారియైన శిష్యుడు నవ్వుతూ, "గురువుగారూ, ఆతిథ్యం స్వీకరించి మా యింట శార్దూలమును (పులిని) విడిచి వెళ్ళుట మీకు న్యాయమేనా?" అన్నాడు.

👉🏿దానికి గురువుగారు నవ్వుతూ, "ఆ శార్దూలమును మంత్రించి వదిలేశాను. నీకు ఏలాంటి అపకారం చేయదు. అదీగాక, నీవు ఊరి వెలుపల ఇల్లు కట్టుకున్నావు. పంచమీ తత్పురుషము లేకుండా ఈ షష్టీని కాపలాగా పెట్టానని" అన్నారు.

👉🏿పంచమీ తత్పురుషానికి అందరూ చెప్పే ఉదాహరణ 'దొంగవలన భయము'. షష్టీ తత్పురుషానికి 'కుక్క యొక్క కాపలా'. అంటే, గురువుగారు, దొంగ వలన భయము లేకుండా శార్దూలాన్ని కాపలా పెట్టారన్నమాట.

👉🏿ఆ కాలం వాళ్లు, ఈ కాలం వాళ్ల లాగా, గుమ్మం దగ్గర నుండే టాటా, బై బై చెప్పేవారు కాదు. గురువుగారిని బండిలో ఎక్కించి, "మీరు మళ్ళీ మా యింటికి దయచేయాలి అని మర్యాద పూర్వకంగా అనేవారు". శిష్యుడు కూడా అలాగే అన్నాడు.

👉🏿అందుకు గురువు గారు నవ్వుతూ, "నీవు ద్వంద్వా తీతుడయిన తర్వాత వస్తానులే" అన్నాడట. ద్వంద్వ సమాసమునకు ఉదాహరణ, 'భార్యా భర్తలు', 'తలిదండ్రులు', 'అక్కాచెల్లెళ్లు' అని ఉంటుంది.

👉🏿ద్వంద్వాతీతుడంటే మీ భార్యాభర్తలు తలిదండ్రులు అయినప్పుడు, అంటే, "మీకు సంతానం కలిగినప్పుడు మళ్ళీ వస్తానని" అర్థము. పూర్వకాలము పండితులు కలిసినప్పుడు, ఇంత చమత్కారముగా మాట్లాడేవాళ్ళు.

👉🏿, మనం ఎలాగూ మాట్లాడలేము. కనీసం విని ఆనందిద్దామని మీకు ఈ వ్యాసంలో తెలియజేస్తున్నాను.

చదివినందులకు ధన్యవాదాలు.


శ్రీమతిగారు!
ఇవాళ అధ్భుతమైన భోజనము చేసినట్లుగా కలొచ్చింది!

మీ కలలో కన్నా అత్యధ్భతమైన వంటకాల రుచి ఈరోజు చూడబోతున్నారు శ్రీవారూ!

ఆహా! ఏమి నా భాగ్యము!
ఇలలో స్వర్గమంటే ఇదేరా!
శ్రీమతిగారూ! నీకేమి కావాలో కోరుకో మరి!

వద్దులెండి, మీకిబ్బందిగా వుంటుందేమో?

నీ కోరిక తీర్చకుంటేనే నాకు నరకం తెలుసా?

అంత మాటనకండి పతిదేవా!
ఇదిగో నా చిట్టా!
1 మా అమ్మ నాన్న అన్నయ్య వదిన చెల్లి మరది వాళ్ళ సంతానాలూ వస్తున్నారు,
వాళ్ళందరినీ జాగ్రత్తగా టేక్సి లో ఇంటికి తెండి
2 వాళ్ళున్న నెల్లాళ్ళు సెలవు పెట్టి అనేక ప్రదేశాలు తిప్పండి
3 వాళ్ళు వెళ్ళేప్పడు ఘనంగా సత్కరించి సాగనంపండి!
మీ పాద ధాసి ఈ చిరు కోర్కె తీర్చండి ప్రభూ!
--((**))--
భార్య : ఏవండోయ్.. ఇవాళ సాయంకాలం తొందరగా ఇంటికి రండి సినిమాకు వెళ్దాం....

భర్త : నా దగ్గర TRS 🚙గుర్తేమైనా ఉందా, ఉండేది TDP🚲 గుర్తు... ఆలస్యం అవుతుందేమో!

భార్య : సకాలానికి వస్తే BJP🌹 గుర్తు, ఆలస్యమైతే కాంగ్రెస్✋ గుర్తు, మరీ ఆలస్యమైతే AAP🏒 గుర్తు మీకు స్వాగతం పలుకుతాయి. ఆ తర్వాత మీ ఇష్టం....
.
.
.
.
.
ఇంకా నయం ఈ మహాతల్లికి CPI గుర్తు గుర్తురాలేదు...
--((**))--
అప్పుడే స్నానం చేసి బెడ్ రూం లోకి వచ్చాడు భర్త.
మంచం మీద తాపీగా కూర్చుని వున్న భార్య ని చూసి...

భర్త:- ఏమిటీ! ఇంత ఆనందంగా వున్నావ్?

భార్య:- తీసేసానండీ. (నవ్వుతూ)

భర్త:- ఏమి తీసేసావ్?

భార్య:-మీ సెల్ ఫోన్ వాట్సప్ లో మిమ్మల్ని "వైరస్" గ్రూప్ నుంచి తీసేసాను.

భర్త:- నీ బొంద అది “VIRUS” గ్రూప్ కాదే “VIRA’S” గ్రూప్. వీర రాఘవయ్య స్కూల్. అది మా టెంత్ క్లాస్ బ్యాచ్ మేట్స్ గ్రూప్.

భార్య:-ఏమో నాకేమి తెలుసు? మొబైల్ లో వైరస్ ఉండకూడదు కదా! అందుకని తీసేసాను.

భర్త:-ఇంకా ఏమి తీసేసావ్?

భార్య:- “N.V.” గ్రూప్ నుంచి కూడా తీసేసాను.

భర్త:- ఓసి నీ మొఖం మండా !!! “N.V.” అంటే “నూకల వెంకటరత్నం కాలేజ్”. అది మా ఇంటర్ బ్యాచ్.

భార్య:-ఏమో నాకేమి తెలుసు? నాన్ వెజ్ జోకులు ఉండకూడదు కదా! అందుకని తీసేసాను.

భర్త:-అంతేనా ఇంకా ఏమన్నా తీసేసావా?

భార్య:-"గాలి" గ్రూప్ నుంచి కూడా తీసేసాను.

భర్త:- ఓసి నీ అయ్యా అది !!! “గాలి చిన వెంకటేశ్వర్లు కాలేజ్”. అది మా ఇంజినీరింగ్ బ్యాచ్.

భార్య:-ఏమో నాకేమి తెలుసు? గాలి కబుర్లు చెప్పుకోకూడదు కదా! అందుకని తీసేసాను.

భర్త:-ఓసి నీ సిగ తరగా!!! అసలు ఇవన్నీ చేయటానికి నీకు నా మొబైల్ పాస్ వర్డ్ ఎలా దొరికింది?

భార్య:-మీ పేరు పెట్టా, నా పేరు పెట్టా, మీ అమ్మ పేరు పెట్టా, మీ నాన్న పేరు పెట్టా, మన అమ్మాయి పేరు పెట్టా, ఎన్ని ట్రై చేసినా కుదరలేదు.

భర్త:- మరి ఎలా తెరిచావే తల్లీ?

భార్య:-చివరి ప్రయత్నంగా మన పని మనిషి "సుందరి" పేరు నొక్కా!!! దెబ్బకి తెరుచుకుంది ...

#అందుకే_నా_మొబైల్_పాస్_వర్డ్_ఎవరికీ_తెలియనిదీ_అసలెవరూ_ఊహించనిదీ_పెట్టుకున్నా_లేపి_తన్నించుకోవడం_ఎందుకులే_అని
--((**))--

నేటి హాస్యం
శ్రీవారూ! I love u So much!

ఏమైనా కావాలా శ్రీమతిగారూ?

ఏమీ అఖ్ఖర్లేదు శ్రీవారూ!
రేపు మా చెల్లి వస్తుంది, శ్రీ రామ చంద్రుడు లా వుండండి చాలు!!!
--((**))--
సుషీ! నీ మీదొట్టు!
తాగడం మానేసి షాలా సంచ్రాలయిందే!
నీ హ్రుదయంలో కాస్త చోటు ఇవ్వవే!

పానకాలు గారూ! మీ ఇల్లు పక్క వీదిలోనుంది! వేగంగా దయచేయండి,
ఈలోగా మా ఆయన గాని వచ్చారో,
మీ స్థానం హ్రుదయాల్లో కాదు,
స్మశానవాటికలో వుంటాది!
--((**))--
బావా! నా పాలకోవా!
ఈ జన సంచారము లేని అడవిలో
మనమిద్దరమూ
డ్యూయెట్ పాడుకందామా?

ఏం పాట?

నీ యిష్టమే!

నాకిష్టమైన పాటలలో నువ్ దేనికి సూట్ అవవే!
చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది
పాడదామంటే నువ్ డ్రస్ వేసుకున్నట్లు తదేకంగా చూస్తే గాని తెలీదు

నా హ్రుదయంలో నిదురించే చెలీ అని పాడదామంటే నీకు నా ఆస్తుల మీద పడుక్కోవడము మాత్రమే ఇష్టం

నీ జెడ వలపు పాశమవి బెదరితిలే అని పాడదామంటే నీ వున్న జుత్తునే తగ్గించేశావు

లేదనిపించే నీ నడుము పాట పాడదామంటే నడకలో పందెం కడితే తాబేలు నీ కన్నా ముందుంటుంది

తీగెలాంటి నడుము దాన అని పాడదామంటే నీ నడుము దట్టమైన వటవ్రుక్షంలా వుంటుంది

ఇది అయే పని కాదు గాని నీకు రెండు గంటల సేపు తినగలిగే తిసు భండారాలు తెస్తాను.
అవి హాయిగా తినేస్తే ఇంటికి పోదాం

బావోయ్
తంధూరీ చికెన్ తేవడం మర్చిపోకేం!
--((**))--

--((**))--
మీరిప్పుడు కరెంటు కుర్చీలో కూర్చున్నారు.
మరి కొద్ది క్షణాలలో మీరు ప్రాణాలు కోల్పోతారు.
మీ ఆఖరి కోరికేమైనా వుంటే చెప్పండి?'

మీరు తీర్చలేరు వదిలేయండి సార్!

నా మాట నమ్మండి...
ఎటువంటి కోరికైనా నేను తీరుస్తాను

అయితే సరే సార్! నేను మిమ్మల్ని నమ్ముతున్నాను
కరెంటు ఇచ్చినప్పుడు చేతికి ఏ విదమైన తొడుగూ లేకుండా మీరోసారి నా చేతిని ముట్టుకోండి'..!
--((**))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి