9, జనవరి 2019, బుధవారం


మాత్రాబద్ధ  సూక్తులు (1)
రచయత మల్లాప్రగడ రామకృష్ణ 

గిరిగీచుక కూర్చొనఁ బోకు
సరి లేరని నాకెవరెట్లు
మరియాదగనుండుట మేలు
ధరనెచ్చట నున్నను గాని

సమయోచన చేయుట మేలు 
కళలన్నియు పొందుట మేలు  
ధరలన్నియు పెర్గుట వళ్ళ 
తినకుండుట ఆశలు చెల్లు 

ప్రమదావన సౌఖ్యము ఇంత
అని ఎవ్వరు చెప్పను లేరు 
మదిలోకల భాగ్యము ఇంత 
అని చెప్పుట సఖ్యత లేదు 

మన కక్కర  లేనిది ఖర్చు 
మనసివ్వని కష్టపు ఖర్చు 
వయసివ్వని మూర్ఖపు ఖర్చు 
పరులెవ్వరు చేయని ఖర్చు 

నదులేమన దాహము తీర్చు 
ధరణీమన ఆకలి తీర్చు 
వనితేమన కోరిక తీర్చు          
మనసేమన ఆశలు తీర్చు 

నిజమేమన బాధను తీర్చు 
తపనే మన ఆశను తీర్చు   
వలపేమన ఆకలీ తీర్చు 
తనువేమన మాటను మార్చు  

--((**))--

మాత్రాబద్ధ  సూక్తులు (2 )
రచయత మల్లాప్రగడ రామకృష్ణ 

గురుపాదము గొలుచుకొమ్ము
గురుసేవల సలుపుచుండి
కరుణన్ గని సకల జనుల
తరుణమ్మున సాయమిడుము

జననీ జనకులకు ప్రేమ 
సహనం తెలుపుటను సేవ 
లను చేసి మనసున హాయి  
గొలుపే పలుకులు తపస్సు 

సమయాసమయముల వల్ల 
బతుకే భయ సుఖము వల్ల 
కలకే నిద్రచెడుట వల్ల 
మనసే మనుగడయు గుల్ల 

చిరునవ్వుల సుఖము వల్ల    
కవిచెప్పు గళముల వల్ల 
కవివ్రాయు కవితల వల్ల
మనువాడు వనితల వల్ల
   
నెలవంక శుభముల వల్ల
సెలయేరు కదలిక వల్ల 
సుమగంధపు లతల వల్ల
తరణం మనసును చిగుర్చు 

--((**))--


మాత్రాబద్ధ  సూక్తులు (౩ )


రచయత మల్లాప్రగడ రామకృష్ణ

అతిగానెటఁ బల్కఁ బోదు 
మతినుంచుము సేవ పోదు 
గతి మార్పుకు ఆశ రాదు 
చెడువాసము చేయ రాదు 

పరు లెవ్వరు చేయ లేదు 
మమతెవ్వరు పంచ లేదు 
మనువాడుట మంచి లేదు  
మనసున్న విపంచి   లేదు  

చిరు హాసపు చూపు లేదు 
పలు పల్కుల హాయిలేదు 
తెలివన్నది  చూప లేదు  
కల యన్నది ఒప్పలేదు 

మన కళ్ళను నమ్మ లేదు 
మన వాళ్ళను చూడ లేదు 
మన హాయిని తెల్ప లేదు
మన పోరుని ఆప లేదు    

రమనామము ఒప్ప లేదు 
అణుశక్తియు ఇవ్వ లేదు 
జననామము తప్ప లేదు 
శివనామము తప్పలేదు


----((**))--


**మధురవాణి 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

పట్టుదల ఉన్నచోట శుభంతో 
విజయం మీకు తధ్యమంటున్నది 
మౌనం ఉన్నచోట మమతలతో 
కోరికను సంతోషంతో ఇమ్మంది 

బాధ్యత ఉన్నచోట కర్తవ్యంతో 
స్నేహభావంతో మెలగమన్నది 
స్త్రీగౌరవం లేనిచోట ప్రేమతో 
ధైర్యంతో బ్రతకాలంటున్నది

మనసున్నచోట మానవత్వంతో 
నవ్వులతో బ్రతకమంటున్నది
కన్నీరు ఉన్నచోట ప్రేమలతో 
హాస్యముతో బ్రతకమంటున్నది 

చీకటి ఉన్న చోట వెలుగు తో 
తపనతో బ్రతకమంటున్నది 
స్నేహ భావాల ప్రేమ పరీక్షతో 
వినయంతో బ్రతకమంటున్నది 

గమనించుము సృష్టి రచన 
మనదేశము వృద్ధి యగును 
మనభావము శుద్ధి యగును 
మనమేకము బుద్ధియగును

తల్లితండ్రు లందరి ప్రేమ     
మెల్లఁగాను చల్లగ ఉండు 
కల్ల బొల్లి మాటలు వద్దు 
ఇల్లె నిత్య శోభలు చేర్చు 

తల్ల డిల్లు బోదలు వద్దు 
డొల్ల పల్కు శోధన వద్దు 
కళ్ళ లాడి సేవలు వద్దు 
వళ్ళు గుల్ల చేయుట వద్దు 

చల్ల ఇచ్చి ముద్దులు వద్దు
అల్ల రవ్వగా కల వద్దు 
గుల్ల చేసి నవ్వులు వద్దు 



UI-UII - UI - UII UUUU

ఓర్పు నీదియుఁ కాని శోధన నాదేనమ్మా
తీర్పు నీదియు కాని ఆచర నేలేదమ్మా 
మార్పు నీదియు కాని సాధన యేలేదమ్మా
నేర్పు నీదియు కాని నిత్యము కష్టాలమ్మా

ఊహ గా బ్రతకాలి ఆశలు నీవేనమ్మా
ఆశ గా బ్రతకాలి ఊహలు  నీవేనమ్మా
సేవ గా బ్రతకాలి దారులు నీవేనమ్మా
తెల్వి గా బ్రతకాలి దీవెన నీదేనమ్మా

ప్రేమతో నిరతమ్ము మశ్చిక చూపాలమ్మా
తెల్విగా విజయమ్ము వచ్చుట చూపాలమ్మా
కొల్వుగా నిరతమ్ము బాధ్యత చూపాలమ్మా
ప్రేమగా కనుచూపు పల్కులు పంచాలమ్మ 

శక్తి   తో  దినమంత  కష్ట పడాలేనమ్మా
ముక్తి కోసము కొంత కష్ట పడాతానమ్మా
యుక్తి తో మనసంత ఇష్టము చూపాలమ్మా
భక్తి తో దినమంత  పూజలు చేస్తానమ్మా

ఊహ  నీదియు కాని చేతలు నా వేనమ్మా
ఊహ గా బ్రత కాలి   ఆశలు నీ వేనమ్మా
ఊహతో  జత జంట  ప్రేమల నా బాంధవ్యం
ఊహాగా  లత లేలు    అల్లిక  నీ భంధమ్మే

సౌర్యమే మనకుండు - రక్షణ కల్పిద్దామూ 
ధైర్యమే  మనకుండు - శిక్షణ ఇచ్చేద్దామూ
ప్రేమయే మనకుండు ప్రేమను పంచేద్దామూ
దేహమే మనకుండు - సేవలు  చూసేద్దామూ

--((**))--
 

   తప్త - స/భ/త/త/గ
13 అతిజగతి 2356
IIU UII UUI UUI U -13

కథలే  తెల్పుచు సందర్భ సంఘర్షణే
సమరం జీవిత సంగ్రామ భాష్యాలలో 
సహనం మార్గముగా భావ ప్రాధాన్యతే
మరులే గొల్పుచు భావాల సాహిత్యమే

సమయానందము దేహాభిమానాన్ని పొం
దుట వల్లేనని దానాలు ధర్మాలు చే
యుట వల్లేనని సాహిత్య కావ్యాలు భో
దలు వల్లేనని నీప్రేమ వల్లే రమా

చిరునవ్వే మన ప్రేమాభిమానాలు సా
దర ఆహ్వానము ప్రేమామనో భావ సే 
వలు చెయ్యుటకు శ్రీనాధ సౌఖ్యము పొం
దుట కే స్త్రీల కు నవ్వుల ఆశే రమా    

--((**))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి