14, జనవరి 2019, సోమవారం

ఆరాధ్య భక్తీ లీల - 50



ఆరాధ్య భక్తీ లీల - 50   

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

అణువణువు ఆక్రమించి, అలివి మీరిన

భయాన్ని తొలగించేటి మమతల సింహము
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడే   

ఆది అంతము వరకు ఆక్రమించిన,

ఆది పురుషుని ఆకర్షించే పెను సింహము
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడే 

బ్రహ్మాదులు, వేదాంతతతులు, తెలుసు 

కోలేని ప్రేమను పంచే ఘన సింహము
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడే 

కళ్ళతో ప్రేమను పంచి, కళ్ళతోనే

భయము తొలగించే జిగి సింహము
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడే 

తరుణి కౌగిట జేర్చి, మనసు ఊరడించి

సంత్రృప్తి కల్పించే శ్రీ నరసింహము
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడే 

అధర్మపరులను అంతము చేసి ధర్మాన్ని 

రక్షించి శాంతి కల్పించే సంహార సింహము
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడే 

వేంకటాద్రిపే, వేదాచలముపై, శీఘ్రంగా

పెరిగి లోకాలన్నీ నిండి బెరిగిన సింహము
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడే 


--((**))--



ఆరాధ్య భక్తి లీల -49

రచయత : మల్లాప్రగడ రామకృష్ణ  

కను రెప్పల మాటున దాచావు    
పెదవంచున నవ్వును నిల్పావు
బ్రమరమ్ముగ కృష్ణను మార్చావు   
విహరించియు మక్కువ చూపవు      
శ్రీ శ్రీ శ్రీ  తిరుమల తిరుపతి వేంకటేశా 

తలచి వలపుల్లో బంధించావు 
మనసు మలుపుల్లో ఇర్కించావు
తనువు తలపుల్లో తర్కించావు    
పగలు జపముల్తో నమ్మించావు 
శ్రీ శ్రీ శ్రీ  తిరుమల తిరుపతి వేంకటేశా 

మనస్సును మైకంలో ముంచేసావు   
వయస్సును మౌనంలో దాచేసావు  
ఉషస్సును రూపంలో చూపేసావు 
యశస్సును గోప్యంతో పంచేసావు 
శ్రీ శ్రీ శ్రీ  తిరుమల తిరుపతి వేంకటేశా 

నవ్వుల చూపులకు దక్కినావు
పువ్వుల వాసనకు  చిక్కినావు 
రివ్వున ఆశలతొ నిల్చినావు
జివ్వున ఊహలతొ మల్చినావు    
శ్రీ శ్రీ శ్రీ  తిరుమల తిరుపతి వేంకటేశా 

ఆరాధన హారతి అందించావు  
మంత్రంమెదొ నేర్పుగ వేసేసావు 
మాటల్తోను నేర్పుగ దాచేసావు 
ప్రేమల్తోను ప్రార్ధన చేసేసావు       
శ్రీ శ్రీ శ్రీ  తిరుమల తిరుపతి వేంకటేశా 

---((**))--


ఆరాధ్య భక్తి లీల -*48

రచయత : మల్లాప్రగడ రామకృష్ణ  
భావం : అంతా నీవే, నీవు లేని ప్రాంతము అంటూ లేదు అంత నీవే    

అంతట నీవే నీవే,  అంతరాత్మలో నీవే  

కలియుగంలో, వేంకటేశ్వరునిగా నీవే 
శ్రీ శ్రీ శ్రీ  తిరుమల తిరుపతి వేంకటేశా 

సకలభూతాలలో ఉండే జీవశక్తివి  నీవే 

సర్వాంతర్యామిగా  ఉండే దైవం నీవే
ఓషధులను వృద్ధిచేసే సూర్య శక్తివి  నీవే
ప్రత్యక్షదర్శనమిచ్చే దైవమ్ము నీవే   
శ్రీ శ్రీ శ్రీ  తిరుమల తిరుపతి వేంకటేశా 

జఠరాగ్నిని శాంతపరిచే ఉదరశక్తివి  నీవే 

అన్నపు శక్తిని పెంచేటి  దైవం నీవే 
స్మృతి, విస్మృతి కల్పించే, గుండె శక్తివి  నీవే
వాయు శక్తిని పంచేటి దైవమ్ము నీవే 
శ్రీ శ్రీ శ్రీ  తిరుమల తిరుపతి వేంకటేశా 

సర్వానికి జ్ఞానం అందించే వేదశక్తివి  నీవే

అంతర్గత భావన్ని కల్పించే దైవమ్ము నీవే 
భక్తునికి నిజం తెలిపే వివేకమ్ము నీవే  
వినయ విధేయతా భావమ్ము నేర్పేది నీవే 
శ్రీ శ్రీ శ్రీ  తిరుమల తిరుపతి వేంకటేశా 

అంతట నీవే నీవే,  అంతరాత్మలో, నీవే  

కలియుగంలో, వేంకటేశ్వరునిగా, నీవే 
శ్రీ శ్రీ శ్రీ  తిరుమల తిరుపతి వేంకటేశా 

--((**))--


ఆరాధ్య భక్తి లీల -47 

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
            
చిక్కని చీకటిలో చలి గాలులు
కొండ కోనేరులో తుషార జల్లులు 
సొగసు మబ్బుల మెర్పు వరుసలు  
గల గలల అలల నురగల

కొమ్మ కోన ఉరకల పరుగులు  

అంబరాల వెలుగుల మెరుపులు 
తిరుమల తిరుపతి కళ
దర్శనం కొరకు భక్తుల వరుస    

సప్తగిరి సమాచార ప్రకటనలు  

వసతిలోక వీధులలో జనులు   
బ్రేక్ దర్శనం అంటూ ఆపటం   
భక్తులను పట్టించుకొని అధికారులు
  
నిరుత్సాహంతో తిరిగివెళ్ళే భక్తులు
8 గం వెళ్లిన 12 గంటలు వెచ్చియున్న 
దర్శనం పొందని పరిస్థితులు     
ఇలా ఉంటె నిన్ను నమ్ముకొన్న భక్తులకు 
దారిచూపవా శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 
--((**))--

ఆరాధ్య భక్తి లీల - 46

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

చాందినీ గుడ్డ మెరుపు ఒక వైపు

నీలి మేఘాలు పరుగు మరో వైపు
కోకిల స్వర మాలికలు ఒక వైపు
నెమలి మురిపం కూతలు మరోవైపు

మాకు ప్రక్రృతిని అందించి 

పరవశించి పోతున్నావా 
శ్రీశ్రీశ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

నీసన్నిధిలో వసతి కోసం ఒక వైపు

నీ సన్నిధిలో దర్శనం కోసం మరో వైపు
నీ సేవలో ఆరాధ్య మంత్రాలు ఒకవైపు
సదుపాయాలు సరిలేక భక్తులు మరో వైపు

నీ లీలలు తెల్సుకోలేని 

మానవుల్లో నేనొకడ్ని
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా
--((**))--

*ఆరాధ్య భక్తి లీల* - 45

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 


శ్రీ వేంకటేశ్వర మేలుకో 

శరణాగతి అన్నవారిని ఏలుకో

సమాంతర సమర్ధతను గమనించి

తనువుకు తరుణానంద శక్తిని కల్పించి
వినయ విషయానంద మనుగడ పంచి
మనోమయం మరలకుండ మోనశక్తి పెంచి
మమ్మేలుటకు మేలుకో 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తీరుపతి వేంకటేశా

ధైర్యాన్న నింపి అధైర్యాన్ని తిలగించి

చెడును తొలగించి మంచిని అందించి
శౌర్యాన్ని అందించి వినమ్రతను పంచి
నిత్య సౌభాగ్యం అందిచే ప్రేమను పంచి
మమ్మేలుటకు మేలుకో
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తీరుపతి వేంకటేశా
శ్రీ వేంకటేశ్వరా మేలుకో 
శరణాగతి అన్నవారిని ఏలుకో
నమో నమో నమః
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా


-((*))--

*ఆరాధ్య భక్తి లీల* - 44
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఏమని చెప్పేది ఎలా చెప్పేది 

ఈమాట విన్నా, ఏ నోటా విన్నా నీ నామమే  
తిరుమలపై ఏభాష చూసినా నీ ఆలాపనే  
ఒక వైపు సుప్రభాత కీర్తనలు
మరోవైపు భక్తుల ఆనంద హేళలు 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా    

నయనాల సొగసులు కష్టమ్మే పోళ్చటం

యుక్తి బోధతో చేస్తున్నాము ప్రదక్షణలు   
తరుణాన్నీ సద్వినియోగము చేయాం 
భక్తి తో పఠించటమే   నీ కీర్తనలు
        
అనురాగ తలుపుల  కారుణ్యం 
మాకు తలచే వేదమంత్రాలు  
అపురూప మహిమల చూపించి  
కరుణించే సప్తగిరివాసా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా  

--((**))--



*ఆరాధ్య భక్తి లీల* - 43

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

అండ పిండ  బ్రహ్మా౦డ చక్ర ధారి
ఆత్మీయత తో ఆదుకున్న ధారి
అరవీర భయంకరుల గుండెను కూడా
కరుణ రసముతో దయ చూపిన 

శ్రీ  తిరుమల తిరుపతి వేంకటేశా 

ఆణువణువూ ఆవరించిన శ్రీ వెంకటేశ్వరా
నమో నమో శ్రీ వెంకటేశ్వరాయ
నమో నమో శ్రీనివాసయా నమో నమ:

చిత్ర విచిత్రాల దర్శకేంద్రా
శృంగారా సాహిత్య అభిలాషా
ప్రార్ధనకై మోక్షము నందించి
మనస్సును ప్రశాంత పరిచి
సుఖ శాంతులను అందించి
మమ్ము ఆదుకునే మహానుభావా

శ్రీ  తిరుమల తిరుపతి వేంకటేశా 

ఓం నమో వేంకటేశాయ నమో నమ:
ఓం నమో శ్రీనివాసాయ నమో నమ:
గోవిందా గోవిందా గోవిందా         

శ్రీ  తిరుమల తిరుపతి వేంకటేశా 
--((**))--



*ఆరాధ్య భక్తి లీల* - 42

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

నమోవెంకటేశా - నమోశ్రీనివాసా
నమో లక్ష్మిదేవీ - నమోశ్రీదెవీ

సదాసేవ చేస్తా - సదా పూజ చేస్తా

సదా వేడు కుంటా  - సదా ప్రార్దిస్తా

సుఖం కోరు కోనే - దుఃఖం కోరు తానే

మోసం జోలు పోనే - మౌనం పాటిస్తా   

కళా పూర్ణ రూపా - కధా న్యాయ రూపా

మనో సంత రూపా - మనో దర్శకా

ప్రజా మాయ నీదే  - ప్రజా వెల్గు నీదే

ప్రజా శక్తి నీదే - ప్రజా బాధ్యతే     

మనోనేత్ర మాయా - మనో పృథ్వి దేవా 

మనో దివ్య తేజా - మనో అర్పితా      

రమా బంధ రూపా - రమా మోక్ష రూపా 

రమా తేజ రూపా - రమా దైవమే   

అరాళమ్ము లాశా - స్వరూపమ్ము గాదా

మరాళమ్మువోలెన్ - మదిన్ నిల్వ రా

నమోవెంకటేశా - నమోశ్రీనివాసా

నమో లక్ష్మిదేవీ - నమోశ్రీదెవీ

ఆణువణువూ నిండిన దైవం 

నిరంతర స్మరణ దైవం 
మమ్ము రక్షించే మా దైవం 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 
--((**))--

*ఆరాధ్య భక్తి లీల*- 41 
ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

స్మరణ జొచ్చుట నావంతు

 - కర్మను తీర్చుట నీవంతు 
పూలతొ పూజించు నావంతు
 - సంపద పంచుట నీవంతు      
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

మోక్కులు తీర్చుట నావంతు 

- శాంతిని ఇచ్చుట నీవంతు  
కోరిక చెప్పుట  నావంతు
 - మాటను నిల్పుట నీవంతు 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

పరమపురుష శ్రీపతివి నీవైనావు   

పరిపూర్ణ లక్ష్మీ పతివి గా ఉన్నావు 
భక్తులకు పరమాత్మగా మారవు   
మమ్మల్ని ఆదుకొనే మహాపురుషుడ వైనావు   
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా


--((**))--

*ఆరాధ్య భక్తి లీల*- 40 

ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

దండము పెట్టుట నావంతు 

- తప్పుల రక్షణ నీవంతు 
ధర్మము పల్కుట నావంతు
 - అర్ధము చెప్పుట నీవంతు   
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

కప్పము కట్టుట నావంతు

 - శక్తిని ఇచ్చుట నీవంతు 
దైవము కొల్చుట నావంతు
 - అల్పుని దీవెన నీవంతు   
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

అండగ ఉండుట నావంతు

  - బంధన ముక్తియు నీవంతు  
దాసుగ పండుట నావంతు 
- కర్తను గాచుట నీవంతు 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా


--((**))--


ఆరాధ్య భక్తి లీల -39 

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

ఏమని వర్ణించను దివ్య ఆభరణ స్వరూపాన్ని

మానస కలానికి అందని రూప లావణ్యాన్ని
ఆనందం వ్యక్తపరిచే ఆకాశం వెల్గు వైభవాన్ని
దివికాంతుల సురచిర అమోఘ సుందరత్వాన్ని  
దర్శనమందించావు  శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా   

రవికాంతుల రమణీయ నిర్మల రాజసత్వాన్ని

చంద్రని వెన్నెల వెల్లువిరిసిన పూర్ణ బింబాన్ని
శుఘంధ పరిమళాలను పంచె వాయు మృదంగాన్ని
తరంగాల మంజీర నాద గమకాల గమనాన్ని  .
మాకందించావు  శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

మంచు తెరల తుషార బిందువుల చల్లఁదనాన్ని

చిలుకు తొలకరి పూల జల్లుల శీతలత్వాన్ని     
మధుర కోకిల సంగీత స్వర మాధుర్య గానాన్ని
ఉషోదయ ఆరోగ్య ఔషద ఆకర్ష కిరణ మార్గాన్ని 
మాకందించావు  శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

శ్రీ శ్రీ శ్రీ వెంకటేశా సమస్తము  నీ ఆకర్షణకు లోనై

తమతమ లక్షణాలను వెళ్లబుచ్చాయి.
నేను సామాన్య మానవులమ్  నీ కరుణా కటాక్ష వీక్షణాలు
మాపై చూఫు  శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా    

--((**))--



ఆరాధ్య భక్తి లీల (38)
మల్లాప్రగడ రామకృష్ణ 

పట్టు పీతాంబరముల చుట్టుకొనువాడు..

పసిడి పిల్లని గ్రోవి ధరియించువాడు ..
కాటుకతో అందమునిచ్చు కనులవాడు
శిఖి నందు పింఛమమరిన. చిన్నవాడు.
శ్రీ శ్రీ శ్రీ తిరుమల  తిరుపతి వేంకటేశ్వరుడు 

వెలుగు విరజిమ్ము పసిడి మోమువాడు

నీలి మేఘ జలదంపు మేని వన్నె వాడు
సమస్త సాధు జనులను రక్షించు వాడు
ప్రేమతో పిలిస్తేనె ప్రత్యక్షమయ్యె వాడు
శ్రీ శ్రీ శ్రీ తిరుమల  తిరుపతి వేంకటేశ్వరుడు

ఆకాశం లో శాంతి నెలకొల్ప గల వాడు

భూమండలం లోనూ శాంతి నెలకొనువాడు
సముద్రజలం లో శాంతి నెలకొనువాడు
సమస్త ప్రాణుల్లో శాంతి నెలకొనువాడు
శ్రీ శ్రీ శ్రీ తిరుమల  తిరుపతి వేంకటేశ్వరుడు
--((**)--

ఆరాధ్య భక్తి లీల (37 )

మల్లాప్రగడ రామకృష్ణ 

పాద మంజీరా రవళుల పడుచువాడు

కరుణ సారించు దృక్కుల కన్నయ్యవాడు
వేణు నాదమ్ము జగమున లూగించువాడు
సకల జీవుల ఉల్ల మలరించువాడు.
శ్రీ శ్రీ శ్రీ తిరుమల  తిరుపతి వేంకటేశ్వరుడు

భక్తి, రక్తి ఇచ్చు అవతారమొందినాడు

భక్తల మనస్సు  బ్రోచిన భాగవతుడు
ఇహమునకు .పరమునకు ఈప్సితుడు 
ముక్తి.. మార్గమ్ము జూపెట్టెడి గీతాచార్యుడు.
శ్రీ శ్రీ శ్రీ తిరుమల  తిరుపతి వేంకటేశ్వరుడు

ప్రకృతి పరిధిని, మించి రక్షించు వాడు

పరిమితి నందు ధర్మాని కాపాడేవాడు
మనుష్యుల దేహాలల్లో దేవుడై ఉంటాడు
లీలతో ఆగమ లక్ష్యాన్ని పూర్తి చేస్తాడు
శ్రీ శ్రీ శ్రీ తిరుమల  తిరుపతి వేంకటేశ్వరుడు


--((*))__



ప్రాంజలి ప్రభ- 36   
మల్లాప్రగడ రామకృష్ణ 

లేత పూబంతి ముద్దులకు 

మగువ మోము పొందుటకు 
మత్య కంటి చూపులకు 
మొదలు పెట్టె పేచీలకు 
లోన్గావా శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

మడతుక మడత పేచీకి 

మత్తకాశిని మత్తు చూపులకు 
మదిరినయన వేదింపునకు 
మదిరాక్షి మనుగడకు 
లోన్గావా శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 
  
లతాంగి పరిమళమునకు 
లతాతన్వి వీరత్వమునకు 
లతకూన మేలికౌగలింపుకు 
రోచన రూపలావణ్యమునకు 
లోన్గావా శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

రూపసి శృంగార చేష్టలకు  

రుచిరాంగి రాసాస్వేదముకు 
రూపరి పవళింపు పిలుపుకు 
రమణి రంజిల్లు చూపుకు 
లోన్గావా శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 


   --((**))--

ఆరాధ్య రక్తి లీల - 35
ప్రాంజలిప్రభ 
మల్లాప్రగడ రామకృష్ణ 

చెలి చన్నుల ఊపులకు  

చెలియ చమత్కార మాటలకు 
చిగురుబోడి చిరుహాసమునకు 
చిలుకలకోలోకి పొడుపుకథలకు 
లోన్గవా శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా  

చోరు లత చోరత్వమునకు  

చెలువ చామరం ఉడుపులకు 
జక్కువచంటి జిమ్ముకులకు 
జలజనేత్రి ఈదులాటకు
లోన్గవా శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

తనుమధ్య తాపత్రయమునకు 

ఝషలోచన ఆలోచనలకు 
తాటంకిని ఉబలాటలకు  
తాటంకావతి తాంబూలముకు 
లోన్గవా శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా


--((**))--

ఆరాధ్య భక్తి లీల- 34  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

శ్రీ వేంకటేశ్వరా నీతో అమ్మవార్లు ఎలా ఉంటారో 

అలా ప్రతి స్త్రీ పురుష మధ్య సఖ్యత ఉండేట్లు  
చేసే శక్తి నీదే, సకలలోకాలు సంరక్షణ నీదే కదా తండ్రి   

తోడైతది, నీడైతది,  తనువుకు , గూడైతది 

ఓర్పుతో వినయ విధేయతతో చెలియైతది
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

సుఖ సంతోషాల మేళవింపుతో రమ్యమౌతది
మనసుకు మమకారం అందించే మధువౌతది    
మధురగానంతో మురిపించే ఉత్తమ మౌతది 
ఉత్సాస నిశ్వాసాలకు శక్తి నిచ్చే ఊపిరౌతది  
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

సుఖానంద అనురాగ నాయికగా స్వీయోతది

నిత్య నవ యవ్వన సుఖాలు పంచే ముగ్దౌతది   
నిత్య విషయ కేళీ కళా కోవిద ప్రౌడౌతది  
సవితకు ప్రేమనంతా పంచేటి ముదితౌతది
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

అధికప్రేమలోముంచి స్నేహపూర్వక జేష్ఠ ఔతది

వ్యంగంగా కోపాన్ని ప్రకటించి ఊరించే ధీరఔతది   
ప్రేమనాకే సొంతమవ్వాలనేటి పేమగర్వితౌతది 
లోకాల్లో ఉండే బిడ్డలందరిని రక్షించే అమ్మోతది   

తోడైతది, నీడైతది,  తనువుకు , గూడైతది 

ఓర్పుతో వినయ విధేయతతో చెలియైతది
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

--((**))--



*ఆరాధ్య భక్తి లీల*- 33  

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

ఉపవాస వ్రతములు, నీ కోసం చేస్తున్నాను 

ధర్మ బోధ చేయుటకు సహక రించు తండ్రి      
సుమపూజ జపములు, నీకోసం చేస్తున్నాను 
న్యాయ బోధ చేయుటకు సహకరించు తండ్రి 
శ్రీశ్రీశ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా
   
సమ భావ తపములు, నీకోసం చేస్తున్నాను 
సత్య బోధ చేయుటకు సహకరించు తండ్రి  
నిను చేరి కరములు, జోడించే ప్రార్థిస్తున్నాను 
నిత్య బోధ చేయుటకు సహకరించు తండ్రి   
శ్రీశ్రీశ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

నియమాను సరముగ, దీపాలూ వేల్గిస్తున్నాను 

దీప బోధ చేయుటకు సహకరించు తండ్రి   
కనుపాప పరముగ, కాపాడుతున్నాను 
జ్ఞాన బోధ చేయుటకు సహకరించు తండ్రి  
శ్రీశ్రీశ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

మదిలోన మమతగ, ప్రేమమ్మే కల్పిస్తున్నాను 
ముక్తి బోధ చేయుటకు సహకరించు తండ్రి  
తరుణం నష్టమ్మే కాకుండా నిన్నే జపిస్తున్నాను  
శక్తి బోధ చేయుటకు సహకరించు తండ్రి  
శ్రీశ్రీశ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా


--((**))--


ఆరాధ్య భక్తి లీల (32)

రచయత : మల్లాప్రగడ రామకృష్ణ  

భక్తునికి  వివేక శక్తి నింపి ఆదుకోవయ్యా  

మంచిని నలుగురికి పంచే విధంగా మార్చవయ్యా 
ఆచరిస్తా నాకు నమ్మిన దైవం నివేనయ్యా 
వినయ విధేయతాభావం నాలో నింపవయ్యా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

సకలభూతాలలో, ఉండే, జీవశక్తి తెపవయ్యా  

సర్వాంతర్యామి ఉంది మమ్ము కాపాడవయ్యా  
ఓషధులను వృద్ధిచేసే సూర్య శక్తివి నీవయ్యా 
ప్రత్యక్షదర్శన మిచ్చే కలియుగ దేవుడవయ్యా  
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 
   
జఠరాగ్నిని శాంతపరిచే, ఉదరశక్తి పంచవయ్యా  
ధైర్యం నింపే అన్నపు శక్తిని మాకు పంచావయ్యా   
స్మృతి, విస్మృతి కల్పించే, గుండె శక్తి పెంచవయ్యా 
మాకు పంచభూతాల శక్తిని పంచి  ఆదుకోవయ్యా   
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

--((**))--

ఆరాధ్య భక్తి లీల (31)
రచయిత: మాలాప్రగడ రామకృష్ణ  

దోష పూరితమైన, కలియుగము ఉండగా 

నాకు భయమన్నది లేదు, నీవు తోడుండగా 

జన్మజన్మ పాపాలు, నన్ను వెంటాడు చుండగా 

శాపములా కోపం, నన్ను చుట్టు ముట్టు చుండగా   
ధైర్యము అందించే నా మనస్సులో నీ ఉండగా  
నీ నామ జపమే నాకు రక్షణగా ఉన్నది 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

దోష పూరితమైన, కలియుగము ఉండగా 
నాకు భయమన్నది లేదు, నీవు తోడుండగా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

ఇంద్రియాలు ఇబ్బందిగా తరుముతూ ఉండగా

కర్మ బంధాలు తాళ్లతో కట్టివేయు చుండగా    
నీ శరణాగతితో మన్నస్సు ప్రశాంతముగా  
బంధాలు విడువక నిన్నే ప్రార్దిస్తు ఉన్నాను    
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

దోష పూరితమైన, కలియుగము ఉండగా 

నాకు భయమన్నది లేదు, నీవు తోడుండగా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

శ్రీ శ్రీవేంకటేశ్వరా నిన్నే నమ్ము తున్నానుగా 

గతిగా శ్రీ లక్ష్మీ దేవి నాకు మాతృ మూర్తిగా   
నీ సేవలతో పరవశం చెందు తున్నానుగా
నీ కృపయే నాకు శిరోధార్యం అయి ఉన్నది    

దోష పూరితమైన, కలియుగము ఉండగా 

నాకు భయమన్నది లేదు, నీవు తోడుండగా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా
--((**))--


ఆరాధ్య భక్తి లీల-30 

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  

ఆశనిరాశగా మారింది ఇది ఏమి సోధ్యం 

ఇది కేవలం ఒక భక్తి పరీక్షగా భావిస్తాను 
ఊహించా కాలమార్పుల్లో ఇది ఒక మార్పని   
3  గంటలు మెట్లపై నడిచి వచ్చిన 
మీ దర్శనము కాదు కష్టతరమైనది
  
సమయానికి ఆధునిక యంత్రములు 
పనిచేయక పోవుట వల్ల ప్రసాదం పొందలేకపోతిని 
కనివిని ఎరగని విధముగా నడిచి వచ్చినా 
మీ దర్శనం వరుసలో 4 గంటలు పట్టినది 
అనగా అర్ధరాత్రి క్షణకాలం కూడా 
చూడకుండా రక్షకభటువలయం తోస్తున్నారయ్యా 

పోనీ కానుకలు సమర్పిద్దామంటే 

వరుసక్రమము లేని విధముగా 
ఒకటే తొక్కిసలాట హా హా కారాలు చేశారయ్యా 
 శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

 మూడురాత్రులు మూడుసార్లు నిన్ను 

దర్శనం చేసుకుందామని వచ్చానయ్యా 
ఆశ నిరాశ చేసే రక్షక వలయం ముందు 
భక్తుడు విన్నవించుకోలేని స్థితి తెచ్చినావయ్యా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా  

  
--((**))-- 
ఆరాధ్య లీల-29
రచయత మల్లాప్రగడ రామకృష్ణ

ఆకాశ మంత ఎత్తులో ఉండేనివాశి

పెళ్ళి కోసం అప్పులు చేసిన వాశి
అప్పులు తీర్చేందుకు నిలబడ్డవాశి
వడ్డీ కట్టేందుకు ప్రజామేలు స్థిరవాశి

పిడికెడు తలంబ్రాలు శిరంపై పోశి

ఓర చూపులతో మాయను చేసేశి
మదిలో ఉల్లాస్సంతో నవ్వు నవ్వేశి
శ్రీదేవి,భూదేవి వివాహ మాడినావయ్యా

సతులకు మమతాను రాగాలు పంచేశి

అలకలు చూపక సఖ్యత సేవలు చేశి
నిత్య ఆనంద సౌఖ్యాలు అందచేసేశి 
సమస్త ప్రజల ధుఃఖాలను తొలగించేటి
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

--((*))--

***
ఆరాధ్య భక్తిలీల -28***

రచయత మల్లాప్రగడ రామకృష్ణ

దివ్య దర్శనం అంటూ ఇష్టా రాజ్యంగా

ధర్మ దర్శనం అంటూ అధర్మ పరంగా
భక్తుల వసతి గ్రహాలు లేక ఇబ్బందిగా
మనుష్యుల ఓర్పును పరీక్షిస్తున్నావా దేవా

మోక్కలు తీర్చాలని నడిచి వచ్చామయ్యా

కంకణాలంటూ పలు ఇబ్బంది చేస్తున్నావయ్యా
పైసాతో పరమాత్ముడిని దర్శించ లేదయ్యా
కాలం నీదయ్యా మమల్ని ఆడిస్తున్నావయ్యా

అంతులేని ధనాన్ని ప్రజలు నీకిచ్చిన

కనీసం లడ్డూ ప్రసాదం లేకుండా చేసిన
అధికారులు ఇష్టా రాజ్యంగా మార్చిన
నీమీద భక్తితో నామనస్సు తెలుపుతున్నా

మామనస్సును అర్ధం చేసుకోవయ్యా

శ్రీ శ్రీ శ్రీ తిరుమల తీరుపతి వేంకటేశా
భక్తులు కోర్కలు తీర్చే మహానుభావా
కలియుగ వైకుంఠం యేలే నాయకా

--((*))--

ఆరాధ్య భక్తి  లీల- 27
ప్రాంజలి ప్రభ  
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ

పాల కడలి యందు ఉద్భవించిన కన్యవై 

- పరమ దయాల హృదయ తరుణి మల్లెవై    
వెంకటేశ్వర  పట్టపు మహారాణి వై 
- అలమేలు మంగగా ఆనంద పరిచినావు
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడికి 

- సమస్త ప్రజానీకానికి నాయిక వై   

ముని జన స్తోత్ర, మహలక్ష్మిదేవి వై
- సమస్త మారాధ్య కల్పవల్లీ దేవి వై
హృదయానంద భరిత అమృతాన్నివై
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడికి

వరలక్ష్మి, గజ లక్ష్మి, రాజ్యలక్ష్మి వై

- భాగ్య లక్ష్మి, శ్రీ లక్ష్మి, సౌభాగ్యలక్ష్మి వై   
సంతాన లక్ష్మి,, వెంకటా లక్ష్మి,దేవి వై 
శరణన్న వారికి  కొంగు బంగారమై 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరునకు  సతివై 

మమ్ము కన్నబిడ్డల్లా కాపాడే తల్లివై

- మాతగా తిరుమలేశ్వరుని దేవి వై     
మగువల కోరికలు తీర్చే గౌరి వై
- మముగన్న తల్లులకు తల్లివై  
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరునకు  సతివై 

అమ్మా మాకు నీవే దిక్కు

మీకే ఉంది కరుణించే హక్కు
మాకు అందిచవమ్మా అమృత వాక్కు
మా కోరికలు తీర్చి కాపాడే తల్లివి నివేనమ్మా  
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరునకు  సతివై 

--((**))--

ఆరాధ్య భక్తి లీల- 26 *****
ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ   

మళ్ళీ రాదు జరిగిన కాలం
- ఉన్న అవకాశం వదల లే  
కోల్పో వద్దు సహనము తీరం 
- మంచి సమయాన్నీ మరువ లే 
 శ్రీశ్రీశ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా
  
ఎంతో మార్పు జరిగిన భావం
-అన్న పలుకుల్లో  వరుస లే   
అమ్మా నాన్న వదలక ఉండు
- సేవ సమయాల్లో ఒకటి లే 
 శ్రీశ్రీశ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

పొందే శక్తి మనసున లక్ష్యం 
- విద్య వినయాల్లో కధలులే 
గొప్ప మార్పు కోరుకునే ధ్యేయం 
- ప్రేమ సుఖ సంతో షములుగా  
శ్రీశ్రీశ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

విజయ సాధించేంత వరకు - నా కృషి ఆపను  
చెలిమి గాతోడుండు వరకు - పట్టు విడవను 
గురువు తల్లీ తండ్రి కొరకు  - మాట మరువను  
సేవల త్యాగమ్మేను మనసు - మారదు ఎపుడు  

శ్రీశ్రీశ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

--((**))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి