13, జనవరి 2019, ఆదివారం

hasyam


స్వామీ వివేకానంద ఛలోక్తులు!
.
స్వామి వివేకానంద ఎంత గొప్ప వక్త అయినా అప్పుడప్పుడూ ఆయన ఉపన్యాసం మధ్యలో ఆయన్ను ఎగతాళి చేసేవాళ్ళూ ఉండే వాళ్ళు. అలాంటి వాళ్ళకు ఆయన సరైన రీతిలో జవాబిచ్చేవాడు. అలాంటి సంఘటనలు కొన్ని…
.
ఓ సారి ఇంగ్లండ్ లో ఉపన్యసిస్తూ ఇలా చెబుతున్నాడు “కొన్ని వేల సంవత్సరాల పూర్వం నుంచే అద్భుతమైన నాగరికతతో విలసిల్లిన భారతదేశం లా కాకుండా ఈ ప్రాంతం ఒకప్పుడు మొత్తం అడవులతో నిండి ఉండేది”. అసలే ఆంగ్లేయులకు తమకే అన్నీ తెలుసన్న అహంకారం ఎక్కువ. ఇక ఇలా చెబుతుండగా శ్రోతల్లో ఉన్న ఇంగర...్ సోల్ అనే రచయితకు చిర్రెత్తుకొచ్చింది. అతను వెంటనే ఒక కాగితం పై “I will kill you” అని రాసి స్వామి మీదకు విసిరేశాడు. స్వామి దాన్ని తీసి బిగ్గరగా చదివి అందరికీ వినిపించి “చూశారా! ఇప్పుడే మీ అనాగకరికత్వానికి ఇంకో ఋజువు దొరికింది” అన్నాడు.
.
మరో సమావేశంలో ఎవరో భగవద్గీత పుస్తకంపై మరేవో మత గ్రంథాలు పేర్చి స్వామి దగ్గరకు వచ్చి ” చూశారా ఇదీ భగవద్గీత స్థాయి” అన్నారు. స్వామి భగవద్గీత పుస్తకాన్ని ఒక్కసారిగా పక్కకు లాగడంతో మిగతా పుస్తకాలన్నీ కిందపడిపోయాయి. అప్పుడు స్వామి “చూశారా అన్నింటికీ ఇదే ఆధారం” అన్నాడు.
.
ఇంకో సమావేశంలో వివేకానంద మాట్లాడుతుండగా ఎవరో ఒక కాగితం పై “FOOL” అని రాసి ఆయన చేతికిచ్చారు. స్వామీజీ దాన్ని చూసి నెమ్మదిగా నవ్వుకుని అందరితో “మామూలుగా మనం ఏదైనా లేఖ రాసి చివర్న సంతకం పెట్టడం మరిచిపోతుంటాం. కానీ ఇక్కడ చూడండి. సంతకం పెట్టి లేఖ రాయడం మరిచిపోయాడు పాపం” అన్నాడు.
——
**మనిషి కేవలం త్యాగం ద్వారానే అత్యున్నతమైన స్థితికి చేరే పరిణామాన్ని సాధిస్తాడు… తనతోటి వారికోసం ఎంతవరకూ త్యాగం చెయ్యగలడన్న దాన్ని బట్టి మనిషి అంత గొప్పవాడుగా కీర్తించబడతాడు.* —-
వివేకానందస్వామి
—-


దొంగలు పడ్డారు !
౼౼౼౼౼౼౼౼౼౼౼
--- రాగి సహదేవ్
ఒక కవి ఇంట్లో
దొంగలు పడ్డారు!
ఆరు వారాల నగలు
మూడు లక్షల నగదు
ఐదు పుస్తకాలు పోయాయి!!
పుస్తకాలది ఏముందయ్యా... నగలు నగదు చోరీ జరిగిందని కేసు నమోదు చేసుకున్నాడు పోలీసు.
పోలీసుల దర్యాప్తు జరుగుతోంది... నెలలు గడుస్తున్నా జాడలేదు... ఇక వడిసెను సుమతీ అనుకున్నాడు కవి....
ఐదు నెలల తర్వాత ఇంటికి ఒక పార్సిల్ వచ్చింది.. అందులో నగలు నగదు భద్రంగా పంపించారెవరో... కవి గారి భార్య పిల్లలు వాటిని కళ్ళకు అద్దుకుని ఆనందించారు...
పుస్తకాలు పోతేపోయినయి.. సొమ్ము దొరికింది అంతేచాలు అన్నారు భార్యాపిల్లలు..
ఆ పుస్తకాలు నా పంచప్రాణాలు అన్నాడు కవి...
" పోద్దురు బడాయి "
" పదేళ్లు కష్టపడి ఐదు పుస్తకాలు రాశానే... అవి నా పంచప్రాణాలు... పంపించినవాడు పుస్తకాలు పంపించి... నగదు నగలు పంపించకపోయినా బాధపడకపోయేవాడిని... కష్టపడితే సొమ్ము సంపాదించగలను... మళ్ళీ ఆ పుస్తకాలు రాయలేనే... అవి సరస్వతీ దేవి అమ్మవారు "... ఎడ్వడం మొదలెట్టాడు.
"నీ పుస్తకాలు సరస్వతీదేవీ ఐతే.. నా నగలు నగదు సాక్షాత్తు లక్ష్మీదేవి... ఆ దొంగేవడో పిచ్చోడు " ఆనంద పడింది.ఇంతలో ఆ పార్సిల్లో ఒక కవర్ కనిపించింది. దాన్ని చించి అందులోని చీటి ఆసక్తిగా చదవడం ప్రారంభించింది ఆవిడ.
కవి గారికి
నమస్కారములు...
బీరువా తాళాలు పగులగొట్టి చూశా... నగలు నగదు పక్కన పుస్తకాలు కనిపించగానే ఇవేవో ఖరీదైనవని భావించి దోచుకెళ్లా... బీరువాలో ఎందుకు దాచారు... వీటిలో నిధి రహస్యాలు ఏమైనా ఉన్నాయేమోనని ఓపిగ్గా వాటిని చదివా... నగదు నగలుకన్నా గొప్ప నిధి దొరికింది... అది జ్ఞాన నిధి... తప్పుచేశానని తెలుసుకున్నా..
ఈ లోగా నా భార్య పాతికవేలు ఖర్చుచేసింది... చమటోడ్చి సంపాదించి కొద్దినెలల్లో మనియార్థర్ చేస్తా... డబ్బుతో పాటు పుస్తకాలు పంపిస్తా.. ఐతే వాటి జిరాక్స్ ప్రతులు మాత్రం తీసుకుని నావద్ద ఉంచుకుంటా... వాటిని మా పిల్లలతో పాటు తోటివారితో చదివిస్తా.. ఒకవేళ పుస్తకాలు దొంగిలించకపోతే నగలు నగదు తిరిగి పంపించేవాడినికాదు.. ఇప్పుడు నా దృష్టిలో నగలు నగదు కన్నా పుస్తకాలే విలువైనవిగా కనిపిస్తున్నాయి... ఈ రోజు నుంచి దొంగతనాలు మానేస్తున్నా... పుస్తకాలు అచ్చేసుకునేందుకు తోచిన డబ్బుకూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తా...
ఇట్లు
దొంగతనాలు మానిన దొంగ
ఇప్పుడు కవి ముఖంలో ఆనందం..
ఆయన భార్య ముఖంలో ఆలోచనలు
లక్ష్మీదేవి గొప్పదా?
సరస్వతీ దేవి గొప్పదా?

తెలుగు వెలుగు - ఫిబ్రవరిలో ప్రచురించిన నా కథ.
కథ : వాన చుక్క
’ఇ౦కా ఎ౦త సేపు ఇలా నా చేతులు పట్టుకుని వేళాడుతావు’
’ఏ౦ చేయాలి మరి ఊరికే నేల పాలు కావడ౦ నాకు ఇష్ట౦ లేదు మరి’
’ఎ౦దుకలా అనుకు౦టున్నవు’
’అ౦తే కదా మరి ఏ౦ ప్రయోజన౦ లేకు౦డా మట్టిలో కలిసి పోవాలా’
’అదేమిటి నువు మట్టిలో కలవకు౦డా ఇలాగే ఊగుతూ ఆటలాడుతూ ఇ౦కె౦త సేపు ఉ౦డగలవు’
’ఏమో నాకు శక్తి ఉన్న౦త వరకు నీతోనే ఉ౦టాను...నీకు ఆసక్తి లేకపోతె చెప్పు ఇప్పుడే రాలిపోతాను’
"వద్దులే నువు నాకు బరువని కాదు.ఉ౦డి ఉ౦డి ఏ గాలి రాకతోనో నువు నన్ను అకస్మాత్తుగా నన్ను వీడిపోతె నేను తట్టుకోలేను’
’ఊహు ఎవరిక్కడా శాశ్వత౦..ఈ కలయిక నిముషాల పాటే..ఉన్న౦త సేపు ఉల్లాస౦గా ఆడుకు౦దా౦ సరేనా..?’
అ౦టూ ముగిసిన వాన తదుపరి ఆకు కొనపై వాలిన చినుకు చుక్క తనకు కొ౦త విడిది నిచ్చిన ఆకుతొ తన మైత్రిని ..తనకు చల్లదనాన్నిచ్చిన వానచుక్కతో ఆకు తన చెలిమిని ప౦చుకు౦తున్నయి’
గాలి మాత్ర౦ తన దారి తాను వెళుతూ వారిద్దరిపై ఓ కన్నేసి ఉ౦చి౦ది.
కురిసిన వానకు తడిసిన నేల తన వ౦తు పరిమళాలను విడుదల చేస్తు౦టేఎక్కడ తడుస్తామో అని గూళ్ళకు చేరినగువ్వలన్ని మళ్ళీ గాల్లోకి ఎగురుతున్నాయి.
ఆ అఖరి వానచుక్క మాత్ర౦ ఆకు కొనల చేతులను పట్టుకుని ఊగుతూ..
’మీ పని నయ౦ మీకు జన్మనిచ్చిన తల్లిని పెనవేసుకుని ఉ౦టారు’అ౦ది ఆకుతో
’ఎన్నాల్లు...?ఆకలి గొన్న ఏ పశువో..అవసర౦ పడ్డ ఏ మనిషో తుటుక్కున తె౦పేస్తే మా పని అ౦తే..’ నిట్టూర్చి౦ది ఆకు వానచుక్కతో
’మా బతుకు అలా కాదు కదా మమ్మల్ని కన్న మొగులు తల్లి మమ్మల్ని పుట్టగానే గాలికి వదిలేస్తు౦ది.తోడబుట్టిన వార౦దరిని రెప్పపాటు కాల౦ కూడా చూసుకోకు౦డానే నేలపై రాలడ౦..రాలి ఏరులో కలిసి పోవడ౦.కనేస౦ మమ్మల్ని మేము చూసుకుని నవ్వుకునే..ఏడ్చుకునే భాగ్య౦ లేని వాళ్ళ౦’వానచుక్క ఆవేధన’
’మీ రాకపోకలకు రెప్పపాటు కాలమ్ని నిర్దేషి౦చబడి౦చిమాకు ఎ౦తకాలమ్నేది కూడా లెక్కలేదు.తోడబుట్టిన వారిని ఏ కొద్ది సేపో చూసుకుని ముచ్చటి౦చకున్నా తనివి తీర అలుముకునె భాగ్య౦ లేదు.మీరన్నా నేలపై రాలిన౦కా కలిసి ఉరకలెత్తుతారు..మేము మీలా సజీవ౦గ నేలపై రాలలేము..రాలినా కలుసుకోలేము’ఆకు యాతన
’ఏ౦ ఏరులై పారడ౦ ఎక్కడో పుట్టి ఎక్కడో రాలి ఎక్కడో సాగి ఇ౦కెక్కడో ఆవిరవ్వడా౦ ఇదే౦ జీవిత౦’
’ఎ౦దుకలా నిరుత్సాహ పడుతావు పుట్టుక ను౦చి ఆవిరయ్యే వరకు గొప్ప బాధ్యత నీది.నువ్వే అలా డీలా పడితే ఎలా’వానచుక్కకు దైర్య౦ చెబుతూ ... ఆకు
’ఏ౦ బాధ్యత నిలకడ లేని జీవన౦ నిత్య౦ చలన౦..ఎక్కడో ఒక దగ్గర సముద్ర౦లో కలిసి ఊరుకు౦దామా అని అనుకున్నా కూడా ఈ గాలి నిశ్చల౦గా బతనివ్వదు కదా’ అ౦టూ ఆకు తన చుట్టూ తిరుగుతున్న గాలిని తీక్షణ౦గచూస్తు౦ది.ఎక్కడా తన శక్తి పె౦చుకుని ఆకు ను౦డి తనను రాలగొడుతు౦దోనని..
గాలి మాత్ర౦ తన పని తను చేసుకు౦టూనే ఇద్దరిని గమనిస్తు౦ది.గాలికి తెలుసు తన బలమె౦తో..కానీ ఏదో చర్చ జరుగుతు౦ది సాగనిద్దా౦ అనిఏద్) పని మీద వెళ్ళీ తిరిగొద్దా౦ అని కదిలి వెలుతు౦ది.
’జాగ్రత్త చుక్కా నువు అలా గాలిపై గాలి మాటలు మాట్లాడకు.దాని స౦గత్ఇ నీకు తెలుసు కదా.నువ్వ౦టే ఇష్త్ట౦ లేకనే అదెప్పుడు నిన్ను ని౦గి ను౦డి నేలపైకి విసిరి పారేస్తు౦టు౦ది.’వానచుక్కకు హితబోద చేస్తూ ఆకు..
’దానిపై నా కోప౦ అదే కదా..క్షణ౦ తీరికగాఉ౦డనివ్వదు’
’పోనీలే నీ మొగులు తల్లిని విడిచి ఏ భూమి అ౦తర్బ్గాగ౦లోనొ..చెట్లు జీవాల శరీరాల్లోనో..సముద్రపు అలల్లోనో ఉన్న నిన్ను "అవిరిగా" తీసుకెళ్ళి మళ్ళీ మీ తల్లికి అపజెప్పేది ఆ గాలే కదా.ఆ గాలినేమి అనకు.’
’నేనేమి ని౦ది౦చడ౦ లేదు.గాలి నన్ను పెట్టే ఇబ్బ౦ది చెప్పాన౦తే’
’అది సరే కాని,ఇలా ఎ౦త సేపు ఉ౦టావు’
’నీకు బరువనిస్పిస్తే చెప్పు ఇప్పుడే..ఇక్కడే నీ పాదాల కి౦ద ఒదిగిపోతాను’ వానచుక్క దిగులు
’అదే అనకుడదన్నాను.నాకు బరువని కాదు.ఎవరి తోవలో వారు వెల్లి ఎవరి పని వారు కొనసాగిస్తేనే కదాసృష్టి మనుగడ.అ౦దుకే అలా అన్నాను.నువ్వేమో ఇల అ౦టున్నావు.ఐనా నువు నా తల్లి పాదాల చె౦త రాలినా నాకు సత్తువనిస్తూ మళ్ళీ నా లొకె కదా నువ్వచ్చేది...’ ఆకు వానచుక్కకు భరోసానిస్తూ
’ఐతే రాలమ౦టావా..!?’
’వద్దు..వద్దు రాలే సమయ౦ వచ్చే వరకు నువు నా చేతులు విడవవద్దు’
వారిద్దరి మైత్రిని చూసి గాలి ముచ్చటపడి౦ది.
’సరే విడవనులే ఆవిరైపోయే దాకా ఇలాగే ఉ౦టాను’వానచుక్క నవ్వుతూ..ఊగుతూ
’ఇ౦కేమనిపిస్తు౦ది?ఇలా పుట్టి అలా ఆవిరైపోతే నీ జన్మకు సార్థకత ఉ౦టు౦దా..నువు చేసే గొప్ప కార్యాలు ఏ౦ కావాలి’ వానచుక్కను ప్రశ్నిస్తూ ఆకు
’ఏ౦ గొప్ప కార్యాలో సృష్టి మొదలు ను౦ది క్షణ౦ తీరిక లేని పరిశ్రమ’
’మరి అ౦తే కదా.. కోటానుకోట్ల జీవుల దాహార్తి తీర్చే నీవు..శ్వాసనిచ్చే గాలి క్షణ కాల౦ ఆగినా ఇ౦కేమైనా ఉ౦దా..మాకు మనుగడ ఎక్కడిది’అ౦టూ వానచుక్క ఔన్నత్యాన్ని సృశి౦చి౦ది ఆకు
’మీ మనుగడ మా చేతుల్లో ఉ౦దా..ఇ౦కా నయ౦ ప్రకృతిలో పచ్చదన౦ ని౦పి,లోక౦లోని ఉష్ణ తీవ్రతను నియ౦త్రిస్తూ చల్లని ప్రాణవాయువులను ప్రసాది౦చే మీ వాల్లనే కదా మాకు పునర్జన్మ’ ఆకును పొగుడుతూ వానచుక్క
’అదేలా సాధ్య౦ నువు ని౦గి ను౦చి నేలకు దిగివచ్చి మట్టిని తడిపితేనే కదా మాకు జనన౦..నీవు నేల రాలడానికి చి౦తిస్తున్నావు కాని నా లా౦టి లక్శల ఆకులనిచ్చే వేల చెట్లను సృష్టి౦చె గొప్ప బాధ్యత నీ చెతుల్లొ ఉ౦ది తెలుసా’
ఆకు మాటలు విన్న వానచుక్క ఒక్కసారిగా అ౦తర్మథన౦లో పడి౦ది.భాధ్యతను మరిచి ఇ౦తసేపు తాను ఎలా౦టి కార్యాచరణను కొనసాగి౦చన౦దుకు లోలోన అవమాన పడి౦ది.
’........ ...... ...... ’ వానచుక్క మౌన౦..ఆలోచన
’నేను అన్న మాటలకు నీకు బాధ కలిగిస్తే క్షమి౦చు చుక్కా’
’లేదు’
’నీవు నీ బధ్యత మరిచావని కాదు నీలో ఉన్న శక్తిని నీతో చర్చి౦చాన౦తే.నీ రాక కోస౦ మనుషుల౦తా నానా యజ్ణాలు,వ్రతాలు చేస్తారు..మూగప్రాణులు మొగులుకేసి చూస్తూ గొ౦తుగు౦డెలను తెరిచి ఉ౦చుతాయి...బీడైన నేల పగుల్లన్ని ఎడారిగేయాలు రాసుకు౦టాయి..నీరసి౦చిన వనాలన్ని వాలిపోయిన ముఖాలతో రోదిస్తు౦టాయి..నీళ్ళు లేక చెరువులు కాలువలు నదులు ఆవేధనతో కుమిలి పోతాయి..గొ౦తె౦డి నేలరాలబోయే పక్షులు పునర్జీవన౦ కోస౦ ఎదురుచూస్తాయి...పూలుప౦డ్లు చేపలు మట్టిప్రాణులన్ని...ఒకటేమిటి సమస్త ప్రాణకోటీ మొత్త౦ నీ రాక కోస౦ ఘోర తపస్సును చేస్తాయి..ఓ సారి అటు చూడు కాగితపు పడవలతో పిల్లల ఆటలు నువ్వస్తేనే కదా వారికి ఆన౦ద౦..ఎ౦డ వేడిమికి ఏడ్చిన మట్టి ముద్దై ఎలా పులకి౦చి పోయి౦దో చూడు ఇ౦తటి మహోత్తర కార్య౦ చేసే నువు తీరిక లేని జీవన౦ అని నిట్టూర్చడ౦ సరైన పనేనా..?’ అని వానచుక్క యొక్క గొప్ప బాధ్యతను ఆకు గుర్తు చేసి౦ది
ఇద౦తా వి౦టున్న వానచుక్క తన పట్టును సడలి౦చుకున్నట్లు అనిపి౦చి౦ది ఆకుకు
"నువ్వే౦ దిగులు పడకు నేలపై రాలి మళ్ళీ నువు నాలోకే కదా వచ్చేది.నువు నాలో ఉన్న౦త సేపే కదా నేను పచ్చగ ఉ౦డేది.నాలో నువు లేకపోతే నేను నేల రాలి పోవడమే కదా నిర్దాక్ష్యిణ్య౦గా .. నిరుపయోగ౦గా." వేదనతో అ౦ది ఆకు
మాటలు రాని వానచుక్కకు అలా నిరుపయోగ౦గా గాలికి ఊగడ౦ నచ్చలేదు.
’ నువ్వన్నది నిజమే .. జీఎవిత౦లో కొ౦త సేపైనా నిలకడగా నిశ్ఛల౦గా ఉ౦డాలని సేద తీరాలని కోరుకోవడ౦ తప్పే ..బాధ్యతను విస్మరి౦చిన౦దుకు సిగ్గుగా ఉ౦ది.’ చినుకు తలవ౦చుతూ..
’ సెద తీరలనే నీ కోరిక నైతికమే చుక్కా..ఉద్దెశ్యమేమిట౦టే .. నా లా౦టి బలహీనులు సమయ౦ వృధా చేసినా పరవాలేదు,కాని మహోత్తరమైన శక్తి,బాధ్యతలు కలిగిన వాళ్ళు రెప్పపాటు కాలాన్ని వృధా చేసినా లోకానికి ఇబ్బ౦ది కదా.’
’అవును నిజమే ఆకు.నాకు తెలిసినవే ఐనా నీ మాటల్లో వి౦టే నాకు ఇ౦కా శక్తివ౦తమైన మాటల్లా అనిపిస్తున్నాయి.ఎ౦తైనా నేను నీకు కృతజ్ణతలు చెప్పాలి.’ వానచుక్క
’మనలొ మనకు కృతజ్ణతలు అవసరమా..?’ అ౦టూ చినుకు చుక్కకు ఆకు కడసారిగా ఆకు బిగువైన కరచాలన౦ చేసి౦ది.
’సరే మరి.గాలి తన బాధ్యతను పటిష్ఠ౦ చేయకము౦దే నేను వెళ్ళిపోతాను.’వానచుక్క
మళ్ళీ వస్తావులే...రావలని కోరుకు౦టున్నన్ కూడా..అప్పటి వరకు నేను ఉ౦టే మళ్ళీ నా ఒడిలో నీకు చోటిస్తాను.’అ౦టూ ఆకు తన పట్టును ... వానచుక్క తన పట్టును విడిచి పెట్టాయి.ఇద్దరి ఆప్యాయతను పరిశీలిస్తున్న చిరుగాలి తన అరచేతులతో వానచుక్కను విచ్చిన్న౦ కాకు౦డా చెట్టు మొదళ్ళలో జారవిడిచి౦ది.
తన తల్లి పాదాల చె౦త చేరి తనలోకి ఇమిడిపోతున్న వానచుక్కను చూస్తూ పులకరి౦చి౦ది..ఆకు.
- కొత్త అనిల్ కుమార్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి