21, జనవరి 2019, సోమవారం



ప్రాంజలి ప్రభ 
ప్లాస్టిక్ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

ఎటుచూసినా అశ్రద్ధ తీరు 
ఏ వీధి చూసినా అపరిశుభ్రత గా మారు  
ఈనోటా విన్నా నిరుత్సాహత పోరు 
ప్లాస్టిక్ కవర్లు గుమ్మాలకు తగలటం జోరు  

మనుష్యులలో బద్ధకం పెరిగి   
పాలప్యాకెట్లకు వాడుతున్నారు 
నీళ్ల కవర్లు వాడుతున్నారు 
ప్యాకేజీలకు వాడుతున్నారు 

కూరలు తెచ్చుటకు వాడుతున్నారు 
పట్టించుకొనేవారు లేరు 
ప్రభుత్వం వారు పట్టించు కోరు 
ఇంకా పెరిగాయి కవర్ల జోరు 

చెత్తకుప్పలో చేరి దుర్వాసన తీరు 
మూగజీవులు తిని రోగాల్లో జేరు 
ఆవులు గేదలు తిని పాలు రంగు మారు
లంచాలకు లోబడి కవర్లు అమ్మిస్తున్నారు 

కోర్టులు చెప్పిన పట్టించుకోని తీరు  
ఇకనైనా ప్రభుత్వం గట్టి చెర్యలు 
గాజుముక్కలు, ప్లాస్టిక్ ముక్కలు 
జాగర్తగా వేసేటట్లు సహకరించాలి  
ప్లాస్టిక్ స్థానంలో గుడ్డ కవర్లు వాడాలి  
మందపాటి కవర్లు అమ్మేటట్టు చూడాలి  

--((**))--

నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

జాబు ఉన్నది జాడేలేదు
జీత మున్నది  జానేలేదు
ఇల్లు ఉన్నది ఆలేలేదు
ప్రేమ ఉన్నది పెళ్లి లేదు

తెల్వి ఉన్నది తోడే లేదు
భైక్ ఉన్నది భామే లేదు
కారు ఉన్నది కైపు లేదు
డబ్బు ఉన్నది దాబి లేదు

బుద్ది ఉన్నది బోదె లేదు
శక్తి  ఉన్నది టైమే లేదు
మంచి ఉన్నది చెడే లేదు
వెల్గు ఉన్నది నిద్ర లేదు

చెట్టు ఉన్నది నీడ లేదు
భక్తి ఉన్నది స్వేశ్చ లేదు
ఆస్త్రి ఉన్నది  ప్రియ లేదు
విద్య ఉన్నది ఉమా లేదు

ఉన్నది లేదు, ఆశ లేదు
వలపు ఉంది మల్పు లేదు
నాకు ఫేస్  బుక్ లేదు
భార్య వస్తుందని ఆశ లేదు

--((**))--


ప్రేమలీల
మగువే మగాడ్ని కోరితే
ఇలాఉంటుందని ఊహ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

చిరునవ్వుల చిద్విలాసి 
చిరునామా తెల్పవా
మరిచావా  ప్రేమపిపాసి
విధిరాత మార్చవా

కల్పలతల సహవాసి
ప్రేమత్వము తెల్పవా
ప్రాణాలర్పించే స్నేహవాసి
శుభమస్తు తెల్పవా

రసస్వరూప రసవాసి
రహస్యము తెల్పవా
శృంగారరసా దిష్టవాసి
అర్ధమును తెల్పవా

గాలిలో ఉన్నట్టుందా వాసి
స్వాతంత్రము తెల్పవా
గుండె నాకర్పించవా వాసి
స్వర్గమును తెల్పవా

విశేష దర్శక నివాసి
విశ్వాసము తెల్పవా
అపూర్వ విద్యల నివాసి
చైతన్యము తెల్పవా

సర్వాభరణాల నివాసి
చూడామణి తెల్పవా
సర్వత్రా గుణాల నివాసి
విశ్వమణి తెల్పవా

వెన్నల మనోహరవాసి
మమతల్ని తెల్పవా
వన్నెల వినోదాల వాసి
పలుకుల్ని తెల్పవా

--((**))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి