7, ఫిబ్రవరి 2019, గురువారం

pranjali prabha (1)



ప్రాంజలి ప్రభ (మొదటి వారం /2019)
కధలు ( 5) కవితలు (11)


నేటి సాహిత్యం (1)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

అద్దంలో అందం ఎప్పటికీ మారదు,
ఆశలు చూపుతూ వాకిలి మార్చదు
వయసు కప్పే నగుమోము మారదు,
ఆడదే ఆధారం అనక తప్పదు    

ఆవేదన తీర్చలేని శోకం నీడ నీది
కంటి చెమ్మ చూప లేని స్థితి నీది  
సింధూరపు రాగాల విరహం నీది 
వసంతకాలంలో ప్రేమ మొహం నీది

పడకటింట త్యాగ చూపుయే నీది  
అనురాగం ఆత్మీయత శీలం నీది 
సుఖాలను అందించే యవ్వనం నీది
నిప్పుల్లాంటి మాట మింగే మౌనం నీది  

పరుపులా మెత్తటి మనసు నీది
పరిమళంలా కమ్మని చూపు నీది 
ఆధరంతో తీర్చేటి మధురం నీది
అంగాంగం అందించే ఆడతనం నీది      

అద్దంలో అందం ఎప్పటికీ మారదు,
ఆశలు చూపుతూ వాకిలి మార్చదు
వయసు కప్పే నగుమోము మారదు,
ఆడదే ఆధారం అనక తప్పదు    

--((**))--

శ్రీ కోదండరామాలయం- గొల్లల మామిడడ 
శ్రీ కోదండరామాలయం (1)

కోనసీమ అయోధ్యగా పేరుగాంచిన ఈ దేవాలయం 1889 లో నిర్మించారు . ఈ క్షేత్రాన్ని రెండో భద్రాచలం అని కూడా పిలుస్తారు . అద్బుతమైన శిల్పకళ, పెద్ద పెద్ద గోపురాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవా అన్నట్లు ఉంటాయి . శ్రీ ఆంజనేయ సమేత రామ లక్ష్మణ సీత విగ్రహాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి . ఇక్కడ ద్వజస్తంబం, ఆలయనిర్మాణం పసిడి రేకులతో కళకళలాడుతూ ఉంటాయి . ఆలయం లో ఉన్న అద్దాలమేడ లోకి ప్రవేశిస్తే ఎన్నో వింతాలు ,విశేషాలు కనిపిస్తాయి . 

ప్రతి ఒక్కరు జీవిత కాలం లో తప్పకుండ ఒకసారి ఆయన ధర్సించనియ క్షేత్రం ఇది . రాముడే దిగివచ్చి కొలువున్నట్లుగా అనిపిస్తుంది . 
దేవాలయం ఆవరణ లో శ్రీ బాల గజానన దేవాలయం శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయాలు కూడా ఉన్నాయి .  ప్రత్యేక కార్యక్రామాలు 
శ్రీ రామనవమి కి కల్యాణోత్సవం జరుపబడును, ధనుర్మాసం ,శ్రవణ మాసం ,కార్తిక మాసం లో ప్రత్యేక పూజలు నిర్వహించాబడుతాయి . 
క్షీరాబ్ధి ద్వాదశికి తెప్పోస్తావం నిర్వహించబడును. వైకుంట ఏకాదశి కి ఉత్తర ద్వారా దర్శనం లబిస్తుంది .

-((**))--

Ganesha Sketch yet to paint... - Sketching by Rajdeep Nair at ...

నేటి సాహిత్యం (2)
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ

లోకం ఒక లోలకం, అది కదిలే ఒక కెరటం
జీవితం ఒక మమైకం, అది కదిలే ఒక నయనం

సృష్టికి మూలం ఒక భూమిక 
భూమికి మూల ఒక దృష్టి 
దృష్టి కి మూలం ఒక నీతి 
నీతికి మూలం భగవద్గీత 

లోకం ఒక లోలకం, అది కదిలే ఒక కెరటం
జీవితం ఒక మమైకం, అది కదిలే ఒక నయనం

మనుష్యుల నడవడి గీత 
గీత మదడులో ఉండే జ్యోతి 
జ్యోతి చైతన్యమే ఆకృతి 
ఆకృతి యే నేర్పు జీవన సంస్కృతి 


లోకం ఒక లోలకం, అది కదిలే ఒక కెరటం
జీవితం ఒక మమైకం, అది కదిలే ఒక నయనం

ఉషోదయం ఉత్తమ మార్గ నిర్ణయం
చంద్రోదయం చల్లని శక్తి నిర్ణయం
జీవ మయం మాటల భంధ నిర్ణయం
ప్రాణ మయం ప్రేమను పంచె నిర్ణయం

లోకం ఒక లోలకం, అది కదిలే ఒక కెరటం
జీవితం ఒక మమైకం, అది కదిలే ఒక నయనం

కాలమెప్పుడు ఆగదు ఆగేది భంధం
భందమేప్పుడు ఆగదు ఆగేది సత్యం
సత్యమేప్పుడు ఆగదు ఆగేది న్యాయం
న్యాయమేప్పుడు ఆగదు ఆగేది ప్రాణం

లోకం ఒక లోలకం, అది కదిలే ఒక కెరటం
జీవితం ఒక మమైకం, అది కదిలే ఒక నయనం

యదార్ధం ఎంత సహజమో, ప్రేమ అంత మధురం 
ప్రేమార్ధం ఎంత భంధమో, స్నేహ మంత మధురం
స్నేహార్ధం ఎంత భావ్యమో,  దైవ మంత మధురం
దైవార్ధం ఎంత ధర్మమో, ప్రాణ మంత మధురం   

లోకం ఒక లోలకం, అది కదిలే ఒక కెరటం
జీవితం ఒక మమైకం, అది కదిలే ఒక నయనం

అమ్మ తోడు నీడయె కావలె శ్రీమంతుల కైనన్
అయ్య తోడు నేర్పుయె కావలె ఏశక్తుల కైనన్
దేశ మాత తోడుయె కావలె ఏప్రాణుల కైనన్       
శక్తి తోడు కావలె యెంతటి ధీమంతుల కైనన్

లోకం ఒక లోలకం, అది కదిలే ఒక కెరటం
జీవితం ఒక మమైకం, అది కదిలే ఒక నయనం


--((**))--

నేటి పద్యము (3)
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ

కాల చక్రం తిరుగుట మచ్చుకైనా కానరాదు
నా వయస్సే పెరుగుట మచ్చుకైనా కానరాదు
స్త్రీ మనస్సు నలుగుట మచ్చుకైనా కానరాదు
శక్తి తోడు కావలె యెంతటి ధీమంతుల కైనన్!

అమృత ఘడియలలో  చదువు మేధస్సు పెంచున్
మేధస్సు మనుగడలో బతుకు తేజస్సు పెంచున్
తేజస్సు  కాలగమనంలో మనిషి శక్తి పెంచున్   
శక్తి తోడు కావలె యెంతటి ధీమంతుల కైనన్!

అమ్మ తోడు నీడయె కావలె శ్రీమంతుల కైనన్
అయ్య తోడు నేర్పుయె కావలె ఏశక్తుల కైనన్
దేశ మాత తోడుయె కావలె ఏప్రాణుల కైనన్       
శక్తి తోడు కావలె యెంతటి ధీమంతుల కైనన్

కాల మెప్పుడూ మన వెంబడి ఏ కాంతము లైనఁన్
తీర్పుచెప్పలేనిది సంతస మే జీవము ఐనన్
మార్పు నేర్పు కానిది మానవ సంభందము లైనఁ న్       
 శక్తి తోడు కావలె యెంతటి ధీమంతుల కైనన్"””

--((**))--


Image may contain: 1 person




నేటి పద్యం (4)

" వయసా ఈ పూట నిజమే తన్మాత్ర సౌభాగ్యమే "
" తనువా ఆ ఆశ పరిధే ఉత్సాహ ఉల్లాసమే "
"కధలే ఆనంద అవినాభావాల మ్నాధుర్యమే" 
"మనసా నామాట వినుమా మర్యాద కాపాడుమా"

--((**))--


Prnjali prabha.com 
ఆరాధ్య ప్రేమ లీల (5)
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ  

అగ్నిగుండాలపై నడిచిన పాదం 
- ఆరాధ్యులను నడిపించిన పాదం 

ఎడారిలో కాయాన్ని మోసిన పాదం 
- కర్మ నైపుణ్యాన్ని చూపించిన పాదం 

కర్మఫల దాతను చూపించే పాదం 
- శక్తిని శిక్షణగా మార్చిన పాదం 

దేశ రక్షణకు నడిపించే  పాదం 
 - కాలాన్ని వ్యర్దపరచనిదే పాదం    

పాదాలకు మోసే శక్తి  
మార్గాన్ని చూపే శక్తి
ప్రాణాన్ని నిల్పే శక్తి
వేణుగోపాల ప్రేమ సుమా 

--((**))--  



నేటి సాహిత్యం (6)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

కమ్ముకున్న చీకట్లు తొలిగే దెప్పుడు
నమ్ముకున్న వాకిళ్లు బతికే దెప్పుడు
మారుతున్న బంధాలు కలిసే దెప్పుడు
ప్రేమ ఉన్న స్నేహాన్ని తెలిసే దెప్పుడు 

ప్రజలు చేసే పాపము రాజుకు చెందు
రాజులు చేసే పాపము బ్రాహ్మణ చెందు
భార్యలు చేసే పాపము భర్తకు చెందు
శిష్యులు చేసే పాపము గుర్వుకు చెందు 

కనిపించే వేశ్యలు రక్కసులు అనిపించు
వికసించే రక్కసి  భక్షకులు  అనిపించు
తలపించే భిక్షకి  పాపకులు అనిపించు 
మరిపించే ఆరోగ్య  శాపకులు అనిపించు

కమ్ముకున్న చీకట్లు తొలిగే దెప్పుడు
నమ్ముకున్న వాకిళ్లు బతికే దెప్పుడు
మారుతున్న బంధాలు కలిసే దెప్పుడు
ప్రేమ ఉన్న స్నేహాన్ని తెలిసే దెప్పుడు 

--((**))--


నేటి పద్యము (ఛందస్సు ) (7)
రచయత: మల్లా ప్రగడ రామకృష్ణ

మాతా సరస్వతీదేవి మాపై కరుణించి
మాలో అసురత్వాన్నీ తిసేయమ్మ దయుంచి 
మామా మనొచిత్తాన్నీ మమేకము చెయించి 
జ్ఞానామృతము పంచీ మనస్సు నడిపించు 

బంధాలు తొలగించీ ని పాదములు పట్టి
వేదాన్ని పఠియించి ని పూజలు చె పట్టి
కాలాన్ని గౌరవించి ని సేవలు చె పట్టి
నైవేద్య  మవుతాను ని చెంతయును తల్లి

--((**))--


నేటి సాహిత్యం (8)
రచయత:మల్లాప్రగడ రామకృష్ణ

జ్ఞానమేమి చేస్తుంది,  మేధ ఏమి చేస్తున్నది
జీవ మార్గ మిదేనా, కలియుగ సందేశమిదేనా

అర్ధ రాత్రి ఆడవాళ్ళ ప్రయాణాలు ఒకవైపు
అర్ధరాత్రి ఆడపడుచుల హత్సలు మరోవైపు
మగవాళ్లను చులకచేసే ఆడవాళ్లు ఒక వైపు
ఆడవాళ్లను ఆడుకొనే మొగవాళ్ళు మరోవైపు

జ్ఞానమేమి చేస్తుంది,  మేధ ఏమి చేస్తున్నది
జీవ మార్గ మిదేనా, కలియుగ సందేశమిదేనా

ఆడది ఆటబొమ్మ కాదు ఆదిపరాశక్తి ఒక వైపు
మొగాడికి అడుగులకు మడుగులెత్తె స్త్రీ మరోవైపు
ఆడది ఆధునిక విద్య ఉద్యోగ వేగ ఉత్పత్తి ఒక వైపు
మొగాడ్ని ఇరికించి సంతోషించే వారు మరోవైపు     

జ్ఞానమేమి చేస్తుంది,  మేధ ఏమి చేస్తున్నది
జీవ మార్గ మిదేనా, కలియుగ సందేశమిదేనా

సిగ్గు విచ్చల విడిగా ప్రదర్శిస్తుంది ఒకవైపు
అదుపు లేక మొగాణ్ణి బలహీన పరుస్తుంది మరోవైపు
తప్పు చేసినా ఆడదానికి విలువ ఒక వైపు
ఏ తప్పూ చేయక ఉన్నా మొగాడికి శిక్ష మరోవైపు

జ్ఞానమేమి చేస్తుంది,  మేధ ఏమి చేస్తున్నది
జీవ మార్గ మిదేనా, కలియుగ సందేశమిదేనా
--((**))--


సాహితీమిత్రులారా! 
ఈ కథను ఆస్వాదించండి............... 
ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ మొదలవకముందు, ఇండియన్ ఎయిర్‌లైన్సే రాజై వెలుగుతున్నప్పటి కాలంలో– ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లో పనిచేస్తుండేవాళ్ళం. 

“ఇందూ, గంటవరకూ గ్యాంగుకి డ్యూటీలేవీ లేవు. మళ్ళీ ఎండ పోతుంది. బండలు ఖాళీగానే ఉన్నాయా?” ఇంటర్‌కామ్‌లో అడిగింది ప్రీతి. 

మా గ్యాంగులో వారి డ్యూటీలు- ఎయిర్‌బస్ టెర్మినల్‌లోనూ బోయింగ్ టెర్మినల్‌లోనూ. నన్ను మాత్రం ఈ రెండిటికీ మధ్యనున్న డొమెస్టిక్ కార్గో సెక్షన్‌లో పడేశారీ మధ్య. 

“వచ్చేయండి, ఖాళీగానే ఉన్నాయి. నేనూ నా డ్యూటీ బ్రేక్ ఇప్పుడే తీసేసుకుంటాను.” చెప్పాను. 

మూడవవస్తోంది. 

కార్గో బిల్డింగ్‌కి సరిగ్గా బయట, టార్మాక్ వైపు, అందరికీ ‘అడ్డా’ -అడ్డంగా పడేసున్న ఆ పొడుగాటి స్తంభాలు. మూడడుగుల వెడల్పున్న ఆ భారీ, చదరపు, నలుపురంగు స్తంభాలు కార్గో డివిజన్‌లో భాగమే అనిపిస్తాయి. అవే మా అందరి ‘బండలు’! ఎండలకి కాలవు. వానలకి జడవవు. చలికి వణకవు. వడగళ్ళకి చితకవు. ఏ పది నిముషాలో ఖాళీ ఉన్న ప్రతీ ఒక్కరమూ శీతాకాలంలో వాటిమీద కూర్చోక మానం. 

అటునుంచిద్దరూ, ఇటునుంచిద్దరూ వచ్చారు. 

కాంటీన్ ట్రాలీ తోసుకుంటూ ఎటెండర్లు వస్తుంటే- సాండ్‌విచ్‌లూ సమోసాలూ పేపర్ ప్లేట్లలో సర్దుకుని, టీ, కాఫీలూ అక్కడే వున్న ప్లాస్టిక్ టేబుల్స్ మీద పెట్టుకున్నాం. కబుర్లూ, టీలూ పూర్తయాయి. ఎవరి డ్యూటీ పాయింట్లకి వాళ్ళు తిరిగి వెళ్ళారు. నేనూ కార్గో బిల్గింగ్ లోపలికి వచ్చాను. 

నాకోసమే ఎదురు చూస్తున్నాడు ఫెడ్‌ఎక్స్ ఏజెంట్, ‘మాడమ్, నా కన్‌సైన్‌మెంట్ సంగతేమయింది?’ అంటూ. నక్షత్రకుడు! పది రోజుల కిందట సీ-నోట్ అని మేం పిలుచుకునే ఏడేళ్ళనాటి పాత కన్‌సైన్‌మెంట్ నోట్ ఒకటి తెచ్చినప్పటినుంచీ విసుగూ విరామం లేకుండా రోజూ ఇక్కడే చక్కర్లు కొడుతున్నాడు. ఆ నోట్‌లో బుక్ చేసిన వ్యక్తి పేరు సతీష్ అగర్వాల్ అని రాసుంది. 

“బాబూ, కార్గోలోనే కాదు, ఎయిర్‌పోర్టంతటా వెతికించినా మీ సామాను కనబడలేదు. అయినా 40 కోట్ల విలువయిన సామాను అని ఇన్‌వాయిస్‌లో ఉంది. అదీ, పన్నెండు టన్నుల మెటల్!” అరిగిపోయిన రికార్డులా చెప్పి, “అయినా ఇన్నేళ్ళూ మీ క్లయింట్ పట్టించుకోనేలేదేం?” చివరికి కుతూహలం పట్టలేక అడిగాను. 

“నేను కొత్తగా చేరాను మామ్, నాకంత తెలియదు. బుక్ చేసిన సతీష్‌గారు పోయి ఆరేళ్ళు దాటిందట. ఇప్పుడు ఆయన కొడుకు నీరజ్ అగర్వాల్, ‘సామాను వెతికిస్తారా, చస్తారా!’ అంటూ మా పీకలమీద కూర్చున్నారు. మీకూ ఫోన్ చేస్తానన్నారు. ప్లీజ్, మళ్ళీ చూడండి…” బతిమాలుకున్నాడు. 

జాలేసింది కానీ కనిపించని వాటినెక్కడినుంచి తెచ్చేది! ఏ ఈగో దోమో చిన్న పాకెట్టో కూడా కాదు, ఎక్కడో పోయిందనుకోడానికి. 

“మళ్ళీ రెండ్రోజుల్లో రండి. ఇంకెక్కడైనా దొరికే వీలుంటుందేమో ప్రయత్నిస్తాను.” వాగ్దానం లాంటిది చేశాను. 

సీ-నోట్ కాపీలు తీయించి, అవేవో కరపత్రాలయినట్టు హెల్పర్లకి పంచి, కన్‌సైన్‌మెంట్ వెతకమని అన్ని చోట్లకీ పరిగెత్తించాను. 

ఈ వ్యవహారం అంతు తేలనప్పటికీ మా బండల మీది సంబంధాల్లో మాత్రం మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఎప్పట్లాగే. మిత్రులు శత్రువులవుతున్నారు. ఒకరి మొహం ఇంకొకరు చూసుకోడానికి కూడా ఇష్టపడని వాళ్ళు ప్రాణ స్నేహితులయిపోతున్నారు. కొత్త రొమాన్సులు మొదలవుతున్నాయి. అత్తగారి ఆరళ్ళ గురించిన కబుర్లకి అంతమే లేదు. 

‘రాజకీయాలు చర్చించుకోవద్దు మొర్రో!’ అని ఒకళ్ళిద్దరు గీపెట్టినా వినక, వాటి గురించిన వాదనలూ భేదాభిప్రాయాలూ మొహాలు ముడిచెట్టుకోవడం, రుసరుసలూ ఎలాగూ సామాన్యమే. 

కొత్తగా హైదరాబాదునుంచి బదిలీ అయి వచ్చిన రాధిక నోట్లోంచి వచ్చీరాని హిందీ తప్ప ఇంకో భాష ఊడిపడదు. ‘పోనీ, ఇంగ్లీష్‌లో ఏడవ్వమ్మా,’ అన్నా వినదు. 

పూనమ్ మగవాళ్ళందరి అందాన్నీ గ్రేడ్ చేస్తూ ఉంటుంది. మేం విన్నా వినకపోయినా, తనకున్నాయని ఊహించుకునే రోగాలన్నిటినీ రాజ్ ఏకరువు పెడుతుంటాడు. 

డైటింగ్ చిట్కాలు చెప్తుంది అనుభ. సునీతకి ఎప్పుడూ తన వంటల గోలే! 

ఈ మధ్యెవరో కొత్తమ్మాయి ఉద్యోగంలో చేరింది. ఆ వేటలో పడి జయంత్ రానే రావడంలేదు. వినితకి ఎప్పుడూ ‘నేను, నాకు’ అన్న టాపిక్ తప్ప మరేదీ పట్టదు. 

అన్ని సమస్యలకూ పరిష్కారం అజయ్ దగ్గిర మాత్రం తప్పక ఉంటుంది. వద్దు నాయనా అన్నా, ఉచిత సలహాలు ఇవ్వడం మానడు. 

ఒకరోజు మామూలుగా ఏ మూలో కూర్చుని ప్రేమ ఒలకబోసుకుంటుండే నీలేష్, నీనా ఎప్పుడూ లేనిది ఇక్కడికి వచ్చారు, మొహాలు చిటపటలాడించుకుంటూ! ఒక బండ చివర్న కూర్చుని లోగొంతుకలతో వాదించుకున్నారు. ఉన్నట్టుండి ఒకపక్క చెమర్చిన కళ్ళని అద్దుకుంటూనే నీనా అతన్ని చెంప మీద కొట్టింది. అతనూ తిరిగి కొట్టాడు. మేం నిశ్చేష్టులమై, చలనం లేకుండా బండలలో కలిసిపోయాం. తను ఇంచుమించు పరిగెత్తుతూ బోయింగ్ టర్మినల్ వైపు నడిచింది. అతనూ అనుసరించాడు. అదృష్టం కొద్దీ మేము తప్ప అక్కడింకెవరూ లేరు. లేకపోతే, అదో కేస్ అయి కూర్చునేది. అదంతా చూసి మేము కంగారు పడ్డాం. 

బండలు మాత్రం నిర్వికారంగానే గమనించాయి అంతా. 

ఇంతలో ఎండాకాలం వచ్చింది. బండలు వేడెక్కాయి. వాటిమీద కూర్చోవడం కాదు కదా సమీపించాలన్నా కాల్చేస్తున్న ఎండ వద్దు, వద్దంటూ వారిస్తోంది. మరవి చిన్నబుచ్చుకున్నాయో ఏమో కానీ కారునలుపుకి మారాయి. 

కొన్నాళ్ళు ఫెడ్‌ఎక్స్ అబ్బాయీ రాలేదు, నీరజ్ అగర్వాల్‌ నుంచి ఫోనూ లేదు. ‘హమ్మయ్యా, ప్రస్తుతానికి కొంత ఉపశమనం’ అనుకుంటూ కార్గోలో పనిచేస్తున్న వాళ్ళందరం ఊపిరి పీల్చుకున్నాం. హెల్పర్లు కూడా ఆకాశంవైపు తలెత్తి దండాలు పెట్టుకున్నారు. 

ఒకరోజు నీరజ్ అగర్వాల్ నుండి ఫోనొచ్చింది– మీ ఎయిర్‌లైనుని కోర్టుకీడ్చకపోతే చూడండి. ‘విలువైన సామాను కాజేసి, అందరూ కలిపి డబ్బు పంచుకుంటున్నట్టుగా ఉంది,’ అన్న బెదిరింపులతో. కోపంతో భగభగమంటున్నాడు. 

“సర్, అంత భారీ సామాను సెక్యూరిటీ కంటపడకుండా ఎవరు బయటకి తీసుకెళ్ళగలరో మీరే ఒక్కసారి ఆలోచించండి…” అనునయంగా చెప్పాను. 

కొంత వాదన తరువాత, నా శాంతస్వరం వినో ఏమో కానీ అతనే చల్లబడి, “మా ఫాక్టరీ మానేజర్ చాలాకాలంగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతానికి ఊళ్ళో లేడు. వెంటతెస్తాను. ఆయనే గుర్తుపడతాడు.” అన్నాడు. సరే ఆయనొచ్చాక చూడచ్చులే అని నేనూ మర్చిపోయాను. 

హఠాత్తుగా ఒకరోజు, రీజినల్ డైరెక్టర్ నన్ను వెంటనే రమ్మంటున్నారన్న కబురుతో, ఎయిర్‌పోర్ట్ మానేజర్ ఫోనొచ్చింది. ఎందుకా! అనుకుంటూ, ఉరుకులూ పరుగులతో ఆయన ఆఫీసులోకి అడుగుపెట్టాను. 

“ఈయన నీరజ్ అగర్వాల్!” అక్కడ కూర్చుని తీరిగ్గా టీ తాగుతున్న ఒక వ్యక్తిని పరిచయం చేశారాయన. ‘ఓహో, ఇతనేనా! పైనుండి నరుక్కు వస్తున్నాడన్నమాట! అందుకే, ఉలుకూ పలుకూ లేదీ మధ్య’ అనుకున్నాను. 

“ఏమమ్మా, ఈయన కన్‌సైన్‌మెంట్ పోయిందట. మీరెవరూ సహకరించడం లేదంటున్నారీయన. మీరే కదూ ఈ కేసు చూస్తున్నదీ?” తిన్నగా విషయానికి వచ్చారు డైరెక్టర్‌. 

పని అయిందో లేదో అని తప్ప ఆయన వివరాలు పట్టించుకోరని, నెపాలు చెప్తున్నానని అనగలిగే అవకాశం ఉందని తెలిసీ ఉండబట్టలేక, వెతికించడానికి ఎంత కష్టపడుతున్నామో క్లుప్తంగా చెప్పాను. 

“దాని విలువెంతో చూశారా! ఇంత నిర్లక్ష్యం ఏమిటి?” అడిగారాయన. అవును, చూశాను కానీ ‘మెటల్’కి ఆ ధరెందుకో అంతు పడితే కదా! 

“అది బుక్ చేసినదెవరో, ఏమిటో కనుక్కోండి. రేపట్లోగా రిపోర్ట్ కావాలి నాకు.” 

‘ఇంక నువ్వు దయచేయి’ అన్నారని అర్థమై, తిరుగు మొహం పట్టాను. నాకెందుకు తట్టలేదీ సంగతి? బుక్ చేసిన ఆ కొలీగ్‌నే అడిగుంటే సరిపోయేది కదా! నన్ను నేను తిట్టుకుంటూ నా ఫైల్లో ఉన్న కాపీ తీశాను. ఆర్.కె.జి. అన్న ఇనీషియల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి తప్ప సంతకం గిలికేసినట్టుంది. ఎవరిని అడిగినా చెప్పలేకపోయారు. అది పట్టుకుని ఎయిర్‌పోర్ట్ మానేజర్ వద్దకి వెళ్ళాను. 

“ఆ టైములో మీ సెక్షన్లో ఎవరెవరి పోస్టింగ్ అయిందో కనుక్కుంటాను,” అన్నారాయన. 

మర్నాడే, ఆ వ్యక్తి రాధాకృష్ణ గుప్తా అని తెలిసింది. ఇండోర్‌ నుంచి శ్రీనగర్‌కి బదిలీ అయే మధ్యన మూడ్రోజులు ఇక్కడ టెంపరరీ డ్యూటీ పడిందట. ఇప్పుడతని పోస్టింగ్ బాంకాక్‌లో అట. ఫోన్‌లో మాట్లాడితే, ‘అవును. మొదటిరోజే భారీ సీ-నోటేదో తయారుచేశానన్న గుర్తే. కార్గోలో పనిచేసిన అనుభవం లేదప్పటికి. సలహా అడగడానికి చుట్టుపక్కల ఎవరూ కనిపించలేదు. ఏజెంటెవరో తెచ్చిన కాపీలో ‘ఇంత ఇనుమో, ఏదో’ అని రాసుందని లీలగా తప్ప మరేదీ జ్ఞాపకం రావడం లేదు. ఎన్నేళ్ళ కిందటి సంగతో!’ అని చెప్పాడట. 

అయినా, బుక్ చేసింది తనే కాబట్టి అతన్ని మర్నాటి ఫ్లైటులోనే రప్పించారు. మొత్తానికి గుప్తా అయితే వచ్చాడు కానీ సామాను ఆకారం కూడా గుర్తు లేదు అన్నాడు. సిటీ, ఇంటర్నేషనల్ కార్గోతో సహా అన్ని చోట్లకీ ఇద్దరు హెల్పర్లని వెంటబెట్టుకుని తిరిగొచ్చాం. ఫలితం లేకపోయింది. 

రెండ్రోజుల తరువాత, మరేం తోచిందో ఏమో కానీ ఆత్రంగా వచ్చి మా బండల చుట్టూ తిరుగుతూ, “ఇదే ఆ కన్‌సైన్‌మెంట్ అనుకుంటాను…” అన్నాడు. 

కనుక్కోడానికి జూనియర్ అగర్వాల్‌కి ఫోన్ చేస్తే, తన మానేజర్ ఊరినుంచి తిరిగి వచ్చాడనీ, అతన్నీ తనతో పాటు తెస్తాననీ అన్నాడాయన ఉత్సాహంగానే. 

మేనేజర్‌కి 50 ఏళ్ళుంటాయి. వచ్చీ రావడంతోనే బండల్ని చూసి, ‘ఇవే, ఇవే!’ అంటూ సంతోషం పట్టలేక ఇక గెంతులేయడమొక్కటే తక్కువ! 

అంతటా కబురు పాకింది. ఎయిర్‌పోర్ట్ మానేజర్ కూడా వచ్చి అయోమయంగానే ఆయన్ని అడిగారు, “అయితే, మీ బిల్లుమీద కోట్ల విలువ రాసుందేమిటండీ? అసలే మెటలైనా అంత ధర పలుకుతుందా!” 

మేనేజర్ చిద్విలాసంగా నవ్వి, “ఇది వెండండీ!” అన్నాడు. 

అందరం నోళ్ళు వెళ్ళబెట్టాం. 

“అసలేమయిందంటే, వీటిని మా చెన్నై ఫాక్టరీకి పంపించాలనుకున్నాం. ఇంత బరువున్న వెండి కడ్డీలు వంగిపోతాయి కదా అని వాటికి ఇనప తాపడం చేయించాం. అప్పటికే సతీష్‌గారి ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయన వీటిని బుక్ చేయించినప్పుడు నేను లేనక్కడ. నీరజ్‌గారేమో యుఎస్‌లో ఉన్నారు. ఫెడ్‌ఎక్స్ వాళ్ళే సలహా ఇచ్చారట, ఏదో మెటల్ అని రాసేయమని. సతీష్‌గారు పోయాక, ఎవరూ వీటి సంగతి పట్టించుకోలేదు. ఫాక్టరీ లెక్కలు చూస్తున్నప్పుడు అవి తేలకపోయి ఫైల్సన్నీ చెక్ చేస్తుంటే ఈ మధ్యే నీరజ్‌గారి కంటపడింది.” ప్రశ్నార్థకంగా పెట్టిన మా మొహాలని చూస్తూ తేలిగ్గా తేల్చేశాడాయన. 

హమ్మయ్యా, చిక్కు ముడి విడింది! 

మర్నాటి చెన్నై ఫ్లైట్‌లో వాటిని లోడ్ చేయడానికి పెద్ద క్రేనులూ పటాటోపం కనిపించాయి. దూరంగా ఉన్న బే మీద నిలుచున్న ఎయిర్‌బస్ వెనకాతల హెల్పర్లందరూ గుమిగూడి ఉన్నారు. వెళ్ళి చూస్తే, వెనకనున్న కార్గో హోల్డుల్లో కడ్డీలు పట్టలేదు. వాటిని దింపేసి మళ్ళీ ఎత్తి, ముందు హోల్డులో ఎక్కించడానికి ప్రయత్నిస్తుంటే పొడుగు చాలలేదు. ఇంక వీలవక రెండిటినీ దించేశారు. ఇన్నేళ్ళూ అవిక్కడే ఎందుకు పడున్నాయో అర్థమయింది. అవసలు మా విమానాలు వేటిల్లోనూ పట్టగలిగే కొలతలున్నవి కావు! 

అవి తిరిగి అగర్వాలుల ఇంటికి రాజసంగా పెద్ద ట్రక్కులో ప్రయాణమయాయి. 

గుప్తా తప్పు కేవలం సీ-నోట్ సరిగ్గా తయారు చేయకపోవడం మాత్రమే అనుకున్నారు ముందు. కానీ, ఈ సంఘటన తరువాత కడ్డీల పొడుగు సరిగ్గా కొలిపించకుండానే బుక్ చేసి, ఆ తరువాత అవి లోడ్ అయాయో లేదో అని కూడా పట్టించుకోని అతని నిర్లక్ష్యానికి అతని ఇంటర్నేషనల్ పోస్టింగ్ రద్దు చేసి, మూడు నెల్లు సస్పెండ్ చేశారు. 

ఇప్పుడు కాంక్రీట్ మీద మా అందరి అనుభూతులకీ సాక్షిగా ఉండే చలనరహితమైన మా బండలైతే లేవు కానీ వాటి కింద ఇన్నేళ్ళూ వర్షం, ధూళి, నుండి తప్పించుకున్న తారూ ఇసుకా మేళవించిన టార్మాక్ భాగం మట్టుకు తళతళలాడుతోంది! 
కానీ మేము మాత్రం మా కబుర్లకి మరో చోటోదే వెతుక్కోవాలి.

--((**))--




నేటి సాహిత్యం (9)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

ఎందుకా ఆ నవ్వులు, ఎందుకా చిందులూ
ఎగసిపడే కెరటాల్లా, ఎగసి పడే జ్వాలల్లా
ఎందుకా ఆ నవ్వులు, ఎందుకా చిందులూ

హృదయాన్ని రగిలిస్తూ,
దైవత్వాన్ని నిందిస్తూ
ఉదయాన్ని తిలకిస్తూ
ఉన్మాదిగా పరి బ్రమిస్తూ

ఎందుకా ఆ నవ్వులు, ఎందుకా చిందులూ
ఎగసిపడే కెరటాల్లా, ఎగసి పడే జ్వాలల్లా
ఎందుకా ఆ నవ్వులు, ఎందుకా చిందులూ

నేను నిశీధిలో జీవిస్తూ
ఆనందాన్ని దహిస్తూ
పెను భారాన్ని భరిస్తూ,
ఆవేదనను  మోస్తూ
ఉన్న నన్ను చూసి

ఎందుకా ఆ నవ్వులు, ఎందుకా చిందులూ
ఎగసిపడే కెరటాల్లా, ఎగసి పడే జ్వాలల్లా
ఎందుకా ఆ నవ్వులు, ఎందుకా చిందులూ

నిదురను మింగే కలలను భరిస్తూ
ఏమి చెప్పుకోలేక మౌనాన్ని భరిస్తూ
ఆరోగ్యాన్ని హరించే మందు సేవిస్తూ
ఓర్పు ఓదార్పు లేక నీరు గాలి సేవిస్తూ
ఉన్న నన్ను చూసి

ఎందుకా ఆ నవ్వులు, ఎందుకా చిందులూ
ఎగసిపడే కెరటాల్లా, ఎగసి పడే జ్వాలల్లా
ఎందుకా ఆ నవ్వులు, ఎందుకా చిందులూ

ప్రేమ నన్ను మోసం చేస్తే
పెద్దలు నన్ను అవమానిస్తే
కలి కాలం నన్ను వెక్కిరిస్తే
కాయాన్ని మోస్తూ కర్మ భరిస్తూ
ఉన్న నన్ను చూసి

ఎందుకా ఆ నవ్వులు, ఎందుకా చిందులూ
ఎగసిపడే కెరటాల్లా, ఎగసి పడే జ్వాలల్లా
ఎందుకా ఆ నవ్వులు, ఎందుకా చిందులూ
--((**))--


నేటి సాహత్యం (10)
ప్రజలకు మేలుకొలుపు

వాని తిట్టులు పట్టుదలకు నాందీ వాక్కులు
ఏక మవ్వుట  పట్టు  ప్రజలు చూపే జే జే లు 
మంచి చేసియు తెల్పు కలయ ఓర్పే జేజీలు 
జాతి సేవయు గుర్తు గెలుపు మహాకూటాన్కె 

ఆదిలో కష్టములెన్నున్నా ప్రజల తీర్పు మారు
ఓర్పుతో ఎకమవుటన్నా జయము తప్పదన్న
సేవయే కలయుటఅన్నా ప్రజల నాడి  అన్న
మహకూట గెలుపు తెలంగాణాకు మార్పునన్న 

ఏక మవుట కొన్ని పరిస్తితులలో  అందరికీ  తప్పదు
నేను అనియు నీవు ప్రతి స్థితిలో అందరికీ తప్పదు
వాని చెడుయు మీలొ నిజ స్థితిలో అందరికీ తప్పదు
మహా కూటమి తెస్తుంది ప్రజలందరిలో మరోమలుపు

--((**))--

Pranjali Prabha.com
ఓ అతిధి (నేటి కవిత) (11)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

ఉప్పొంగింది నా హృదయం
ప్రేమించింది నా నీ ధైర్యం
ద్వేషించింది నా దౌర్భాగ్యం
బోదించింది నా నీ గమ్యం

వినిపించింది నీ గళం వాగ్దాటి 
కనిపించింది నీ ముగ్ధ హృద్యార్థి
కరుణించింది నీ దృష్టి ధర్మార్ధి
తపియించింది నీ సేవా కర్మార్ధి



--((**))--

ఓం శ్రీ రాం       ఓం శ్రీ రాం        ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ -సప్తర్షులు :


సర్వేజనాసుఖినోభవంతు *

భారతీయ ఋషి పరంపర -- సప్తర్షులు :(4)
ప్రపంచానికి జ్ఞాన కేంద్రం భారతదేశం . అజ్ఞానం అనే తిమిరాన్ని పారద్రోలి జ్ఞాన మార్గాన్ని నిర్దేశిస్తూ గురువునుండి శిష్యునికి నిరంతరంగా ఈ ప్రవాహం కొనసాగుతూ వస్తుంది . జ్ఞానాన్ని అందించిన ఈ పరంపర నే ఋషి పరంపర అంటారు . మనదేశం విశ్వ గురువు. ప్రపంచం మొత్తం అందకారంలో ఉన్నపుడు భారతదేశం జ్ఞానంతో వెలుగొందింది . సకల శాస్త్రాలు , విజ్ఞాన సర్వస్వం ఇక్కడే ఉద్బవించింది .
ఋషి అనగా ‘ఋతము ‘ వైపు పయనించెవాడు అని అర్ధం . ఋతము అంటే పరమ సత్యమైన దానిని తెలియజేయు విజ్ఞానం అంటారు పెద్దలు . తపస్సు చేత అట్టి విజ్ఞానాన్ని పొంది , ఆ విజ్ఞానాన్ని వేదం మొదలు కాగల శాస్త్రాలలో నిక్షిప్తం చేసి మనకందించిన వారు ఋషులు . ఈ ఋషి పరంపర లో ముఖ్యులు అగ్రగణ్యులు సప్తర్షులు , వీరు నక్షత్ర మండలంలో మనకుదర్శనమిస్తారు .
సప్తర్షులు :
1) అగస్త్య మహర్షి 2) అత్రి మహర్షి 3) అగీరస మహర్షి 4) కశ్యప మహర్షి ( ఈయననే కశ్యప ప్రజాపతి అనికూడా అంటారు ) 5) బృగు మహర్షి 6) వశిష్ట మహర్షి 7) విశ్వామిత్ర మహర్షి వీరి నే సప్తర్షులు అంటారు .
1)అగస్త్య మహర్షి :
లోకహితం కోసం సముద్ర జలాన్ని ‘ఔపోసన ‘పట్టి, వింధ్య పర్వత గర్వమనచిన వాడు అగస్త్యుడు . ఈయన వశిష్టుని సోదరుడు . త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాసం చేసే సమయంలో పంచవటి లో నివసించమని చెప్పి లోక కళ్యాణానికి కారణమైనవాడు, ప్రసిద్దిగాంచిన ‘ ఆదిత్య హృదయం ‘ ను రామునికి ఉపదేశించినవాడు అగస్త్యుడు .
ద్రవిడ సంస్కృతి మూలపురుషుడు అగస్త్యుడు . దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా తమిళనాడులో ప్రసిద్ద ‘ సిద్దవైద్యానికి ‘ మూలపురుషుడు ఈయనే . అదేకాక శక్తి తంత్రాన్ని , శక్తి సంహిత , అగస్త్య సంహిత గ్రంథాలలో విద్యుత్ శక్తి తయారు చేసేవిధానం గురించి అగస్త్యుడు వివరించాడు .
అగస్త్యుడు భాద్రపద మాసంలో నక్షత్రంగా మనకు కనిపిస్తాడు .
2)అత్రి మహర్షి :
అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు . త్రిమూర్తులను పసిపాపలు గా చేసి న మహాపతివ్రత సతి అనసూయ అత్రి మహర్షి అర్ధాంగి . సృష్టి నిర్మాణంలో బ్రహ్మకు సహాయ పడినవాడు అత్రి మహర్షి . కృతయుగంలో సీతారామ లక్ష్మనులకు ఆతిథ్యమిచ్చిన వాడు అత్రి మహర్షి . ఆత్రేయ ధర్మ శాస్త్రం , ఆత్రేయ స్మృతి అనేది చాలా ప్రసిద్ద ధర్మ శాస్త్ర గ్రంథం . ఋగ్వేదం లో అత్రి సంహిత ను ఉపదేశించిన మంత్ర ద్రష్ట .
3)అంగీరస మహర్షి :
అంగీరసుడు బ్రహ్మ మానస పుత్రుడు . అగ్నికి బదులుగా అతని కార్యం నిర్వహించినవాడు అంగీరసుడు . తన తపఃశక్తితో బ్రహ్మకు సృష్టి నిర్మాణంలో సహాయం చేసినవాడు అంగీరస మహర్షి . ఈయన కర్దమ ప్రజాపతి కుమార్తె’ శ్రద్ద’ ను వివాహం చేసుకున్నాడు . అంగీరస స్మృతి ధర్మశాస్త్ర గ్రంథంగా లోక ప్రసిద్ధం . ఈయన ప్రస్తావన వేదాలలోను , ఉపనిషత్తులలోను మనకు కనిపిస్తుంది . అంగీరసుడు తేజో రూపంలో నక్షత్ర మండలంలో దర్శనమిస్తాడు .
4) భృగువు :
బ్రహ్మ హృదయం నుండి జన్మించిన వాడు భృగువు . నవబ్రహ్మ లలో ఒకడు , భృగు వంశ మూలపురుషుడు భృగువు. ఇతను కర్ధమ ప్రజాపతి కుమార్తె ‘ఖ్యాతి’ ని వివాహమాడాడు . యాగఫల హర్హత కోసం త్రిమూర్తులనే పరీక్షించిన తపస్సంపన్నుడు . భృగు మహర్షి ‘జ్యోతిష్య శాస్త్ర సారాన్ని ‘ రచించాడు .
5) కశ్యప మహర్షి :
కశ్యపుడు, ‘మరీచ’ మహర్షి పుత్రుడు . కశ్యప వంశ మూలపురుషుడు . ఇతడు దక్ష ప్రజాపతి కుమార్తెలను వివాహమాడాడు . ద్వాదశ ఆదిత్యులను , హిరణ్యాక్ష , హిరణ్యకశ్యపులను , నాగులను , గరుత్మంతుని, గంధర్వులను ,దేవతలను దైత్యులను , రాక్షసులను , అప్సరసలకు తండ్రిగా జన్మనిచ్చి సృష్టి ధర్మాలను నిర్వర్తించాడు కశ్యపుడు .కశ్యప మునికి పుత్రునిగా , మహావిష్ణువు ‘ వామన మూర్తిగా ‘ జన్మించాడు . కశ్యపుని పేరు మీద ‘వాస్తు , శిల్ప శాస్త్ర’ రీతులు ఉన్నాయి .
6) వశిష్టుడు :
ఇతడు బ్రహ్మ మానస పుత్రుడు . ఇక్ష్వాకుల కుల గురువు . వశిష్టుని భార్య మహా సాధ్వి అరుంధతి . ఇతను రామునికి ‘ యోగ వాశిష్టము’ బోధించాడు . ఇది చాలా ప్రసిద్ధి గాంచింది . వశిష్ట స్మృతి , మను స్మృతి అంతగొప్పది . క్షత్రియుడైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షిగా మారటానికి కరణమైనవాడు వశిష్టుడు . నవ బ్రహ్మలలో ఒకడు, బ్రహ్మ తేజో సంపన్నుడు ఆరధ్యనీయుడు వశిష్టుడు .
7) విశ్వామిత్రుడు :
ఇతను తొలిగా క్షత్రియుడు . వశిష్టుని తొ తలపడి మహా తపస్సు తో బ్రహ్మర్షిగా ఎదిగాడు . ఎన్ని ఓటములు ఎదురైనా వాటినే విజయాలుగా మా ర్చుకొని సప్తర్షులలో ఒకనిగా నిలిచాడు విశ్వామిత్రుడు . హరిశ్చంద్రుని సత్యసంధునిగా లోకానికి చాటిన వాడు , శ్రీరామునికి శస్త్ర విధ్యలను నేర్పించి దుష్ట శిక్షణకు సహాయపడిన వాడు విశ్వామిత్రుడు . హైందవ ధర్మానికి ‘ గాయత్రి ‘ మంత్రమును ప్రసాదించిన వాడు , సృష్టికి ప్రతి సృష్టి ని చేసినవాడు విశ్వామిత్రుడు . వీరందరూ మన హైందవ ధర్మానికి రక్షణ గా నిలిచి , మనకు సకల మానవాళికి ఆదర్శనీయులు సప్తర్షులు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి