వందనమ్ములు పలుకు తున్నా భాషామ తల్లికి
వందనమ్ములు పల్కుతున్నా పండిత పామర్లకి
వందనమ్ములు గురువు తల్లి తండ్రు లందరికి
తెలుగుభాషను బ్రతికించమని కోరుతున్నా
ప్రతిదినమ్ము నాకు భాషోత్సవంబుగ నుండునే
ప్రతిదినమ్ము వరమె, కలో తెలియ కుండెనే
ప్రతిదినమ్ము శ్రీకరమ్ముగఁ గొలుచు చుండెనే
ప్రస్తుతించు చుండి భాష పద కరుణ దయలే .
తెలుఁగు వెలుఁగుఁ బంచి దేశదేశమ్ములఁ యందు
దలిఋణమ్ము దీర్చి ధన్య జీవి అవ్వాలి ముందు
శ్రీమాత పితల భాష బ్రతికించు సత్య ముందు
వలయునట్టి ప్రేమ పెంచు భాషాభివృద్ధి యందు
తీయనగుచు వినఁగ హాయి గూర్చెడి తెలుగు
తాయి పలుకు భాష తనివినిడును తెలుగు
శ్రేయమిడెడు నాకుఁ జెప్పలేనంత వెలుగుగా
చదువి వ్రాయఁట యందు హాయి నొసగు తెలుగు
తరగతి గది
ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ
విద్యార్ధులు వికసించిటకు పునాది
సులభతరంగా విద్యనభ్యసించు గది
పెద్దల మాటలను అనుకరించునది
గురువుద్వారా వెలిగే దీపాలుగా మార్చేది
అందుకే తరగతి గది అనుభవాల నిధి
విద్యార్థులకు జ్ఞాన భిక్ష ఒడి
విద్యకు ఆటంకములేని దడి
గురువులు బోధించే బడి
జీవత గమ్యం తెలిపే గుడి
అందుకే తరగతి గది అనుభవాల నిధి
భౌతికంగా చైతన్యం కల్పించేది
ఆర్ధికంగా ఆదు కొనేటట్లు చేసేది
కన్నీళ్లు రానియ్యకుండా ఆదుకునేది
చరితను సృష్టించే జ్ఞానాన్ని అందించేది
అందుకే తరగతి గది అనుభవాల నిధి
చేతులను ఆయుధాలుగా మార్చేది
చూపులను కిరణాలుగా మార్చేది
మాటలను కృపాణాలుగా మార్చేది
అడుగులను ఆదర్శాలుగా మార్చేది
అందుకే తరగతి గది అనుభవాల నిధి
స్నేహభావంతో చదువుకొనే తరగతిగది
అమృతభాష్యాలను గురువులు బోధించే గది
జీవతగమ్యానికి అర్ధం తెలుసుకొనే గది
అర్ధానికి పరమార్ధానికి మూలం ఇది
అందుకే తరగతి గది అనుభవాల నిధి
--((**))--
ప్రియసి ప్రియుల మద్య ఛలోక్తులు
ప్రేమ పంచుటకు కోరాను నీ మనస్సు
నీ కోసం ఎక్కు పెడుతా శివ ధనుస్సు
అందిస్తా చీకటిని తరిమే ఉషస్సు
తెప్పిస్తా నేలకు నింగిలోని తేజస్సు
కళ్ళు తిరిగి నీకోసం అలసినాను,
కీళ్ళ నెప్పులు బాగా పెరిగి ఉన్నాను
నా కలలో ప్రేవేసించి నందు కేనేమో
అన్నది ఒక ప్రేయసి
మెదడుని కధతో తొలిచావు కదా
మందుఇచ్చి మరీ త్రాగమన్నావుకదా
అన్నాడు ప్రియుడు
హృదయంలో పన్నీరు జల్లి ఉడికించావు
మనస్సు కల్లోల పరిచి కదిలించావు,
అన్నది ప్రియాసి
వయసులో తలపుల్ని మెరుపు కల్పించి,
చుంబనాలు అందించావు కదా ప్రియాసి
అన్నాడు ప్రియుడు
--((*))--
నేటి కవిత - అంటాడు-
ప్రాంజలి ప్రభ
రచయత మల్లాప్రగడ రామకృష్ణ
మాటవిని మాట్లాడటం నేర్చుకో - అంటాడు కోపంగా
మనస్సును అర్ధం చేసుకో - అంటాడు ప్రేమగా
నీలో ఉన్న మృగత్వాన్ని వదులుకో - అంటాడు భాదగా
అహంకారం వదలి కష్టం తెలుసుకో - అంటాడు నెమ్మదిగా
సానుభూతి వ్యక్తపరచటం నేర్చుకో - అంటాడు స్నేహముగా
వైకుంఠపాళి ఆడటం నేర్చుకో - అంటాడు నాయకుడిగా
ఆధిపత్యం కోసం ఎత్తులు నేర్చుకో - అంటాడు చాణిక్యుడిగా
సమానత్వం ఉందని తెలుసుకో - అంటాడు సంపాదనతో
నీ శక్యతే నాకు సుఖ మనుకో - అంటాడు నవ్వులతో
హృదయం అర్ధం చేసుకో - అంటాడు కన్నీరుతో
నోరువిప్పలేనని తెలుసుకో - అంటాడు కళ్ళతో
--((**))--
నేటి కవిత - కళ్ళు తెరవండి -
ప్రాంజలి ప్రభ
రచయత మల్లాప్రగడ రామకృష్ణ
దాహం తీరదు, దాపరికం ఉండదు, దాచుకున్నదంతా ఖర్చుఆయ్యెదాక,
దానం చేయరు, దరిద్రుడిలా ఉండలేరు, దంభంగా ఉండి బతికేవారు ,
దర్జా అనుకుంటు, దండగ మారి అప్పులుచేస్తూ, దండుకుతినేవారు,
దర్మం అంటే ఏమిటో తెలియదు, దౌర్జన్యం, దాడి చేయు లక్షణంతో ఉంటారు ,
దమ్ము చూపి, రొమ్ము విరిచి, కమ్ముకోసున్న చీకటిని చిల్చాలనుకుంటారు,
ధనం ఇదం జగత్ అని పిచ్చి ప్రేమలో ఉంటారు,
ధనం చుట్టూ తిరిగి అనారోగ్యు లవుతారు,
ఆరోగ్యవంతులను అనారోగ్యులుగా మారుస్తారు,
దాసులుగా మర్చుకోనుటే, మనస్సుకు నచ్చుతుందని అంటారు
అదే మాలక్ష్యం, మాదేయం , మాఊపిరి, అంటారు,
మానవులై ఉండి దానవులుగా మారి రాక్షసకృత్యాలు చేస్తారు,
దుష్ట కర్మల చేత దూసు కేల్లుతూ గొప్పనుకుంటారు,
సత్వగుణమ లేక రజో, తమో గుణాల్ని ఆశ్రయించి రెచ్చి పోతారు,
నీచ కర్మలకు దుష్ట బుద్ధులతో చేరి తిరుగుతారు,
నిర్భాగ్యులను, నిర్వేదులను నిరక్షరాసులను, నిర్ధాక్షిణ్యంగా చంపేస్తారు, కామాంధకారంతో కన్ను మిన్ను కానరాక వావివరుసలు ఎరుగని వారు,
మధాన్ధముచేత పాపక్రుత్యములు చేసే వారు,
మాకు రేపనేది లేదు, నేడే మాకు స్వర్గం, అంటారు
అందుకున్నంత అందుకోవటమే మా లక్ష్యం, అని దోచుకుంటారు,
సంసారమనేది సంకుచిత బుద్ది అని నిలువునా న్యాయాన్ని చంపే స్తారు,
అడ్డు చెప్పినవార్ని, నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపుతారు,
నీతి నియమాలు, ధర్మ నిర్ణయాలు ఏ నిముషాన తలకేక్కవంటారు ,
వాటితో పనిమాకు లేదంటారు,
స్వలాభం కోసం ధనార్జనకోసం దారి తప్పి తిరుగుతారు,
తిండి తినక, కంటికి నిద్రలేక, కన్నవారిని వదిలేసి విప్లవభావాలతో ఉంటారు
వారే తీవ్రవాదులు మరెక్కడో లేరు మనమధ్యనే ఉన్నారు,
మానవులు దానవుల్గా మారకముందే
మనుష్యులందరూ ఏకమై మనుష్యులుగా మార్చండి
ఇదే నా కొరికి, ఇది అందరికొరిక, ఎదే భారతమాత దాస్యవిముక్తికి అధరం,
నిత్య సంతోషాలకు మనమధ్య ఉన్న వారిని ఎరివేయుటకు
అందరి సహకారం అవసరమండి,
కళ్ళు తెరవండి నిజం తెలుసుకోండి ,
ఐకమత్యంగా జీవిద్దాం రండి,
జై మాతృ భూమి, జై జై మాతృ భూమి
--((**))--
ప్రాంజలి ప్రభ - చిత్తంలోనే ఉంది
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
హారియై పోషిస్తావో - యముడై హరిస్తావో
మనసై ప్రేమిస్తావో - ద్రోషియై దూషిస్తావో
కాలమై నడుస్తావో - కలియై పీడిస్తావో
అంతా నీ చిత్తంలోనే ఉంది
నిజంలో జీవిస్తావో - భ్రమలో బతికేస్తావో
శ్రమతో జీవిస్తావో - బద్దకంతో బతికేస్తావో
ధర్మతో జీవిస్తావో - దాంతో బ్రతికేస్తావో
అంతా నీ చిత్తంలోనే ఉంది
స్వర్గం గా మారుస్తావో - నరకంగా మారుస్తావో
మౌనం గా జయిస్తావో - మూర్ఖం గా నటిస్తావో
ధైర్యంగా జీవిస్తావో - కోపం గా వేదిస్తావో
అంతా నీ చిత్తంలోనే ఉంది
ఊట నీరు త్రాగుతావో - కడలి నీరు త్రాగుతావో
పైరు గాలి పీలుస్తావో - కుత్రిమ గాలి పిలుస్తావో
సూర్య వెల్గు పొందుతావో - విధ్యుత్ వెల్గు పొందుతావో
అంతా నీ చిత్తంలోనే ఉంది
నీళ్లు త్రాగి బ్రతుకుతావో - కల్లు త్రాగి బ్రతుకుతావో
వళ్ళు వంచి బ్రతుకుతావో - వళ్ళు అమ్మి బ్రతుకుతావో
కళ్ళు తెర్చి చెపుతున్నావో - కళ్ళు మూసి చెపుతున్నావో
అంతా నీ చిత్తంలోనే ఉంది
దొరవై పది కాలాలుంటావో - బానిసై బతుకు చాలిస్తావో
ప్రియుడై ప్రేమ నందిస్తావో - కాలుడై ప్రేమ మింగేస్తావో
శివుడై ఆరాధ్యుడౌతావో - శివుడై రుద్రు డౌతావో
అంతా నీ చిత్తంలోనే ఉంది
ఉగ్రవాదం
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
తీవ్ర వాదం వివాదంగా మారి
ఆశావాదులకు అదొక దారి
ముష్కర మూకల రహదారి
తీవ్రవాదం నిత్యం ఊరికే గోదారి
మేధావులే సంపదకు పెడదారి
నిరుద్యోగుల ఉపాధికి దారి
నిగ్రహశక్తిని లోపరుచుకొనే దారి
తీవ్రవాదం నిత్యం ఊరికే గోదారి
శిక్షణతో మారుస్తారు కొందరి దారి
స్త్రీలలో కూడా ప్రోత్సాహపు దారి
ప్రజల సమస్యల్ని తీర్చే దొకదారి
తీవ్రవాదం నిత్యం ఊరికే గోదారి
ఈ దారి ఎవ్వరికి మంచిది కాదు
క్షణికవాసానికి లోను కాకండి
ఒక్క నిముషం ఆలోచించండి
అడుగు వేసేముందు చూడండి
మూగజీవులను కూడా బాధపెట్టకండి
మానవత్వానికి చేయూత నివ్వండి
ప్రబల శత్రుత్వాన్ని వదలండి
సమానత్వాన్ని ఏకం చేయండి
నిర్మలత్వానికి సహకరించండి
తల్లి తండ్రులకు బిడ్డలందరు సమానము
బిడ్డల తప్పుమార్గం ఖండించుట కర్తవ్యము
బలహీనతలను వక్రమార్గంలో తిప్పకము
జీవితము మంచి చెడుల ప్రయాణము
--((**))--
ప్రాంజలి ప్రభ
నేటి కవిత
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
నిరాదరణ నిర్భాగ్యులు కాదు
కడలిలో కొట్టుకు పోయే నావలు కాదు
నిట్టూర్పుల నిస్చేష్టులు కాదు
రెక్కలు లేని పక్షులు కాదు
ఆదుకోలేని అధములు కాదు
దారం తెగిన గాలిపటాలు కాదు
గాలికి రాలిపొయ్యే పువ్వులుకాదు
పనికి రాని గడ్డిపువ్వులు అంతకన్నా కాదు
విసిరేయబడ్డ ఇసుక రేణువులు కాదు
గాలికి ఎగిరే చెత్తకాగితాలు కాదు
ఒడ్డుని దాటలేని కెరటాలు కాదు
గమ్యం తెలియని వారు అంతకన్నా కాదు
పిడికెడు కబళం కోసం కక్కుర్తిపడేవారుకాదు
కళ్ళ చూపులతోనే శపించేవారు కాదు
ఆకలిని అదుపుచేసుకోలేనినారు కాదు
కన్నీటినే త్రాగి కడుపునింపుకొనే వారణక తప్పదు
అందుకే వారు
జీర్ణమై జీవచ్ఛవమై ముడతలు బడ్డ ముదిమి
జవసత్వాలు ఉడికిన మేధాసంపత్తిని అందించే బలిమి
నిర్వీర్య నిస్తేజాలు కాదు ఉత్తేజ ఉపోద్ఘాత కలిమి
వట్టిపోయిన పశువులు అసలే కాదు కర్మ బద్ధుల చెలిమి
కళ్లుండి గుడ్డివారుగా ఉండే వారికన్నా వెలుగుచూపే పున్నమి
బద్ధకస్తులకన్నా గుండెధైర్యంతో అనుభవాలు తెలిపే ఘని
వారే మన మాతృ మూర్తులు
వృద్ధులని కించపరిచి చులకన చేయకండి
బిడ్డలని వుద్ధిలోకి తెచ్చే ధర్మ దక్షులు
స్థిర చరాస్తులు సమకూర్చిన కృషీవలులు
శక్తికిమించి చమటోట్చి సహకరించిన వృద్దులు
అందుకే వారిని ఆడుకోవటం మనలక్ష్యం
మన ధ్యేయం, మనగమ్యం, మనకర్తవ్యం
ఎండు టాకులని నిర్లక్ష్యం చేయకండి
పండు ఆకులై సహకరించి ఆదుకున్న
వృద్ధులని గమనించండి
నిర్లక్ష్యం చిన్నచూపు చూస్తే
అదే మనకు తారసపడు తుందని తెలుసుకోండి
వృద్ధో రక్షతి ఱక్షత:
--((**))--
బ్రతుకు బండి-ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ
విశ్వాసమే నీకు బ్రతుకు బండి
అనురాగమే ఆమని బండి
అభిమానమే ఆత్మీయుల బండి
సహనమే అందరిహృదయ బండి
చతన్య దీపమే చీకట్ల బండి
ఆత్మ విశ్వాసమే చిరంజీవుల బండి
జీవన వృక్షం వకుళించి చిగురించు బండి
జీవన వసంత జీవి తేజస్సు బండి
మానస వీణ మధురస్మృతి బండి
సమాజ రక్షణ సంకల్ప బండి
మూగబోయిన హృదయానికి ప్రేమ బండి
అలమటించే వారికీ స్నేహ బండి
ప్రేమికులకు చల్లని వెన్నెల బండి
వేడుకలకు వర్షపు జల్లుల బండి
కోరికలకు తపన తగ్గించే బండి
ఆశయాలకు ఆదరణ ఇచ్చే బండి
సుఖాన్ని అందించే సారధి బండి
అమృతాన్ని అందించే సుఖ బండి
ఆలోచనల అమలుపరిచే ఆదర్శ బండి
విధాత వ్రాసిన కలియుగ బండి
--((**))--
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ఏమిచెప్పాను ఎలా చెప్పను
హృదయ విదార విలాస కేళి
ఆహార హారం నీ ధ్యాస
తన్మయ తాపం నీ ప్రేమ
దేహమంతా నీ కృప
ధ్యానమంతా నీ స్నేహ
హృదయమంతా నీ రూపు
మనస్సంతా నీ మాయ
పెదవులంతా నీ ముద్ర
కనులంతా నీ కైపు
వయసంతా నీ కర్పణ
వలపంతా నీ తర్పణ
సొగసంతా నీ ఈప్సితి
తనువంతా నీ తల్పం
జీవనమంతా నీ మురళి
అనురాగ మంతా నీ రవళి
అభిమానమంతా నీ సరళి
ఆలాపన అంతా నీ లోగిళి
ఏమిచెప్పాను ఎలా చెప్పను
హృదయవిదార విలాస కేళి
--((**))--
కలిగించునది శాంతి
అదియే మనకు ప్రశాంతి
అనురాగపు దివ్య కాంతి
కరిగింది కరిగింది మనస్సు
ఒరిగింది ఒరిగింది ఇంద్రధనస్సు
కులుకింది కులికింది యశస్సు
ఉరికింది ఉరికింది ఉషస్సు
చిగురించింది వయస్సు
పరిమళించింది ఛందస్సు
భ్రమింపచేసింది వర్చస్సు
ఫలించింది తపస్సు
ఆకర్షించింది నేత్ర సొగసు
జ్వలించింది నీడ మనసు
తపించింది ప్రేమ వయసు
ఫలించింది జంట మేధస్సు
సుజీవన స్రవంతి
కలిగించునది శాంతి
అదియే మనకు ప్రశాంతి
అనురాగపు దివ్య కాంతి
--((**))--
కమనీయ దృశ్యమే - కమనీయ కావ్యమే
కమనీయ భాష్యమే - కమనీయ మంత్రం
కనువిందు సిద్ధియే - కనువిందు సఖ్యతే
కనువిందు ధర్మమే - కనువిందు మార్గం
విధిరాత కయ్యమే - విధిరాత నెయ్యమే
విధిరాత వియ్యమే - విధిలేని కాలం
కనుపాప అద్దమే - కనుపాప రక్షణే
కనుపాప చూఫులే - కనుపాప లీలా
మహిలోన పుట్టుటే - మహిలోన జచ్చుటే
మహిలోన మంటలే - మదిలోన భీతీ
నిముషంలొ మార్పులే - నిముషం లొ తీర్పులే
నిముషం లొ కూర్పులే - సమయం లొ మార్పే
మరుగేల ఓరమా - మరుగేల ఓ ఉషా
మరుగేల ఓసిరీ - మరుగేల నీతో
మదిలోని కాంతియే - మదిలోన మాయయే
మదిలోన ప్రేమయే - మదిలోని ప్రియం
సువిధేయ శ్రీమతీ - సువిధేయ శ్రీపతీ
సువిధేయ నెయ్యమే - సువిధాతా లీలా
--((*))--
క్రిస్మస్ శుభాకాంక్షలతో ..........
గారవింపనర్హుడౌను ..
-----------------------------
ఉత్సాహ
ఏసు పేర జననమొందె నిలకు శాంతిఁ గూర్చఁగా
వాసిఁగాంచె దూతయగుచుఁ బ్రభునికొక్క పుత్రుఁడై
ఈసులేక పరులఁగూర్చి యెలమి తోడ బ్రతుకఁగాఁ
జేసెనతఁడు బోధలెన్నొ క్షితిని జనులు వొగడఁగా
త్యాగగుణము సూపెనతఁడు ధరణిమెచ్చు రీతిగా
వేగ వేగ వ్యాప్తిఁజేసి ప్రేమనెదల మెండుగా
రాగమేమిలేకయెందు రగడలేక యెవరితో
యోగివలెనె బ్రతికెనిలను నున్నకాలమంతయున్
కోలుపోయె ప్రాణమదియుఁ గొనకు తాను శిలువపై
జాలితోనె గాంచెఁగాని శత్రువులను సయితమున్
తూలనాడఁడప్పుడైన దోసమెంచి వారిలోఁ
గేలుమోడ్చి కోరుకొనుటె కృపనుఁ జూప వారిపై
ఎఱుకఁగలిగి యరులకైన నెట్టివాడొ నిజముగాఁ
గఱకువైన యెదలనైనఁ గరుణ పొంగి పారఁగా
మఱల మఱల జెప్పుకొనఁగ మనుజులతని మహిమలున్
చరితమద్ది నిలిచిపోయె శాశ్వతముగ ధాత్రిపై
మతము తనది వ్యాప్తిఁజెందె మహిని నాల్గు దిక్కులన్
బ్రతినఁబూని శిష్యులంతఁ బ్రజలలోనఁ జాటఁగాఁ
గతలు బోధలన్ని గూడ గ్రథితమవఁగ బైబులై
మతినినిల్ప వీలుగలిగె మంచిమంచి మాటలున్
పెరిఁగి మేరి గర్భమందుఁ బ్రీతిఁగూర్చు శిశువుగా
ధరనుఁబడ్డ దినమటంచు దైవకృపకుఁ జిహ్నమై
స్మరణ సేసికొంచు నేఁడు జరుపు కొంద్రు పండుగన్
నిరతి మీఱఁ బంచుకొనుచు నేలనంతఁ గానుకల్
వేరయినను మతము పేరు, ప్రేమబంచు వ్యక్తిగా
నేరికైన బంధువెయగు నిలను మూల మూలలన్
గారవింపనర్హుడౌను కర్మయోగి యౌటచే
ధీరగుణము త్యాగనిరతి తెలుప నతని యున్నతిన్
సుప్రభ
( మాస్టర్ అండ్ టీచర్ 0
మల్లాప్రగడ రామకృష్ణ మరియు శ్రీ దేవి 1986 ఆఫ్టర్ మ్యారేజ్ ఫోటో
Displaying DSCN4260.JPG
నన్ను గాపాడు యా - నాథుఁ డా యేసువే
వన్నెలన్ బుట్టెనే - వాఁడు మేరీకిఁ దాఁ
దెన్నులన్ జూప నా - దేవుఁడే పంపఁగాఁ
జెన్నుగాఁ నవ్వెనే - చెల్వునిన్ జూడరే
లఘు వృత్తము మందర లేక హృద్య -
ఆధారము - ప్రాకృతపైంగళము, జయకీర్తి
మందర లేక హృద్య - భ
3 మధ్య 7
అన్నుల / మిన్నకుఁ / బున్నమి / వెన్నెల
వన్నెల / తెన్నులఁ / గిన్నెర / కన్నులు
బాసయె / వాసము / ప్రాసయె / శ్వాసము
రాసము / కోసము / లాసము / హాసము
ఛందము / నందున / సుందర / బంధము
మందర / గంధము / లందున / విందులు
అందపు / సందుక / లందియ / చిందులు
దేవుని / దీవెన / లీ వనిఁ / బూవులు
ద్రావపు / చేవయె / చావుకు / జీవము
పద్యము / మద్యము / గద్యము / చోద్యము
నాద వి- / నోదము / రాధకు / మోదము
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
మిశ్రగతిలో (మూడు, నాలుగు మాత్రలతో) -
మరియ మాతకు శిశువు పుట్టెను
మురిసి పోవుచు జగతి పొంగెను
గగన మందున తార తోచెను
దేవ దూతలు జోల పాడిరి
జనులు వచ్చిరి కనగ పాపను
కాన్క లిచ్చిరి హృదయములతో
మరియ మాతకు శిశువు పుట్టెను
మురిసి పోవుచు జగతి పొంగెను
ఆవు దూడలు చూచి బిడ్డను
తలల నూపుచు పలికె అంబా
మేక పిల్లలు చూచి బిడ్డను
మెల్ల మెల్లగ పలికె మేమే
మరియ మాతకు శిశువు పుట్టెను
మురిసి పోవుచు జగతి పొంగెను
పిదప గాడిద చూచి బిడ్డను
పాడ దలచుచు పలికె హీహీ
గుఱ్ఱ మొక్కటి చూచి బిడ్డను
కాలి నెత్తుచు పలికె గుర్ గుర్
మరియ మాతకు శిశువు పుట్టెను
మురిసి పోవుచు జగతి పొంగెను
పిల్లి పిల్లలు చూచి బిడ్డను
త్రుళ్ళి పోవుచు పలికె మ్యావ్ మ్యావ్
కుక్క లప్పుడు చూచి బిడ్డను
తోక లూపుచు పలికె బౌ వౌ
మరియ మాతకు శిశువు పుట్టెను
మురిసి పోవుచు జగతి పొంగెను
చిన్న ఎలుకలు చూచి బిడ్డను
కన్ను సైగల పలికె కీచ్ కీచ్
హరిణ మొక్కటి చూచి బిడ్డను
కరుణ మీఱగ పలికె ఆ ఆ
మరియ మాతకు శిశువు పుట్టెను
మురిసి పోవుచు జగతి పొంగెను
పావురమ్ములు చూచి బిడ్డను
ఱెక్క విప్పుచు పలికె కీ కీ
కోయి లొక్కటి చూచి బిడ్డను
గొంతు విప్పుచు పలికె కూ కూ
మరియ మాతకు శిశువు పుట్టెను
మురిసి పోవుచు జగతి పొంగెను
మరియ పాపను చూడ చూడగ
అందచందము చిందు లాడెను
క్రిములు పక్షులు మృగము లెన్నో
నటన మాడెను సంతసమ్మున
మరియ మాతకు శిశువు పుట్టెను
మురిసి పోవుచు జగతి పొంగెను
విధేయుడు - మోహన
Image may contain: bird
తెర
చెరువు గట్టు మీద వంగి నిల్చున్న కొబ్బరి చెట్టు
నీటిలో మొహాన్ని చూసుకుంది
నారికేళ పాశాల ముగ్ధ రూపం
నేనూ నా మొహాన్ని చూసుకుంటా
ఒకసారి నీలో
ఒకసారి నాలో
రోడ్డు మీద ఉనికి కోల్పోతున్న జన సమ్మర్ధంలో
నా జాడలు వెతుక్కుంటా
మొహం అనేక భావాల కూడలి
అనేకానేక జంత్ర వాయిద్యాల స్వర సమ్మేళనం
చిరునవ్వును పాడుతుంది
చిరు విషాదాన్ని ప్రకటిస్తుంది
అనేక క్రూర జంతువులు గుమి గూడే గొప్ప అడివి
గుల్మ తరుశాఖల మధ్య
శుష్క కాంకాళాలను మ్రుత్యు మాలలా ధరించిన
మ్రుగరాజును అక్కడ చూడొచ్చు
మొహంలోంచి నడిచి సరాసరి నువ్వొక చీకటి గుహలోకి పోవచ్చు
దయారహిత ప్రపచాల్లోకి అడుగు పెట్టొచ్చు
అందరికీ కనిపించవచ్చు
ఇష్టం లేదని దాక్కోనూ వచ్చు
మొహం నీ మనో ద్వారానికి వ్రేలాడదీసిన కర్టన్ గుడ్డ
దాని వెనుక నీ భార్యా పిల్లలు
కల్లోల సాంఘిక జీవితం ఎవరికీ కనిపించవు
భూమిని తవ్వు తున్నట్టు
మొహాన్ని తవ్వుతున్నా
బావిని తవ్వు తున్నట్టు
మొహాన్ని తవ్వుతున్నా
ఒక జల కావాలి
తళ తల మెరిసే
పారదర్శకమైన జల కావాలి
తవ్వుతున్నా
రాత్రింబవళ్ళు తవ్వుతున్నా
మహాఘోష 2004
నిశి వస్తే నింగికి సంబరం .... తారలు , శశి రాకతో బహు సుందరం
చరాచర ప్రకృతికీ నిశీధి లో దొరికే వెన్నెలంటే హర్ష పులకితం
రాత్రి అన్నది క్రియాశీలక చైతన్యానికి పరిపూర్ణ విరామం
ఆ విరామం లో దొరికే ఉత్తేజం తో లేచేను ప్రపంచం
కానీ రేయి నీడలో చేయమనలేదు.... నేర కిరాతకం
పగలు జాగృతమై ,రేయి విరామమై , సాగుట విధి న్యాయం
అంధకారం .... ఓటమి, నైరాశ్యాలకు కారాదు ఎపుడు స్థావరం
చుట్టూ ఉన్న తిమిరం పారద్రోలుతూ వెలిగించాలి ఆశా దీపం
కాళ రాత్రి కౌగిట్లో ,అంధకారపు లోగిట్లో , నిశి నిండిన ముంగిట్లో
చీకటి కేంద్రం చేస్కుని ..... జరిగే నేరాలు, తప్పులు , కోకొల్లలు
తప్పు చీకటిది కాదు ...... చీకటి పేరుకున్న మనస్తత్వాలది
విరామానికై అంధకారం సృష్టించింది కాల చక్రం
నిదురపోతేనే .... నూతన శక్తి , ఉత్సాహం ,బలం
నిశాచరులు .... భంగం చేస్తారు ...ప్రక్కవారి విరామం
సృష్టిస్తారు భయోత్పాతం ..... చేస్తారు అల్లకల్లోలం
చీకటి ఉంటేనే కదా తెలిసేది వెలుగుల ప్రాశస్త్యం
చీకటిని ఎదుర్కొంటే నే దొరుకుతుంది కాంతి జీవనం
రాత్రి అయితేనే జాబిల్లి- తారల ప్రకాశ సంచలనం
నింగిలో కదిలే మేఘమాలికల అపురూప దర్శనం
ఈ వెన్నెల కావాలంటే .... ఆ చీకటికి ఇవ్వాల్సిందే ఆహ్వానం
చీకట్లో దొరికే ఆ వెన్నెల మైకం యెంత రమణీయం
అనిభవంలోనే అవగతమయే రమ్యానుభవం ....
"తమసోమా జ్యోతిర్గమయా " అన్నది హిందూమత ప్రబోధం
ఆత్మ దీపం వెలిగించి ,తమస్సు తొలిగించి సాగించాలి జ్ఞాన మార్గం
కిన్నెరసాని.అంటే ఒక వాగు గోదావరి నదికి పాయ...
కాని కవులు ఒక అందం అయిన అమ్మాయి గా వర్ణిస్తారు!
నిజమేనంటారా....
విశ్వనాథ గారి ..కిన్నెరసాని.!
. కిన్నెర నడకలు
కరిగింది కరిగింది
కరిగింది కరిగింది
కరిగి కిన్నెరసాని వరదలై పారింది
తరుణి కిన్నెరసాని తరకల్లు కట్టింది
పడతి కిన్నెరసాని పరుగుల్లు పెట్టింది
కదిలింది కదిలింది
కదిలింది కదిదింది
కదిలి కిన్నెరసాని వొదుగుల్లుపోయింది
సుదతి కిన్నెరసాని సుళ్ళుగా తిరిగింది
ముదిత కిన్నెరసాని నురుసుల్లు గ్రక్కింది
నడచింది కడరాళ్ళు
గడచింది పచ్చికల్
తడసి కిన్నెరసాని సుడులలో మొరసింది
జడిసి కిన్నెరసాని కడలందు వొరిసింది
సుడిసి కిన్నెరసాని జడలుగా కట్టింది
కరగగా కరగగా
కాంత కిన్నెరసాని
తరగచాలుల మధ్య తళతళా మెరిసింది
నురుసుపిండులతోడ బిరబిరా నడిచింది
ఇసుక నేలలపైన బుసబుసా పొంగింది
కదలగా కదలగా
కాంత కిన్నెరసాని
పదువుకట్టిన లేళ్ళకదుపులా తోచింది
కదలు తెల్లని పూలనదివోలె కదిలింది
వదలు తెల్లనిత్రాచు పడగలా విరిసింది
నడవగా నడవగా
నాతి కిన్నెరసాని
తొడిమ యూడిన పూవు పడతిగా తోచింది
కడుసిగ్గుపడు రాచకన్నెలా తోచింది
బెడగుబోయిన రత్న పేటిలా తోచింది
పతి రాయివలె మారి
పడియున్న చోటునే
పడతి కిన్నెరసాని విడలేక తిరిగింది
ముగుద కిన్నెరసాని వగచెంది తిరిగింది
వెలది కిన్నెరసాని గలగలా తిరిగింది
తాను నదిగా నేల
నైనా ననుచు లోన
పూని కిన్నెరసాని పొగిలింది పొగిలింది
ముక్త గీతికవోలె మ్రోగింది మ్రోగింది
ఒకచోట నిలువలే కురికింది వురికింది
ఏ వుపాయము చేత
నైన మళ్ళీ తాను
మనిసి కిన్నెరసాని నగుదామ యనిపించి
ఆపలేనంత కోరికచేత విలపించి
ముగుద కిన్నెరసాని మొరసింది మొరసింది
బండలు
ఆరాధ్య భక్తి లీల
మల్లాప్రగడ రామకృష్ణ
సురుచిర సుందర మోక్తికమా
సురవిహార వన సోభితమా
3। రచన: అన్నమాచార్య
జో అచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంద రామ గోవిందా ।।
అంగజుని గన్న మా యన్న యిటు రారా
బంగారు గిన్నెలో పాలు పోసేరా ।
దొంగ నీవని సతులు గొంకుచున్నారా
ముంగిట నాడరా మోహనాకార ।।
గోవర్ధనంబెల్ల గొడుగుగా పట్టి
కావరమ్మున నున్న కంసుపడగొట్టి ।
నీవు మధురాపురము నేలచేపట్టి
ఠీవితో నేలిన దేవకీపట్టి ।।
నందు నింటను జేరి నయము మీఱంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ ।
నందముగ వారిండ్ల నాడుచుండంగ
మందలకు దొంగ మా ముద్దురంగ ।।
పాలవారాశిలో పవళించినావు
బాలుగా మునుల కభయమిచ్చినావు ।
మేలుగా వసుదేవు కుదయించినావు
బాలుడై యుండి గోపాలుడైనావు ।।
అట్టుగట్టిన మీగ డట్టె తిన్నాడే
పట్టి కోడలు మూతిపై రాసినాడే ।
అట్టె తినెనని యత్త యడగ విన్నాడే
గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే ।।
గొల్లవారిండ్లకు గొబ్బునకుబోయి
కొల్లలుగా త్రావి కుండలను నేయి ।
చెల్లునా మగనాండ్ర జెలిగి యీశాయీ
చిల్లతనములు సేయ జెల్లునటవోయి ।।
రేపల్లె సతులెల్ల గోపంబుతోను
గోపమ్మ మీ కొడుకు మా యిండ్ల లోను ।
మాపుగానే వచ్చి మా మానములను
నీ పాపడే చెఱిచె నేమందుమమ్మ ।।
ఒకని యాలినిదెచ్చి నొకని కడబెట్టి
జగడములు కలిపించి సతిపతులబట్టి ।
పగలు నలుజాములును బాలుడై నట్టి
మగనాండ్ర చేపట్టి మదనుడై నట్టి ।।
అలిగి తృణావర్తు నవని గూల్చితివి
బలిమిమై బూతన బట్టి పీల్చితివి ।
చెలగి శకటాసురుని జేరి డొల్చితివి
తలచి మద్దులు రెండు ధరణి వ్రాల్చితివి ।।
హంగుగా తాళ్ళపాకన్నయ్య చాల
శృంగార రచనగా చెప్పె నీ జోల ।
సంగతిగ సకల సంపదల నీవేళ
మంగళము తిరుపట్ల మదనగోపాల ।।
చూడు అటుచూడు
ఆ కనిపించేది శ్రీ హరివాసము
ఏడుకొండలా మయము
సంతృప్తి పరిచే దైవమందిరము !!
అదే శ్రీ వేంకటేశ్వరా నిలయము
అదియే దేవతల కపు రూపము
అదియే సకల ప్రపంచ ప్రజలకు
మొక్కులు తీర్చే ఆనంద మయము
చెంగట ఉండు సుఖ సంతోషము
శాంతి సంపద అందించే సౌఖ్యము
బంగారు శిఖరాల పుణ్య ధామము
నిత్యకళ్యాణ నిర్మల ప్రాంతము
కైవల్యము చెందే సుమ వాసము
సిరి సంపద లందించే నివాసము
పాపములు తొలగించే పావన మయము
నిత్య దర్శనమిచ్చే ఆనంద నిలయము
చూడు అటుచూడు
ఆ కనిపించేది శ్రీ హరివాసము
ఏడుకొండల మయము
సంతృప్తి పరిచే దైవమందిరము !!
--((**))--
ఆనాడు జారింది హుణ్ణి
8। రచన: అన్నమాచార్య
రాగం: మధ్యమావతి
అదివో అల్లదివో శ్రీ హరి వాసము
పదివేల శేషుల పడగల మయము ।।
అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము ।
అదివో నిత్యనివాస మఖిల మునులకు
అదె చూడు డదె మొక్కు డానందమయము ।।
చెంగట నదివో శేషాచలమూ
నింగి నున్న దేవతల నిజవాసము ।
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము ।।
కైవల్య పదము వేంకట నగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది ।
భావింప సకల సంపద రూపమదివో
పావనముల కెల్ల పావన మయమూ ।।
--((*))--
నవలీలా సోమసుధా లతా మా
నవతా మాధుర్య మనో భయాందో
లన తన్మాయా సమ భావ సౌశీ
ల్య
శిలగా నుండన్ - జెడు కోప మో నా
చెలికాఁడా నె-చ్చెలిపైన నేలా
కలలోఁ గూడా - కరుణించవా యి
ట్లిలపై నుండన్ - హితమౌనె నాకున్
టలనమ్మా ఝా-టలమందు నీకై
చలిలో నుంటిన్ - స్మరియించుచుంటిన్
లలితోఁ బేరిన్ - లలితప్రియాంగాఁ
దొలి ముద్దీయన్ - దురితమ్ము రావా
(టలనము=తాత్సారము చేయుట)
Pranjali Prabha।com
ప్రక్కకు ఉండు అన్న మాట ?
ఆధి పత్యం కోసమన్నట్లు
కలసి గుడికి పోదాం అన్న మాట ?
అన్యూన్య దాపత్యం అన్నట్లు
ఆకర్షించుతూ అన్నమాటా ?
అమాయకురాలిని పెట్టకు ఇక్కట్లు
వైకుంఠ పాళీ ఆడుతూ అన్నమాట ?
పావులు కదిపి పాము నోట్లో తోయకన్నట్లు
చేయి చేయి కలుపుతూ అన్న మాట ?
నాపై సానుభూతి చూపాలన్నట్లు
మాటకు మాట పలుకుతూ అన్నమాట ?
అహంకారం వదలి కష్టం చూడాలన్నట్లు
కళ్ళ చూపులతో పలికే మాట ?
నేను నోరు విప్పని జీవి అన్నట్లు
నోటితో గట్టిగా పలికే మాట ?
తప్పు చేస్తున్నారు వస్తాయి ఇక్కట్లు
కన్నీరు తో పలికే మాట ?
హృదయాన్ని అర్ధం చేసుకోమన్నట్లు
నవ్వుతూ పలకరించే మాట ?
నీ శక్యతే నాకు సుఖ మన్నట్లు
సంపాదనతో పలికే మాట ?
సమానత్వం కావాలన్నట్లు
భాధ పెంచే వానితో పలికేమాట ?
మృగత్వం వదులు కోమన్నట్లు
ప్రేమతో పలికే మాట ?
మనస్సును అర్ధం చేసుకోవాలన్నట్లు
కోపంతో అనే మాట ?
మాటవిని మాట్లాడ మన్నట్లు
--((**))--
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి