1, మార్చి 2019, శుక్రవారం


తెలుగు భాష నేర్చుకుందాం 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ  
U I U I U I U I I    II UI 

డబ్బు మీద ఆశ జబ్బును కొని తెచ్చు
కష్ట కాల మెప్పు డుండదు గమనించు
నమ్మ కంతొ మూగ జీవిని బతికించు
ఆశ వైపు  పోక అర్థమును గ్రహించు

జబ్బు వుంటె ఖర్చు ఎక్కువ అనితెల్సు  
నష్ట కాల మెప్పుడుండదు గమనించు   
మంచి మాట చెప్పి జీవిని బతికించు 
కోర్క నిన్ను మంచి తెల్పక నడిపించు 

ఒప్పు చెప్పు నీతి వెంట నడవ వచ్చు
తప్పు చేస్తె ముప్పు వెంట నడక తంట
తప్పు ఒప్పు చూడ లేక  పడక తంట
తీపి చేదు జీవి తాంతము మణిపూస

శక్తి యుక్తి నీతి వెంట నడవవచ్చు 
శక్తి యున్న మంచి వెంట నడక తంట 
శక్తి యుక్తి అందలేక నడక తంట 

భక్తి వుంటె పొంద లేని నిదియు లేదు    

--((**))--

తెలుగు నేర్చు కుందాం 
లీలావతి ( నూతన వృత్తము )

గణములు - స,స,జ,ర.జ,వ ( 6,6,6,6 మాత్రలు)
యతి -- 10

పలికించెడి తల్లితోడఁ బాటఁ బాడ వచ్చెదవా
అలరించెడి పూలతోట నాడుకోగఁ జేరెదవా
కలమాదిరి జీవితమ్ము గడ్చిపోవు సౌఖ్యముగా
తెలతెల్లని మబ్బువోలె తేలిపోవ మానసమున్‌

నిరతమ్మును మోదమౌను నీకు నాకుఁ దథ్యముగా
వరమీణియ మీటి నేను బాడు చుండ నీజతగా
విరఁబూచెను బూవులన్ని ప్రీతిగొల్పు రీతులలోఁ
దరుణమ్మిది మంచిదౌను దల్లితోడఁ గూడుటకై

ఎదపొంగఁగఁ నాడిపాడి యీదినమ్ము పూవనిలో
మధురమ్మగు ప్రేమఁబంచి మాతకీవు మన్ననతోఁ
బదమల్లఁగ వచ్చు రేపు పంచుకోగ మిత్రులతోఁ
జదివించిన విద్యయంత సంతసమ్ము నీకిడఁగా

వినిపించెదఁ గ్రొత్త పాట వేడుకొంద నిక్కముగా
మనసారఁగఁ గూర్చితేను మంచిదొక్క రాగముతోఁ
దనియించెడి సుస్వరాలు తాపమున్న బాపెడివై
మనసంతయు నూయలూపు మర్చిపోగ నీయునికే

విడబోదది గుండెనుండి విన్నయంత తన్మయమై
కడదాకను నిల్చియుండుఁ గమ్మనైన కానుకగా
సడులయ్యవి మ్రోగుచుండ సంతతమ్ము నీయెదలో
సుడిగాలులు చుట్టియున్న స్రుక్కబోని స్థైర్యమదే
--((**))--


దేవదత్త - ర/న/న/జ/ర/లగ UI UI III III - UI UI UIU
17 అత్యష్టి 44027
    
చారుశీల కులుకు నడక ఏల ఏల ఒప్పునా  
ప్రేమ భావ కిటుకు నడత ఏల ఏల ఒప్పునా    
స్నేహశీలి మడత ముడత ఏల ఏల ఒప్పునా  

కాల మాయ ఒకటె అనక ఏల ఏల ఒప్పునా   
--((**))--

తెలుగు భాష నేర్చు కుందాం 28
మల్లా ప్రగడ రామకృష్ణ
U I  U I U I U I 
       
తోడు నీడ నాకు లేదు
ఆశ ఒక్కటే నాకు తోడు
కూడు గుడ్డ నాకు లేదు 
ప్రేమ ఒక్కటే నాకు తోడు


మెచ్చే విద్య నాకు లేదు
జాలి ఒక్కటే నాకు తోడు
సత్య వాక్కు మాన లేదు
నీతి ఒక్కటే నాకు తోడు

పువ్వ లాంటి మేను లేదు
నవ్వు ఒక్కటే నాకు తోడు
అప్పు లాంటి దాత లేదు
నిప్పు ఒక్కటే నాకు తోడు

తప్పు చెప్పె నేత లేదు
ఒప్పు ఒక్కటే నాకు తోడు
కీర్తి పెంచు దారి లేదు
ఓర్పు ఒక్కటే నాకు తోడు

మంచి పంచు దారి లేదు
కాల మోక్కటే నాకు తోడు
చేష్ట మార్పు దారి లేదు
ప్రాణ మోక్కటే నాకు తోడు

పేద బత్కు దారి లేదు
జ్ణాన మోక్కటే నాకు తోడు
రాస లీల దారి లేదు
రాత్రి ఒక్కటే నాకు తోడు

--((**))--


*చందస్సు (ఆలుమగలు)
UI_III_III_UI_IIU


ధర్మ పధము పతికి ధర్మ సతియే
పాలు జలము కలసి నట్లు జతయే
అమ్మ ఉనికి పలుకు నాన్న కొరకే
అత్త కలసి బతుకు మామ   కొరకే

ఆలు మగలు కలిసె నాద రముకే
బంధు జనుల కలయికా మమతకే
మంచి గుణము అనియు భంద మగుటే
మాట నెపుడు మరువకా కలియుటే


విద్య సిరులు పుడమి యందు సెగలే
యన్న మడిగి నతని యందు మనసే
పుణ్య మను నది యును దాన సలుపే
కర్మ ఫలము అనుభ వాళ తలపే  


మాట ఓకరి కొకరు వాద మవకే
సాటి నవ యువకుల విద్య కొరకే
బిడ్డ లకు సమయ సహాయ తలపే
నిత్య అణుకరుణతొ ఆలు మగలే  
 

--((*))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి