|
ఓం శ్రీ రాం - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్రభ - వాక్కులు - అవాక్కులు (2) (కధ) -(20)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
పెళ్ళి చూపుల్లో కాబోయే మాఁవగారూ, కోడలు
సంభాషణ :-
అమ్మాయి, నీకు టైపింగ్ వచ్చా..?!
నిమిషానికి కనీసం పది మందికి వాట్స్ అప్ లో రిప్లై ఇవ్వగలనండి. గంటకు పది పోస్ట్లు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసేస్తానండి!
మంచిది. వంటా వార్పు ఏమైనా వచ్చా తల్లీ..?!
సిటీలో ఉన్న కర్రీ పాయింట్స్, రెస్టారెంట్స్, హోటల్స్, టేక్ అవే సెంటర్స్ యాప్స్ అన్ని అలవాటు చేసుకున్నానండి. ఆర్డర్ పెట్టడం చిటికెలో పని"
శభాష్. టెక్నాలజీ ఏమైనా నేర్చుకున్నావా అమ్మా..?!
ఆండ్రాయిడ్ న్యూ వర్షన్ దాకా మొబైల్ అప్ డేట్ లో ఉంచుకున్నానండి.
భలే భలే. స్పోర్ట్స్ లో ప్రవేశం ఉందామ్మ..?
క్యాండీ క్రష్, టెంపుల్ రన్ లో ఈ కాలనీలోనే నన్ను బీట్ చేసిన వాళ్ళు లేరండి.
మరి డ్రైవింగ్ అయినా వచ్చా అమ్మాయ్..?
ఊబర్, ఓలా నాకు బెస్ట్ కస్టమర్ అవార్డ్ కూడా ఇచ్చాయండి.
అబ్బో!మరి ఇల్లు సర్దుకోవడం, బట్టలు ఉతుక్కోవడం లాంటి పనులు..?!
ఎవరు కావాలన్నా జస్ట్ డయల్ ఉంది కదండీ.
అమ్మాయి నీవు రాజకీయంలో తిరుగుతున్నావని తెల్సింది అది నిజమేనా
ఆడవాళ్లు మొగవాలాతో సమానం కదండీ, అందుకని నేను రాజకీయంలో తిరగటం త ప్పా చెప్పండి
ఆ ఆ తప్పు లేదు కానీ
పెళ్లి ఆయినాకా నీ భర్తకు సెల్ ఫోన్ మాటలు, నీ ప్రవర్త నచ్చ లేదని అరిస్తే ఎం చేస్తావ్
ఏమి చేయను విడాకులిచ్చి నాకు ఇష్ట మైన వాడిని పెళ్ళిచేసుకుంటా
ఆ అట్లా అనవచ్చా
మీరు పెద్దవారు మొగ వాల్లకో రూలు ఆడవాళ్ళకో రూలు ఉంటుందా చెప్పండి
ఒక పార్టీలో పదవి రాలేదనుకో వేరే పార్టీలో దూకటంలా నాయకులు నేను అంతే
వెళ్లోస్తాం అమ్మా. ధన్యోస్మీ తల్లీ..
నేను నచ్చానాండి..?
ఇంటికి వెళ్ళాక మెసెంజర్ లో చెప్తానమ్మా.
అలాగే నువ్వు ఎప్పుడు ఆన్ లైన్ లోనే ఉండు తల్లీ.!!!
--((*))--
ఓం శ్రీ రాం - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్రభ - వాక్కులు - అవాక్కులు (కధ) -(19)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
వాక్కులు - అవాక్కులు ఎం తాత తీరుబాటుగా కూర్చొని చుట్ట త్రాగుతున్నావు, నీ ఆరోగ్యం చెడిపోతుందని తెలిసి కూడా తగుతున్నావా
ఎదో రా ఈ జీవితం ఇలా సాగని, కాని ప్రభుత్వం వారు బహిరంగంగా గుడ్క, సిగేరేట్ అమ్ముతున్నారు దీనివల్ల వయసులో ఉన్న అనేకమంది అనారోగ్యు లవుతున్నారు వారిని చూసేవారెవరు, కేవలం వ్యాపారం దృష్టిలో పెట్టుకొని ఆదాయం కోసం అమ్మడం ఎంతవరకు సమంజసం రా అని అడుగుతున్నాను।
నిజమే తాత మీరు చెప్పుతున్నది అక్షరాల నిజమే
సరే తాత ప్రస్తుత రాజకీయము గురించి నాలుగు మాటలు చెప్పు ఎవరిని గెలిపించాలి, ఎవరికి ఒటేయ్యాలి ?
నా అభిప్రాయం మాత్రం చెప్పగలుగుతా మీరు ఎవరికీ వేస్తారో అది మీ ఇష్టం
సరే తాత ని ఉద్దేశ్యము చెప్పు
ఉండు ఈ చుట్ట అవతల పారేసి చెపుతా
మొత్తం త్రాగాకే చెప్పుతాతా
నేను త్రాగటం తగ్గించానురా, ఎదో ఈ రోజు గుర్తుకు వచ్చి త్రాగా
ఆ ఇప్పుడు చెప్పు ఎదో అడుగుతున్నావు
ఎవ్వరికి ఓటువేయాలి
అభివృద్ధి పరచిన వారికి ఓటు వెయ్యాలి
అర్ధం కాలా
మనం ఏ పరిస్థితిలో విడిపోయాము, ఎవరి సహాయము ఆశించి విడిపోయామొ ఒక్కసారి చెప్పు
అవును తాతా వేల కోట్ల లోటు బడ్జెట్, అప్పుతో రాజధాని లేకుండా విడి పోయాము, కేంద్రం సహాయము చేస్తానని చేయలేదా తాతా
నీవన్నది అక్షరాలా నిజం అనుభవమున్న వాడికి అధికారం ఇచ్చాము కదా
5 సంవత్సరాలలో అభివృద్ధి ఏమి కనిపించలేదని, పది సంవత్సరాలు అవకాసమున్న వెంటనే రాజధానిని నిర్మిస్తానని ఏమి జరగలేదు ప్రతి పక్షం గొంతు చించు కుంటున్నది కదా తాత ।
ప్రతి పక్షం గా ఉండి ప్రజా సమస్యలను పరిష్క రించటానికి ప్రయత్నం ఎమన్నా చేసిందా లేదే, కనీసం హాజరుకూడా కాలేదు కదా, జీతాలు తీసుకుంటూ పాదయాత్రలు చేస్తే ప్రజలు ఓట్లు వేస్తారని ఏ విధంగా అనుకంటారో నీవె చెప్పు
నోరున్నదికదా అని దుర్మార్గుడు, దుష్టబుద్ధి కలవాడు, రాజ్యాన్ని బ్రష్టు పట్టించాడు అని విమర్శిస్తే ప్రజలు ఓట్లు వేస్తారా
ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలు గమనిస్తున్నారు కదా
ప్రపంచ దేశాలకు తలమానికంగా నిలబడే రాజ ధానిని నిర్మిస్తున్నారుట కదా అది నిజమేనా
నీవే ప్రత్యక్షంగా వెళ్లి రాజధానికి అవసరమైన భవనాలు ఎంత వరకు పూర్తి అయినాయో ఇంకా ఏమి పూర్తికావాలో, ఒక్కసారి చూసి తెలుసుకో
ఏమోలే తాతా అంత దూరం నేను ఏమి పోగలను
మరి ప్రక్క రాష్ట్రంలో ఉన్నప్పుడు పొయ్యావుగా
అది వేరు ఇది వేఱు
మార్పు కోరుతున్నారు ప్రజలు మాకే ఓటు వేయండి అంటూ కొత్త కొత్త పార్టీలు ప్రజలవద్దకు వస్తున్నాయి కదా తాతా
వస్తాయి బాబు ఇంతకు ముందు ఒక నటుడు నన్ను గెలిపిస్తే ప్రజా సమస్యలు తీరుస్తా అన్నాడు, అతన్ని గెలిపించకుండా వేరే పార్టీని గెలిపించారు ఏమైంది ఆశకు లోబడి, మంత్రిపదవికి ఆశబడి గెలిచినవారితో కలసి పార్టీనే వేరొక పార్టీ లో కలిపేసాడు, అతను ఇప్పుడు ప్రజలముందుకు రావటానికి భయపడుతున్నాడు।
తాతా ఓటు ఎవ్వరికి వెయ్యాలో చెప్పక ఇంత కధ చెప్పావు కదా
*మాతృహీన శిశుజీవనం వృధా, కాంతహీన నవయవ్వనం వృధా,*
*శాన్తిహీనతపసః ఫలం వృధా, తింత్రిణీరస విహీన భోజనం వృథా, వృథా!!*
తల్లిలేని పిల్లవాని బ్రతుకు, భార్యలేనివాని యవ్వనం, శాంతం లేని ఋషి తపస్సు ఇవన్నీ ‘చారు’ లేని భోజనంలా నిష్ఫలం అని పై శ్లోకానికి అర్ధం।
అందుకే మీరు వేసే ఓటు వృధా కాకుండా ఎవ్వరి వళ్ళ మనదేశం, మనరాష్ట్రం బాగుపడుతుందో ఆలోచించి మరి వెయ్యమని చెప్పుతున్నా
తాతా నాకు ఒకటి తెలుస్తున్నది వాక్కులు అవాక్కులు విని ప్రజలే నిర్ణయం తీసుకోవాలంటావ్
అవునురా బాబు ఇది రాజకీయం చెప్పుకుంటూ పొతే చాలా పెద్ద కధ ఇరోజుకు ఇది చాలు రేపటి ఆలోచనలు రేపే చెప్పకుందాం ఇంకా ఓట్లు వెయ్యటానికి చాలా రోజులున్నాయి కదా
అవునుకున్నాయి కదా
తాతా చుట్ట వెలిగిస్తావా
ఈరోజు నుంచి చుట్ట మానేస్థాను అని చుట్టల కట్ట విసి రేసాడు తాత ఎండలు ఎక్కువగా ఉన్నాయి మజ్జిగ తాగుదాం పా
అట్లాగే ।
--((**))--
ఓం శ్రీ రాం - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్రభ - ఉద్యోగమా - పెళ్లామా (కధ) -(18)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ఏమిటే ఆలా మెలికలు తిరి పోతున్నావు, నన్ను ఒకడు ప్రేమిస్తున్నాడని అన్నాడే అన్నది శిరీష , స్నేహితులు అన్నారు, ఒక అమ్మాయిని పొందా లంటే ఆబ్రహ్మ దేవునికి కూడా సాధ్యం కాదు, ఆ అశోక్ గాడిని పిలువు, బారుకి తీసుకెళ్లి బాగా వదిలిద్దాం, అప్పుడు ప్రేమ వద్దు అని చెప్పవచ్చు అని స్నేహితులు చెప్పారు.
ఒక నవ్వు నవ్వి అశోక్ ను శిరీష పిలిచింది, క్లబ్ కు పోదామంది, పీకల దాకా దాగింది, అశోక్ ను నోటికి వచ్చి నట్లు తిట్టింది, అక్కడే క్రింద పడింది, అప్పుడు పోలీసులు రైడ్ చేశారు, స్నేహితులు పరిగెత్తారు శిరీషను వదిలి, కొంత పైకము తీసుకోని పోలీసులు వెళ్లి పోయారు. అప్పుడే ఆమె బ్యాగులో సెల్ మ్రోగింది, వెంటనే చెప్పాడు మీ అడ్రస్ చెప్పండి, మీ అమ్మాయి త్రాగి క్లబ్బులో పడింది, తీసుకొస్తున్నాను అని కబురు పంపి తీసుకొచ్చి దించి వెళ్లి పోయాడు అశోక్ .
పొద్దున్నే లేచి అమ్మా నన్ను ఎవరు తెచ్చారు, ఎవరో అశోక్ టా, నీకు ఎన్ని సార్లు చెప్పిన నీ అలవాట్లు మానుకోవు, డబ్బు మనిషిని పాడు చేస్తుంది, డబ్బు చేతికి అందక పొతే పిచ్చి వాణ్ని చేస్తుంది, అసలే నీవు యవ్వనం లో ఉన్నావు, బీటెక్ పూర్తిచేసావు, ఉద్యోగ కోసం ప్రయత్నిస్తున్నావు.
ఇదే చివరి మాట ఇక చెప్పేది లేదు, ఇక పెళ్లి చేయటమే మా తక్షణ కర్తవ్యమ్, నీవు ఉద్యోగం చేసి మాకు సంపాయించి పోషించ నక్కరలేదు అని గట్టిగా చెప్పారు తల్లి తండ్రులు.క్షమించండి అని చెప్పి లోపలకు వెళ్లింది.
అప్పుడే ఆతల్లి "కూతురు ప్రవర్తనకు" భాదపడుతూ ఆ భగవానుకి మోర పెట్టుకున్నది.
మానసమ్మందు నో మాధవా నీవె నా ప్రాణమీ ధారుణిన్
బాలు పోయంగ రా వానలో నెండలో వంతలో విందులో
ధ్యాన మా నామమే దానవారీ హరీ చిత్తమం దెప్పుడు నా చింత
నీవేగదా పొత్తమం దెప్పుడు నీ మూర్తి నే జూతురా ముత్తెముల్
నీవెగా మోహనానంద నా విత్తముల్ నీదెగా ప్రేమ
చింతామణీ నల్లనౌ దేహమే నాకు నెల్లప్పుడున్ దెల్లఁగాఁ
దోఁచురా తేలి నే పోదురా యుల్ల మూయాలగా యూఁగురా
తూఁగుచున్ మెల్లగా నవ్వుచున్ మేలమాడంగ రా పూవులోఁ
జూతు నిన్ బ్రొద్దులో జూతు నిన్ గ్రోవిలో విందు నిన్
ద్రోవలో విందు నిన్ నీవు నేనందురా నిన్ను నాకందురా
జీవమున్ గావఁరా జీవితేశా నమస్తే నమస్తే నమస్తే నమః
తండ్రి కూతురి వద్దకు వచ్చి ఈ విధముగా తెలియ పరిచాడు
స్త్రీలు అనాదిగా మోసపోతూ ఉన్నారు, అది ఎవరి
వలనని ఆలోచించటం అనవసరం, ఎందుకంటే తిరగక పొతే చెడిపోతాడు మొగవాడు, తిరిగితే చెడి పోతుంది ఆడది, అర్ధం కాలేదను కుంటా ఆడవారు కళ్ళ బొల్లి మాటలకు లొంగి పోతారు. తిరిగితే, కాలు జారీనా జారవచ్చు, బయట పడేది ఆడదాని శీలం విలువ, అదే మొగ వాడు తిరుగక ఇంట్లో ఉంటే ఆడంగి వేషాలు వేసుకొని బ్రతికేవాడుగా, ఆడదానికన్నా ఘోరముగా మారుతాడు.
వలనని ఆలోచించటం అనవసరం, ఎందుకంటే తిరగక పొతే చెడిపోతాడు మొగవాడు, తిరిగితే చెడి పోతుంది ఆడది, అర్ధం కాలేదను కుంటా ఆడవారు కళ్ళ బొల్లి మాటలకు లొంగి పోతారు. తిరిగితే, కాలు జారీనా జారవచ్చు, బయట పడేది ఆడదాని శీలం విలువ, అదే మొగ వాడు తిరుగక ఇంట్లో ఉంటే ఆడంగి వేషాలు వేసుకొని బ్రతికేవాడుగా, ఆడదానికన్నా ఘోరముగా మారుతాడు.
నీవు చేసింది మంచో చెడో నాకు అర్ధం చేసుకొనే చదువు లేదు, ఎదో తోటను నమ్ముకొని బ్రతుకుతున్నాను దానిమీద వచ్చిన పైకముతో పైకి వచ్చాను, అదే నీకు నాకు కూడు పెడుతున్నది.
అనాది నుండి నేటివరకు నింగి నేల కలిసినట్లు కనబడుతున్నది కానీ కలుస్తుందో లేదో తెలియదు కానీ భార్య భర్తల సంగమమే అనురాగ భందమై జీవిత సానిత్యానికి పిల్లలు పుడతారు. వారి ఆనందానికి తోడ్పడే వాళ్లు తల్లితండ్రులు మాత్రేమే, ఎప్పుడూ పిల్లలకు ప్రేమను పంచుతారు, విషం మాత్రం పంచరు.
స్త్రీ జీవితము అనగా ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా, బిడ్డగా రూపాంతరము చెంది అన్ని రంగాలలో ముందడుగు వేస్తున్నది, సూర్యుడికన్నా ముందే లేచి పాచిపని , ఇంటిపని , వంట పని చేస్తూ పిల్లలకు స్కూలుకు క్యారేజీ రడీచేసి, భర్తకు క్యారేజ్ రడీ చేసి, భర్తను ముద్దు చేసి ఆఫీసుకు పంపి అలసి పోయి, తాను ఉద్యోగమూ చేస్తూ నిరంతరము ఓర్పు తో బస్సుల్లో తిరిగి ఇంటికి చేరే పరిస్థితి ఉన్నది, అవసరమయితే స్త్రీలు దుర్మార్గులపై భద్రకాళి రూపము దాల్చి చండాడే విధముగా మారాలి నేటి సమాజములో. నీవు వళ్ళు మరచి త్రాగి తల్లి తండ్రులకు తలవంపులు తెస్తావనుకోలేదు.
మా పెంపకంలో ఎక్కడో ఎదో లోపం జరిగింది, అయినా దేవుడు మన యందు దయచూపాడు, నిన్ను క్షేమంగా ఇంటికి చేర్చాడు. నేనొక కధ చెపుతాను వినమ్మా.
ఇంటికి ఆలస్యంగా త్రాగి వచ్చిన కూతురిని పై చదువుల కోసం ధ్యాస పెట్టమని , ఇలాంటివి మానుకొమ్మని తల్లిదండ్రులు మందలించారు.
"చిన్నప్పటి నుండి చూస్తున్నాను, నాకు మీరు అస్సలు స్వేచ్చ ఇవ్వడం లేదు. ఎంత సేపు చదువు చదువు అని నా ప్రాణం తోడేస్తున్నారు . నేను మిత్రులతో గడపకూడదా ? సినిమాలకి షికార్ల కి వెళ్లకూడదా ? అందరు వెళ్ళడం లేదా ? మొబైల్ లో ఒక గంట సేపు మాట్లాడితే తప్పా ? ఫేస్బుక్ లో చాటింగ్ తప్పా ? " అని నిల దీసింది కూతురు .
"సరే నీకు కావలసినంత స్వేఛ్చ ఇస్తాను. ఒక్క సారి నా మాట వింటావా ? ఈ రోజే మనం ఒకసారి మన సొంత ఊరికి వెళ్లి వద్దాము . అక్కడ రెండు రోజులు ఉందాము . తిరిగి వొచ్చిన తర్వాత నీ ఇష్టం " అని తండ్రి బదులిచ్చాడు. కూతురు సరే అన్నాది . అనుకున్నట్టు గానే సొంత ఊరికి బయలు దేరారు.
తండ్రి కూతురితో కలిసి వారి మామిడి తోటకి తీసుకెళ్ళి "నేను ఇక్కడే కుర్చుంటాను . ఈ తోటలో నువ్వు ఒక గంట సేపు తిరిగిరా అని బదులిచ్చాడు" కూతురు ఒక గంట తర్వాత తిరి గొచ్చింది. తోటలో నువ్వు ఏమి చూసావు అని ప్రశ్నించాడు తండ్రి. "అన్ని చెట్లు పెద్దగా బాగానే ఉన్నాయి. కానీ ఒక చెట్టు మాత్రం పొట్టిగా, పురుగులు పట్టి, కాయలు లేకుండా ఉంది . ఆరోగ్యంగా లేదు. మిగిలిన అన్ని చెట్లు బాగున్నాయి. దీనికి కారణం ఏమిటి ? " అని అడిగింది . దానికి తండ్రి "మామిడి చెట్టు పెంచేటప్పుడు కొంత ఎత్తు పెరిగిన తర్వాత అవసరం లేని కొమ్మలను, కిందకు వేలాడే కొమ్మలను కత్తిరిస్తారు . లేదంటే ఈ వేలాడే కొమ్మలకు సూర్య రశ్మి తగలక, పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉంది. అంతే కాకుండా పురుగులు చేరే అవకాశం కూడా ఎక్కువ . అన్నీ చెట్లకి కొమ్మలు కత్తిరించాము. అందుకే అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. కానీ ఆ చెట్టుని కత్తిరించలేదు. మొదట నాటిన చెట్టు కదా స్వేఛ్చ గా పెరగనిద్దాము అని వదిలేసాము" అని బదులిచ్చాడు. కూతురికి విషయం అర్ధమయ్యింది.
"అనవసరంగా పెరిగే కొమ్మలు ఎలాగైతే వృక్షాన్ని నాశనం చేస్తాయో .. అదే విధంగా చదువుకునే వయసులో చేసే అనవసరమైన పనులు విద్యార్ధుల జీవితాలను నాశనం చేస్తాయి. మీ నాన్న కేవలం కొమ్మలు కత్తిరించే ప్రయత్నం చేస్తున్నాడు, చెట్టంత కూతురు చల్లగా ఉండాలని. అంతే కానీ స్వేఛ్చని అడ్డుకోవాలని కాదు " అని భుజం మీద చెయ్యి వేసి ఇంటికి తీసుకొచ్చాడు .
బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే ప్రతి తల్లి దండ్రుల మనోభావాలను ఈ యువతరం అర్ధంచేసుకోవాలని ఈ కధనీకు చెప్పాను.
తల్లి తండ్రులను ఒకచోట కూర్చోపెట్టింది, శిరీష పాదాలకు నమస్కరించి నాతప్పు తెలుసుకున్నా, నేను చదువు కోమంటారా, ఉద్యోగము చేయమంటారా లేదా పెళ్లి చేస్తాము అంటారా మిరే చెప్పండి అని అడిగింది.
నీ వయసుని బట్టి ధైర్యముగా ఉద్యోగము సంపాదించి పెళ్లి చేసుకుంటే మంచిది అని చెప్పారు.
అదికాదు ఎదో ఒకటే చెప్పండి ఉద్యోగమా, పెళ్లా నిర్ణయం చేసుకొని మేరె చెప్పండి అన్నది.
తల్లి తండ్రులు ఆలోచించి పెళ్లే మా నిర్ణయం, మరి నీ నిర్ణయము మాకు చెప్పు, నీవు ఎవరి నైనా ప్రేమించావా, లేదా మేము చూసిన సంభంధం చేసుకుంటావా చెప్పు అని అడిగారు.
అశోక్ పై మీ అభిప్రాయము ఏంటో తెలుపుతారా నీవు అతన్ని ప్రేమించావా ప్రేమించలేదు, ఇప్పుడు ప్రేమిద్దామని అనుకున్నా, మంచిది వారి తల్లి తండ్రులను సంప్రదించి అన్ని వివరాలు రేపు నీకు చెపుతాము తల్లి
మనసులో అనుకున్నారు తల్లి తండ్రులు ఒకనాడు పెద్దలు మాట పిల్లలు వినేవారు, నేడు పిల్లల మాటలకు తల్లి తండ్రులు నోరు విప్ప లేని స్థితి తెస్తున్నారు ఇదేమి లోకం.
-((*))--
ఓం శ్రీ రాం - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్రభ - నేటి కధ (17)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ అలా సెలయేరు గట్టు మీద నడుస్తున్నాను, ఆకాశం మబ్బులతో కమ్మి ఉన్నది, చీకటిని తరిమే వెలుతురు చిమ్ముతున్నది, చెరువు గట్టుమీద ఒక పొన్న చెట్టు, చెట్టుమీద కోయిల కూస్తున్నది, ప్రకృతి సౌందర్యానికి లోబడి నా మనసు పులక రిస్తూ, నా హృదయం పరవశించింది।
సెలయేటి తీరాన ఒక బండ రాయి మీద కూర్చొని అందాల భరిణ స్నానం చేస్తూ కనిపించింది। ఆకాశం నుండి ఊడి పడ్డ అందాల తారా
ఆమె జలక మాడుతున్నది, అద్భుత సౌందర్యంతో పుత్తడి బొమ్మగా కనిపిస్తున్నది, శ్వేత వస్త్రం ధరించి తడి ముద్దలో అందాలన్నీ కనిపిస్తూ తన్మయత్వానికి లోను చేసింది। ఆమెమో తన్మయత్వంతో జలమాడుతున్నది, నీటి బిందువులు ముత్యాలవల్లే మెరుస్తూ భుజాలపై నుండి జారీ , వీపుమీదనుండి జారీ, అలా అలా నితుంబాలనుండి జారీ, పాదాలకు చేరే బంగారు తీగల్లా మెరిసే నీటి బిందువులు।
ఆమె అందం నన్ను పిచ్చివాణ్ణి చేసింది, ఆమె విరహాతాపంతో వళ్ళు విరిచి చూపిస్తుంది, చెట్టంత మొగవాన్ని నన్ను చూసి చిరునవ్వు నవ్వి, చూసి చూడనట్లుగా కళ్ళు తిప్పుతూ, కట్టుకున్న వస్త్రాన్ని సవరిస్తూ ఉన్నా గాలికి వస్త్రం రెపరెప లాడుతున్నది।
సెలయేటి వద్ద పక్షులు శబ్దం వినబడుతున్నది, చల్లని గాలి వీస్తున్నది నా హృదయం ఎదో కోరుతున్నది, నాకు తెలియ కుండానే ఎదో ఆనందాను భూతి నన్ను ఆవహించింది, నాలో బిడియంతో పాటు, ధైర్యం ఆవహించి ఆమె వద్దకు చేర్చింది।
నన్ను చూసింది భయ మనేది చూపలేదు, పైట సర్దుకోలేదు, మెలికలు తిరగలేదు, నోరెత్తి పెద్దగా అరవలేదు, ఎదో తప్పు జరుగుతుందిని అనుకోలేదు, నెమ్మదిగా నడుచుకుంటు నా పక్కన చేరి సిగ్గుతో కళ్ళు దించుకుంది।
అవి ఎంత అందమైన కళ్ళు, కళ్ళతో చెప్పే మూగబాసలు, హృదయాన్ని తాకమని భావప్రకంపనలు, సుమధుర భావాలకు నా మనసు ఆకర్షించింది, తనువు వేడెక్కింది, ఎక్కడో స్వర్గలోకంలో ఉన్నట్లని పించింది ఆమెవైపు నేను నావైపు ఆమె చూస్తూ అలా ఉండి పోయాము।
ఆమె కౌగిట్లో నేను నా ఎదపై ఆమె, అనుకోని విధముగా స్పర్శ సుఖాలకు పరవశిస్తూ, మానుకు పెనవేసుకున్న మల్లెలా చుట్టుకుంటూ నా కౌగిట్లో ఉన్న ఆమె తన్మయత్వంతో కరిగిపోతున్నది, కౌగిలిలో చిక్కి నలిగి పోతున్నది ఊహించని అనురాగాల అనుభూతి పొందుతూ ।
నేను తేరుకొని కౌగిలి చూసాను, ఖాళీగా ఉన్నది
సుందరి సుందరి అని అరిచాను
ఏమండి ఏమిటండి అలా అరుస్తున్నారు సుందరి ఎవ్వరు అన్న శ్రీమతి పలుకు వక్కసారి కళ్ళు తెరిచాను, అది కల అని గ్రహించాను, చే తిలో ఉన్న దిండును ప్రక్కన పడేశాను।
నా వైపుకు వింతగా చూసింది నా శ్రీమతి, నేను నోరువిప్పి ఏమి చెప్ప లేక పొయ్యాను, ఒకవైపు ఫాన్ గిర్రున తిరుగుతున్నది
మీరేం కలగన్నారో ఏమో ఈ మంచినీళ్లు త్రాగండి అంటూ గ్లాస్ చేతి కందించింది
కళ్ళు మూసుకొని గడ గడ త్రాగటం తప్ప ఏమి చేయలేక పోయాను ఆసమయంలో ।
మనస్సుకు చేరు ఊహలు ఎన్నో
ఉహలలో పలికే రాగాలెన్నో
రాగాలకు మ్రోగే వీణ లెన్నో
మ్రోగే వీణలకు తీగలెన్నో
తీగలు పాడే పాటలెన్నో
మదిలో మ్రోగే వీనలెన్నో
పెదవులు పలికే పదాలెన్నో
మదిలో జారిన ధారలెన్నో
కళ్ళల్లో వచ్చే కలలు ఎన్నో
కన్నులు తడిపిన కలులు ఎన్నో
ప్రేమ ప్రేమకు మార్గాలెన్నో
ప్రేమతో వచ్చే సుఖాలెన్నో
చీకటి తరిమే కిరణాలు ఎన్నో
చంద్రుడు కప్పే వలువలు ఎన్నో
తలలు వాల్చే కమలాలెన్నో
మనస్సుకు చేరే కోరికలెన్నో
గుండెకు తాకినా సంఘటనలెన్నో
గుండెలు తీసిన గడియలు ఎన్నో
గంధము చూపిన స్వాసలెన్నో
పుట్టుక నేర్పిన బాసలెన్నో
నీటిలో తేలే పడవ లెన్నో
గాలిలో తేలే పక్షులెన్నో
పిల్లలు చేసే అల్లరిలెన్నో
నవ్వులు చిందే తారలెన్నో
ఎన్నో ఎన్నో అని నిద్రలో కలవరిస్తున్నాడు మన కధానాయకుడు.
శ్రీమతికి ఏమి అర్ధం కాక కౌగలించుకొని పడుకున్నది అలా నిద్రలో జరిగి పోయింది కధ
--((**))--
ఓం శ్రీ రాం - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్ద్రభ - నేటి కధ (16)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
గురువుగారికి నమస్కారములు అంటు పక్కింటి పద్మారావుగారు ఇంట్లోకి వచ్చారు.
నవ్వుతూ ఊరక రారు మహాత్ములు అన్న సామెత గుర్తుకు వస్తుంది కదా, అవును గురువు గారు నీరున్న చోట పక్షులు, ప్రేమ ఉన్న చోట కోర్కలు, ఉద్యోగం చేసేచోట అవాక్కులు, వాక్కులు, పెళ్ళి చేసుకుంటే సుఖదు:ఖాలు, చేసు కోకపోతే వెలుగు నీడలు వెంట పడుతూ ఉంటాయని ఎవరో కవి చెప్పారండి.
అవునోయ్ ఇంతకీ వచ్చిన విషయం చెప్పక చక్కటి ఉపోద్ఘాతం చెపుతున్న వేమి టోయ్
అవునండి నేను చెప్పేవి మీకు ఉపోద్ఘాతాలే మీరు చెప్పేవి మాత్రం వేదాలు, మమ్మల్ని నమ్మ మంటారు
నా అభి ప్రాయాలు నేను వ్రాసు కుంటాను, చెప్తాను. అవి మీకు నచ్చవచ్చు, నచ్చక పోవచ్చు అంతమాత్రాన అవి ఆచరణ యోగ్యము కావని నేను మీకు చెప్పలేదే,
అవునని కుడా చెప్పలేదు కదా గురువుగారు .
కట్టుకున్న భార్య కుడా ఒక్కోసారి పిల్లలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతుంది. అది ఓక తల్లి ప్రేమని మనం గమ నించాలి అది తప్పని వాదన చెయుట ఎందుకు.
నాణానికి రెండువైపులా రెండు గుర్తులున్నట్లు, ప్రతి మనిషిలో రెండు లక్షణాలు ఉంటాయి, అందులో మంచి లక్షణం ఒకరికి నచ్చవచ్చు, అదే వేరొకరికి నచ్చకపోవచ్చు, చెడు లక్షణమే కొందర్ని బ్రతికించవచ్చు అంత మాత్రానా అటు వంటి మనిషి చెడ్డవాడని మీరు చెప్పగలుగు తారా, మంచి వాడని చెప్ప గలుగు తారా నీవే చెప్పు అన్నడు గురువుగారు.
మీ మాటలేమోగాని మంత్రం లా ఉన్నాయ్, అటు పాము చావదు, ఇటు కర్ర విరగదు అన్నట్లు ఉన్నాయ్ మీరు రాజకీయములో చేరితే బాగుంటుంది కదా గురువుగారు.
అందుకే ఎవరితో మాట్లాడాలన్నా ఎదో ఆశించి పలుకుతారు, అదికూడా వివరంగా చెప్పరు, మార్పువస్తే కొండత బలం అంటారు, కష్టపడ్డ వారు ప్రజా సేవచేసే వాళ్ళు గెలిస్తే ఇంకా బలం అంటారు, మాటలతో ములగ చెట్టు ఎక్కిస్తారు ఇదే లోకం కదా పద్మరావుగారు
మహానుభావా మీ మాటల్లో నేను వచ్చిన విషయం కూడా మర్చిపోయా
అట్లయితే మంచి టి త్రాగు వెంటనే మెదడ్ ల్లో వెలుగు కమ్ముకుంటుంది
ఇదిగో నండి " టి " అంటూ బాయ్ ఇవ్వటం జరిగింది.
పద్మపురాణంలో ఉన్న ఒక కధ చెపుతా విను
సుశర్మ అనే బ్రహ్మనుడుండేవాడు, అని దు రలవాట్లే ఉండేవి, పుణ్యమనేది చేసి ఎరుగడు, చివరి ఘడియలలో కన్న బిడ్డలు కూడా దగ్గరికి రాలేదు, ఎప్పుడు పోతడా అని అందరు ఎదురు చూసారు, అదికూడా సంపాదన పంచుకోవటానికి ఎదురు చూసారు (పాపపు సొమ్ము అని తెలిసి కూడా) ఎవ్వరు ఆగమన్నా ఆగని కాలం సుశర్మ ప్రాణాల్ని హారించింది.
మరుజన్మలో ఎద్దుగా పుట్టాడు, మొద్దు పనులు చేస్తూ బతికాడు ఒకనాడు బండి లాగుతూ మరణించాడు బండి లో ఉన్న ఒక స్త్రీ నేను ఏమైనా పుణ్యం చేసి ఉంటే ఎద్దుకు అర్పిస్తున్నాను అని సంకల్పించింది. ఆ పుణ్యం వళ్ళ ఎద్దు పుణ్య లోకాల కెల్లి మరుజన్మలో ఉత్తమ బ్రహ్మణుడు గా పుట్టాడు, కలాక్రమేన ధర్మ బోధ చేస్తున్నాడు ఒకరోజు పూర్వజ్ఞానం తో తనకు పుణ్యం ధారపోసిన స్త్రీ ఇంటికి వెళ్ళాడు.
పుణ్యం గురించి అడిగాడు, నేను మీకు చెప్పే అంతా దాన్ని కాను, నేను రోజు చిలక పలుకులు వింటాను ఆరోజు ఎద్దుకు అవే ధారపోసినట్లు గుర్తు అని చెప్పింది. చిలక ఏమి చెప్పేది, ఏమి వినేవారు అని అడిగాడు.
పుణ్యం గురించి అడిగాడు, నేను మీకు చెప్పే అంతా దాన్ని కాను, నేను రోజు చిలక పలుకులు వింటాను ఆరోజు ఎద్దుకు అవే ధారపోసినట్లు గుర్తు అని చెప్పింది. చిలక ఏమి చెప్పేది, ఏమి వినేవారు అని అడిగాడు.
మీరే చిలకను అడగండి
అప్పుడు చిలక నేను భగవద్ గీత మొదటి అధ్యాయము గురువు గారు బోధిస్తూ ఉంటె విన్నాను, విన్నది విన్నట్లుగా అమ్మగారికి చెప్పాను అంతే.
ఆ పుణ్యమే మీకు ధారపోసింది అని చెప్పింది.
ఆమెకు పాదాబి వందనము చేసి భగవద్ గీత పారాయణము నిత్యం పటిస్తూ అఖండ శక్తిని పొంది జన్మలేని దేవునిలో కలసిపోయ్యాడు. ఇది కధ.
పద్మారావుగారు మీ రెందుకొచ్చారో నేను అడగను, పిల్లలకు భగవద్ గీత నేర్పాలి
నేను నేర్చుకుంటా మీరు చెప్పండి అని కూర్చున్నాడు పద్మారావు
గురువుగారు భగవద్ గీత భోదిస్తున్నారు అలా ..... ...
ఈ కధ మీకు నచ్చితే షేర్ చెయ్యండి ఇంతకన్నా నేను కోరేది ఎదిలేదు
అందరికి వందనాలు .......
--((**))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి