11, మార్చి 2019, సోమవారం



రైలు ప్రయాణంలో ఒకరోజు (8 )
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
ప్రాంజలి ప్రభ - (చిన్న కథ )

రైలుబయలు దేరుతుంది 
ఒకబోగిలో కొందరు భక్తులు కాశీకి బయలుదేరారు. అందులో ఒకభక్తుడు గురువుగారి వద్దకు పోయి నాసమస్యకు పరిష్కారంతెలుసుకోవాలని అనుకున్నాడు.     
వెంటనే గురువుగారికి సాష్టాంగ ప్రణామములు చేసాడు 

ఏమి నాయనా. పూర్వాశ్రమ వాసనలనుండి పూర్తిగా వైదొలగినట్లేనా. ఇంకా శేషమేమైనా మిగిలి వుందా? అనుమాన ఏమైనా ఆనందా, సమస్య ఏదైనా ఉన్నదా  
ఉంటె ఆ కాశీ  విశ్వేశ్వరునికి తెలియ పరుచుకుందాం 

గురువుగారూ. హంతకుడు, దోపిడీదారుడు, స్త్రీ వ్యామోహపరుడనైన నన్ను సన్మార్గమున నడిపిన మీకు శతశహస్ర పాదాభివందనములు, కొంతకాలముగా మనోవేదనకు గురి అగుచున్నాను, తమరు మరొక్కసారి ఈ దీనుని దయతలచి, తరుణోపాయము తెలుప ప్రార్ధన! 

చెప్పు నాయనా! 

పూర్వాశ్రమంలో నేను చేసిన పాపపంకిలము నుండి నేను విముక్తి చెందే మార్గము తెలియజేయ విన్నపము.  

కష్టమైన విషయమిది నాయనా.  

తప్పు చేయని వారుండరు నాయనా, శిక్ష ఎక్కువ పడుతుంది  నాయనా, ఎక్కువ కష్టాలు భాధలు భరించాలి నాయనా,    

ఎంత కష్టమైనా భరిస్తాను గురుదేవా 

చూడు నాయనా

ఈ విషయం లో ఏమైనా నీ లోపముంటే మాత్రము, నీకు మరి నాలుగింతల పాపం చుట్టుకుంటుంది సుమా,  భోదించిన పాపానికి నేను కూడా నీ పాపములో భాగస్వామ్యం పొందాల్సుంటుంది నాయనా.  

ఏది ఏమైనా నీకు తరుణోపాయము చెప్పాలని ఉంది

నేను నిష్టగా, నియమబద్దముగా మీరు నాకప్పజెప్పబోవు పనిని నిర్వర్తిస్తానని మీ పాదపద్మము మీద ఆన.  

ఆన, తల్లి తండ్రుల మీద ఒట్టు అని నోరు దురద తీసుకోకు నాయనా   

నీ పాపాన్ని అందరూ పంచుకునే ప్రక్రియ ఇది నాయనా . 

పాపాన్ని పంచుకునేవారెవరు ప్రభూ? 

వారి సహజ బలహీనతలే నీకు వరమౌతాయి నాయనా.  

నీవు మలి సంధ్య వేళ శ్రుంగార పురుషునిలా అలంకరించుకుని, వివాహితయైన నీ కుమార్తె ఇంటికి పోయి, అచటనే నిద్రించి, తొలి సంధ్య లో నీ స్వగ్రుహమునకు చేరము, ఈ విధముగా సంవత్సర కాలము వరకూ చేయ వలయును. అదికూడా ఇప్పుడే నీవు ఈ రైలు దిగిన వెంటనే వెనక్కి పోవలెను, సంవత్సరం తర్వాత కాశీ    విశ్వేశ్వరుని దర్శనం చేసుకుంటే చేసిన పాపాలు పోతాయి నాయనా.  

సందేహనివ్రుత్తి చేసుకోవచ్చునా ప్రభూ.  

తప్పకుండా! 

నేనీవిదముగా చేయుట వలన నాకు కష్టమేమీ కనిపించుట లేదు, 
నా పాపాలు పోతాయన్న గురి కూడా కుదరడము లేదు.  

అనురక్తుడవై వినుము.  

నీవీ విధముగా మూడు నెలలు పూర్తి చేయుసరికి, గ్రామ, గ్రామముల ప్రజలు నీ ఈ ప్రవర్తనకు, సహజసిద్ధమైన వాచాలత్వముతో దుష్ప్రచారము జేసి నీమీద అంతులేని అభాండములు మోపి నిన్ను కళంకితునిగా చిత్రీకరించుకొందురు.  

మరో మూడు నెలలు గడచు సరికి 

నీ భార్యా, పిల్లలూ, బందుగణము ప్రజల మాటలను నమ్మి నిన్ను ధూషింతురు. 

అక్కడి నుండి అనుక్షణమూ నీవు నరకయాతనలకు గురి ఔతావు నీ కూతురు నిన్ను ఇంట్లోకి రానివ్వదు, ఐననూ నీవు నీ భాధ్యతలు విస్మరించరాదు సుమా. ఆఖరుకి నీ కుమార్తె ఇంటి చూరుకింద, వీదిలోనూ నిదురించే పరిస్థితి దాపురిస్తుంది, క్రమేపీ ప్రజలలో నీమీద సానుకూల ధ్రుక్పదము ఏర్పడుతుంది, 

ఐతే వారందరికీ జరగవలసిన నష్టము అప్పటికే జరిగిపోతుంది, 

వారు నీ వింత ప్రవర్తనకు కారణమడిగినా చెప్పరాదు సుమా.  

గురువుగారు నా ప్రయత్నం  నేను చేస్తాను, నేను నిజాయితీగా, ధర్మం తప్పఁకుండా నా కూతురింటిలోనే ఉండి ఎవ్వరు ఎమన్నా పాట్టించుకోకుండా  తపస్సు చేస్తాను మీరు వచ్చేదాకా "ఓం నమ: శివాయ: అని జపం చేస్తాను "     
మీ అందరి సమక్షమన ప్రతిజ్ఞ చేస్తున్నాను. 

ఇప్పుడే వచ్చే స్టేషన్లోనే దిగి పోతాను, మీరు తిరిగి వచ్చే టప్పటి కల్లా మిమ్మల్ని కలిస్తాను.       

నాన్న ఏమిటి అంత గాబరా పడుతున్నావు   ఇది కల, నిజమా తెలియకున్నాను  

ఏమిలేదు ఈ రోజు మాగురువుగారు వస్తారు మన ఇంటికి పా ద పూజచేసు కుందామని అనుకుంటున్నాను,  అయినా నిన్ను అడగాలి కదమ్మా   

నాన్న నీవు ఎంతో మారిపోయావు 

అవునమ్మా అంతా మా గురువుగారి రైల్లో బోధ మహాత్యవమ్మా 
శిష్యా  బాగున్నావా అని పిలుపు విన్నాడు 

గురువుగారు మీరా 

అవును నాయనా నేనే, 

నా వయసు పెరిగింది తిరగలేకపోతున్నాను, నాకు సహాయకుడిగా ఉంటావా  నాయనా

నీలో పరివర్తన వచ్చిందో లేదో చూద్దామనివచ్చాను

ఆ పరమాత్ముడు ఆడించినట్లు ఆడటమే మన విధి కదా గురువుగారు 

అందరము కర్మ బద్ధులమే కదా గురువుగారు, చీకట్లు తరిమే వెలుగు వస్తుంది, పాపాన్ని తొలగించే పుణ్య మార్గం వస్తుంది కదా గురువుగారు.

వెంటనే గురువుగారు లేచి శిష్యుణ్ణి అను కూర్చున్న కుర్చీలో కూర్చోపెట్టి 

నీవే నా ప్రధమ శిష్యుడివి ఇక నుండి నా ఆశ్రమాలన్ని నీవే చూసుకో నేను కాశీలో స్వామిని  దర్శించుకుంటు జీవిస్తాను.
నా మాటకు కాదని చెప్పకు నాయనా 
ఈ రోజే అన్ని నీకు వివరించి నా రైలు ప్రయాణం సాగిస్తాను నాయనా 
గురువు గారు మరి నన్ను కాశీకి వెళ్లాలన్నారు కదా 
శిష్యులకు బోధచేసి వారితో కాశీకి రా నాయనా 
సుభం భూయాత్              

--((**))--


రైలు ప్రయాణంలో ఒకరోజు (7 )
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
ప్రాంజలి ప్రభ - (చిన్న కథ )

రైలు కదులుతుంది, రైలు బోగీలో ఒక వైపు ఎక్కువమంది తీర్ధయాత్రకు పోతున్న వారిలా, మరోవైపు ఎంప్లాయిస్ కుర్చొని ఉన్నారు, వేరేప్రక్క బైరాగిలు  కూర్చొని ఉన్నారు. 

అమ్మా నాకు బిరియాని ఇప్పించమ్మా ఆకలేస్తుంది, రైల్వేలో అమ్మేవి బాగండవు మరి వాళ్ళు తింటున్నారు గదమ్మా. అంటూ అక్కడ ఉన్న ఒక కుటుంబలో పిల్లవాడి మాటలు           

'హైదరాబాద్ బిరియాని గా ఉండదు. ఇదిగో ఈ పప్పుండలు తిను అన్నది. 
నాకొద్దు బిరియాని నే కావాలి అని ఏడవటం మొదలపెట్టాడు. తల్లి ఒక్క అరుపు అరిచింది అంతే నిక్కరు తడిసి పోయింది. 
ఛీ పాడు పిల్లోడా అంటూ బాత్ రూమ్ దాకా గుంజు కెల్లింది    
ఏంటమ్మా ఇంత కంపుగా ఉన్నది. ఎం వాసనమ్మా ఇది
ఖర్మ ఖర్మ సిగెరెట్ త్రాగేవారందరు బాత్ రూమ్లోనే త్రాగాలా, ఎంత పొగ ఎంత వాసనా 
ఇక్కడ సి సి కెమేరాలు పెట్టి అందరిని పోలీసుస్టేషన్లలో పెటించాలి అన్నది .
అవునమ్మా పెట్టారనుకో ఒకటి, రెండు పోవటానికి మీకే కష్టం కదమ్మా 
అవునురా బాబు ఆవేశముతో అన్నాను, నీకున్న తెలివి కుడా నాకు పని చేయుటలేదు. 
అమ్మా గుడ్డు మీద ఈకలుంటాయా 
నాకేం తెలుసురా మనము విజిటేరియన్ రా 
అంటే 
నా తలకాయ 
అంటే 
అంటే లేదు గింటే లేదు అన్నాను, చంపకురా      
బిరియాని అబ్బాయి వస్తే పిలువు కొనిపెడతా అన్నది
మా అమ్మ ఎంతో మంచిది అంటు చీర గుంజాడు.
హరే ఉండురా సంతోషం వచ్చిన ఆవేశం వచ్చినా నిన్ను మీనాన్నను ఆపలేక పోతున్నాను     
       
అంతలో ఆర్డర్ అంటూ ఒక అతను వచ్చాడు
ఏమున్నాయి అన్నది 

'మేడం బిరియాని, చెపాతి, పూరి ఇడ్లి, కూరలు   ప్రై  .. పనీర్ బుర్జీ , పనీర్ బటర్ మసాలా , మేధీ పనీర్ ,కడై పన్నీర్, పన్నీర్ 65, షాహీ పన్నీర్ , ఆలూ గోబీ , గోబీ మట్టర్ , దాల్ ఫ్రై , బేబీ కార్న్ , పాలక్ పన్నీర్ , పనీర్ పందా .. ' ఉన్నాయి 

ఇవన్నీ ఉన్నాయా ఊరికినే చెపుతున్నావా 
మీరు ఆర్డర్ ఇస్తే చేయించుకొని తెస్తా 
ఎంత సమయం పడుతుంది
ఇంతవరకు ఎవ్వరు బుక్ చేయందే, సుమారు అరగంట పడుతుంది 
అవునా 
అవునండి  
అసలు మీరు తినడానికన్నా వండుకున్నారా
ఈ రైల్లో వండేవి మేం తినవమ్మా 
ఇంటిదగ్గర నుండి క్యారేజ్ తెచ్చుకుంటాం

'ఇక్కడి వంటలండీ .. ఒకటే కారాలు ?'

'పోన్లే .. కష్టపడి మింగామనుకో,  ఏ అసిడిటీయో వచ్చిందంటే మళ్ళీ మందుల ఖర్చు '  అని నాలుక కర్చుకున్నాడు, 
వేరొకతను వచ్చి ఆర్డర్ 
ఏమిటిరా మాట్లాడేది ఏమి లేదు ఏమి లేదు ముందు ఆర్దర్స్ ఎన్ని వచ్చాయి అన్నాడు 
ఏమీ రాలా, సరే వెళ్లి బుక్ చెయ్   
సారీ మేడం ఇతను తెలుగులో మాట్లాడేవారుంటే చాలు అదొక భాష పిచ్చి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో అని ఆలోచించకుండా అన్ని చెప్పేస్తాడు, రైల్లో అనేక బాషల వాళ్ళు వస్తారు వాళ్లకి చెప్పలేక నోరెళ్ళ పెడతాడు వీడు. 
ఇంతకీ ఆర్డర్ ఇచ్చారా   
ఇస్తాం సీటు దగ్గరకు పోయాక చెపుతాలే చివరిదాకా పోయిరా అన్నది 
ఇదిగోనండీ మీ అబ్బాయి ఏడుస్తున్నాడు మేం తెచ్చిన బిరియాని కొద్దిగా పెట్టండి      
ఆ వద్దు లేండి నేను కొనిపెడతాను లేండి 
మీరెవరో నాకు తెలియదు, మానవతా దృక్పధంతో చెపుతున్న 
ఆత్మారాముణ్ణి ఇబ్బంది పెట్టకూడదమ్మ అని ప్రక్కనే కూర్చున్న ఒక పెద్దమ్మ   
ఆ ప్లేటులోనిది చూసి ప్రక్క ఉన్న కొడుకు నాలుక తిప్పుతున్నాడు అమ్మ మొఖం  చూస్తున్నాడు
తింటావురా బాబు అన్న మాటలకు
అమ్మా ఆకలేస్తే నీవు తినకుండా ఉండగలవమ్మా, ఇంతలేవు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు 
తీసుకోని తిను 
నాకు ఆకలి కావటం లేదు 
అక్కడే ఓసెల్ ల్లో శుభలగ్నం సినిమా  పాట వినబడుతుంది 

చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక 
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక 
మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చెయిజారాక 
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక

చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక 
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే
బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే

వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే 
అమృతమే చెల్లించి ఆ విలువతో 
హలాహలం కొన్నావే అతితెలివితో 
కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక 
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక

అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో 
ఆనందం కొనలేని ధనరాశితో 
అనాథగా మిగిలావే అమవాసలో 
తీరా నువు కనుతెరిచాక తీరం కనపడదే ఇంకా 
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక 
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక 
మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చెయిజారాక 

లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక 
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక

అమ్మా మనం ఎక్కడకు వెళుతున్నాం   
రైలు ఆగేమ్గానే దిగివెళ్లదాము ఎక్కడికి 

ఇది విశాలమైన ప్రపంచం మనల్ని ఆదుకొనేవారు చాలామంది ఉన్నారు           
స్టేషన్ వచ్చింది గబా గబా దిగారు తల్లి కొడుకులు ఇదేనండి లోకం ఈరోజు రైలు ప్రయాణం  
--((**))--

రైలు ప్రయాణంలో ఒకరోజు (6 )
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
ప్రాంజలి ప్రభ - (చిన్న కథ )
రైలు బయలుదేరుతుంది, అది తొందరగా అందరిని గమ్యం చేర్చాలని ఆశ బడుతున్నది, ఎర్ర బల్బు చూసి ఆగి పచ్చబల్బు చూసి బయలు దేరి కొండలు కోనలు, చెట్లు, చేమలుతో పని నాకేంటి అనుకుంటూ మధ్య మధ్యలో నన్ను గుర్తించ కుండా మొద్దు నిద్దర పొయ్యేవారికి మేలుకొలుపుగా కూత కూస్తూ వెళుతున్నది రైలు.
ఒక బోగీలో కొందరు విద్యార్థులు మాట్లాడు కుంటున్నారు, వారి మాటలు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్ధం కాక ప్రక్కనే ఉన్న తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకున్న ఒక పెద్ద మనిషి వాళ్ళని కదిలించి అసలు విషయం తెలుసుకుందామా అని అనుకున్నాడు.
ప్రజాసామ్యం గురించి అంతగా మాట్లాడు కుంటున్నారు ఎం చదివారు మీరు మెం నలుగురం జర్నలిజం చదువుతున్నాం, మాలో ఒకరి భావాలు మరొకరికి నచ్చటం లేదు మీరు అనుభవంతో ఏమైనా చెప్పండి ప్రజాసామ్యం గురించి. బాబు నేను మీలా పెద్ద చదువులు చదుకోలేదు, ఎదో వానాలపు చదువు, ఎండాకాలపు బతుకు, చలికాలపు సహాయం చేస్తూ కాలం వేళ్ళ బుచ్చుతున్నాను.
మీరెక్కడ దాకా మాతో వస్తారు.
ఆ విధాత వ్రాసిన ప్రయాణం ఎంతవరకో. అంతవరకూ మీతో ఈ బోగీలో ఉండాలి కదా అన్నాడు.
మీరు చదవకపోయినా అనుభవజ్ఞులని భావిస్తున్నాము, మా సంభాషణలు ఇబ్బంది పెట్టిన మమ్ము క్షమించండి.
మీది యువరక్తం, మీ ఆలోచనలు ఉత్తేజం, మీ ప్రవర్తన సమాజానికి ఉపయోగ పడాలి కానీ మీలో మీరే వాదనలు, ప్రతివాదనలు చేసుకుంటున్నారు, అది ఇప్పుడు అవసరమా.
నేను ఒకటే ప్రశ్న వేస్తాను
మీరు సమాజానికి ఎం చేసారు, ఎం చేస్తున్నారు, ఎం చేద్దామనుకుంటున్నారు ఒక్క ముక్కలో చెప్పండి అన్నాడు, అక్కడ ఉన్న వ్యక్తి.
మమ్మల్ని క్షమించండి మా ఆలోచనలు మాకే అర్ధం కావటంలేదు, సంపాదన, కుటుంబ శ్రేయస్సుతో పాటు సమాజానికి ఏమి చేద్దామన్న, పెద్దలే చేసారు మేము ఎం చేద్దామన్న అడ్డు పడుతున్నారు.
మెం నిజం చెపుతున్నాం వ్యాస రచన పోటీలకు వెళుతున్నాం "ప్రజాసామ్యాన్ని గురించి వ్రాయాలి" తలా తోక లేని దాని గురించి ఎలా వ్రాయాలా అని ఆలోచిస్తున్నాము అన్నారు.
తప్పు మాట్లాడుతున్నారు ప్రజాసామ్యం లేకపోతే మనం ఇలా కూర్చొనేవారము కాదు, ఇట్లా స్వేశ్చగా ఉండే వారము కాదు.
గురువుగారు మీకు తెలిసినవి ప్రజాసామ్యం పై నాలుగు వాక్యాలు తెలపండి. మీరు రచయతలు ఎన్నో కధలు చదివుంటారు అయినా నాకు తెలిసినవి చెపుతాను అవి నిజమో కాదో ఏది ఆచరణయోగ్యమో, ఏది కాదో మీరే నిర్ణయించుకోవాలి ఎవరో చెప్పారని ఎదో చేశారని అంటూ మోసపోయి ప్రవర్తించ కండి అదే నేను కోరేది. వినండి చెపుతాను అంటూ ప్రాంభించాడు.
నా పేరు మల్లాప్రగడ రామకృష్ణ అంటారు, నేనొక మామూలు మనిషిని అయినా అడిగారు కనుక తెలియపరుస్తున్నాను. మాట్లాడే హక్కు అందరికి ఉంది కనుక కొన్ని విషయాలు తెలిసినవి మీకుతెలియపరుస్తాను.
మన తల్లి మనల్ని నవమాసాలు మోసి పురిటినెప్పులు భరించి భూమి మీదకు తెస్తుంది, స్వేత్సా జీవిగా బ్రతకమని ప్రపంచంలో వదిలేస్తుంది. అట్లాగే ప్ర పంచంలో ఉన్న ప్రజాసామ్యం నేతల్ని కనలేక పురిటి నెప్పులు పడుతున్నది.
బయఁట పడ్డ వారు కప్పల బతుకుల్లా మారుతున్నారు. కొంత నీటిలో కొంత నే లలో అనగా కొంత అవినీతి సామ్రాజ్యాన్ని, కొంత అభాగ్యుల ధీనత్వాన్ని సొమ్ము చేసుకొని బతుకుతున్నారు. వారికి ఎవ్వరు గుర్తించలేరు వారు అందరికి మేధా వులే చెప్పేది చేయరు, చేసేది చెప్పరు ఎవరికోసం .
5 సంవత్సరాలలో వచ్చే ఎలక్షన్ సీటు రాకపోతే వారి ప్రవర్తన వర్ణనాతీతం మేధావులు మడి కట్టుక్కూర్చుని మీన మేషాలు లెక్కేసి అటో ఇటో చెప్పే పనిలో అష్టకష్టాలు పడతారు ఎవరికోసం.
వారసత్వం కోసం కుమ్ములాట, కుమారరత్నం కోసం కుర్చీలాట, నోట్లు అందించి పదవులు వేలం పాట, ఏది కుదరకపోతే కప్పఁగంతుల ఆట, ఎవరికోసం
ఇన్కమ్ టాక్సు వారు రైడ్ చేస్తే, తాతల నాటి సొత్తని (ఏడువారాల ఆభరణాలని) చూపిస్తారు, తండ్రి కూడ బెట్టిందే అతి తక్కువకున్న స్థలాలు ఇప్పుడు కోట్లు విలువచేస్తున్నాయి లెక్కకట్టటం ఎందుకని నంటారొకరు, మామ ఇచ్చిన ముల్లే నంటారింకొకరు,అంతా నేనే నంటాడొకరు ఏది ఏమైనా నాయకుల్ని మాత్రం ఎవ్వరు పట్టుకోలేరు, ఉద్యోగుల్ని మాత్రం తప్పులు లెక్క కట్టారు మళ్ళీ కట్టండి అని పదవీవిరమణ చేసిన వారికి నోటీసులు ఇస్తున్నారు ఇదేనండి ఎవరికోసం .
అందరూ ప్రబుద్దులే, అందరివీ అటకెక్కిన బుద్దులే, వాటా తేడా వస్తే ఊరుకో రెవ్వరూ, ఇంటికే అగ్గి పెట్టే సమర్థులే, కోట్లకు పడగలెత్తి మోసం చేసి దేశం వదలి వెళ్లిన వారిని ఏమి చేయలేరు, నెలవారీ కట్టాల్సిన రొక్కము కట్టలేదని బెదిరించి బాధపెట్టేది ఎవరికోసం .
ఇంటి గుట్టు బయటపెట్టేస్తున్నారు, ఒకరి బతుకు లొకరు చెరిగేస్తున్నారు,
ఎవరొస్తే మీకేంటని నిలదీస్తున్నారు, ఇరకాటంలోకి జనాల్ని నెట్టేస్తున్నారు, కొత్త ఆశలను చూపిస్తున్నారు, ఎవరికోసం
అంతా 'నాదే' నంటాడు మరొకడు;
పూట గడవని పేద బతుకులు గురించి ఆలోచించేవారు లేరు, ముప్పు నెఱగని దీపం పులుగులు వీరు, బతుకు నేర్వలేని వారు, అర్ధం కోసం అర్ధం కాకా తిరుగు తుంటారు ఎవరికోసం .
చెట్టు క్రింద జోస్యం చెప్పే మహానుభావులు, కొత్త చిలకలకు పాఠాలు నేర్పించి ఫలితాలు అంచనా లేస్తూ కాసులు దండుకుంటున్నారు కొందరు ఎవరికోసం
జనం మాత్రం చాప మీద కాళ్ళు చాపి, కళ్ళు తేలేసి కాలం చెప్పే తీర్పు కోసం
ఎదురు చూస్తున్నారు, ఎంతో దైన్యంగా మా నాయకుడు గెలవాలి మాకు మంచి గలగాలి అని మొక్కులు మొక్కుతారు ఇదే నండి లోకం, ఈ లోకాన్ని వర్ణించటం మనుష్యుల బుద్ధులు మార్చటం ఎవ్వరి తరం కాదు. రైలు ప్రయాణంలా విషయాలు తెలుసుకోవటం, ఆచరణ యోగ్యమైనవి ఆచరించటం యోగ్యముకానివి విడిచిపెట్టటం.
ఎవరికోసం అనుకోకండి మనకోసం మనసమాజం కోసం మనవంతు సహాయం చేద్దాం అనే దృఢ సంకల్పమే మన అందరి ప్రయాణం అని గమనించండి.
స్టేషన్ వచ్చాకా అందరం దిగి పోలసిందే, మనగమ్యానికి చేరాలంటే ఏదోఒకటి ఆధారం తీసుకోవలసినదే అది తెలిపేదే ప్రజాసామ్యం
--((**))--
రైలు ప్రయాణంలో ఒకరోజు (5 ) 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
ప్రాంజలి ప్రభ - (చిన్న కథ )  

రైల్లో జనం ఇసకేస్తే రాలనాట్లు ఉన్నారు జనరల్ కంపార్టుమెంట్, ఏ.సి విషయం చెప్పాలంటే మనుష్యుల్లేని పార్కులా, కెరటాలు లేనిసంద్రంలా ఉన్నది. ఏంతో  అతి కష్టం మీద తెల్ల ప్యాంటు షార్ట్ వేసుకొని ఒక మనిషి  ఎక్కగానే అందరూ ప్రక్కకు తొలగి స్వేశ్చ ఇచ్చారు, గెట్ దగ్గర జనం బాగా ఉన్నారు కానీ లోపల కొంత విశ్రాంతి తీసు కొనే విధంగా ఉన్నది.             

ఇద్దరు విద్యార్థులు చదువుకున్న వారిలా ఉన్నారు మూర్ఖంగా వాదిస్తున్నారు ప్రస్తుత రాజకీయము గురించి.     
అందులోఒకడు 
తమ పార్టీ ప్రజా క్షేమం గురించి పోరాడుతుంది తెలుసా అన్నాడు 
రెండవ వాడు 
అవును పోరాడుతుంది గెలిచాక ప్రజా క్షేమ దేవుడెరుగు కుర్చీ క్షేమకోసం మంత్రిపదవికోసం, ఇన్కమ్ టాక్సు ఎగనామం పెట్టుటకోసం పార్టీనే మార్చేస్తారు. 

మానాయకుడు ఏ పార్టీలో ఉంటె మాకెందుకు త్రాగేందుకు డబ్బులిస్తాడు, మా పేరుతొ స్థలాలు ఇప్పించాడు, వచ్చినప్పుడల్లా మంచి భోజనం పెట్టిస్తున్నాడు,
ఏదన్న మీటింగులకు అవసరమైతే నాచేత్తో లక్షలు ఖర్చు చేయిస్తాడు అది నాకు చాలు అన్నాడు 
నీవరకు నీకు సరిపోతే సరిపోతుందా, నీ ప్రవర్తన నీ కుటుంబం పై పడుతుందని ఒక్క సారన్నా ఆలోచించావా, డబ్బున్న వారిదంతా ఒకే కులం లేనివారిని వల చివర ఎర కట్టి చేప ను పట్టినట్లుగా, మనిషి బలహీనతను బట్టి ఓటు వేయించు కుంటారు అది నీకు తెలుసా.

చిత్త శుద్ధితో దేశాన్ని పరిపాలిస్తారని ఓట్లు వేస్తారు, అది ప్రకటనలకు పరిమితి చేసి చెత్త శుద్ధి కార్యక్రమాలతో సరిపెడుతున్నారు.

కొత్తపార్టీలు పుట్టుకొస్తాయి అధికారం కోసం అటు గెలవలేక, ఇటు నిలవలేక పరువునే తాకట్టు పెట్టి వేరో పార్టీలో కలిసి పోతారు ఆటువంటి వారికి ఓటు వేయటం దేనికి అని నేను అంటాను అన్నాడు ఒకడు                  

స్వార్ధం కోసం నాయకులు పనిచేస్తారు, ఈరోజు ఒక కండువా కప్పుకొని గెలుస్తారు, గెలిచాక, నా చుట్టూ వూన్న వారి క్షేమం కోసం కండువా మారుస్తాను అంటాడు.       

అత్యున్నత న్యాయస్తానమ్ ఆధారన్నింటికి వాడనవసం లేదు అన్నది 
ఆధార్ లేనిదే బ్రతుకే కష్టమంటున్నారు. ఆధార్ ఆధారం గా కష్టాన్ని దోచుకుంటారో నని భయం ఉన్నది. 
    
రాజకీయంలో రాకముంది అతడు ఒక పిచ్చి మొక్క, ఇప్పుడు అతడు తులసి మొక్క, ప్రజాక్షేమం కోసం నిత్యం కష్టపడతాడు కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి పరుస్తాడు, 5 సంవత్స రాల ముందు ఉంటానికి ఇల్లు లేని వాడు ఎపార్టు మెంట్లు కట్టించి అమ్మే ఓనర్గా మారుతాడు. 

వీరి మాటలు అన్ని వింటున్నాడు తెల్ల ప్యాంటు, తెల్ల షర్టు వేసుకున్న వ్యక్తి. 
ఇంతకీ మీకు ఓటు వేసుకొనే హక్కు ఉన్నదా లేదా ముందు చూసారా. చుడలేదు               
ముందు ఉన్నదో లేదో చూడండి. రాజకీయవాదనలు కూడు పెట్టావు, శ్రమ తప్ప   
తిన గలిగిన వాడే చేయగలడు, చేయ గలిగిన వాడే గెలవ గలడు అది మాత్రం గుర్తుంచుకోండి. 
    
ఇంతకీ మీరెవరండి అని అడిగారు వారు 

నేను ఒక రచయతను నా జీవితం కోసం తాటాకు చప్పుళ్లకు కుందేలు కదులుతుంది అని , నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని,  మానాయకుడే గొప్పవాడు అతనికే ఓటువేయ్యండి అని , అతను జైలు నుండి వచ్చాడు అతనికి ఓటు వేస్తారో, అభివృద్ధి పధంలో తీసుకెళ్లే పార్టీకి ఓటువేస్తారో అని మిరే నిర్ణయించండి అన్న పలుకులు విని నేడు ప్రకటిస్తాము.  రేపు కొత్త విషయాలు తెలియపరుస్తాము అదే మా జీవితం నేటి విషయాలు ఉన్నది ఉన్నట్లుగా తెలియపరుస్తాము అదే మాకలం అన్నాడు.          
వెంటనే ఇద్దరు మాట్లాడటం మానేశారు  
ఎందుకనగా నోరుజారిన మాటలు ఎంతమందిని బాధపెడతాయ్ అని ఊరుకున్నారు. మనిషికి మాట్లాడే హక్కు ఉన్నది, ఉన్నది ఉన్నట్లు రాసె హక్కు రచయితకు ఉన్నది.

రాజకీయపు పెద్దలు I హితబోద జేస్తారు 
వారికిఁ; ఓటు హక్కు  I విలువ దెలుసు 
యాప్యాయత కరువై I యన్నాని కై యేడ్చు
నాయకుని స్థితి I యఱుపు దెలుసు 
సూరీడు చుట్టమై I పోరాడి శ్రమటోడ్చు
ఓటరు గుడిసె  I తీరు దెలుసు 
దారైన దెలియని I రాజకీయ లొల్లి 
నిదుర లేని కుంపటి I మీకు దెలుస?
వేది కెక్కి ఉపన్యాసముతో నమ్మక  సృష్టి 
ఓటు వేసే వానికే  దెలుసు? రాజీ బ్రతుకు

అప్పుడే స్టేషన్ రావటం గబగబా దిగి వెళ్లిపోయారు కొందరు, అందులో తెల్లప్యాంటు, తెల్ల షర్టు వేసుకున్న వాడు దిగిపొయ్యాడు ఆలా జరిగింది ప్రయాణము ఈ రోజు                   
--((**))--
    

1 కామెంట్‌: