17, మార్చి 2019, ఆదివారం


ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం  శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - శృంగార సాహిత్యం 
 తరుణామృతం
సర్వేజనా సుఖినోభవంతు 

మ. మ . త  (పెద్దలకు మాత్రమే )-1 
మనసు మనసు తరుణామృతం - సాహిత్య వచన శృంగార  కావ్యం
(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) 
 ------
  పచ్చటి తోటయందు పసిడి రంగుతోడ, ఓరచూపు ఇంపుతోడ, అడుగులు దడా  దాడా అనుచుండ, జారేడు కుచకుంభాలు కదులుచుండ, కాల్నడక పోవు చుండ, వదనాంచలమందున చిన్కుల చెమట, మడుగులా మారుచుండగా, వయ్యారంగా మల్లిక కన్పించే. 



పసిదానిమ్మ పండు  చాయ, కొసరు ఆ కుసుమ గంధి కోమలపు తోడలు  (లేలేత తామర స్వేత తూడులా లేక పాల లాంటి అరటి ఊచలా ) 
 జారు చెమ్మ, నేలరారు ముత్యాల వరుస, సహజ సౌందర్యముతో వెలసిల్లు చుండా, పదహారో వసంతంలో అడుగుపెట్టి, వయసు వన్నెలతో, మాయని మెరుపు కాన వస్తున్నది, బాల్యము వెడలి, నవ యవ్వనపు మొలకులతో లేత సిగ్గుల దొంతరలతో, మధుర మంద హాసంగా ఉండి, నడుస్తుంటే, పురజనులు " ఆ ఆ " అని నోరు తెరచి, సొంగ కార్చు చుండే, ముందుకు నడుస్తున్నప్పుడు, ముందు వెనుక ఎవరున్నారు అనే జ్యాస అనేది లేదు, మరియు అమె కళ్ళకు ఎమీ కనిపించలేదు, కాని ఏదో తెలియని వయసు పొంగే మెరుపు ఆవహించినదని  మాత్రం అర్ధం అవుతున్నది, ఆమె ఏ శృంగార దేవత, కారణము ఏమగునో  అని పలువురు ముచ్చట్లు చెప్పుకొనసాగిరి, సౌందర్యదేవత నడచి వెళ్ళినట్లు తన్మయులై ఉన్నారు ఆసమయాన?                                                ఇంకాఉంది  

Photo

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం  శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - శృంగార సాహిత్యం 
 తరుణామృతం
సర్వేజనా సుఖినోభవంతు 

మ. మ . త  (పెద్దలకు మాత్రమే )-2  
మనసు మనసు తరుణామృతం - సాహిత్య వచన శృంగార  కావ్యం
(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) 

 యవ్వన నడకతో నడుస్తుంటే  ఇసుక లో కాళ్ళు ఇరుక్కొని,  ఈడ్చు కుంటూ, తన్మయత్వపు  నడకతో, మేనుపై  వేడి కిరణాల సెగ ఆవహించిన నిట్టూర్పులతో, ఉన్న నడకను చూసిన వారికి కన్నులు  చెదిరినవి, వారి ఊహలు గాలిలో తెలిపోతున్నవి. వార ఆలోచనలు మారుతున్నవి. ఆహా ఏమి సౌందర్యము  వర్ణించుటకు విలుకాని సౌందర్యము, రూపానికే వయసుడికినవారికి కూడా వరల్డ్ మాప్ గుర్తుచేస్తున్నది.  చూస్తు బట్టలు మార్చుకోలేక అలా ఉండి పోయారు తన్మయత్వంతో , వారి ఆలోచనలు పరుగెత్తే గుర్రమ్లాఉన్నాయి.   

తామర మొగ్గచందమున మెత్తని మేను
జలజగంధము రతిజలముఁదనరు
మాలూరఫలముల మఱపించు పాలిండ్లు
కొలికుల కింపైన కలికి చూపులు 

తిలపుష్పముల వన్నె దిలకించు నాసిక
గురువిపూజనాపర సునియమ
చంపకకువలయ ఛాయయుగల మేను
నబ్జపత్రము బోలు నతనుగృహము

హంసగమనంబు కడుసన్నమైన నడుము
మంజుభాషిణి, శుచి, లఘుమధురభోజి
వెల్లచీరల యందున వేడ్క లెస్స
మానవతి పద్మినీభామ మధురసీమ

తామరపువ్వువలె మెత్తని శరీరంను,
తామరపువ్వువాసనగల రతిజలమును,
మారేడు పండ్లవంటి కుచములును,
సొగసగు చూపును, నువ్వుపువ్వువంటి ముక్కును,

గురు బ్రాహ్మణ పూజయందు ఆసక్తియు,
సంపంగి వంటియు కలువ పువ్వులవంటి
దేహఛాయ గలదియు, హంసగమనమును,
సన్నని నడుమును, మంచి మాటలును,

శుచియై కొద్దిపాటి వయవసౌష్టమును, తెల్ల చీరల
యందు ప్రీతియును గల పద్మిని జాతి గల  స్త్రీ ని చూసి
పరవశించి పొయ్యారు   


--((**))--
                                                                    ఇంకాఉంది 


మ. మ . త  (పెద్దలకు మాత్రమే )- ౩   
మనసు మనసు తరుణామృతం - సాహిత్య వచన శృంగార  కావ్యం

(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) 

పడచు జింక పిల్ల నడిచినట్లు మల్లిక నడుస్తుండగా, కాలి పాదాల చెమ్మ, అద్భుత మెరుపుగా కనిపించే., ఆవిధముగా  పోతూ ఉంటే  అక్కడ కొంత దూరములో మామిడి తోపులు కానవచ్చే, మామిడి పువ్వు నవ యవ్వన సౌందర్యానికి పరవశించి, కొమ్మలపై రేమ్మలపై నిలువలేక, జల జల రాలి పాదాల ముందు చేరే, ఆమె పాదాలు స్పర్శకు పూలు  నలిగినా చెప్పుకోలేని సంతోషముతో ఉండగా, జిలుగు పూల కళంకారి చీర జాఱ, కాలి కడియాలు మలుపు కొనుచు, తనువంతా వంచి సరిదిద్దు కొనుచు, సందెడు చీర కుచ్చెళ్లు చెదరనీక గట్టిగా అదుము కొనుచు, పిల్ల గాలి సవ్వడికే ఎగసిపడుతున్న చీరను పట్టుకొనుచు ఉండగా, ఆ వనమంతయు చూసి పరవసంతో పూల వర్షం కురుపించే.        

అప్పుడే పవనుడు (నిత్య  సంచారి) ఈవిధముగా పాడుచున్నాడు

ఓ బాల బాల నిన్నే కోరి
 నీచెంతకు చేరి
నవ్వులు కురిపిస్తా రాదరి
సొగసుతో అలుగకు నారి

ఓ పరువంలో ఉన్న తుంటరి
ఓ మనసును తపిస్తున్న చకోరి
ఓ వయసులో చేయద్దు చాకిరి
ఓ ఎందుకు ఉంటావు ఒంటరి

ఒంటరిగా తిరుగకు మయూరి
వస్తాడు పరువాన్ని దోచే పోకిరి
నేను వెంట పడ్డా సరి సరి
నీ ఆశ తీర్చనా ఈ సారి

కళ్ళలో భావం చూపే గడసరి
నేను సరిజోడు కానా మరి
తోడూ నీడవుతాడు ఈ బాటసారి
నీ చూపుకే నాకు వచ్చు శిరి


--((**))-
                                                                                                               ఇంకా ఉంది 


మ. మ . త  (పెద్దలకు మాత్రమే )- 4    
మనసు మనసు తరుణామృతం - సాహిత్య వచన శృంగార  కావ్యం


(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) 


          కనులలో కని పించె ప్రేయసి, కసి తీర కవ్వించే కురులు విరబూసి, పెదవి పై తొణి కేటి తోలిరాసి, తనివి తీర తపనలనుపెంచేసి  

          మోము లో కని పించె అందాన్ని చూపి,మనసు లో చిగురించె మోహం చూపి, రాగాల పనతో కవ్విమ్పచేసి, మదినేలు సుమపూల గంధంపూ రాశి ! 

అపురూప సౌందర్య రాశి, 
చూడు ఓక సారి నా కేసి, అందించు సొగసు విరబూసి 
అవును నే ప్రేమ పి పాసి! 

           నా హృదయ రాణి గా నీవేనని, ప్రేమ సామ్రాజ్య మేలగ రావేమని, జగమంత ప్రణయ మయమె మరి, జగతికి ఆదర్శము కావాలి మరి  



      అంటూ తన్మయత్వంతో నారి మణి చూపుల  తప్పుకోలేక, ఒప్పించలేక మదన తాపముతో కదిలాడు ఆకాశ సంచార పవనుడు .

         ఆ మాటలకు కణతలు త్రిప్పి అనగా విచ్చుకున్న పువ్వులా చూసి కొంగ్రొత్త శోభతో చిరునవ్వు విసిరి, వెన్నెల చెండ్లు పట్టి చేతిలో ఉంచి నెమ్మదిగా ఊదే  కనులు నేలచూపులు చూస్తు, పాదాలు అలవోకగా కదిలిస్తూ చూసి చూడనట్లుగా ఓర చూపు చూస్తూ, చేతితో చీర కొసలు పైకి  ఎగదోస్తూ,  వన మద్య నిలిచే మల్లిక.
  
స్వాగత పక్షి కుహు కుహు అని పిలుస్తున్నట్లు, హ్రదయము బరువెక్కగా, ఎద పొంగులు కాన రాకుండా చీర చుట్టు కొనగా,
 మోహనుడు కంచెను దాటి వచ్చినట్లుగా ఊహించె మోహనాంగి.
మిస మిస లాడు జవ్వనం, మేలిమి మైన పుత్తడి తనువును చేరి, ఓరగా సొగసు నంతా నలిపి నట్లుగా, మనసును పులకరింప చేసి నట్లుగా,  అతని చూపుల యందు ఆర్తి, హృదయాంతరము నందు తరింపక వేదన గురిచేసి వేళ్ళకు మోహనా, తొలకరి వానకు తడిసిన ముగ్ద మోహన లతాంగిని, నాలో ప్రవేశించి నన్ను ఇబ్బంది పెట్టకు ఓ చల్ల గాలి .
 అందెల రవళితో, జల జల పారే నదిలా సాగుతున్న లతాంగిని హరిణ పుత్రి చూసి, తొడగని చల్లని చెమటలూరు హస్తంబున దువ్వుచూ చల్లని పలుకులతో  నెమ్మదిగా ముచ్చట్లు చేసే, కళ్ళ వెలుగులు నవరత్నాల వెలుగుల కన్నా మిన్నగా ఉన్నాయి, ఈ మెరిసే ప్రాలు మాలికలకు కారణం ఏదైనా ఉన్నదా ? 
ఇంకా ఉన్నది 

ఈ వనము నందు వచ్చుటకు కారణం చిన్న తనపు చేష్ట అను కొందునా, అని పలుకుతూ కళ్ళ యందు వాత్సల్య మును కురిపించే, ఆ మోహన హరినంబును ముద్దాడి, తృణ పరిమళమును ఆస్వాదించి అనువంతా తపించే.

నడచి వచ్చిన ఆయాసము పోలేదు
చీర చెఱగుల తడి యైన ఆరలేదు
తృణమును ముద్దాడిన మక్కువ తీర లేదు
ఆ హా హా ఏనాటి ప్రేమార్ధమో తెలియుట లేదు 

వాలు చూపులతో ఉన్న సొగసుకు మరి కాస్త వన్నె తెచ్చేందుకు, లలిత సుకుమార కుసుమాలు, కురులకు చేరి పరిమళాలతో పరవశిస్తూ  తుమ్మెదలను పిలుస్తున్నట్లుగా, శిరో మండలమునందు ఉండి, ఈ చెట్టు నీడను చేరు ఓ కోమలాంగి అని అన్నాయి. 

కొమ్మలతో రెమ్మలతో కిక్కిరిసి ఉన్న వన పందిరి క్రింద మల్లిక చేరే, అక్కడే  ఉన్న ఒక వృద్ధ వృక్షంబొకడు (రాం తాత), ఆ తరువు యందు సంత సించి సొన కార్చుచూ, చెమ్మతో చల్లదనము కల్పించుతూ ఇట్లు పలికే, ఎండ కన్నెరుగక, వాన నీడ  గిలక, వన సౌరభాన్ని చూడు, ఆనంద పారవస్యంలో మునిగి తరించు కుసుమమా .....అని పలికే . 

ఇంకా ఓ కుసుమమా మన్మధుడు మంచి వాడు తన పని తను చేసుకు పోతూ ఉంటాడు,  వానిని ఎదిరించి ఎవ్వరూ జీవనము గడపలేరు, ఆ త్రిమూర్తులకే చేతకాలేదు అది గమనించు. 

సుడిగాలి వస్తున్నా, అగ్ని గోళాలు విరజిమ్ము తున్నా, ఎండిన ఆకులు రాలుతున్నా, పిట్టలు చల్లదనం కోసం పరుగెడుతున్నా,  మేఘాలు ఘర్జిమ్చుతున్నా, అకాశ మంతా నల్లని రూపం దాల్చిఉన్నా, ఎడారి జీవులుగా మారుస్తున్నా, ఎవ్వరియందు చైతన్యము లేకున్నా, శృంగార తత్వం, మన్మధుని లీలలు మారవు అది మాత్రం గమనించు మల్లిక .
                                                                                                                ఇంకా ఉండి



మ. మ . త  (పెద్దలకు మాత్రమే )- 5     
మనసు మనసు తరుణామృతం - సాహిత్య వచన శృంగార  కావ్యం
(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) 
శృంగార సాహిత్య  పద్యాలు

1 .శృంగారమ్ మదిలో సమాన తలపే సంసార సౌలభ్యమే
    అంగాంగం సెగలు మనస్సు తలపే సంతోష సమ్మోహమే 
    ప్రేమమ్మూ తలపే మనో నెత్రముగా చూపుల్లో సౌ0దర్యమే      
    స్నేహంతో తనువే సుఖంగ తరుణీ సంయోగ సౌభాగ్యమే

తాత్పర్యము : ఆకర్షణ ఒక వరము, మనసును దోచి సంసారం లో దించి సుఖాలందించేది, శరీరంలో ప్రతి భాగపు సెగలను చల్లపరిచి, మనసుకు సంతోష పరిచి సంమ్మోహపరిచేది, చూపుల్లొ సౌందర్యాన్ని చూపించి , మనసు అంతా ప్రేమను వ్యక్త పరిచేది, ఒకరికొకరు కలువుటకు   స్నెహపూర్వకమైన వాతారణం కల్పించి, తనువే సుఖంగా అర్పించి సంతోషం కల్పించి సౌభాగ్యం అందించేది స్త్రీ మాత్రమే.    

2  గాఢాంద జ్వలయే సరాగ వలపే మాధుర్య వాత్సల్య మే
    భండారమ్ భగలే తేజస్సు  తొలిచే సాంగత్య సౌలభ్య మే 
    బంధంతో కదిలే రేతస్సు కధలే కావ్యాల కారుణ్య మే
    నేడంతా శుభమే శుఘంధ సెగలే సౌఖ్యంబు తత్వాలులే      .


తాత్పర్యము : వాత్సల్యమనే తీపిదనము అందించి సరాగాలతో వలపులను చూపించి చీకటిలో వేడి సెగలను చల్లార్చేది, పట్టుదలతో మొండిగా తపస్సు చేసిన భగ భగ  సెగలు కమ్ముకొని సాంగత్యము ఒకరికొకరు కలవాలని అనుకొనే భావము చూపునది, ఒకరి కొకరు భంధంతో పెన వేసుకొని మనసులో ఏర్పడే అనుకోని తేజస్సు ప్రశాంత కధలతో కావ్య రచనకు సహకరించేది, ప్రతిరోజూ సుఘంధ పుష్పాల పరిమళాలను అందించి సుఖ సౌఖ్యం కల్పించేది, మనసుకు తత్వాలు భోదించేది స్త్రీ మాత్రమే.    
                                                                                            ఇంకా ఉంది

మ. మ . త  (పెద్దలకు మాత్రమే )- 6     
మనసు మనసు తరుణామృతం - సాహిత్య వచన శృంగార  కావ్యం


(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) 
మనకవులు శృంగార వర్ణన మీరు తెలుసుకోండి - చామకూర ప్రతిభ ! 

దక్షిణాంధ్రయుగంలో నాయక రాజుల కాలంలో " రఘునాధ రాయల " ఆస్థానంలో తులలేని కవిగా ప్రణుతి గాంచిన ప్రతిభామూర్తి చామకూర వేంకట కవి. సారంగధర చరిత్రము , విజయ విలాసము లను రెండు ప్రబంధముల నీకవి రచించి చమత్కార కవితా చతురునిగా ప్రసిధ్ధిగడించినాడు. విజయ విలాసము ప్రబంధకోటిలో మేల్బంతియై ఆంధ్రవాఙ్మయమున నితనికి కీర్తి పతాకగా నిలచినది. అందులో ఒకపద్యం మీకోసం చిత్తగించండి! 

ఉ: చిత్తజుఁ డల్గి తూపు మొనజేసిన జేయగనిమ్ము , పైధ్వజం 
బెత్తిన నెత్తనిమ్ము ; వచియించెద కల్గినమాట గట్టిగాఁ, న 
త్తరళాయతేక్షణ కటాక్ష విలాస రస ప్రవాహముల్ , 
కుత్తుక బంటి తామఱలకున్ ; దల ముల్కలు గండు మీలకున్; 

ఇందులో కవి సుభద్ర వలపుఁజూపులను వర్ణించుచున్నాడు. వీనినే కొండొకచో కలికి చూపులనికూడా అంటారు. 
వివరాలలోకి వెళదాం. 

సుభద్ర నవయవ్వన శోభతో నొప్పారుచున్నది. ఆమెకన్నులు పద్మములను , మీనములను బోలియున్నవి. వాటి తళుకు బెళకులు శృంగారరస ప్రవాహమును దలపించు చున్నవి. యని కవిచెప్ప నెంచినాడు. కానీ యతడు చమత్కారిగదా! 
సూటిగా చెప్పునా ? దానికో చక్కని కథనల్లు చున్నాడు. 

సుభద్ర క్రీగంటి చూపులు రసప్రవాహములై తామరలకు ,గండుమీనములకు సిగ్గుచే తలవంపులు దెచ్చుచున్నవి. అందువలన కోపమున తామర కుత్తుక బంటియైనది. (తామరపూలు సహజంగానే పీకలోతు నీటిలో ఉంటాయి ) గండుమీనములు నీటిలో మునిగి తలదాచుకుంటున్నవి. (చేపలు సహజంగా నీళ్ళలో మునిగే ఉంటాయి) అవి అలా ఉండటం ఆమెఅందమైన కన్నులను చూపులను పోల లేకనట! 

తామరలు, గండుమీనములు ,మన్మధపరివారము. పద్మ మాతని పంచబాణములలో మొదటిది. ఇకమీనమా ఆతని ధ్వజ చిహ్నమాయె, మరి వానిని సుభద్రచూపులు ఓటమి పాలొనరించురీతిగా నున్నవని చెప్పిన మన్మధునకు కోపమురాదా? వచ్చునుగదా! అలా ంచబాణునకు కోపం వచ్చినాసరే ,నాపై బాణం (పద్మం) యెక్కుపెట్టినాసరే , నాపై యుధ్ధం ప్రకటించినాసరే ( ధ్వజం అంటే జండా! యుధ్ధానికి వెళ్ళేవారు జండా యెగరేస్తారు) ఉన్నమాట అనక మానను. అంటాడు కవి. ఇంతకీ ఏవిటామాట! ఆమె విశాలమైన విలోలమైన విలాసవంతమైన శృంగార రసప్రవాహ ప్రరోచనములైన కంటి చూపులు మన్మధుని పరివారాన్ని త్రోసి రాజంటున్నాయి. ధిక్కరిస్తున్నాయి.అంటాడు. 

ఎంత చమత్కారి !!!

                                                                                      inkaa undi

మ. మ . త  (పెద్దలకు మాత్రమే )- 7     
మనసు మనసు తరుణామృతం - సాహిత్య వచన శృంగార  కావ్యం
(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) 


ఈ వంటరి బతుకు లోనికి వచ్చావా ప్రేమ, నా కన్నీల్లను తుడిచి వెన్నలను పంచటానికి వచ్చావా ప్రేమ, నీ పరిమళాలను అందించ టానికి వాచ్చావా ప్రేమ, లోనుంచి పొగి వస్త్తున్న సిగ్గును, నవ్వును పెదవులను వారించ లేక పోతున్నావా ప్రేమ, అనుక్షణం, కొత్తదనం  కోసం, కొత్త కోట గాలికోసం, కొత్త నీరు కోసం తపనతో తపిస్తున్నవా, నీవు నడచి వస్తుంటే నా మదిలో సువర్ణ దివిటీల వెలుగు నన్ను ఆవహించి నట్లున్నది, నా బ్రతుకులో ఒక తీయని  స్వప్నము సఫల మైనట్లు ఉన్నది,  నా జీవన్ముక్తిగా, నా మోక్షానికి దారిగా, నన్ను ఆవహించి నన్ను వెంటాడు తున్నది, నీ కన్నులు కలువ పువ్వులుగా మారి ధవళ ధవళంగా మెరుస్తూ ఉన్నాయి,  నేను ఎంత వద్దనుకున్న నీ చూపులు నన్ను వెంటాడు తున్నాయి, నీ చూపులు నాచూపులు ఒక్కటై, తనువు  తనువూ ఒకటై, మనసు మనసు ఏకమై తపనలతో తన్నుకుంటూ చల్లార్చు కుంటూ  ఉండేది ప్రేమ.   
image not displayed 

పూర్వము నులక మంచంలో ప్రారంభయ్యేది ప్రేమ, ఒకవైపు ఒకరు  మరోవైపు మరొకరు ఉండి ఒకరు కింద చేయి పెట్టి,  మరొకరు పైన చేయి పెట్టి లాగు తుంటే నులక కదులు తుంటే ఆ బిగువువళ్ళ పొందే  తన్మయత్వం ఇంతని ఎట్లా చెప్పగలము  అదొక రకం ప్రేమ కదూ ఈ కవిత చదవండి  "నవ్వుల నులకతో గవ్వల గిలక (మంచము) పై చువ్వల అటక మీది గువ్వలు పలక పరుచుకొని (దుప్పటి ) ప్రేమ పొందటంలో ఉండే తృప్తి అదోరకమ  ప్రేమ ఆ పరవస్యయం ఎలా ఉంటుంది మీకె తెలుస్తుంది 
  
నవ నవ లాడే నవ్వుల నులక 
చక  చక  సాగే గువ్వల పలక 
గర గర  లాడే గవ్వల గిలక 


చిర చిర లాడే  చువ్వల అటక   
                                                                                                                                continu....

మ. మ . త  (పెద్దలకు మాత్రమే )- 8      
మనసు మనసు తరుణామృతం - సాహిత్య వచన శృంగార  కావ్యం


(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) 

తరుణమే తమకమే - మనోమయమే కోరికలే, చరణమే, చమకమే - సమత్వములే మనువే, - కలువలే కధలేలు, మనస్సు ఏకంఅవుటే -  
మనిషిగా సహకారముగా సమభావములులే ।

మనసులో సమవేద -  వసంతము ప్రేమమయం, వయసులో అనురాగ - సరాగము కామమయం, సొగసులో మధురాతి - సుమంగళ రాగమయం
అలుకలో తమకంతొ  - సరాగములే మధురం 

కనులతో కలవంగ - నరాలలొ సంతసమే, నటనలో నవరాగ  - పదాలతొ  చెప్పే రతీ, మనిషిలో అనురాగ - ప్రెమలతొ దివ్యమయం, మహిళలో అతిసేవ - వయస్సులొ కోరికలే 

మనిషిలో  అతి ప్రేమ -  మనోమయ మందిరమే, మనసులో   మను శక్తి - మేలు తమ సుందరమే,  వయసులో యువ శక్తి - వేడి కల కోరికలే కలువలో కనువిందు - విచ్చిన దళం సరసే  


--((*))--






"Cuando abrazo a otras personas, el cielo es claro; pero cuando te abrazo a ti, salen las estrellas.":
సర్వేజనాసుఖినోభవంతు
మ. మ . త  (పెద్దలకు మాత్రమే )- 9      
మనసు మనసు తరుణామృతం - సాహిత్య వచన శృంగార  కావ్యం
(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) 

ప్రేమ, ప్రణయం, అనురాగం, స్నేహం  అనే పెద్ద మాటల అందరూ  చుప్తుంటారు వాటి గురించి నాకు పెద్దగా తెలియదు. 
అయిన నాకు తెలిసినది అందరుకు చెప్పాలని ఒక ఉబలాటం మాత్రం ఉన్నది. అవి మనుష్యులను ఆనoదపారవశ్యమ్  ఉంచే పదాలు, ప్రతి ఒక్కరిని ఏదో సమయాన వెంటాడుతూనే ఉండాలి, వెంటాడుతూనె  ఉంటాయి.
ప్రేమ అనేది మనిషిలో ఎలాపుడుతుందో ఎలాపెరుగు తుందో ఎవ్వరు చాప్పలేరు, ఒక వయసు  వచ్చినప్పుడు అనుకోని విధముగా శరీరములొ కొన్ని మార్పులు అందరికి కనిపిస్తాయి, వాటితో కోర్కలు పుడతాయి, ఏదో చేయాలి, ఏదో చూడాలి అని ఒక తపన మనిషిని  వెంటాడం  ప్రారంభించుతుంది సంపర్కం గురించి తెలుసుకోవాలని ఉబలాట  పెరుగుతుంది, అది కొందరిలో వెర్రి వేషాలు వేస్తుంది, తల్లి తండ్రులకు భాద పెంచుతుంది, మరికొందరికి చాప క్రింద  నీరులాగా ఉంటుంది. ఇది (ఆనంద పారవశ్యానికి తోలి మెట్టు). 

కళ్ళు తెరిచినప్పుడు కనిపించేది దృశ్యం, కళ్ళు మూసుకున్నప్పుడు  కనిపించినట్లు అనిపించేది అదృశ్యం. నిజానికి మానవులకు మదుర స్మృతి ఒక వరం, వికల స్మ్రుతి ఒక శాపం. ప్రతి ఒక్క విషయంలో నమ్మకము ఒక విజయము , అపనమ్మకం అపజయానికి అదే మూలం  
జీవితమనేది ఎప్పుడు వసంతంగానే ఉంటుంది, కాని అప్పుడపుడు కోరు కుంటుంది ఏకాంతం, మనసు ఎప్పుడు కల్లోలము నుండి ప్రశాంతముగా మారుతుంది కాని అప్పుడపుడు కోరు కుంటుంది ఏకాంతం, మనుగడకు ఉండాలి మానవత్వం కాని అది ఎప్పుడు ఓర్పు వహించటానికి కావాలి ఎకాంతం, అందరిని గమనిస్తూ ఉంటుంది సూర్యా కాంతం అది ఎప్పుడు కాలాన్ని బట్టి ప్రకృతి బట్టి తిరుగుతూ  పొందుతుంది ఏకాంతం. 
       

ఓ...  ఓ...  బంగారు చిలక 
నీకు వద్దే ఇప్పుడు అలక 
తీయని  కోరికలు  తీరక
మనసులోని మాట తెలపక

ఇక వయసు పిలించిందిక 
ఎవ్వరికి ఎటూ చెప్పుకో లేక
బల్లపై తలవాల్చింది చిలక
గోరింక చిలకను పలకరించాక 

నెమ్మదిగా చేరి ఆనంది చెక చెక 
నేనోచ్చాను దిగు లెందుకు  ఇక
కమ్మ నైన పాటలు పలుక
ఆనంద పారవశ్యo లో తేలు చిలక 

మనసు గట్టి పరుచుకో చెక చెక
నీ ఆనందాన్ని చూసాను పక పక
నీ నవ్వులు రాల్చాలి ఇక
నీవు ఆలోచించకు తిక మక


కమ్మ నైన పాటలు పలుక


ఆనంద పారవశ్యo లో తేలె చిలక గోరింక  
--((**))--


మ. మ . త  (పెద్దలకు మాత్రమే )- 10      
మనసు మనసు తరుణామృతం - సాహిత్య వచన శృంగార  కావ్యం
(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) 

కొత్తగా పెళ్ళైన భర్త త్రాగి వస్తే వారి మాటలలో కుడా ఒక రకమైన ప్రేమ ఉంటుంది.  ఆ ప్రేమ ఎలాగంటే ఏమని అడుగకు, ఆమని పిలువకు, కామిని కలువకు,  ఈ జవ్వని చెరపకు అనిహిత భోధ చేసిన ప్రేమ

ఎలా ఎలా అని ఏమని అడుగకు 
అల అలా అని ఆమని పిలవకు 
కల కలా అని కామిని కలువకు 
జల జలా అని జవ్వని చెరపకు 

image not displayed

ఒకరి కొకరు అర్ధం చేసుకోకుండా అనందం గా సరదాగా మాటలు ఒక్కసారి చూడండి అదొక రకమైన ప్రేమ ఇంతో కష్టపడి తీసిన  పనస తొనలు రుచి ఎలా ఉన్న, పెరిగే వయసు గుర్తుకు రాకున్నా, కరిగే మనసు ఉన్నా లేకున్నా, ఒకరి కొకరు భరోసాగా మాట్లాడు కోవటం కుడా ఒకరకమైన ప్రేమ 

కొందరి ప్రేమ మరో రకం గా ఉంటుంది అదే ఎట్లా గంటె కళ్ళ చూపులతో మింగేస్తారు, వేళ్ళతో మలుపులు త్రిప్పి చక్కల గింతలు పెట్టి తిక మక పెట్టి తపిస్తారు, కొందరు పళ్ళు కదిలిస్తూ, ఒక విధమైన శబ్దాలు చేస్తు, పెదాలు చూపిస్తు, కవిస్తూ, ఏడిపిస్తారు, కొందరు వళ్ళంతా చూపిస్తు అందుకో, అందుకో, అని ఆడిస్తూ చూపి చూప కుండగా ఒక ఆట ఆడిస్తూ కవ్విస్తూ పారవశ్యం పొందుతారు. 

మనసులోని మాట కళ్ళతో తెలుపు 
సొగసులోని తీట వేళ్ళతో  మలుపు
 పరసులోని తేట పళ్ళతో పిలుపు 
వయసులోని వాట వళ్ళంతా వలపు 
--((**))--

You don't see
image not displayed



మ. మ . త  (పెద్దలకు మాత్రమే )- 11      
మనసు మనసు తరుణామృతం 
- సాహిత్య వచన శృంగార  కావ్యం


(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) 

ప్రేమతో కొందరు కొన్నిరకాల పదాలు వాడుతారు నవ్వులాడు కుంటారు అందులో ఒకరు ఒస్తే చిమ్మిరీ, కాస్త ఆ పుస్తకమ్ము తీసురావే అని అరుస్తారు, అప్పుడే మీకేమ్ పనిలేదు సమయమ్ము దొరికినప్పుడల్లా ఏదో పేరు పెట్టి పిలుస్తారు మీరు, నిక్షేపంలా మా నాన్న అమ్మ కలసి పెట్టిన పేరు పిలువక ఏమిట్ ఆ తిమ్మిరి ఛిమ్మిరీ పిలుపు ఒరే  కవ్వరి, ఒరే  సోంబేరి అని పిలుస్తే నీకెలా ఉంటుది, అంటూ రుస రుసలు ఉంటాయి, కదండీ, నిజమేననుకో నిన్ను ఉడికిస్తేగని నాకు తిక్క రేగి ఒక పట్టు పట్టా ననుకో అబ్బా ఆబ్బా అంటావు ఇంకా ఇంకా అంటావు , ఎందుకులే  మీ మాటలు మీరు మీ పని చేసుకోండి, ఇదుగో పుస్తకము చదువుకొని కూర్చోండి, కాఫీ తీసుకొస్తా  అనేవారు ఉన్నారు కదండీ భర్తతో . 

భర్త మాటలకు కొందఋ లొంగి ఎట్లా చేయమంటే అట్లా చేస్తారు నోరెత్తరు, చూపాలని  అనిపించి నప్పుడు చూపిస్తారు, ఆడించాలను కున్నప్పుడు ఆడిస్తారు  ఆడవాళ్ళ మాటలను మనస్సును అర్ధం చేసుకోవటం అబ్రహంకు కూడా తెలియదనుకుంటా 
ఒక్క సారి ఈ క్రింద కవితను అర్ధం చేసుకోండి   

పడతియె తడబడి పలికిన పలుకులు
తమకపు ప్రణయపు తపన తెలుప
పదముల రవములు పలికెడి పెదవులు
మృదువుగ చిలికెను మెరుపుల తడి

వినగను కనగను వివశుడయి మురిసె
వలపు తెలుపగను వలచి చెలుఁడు
నిలిచెను కదలక మిలమిల మెరిసెడి
కలువఁ గనులను నగవునఁ గనుచు

కలతలు తొలగిన మమతలు నిలువును 
బిడియ పడుచు నొదిగెనిక తడియు
వలదు వలదు అనిన తొడిమను తడిపి  
చెలుని యెదపయి ముదమున చెలిమి  

చిరునగవులు కలుపెను మనసుకు 
కలలనుఁ గనుచు నిరువురు కొలను
వలపు నదమున మునిగిరి పరవశము

బిడియము తొలగియు ఒకటవు కత 

చిరు చిరు నవ్వుల చిమ్మిరి చిలక 
మరి మరి కొవ్వుల కవ్వరి ఆనక
గిరి గిరి గువ్వల చిన్నారి అలక
రారి రారి రవ్వల రాత్రి చరక చరక 

--((**))--


మ. మ . త  (పెద్దలకు మాత్రమే )- 12      
మనసు మనసు తరుణామృతం 
- సాహిత్య వచన శృంగార  కావ్యం
(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) 

నేను ఒకటే చెపుతున్నా ఏదైనా, ఎనైనా కాలాన్ని నడుచుకుందాం ఆరోగ్యాన్ని బట్టి ప్రవర్తించుదాం, సంస్కారం బట్టి కలసి బ్రతుకుదాం 

“ప్రేమించి పెళ్లిచేసుకున్నా … పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా … భారతీయ వివాహ వ్యవస్థ చాలా ఉన్నత మైనది. దానిని కాపాడుకోవలసిన ఆవశ్యకత మన మీదనే ఆధారపడి ఉంది. మారుతున్న సమాజంలో సహజీవనాల మధ్య బ్రతుకుతున్న మనం మన స0ప్రదాయాలను, సంస్కృతులను విస్మరిస్తున్నాం, మనకు నచ్చిన విధంగా మార్చేసు కుంటున్నాం. ఏవి మారినా ఇబ్బంది లేదు కానీ వివాహం విడాకులుగా మారితే వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుంది. కాబట్టి ఒకరినొకరు అర్ధం చేసుకొని సర్ధుకుపోతే సంసారాలలోని సారాన్ని గ్రహించిన వాళ్లమవుతాం….” అని ఒక మాత ఉపన్యాసం ఇస్తున్నది. 

 భార్య విషయంలో ఏమి ఆలోచించమ్ ఎందుకు ? ఇంకా అనుమాన బీజం వేసుకొని జీవితమే నాశనం చేసుకొనే  ప్రభుద్దులు ఉన్నారు ఇటువంటి వారిని ఎవ్వరు మార్చలేరు. అయినా శృంగారంలో ఎంతచక్కగా ఒకరికొకరు సహకరించు కుంటూ ఉంటె ఎటువంటి భాధలు అనుమానాలు ఉండవు. ఎదో తప్పు  చేస్తున్నామని అనుకోవటం తప్పు, ప్రకృతి అనుసరించి మాత్రమే మనం నడుస్తున్నాము సృష్టికి సహకరిస్తున్నాము మన: శాంతి కొరకు జీవిస్తున్నా౦.
    
ఆమె మాట్లాడుతుంది… ఆమె అడుగుతుంది… ఆమె ప్రశ్నిస్తుంది…
“మీరు ఆఫీస్ కి వెళ్ళిన తరువాత ఏరోజైనా మీ భార్యకు ఫోన్ చేసి తిన్నావా ?” అని అడిగారా
“ఒకవేళ మీకు తీరిక లేక పని ఒత్తిడిలో ఫోన్ చేయలేకపోతే , తనే చేసినప్పుడు మీరు హడావుడిగా, చిరాకుగా, కోపంగా మాట్లాడకుండా ప్రశాంతంగా ఎప్పుడైనా మాట్లాడారా?”
“పోనీ పనిలో బిజీగా ఉన్నాననే విషయాన్ని, తరువాత ఫోన్ చేస్తాను లేదా చేయమనే విషయాన్ని మీరు నెమ్మదిగా చెప్పిన సందర్భాలున్నాయా ?”
“బిజీ గా ఉన్నప్పటికీ తీరిక చేసుకొని భార్య మీద ప్రేమతో మీరు మాట్లాడినా…?! మీరు మీ భార్యకు ‘ఐ లవ్ యు’ అనే పదాన్ని చెప్పగలిగారా ?” “ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు పెళ్లి చేసుకున్న తరువాత ఎన్ని సార్లు ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని చెప్పిఉంటారో … ?!” నాకు చెప్పాల్సిన అవసరం లేదు ? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
“ఇవన్నీ ఎందుకంటే పెళ్ళికి ముందు ప్రేమించడం గొప్ప విషయం కాదు పెళ్ళైన తరువాత కూడా ప్రేమించడం గొప్ప విషయం. ఆ ప్రేమను వ్యక్తపరచడం ఇంకా గొప్ప విషయం. కానీ ఎవ్వరూ అలా వ్యక్తపరిచే వాళ్ళు లేరు. కారణం పెళ్ళైన తరువాత నువ్వు తిట్టినా, కొట్టినా భార్యలు పడాలి, పడితీరాలి అనే ఒక మూర్ఖపు భావన …”
“భర్త పదివేలు పెట్టి పట్టుచీర తెస్తే ఆడవాళ్ళు ఎంత సంతోషపడతారో…మీ దృష్టిలో అది అంతులేని ఆనందం.. కానీ ఆవిడకు ఆ సంతోషం తాత్కాలికమే… కానీ ‘పదినిముషాలు పక్కన కూర్చొని మాట్లాడితే పరవశించి పోతారు. పది జన్మలకైనా నీకే భార్యగా పుట్టాలనుకుంటున్నాని చెప్పడానికి సిగ్గుల మొగ్గలతో పులకించిపోతారు.’ శాశ్వితంగా గుర్తుంచుకుంటారు.”

ఇలా చెప్పుకుంటూ పొతే జీవితంలో చాలా సంఘటలుఉన్నాయి మిగతావి రేపు  తెలుసుకుందాం  అంటూ ముగించింది. 


మ. మ . త  (పెద్దలకు మాత్రమే )- 13      
మనసు మనసు తరుణామృతం 
- సాహిత్య వచన శృంగార  కావ్యం

(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) 

మాత ఇంకా ఇలా చెపుతున్నది
శృంగారం ఒక కళ ఆ కళ సద్వినియోగం అనేది ఇద్దరి మధ్య ఉండాలి దాని ప్రభావం సంతృప్తి అసంతృప్తి వళ్ళ జీవితాలు బాగుపడతాం నాశనమవటం జరుగుతుంది. 100  100 శాతం భారతీయులు కళను అంముకొని జీవితాలు సాగిస్తారు. 
           
విపరీత పరిణామాల మధ్య నలిగిపోతున్న మీరు ఈ రోజు ఇక్కడికి రాగలిగారంటే మీకు మీ భార్యలను వదిలేయాలనే కోరిక కాని, వారిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన కానీ ఎంతమాత్రమూ లేవు అనే విషయం స్పష్టంగా అర్ధ మవుతుంది. దానితో పాటే పని ఒత్తిడిలో వాళ్ళను నిర్లక్ష్యం చేస్తున్నారనే విషయం కూడా మీరు రాసిన ప్రశ్నలను బట్టి అర్ధమవుతుంది.”
ఆవిడ గొంతు గంభీరంగా ఉంది. కానీ అందులో తీయదనం ఉంది. “చిన్నపిల్లాడు తప్పు చేస్తే తల్లి ఎలా అయి తే తప్పును సరిదిద్దాడానికి ప్రయత్నిస్తుందో అలాంటి ప్రయత్నం ఆమె చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది….” చందు లోలోపల అనుకుంటున్నాడు…..
 పెళ్ళైన దగ్గర నుంచి నా భర్త నాకు ‘ఐ లవ్ యు’ అని చెప్పని రోజు లేదంటే మీరు నమ్ముతారా? చివరకు ఆయన చనిపోయే ముందు కూడా నాతో పలికిన చివరి పలుకులు ఏమిటో తెలుసా ‘ఐ లవ్ యు… బంగారం’

“మీరు ఏరోజైనా భార్యకు మూరెడు మల్లెపూలు తీసుకెళ్ళారా ? సరదాగా సినిమాకు తీసుకెళ్ళారా ?”
“సాయంత్రం షికారుకెళ్లి ఏ కాఫీనో, కూల్ డ్రింకో త్రాగుతూ మనసువిప్పి మాట్లాడుకున్నారా? మీ బెస్ట్ ఫ్రెండ్ కి ఇచ్చే స్థానాన్ని ఏరోజైనా మీ భార్యకివ్వగలిగారా?”
“మీ ప్రేమలేఖల్ని, మీ శుభలేఖల్ని, మీ పెళ్లి ఫోటోలని, మీ పెళ్లి వీడియోలని, మీకున్న గతవైభవ జ్ఞాపకాలని ఏరోజైన మనశ్శాంతిగా కూర్చొని చూడగలిగారా? అంత టైమ్ మీ భార్యకు మీదైనందిన జీవితంలో కేటాయించగలిగా రా ? ఆలోచించండి ”
“పొరపాటున తెలిసో, తెలియకో మాట జారినప్పుడు మూతి పగలగొట్టకుండా నా భార్యే కదా అని మనసుకు హత్తుకున్నారా?”
అన్నిటినీ మించి “అందరినీ వదిలేసి నీ కోసం వచ్చిన నీ భార్యను , నీదైపోయిన నీ భార్యను… తన వాళ్ళు గుర్తుకు రాకుండా గుండెల్లో పెట్టి చూసుకో గలుగుతున్నారా?” ఈ ప్రశ్నలకి సమాధానాలు మీకు తెలిస్తే మీ భార్య మీ పట్ల ఎందుకలా ప్రవర్తిస్తుందో మీకు అర్ధమవుతుంది.
ఇలాంటి ప్రశ్నలు ఆవిడ ఒకదాని తరువాత ఒకటి మామీద సంధిస్తూనే ఉంది. కాదు… కాదు… మా తప్పుల్ని చాలా తెలివిగా మాకే గుర్తుచేసి, తప్పుచేశామనే భావనను మాలో కలిగించి ఆ తప్పులు దిద్దుకునే విధంగా అడుగులు వేయడానికి మార్గాలు చూపుతున్నట్టుగా ఉంది.
ఒక్క సారి ప్రతి ఒక్కరు ఈ కవితను అర్ధం చేసుకోండి
అందులో అర్ధం పరమార్ధ తెలుస్తుంది. 
  
కుసుమమాలికా - న/భ/జ/స/ర IIIU IIIU - IIIU UIU 
15 అతిశక్వరి 10104 

కనులతోఁ దెలిపెదన్ - గవిత నేఁ గమ్మఁగా 
మనసుతోఁ దెలిపెదన్ - మమత నేఁ బ్రీతిగాఁ 
దనువుతోఁ దెలిపెదన్ - దపన నే గాఢమై 
దినములో రజనిలోఁ - దెరువు నేఁ గాంచితిన్ 

వలపులో నలిగితిన్ - వ్యధలతో నేనిటన్ 
దలఁపులో మునిగితిన్ - దరియు నేఁ గానకన్ 
మలుపులో నిలిచితిన్ - మనసులోఁ గోరుచున్ 
పిలుపుకై కలఁగితిన్ - బ్రియుఁడు రాఁడేలకో 

ముదము పానకమవన్ - బుడక యా కోపమా 
వదలఁగా నగునె యీ - వలపు మాయాకృతిన్ 
కదలఁగా నగునె యీ - కలల లోకమ్ములన్ 
సుధలు ధూలకములా - సుమము ముల్లయ్యెనా 

హరిని నేఁ దలువఁగా - హరుసమే గల్గుఁగా 
హరిని నేఁ బిలువఁగా - హరుసమున్ వచ్చుఁగా 
హరియు నా సరస నీ - యవనిపై నుండఁగా 
నురములోఁ జిరముగా - నుఱుకు క్షీరాబ్ధియే 

విరులతో సరములన్ - బ్రియముగా నల్లితిన్ 
సరములన్ గళములో - సవురుతో నుంచితిన్ 
మఱల నా సరములన్ - మమతతో వేసితిన్ 
హరికి నే గళములో - హరియుఁ దా నవ్వఁగా 

దెసలలో నసమమై - తెలివెలుంగెల్లెడన్ 
నిసియు నీరవమవన్ - నెనరు నిండెన్ గదా 
కుసుమమాలికలతోఁ - గొమరునిన్ గొల్చెదన్ 
రసము రాజిలఁగ నా - రమణునిన్ బిల్చెదన్ 

--((**))--



మ. మ . త  (పెద్దలకు మాత్రమే )- 14      
మనసు మనసు తరుణామృతం 
- సాహిత్య వచన శృంగార  కావ్యం
(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) 

 సాహిత్యా నుభవం, సువిద్యా, శ్రమయే, దిర్ఘాను భావత్వమే
    మొహత్వ శిరులే, సుసత్య పలుకే, సర్వోదయా పెన్నిదే
    ఆహ్వానం సుఖమే, సునేత్ర సహజం, సర్వోన్నతా సారమే
    స్నేహత్వం కలలే, సుఘంధ ప్రేమయే, సామాన్య సారూప్య మే

తాత్పర్యము:  విద్యను నేర్చుకొని, సాహిత్య సంపదను పెంచుకొని, విశ్రాంతి అనేదే లేకుండా  శ్రమించేది, ఆలోచనా పర్వంగా భావాలను వ్యక్త పరిచేది,  అందరి శ్రేయస్సు కొరకు, సత్యము పలుకుతూ, మనసులో ఉన్న మొహత్వాన్ని తగ్గించి శిరులను అందించేది, ప్రతి ఒక్కరిని ప్రీతితో పలకరిస్తూ, కళ్ళలో కరుణ చూపిస్తు, బిడ్డ లందరినీ ఉన్నతులుగా మార్చుటకు సహకరించేది, ఎమీ తెలియని వ్యక్తిగా, కళల సాకారము కల్పించి స్నేహమనే ప్రేమను అందిచేది, పరిమళాలను అందించే సుఘంధ పుష్పము స్త్రీ మాత్రమే.                 

heathersketcheroos:  An older illustration I came across while looking for some files..really want to finish it someday!:

 ఆనందం తెలిపే అనంత సుఖమే ఆలింగ సమ్మోహమే

    ఆంతర్యం పలికే అమోఘ మలుపే స్త్రీ సౌఖ్య వర్చస్సు యే
    ఆహ్లాదం కలిగే ఆనంద వలపే సౌసీల్య భావంబు లే
   ఆరోగ్య కులుకే మనస్సు  తలపే సంతోష సాఫల్యమే


తాత్పర్యము : భాహువులలో చిక్కి, ఆనందం అందించి, ఇదే అన్న సుఖమని తెలిపేది, వనితా శరీర మెరుపుతో, హావ భావాలను చూపుతూ, మగని మనస్సును అర్ధం చేసుకుంటూ, నవ్విస్తూ నవ్వులు పంచుతూ, తన శీలాన్ని భద్రంగా అందిచుతూ, ఆరోగ్యంగా ఉంటూ, ఎప్పుడు సంతోషాన్ని వక్తపరుస్తూ, అనిర్వచనము లైన పలుకులు పలక కుండా, ఉస్చాహము ఉల్లాసము వచ్చుటకు స్త్రీ సాఫల్యము మాత్రమే.


మ. మ . త  (పెద్దలకు మాత్రమే )- 15      
మనసు మనసు తరుణామృతం 
- సాహిత్య వచన శృంగార  కావ్యం
(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) 



జయదేవుని ...అష్టపది.
.
సఖీ ! యా రమితా వనమాలినా
వికసిత సరసిజ లలితముఖేన
స్ఫుటతీ న సా మనసిజ విశిఖేన
అమృత మధుర మృదుతర వచనేన
జ్వలతి న సా మలయజ పవనేన
స్థల జలరుహ రుచికర చరణేన
లుఠతి న సా హిమకర కిరణేన
శజల జలద సముదయ రుచిరేణ
దళతి న సా హృది విరహభరేన
కనక నిష రుచి శుచి వసనేన
శ్వసితి న సా పరిజన హసనేన
సకల భువనజన వర తరుణేన
వహతి న సా రుజ మతి కరుణేన
శ్రీ జయదేవ భణిత వచనేన
ప్రవిశతు హరి రపి హృదయ మనేన
.
అర్ధం...
.
(సఖీ, గాలికి కదలాడే పద్మాల వంటి కన్నులు గల వనమాలి తో రమించిన స్త్రీ చిగురాకుల శయ్య మీద పరితపించదు.

 కోమలమైన పద్మము వంటి ముఖము గల వనమాలి తో రమించిన స్త్రీ మన్మధుని బాణాలకు ఛిద్రం కాదు.

తియ్యనైన అమృత వచనములు చేసే వనమాలి తో రమించిన స్త్రీ శీతలములైన గాలులకు తాపము చెందదు.

 తామర తూడులవంటి కర చరణాల వనమాలితో రమించిన స్త్రీ చంద్రుని కిరణాలకు విలవిలలాడదు.

కారుమబ్బుల వంటి వనమాలి తో సుఖము పొందిన యువతి యొక్క హృదయం విరహ బాధను చెందదు.

 శుభ్రమైన పీతాంబరములు ధరించిన వనమాలితో రమించిన స్త్రీ పరిజనుల వికటములకు నిట్టూరుపు చెందదు.

అన్ని భువనములలోని జనులలో ఉత్తమ యువకుడైన వనమాలితో రమించిన వనిత కరుణార్ధ్రమైన విరహాన్ని కలుగదు.

శ్రీ జయదేవ కవి వచనముల ద్వారా హరి మన హృదయాలలో ప్రవేశించుగాక.)

--((**))--

--------------------------------------------------------------------------------------

మ. మ . త  (పెద్దలకు మాత్రమే )- 16      
మనసు మనసు తరుణామృతం 
- సాహిత్య వచన శృంగార  కావ్యం
(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) 
  

మాణిక్యం ఎరుపే, పెదాల మెరుపే, కావ్యాన్ని సృష్టించె లే
    బంగారం తనువే ఉగేటి నడుమే ఉల్లాస విజ్రుంభ ణే
    నాడెంతో తడిసే, సుఖాన్ని తెలిపే పాన్పును పంచేను లే
    వక్షోజాల కదల్చుట వల్ల మనసే ఆత్రంగా ఆరాటమే

తాత్పర్యం : పెదాల ఎర్రదనం, ఎర్రటి మానిక్య మెరుపు దనం, కవుల కావ్య రచనకు, సృష్టి జరుపుటకు దోహద కారి యగునది, శరీరం బంగారు ఆభరణాలుగా మెరుపుదనం తో ఆకర్షణగా మారి, ఉల్లాసంగా కవ్వించి సుఖాన్ని పొందేది, అసలే చక్కని పాన్పు ఉన్నది, తడిసిన బిగువ అందాలు చూపుతూ సుఖాన్ని పంచేది, స్థనాల బిగువులు తొలగించి, ఆత్రపు చూపులకు చిక్కి మనసును అర్పించేది స్త్రీ మాత్రమే. 

6. కోలాటం జరిపీ కోపంతో కొరికే కోపిష్టి మార్చేను లే
    కొమ్మంతా కుదిపీ  జ్వరంతొ తడిసీ చల్లాగ నిద్రించు లే
    మాగాణీ కలుపే అమోఘ కుదుపే కాదన్న ఒర్చుట యే
    పుష్పంలా నలిగే శుఘంధ పరువం అర్పించె ఆర్భాటమే

తాత్పర్యము : మొగవాడు ఎంత కోపంగా ఉన్నా, ఒకరికొకరు కోలాటం జరిపినా, కోపం పేరుగా కుండా జాగర్త పడేది, ఏంతో కష్టపడి, శారీర మంతా కదలి జ్వరం పోయి చల్లగా మార్చి  నిద్ర పుచ్చేది,  శారీర సౌష్ఠమునకు చిక్కి, బాగుగా నలిగి, ఇంకా కావాలన్న ఓర్పు వహించి, పువ్వు నలిగి నట్లు నలిగినా శుఘంధ పరిమళాలను అందించేది స్త్రీ మాత్రమే
--((**))--
                                                                        


మ. మ . త  (పెద్దలకు మాత్రమే )- 17      
మనసు మనసు తరుణామృతం 
- సాహిత్య వచన శృంగార  కావ్యం
(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) 
  
వయసులో ఉన్నప్పుడు ప్రేమ పండించుకోవడం 
చీకటి పడినప్పుడు దోమతో కుట్టించు కోవడం 
పగలంతా కష్టపడి రాత్రి సుఖ విందు పొందటం 
క్రింద మీద ఎక్కి ఉబలాటం తీర్చుకొనే జీవితం 

మోదమున నిట వచ్చి - ముద్దు లందిమ్మా 
ఖేదమును బాపంగఁ - గృపతోడ రమ్మా 
నాదరియు నీవుండ - నాకేల సొమ్ముల్ 
హ్లాదమున కొక కుండ - యందు క్షీరమ్ముల్ 

మానసము పిల్చె నిను - మన్ననల దేవా 
యాననము సూపగను - నందములఁ దేవా 
వీణియల నాదములఁ - బ్రేమ రవ మీవా 
కానుకల నిచ్చెదను - కావ నను రావా 

తామసము లేక లత పూజ కనలేవా 
కోపమును బాపి సుఖ లాలి మనలేవా  
నీదరి నె నుండ తాపమేల సుఖమాలీ 
నా దరి నీ వుండా జపమేల భయమేలా

ఆకలియు ఉంది నిను తృప్తి పరచేలా 
ఓపికయు ఉంది మనసంత మధువేలా 
కోరికల నాదముల తీపి తను వీవా 
ఆకలిని తీర్చెదను పొంద నువు రావా            

(ఇది వనమయూర వృత్తమే)

--((**))-- 


మ. మ . త  (పెద్దలకు మాత్రమే )- 18      
మనసు మనసు తరుణామృతం 
- సాహిత్య వచన శృంగార  కావ్యం
(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) 


రా రా రతి రాజ సుందరా
రా రా మది దోచి సుఖం పొందరా
రా రా పువ్వులొ  మకరందం దోచరా 
రా రా మన్మధ బాణం సంధించరా

వచ్చా అంతా చూసి పొతాలే 
వచ్చా  అందం అంతా దోచేస్తాలే
వచ్చా  అందం అంతు చూస్తాలే 
వచ్చా శృగార కళలు చుపిస్తాలే 
    
రా రా సుధామధురిమమే అనురాగమే రా 
రా రా మనోమయములే సుమభావమే రా 
రా రా తమోగుణములే  మనసాయనే రా 
రా రా  ప్రభాభవములే  ప్రతిభాలయే రా     

రా రా మనుష్య మమతే మది దోచగా రా
రా రా అనూహ్య శిఖరం ఇది పొందగా రా 
రా రా  సమత్వ సమతా ఇది ముందుగా రా 
రా రా  పటుత్వ పదిలం ఇది నిత్యమూ రా 

రా రా  పెదాల రుచియే జత చేయగా రా 
రా రా  పదాల సరదా  జత చేసుకో రా         
రా రా  సుఖాల పరదా జత కల్పుకో రా
రా రా  పువ్వులొ మురళీ జత చేయుకై రా 

రా రా రతి రాజ సుందరా
రా రా మది దోచి సుఖం పొందరా
రా రా పువ్వులొ  మకరందం దోచరా 
రా రా మన్మధ బాణం సంధించరా

వచ్చా అంతా చూసి పొతాలే 
వచ్చా  అందం అంతా దోచేస్తాలే
వచ్చా  అందం అంతు చూస్తాలే 

వచ్చా శృగార కళలు చుపిస్తాలే 


--((**))--


మ. మ . త  (పెద్దలకు మాత్రమే )- 18      
మనసు మనసు తరుణామృతం 
- సాహిత్య వచన శృంగార  కావ్యం

(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) 

శృంగారం అంటే ఒక కళ, కళ అనగా నేర్చుకుంటే అబ్బేది. కాని ఇది ప్రక్రుతి కమనీయ దృశ్యానికి పరవశించి మనసు గగుర్పాటు ఏర్పరిచి ఎదో అనురాగ బంధము అవసరమని భావించి సమయస్ఫూర్తి దులిపే అవకాశం ఏర్పడి ఆనందముతో ఆరోగ్యాన్ని పంచుకొనే తరుణం        

సుమరాగ సఖ్యతకు - పరువముల కలయు
అనురాగ మల్లికకు - కమలములు వలయు 
హిమబిందు పుష్పముకు - దళములె కలసియు
పవళింపు రాగముకు  - సుఖములను బడయు 

కనులంత పెద్దవిగ - మరువము మెరిసియు 
మనసంత మచ్చికగ - కలతొ  మనవలయు 
తనువంత సంబరము - సరిగమల తపనయు 
కళలంత   సమ్మతము - తరుణమున సుఖియు 

చిగురంత నీతియును - తెలుపుట తరుణము 
బిగువంత భాదయును - కలుపుట తరుణము   
తెగువంత చూపుటకు - మనుగడ తరుణము           
కలయంత తెల్పుటకు - అణుకువ తరుణము 

ఆనంద సంద్రమున - నలలపైఁ దేల 
సౌందర్య సంద్రమున - కలలపై దేల 
సాహిత్య సంద్రమున - కధలపై దేల 
కారుణ్య సంద్రమున  - వినయమే దేల 

నేనైతిఁ దూఁగఁగా - నిక్కముగ డోల 
కానదే కన్నులకు - గమ్యమది యెందు 
కాని నే సాఁగెదను - కదలుచును ముందు 

--((**))--



మ. మ . త  (పెద్దలకు మాత్రమే )- 19      
మనసు మనసు తరుణామృతం 
- సాహిత్య వచన శృంగార  కావ్యం

(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) 

శృంగారం అంటే ఒక కళ, కళ అనగా నేర్చుకుంటే అబ్బేది. కాని ఇది ప్రక్రుతి కమనీయ దృశ్యానికి పరవశించి మనసు గగుర్పాటు ఏర్పరిచి ఎదో అనురాగ బంధము అవసరమని భావించి సమయస్ఫూర్తి దులిపే అవకాశం ఏర్పడి ఆనందముతో ఆరోగ్యాన్ని పంచుకొనే తరుణం
అలుకనుఁ బాపుట  ..
---------------------------
I I I I  U I I  I I I I  -  U I I  I I I I U I I U 
తరుణము నీదిలె జగడము - కోపము తమకము వద్దునులే
సమయము వచ్చెను అలుకలు మానుట అవసర ముందియులే 
తనువును పంచియు సరిగమ పల్కియు మనసును ఇద్దువులే
గతమును తల్చక కళలను చూపియు వయసును పంచుదువే 

పెదవులు పంచియు కరముల బంధము చెయుటయు ఇష్టములే        
అదరము చూపియు నరకము నిచ్చెన వెయుటయు ఇష్టములే
పరువము పంచియు పదిలము చూపియు తమకము ఇష్టములే 
సుఖమును మద్దెల దరువుల తో తెలుపుటయును ఇష్టములే 
      
నగవులు చూపియు కధలను తెల్పియు కలియుట ఇష్టములే 
బిగువులు సల్పియు ఉరకలు వేసియు తలచుట ఇష్టములే 
అలకలు చూపియు వెతలను చెప్పియు ముగియుట ఇష్టములే
ఒకరొక రేక మగుట మనసిప్పియు తెలుపుట ఇష్టములే        


--((**))--




మ. మ . త  (పెద్దలకు మాత్రమే )- 20      
మనసు మనసు తరుణామృతం 
- సాహిత్య వచన శృంగార  కావ్యం
(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) 

UUUU - IIIIIU - UIUUIUU అయియును

శృంగారం చేష్టలు మనసునే - మెచ్చి సంతోష భావం   
ఉల్లాసం వచ్చి వలపులలో - తృప్తి కల్గించు భావం         
ఉత్సాహం వచ్చి తలపులలో - హాయి పొందేటి భావం 
ప్రోత్సాహం కల్గి తరుణములో-  ప్రేమ పంచేటి భావం   
  
బాహ్యానందం - పరమసుఖమే - నిత్య సౌభాగ్య భావం 
దివ్యానందం - దినచరముయే - సత్య సౌందర్య భావం 
భవ్యానందం - భవభవమయే  - భవ్య భాందవ్య భావం     
శ్రావ్యానందం - శ్రమనయనమే - శక్తి సౌలభ్య భావం 

సౌందర్యోపా శమువలననే - కామినీ కాంతలేలే  
స్త్రీలోలుండై కుచముఖములే - వర్ణణా తీతమేలే
కాలాతీతం గుణములవలే - స్త్రీప్రెమామృత దివ్వే
ప్రాణాలేలే విరహముగనే - భావ బాంధవ్య మేలే

--((**))--



మ. మ . త  (పెద్దలకు మాత్రమే )- 21      
మనసు మనసు తరుణామృతం 
- సాహిత్య వచన శృంగార  కావ్యం
(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) 

భావనాలయ - 

వర్గము - లయగ్రాహి 
ఆధారము - కల్పితము 
నడక - పంచమాత్రలు 
యతి - ప్రాసయతి 

భావనాలయ - ర/న/త/భ/య/జ/స/ర/గగ 
UIU IIIU - UIU IIIU - UIU IIIU - UIU UU 
26 ఉత్కృతి 5152059 

కాలమాయ పరువే నీది నాది తలపే  
సేవ భావ మనసే నాది నీదేలే 
పువ్వుగా నలిగియున్ - నవ్వుగా పిలిచియున్ 

జువ్వలా వెలిగియున్ - మక్కువా రావా   


దివ్వెగా వెలుఁగుచున్ - గువ్వగాఁ బలుకుచున్ - 
మువ్వగాఁ మొరయుచున్ - జవ్వనీ రావా 
రవ్వగా మెఱయుచున్ - పువ్వుగా విరియుచున్ - 
నవ్వులన్ జిలుకుచున్ - జవ్వనీ రావా 

రివ్వగాఁ గదలుచున్ - సవ్వడిన్ జెలఁగుచున్ - 
దవ్వులన్ శశివలెన్ - జవ్వనీ రావా 
ఇవ్వఁగా వలపు నం-దివ్వఁగా ముదము లం- 
దివ్వఁగా హృదయ మో - జవ్వనీ రావా 

భావనాలయములో - రావముల్ బదములై - 
గ్రీవమం దలరెఁగా - జీవ మీయంగా 
భావనార్ణవములో - నావ నే నడుపఁగాఁ - 
దీవి నాకగపడెన్ - రేవు సూడంగా 

భావ నందనములోఁ - బూవు లా లతలలోఁ - 
బ్రోవులై విరిసెఁగాఁ - దావి బర్వంగా 
చావులో బ్రతుకులో - మోవితో మురళిలో - 
జీవ మూఁదగను రా - దేవరాగమ్మై 

--((**))--

మ. మ . త  (పెద్దలకు మాత్రమే )- 22      
మనసు మనసు తరుణామృతం 
- సాహిత్య వచన శృంగార  కావ్యం
(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) 

రాత్రి కురిసింది చిరు జల్లుల వాన
ధాత్రి తడిసింది మరి మల్లెల బాట
మైత్రి కలిపింది జల బిందువు ఆట
అత్రి విరిసింది మది పొంగుల వాట

దుమ్ము దులిపింది గిరి కాంతుల వాన
సొమ్ము చెదిరింది విరి బంతుల బాట
చిమ్ము కొననుంది వరి కంకుల ఆట
నమ్ము కొనిఉంది మది హంగుల మాట

వచ్చె నిదురంది వల వాంతుల వాన
నచ్చె తలపంది కల జాజుల బాట
విచ్చె వలపంది అల గెంతుల ఆట
తచ్చె సొగసంది మది తీగల మాట

దివ్యె వెలిగింది ఒక రవ్వల వాన
భవ్య సడలింది ఒక పువ్వుల బాట
నవ్య నడిచింది ఒక నవ్వుల ఆట
సవ్య పలికింది ఒక మనస్సు మాట

స్వాతి చినుకంది ధన ముత్యపు వాన 
ఖ్యాతి పెరిగింది నవ సత్యపు బాట
జ్యోతి పెరిగింది భవ బంధపు ఆట 
శృతి అనిగింది మది తత్వపు మాట

--((**))--
    

IIU-IUIIIU - IIUIU-U కామవల్లభ లేక ఋషభ 

చిరుమౌనమే చిగురుటాకుల ఒప్పు కాదా      
తోలి ప్రేమయే ముదురు టాకులు తప్పుకాదా 
మురిపం సమా సమము పల్కుట అప్పు కాదా 
జగడం సమస్యలను పల్కుట ఉప్పు కాదా 

1 కామెంట్‌: