“ కృపణేన సమో దాతా ‘
నభూతో నభవిష్యతి’/
అస్ప్రుసన్నేవ విత్తాని
యః పరేభ్యః ప్రయచ్ఛతి”//
యః పరేభ్యః ప్రయచ్ఛతి”//
.
“ కృపణుడు అనగా పిసినారి. పిసినారి కంటే మించిన దాత ఏ కాలంలోనూ ఇంకొకడు ఉండడు. ఎలా అంటే -వాడు బ్రతికినన్నిరోజులు ఖర్చుపెట్టకుండా, ధనాన్నితాక కుండా, దాచిఉంచి మరణించాక ఇతరులకి ఒప్ప చేపుతాడు.” అందుకనే పిసినారితో సమానమైన దాత “ భూతకాలంలో కాని, భవిష్యత్తు లో కాని” ఉండడు. అని వ్యగ్యంగా కవిచేప్పిన వాక్కు. అందరూ అలా ఉండకుండా బ్రతికి ఉన్నపుడే దానం చేయాలి అని సుభాషితకారుడి సూచన.
తెలుగు భాష నేర్చు కుందాం 30
రచయత :మల్లా ప్రగడ రామకృష్ణ
U I U I U I U I
తోడు నీడ నాకు లేదు
ఆశ ఒక్కటే నాకు తోడు
కూడు గుడ్డ నాకు లేదు
ప్రేమ ఒక్కటే నాకు తోడు
మెచ్చే విద్య నాకు లేదు
జాలి ఒక్కటే నాకు తోడు
సత్య వాక్కు మాన లేదు
నీతి ఒక్కటే నాకు తోడు
పువ్వ లాంటి మేను లేదు
నవ్వు ఒక్కటే నాకు తోడు
అప్పు లాంటి దాత లేదు
నిప్పు ఒక్కటే నాకు తోడు
తప్పు చెప్పె నేత లేదు
ఒప్పు ఒక్కటే నాకు తోడు
కీర్తి పెంచు దారి లేదు
ఓర్పు ఒక్కటే నాకు తోడు
మంచి పంచు దారి లేదు
కాల మోక్కటే నాకు తోడు
చేష్ట మార్పు దారి లేదు
ప్రాణ మోక్కటే నాకు తోడు
పేద బత్కు దారి లేదు
జ్ణాన మోక్కటే నాకు తోడు
రాస లీల దారి లేదు
రాత్రి ఒక్కటే నాకు తోడు
--((**))--
తెలుగు భాష నేర్చు కుందాం
మల్లాప్రగడ రామకృష్ణ-2 8
UIUU-1UUU-IIUU-1UII
కాల మాయే మనోభావం - మన: శాంతే మనోరమ
జాతి భేదం తపో మాయే - జత కాంతే తపోరమ
మాట మంచే మనస్సాయే - కలమాయే సుతారమ
పువ్వు నవ్వే ఆనంతానందము ప్రేమే సుఖాలయ
--((**))--
తెలుగు భాష నేర్చు కుందాం
మల్లాప్రగడ రామకృష్ణ-27
కలలు రాని వేళే లేదు
గెలలు రాని రోజే లేదు
వలలు లేని నావా లేదు
అలలు లేని సంద్రం లేదు
వెతలు లేని జీవే లేదు
కధలు లేని ప్రేమే లేదు
లతలు లేని చెట్టే లేదు
మురికి లేని వీధే లేదు
తగువు లేని తీర్పే లేదు
తరువు లేని కాయే లేదు
తపన లేని మాయే లేదు
తెలప లేని మాటే లేదు
--((**))--
తెలుగు భాష నేర్చు కుందాం
మల్లాప్రగడ రామకృష్ణ-26
I I I U I U - I I U U I
తరువు ప్రేమయే పవనానంద
మనసు గాలమే సమయానంద
వయసు కానుకే సుమయానంద
తనువు ఆశలే తపమానంద
కనుల లోన నే - కలలో నీకు
తగువు లోన నే - మధువో నీకు
--((**))--
తెలుగు భాష నేర్చు కుందాం
మల్లాప్రగడ రామకృష్ణ-25
III-U III-U - III-U UIU కుసుమమాలికా
మనసు -ప్రేమలకు - ఓ - హృదయమే ధైర్యమూ
పవిత్ర తే - లక్షణమే - ఓ - ఉదయ నిస్వార్ధతే
సహన మే - విజయమూ - ప్రేమలతో సత్యంగా
తెలివి ఓ పవనమే - వయసు ఓ కోరికే
మగణి మాటలకు చూపులు సుధా శోభలే
సమయ పాలనకు దాహపు సుధా శోభలే
వరుస సేవలకు ఆకలి సుధా శోభలే
--((**))--
తెలుగు భాష నేర్చు కుందాం
మల్లాప్రగడ రామకృష్ణ-24
భీతియును రోగమును కోపమును చూపకే
మోసమును పాపమును క్రోధమును చూపకే
కాలమును మౌనమును ప్రేమయును నమ్ముకో
కాంతియును శోభయును తెల్వియును చూపులే
ఓ మనసు ఓ వయసు ఓ సొగసు ఏకమే
ఓ తపన ఓ వలపు ఓ తలపు ఏకమే
ఓ జపము ఓ తపము ఓ భయము ఏకమే
తెలుగు భాష నేర్చు కుందాం
మల్లాప్రగడ రామకృష్ణ-23
సామరస్యం సమన్యాయ సేవాలయం
భావతత్వం బలోపేత భావాలయం
ప్రేమతత్వం సుఖాలేలె ప్రేమాలయం
దైవ తత్త్వం మనోశాంతి దేవాలయం
చారుశీల మనోనేత్ర ఆకర్షలే
సత్యభామ కళానేత్ర ఆకర్షలే
నిత్ససత్స సిరోబ్రాంతి ఆకర్షలే
తీపిచేదు తపోమాయ ఆకర్షలే
తెలుగు భాష నేర్చు కుందాం
మల్లాప్రగడ రామకృష్ణ
U-III U-III - U-III UIU నిశిపాల -22
ఓ వలప ఓ తలప ఓ నవత ఇప్పుడే
ఆ మనసు ఈ మనసు ఊ ఒకటి ఇప్పుడే
నా పిలుపు నీ వలపు యే కముగ ఇప్పుడే
కా కలువ కా కవిత కా కమల ఇప్పుడే
ఓ జపత ఓ తపద ఓ వరద ఇప్పుడే
ఆ సొగసు ఈ సొగసు ఊ ఒకటి ఇప్పుడే
నీ వలపు నా పిలుపు యే కముగ ఇప్పుడే
తా తపన తా తగువు తా తరువు ఇప్పుడే
ఆ వరుస ఈ వరుస ఊ ఒకటి ఇప్పుడే
నా కధలు నీ కధలు యే నడుమ ఇప్పుడే
చా చలము చా చమట యే కముగ ఇప్పుడే
--((**))--
తెలుగు భాష నేర్చు కుందాం
మల్లాప్రగడ రామకృష్ణ
UU U U U U ఐ -- 21
అమ్మా దాహం తీర్చావు
నాన్నా అన్నం పెట్టావు
అమ్మా ప్రేమా పంచావు
నాన్నా సాయం చేశావు
అమ్మా ఓర్పు నేర్పావు
నాన్నా నేర్పు నేర్పావు
అమ్మా తీర్పు చెప్పావు
నాన్నా కూర్పు తెల్పావు
అమ్మా శక్తి ఇచ్చావు
నాన్నా యుక్తి నేర్పావు
అమ్మా ముక్తి పంచావు
నాన్నా భక్తి తెల్పావు
అమ్మా కష్టం చెప్పావు
నాన్నా నష్టం మార్చావు
అమ్మా ఇష్టం నేర్పావు
నాన్నా చేష్టల్ మార్చావు
అమ్మా ప్రాణం పోశావు
నాన్నా మానం నిల్పావు
అమ్మా దేహం పంచావు
నాన్నా పుణ్యం పెంచావు
--((**))--
తెలుగు భాష నేర్చుకుందాం
మల్లాప్రగడ రామకృష్ణ
UIUIUIUUII -- 20
తృప్తి చెంత ఆశకు స్వాంతన
బ్రాంతి కాంతి ప్రేమకు స్వాంతన
సేవ తత్వ మాయకు స్వాంతన
మౌన శక్తి మాటకు స్వాంతన
కాల మాయ చెంతకు స్వాంతన
ప్రేమ భావ బ్రత్కుకు స్వాంతన
తీపి చేదు వింతకు స్వాంతన
వచ్చి పోవు సంతకు స్వాంతన
శోక తప్త హృదికి స్వా0తన
యోగ శక్తి దృతికి స్వా0తన
మాయ మోహ శృతికి స్వా0తన
మాట కీర్తి కృషికి స్వా0తన
తెలుగు భాష నేర్చు కుందాం
ప్రాంజలి ప్రభ - 19
మల్లాప్రగడ రామకృష్ణ
కుసుమమాలికా - న/భ/జ/స/ర IIIU IIIU - IIIU UIU
15 అతిశక్వరి 10104
కలలులే కధలులే - మనసునే తల్చుటే
కలువలే జలములో - గమనమే తల్చుటే
మమతలే మనుగడే - జగడమే తల్చుటే
వరుసలో వయసులో - తలపులే తల్చుటే
కనులతోఁ దెలిపెదన్ - గవిత నేఁ గమ్మఁగా
మనసుతోఁ దెలిపెదన్ - మమత నేఁ బ్రీతిగాఁ
దనువుతోఁ దెలిపెదన్ - దపన నే గాఢమై
దినములో రజనిలోఁ - దెరువు నేఁ గాంచితిన్
వలపులో నలిగితిన్ - వ్యధలతో నేనిటన్
దలఁపులో మునిగితిన్ - దరియు నేఁ గానకన్
మలుపులో నిలిచితిన్ - మనసులోఁ గోరుచున్
పిలుపుకై కలఁగితిన్ - బ్రియుఁడు రాఁడేలకో
ముదము పానకమవన్ - బుడక యా కోపమా
వదలఁగా నగునె యీ - వలపు మాయాకృతిన్
కదలఁగా నగునె యీ - కలల లోకమ్ములన్
సుధలు ధూలకములా - సుమము ముల్లయ్యెనా
హరిని నేఁ దలువఁగా - హరుసమే గల్గుఁగా
హరిని నేఁ బిలువఁగా - హరుసమున్ వచ్చుఁగా
హరియు నా సరస నీ - యవనిపై నుండఁగా
నురములోఁ జిరముగా - నుఱుకు క్షీరాబ్ధియే
విరులతో సరములన్ - బ్రియముగా నల్లితిన్
సరములన్ గళములో - సవురుతో నుంచితిన్
మఱల నా సరములన్ - మమతతో వేసితిన్
హరికి నే గళములో - హరియుఁ దా నవ్వఁగా
దెసలలో నసమమై - తెలివెలుంగెల్లెడన్
నిసియు నీరవమవన్ - నెనరు నిండెన్ గదా
కుసుమమాలికలతోఁ - గొమరునిన్ గొల్చెదన్
రసము రాజిలఁగ నా - రమణునిన్ బిల్చెదన్
--((**))--
తెలుగు భాష నేర్చుకుందాం
ప్రాంజలి ప్రభ -18
మల్లాప్రగడ రామకృష్ణ
ఝాటల - స/త/జ/గగ IIU UU - IIUI UU
సమభావాలే - సమ భాష రాగం
నవ దీపాలే - నవ రత్న దీపం
చిరు హాసాలే - చిరు జీవి ప్రాణం
చిరు నామాలే - చిరు దివ్వె భావం
11 త్రిష్టుప్పు 356
శిలగా నుండన్ - జెడు కోప మో నా
చెలికాఁడా నె-చ్చెలిపైన నేలా
కలలోఁ గూడా - కరుణించవా యి
ట్లిలపై నుండన్ - హితమౌనె నాకున్
టలనమ్మా ఝా-టలమందు నీకై
చలిలో నుంటిన్ - స్మరియించుచుంటిన్
లలితోఁ బేరిన్ - లలితప్రియాంగాఁ
దొలి ముద్దీయన్ - దురితమ్ము రావా
(టలనము=తాత్సారము చేయుట)
మనసా వాచా - మహిపైన నిన్నే
వినుమా చేరన్ - బ్రియ దల్చుచుంటిన్
దినముల్ రాత్రుల్ - తిరుగాడుచుండున్
మనమో నీకై - మఱువంగ నౌనా
యమునా తీర - మ్మల సంధ్యవేళన్
రమణుల్ బాడన్ - రసవంతమయ్యెన్
గమనీయమ్మై - కమలాక్షుఁ డూఁదన్
రమణీయ మ్మా - రసరాసకేళుల్
జలజాక్షీ నన్ - జదివించు తల్లీ
పలు ఛందమ్ముల్ - వడి వ్రాయ నెంతున్
మలయై నాకున్ - మహి నుండు మమ్మా
వెలుఁగుల్ నీవై - వెలయంగ రమ్మా
--((**))--
తెలుగు భాష నేర్చుకుందాం
ప్రాంజలి ప్రభ-17
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
శక్తి కూడగట్టి యుక్తి నేర్పావు
బుజ్జ గించి తట్టి లేపి నేర్పావు
వళ్ళు వంచి నిండు మంచి నేర్పావు
కళ్ళు ఎత్తి విజ్ఞ తనే నేర్పావు
మార్పు కోరి నేర్పు కోరి మారావు
ఓర్పు కోరి తీర్పు కోరి మారావు
చుక్క కోరి పక్క కోరి మారవు
వక్క కోరి తొక్క కోరి మారవు
చూసి భామ కోరె భామ అన్నావు
ఆశ భామ ఆట భామ అన్నావు
కాల మాయ మాట మాయ అన్నావు
ఇఛ్ఛ మాయ మచ్చ మాయ అన్నావు
చారు శీల నిత్య బాల అన్నావు
ముద్ద బంతి ముద్ద పప్పు అన్నావు
పేరు దిబ్బ ఊరు గొప్ప అన్నావు
చేసె తప్పు చెప్పె ఒప్పు అన్నావు
--((**))--
ప్రాంజలి ప్రభ-16
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
ప్రమద్వర - ఆధారము - ఛందోరచనా వర్గము - స్రగ్విణి
నడక - ఖండగతి యతి - ఏడవ అక్షరము, ప్రాస నియతము
క్రింద నా ఉదాహరణములు -
ప్రమద్వర - త/ర/త/ర UUI UIU - UUI UIU
12 జగతి 1301
ఈరోజు నీవు నా - కేమేమి యిత్తువో
ఈరోజు నీకు నా - యీడెంద మిత్తునే
గారాముతోడ నిన్ - గవ్వింతు నవ్వులన్
నారాణి నీవెగా - నాకోర్కె నీవెగా
ఎవ్వాఁడు గీచెనో - యీసంధ్య చిత్రమున్
ఎవ్వాఁడు పాడెనో - యీసంధ్య గీతికల్
ఎవ్వాడు పిల్చెనో - యీసంధ్య వేళలో
ఎవ్వాడు నింపెనో - యీప్రేమ రాగముల్
ఏ దేవుఁ డిచ్చెనో - యీనాటి మోదమున్
ఏ దేవుఁ డూఁపెనో - యీస్వప్న డోలికన్
ఏ దేవుఁ డంపెనో - యీప్రేమ కాంతులన్
ఏ దేవుఁ డాడ్చెనో - యీతోలు బొమ్మలన్
కాలమ్ము నాగమా - కాలమ్ము యోగమా
కాలమ్ము సంద్రమా - కాలమ్ము మంద్రమా
కాలమ్ము పాశమా - కాలమ్ము నాశమా
కాలమ్మె యంతమా - కాల మ్మనంతమా
--((**))--
తెలుగు భాష నేర్చుకుందాం
ప్రాంజలి ప్రభ-15
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
III UI III
మగువ లోన పళుకు
మగణి లోన ములుకు
మమత లోన కులుకు
తనువు లోన గరుకు
వలపు లోన ఇరుకు
తలపు లోన ఉడుకు
మలుపు లోన కిటుకు
తలుపు లోన తళుకు
కలుపు లోన వణుకు
మెరుపు లోన చినుకు
పరుగు లోన కినుకు
ముసుగు లోన పలుకు
తనువు లోన తపన
వలపు లోన వగరు
కులుకు లోన జిగురు
బిగువు లోన బెదురు
--((**))--
తనువు పొంగులోఁ - దడియ నలలే
శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
తెలుగు నేర్చు కుందాం
ప్రాంజలి ప్రభ -14 - మనోహరి -
తెలుగు నేర్చు కుందాం
ప్రాంజలి ప్రభ -14 - మనోహరి -
IIIU IIUI - IUII UIIU
మనసులో సమవేద - వసంతము ప్రేమమయం
వయసులో అనురాగ - సరాగము కామమయం
సొగసులో మధురాతి - సుమంగళ రాగమయం
అలుకలో తమకంతొ - సరాగములే మధురం
కనులతో కలవంగ - నరాలలొ సంతసమే
నటనలో నవరాగ - పదాలతొ చెప్పెరతీ
మనిషిలో అనురాగ - ప్రెమలతొ దివ్యమయం
మహిళలో అతిసేవ - వయస్సులొ కోరికలే
మనిషిలో అతి ప్రేమ - మనోమయ మందిరమే
మనసులో మను శక్తి - మేలు తమ సుందరమే
వయసులో యువ శక్తి - వేడి కల కోరికలే
కలువలో కనువిందు - విచ్చిన దళం సరసే
--((*))--
శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
తెలుగు నేర్చు కుందాం
ప్రాంజలి ప్రభ -13
UIIU - IIUI
జీవితమే ఒక ఆట
మార్చుటయే ఒక మాట
ఆడుటయే ఒక వేట
తెల్పుటయే ఒక బాట
కాలముయే ఒక మార్పు
మాటలులే ఒక తీర్పు
చేతలులే ఒక నేర్పు
ఆశయమే ఒక ఓర్పు
సాహసమే ఒక శక్తి
కష్టములే ఒక ముక్తి
నష్టములే ఒక యుక్తి
లక్షణమే ఒక తృప్తి
ఆకలియే ఒక బత్కు
దాహముయే ఒక చిత్పు
దేహముయే ఒక అత్కు
స్నేహముయే ఒక మెత్కు
బాధలుకే ఒక చుక్క
కోతలకే ఒక నక్క
చూపులకే ఒక కుక్క
మాటలకే ఒక అక్క
--((**))--
శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరుని ప్రార్ధించుదాం
తెలుగు భాషను నేర్చుకుందాం
ప్రాంజలి ప్రభ
UI UIII UUIUU ఛందస్సు -12
శాంతి సౌఖ్యములు అందించవయ్యా
కాంతి సౌమ్యములు చూపించవయ్యా
బ్రాంతి సోద్యములు తొల్గించవయ్యా
నిత్య కల్పములు కల్పించవయ్యా
సత్య సంఘములు బత్కించవయ్యా
విద్య భాష్యములు నేర్పించవయ్యా
కర్మ ధర్మములు చేయించవయ్యా
వక్ర భావములు వద్లించవయ్యా
చక్ర స్నానములు ఏర్పర్చవయ్యా
వర్ణ భేధములు మాన్పించవయ్యా
వర్గ భావములు కల్పించకయ్యా
జ్ణాన సంపదను అందించవయ్యా
నీవు నామములు తెల్పితివయ్యా
నీవు మార్గములు చూపితివయ్యా
నీవు వేదములు చెప్పితివయ్యా
నీవు కొండలలో రాయుడవయ్యా
శ్రీ శ్రీ శ్రీ తిరుమల వేంకటయ్యా
శ్రీ శ్రీ శ్రీ తిరుమల బ్రహ్మమయ్యా
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిర్పతయ్యా
శ్రీ శ్రీ శ్రీ తిరుమల సంపదయ్యా
శ్రీ శ్రీ శ్రీ తిరుమల వేంకటాద్రయ్యా
శ్రీ శ్రీ శ్రీ తిరుమల నారాయణాద్రయ్యా
శ్రీ శ్రీ శ్రీ తిరుమల వృషభాద్రయ్యా
శ్రీ శ్రీ శ్రీ తిరుమల అంజనాద్రయ్యా
శ్రీ శ్రీ శ్రీ తిరుమల శేషాద్రయ్యా
శ్రీ శ్రీ శ్రీ తిరుమల గరుడాద్రయ్యా
శ్రీ శ్రీ శ్రీ తిరుమల నీలాద్రయ్యా
--((**))--
ఓంశ్రీ రాం - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్రభ (తెలుగు భాషను నేర్చుకుందాం )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ ఛందస్సు ..... (10 )
IUI IUI IIU UI UUU - లోకోక్తి -౨
సమాన జయమ్ము మనకీ వచ్చు స్నేహమ్మే
నిదాన ప్రయాణ మునకే వచ్చు లాభమ్మే
విశాల వినోద మమతే మార్పు సౌఖ్యమ్మే
అకాల ప్రభావ తరుణం ఓర్పు సౌఖ్యమ్మే
అనంత ప్రభావ సమయం దివ్య దిగ్భంధం
ప్రశాంత ప్రభావ యదలో శ్రావ్య సుఘంధం
అనేక యనేక మదిలో భావ్య ప్రబంధం
చిరస్మ రనీయ కవితా కావ్య ప్రపంచం
--((**))--
ఓంశ్రీ రాం - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్రభ (తెలుగు భాషను నేర్చుకుందాం )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ ఛందస్సు ..... (9 )
ప్రమద్వర - త/ర/త/ర UUI UIU - UUI UIU
ఏ నవ్వు చూసెనో - యీ మార్పు పొందియున్
ఏ పేరు చెప్పెనో - యీ నేర్పు పొందియున్
ఏ మాయ చేసెనో - యీ కూర్పు పొందియున్
ఏ రోగ ముండెనో - యీ తీర్పు పొందియున్
ఏ దేవు డిచ్చెనో - యీనాటి సేవయున్
ఏ దేవుఁ డిచ్చెనో - యీనాటి మోదమున్
ఏ దేవుఁ డూఁపెనో - యీప్రేమ పల్కుయున్
ఏ దేవుఁ డూఁపెనో - యీస్వప్న డోలికన్
ఏ దేవుఁ డంపెనో - యీద్వేష మాటలన్
ఏ దేవుఁ డంపెనో - యీప్రేమ కాంతులన్
ఏ దేవుఁ డాడ్చెనో - యీ మాయ శిష్యులన్
ఏ దేవుఁ డాడ్చెనో - యీతోలు బొమ్మలన్
--((**))--
ప్రాంజలి ప్రభ (తెలుగు భాషను నేర్చుకుందాం )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
UIIU -UI -UI- UI- UI- UIU
ఛందస్సు శోభ (కొత్త వృత్తము ) ఛందస్సు ..... (8 )
స్పర్శలలో చిక్కి ముద్దు లిచ్చి ప్రేమ లందుకో
సవ్వడిలో కలై అలై వళై చూసి నందుకో
మువ్వలతో చేరి హృది పంచి జాలి పంచుకో
ముద్దులతో లేత మేను ఇస్తే శృతి పల్కునే
వానలలో తడ్సి రాగ తాళ పాట పాడెనే
వేణువుతో సంగీ తాన్ని పంచి ప్రేమ పొందెనే
కన్నులలో కాంతి చూపి ఆశ తీర్చ గల్గెనే
ఊయలలో ఊగి జోల పాడి లాభ పొందునే
కన్నులలో కాంతి శక్తి కొంత చూచి నంతనే
తాపముతో వింత శోభ వేగి తుళ్ళి పండెనే
ప్రేమలతో ఇష్ట కాంతి ఛాతి పైన ఉండెనే
కౌగిలిలో చేరి శాంతి పొంది పేరు పొందునే
--((*))--
ప్రాంజలి ప్రభ (తెలుగు భాషను నేర్చుకుందాం )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ ప్రేమమ్ము శాంతియే - ప్రేమమ్ము కాంతియే
ప్రేమమ్ము మోక్షమే - ప్రేమమ్ము వేదమే
ప్రేమమ్ము భక్తియే - ప్రేమమ్ము శక్తియే
ప్రేమమ్ము ముక్తియే - ప్రేమమ్ము యుక్తియే
కాలమ్ము నాగమా - కాలమ్ము యోగమా
కాలమ్ము సంద్రమా - కాలమ్ము మంద్రమా
కాలమ్ము పాశమా - కాలమ్ము నాశమా
కాలమ్మె యంతమా - కాలమ్మ నంతమా
శాంతమ్ము దాహమే - శాంతమ్ము ఆకలే
శాంతమ్ము ఓపికే - శాంతమ్ము నీడయే
శాంతమ్ము వేడియే - శాంతమ్ము చల్లనే
శాంతమ్ము పొందుయే - శాంతమ్ము ప్రేమయే
--((***))_--
ప్రాంజలి ప్రభ (తెలుగు భాషను నేర్చుకుందాం )
రావే సుహాసినీ - రావే నిలాంబరీ
రావే సుధామనీ - రావే వినోదనీ
రావే మనోమఈ - రావే తపోనిధీ
రావే కళావతీ - రావే కృపామఈ
రావే సుమంగళీ - రావే సుమాలతీ
రావే విభావరీ - రావే విలాసినీ
రావే మరాళికా - రావే మనోరమా
రావే ప్రహర్షిణీ - రావే ప్రమద్వరా
రావే సరోజనీ - రావే సుఖాలఈ
రావే సమంతకా - రావే కృషీవతీ
రావే వరూధినీ - రావే ప్రమోదనీ
రావే కధాకళీ - రావే శ్రమావతీ
--((**))--
ప్రాంజలి ప్రభ (తెలుగు భాషను నేర్చుకుందాం )
కలువ పరిమళం - కాంచన రవము
జలము పరుగులే - సంద్రము రవము
పెదవి పలుకులే - సత్యపు రవము
హృదయ తపములే - నిత్యపు రవము
మగువ నగవులే - మౌనపు రవము
మగణి పదవులే - ఆశయ రవము
మమత తలపులే - మాయకు రవము
చరిత కొలువులే - ఆకలి రవము
మధుర మధుర మీ - మంజుల రవము
మొదము నొసఁగు నీ - మోహన రసము
పదము పదములో - వలపు కలమే
హృదయ సరసిలో - నింపు జలమే
ప్రాంజలి ప్రభ (తెలుగు భాషను నేర్చుకుందాం )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ U I U I U - I I U I U (ఛందస్సు - 4 )
గాల మయ్యెరా - కరుణించరా
పూల స్పర్శతో - మురిపంచరా
జాలి చూపరా - సరసమ్ముతో
ప్రేమ నిల్పరా - మురిపెమ్ముతోఁ
నీవె సత్యమూ - నిజ భాష్యమే
నీవె నిత్యమూ - నిజ భావ్యమే
నీవె కాంతియూ - నిజ ప్రేమయే
నీవె శాంతియూ - నిజ మోక్షమే
జాతరే నిత్య - శుభ శోభరా
ప్రేమలే సత్య - భవ బంధమే
దాహమే తృప్తి - సుఖ భావమే
ఆకలే హాయి - కను మెర్పుయే
--((**))--
ప్రాంజలి ప్రభ (తెలుగు భాషను నేర్చుకుందాం )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
I I I U I U - I I U U I (ఛందస్సు -3 )
సరళ రేఖలే - సమభావాలు
కనుల రెప్పలే - నిద్రసౌఖ్యాలు
కలువ మొగ్గలే - తొలి అందాలు
మగువ ప్రేమలే - సుఖసౌఖ్యాలు
కనులలోన నే - కలలో నీకు
మనసులోన నే - మధువో నీకు
తనువులోన నే - జపమో నీకు
మగువతోడ నే - తపమో నీకు
కరుణ చూపియే - మన సివ్వు
పరువు నిల్పియే - సొగసివ్వు
వలపు చూపియే - తనువివ్వు
కలలు తీర్చియు - సుఖ మివ్వు
--((**))--
సరళ రేఖలే - సమభావాలు
కనుల రెప్పలే - నిద్రసౌఖ్యాలు
కలువ మొగ్గలే - తొలి అందాలు
మగువ ప్రేమలే - సుఖసౌఖ్యాలు
కనులలోన నే - కలలో నీకు
మనసులోన నే - మధువో నీకు
తనువులోన నే - జపమో నీకు
మగువతోడ నే - తపమో నీకు
కరుణ చూపియే - మన సివ్వు
పరువు నిల్పియే - సొగసివ్వు
వలపు చూపియే - తనువివ్వు
కలలు తీర్చియు - సుఖ మివ్వు
--((**))--
ప్రాంజలి ప్రభ (తెలుగు భాషను నేర్చుకుందాం )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
UI-UII - UI - UII UUUU (KOTTADI ) ఛందస్సు (1 )
ఊహ నీదియు కాని - చేతలు నా వేనమ్మా
ఊహ గా బ్రత కాలి - ఆశలు నీ వేనమ్మా
ఊహతో జత జంట - ప్రేమల నా బాంధవ్యం
ఊహాగా లత లేలు - అల్లిక నీ భంధమ్మే
ప్రేమతో నిరతమ్ము - మశ్చిక చూపాలమ్మా
ప్రేమగా కనుచూపు - పల్కులు పంచాలమ్మా
శక్తి తో దినమంత - కష్ట పడాలేనమ్మా
యుక్తి తో మనసంత - రాత్రి సుఖాలివ్వమ్మా
--((**))--
UI-UII - UI - UII UUUU (KOTTADI ) ఛందస్సు (2 )
లాలి పాటను పాడి - ప్రేమను అందించాలీ
ఆశ దాహము తీర్చి - ప్రేమను పండించాలీ
వేష భాషలు మార్చి - ప్రేమను ఇప్పించాలీ
కాల మాయను తుంచి - ప్రేమను దీవించాలీ
ప్రేమ నీదియు కాని - భావము అర్ధించాలీ
ప్రేమ పొందితి కాని - ఆశలు మార్పించాలీ
ప్రేమ గాబ్రత కాలి - చేతలు కల్పించాలీ
ప్రేమ మాట వినాలి - కోర్కలు తగ్గించాలీ
ప్రేమతో నిరతమ్ము - మశ్చిక చూపేలాలీ
ప్రేమతో వినయమ్ము - కాంతియు పంచెలాలీ
ప్రేమతో తరుణమ్ము - శాంతియు ఇచ్చెలాలీ
ప్రేమతో విషయమ్ము - తీర్చియు పొందెలాలీ
సౌర్యమే మనకుండు - రక్షణ కల్పిద్దామూ
ధైర్యమే మనకుండు - శిక్షణ ఇచ్చేద్దామూ
ప్రేమయే మనకుండు - కల్సియు ప్రేమిద్దామూ
కాలమే మనకుండు - బాధ్యత గావుందామూ
--((**))--
om
రిప్లయితొలగించండి