23, మార్చి 2019, శనివారం




పూజ-పరమార్థాలు

పూజ --> పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మమృత్యువులను లేకుండాచేసేది సంపూర్ణఫలాన్నిచ్చేది.
అర్చన--> అభీష్ట ఫలాన్నిచ్చేది చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది.
జపం--> అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది జపం.
స్తోత్రం--> నెమ్మది నెమ్మదిగా మనస్సు కి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.
ధ్యానం--> ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది, ఇష్టదేవతను చింతింపచేసేది ధ్యానం.
దీక్ష--> దివ్యభావాలను కల్గించేది, పాపాలను కడిగివేసేది, సంసార బంధాలనుండి విముక్తిని కల్గించేది దీక్ష.
అభిషేక:--> అహంభావాన్ని పోగొట్టేది, భయాన్ని మథించేది, పవిత్రోదకాన్నిచల్లేది, ఆనందాదులను కల్గించేది.
మంత్రం--> తత్త్వం పై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం.
ఆసనం--> ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్తసిద్ధిని, లేదా నవసిద్ధులను కల్గించేది ఆసనం.
తర్పణం--> పరివారంతో కూడిన పరతత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.
గంధం--> అంతంలేని దౌర్భాగ్యాన్ని, క్లేశాన్ని నశింపుచేసేది ధర్మఙ్ఞానాలనిచ్చేది.
అక్షతలు--> కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి.
పుష్పం--> పుణ్యాన్నివృద్ధిచేసేది, పాపాన్ని పోగొట్టేది, పుష్కలార్ధాన్ని ఇచ్చేది.
ధూపం--> చెడువాసనలవల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది, పరమానందాన్ని ప్రసాదించేది.
దీపం--> సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది, అహంకారం లేకుండా చేసేది, పరతత్త్వాన్ని ప్రకాశింప చేసేది.
నైవేద్యం--> ఆరు రుచులతో నున్న నాల్గు విధాల పదార్ధాలను,దేవతకు తృప్తినిచ్చేదానిని నివేదన చేయుటయే.
ప్రసాదం--> ప్రకాశానందాల నిచ్చేది, సామరస్యాన్ని కల్గించేది, పరతత్త్వాన్ని దర్శింపచేసేది ప్రసాదం.
ఆచమనీయం--> లవంగ, జాజి, తక్కోలములతోకూడిన ద్రవ్యం ఆచమనీయం .
ఆవాహనం--> పూజ కొరకు దేవతను పిలుచుటయే ఆవాహనం.
స్వాగతం--> దేవతను కుశలప్రశ్నవేయుట.
పాద్యం--> చామలు, గరికలు, పద్మాలు, విష్ణుక్రాంతలతో కూడిన ద్రవ్యం పాద్యం, పాదాలు కడుగుటకు ఇచ్చే జలం.
మధుపర్కం--> తేనె, నెయ్యి, పెరుగులతో కూడినది.
స్నానం--> గంధం, కస్తూరి, అగరు మొవాటితో స్నానం.
వందనం--> అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం ఉరస్స(వక్షస్థలం, శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, కరములు, కర్ణాలు, నేలకుతాకించి చేసే వందనం సాష్టాంగం).
ఉద్వాసన--> దేవతను, ఆవరణ దేవతలను పదహారు ఉపచారాలచే పూజించి పంపడాన్ని ఉద్వాసనమని అంటారు.

శ్రీనాథుని హరవిలాసమునుండి -

కం. నీవ పరబ్రహ్మంబవు
నీవఖిలాండాండపతివి - నీవు ప్రసన్న-
శ్రీవిభవారోగ్యాయుః
ప్రావీణ్యప్రాభవైక - ఫలదుఁడవు శివా - 7.93
(ప్రథమా విభక్తి)

కం. నిన్నుఁ ద్రిజగన్నివాసునిఁ
బన్నగకంకణుని భక్త-పరతంత్రుని న-
భ్యున్నత కరుణాగుణసం-
పన్నుని గనుఁగొంటి మంటి - బాలేందుధరా - 7.94
(ద్వితీయా విభక్తి)

కం. నీచేతఁ గృపానిధిచే
వాచాగోచర వివేక - వైయాత్మునిచే
నోచంద్రకలాశేఖర
యాచించి మనోరథార్థ - మర్థిం గందున్ - 7.95
(తృతీయా విభక్తి)

శా. నీకై యేను దపంబు చేసితి మహా-నిష్ఠా గరిష్ఠస్థితిన్
నీకై సంస్తుతి సేయుదుం గడఁగి నా - నేర్పొప్పఁగా నెంతయున్
నీకై పూజయొనర్తుఁ గొంత విరులన్ - నిత్యంబు సద్భక్తితో
నీకై సేవ యహర్నిశం బొనరుతున్ - వేదండచర్మాంబరా - 7.96
(చతుర్థీ విభక్తి)
  
      
తే. సాటి యెవ్వరు నీకు ని-శాటభూష
కైటభారాతి హాటక-గర్భ వంద్య
ఘనజటాజూటవాటికా - ఘటిత వికట
గగనగంగా స్రవంతిక - కరటి వైరి - 7.97
(షష్ఠీ విభక్తి)

కం. నీయందు జగములుండున్
బాయక యా జగములందుఁ - బాయక నీవున్
దీయనుపు దెలియ నజునకుఁ
దోయజనేత్రునకు నైనఁ - దోఁపదు శర్వా - 7.98
(సప్తమీ విభక్తి)

మ. జయ సర్వేశ్వర సర్వలోక జనకా - చంద్రార్ధచూడామణీ
జయ కామాతక కామితార్థ ఫలదా - చక్షుశ్శ్రవః కుండలా
జయ సంపూర్ణ కృపాగుణాఇక వసతీ - శైలేంద్రజా వల్లభా
జయ దక్షాధ్వరమర్దనా జయ గిరీ-శా యీశ రక్షింపవే - 7.99

(సంబోధనా ప్రథమా విభక్తి)


ఓం శ్రీ  రామ్ - శ్రీ మాత్రేనమ:
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ (31)  
వాక్కులు - అవాక్కులు చిన్న (కధ)


అది కోర్టు, నల్లకోటు వేసుకున్నవారు కనిపిస్తూ ఉన్నారు. అంతలో సమయమైనదని కొందరు మనుష్యులు గబ గబ వచ్చి కూర్చున్నారు.

వాద ప్రతి వాదనలు జరిగాక 70 సంవత్సరముల పండు ముసలావిడ (వృధ్ధురాలు) హత్య చేసానని ఒప్పు కున్నది.

వయసును గౌరవించి మానవతా దృక్పథంతో కొన్నాళ్ళు మానసికంగా ఆమె చేసిందో లేదో డాక్టర్ కనుగొనాలని, సరియైన ఆధారాలు తెలపాలని రక్షణ శాఖకు (పోలీస్)వారికి తెలియపరిచారు తాత్కాలిక తీర్పుగా.

డాక్టర్ పలువిధాలుగా ప్రశ్నించిన హత్య నేనే చేసాను తెలియ పరిచింది. ఆమె మానశిక పరిస్తితి బాగున్నదని నిర్ధారించి ఉరి శిక్ష వేశారు.

అక్కడ ఉన్న ప్రత్యేక కొరాగారంలో ఉంచటం జరిగింది. కాని డాక్టర్ కు అనుమానం ఉన్నది. నీవు చనిపోతున్నావ్ అసలు నిజం ఏం జరిగిందో నాకు తెలుపు నేను ఎవ్వరికీ చెప్పను అని సెల్ రికార్డ చేస్తున్నది.

నా మనవరాలుకు పెళ్ళి నిశ్చయమైనది పెళ్ళి జరగ బోతున్నదీ ఆ పెళ్ళి లో అందరూ దీవిస్తున్నారు.

అక్కడే ఉన్న ఒక నడివయస్సు లో ఉన్నవాడు జేబులో తెచ్చిన బాటిల్ తో ఏదో చల్లాడు అంతే పెళ్ళి ఆగి పోయింది మండపం తగలబడింది కదా.
ఇది తెలిసిందే నీవు హత్స చేసానని చెప్పావ్ అదే మాకు అర్ధం కాలేదు.
నా మనవరాలుని గబ గబ ఆసుపత్రి కి తీసుకొని వెళ్ళాం అక్కడ కూడా డ్యూటీ డాక్టర్ లేకపోవటం జరిగింది నాకు ఏంచ్చెయ్యాలో తోచలా వెంటనే నాకు తెలిసిన ఆకు పసరు వ్రాసాను మోఖానికి.
తరువాత చనిపోయింది నీవే హత్స చేసానని లొంగి పొయ్యావ్ కదూ అన్నది డాక్టర్.
ఇక నేను చెప్పెది ఏముంది మీరు మేధావులు అన్నీ తెలుసుకున్నారు.
లేదు నీవు ఏదో దాస్తున్నావ్ పూర్తి వివరాలు తెలుపుటలేదు అని డాక్టర్ వెళ్ళి పోయింది.
ఈ వృద్ధురాలు మాట్లాడినవి విన్న జడ్జీ గారు కోర్టు తప్పు త్రోవ చూపినందుకు మోదటి తప్పుగా భావించి శిక్ష రద్దు చేసి విడుదల చెయ్యాలని, డాక్టర్ ను సస్పెండ్ చెయ్యాలని, మనవరాలు మోఖంపై పెట్రోలు పోసి తప్పించు కొని తిరుగు తున్న వారిని పట్టు కోవాలని పోలీస్ వారికి తెలియపరిచి ఈ కేసును వచ్చేవారం కు వాయిదా వేస్తున్నాను. కోర్ట్ ముగిసింది అని లేచారు జడ్జి గారు.

డాక్టర్ నవ్వుతూ ఒక పేపర్ తెచ్చి జైలర్ కు చూపించింది
వృధ్ధు రాలిని విడుదల చేసారా
ఏది మీ రిపోర్టు ఇవ్వాలి కదా, తర్వాత విడుదల చేస్తాము
నేను ఆమెను కలవ వచ్చా
మీకు అభ్యంతరం ఏముంది కలవండి
అన్న జైలర్ మాటలకు వెళ్ళి కలిసింది వృధ్ధురాలని
పేపర్ బట్టి మళ్ళి నాపైన కేసు పెట్టి బంధిఖానా చేద్దామను కుంటున్నారా
మీకు నెట్ వర్కు ఉన్నదా
ఉందను కుంటే ఉంది, లేదనుకుంటే లేదు
మీరు ఎంతవరకు చదివారు
నేను పాత డిగ్రీ, మరియూ లోకం చదివాను
పోలీస్ ఆఫీసర్ కొడుకు పై యాసిడ్ పోసారు
అందులో నీ హస్తం ఉందంటున్నారు, అది నిజమేనా
నేను జైల్లో ఉంటం మీరే సాక్షం
మీరు కూడా పోలీసోళ్ళకు అమ్ముడు పోతే ఎవ్వరూ ఏమి చేయలేరు
నేను ఒకటే చెప్పేది భగవద్గీత ను ఆచరిస్తాను
అధర్మం జరిగినప్పుడు భగవంతుడే పుడతాడని ఉంది
చట్టాలను మీరు నమ్మారా
ఎందుకు నమ్మను నమ్ముతా చట్టంలో ఉన్న లొసుగులే నాయకులకు, డబ్బున్నవారికి అవకాసం గా మారుతున్నాయి.
కేసులు సంవత్సరాల వాయిదాలు వేస్తూ ఉంటే ఎవరికి నమ్మకం ఉంటుంది, వేల కేసులు పెండింగ్ ఎందుకు ఉంటాయ్
ఇంతకీ నీవు చెప్పేదేమిటి
ఎక్కడ అధర్మం, అన్యాయం జరిగిన చోట ఈ ముసలమ్మ ఉంటుంది

--((**))--


ఓం శ్రీ  రామ్ - శ్రీ మాత్రేనమ:
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ (30)  
వాక్కులు - అవాక్కులు చిన్న (కధ)


ఒసై కోడలపిల్లా అలా మూల కూర్చొనే బదులు ఇల్లు ఊడ్చ వచ్చు కదా

అత్తయ్యగారు ఒక్కసారి కళ్ళు పెట్టుకొని చూడండి, ఏంచేస్తున్నానో, పుస్తకం చదువు తుంటే కనబడుట లేదా

నువు చదువు కున్నావని నేను చదువు కోలేదని నన్ను చూస్తే చులకన, మా కాలంలో చదువు కోవాలన్నా చది వేందుకు స్కూల్లు దూరంగా ఉండేవి అందుకనే చిన్నప్పుడే పెళ్ళి చేసేసారు.

ఇప్పుడు చదువు ఉద్యోగం వచ్చిం తర్వాతే పెళ్ళి చేసు కుంటున్నారు, ఇదండి లోకం తీరు అని అన్నది.

అంతలో భర్త వచ్చి అమ్మ కష్ట బడు తుంటే ఊర్కనే కూర్చొని కాలక్షేపం చేస్తున్నివా అన్నాడు కోపంగా భర్త.

అమ్మను కష్టపడుతుంటే నేను చూడలేను అట్లైతే మీరు చేయండి ఆమాత్రం కష్ట పడితే సొమ్మేం పోదులే.

ఒరై అబ్బా య్ అమ్మాయిని ఏమి అనకు ఈరోజు నేను ఊడ్చా, రేపు ఊడుద్దానివి రా ఈ రోజుకు వదిలేయీ కోపగించు కోకు ఎంతైనా నీ పెళ్ళాం ప్రేమించి పెల్లి చేసుకున్నావు అనుభవించాలి కదా .

అది కాదమ్మా , ఏదీ కాదు అలా బట్టలు నేను ఉతుకుతా బావిలో నీళ్ళు తోడి పొయ్యరా 
అట్లాగేనమ్మా .

అత్తయ్యగారు మీరు పెధ్దవారు అలా కూర్చోండి మావారు చేస్తారు లేండి ఈ రోజుకి అన్నది
కోడలు పిల్లా, ఎందుకులేమ్మా నాకింకా ఓపిక ఉంది , నా అంత అయ్యాక నీకు తెలుస్తుందీ.
ఎమన్నారు
ఏమీ అనలేదు
ఏమీ అనకు అలా కూర్చోండి

ఏం మోగుడా చూస్తూ ఉన్నావేమిటీ 
అలా కూర్ఛొని బట్టలు ఉతుకు 
జాగర్త చినగ కుండా ఉతుకు
నాకు చాత కాదే మురికి పోక పోతే మరలా నువ్వే బాధ పడతావ్
నేనేం తక్కువ తిన్నానా మురికి పోనివన్నీ మరలా తీసి నీచేతే ఉతికిస్తా 
ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉతుకూ అని పుస్తకం తీసి చదువుతున్నది కోడలు సుధారాణి.

ఎవరండి లోపల అనే పిలుపు వినబడింది
అత్తయ్యగారు ఎవరో వచ్చినట్లు తెలిసిందీ ఒక్క సారి చూడండి

వచ్చిన వారు వెంటనే సాల్యూట్ చేసారు
ఎందు కొచ్చారు మీ ఇంట్లో పని చేయుటకు 
ఇక్కడ పనిలేదు ఏమీలేదు వెల్లండి
వాల్లని లోపలక లమ్మనమండీ ఆని కోడలు పిల్ల పిలిచిందీ
మరలా సిల్యూట్ చేసాడు వచ్చినవాడు .
అతని చేతిలో కొంత పైకము ఇచ్చి కాగితం మీద ఏదో వ్రాసి ఇచ్చింది 
అత్తగారు ఒరే అబ్బాయ్ మీ ఆవిడ వచ్చిన వానికి ఏదో రాసి ఇస్తుంది, 
మోగోడు వై ఉండి దద్దమ్మలా ఉంటావేమిరా
అన్న పిలుపుకు 
ఏమయిందే అంత పెద్దగా అరుస్తావ్
అరిచానా, పిలిచినుగా
సరె ఏమయిందో చెప్పు
మీ ఆవిడ ఉందిగా ఇవిడ్నే అడుగూ
చూడండి వచ్చినవానికి చీటి వ్రాసి ఇచ్చా, వచ్చాక సరిగా ఉన్నాయౌ లేవో చూడండీ అది చాలు
అంతేనా
ఇందేనికో పిలిచావనుకున్నా
ఇంక కొన్ని రోజులు మీకు పస్తే
ఏంమాట్లాడుతున్నావో నాకేం అర్ధం కావటంలేదు
ఏం అర్ధం అవుతుంది, చెప్పినా అర్ధం కాదు, అమ్మా అమ్మా అంటు ఉంటూ ఉంటే అంతే

అత్తయ్యగారు ఆ తెచ్చినవి, మీకు, ఇవి నాకు మావారికి
ఇన్ని పార్శిల్లు తెపించావు వాటిలో ఏమన్నాయ్ మిగతావన్ని పని వాళ్ళు చూసుకుంటారు, మీ చీరలు నచ్చకపోతే మార్చు కోండి 
కారణం ఏమిటో చెప్పక ఇవన్నీ ఏమిటమ్మా 
ఏమీలేదు అత్తయ్యగారు నానిజాయితీ, నాచదువు చూసి నాకు యమ్ యల్ సి సీటు ఇచ్చి గెలిపించారు అత్తయ్యగారు.
నాకు ఎటూ చెప్పలేదు కనీసం మీ ఒయన కన్నా చెప్పావా
చెప్పానత్తగారు చులకనగా మట్లొడారు మా వారు
ఏం ఉద్యోగమో ఏమో నాకేం తెలియుటలేదు
చదువుకన్నై వాడ్ని ఈ రాజకీయం నాకే తెలియదు
అత్తయ్యగారు మీరు ఆశీర్వదించి రాజ్యసభ కు పంపండి 
అంటే ఇక నాపేరు యమ్ యల్సి గారి మోగుడూ, నొపేరు యమ్ యల్సి గారి అత్తగారు అవునా 
ఐవునా ..... అవునూ 
అని ళవ్వు కున్నారు.

--((**))--


ఓం శ్రీ  రామ్ - శ్రీ మాత్రేనమ:
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ (29  )  
వాక్కులు - అవాక్కులు చిన్న (కధ)

గురువుగారు మీరు ఎవరిని సమర్ధిస్తారు, ఏ పార్టి గెలుపు కోసం ఆశిస్తారు, అని ఒక విలేఖరి అడుగగా ముందు ప్రజలను చైతన్య వంతులు చేయండి, వారికి ఓటు విలువ తెలియ పరచండి, వర్ధమాన నాయకులే దేశానికి వెన్నెముక లాంటి వారు వారినే గెలిపించామని నేను కోరుతాను అన్నారు.    

అట్లాకాదు మీ నిర్ణయం ఖచ్చింగా చెప్పవచ్చు కదా 
చాపక్రింద నీరును ఎవ్వరూ చెప్పలేరు, మనుష్యుల అభిప్రాయాలు ఎవ్వరూ చెప్పలేరు, నేను అందరు ఓటు వెయ్యాలని మాత్రమే చెప్పగలను. 
     
      రోగం తగ్గాలంటే తగిన మందు వాడాలి -దేశం బాగు పడాలంటే సరి ఐన పార్టీకే వోటు వెయ్యాలి - మీ ఓటు విలువ మందు తో సమానం -మందుకు రోగం తగ్గినట్లు - మీ ఓటు తో నిజాయితి గల నాయకులు ఎన్నుకోవటం జరుగుతున్నది - మీ ఓటుతో మీరు నమ్మిన పార్టిని గెలిపించండి

      ఆంజనేయుని దేవాలయం నుండి తెలియపరుస్తున్నా మనచుట్టు వున్నవారి దృష్టితో, దేశ క్షేమం దృష్టితో ఆలోచించి ఓటు వేసి గెలిపించండి 

      వాద ప్రతి వాదనలకు దిగకండి, నమ్మకాన్ని వమ్ము చేయకండి, సహాయపడే వారెవరో తెలుసుకోండి, మానవత్వాన్ని నిలబెట్టె వారెవరో తెలుసుకొని ఆ పార్టీ కే ఓటు వెయ్యండి

       రాజకీయంలో వ్యక్తి గతంగా అభివృద్ధి చేయటం కష్ట తరము - సంఘ పరంగా అభివృద్ధి చేసేవారు ఎవరో, ఎవరో తెలుసుకోవాలి. మన ప్రాంత వృద్ధికి ఎవరు సహకరిసున్నారో, గుర్తించి ఆ పార్టి కే ఓటు వెయ్యాలని కోరుతున్నాను

      మన రాజ్యాంగంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి కొన్ని రోజులు జైల్లో ఉంటె వారి ఉద్యోగం పోతుంది కాని రాజకీయనాయకులు ఎన్ని రోజులు ఉన్నా వారు ముఖ్య మంత్రిగా పోటి చేయవచ్చు ఏది ఏమైనా మన రాజ్యాంగాన్ని గౌరవిద్దాం నేర చరిత్ర లేని వారికి ఓటు వేసి గెలిపిద్దాం, అదే నేను కోరుకునేది

     భారత ప్రజలు 3 రకాల గా అనుకుంటున్నారు బీదవారు, మధ్యరకం వారు, అధిక సంపాదన ఉన్నవారు ఉన్నారు. అయినా ప్రతి ఒక్కరికి సహాయం చేసి భవిషత్తు మార్గం చూపే వారికి ఓటు వెయ్యాలో , నాకేం చేసారు నాకు మందు పోశారు, నాకు చీరలు పంచారు అన్నవారికి వోటు వెయ్యాలో అలోచించి
ఓటు వెయ్యండి. మీ భవిషత్తు మీరే నిర్ణయించు కోగలరని కోరుతున్నాను

      విభజన వల్ల నష్టము వచ్చినా, కేంద్ర సహాయము సరిగా అందక పోయినా ధైర్యంతో రాజధాన్ని నిర్మిస్తునాను అద్భుతమైన నగరంగా మార్చటానికి నాకు అవకాశం ఇవ్వండి అన్నవారికి ఓటు వేస్తారా లేదా ధనాశ చూపిన వారికి ఓటు వేస్తారో మిరే నిర్ణ ఇంచుకొని ఓటు వేసి గెలిపించండి

     కులాల అతీతంగా, మతాలు అతీతంగా, నిజాయతీగా ఆశయాలను బతికించే  వారెవరో గుర్తించి ఆ పార్టీకే " ఓటు " వెయ్యాలని కోరుతున్నాను

మీ భవిషత్తు పూలబాట గా మార్చుటకు మాకు అవకాశం ఇవ్వండి అని మీ ముందుకు వస్తారు ముసలి కన్నీరు చూసి మోసపోకండి ఏ పార్టి వస్తే అభివృద్ధి చేయగలదో వారికే ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. 

--((**))--



ఓం శ్రీ  రామ్ - శ్రీ మాత్రేనమా:
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ (28 )  

వాక్కులు - అవాక్కులు చిన్న (కధ)

గురువుగారు అరిషడ్వర్గాలు గురించి తెలియపరచండి అని శిష్యులు అడిగారు 
మీరు సావదానంగా కూర్చొని వినండి, వినటం కాదు నిగ్రహ శక్తి సంపాదించి కోరికల జోలికి పోకుండా దైవజ్ఞానం సంపాదించండి     
అరిషడ్వర్గాలు అంటే కామ,క్రోధ,లోభ,మహ,మద మాత్సర్యాలు అనే ఆరింటిని కలిపి అరిషడ్వర్గాలు అని అంటారు. ఈ అరిషడ్వర్గాలు అనేవి మనషిని ఎంతటి క్రింది స్థాయికైన దిగాజారుస్తాయి. మనిషి పతనానికి మరియు ప్రకృతి వినాశనానికి కూడా ముఖ్య కారణం ఈ అరిషడ్వర్గాలె. ఈ అరిషడ్వర్గాలు ఎవరైతే కలిగి ఉంటారో వారి మనసు ఎప్పుడు స్వార్ధం మరియు సంకుచిత భావాలే ఎక్కువగా కలిగి ఉంటాయి. దుఃఖానికి ఇవి మొదటి హేతువులు. ఈ అరిషడ్వర్గాల గురించి వివరంగా తెలుసుకుందాం. 

1.కామము – కామము అంటే కోరిక. ఇది కావాలి. అది కావాలి అని తాపత్రయ పడటం, అవసరాలకు మించిన కోరికలు కలిగి యుండడము.

2. క్రోధము – క్రోధము అంటే కోపము. ఇది కోరిన కోరికలు నెరవేరనందుకు చింతించుతూ, తన కోరికలు నెరవేరనందుకు ఇతరులే కారకులని వారిపై ప్రతీకారము తీర్చుకోవాలని ఉధ్రేకముతో నిర్ణయాలు తీసుకోవడము.

3. లోభము – లోభము అంటే కోరికతో తాను సంపాదించుకున్నది, పొందినది తనకే కావాలని పూచిక పుల్ల కూడా అందులోనుండి ఇతరులకు చెందగూడదని దానములు, ధర్మకార్యములు చేయకపోవడము.

4. మోహము - తాను కోరినది కచ్చితముగా తనకే కావాలని, ఇతరులు పొందకూడదని అతి వ్యామోహము కలిగి యుండడము, తాను కోరినది ఇతరులు పొందితే భరించలేకపోవడము.

5. మదము – మదము అంటే అహంకారం. ఇది తాను కోరిన కోరికలన్ని తీరుట వల్ల తన గొప్పతనమేనని గర్వించుతూ మరియెవ్వరికి ఈ బలము లేదని ఇతరులను లెక్కచేయక పోవడము.

6. మాత్సర్యము - తాను గలిగియున్న సంపదలు ఇతరులకు ఉండగూడదని తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని, ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదనే ఈర్ష్య కలిగి యుండడము.

అరిషడ్వర్గాలను అంటే ఏమిటో తెలుసుకున్నాము. వీటిని మనం అదుపులో ఉంచితేనే మనం అనుకున్న స్థాయికి చేరుతాము లేకపోతే వీటి బారిన పడి మనం పతనం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. వీటిని జయించాలి (లేక అదుపులో ఉంచడం) అంటే ముఖ్యమైన ఆయుధం భగవంతుని సత్యమైన దివ్యమైన జ్ఞానం మాత్రమే. ఆ దేవదేవుని జ్ఞానం ఎపుడు పొందుతామో (తెలుసుకుంటామో), అప్పుడు అరిషడ్వర్గాలు అన్నియు సమస్తము మన మనసు నుండి సర్వం నశించిపోతాయి

--((**))--



ఓం శ్రీ  రామ్ - శ్రీ మాత్రేనమా:
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ (27)  
వాక్కులు - అవాక్కులు చిన్న (కధ)
అత్తా ఒక్కింటి కోడలే (కధ)

కోడలపిల్లా ఏమి చేస్తున్నావ్
ఏమి అంత పెద్దగా పిలుస్తున్నా వినబడలేదా
నన్నేనా మీ రనేది
నీవు గాక ఇక్కడ మరెవరున్నారు 
నన్నైతే నాకో పేరు ఉంది ఆపేరు పెట్టి పిలవచ్చుగా
నీవు నాకోడలే కదా 
కాదని ఎవరన్నారో చెప్పండి
మరి పిలిస్తే పలకలేదే
మీసొమ్మెం బోయింది పేరు పెట్టి పిలిస్తే ,పిల్లా పిల్లా అంటే యెలా తెలుస్తుంది
ఏమీ నామాటకే వెటకారమా
లేదు మమకారంతో చెపుతున్నా
ఏది మమకారమో, ఏది అంగీకారమో తెలియని పిచ్చిపిల్లనా ఏంటి, అనుభవం ఉన్న మీ అత్తను
అత్తైతె,దుత్తైతే నాకేంటి నేనేమన్నా తప్పుచేస్తే ఒక కూతురుగా దగ్గర తీసుకొని ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి నేర్పించాలిగాని అరిస్తే ఏమన్నా ఫలితం ఉన్నదా
మాటకు మాట చెప్పటం నేర్చావ్ 
నాకేమన్నా అల్పాహారం పెట్టేదుందా లేదా
ఎందుకు లేదు ఉంది కాస్త ఉల్లిపాయలు తరగి ఇవ్వండి
ఎంచక్క ఉల్లి దోసె వేసిపెడతా
అసలే మాటలతో కళ్ళనీరు తెప్పిస్తున్నావు, దానికి తోడు ఉల్లిపాయలు తరగమంటున్నావు
సరే మీరేం తరగొద్దు అలా కూర్చోండి 
మోదట దోసె వేసి పెడతా
కాగని పెనంపై, ఉడకని దోసె వేసి నాకు పెడదామను కున్నావా
సరే మీ ఇష్టం నేను మా ఆయన తిన్నా క పెడతాము అన్నది కోడలు
చూడరా అబ్బాయ్ మీఆవిడ ఏమంటున్నదో విన్నావా
అంతా వింటూనే ఉన్నా 
మరి మాట్లాడవేమిరా
ఇద్దరాడోళ్ళ మధ్ద చేరిన మగవాని బతుకు మద్దేల దరువుకు ఎక్కువా బ్యాండ్ మేళాంకు తక్కువా ఆని ఎవరో అన్నారు
బలే మాటలు నేర్చావురా
ఎంతైనా నీకొడుకే కదమ్మా
పక్కనే ఉన్న కోడలు నవ్వుతుంది
అసలే అత్తగారు ఆకలితోఉంది, కాకిలాగా అరచి మిగతా కాకులేమన్నా వస్తాయేమోనన్నా చూస్తున్నది గుమ్మంవైపు
అత్తయ్యగారు దోశలు పెట్టాను తినండి
ఉల్లి పాయలు కూడా వేశావు చాలా సంతోషం  
కాస్త అల్లం మిర్చి కూడా వేసి ఇంకో దోస వేయమ్మా 
ఇంకా ఏదన్న వెయ్యాలంట ముందే చెప్పండి అత్తయ్యగారు  
మరిచాను కాస్త నేయి కారప్పొడి వేస్తా ఇంకా బాగుంటుంది   
అల్లం పచ్చడి వద్దా 
నన్ను ఇబ్బంది పెట్టకు కోడలి పిల్లా గబా గబా తిన లేకున్నాను, మీరు తిన్నారా తినక పొతే నాతో పాటు తినండి 
ఎందుకు లేండి మీరు తిన్నాకే తింటానులే  
ఏమో కోడలా నాకు కడుపు నిండింది అదేచేత్తో కాస్ట్ కాఫీ కలిపి ఇస్తే ఎంచక్కా త్రాగి మీ కడ్డంరాక ఆలా గుడిలోకి వెళ్లి భజన చేసి వస్తా 
అమ్మా నీవు భజన చేస్తావా లేదా అక్కడ ప్రసాదం కోసం పోతున్నావా    
ఏదోరా నీవు పొమ్మంటే పోతానురా లేదా ఇక్కడే ఉంటానులే
అత్తయ్యగారు ఇదిగో నండి పూజా సామగ్రి 
అప్పుడే వెళ్ళమంటావా మీ ఇష్టం అత్తయ్యగారు        
అమ్మ నేను గుడిదాకా దించుతానులే పోదాం పదా 
నేను పోతానులే దోస తినండి అసలే కొత్తగా పెళ్ళైనవారు మీ మధ్య నేనెందుకు 
--((**))--


ఓం శ్రీ  రామ్ - శ్రీ మాత్రేనమా:
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ (26)  
వాక్కులు - అవాక్కులు చిన్న (కధ)
వ్యసనం.! 

     కొందరికి ఖద్దరు వస్త్రాలు వేసుకోవడం అలవాటయితే, మరి కొందరికి నూలు వస్త్రాలు వేసుకోవడం అలవాటు. కొందరికి వేణ్ణీళ్ళ స్నానం అలవాటయితే మరికొందరికి చన్నీళ్ళ స్నానం అలవాటు. ఇలా ప్రతి ఒక్కరికి వాళ్ళవాళ్ళ సౌలభ్యానికి తగ్గట్టుగా అలవాట్లు ఏర్పడతాయి. ఈ అలవాట్ల వల్ల వాళ్లకు గాని, ఎదుటి వారికి గాని ఎటువంటి ప్రమాదమూ లేదు. కానీ ప్రమాదకరమైన కొన్ని దురలవాట్లు కూడా ఉన్నాయి. ఇవి క్రమంగా అలవాటు నుండి వ్యసనానికి దారితీసి మనిషి పతనానికి కారణ మవుతున్నాయి. 

ఒక అలవాటు నీకు ఇబ్బంది కలిగిస్తున్నా నువ్వు మానలేక పోతున్నా వంటే అది కచ్చితంగా వ్యసనమే. ఈ వ్యసనాల లో కూడా దుర్వ్యసనాలు, మంచి వ్యసనాలు అని రెండు విభాగాలున్నాయి. దుర్వ్యసనాలు ఆ వ్యసనాలున్న మనిషితో పాటూ వాళ్ళ కుటుంబాలకి చుట్టూ ఉన్న సమాజానికి కూడా హానికరమే. పొగత్రాగడం, మద్యపానం, మత్తు మందు సేవనం మొదలైనవి ఈ విభాగంలోకి వస్తాయి. మంచి పుస్తకాలు చదవడం, ప్రతి విషయాన్ని ప్రశ్నించడం, ధ్యానం చెయ్యడం మొదలైనవి మంచి వ్యసనాల క్రిందకి వస్తాయి. కాని ఇక్కడ నీవొక విషయం గ్రహించాలి. పైన చెప్పిన ఆరు వ్యసనాలు అలవాట్లుగా మొదలైనవే. ఈ ఒక్కసారే కదా, ఈ ఒక్కసారే కదా అనుకుంటూ మొదలై ఒక్కరోజు కూడా మానలేని స్థితికి వెళ్ళిపోతారు. 

… ఇక మంచి వ్యసనాల విషయానికి వద్దాం. చాలామంది రోజూ ఏదో ఒక పుస్తకం చదవకుండా ఉండలేరు. అది వారికో వ్యసనం. కానీ దానివల్ల వారికి విషయ పరిఙ్ఞానం పెరుగుతుంది, విషయ పరిఙ్ఞానం పాండిత్యాన్ని కలిగిస్తుంది. చారిత్రక సామాజిక పరిస్థితులపై అవగాహన కలిగిస్తుంది. మంచి పుస్తకాలు చదవడం వల్ల మనలో ఉన్న మూఢనమ్మకాలు, అపోహలు తగ్గుముఖం పడతాయి. 

స్వామి వివేకానందకు ఇలా ప్రతి విషయాన్ని ప్రశ్నించే అలవాటు వ్యసనంగా మారి ధ్యానమనే మరో వ్యసనాన్ని అలవాటు చేసింది. ఈ వ్యసనాలే అతన్ని భారతీయ మహాపురుషులలో ఒకడిగా చేసాయి. ఇప్పుడు ధ్యానం గురించి తెలుసుకుందాం. మీరు ధ్యానాన్ని వ్యసనంగా మార్చుకోగలిగితే దుర్వ్యసనాలన్నీ వాటంతటవే, మరే ప్రత్యేక ప్రయత్నమూ చేయక్కరలేకుండానే మీ నుండి దూరమైపోతాయి. నిశ్చల ధ్యానమంటే ప్రశాంతంగా మరే ఇతర ఆలోచనా లేకుండా నీతో నువ్వు గడపగలగడం. ధ్యానంలో పురోగతి సాధించిన వాడికి తనంటే ఏమిటో తనకి పూర్తిగా తెలుస్తుంది. తనేంచెయ్యాలో, ఏం చెయ్య కూడదో అనుభవం లోకొస్తుంది. తన మనసు మీద తనకి పూర్తి పట్టువస్తుంది. 

నిగ్రహశక్తి మనలో ఉననప్పుడు ఎటువంటి శక్తిలు మనలని  ఆవహించలేవు. అదికూడా ప్రకృతినిబట్టి కాలాన్ని బట్టి సహచరులను బట్టి నడుచుకున్నప్పుడే ఎక్కువ వయ తక్కువమాట్లడినప్పుడే సాధించగలరు.
    
… ఆశ్రమంలో ఉన్న మీ అందరికి ధ్యానాన్ని, పుస్తక పఠనాన్ని, ప్రశ్నాసమయాన్ని నిత్యకృత్యంగా ఏర్పరచడంలో ఉన్న ఆంతర్యమిదే. ఈ మూడింటిలోని ఆనందాన్ని అనుభవించడం తెలిసిన నాడు మీకిక గురువు అవసరం ఉండదు. మీకు మీరే గురువులు. నాయనలారా మీ సందేహాలు తీరినట్టేనా? అని గురువుగారు అడగంగానే శిష్యులంతా క్రొత్త విషయం తెలిసిందన్న ఆనందంతో ముక్త కఠంతో జవాబిచ్చారు. 
--((**))--



శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రేమతో - ప్రేమ లేఖ (3)



ఓం శ్రీ  రామ్ - శ్రీ మాత్రేనమా:
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ (25)  

వాక్కులు - అవాక్కులు చిన్న (కధ)


రాధా మన పెళ్లి కాకముందు జరిగిన సంఘటనను ఇదిగో మెసేజ్ గా నీకు గుర్తు చేస్తున్నాను, ఒక్కసారిగా ౩౦ సంవత్సరాలు వెనక్కి పోయి ఇప్పుడు వ్రాస్తున్నాను, నేను వ్రాసిన లేఖలో ఏదన్న మరచి పోయినా నీ లేఖలో నాకు తెలుప గలవు, మన ప్రమ లేఖలు మనల్ని ఇంతకాలం బ్రతికిస్తున్నాయి.మన తీపి జ్ఞాపకాలు మన పిల్లలు చదువుకొని నవ్వుకుంటారో మరి ఏమో నాకు మాత్రం తెలియదు . 

ఆనాడు నీకు గుర్తుందో లేదో నాకు బాగా గుర్తు ఉన్నది, నేను గుంటూరులో ఉన్నప్పుడు నీవు ,మాప్రక్క ఇంటిలో కొత్తగా అద్దెకు మీరు  వచ్చారు గుర్తున్నదా, అవును నీవు మరచి పోయి ఉంటావు ఆసంఘటన ఇప్పుడు మరలా గుర్తు చేస్తున్నందుకు ఏమి అనుకోకు.
అప్పుడు మీ అక్కకు పెళ్లి కుదిరింది అప్పటికి నీ వయసు 14 సంవత్సరములు చిన్న చిన్న లంగాలు వేసుకొని, కాళ్లకు పట్టాలు పెట్టుకొని, చెవులకు దిద్దులు పెట్టుకొని, లంగా పైకెత్తుకుని కోడె దూడ ఎగిరినట్లు ఎగురుతున్న విషయం నన్ను కవ్వించిన విషయం ఏనాటికి మరవలేను, ఆ పరుగులే నాలో ఎదో కలవరింతలు రేపినవి ఆనాడు .

 అప్పుడే నాదగ్గరకు వచ్చి మాధవ్ నాకు జామకాయ కోసి పెట్టవా అని అడిగావు, అంతే అంతే ఒక్క గంతులో హనుమంతునిలా ఎగిరి జామకాయ కోశాను గుర్తున్నదా, పెట్టు పెట్టు అన్నప్పుడు, అప్పుడే కాకి ఎంగిలి అని గుడ్డ అడ్డం పెట్టి కొరికి మరీ ఇచ్చాను, పెదాలు రుచి ఎంత బాగున్నది అన్నావు, అప్పుడే అనాలోచనముగా వెంటనే బుగ్గను ముద్దు పెట్టుకొని పరుగెత్తాను, అప్పడే భామ్మా అంటూ ఏడుస్తూ లోపలకు వెళ్లి ఎదో చెప్పావు, అప్పుడు ఏమి జరిగిందో నాకు తెలియదు నీకు గుర్తుందో వ్రాస్తే సంతోషిస్తాను.

బామ్మ అరుస్తున్నది పక్కింటి పిల్లగాడు ఖాళీగా ఉన్నాడేమో ఒక్కసారి పిలువు అని రాధను పురమాయించింది.
మాధవ్ మాధవ్ అంటూ గోడకు వెనుకాల నుండి మెల్లగా పిలిచావ్.తర్వాత గట్తిగా పిలిచావు.  
అప్పుడు నాలో వణుకు పుట్టింది, గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, చమట పట్టేసింది, ఎం చెప్పిందో రాధ, నాకు ఈరోజు ఎదో జరగ పోతుంది, ఎం జరిగినా రాధ కోసం వేచి ఉండాలి, రాధ పిలుస్తున్నది కనుక పోవాలి అని నెమ్మదిగా బామ్మ దగ్గరకు వచ్చాను.

ఏమిటిరా అలా దిక్కులు చూస్తావు అని ఘర్జించింది బామ్మ , అయోమయం పక్షిలాగున్నావు, ఏమిటి ఆ బిత్తర చూపులు, నిన్నెవరు కొరుక్కు తినటంలేదు, వేధించటం లేదు ఇక్కడ, చలికి వణికి నట్లు వణుకుతూ ఏమిటి అలా కార్చుకున్నావు,  పోయి డ్రస్సు మార్చుకొని రా అన్నాది బామ్మ అప్పటికి కానీ నేను ఏం చేసానో తలచుకొని చాలా సిగ్గు పడ్డాను, అక్కడ ఉండక వెంటనే వెనక్కు వచ్చా,

బామ్మ అరుపులు విన్న ఏమన్నదో తెలియదు, పనివారు లోపలకొచ్చి గుడ్డతో తుడిచినట్లు నేవే ఒకసారి చెప్పి బాల్య చేష్టలు అని చెప్పి నన్ను ఉడికించిన విషయం నాకు ఇంకా గుర్తు ఉన్నది, అదికూడా పెళ్లైన మొదటి రాత్రిలో గుర్తు చేసికొని మరి నవ్వుకున్నాము.

ఒకనాడు నీవే నాదగ్గరకొచ్చి చిల్లు గారే తింటావా అన్నావు, నాకొద్దులే అన్నాను, అప్పుడే వేలుకి గుచ్చుకొని నాదగ్గరకొచ్చి తిను మాధవా అంటూ వేలు అందించావు, అప్పుడే నీ వేలును కూడా కొరికాను,  అప్పడే నీకు పిచ్చి కోపము వచ్చి నన్ను నాలుగు ఉతికి మరీ ఏడుస్తూ పోయావు.

అప్పుడు బామ్మకు చెపుతావని అనుకున్నా, కానీ అట్లు చేయక గారెలు బూరెలు కవర్లో తెచ్చి నీవు తిను అంటూఇచ్చి  నీమీద నాకు కోపము లేదే అంటూ నవ్వుకుంటూ జడ తిప్పుకుంటూ వెళ్ళటం నాకు ఇంకా గుర్తు ఉన్నది.

నాకింకా గుర్తుంది రాధా, నీవు పుట్టినరోజు పండుగగా బుట్టఁగౌన్ వేసుకొని కేక్ కట్ చేస్తూ కొంత వంటిమీద పడేసు కొనగా మీ బామ్మా అక్షంతలు వేయగా తర్వాత గౌన్ కడుగు కొనుటకు బాత్ రూంలో చేరగా అక్కడ సబ్బుపై కాలుమోపి పెద్దగా కేకవేసి క్రింద పడ్డావు, అప్పుడే బామ్మ మాధవ్ నీవు వెళ్లి చూడు అన్నప్పుడు వెంటనే పరుగెత్తి బాత్ రూంలో చేరా నీ పరిస్థితిని నాకు భయం ఏర్పడినది అప్పుడే బామ్మను పిలిచా బామ్మ బాత్ రూమ్ లో రాధను చూసి ఓరై నీవు ఆటుపోరా నేను రాధను తెస్తాను అన్న మాటలు ఇంకాగుర్తు ఉన్నాయి. 

నీవు పుష్పావతి అయినట్లు గమనించి చీరకట్టించి పెద్ద బంతి ఏర్పాడు చేసి భోజనాలు ఏర్పాటు చేసి అందరిచేత దీవెనలు ఇప్పించి నన్ను మాత్రం ఆనాటి నుండి ఓర చూపులతో ఉడికించి, కొత్త అందాలతో ఎగసి పడుతున్న విషయాలు ఇంకా గుర్తుకు ఉన్నాయి. నీ మెసేజ్ కోసం ఎదురు చూస్తున్న ఇంకా వ్రాయాలని ఉంది, కానీ ఆనాటి అనుభవాలు నీవు వ్రాస్తావని నా వ్రాతలు ముగిస్తున్నాను.   

  --((**))--

                                     

ఓం శ్రీ  రామ్ - శ్రీ మాత్రేనమా:
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ (24)  
వాక్కులు - అవాక్కులు చిన్న (కధ)

హలో హలో బాగున్నారా రైటర్ గారు 
ఏమడుగుతున్నారూ నిక్షేపంలాగ ఉంటే
హలో హలో నవ్వుతున్నారా
నవ్వో ఏడుపో తెలియని దద్దమ్మలాగున్నావే లాయర్ గారు 
హలో హలో ఓటు ఏ పార్టీకి వేస్తున్నారు
టీపార్టీ ఇస్తావా సరే పోదాం పా
హలో హలో టీపార్టీకాదు, మీ ఓటు ఏగుర్తుకు వేద్దామనుకున్నవురా 
గుర్తు లేదా నేను చెప్పింది అర్ధం కాలేదా
హలో హలో అర్ధం కాలేదా మోగడా 
అర్ధం అంటే డబ్బు ఇస్తానంటే వద్దన్నానా
హలో హలో సైకల్, ఫాన్, హస్తం,కమలం,
ఏమిటిరా ఎలక్షన్ గుర్తులు చెపుతున్నివ్
ఏ గుర్తుకు ఓటు వేస్తావో చెప్పురా మోగుడా
నేనడిగిందే నాకు చెపుతావా ఏమిటి
సరే చివరిరోజు చెప్పు ఎవరి వేయమంటే వారికే వేస్తా ఓటు 
అబ్బా నీతో మాట్లాడే బదులు ఏదన్నా పనిచేసుకుంటే నాలుగు డబ్బులొస్తాయి
ఏంటి ఓటుకు నీకు డబ్బులిస్తున్నారా 
బాబ్బాబు మా కుల ఓట్లు, రాష్ట్రంలో లేని వారి ఓట్లు, ఇలా చాలారకాల ఓట్లు గుట్టు చప్పుడు కాకుండా ఉదయం మోదటే వేయిస్తా 
ఓటు కెంతిస్తావో చెప్పు 
ముందు టీత్రాగు తర్వాత ఎంతకావాలో అడుగు అప్పుడు ఇప్పిస్తా
ఏమి ఇప్పిస్తావురా అసలే నేను లంగోటా వేసుకోను, చూసివంటే పడిపోతావ్
చచ్చు జోకులు వేయకు, ఒక వేపు గడియారాలు పంచుతున్నారు, మరోవైపు డబ్బులు పంచుతారుట, ఇంకోవైపు తిరిగినంత పెట్రోలు పోస్తున్నారు. 

ఏమిటీ ఎవరిపైనన్నా పెట్రోలు పోసారా, చచ్చాడా బతికాడా, ఆడమోగ, పోలీసు కేసైనదా, అందులో నీవున్నావా ఏమిటి, సాక్షం మాత్రం చెప్పను, స్నేహం స్నేహమే, బతుకు బతికే అదితెలుసుకో 

నీవు రైటర్ అనిపిచ్చావురా
నువ్వేం తక్కువా న దగ్గర ఎనతో లాలనుకున్నావ్ గదా 
హలో హలో మరలా ఎప్పుడు కలుద్దాం చెప్పు 
ఏమిటి చెప్పుల షాపుకు వెల్దామంటావా 
ఓరినాయనో నీడతో మాట్లాడే వాన్నీ నిన్నే చూస్తున్నాను      
నీలాంటోడు ఎలక్షన్ లో నిలబడితే నవోటు నీకేరా 
ఏమిటీ
హలో హలో అంటూ నన్ను ముంచావురా  
ఎం ముంచాను నీ ని టైం కాస్త తిన్నాను అంతే 
అదిచాలదా 
సరికాని అలా కూరలు తీసుకొనివెల్ళదాం వస్తావా 
ఆ ఎందుకురాను ఏ కూరాలు తీసుకుంటావో చెప్పు 
వాటి మనుభవాలు నేను చెప్పుతా 
నీకు ఆ తెలివి కూడా ఉన్నదా
మరిచెప్పు 
*గోంగూరకి* 
ఆహం ఎక్కువ.. ఎందుకంటే తాను గుంటూరు వాసినని...
*పొట్లకాయకి*
 పొగరు ఎక్కువ.. ఎందుకంటే ఐదడుగులు ఎత్తు అని....
*చిక్కుడుకు* 
చికాకు ఎక్కువ.. ఎందుకంటే తనని గోరుతో గోకుతారని....
*కందకి*..
వెటకారం ఎక్కువ.. ఎందుకంటే తనకి లేని దురద కత్తిపీటకి వచ్చిందని....
*వంకాయకి* 
గర్వమెక్కువ .. కూరగాయలన్నింటికీ తనే రారాజునని....
*బెండకాయకి* 
ఆనందమెక్కువ.. తనను మగువల చేతివేళ్ళతో పోలుస్తారని....
*దొండకాయకి* 
ఆందోళనెక్కువ.. కాకి ఎక్కడ తనను ముక్కున పెట్టుకుంటదోనని....
*కాకరకాయకి* 
శాంతమెక్కువ.. ఎవరూ ఇష్టపడకపోయినా అందరికీ ఆరోగ్యానిస్తుందిగా....
*బంగాళాదుంపకి* 
సహనమెక్కువ.. కూరలకైనా,చిరుతిండ్లకైనా, పూరీకైనా,పానీపూరీకైనా అన్నీంటికీ తానే దిక్కు మరి....
*గుమ్మడికాయకి* 
 గాంభీర్యమెక్కువ.. కూరగాయలన్నీంటినీ కలిపినా కూడా తన బరువుకు తూగలేవుగా....
*ఉల్లిపాయకి*
 టెక్కు I ఎక్కున.. తానులేనిదే ఆ కూరగాయలకి రుచి ఎక్కడిదని....
*మిర్చికి* 
కోపమెక్కువ.. ముందు నోటినీ,తరువాత కడుపుని మండించేస్తుంది....
*కరివేపాకుకి* 
మిడిసిపాటు ఎక్కువ.. తాను కొంచెమైనా కూర సువాసనకి తానే దిక్కుఅని....
*బీరకాయకి* 
దిగులెక్కువ.. తనను ఎడాపెడా వాడేస్తారని,పీచుని కూడా వదలరని....
*కారెట్ కి బీట్ రూట్ కి* 
 హంగామా ఎక్కువ.. తమంతటి రంగు ఎవరికీ లేదని....
ఏమీ తినని వాడికి ..... బుర్ర తక్కువ 
అన్నీ తిన్న వాడికి ..... ఆయాసం ఎక్కువ 
అదికాదురా తినేవాడికి డబ్బు తక్కువా 
తినలేని వాడికి డబ్బు ఎక్కువా అవునా 

హలో హలో నేనా చెప్పేది నువ్వా చెప్పేది 

హలో హలో పిలిచినా పలకవేరా  
పిలిచావా నాకు వినబడలేదే 
ఆ ...  ఆ .... ఇవ్వండి ఈ వాక్కులు అవాక్కులు 
నవ్వుకున్నారా ఆయా..  ...   

--((**))--

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రేమతో - ప్రేమ లేఖ (2)
ఓం శ్రీ  రామ్ - శ్రీ మాత్రేనమా:
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ (23)  



ప్రాంజలి ప్రభ -వాక్కులు - అవాక్కులు (4)

నీ మెసేజ్ అందింది, నాలో కలవరం మొదలైనది, నీకు మెసేజ్ పంపాలని తాపత్రయం పెరిగింది, ల్యాబ్ టాప్ తీసాను, నాకు తెలిసిన విధముగా ప్రేమ లేఖను వ్రాస్తున్న, నీకు నచ్చుతుందని నేను ఆశిస్తా, నీ రూపు రేఖలు నా కాంతిలో చిక్కి ఉన్నాయి. నాప్రేమ నంతా రంగరించి, నిన్ను మరువ లేక, నేను ఉండలేక వ్రాస్తున్నాను, ఇదే నాకు కొంత మన:శాంతి.

పరిమళించే పరువపు రెమ్మవు, ఎమన్నా పట్టించుకోక తనువును అర్పించిన బొమ్మవు, రతిని మించిన రసరూపమ్ము చూపించి తన్మయ పరిచే అతిలోక దివ్య సుందరివి, పలుక నేర్చిన చిలుకవు, నడక నేర్చి, నాట్య మాడే, పలకరించి నాట్య మయూరివి, కనులతో కవ్వించి, పెదాలతో పలకరించి, నడకను వయ్యారంగా చూపించి, జడ తిప్పుతూ కదిలే వయ్యారివి.

నిన్ను అర్ధం చేసు కోవటానికి చాలదు నాజీవితం, త్రిగుణాల సమ్మేళనమే నీ గుణం, మొగవాడ్ని గుప్పెట్లో పెట్టుకొనే బ్రహ్మాస్త్రం ఉన్నదానివి, అలసి వచ్చిన వానికి సేద తీర్చే నీలో ఉంది కరుణాస్త్రం,  గాలిద్వారా మనసును ఆకర్షించి చిరు నవ్వును చూపి మనసును దోచే పవనాస్త్రం ఉన్నదానివి, ఎన్ని కష్టాల్లో ఉన్న మనసును రంగ రించి, మొహాన్ని పంచే సమ్మోహనాస్త్రం ఉన్నదానివి, అన్ని సమయములలో ఓర్పు వహించి ఓదార్పు చూపించే సహనాస్త్రం గలదానివి, ఇట్లా ఎన్నో అస్త్రాలు నీలో నిండి ఉన్నాయి. అందుకే నేను నిన్నుఅంటాను  సర్వాస్త్ర సుందరివి.

చీకట్లో కూడా కనిపించే తెల్లని మంచు తెరగల దేహంగా, తళ తళా మెరుస్తూ నిలకడగా ఉన్న నదిగా, వెచ్చని వేడి నందించి చల్లని మనసుకు హాయిగా , ఆహ్లదంగా, ఊరట కల్పించే దిశగా, నిశ్చలముగా, నిర్మలంగా, నిలకడగా స్వశ్చంగా సుఖాన్ని అందించే నా కలల సుందరివి.

అంటూ ప్రేమ లేఖను (మెసేజ్)  రాధకు వ్రాసాడు మాధవ్

ఆ మెసేజ్ చూసి రాధ మాధవ్ కు మెసేజ్ పెట్టింది.
నవమన్మధాకారా రూపంతో, ధ్రుడకాయముతో, ఆరడుగుల ఎత్తుతో తెల్లని పంచ లాల్చీ ధరించి, చేతులకు ఉంగరాలతో, మేడలో బంగారు గొలుసుతో నా మనసునుని దోచిన నటనాగ్రేసుడవు నీవు, నా ఊహలన్నీ నీమీదే
నీమాటలకు చిక్కి నీవు ఆడమన్నట్లుగా ఆడి, నీకు ఉల్లాసము కల్పించి ఉత్సాహము పెంచి, సమయాన్ని సద్వినియోగము గా శకలం అర్పించాను ఆనాడు, ఆతీపి గుర్తులే నాకు బంధువులు.

నన్ను అస్త్రాలతో పోల్చి మూలగచెట్టు ఎక్కించావు ఎందుకు, నేను ఎప్పుడు నీమాట జవదాట లేదు, నేనెప్పుడూ నీ నీడగా వెనకాలే ఉండేదాన్ని, ఒక చెట్టులాగా ఎదిగి చెట్టు చేసిన ఉపయోగాలన్నీ నేను నీకు చేసాను. కాలంతో మారకుండా నాకోసం వేచిఉన్నావని సంతోషముగా ఉన్నది. నిన్ను తలవని రోజు లేదు, నీకోసం ఎదురు చూడని రోజులేదు, నీవు చేసే సమాజ సేవకు నీ చేదోడుగా ఉండి సహాయము చేసిన రోజులు ఇంకా గుర్తు ఉన్నాయ్.

రాగాలన్నింటిలో అనురాగము గొప్పది, బంధాలన్నింటిలో అనుబంధం గొప్పది, స్వేశ్చవాయువుల్లో వెలుగుబాట గొప్పది, పున్నమి వెన్నెలలో పూల పరిమళాలు గొప్పవి, నువ్వు నువ్వుగా గుర్తింపు తెచ్చుకోవటం అన్నింటికన్నా గొప్పది. మగవానికి సహజంగా ఉండే అహంకారము లేకుండా ప్రేమను పంచే తత్వం నీలో ఉన్నందుకు నాకు చాలా సంతోషము మరియు నిత్యం ధరిత్రియందు నాకోసం ఎదురు చూపులతో ఉన్నందుకు నేనే నీకు సర్వం అర్పించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాను.

కార్యేషు దాసిగా, కరణేషు మంత్రిగా, భోజ్యేషు మాతగా, క్షమయా ధరిత్రిగా, కులధృమ పత్నిగా, మన కుటుంబానికి నేనొక ఆశాకిరణంగా నీకోసం వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉంటాను
నిమెసేజ్ కోసం ఎదురు చూస్తుంటాను మాధవా                  


  

శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
ప్రేమతో - ప్రేమ లేఖ (1)
ఓం శ్రీ  రామ్ - శ్రీ మాత్రేనమా:
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ (22)  

ప్రాంజలి ప్రభ -వాక్కులు - అవాక్కులు (3)


చూడు రాధ నిన్ను మరవలేకున్నాను, నీ జ్ఞాపకాలు నన్ను వెంట బడు తున్నాయి, మనం కలసిన రాత్రులు గుర్తుకు వస్తున్నాయి, నీ నవ్వును ఒక అక్షర మాలాగా వర్ణించాలని ఉన్నది, నీ నవ్వే చీకటిలో వెన్నెలను పంచె ఒక నక్షత్రం లాగా నాకు కనబడింది, నీ అమృత భాష్యం ఎంత మరవాలన్న మరువ లేకున్నా నంటే  అంత అద్భుత శ్రవణా నందముతో,  సత్య స్పూర్తితో, కరుణ రసముతో, కావ్య భావాలతో  వక్తపరిచి మనసును దోచిన, జ్ఞాపకాల వలయ సుందరివి నీవు.

తొలిసారి నిన్ను చూశా, నీ చిరునవ్వులో కలిశా, నీ సౌందర్యాన్ని ఆస్వాదించా, నీ కళ్ళల్లో నా నీడను చూశా, నీ పెదాల విరుపు చూశా, నా హృదయ స్పందన తెలియ పరిచా, నీ ఓర కంటిలో నిలిచా, నీ పెదాలలో తడిశా, నిన్ను నేను మరువ లేక నీపై పెంచుకున్నాను ఆశా

నాకు తెలుసు నీ కవ్వింత, నేను గమనించా నీ పులక రింత, వలపు చూపుతూ చూపించావు నాకు తుళ్లింత, నీ పులకరింత నాలో పెంచును తపనంత, నీకె పంచాలని నాలో పరుగును గిలిగింత, చెప్పాలని ఉన్నది నాకు ఇంకా కొంత, నీ సంతోషము కొరకు వేచి ఉంటాను జీవితమంతా

నీ పరిచయముతో పరవశించా, నిను దగ్గరగా పరికించా, నీకు కావలసినవన్నీ చేయించి  ఉంచా, జతగా అందించి తరించా, కలవరింత తొలగించి ఆనంద పరిచా, నీ విచ్చిన వింతను గ్రహించా, హమేషా నీకు తోడుగా నడిచా, నీ మనసును బట్టి ప్రవర్తించా, నా తనువును నీకె అర్పించా, నిను వదలి కొంత కాలం జీవించా, ఇక బ్రతుకంతా నీకోసం వేచి ఉండ దలిచా. 

ఓ మాధవా నీ ఉత్తరమునకు నా ప్రత్యుత్తరము నా హృదయాంతరములో ఉన్న భావాలను ఒక్కసారి నీకోసం వక్త పరుస్తున్నాను, నీవు చదివి నీ ప్రేరణలను నాకు తెలియ పరుచు                                            

నీవు నామనసులో నిలిచిన ఒక గిరి, అదే నాకు నిరంతరము కల్పిస్తుంది సిరి, అందుకే నీవంటే నాకు ఎప్పుడు గురి, నీకోసం నేను వేచి ఉంటా తప్పని సరి, నీవు నామనసులో నిలిచి పోయిన పోకిరి, గుర్తుకొస్తున్నది నీవు చేసిన అల్లరి, నీతో వేగ లేక ఎప్పుడూ అంటాను సరి సరి,  అందుకే నీతో కలిసే దాకా ఉంటుంది నా ఊపిరి.

నా కల్లల్లో ఎప్పుడు ఉంటుంది నీ ఆకృతి, అదే నేర్పింది నాకు సంస్కృతి, అది ఒక కృతి, అందుకే నాకు నిత్య సంక్రాంతి, నీ తలపుల వల్లే నాకు నిర్మల  ప్రకృతి, అందుకే నన్ను బ్రతికిస్తుంది కొత్త అనుభూతి.

నా కళ్ళలో నిలిచి పోయినది మెరుపు, నాకు గుర్తు తెస్తుంది తొలివలపు, అదే మన ఇద్దరి మధ్య నిలిచిన మలుపు, ఇది ఓటమి కాదు మన ఇద్దరి గెలుపు, కాలమే మన మధ్య చూపుతున్న మేలుకొలుపు  

సరసం మనల్ని త్తేజ పరిచింది, విరహం మనల్ని ఏకం చేసింది, ఆశయాల మార్గంలో నడిపించింది, మధుర క్షణాల సాఫల్యం ఫలించింది, మధురాతి మధురం మన మధ్య దాపత్య సుఖం.  దాన్నే గుర్తు చేస్తూ మనమధ్య ఎడబాటు ఉన్న ప్రేమలేఖలు మనల్ని బ్రతికిస్తుంది. 
అంటూ ముగించింది రాధ మాధవకు ప్రేమలేఖ.   


 --((**))--

ఓం శ్రీ  రామ్ - శ్రీ మాత్రేనమా:
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ (21)  
ప్రాంజలి ప్రభ -వాక్కులు - అవాక్కులు (3)

జానకి రాముడు ఒకరికొకరు ప్రేమించుకున్నారు వారి ప్రేమ పెళ్లిగా మారాలని దేవునికి మొక్కుకోవాలని ఆంజనేయస్వామి  దేవాలయానికి వచ్చారు . 

పూజారి ఈ విధముగా చెప్పాడు, మీ పేరు,  గోత్రం చెప్పండి

పూజారిగారు పూజ చెయ్యండి అని రాముడు తెలియపరిచాడు.   

దేముడు మీకు పెద్ద జీతం ఇవ్వలేకపోవచ్చు। 

కానీ ప్రస్తుతం నీకున్న జీతాన్ని బట్టి।

మంచి భవిషత్ చూపించాడు !

కాబట్టి।

మీరు వెళ్ళేటప్పుడు హారతి హద్దుకొని వెల్లండి !

శిష్యుడు : ఎందుకు రోజు అలా చెపుతారు అందరితో 

హారతి లాంటి జీవితమ్ మనది, జేబులో పైసా 

ప్రక్కన పెడితో కొంత ఖర్చవతుంది కదా 

దానం చేయటం మొదలౌతుందా గురువుగారు 

అది వారి సంతోషం - మన భాగ్యం     


ఇదిగోనమ్మా ప్రసాదం తీసుకోండి అని పెట్టాడు పూజారి  

జానకిని ఇంటిదగ్గర దించి ఆఫీసుకు వెళ్ళాడు। 

అప్పుడే ఫోన్ వచ్చింది రాముకు 

జానకి : హలో రాము ఎలా వున్నావ్? 

రాము : హాయ్ హాయ్ గా ఉన్నాను 

జానకి : హలో లైన్ లో వున్నావా ? 

రాము : వున్నాను। వున్నాను।వినబడుటలేదా  

జానకి : అంతె లే నేనంటే నీకు లెక్క లేదు ?? 

రాము : అబ్బెబ్బే అలాంటిది ఏమీ కాదు, డార్లింగ్!! 

జానకి : హలో। సరే ఇక నిన్ను ఎప్పుడూ డిస్టర్బ్ చెయ్యను ? 

రాము : అలా అంటె ఎలా డార్లింగ్?  

జానకి : ఇక నుండి నీ మొహం నాకు చూపించకు ? 

రాము : ఎందుకు

జానకి : నాకు పెళ్లి కుదిరింది నీకు టాటా టాటా 

రాము : ఛీ ఎప్పుడూ ఇంతే అని ఫోన్ ఒక మూలకి విసిరేశాడు

జానకి : ప్రేమించానన్నావు పెళ్లంటే వద్దన్నావ్ నీదేం ప్రేమ 

           ఇలా నేలకు కొట్టడమా అంటూ సెల్ మోగింది ।

రాము : ఛీ ।  దీనికి కూడా లోకువయ్యాను 

            అంటూ సెల్ తొక్కాడు 


ఆఫీసులో ప్రేమిసున్న రంగవల్లి రాము దగ్గరకొచ్చింది   

 "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అన్నాది  

మన ప్రేమ ఒకటవ్వాలి అని రాముతో కలసి షాపుకు బయలుదేరారు  

"నా చెప్పు సైజు తెలుసా?" అని అడిగింది " రంగ వల్లి" 

"ఎందుకు తెలియదు నాది నీది ఒక్కటే కదా " 

అయితే పదా షాప్ కెళ్ళి చెప్పులు కొనుక్కొని, ఎంచక్కా, సినిమాచూసి

ఆ ప్రక్కనే ఉన్న 5  స్టార్ హోటల్ ల్లో భోజనం చేసి వద్దాం 

నీ ప్రేమలో ఎంత బలం ఉందో చూస్తాను     

ఇంకా రెండు నిమిషాలు కాలేదు  । 

।ప్రేమిస్తున్నాను అని చెప్పి।అప్పుడె । షేవింగా । షాపింగా??" 

అన్నాడు బెదిరిపొతూ ""రాము "

అప్పుడే బెదిరిపోతే ఎట్లా ప్రేమలో ఇంకా ఎన్నో 

తట్టుకోవాలి నీవు, ఇది ఓన్లీ శాంపిల్ 

శాంపిల్  శాంపిల్  శాంపిల్  అంటూ నవ్వుకుంటూ 

నీతో పెళ్ళైతే తప్పదుగా వస్తా ।

రంగ వల్లిది ప్రేమ,  జానకిది ప్రేమ  అని తెలుసుకోలేక తికమక పడుతున్నాడు రాము  

ఏమిటిరా రాము అలా ఉన్నావు రెండు మూడురోజులనుంచి చూస్తున్నాను ఎదో ఆలోచిస్తున్నావు, ఏవో మాటలు మాట్లాడుతున్నావు, ఏమై0దిరా అని అడిగింది తల్లి 

ఏమి మాట్లాడకుండా పడుకున్నాడు, ఎరా నీ సెళ్ళు  ఏదిరా పోయ్యిందమ్మా 

అని ఊరుకుంటావేమిటిరా

ఇదిగో నాఫోన్ తీసుకో ఇప్పుడే పోయి నీ నెంబరుతో సిమ్ తీసుకునీ ఇందులో వేసుకొని వాడుకో అన్న పిలుపు లేచాడు రాము 
   
చూడు ప్రేమ పుట్టిన దోమ కుట్టిన వెంటనే విరుగుడు మందు వెయ్యాలి వెయ్యక పొతే దేహాన్ని తినేస్తుంది అందువల్ల నీ బుర్ర పనిచేయదు, ప్రక్క వారి బుర్ర పనిచేయ్యనియ్యదు .       

ఇంతకు ముందే అత్తయ్యగారు అంటూ ఒక అమ్మాయి  వచ్చి ఎదో పేరు చెప్పిందిరా గుర్తుకు రావటం లేదు 

ఆ గుర్తుకు వచ్చింది రంగ వల్లి టా నిన్ను ఘాడంగా ప్రేమిస్తున్నది టా 

అమ్మ నన్ను క్షమించు నేను జానకిని తప్పవేరేవ్వరిని ప్రేమించలేదు. 

అది సూర్పనఖ లాంటిది నన్ను వెంబడి పడుతుంటే ఆలా షాపింగ్కు కు వెళ్లాం అంతే, పోనీ ఇప్పుడు ప్రేమించు 

నేను జానకినితప్ప వేరొకరిని ప్రేమించను, ప్రేమించలేను.  

మరి అమ్మాయినే పెళ్లిచేసుకో 

ఎం మన మతం కాదా, మన కులం కాదా ఏమన్నా సమస్యలుంటే నాకు చెప్పరా నాకు చాతనైనంతవరకు నీకు సహాయపడతా

ఆ అమ్మాయికి పెళ్ళి కుదిరింది, రేపే పెళ్లి జరుగుతున్నదిటా   

బాబు నేను ఒక్కటే చెపుతున్న ప్రేమ బలంగా ఉన్నప్పుడు ప్రేమికులు కల్సుకొనేదే ప్రేమ 

నేను చెపుతున్న నీవు ప్రేమించిన అమ్మాయిని ఎట్లా తెస్తావో నాకు తెలియదు ఆ అమ్మాయిని లేపుకురా నేను గుళ్లో పెళ్లి చేస్తాను 

మా అమ్మ చాలా మంచింది 

ఇప్పుడే తెస్తాను అంటూ బయఁటకు నడిచాడు 

అరే బాబు లేడికి లేచిందే ప్రయాణము లా తొందరెందుకు అమ్మాయి తరఫున ఎంత బలగమున్నది ఎన్ని కష్టాలు పడాలో తెలుకున్నావా

నాకు ఏమి కనబడుట లేదమ్మా నా జానకి మొగాడిలా వచ్చి నన్ను తీసుకొనే వెళ్లి పెళ్ళి చేసుకోమని పిలుస్తున్నది అమ్మా 

నీప్రేమ అంత గట్టి దయతే మరి ఎందుకుపెళ్లి చేసుకుంటుందిరా       

అదేనమ్మా నాకు అర్ధం కావటం లేదు 

వెళ్ళొస్తానమ్మా వస్తే జానకీతోనే 

బాబు ఒక్క సారి  ఇటు చూడరా 

లేదమ్మా నన్ను ఆపకు నన్ను ఆశీర్వదించమ్మా అంటూ  వంగి నమస్కరించాడు 

వెనుదిరిగాడు 

బాబు ఇటు చూడరా 

అమ్మ ఆగను  వెళుతున్న 

ఇటు చూడరా 

గుమ్మందాకా వెళ్ళాడు  

ఏమండి ఏమండి అని చిన్న గొంతు వినబడింది 

బయటకు పోవటం ఆగాడు 

నేను మీ జానకిని 

ఆ అంటూ వెనక్కి తిరిగాడు 

జానకి జానకి రాము రాము అంటూ సినిమా ఫక్కీలో కౌగలించుకున్నారు తల్లి నవ్వుకొని ఇంటిలోపలికి వెళ్ళింది 

వాక్కులు అవాక్కులతో మారుమ్రోగి ఏకమయ్యారు  జానకీరాముడు 

ఇదండీ ఈ నాటి కధ।  

--((**))--

ఓం శ్రీరామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్రభ -వాక్కులు - అవాక్కులు (4)
చందమామ కధ.!-22

విక్రమాదిత్యుడు మరోసారి భేతాళుడున్న శవాన్ని బంధించాడు. దాన్ని భుజాన పెట్టుకుని మౌనంగా బృహదారుణ్యం కేసి నడవసాగాడు. భేతాళుడు పదిహేనవ కథ ప్రారంభించాడు.

 “ఓ విక్రమాదిత్య మహారాజా! నీ పట్టుదల అనితర సాధ్యమైనది. నేనో కథ చెబుతాను. మార్గాయాసం మరిచి విను” అంటూ కథ కొనసాగించాడు.

 ఒకానొకప్పుడు బ్రహ్మపురమనే బ్రాహ్మణ అగ్రహారం ఉండేది. అందులో విష్ణు స్వామి అనే బ్రాహ్మణుడుండే వాడు. అతడికి సంతతి లేదు. అందుచేత అతడెంతో దిగులు పడ్డాడు. ఎన్నో నోములూ, పూజలూ చేసాడు. చివరికి మహాశివుడి గురించి తీవ్ర తపమాచరించాడు. శివుడి దయతో, కొంత కాలానికి అతడికి సంతాన భాగ్యం కలిగింది. వరుసగా నలుగురు పుత్రులుదయించారు.

అతడువారినెంతో అల్లారుముద్దుగా పెంచి, తనకు తెలిసిన విద్యలన్నీ నేర్పాడు. మరిన్ని విద్యలు నేర్పాలన్న అభిలాషతో, కుమారులు నలుగురూ దేశాటనం బయలు దేరారు. అలా నానా దేశాలూ తిరుగుతూ, చివరికి ఓ యోగిని ఆశ్రయించారు. ఆ యోగి సకల విద్యా పారంగతుడు. మంత్ర తంత్ర విద్యలని సైతం ఎఱిగిన వాడు. బ్రాహ్మణ కుమారులు. అతణ్ణి శ్రద్ధా భక్తులతో సేవించారు.

 వారి శుశ్రూషలకు మెచ్చిన యోగి, వారికి వారి అభిరుచుని బట్టి మంత్ర తంత్ర విద్యలు నేర్పాడు. తర్కమీమాంసాలు మీద గానీ, వేద విద్య మీద గానీ, వారికి ఆసక్తి లేకపోయింది. దాంతో మృత సంజీవని సహా ఎన్నో అపూర్వమైన మంత్ర విద్యలు గురువు దగ్గర నేర్చుకున్నారు. ఓ శుభ దినాన, యోగి వాళ్ళ నలుగురికీ ‘విద్యాభ్యాసం పూర్తయ్యిందనీ ఇక ఇళ్ళకి వెళ్ళవచ్చనీ’ ఆనతిచ్చాడు.

కుర్రాళ్ళు నలుగురూ ఎంతో ఆనందంతో గురువుకి నమస్కరించి, స్వగ్రామానికి పయన మయ్యారు. దారిలో నదీ నదాలు, కొండలూ లోయలూ, అరణ్యాలూ జనపదాలూ దాటుతూ, తమ విద్యా ప్రదర్శనతో ప్రజలని అబ్బుర పరుస్తూ ప్రయాణించసాగారు. మార్గమధ్యంలో వారొక అడవిలో నుండి ప్రయాణించాల్సి వచ్చింది. అప్పటికే తమ విద్యా ప్రదర్శనలకి ప్రజలు పలికిన జేజేలతో వాళ్ళల్లో అహం తలకెక్కి ఉంది. స్కోత్కర్షతో భుజాలు పొంగి ఉన్నాయి.

 ఆత్మస్తుతి శృతి మించింది. తమని తామే ప్రశంసించుకుంటూ ప్రయాణిస్తున్నారు. అంతలో, బాట ప్రక్కనే ఓ పులి చచ్చిపడి ఉంది. శరీరం కుళ్ళి కంపు కూడా మాసిపోయింది. చీమలు తినగా శిధిలమై, మిగిలిన శరీరావశేషాలున్నాయి. నలుగురు అన్నదమ్ములూ దాన్ని చూశారు. తలకెక్కిన అహంకారానికి ఇంగిత జ్ఞానం అడుగంటింది. చచ్చిన పులిని బ్రతికించి, కుక్కలా తమ వెంట బెట్టుకు వెళ్ళితే, జనం భయంతో, ఆశ్చర్యంతో మూర్ఛబోతారనిపించింది. ఆ ఊహే వాళ్ళకి మత్తు గొల్పింది.

 మొదటి వాడు మంత్రాలు జపిస్తూ పులి కళేబరంలో మిగిలిన ఎముకలు పోగు చేసి నీటిని మంత్రించి చల్లాడు. వెంటనే పులి అస్థిపంజరం తయారయ్యింది. రెండవ వాడు మంత్రం జపిస్తూ, దానికి రక్తమాంసాలు ప్రసాదించాడు. మూడవ వాడు మంత్రాలు జపించి దానికి చర్మమూ, గుండె వంటి ముఖ్యమైన అవయవాలనూ సృష్టించాడు. నాలుగవ వాడు మంత్రం జపించి దానికి ప్రాణం పోసాడు. అప్పటికే మిగిలిన ముగ్గురూ చప్పట్లు చరుస్తూ పులి ప్రాణం పోసుకోవడానికి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నాలుగవ వాడి మంత్రోచ్ఛాటనతో పునర్జీవించిన పులి, తనకు ప్రాణదాతలైన తమ ఎదురుగా, వినయంగా నిలబడుతుందన్న ఊహతో, వొళ్ళు తెలియకుండా నిలబడి ఉన్న నలుగురినీ చూచి, పులి ఒక్కమారుగా గాండ్రించింది.

 ఆకలితో నకనకలాడుతున్న పులి కంటికి నిండుగా ఆహారం కనబడింది. అది తమపై దాడి చేస్తోందన్న విషయం నలుగురు అన్నదమ్ములకీ అర్ధమయ్యేలోపునే, పులి నలుగురినీ చీల్చి పారేసింది. కడుపు నిండా తిన్నంత తిని, దాని దారిన అదిపోయింది. ఇదీ కథ! ఓ విక్రమార్క మహారాజా! నలుగురు బ్రాహ్మణ యువకులూ మృత్యువాత పడిన ఈ సంఘటనలో, ఈ బ్రహ్మహత్యా పాపం ఎవరికి చెందుతుంది?” అని అడిగాడు.



 విక్రమాదిత్యుడు గొంతు సవరించుకుని “భేతాళుడా! నలుగురూ… విద్యాగర్వంతో, వినయాన్ని మరిచి విర్రవీగారు. అయితే మొదటి ముగ్గురి కారణంగా పులి శరీరాన్ని పొందిందే గానీ, చైతన్యాన్ని పొందలేదు. కాబట్టి ప్రాణహాని దాకా పరిస్థితి రాలేదు. కనీసం చివరి వాడన్నా మంత్రప్రయోగం చేయటం ఆపి ఉంటే నలుగురు బ్రాహ్మణ యువకులూ బ్రతికి ఉండేవాళ్ళు. కాబట్టి మొదటి ముగ్గురి మృతి కారణంగా బ్రహ్మహత్యా దోషమూ, చివరి వాడి ఆత్మహత్యా పాపమూ కూడా, నాలుగో సోదరుడికే చెందుతాయి” అన్నాడు. మరోసారి మౌనం భంగమైంది. భేతాళుడు అదృశ్యుడయ్యాడు.

--((**))--


ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:



ఓం శ్రీరామ్ - శ్రీ మాత్రేనమ:

ప్రాంజలి ప్రభ కధ (23)  -వాక్కులు - అవాక్కులు (5)
rachayata : Mallapragada Ramakrishna  

రాధ యేప్పుడు పని పని అంటూ అలా చేస్తూనే ఉన్నావు, కాస్త తీరిక చేసుకొని నాతొ మాట్లాడవచ్చు కదా, నేను ఏదన్న పుస్తకము చదువుతున్నాననుకో అప్పుడే వచ్చి ఎప్పుడూ పుస్తకాల చదవటం తప్ప పెళ్ళాం ఒకటున్నది దాన్ని మంచి చెడ్డ చూడాలని ఒక ఆలోచన మీకు రాదు, మీరు మొగవారండి మీసం తిప్పుతూ ఎదో పెద్ద ఘనకార్యము చేసినట్లు ఒక ఫోజు ఇస్తూ ఉంటారు అంటావు నీవు, అన్నాడు మాధవ్, మీరు ఏమైనా అనుకోండి నాకు ఇప్పుడు  మూడు లేదు అన్నాది. మొగవాడికి మూడొచ్చి నప్పుడు ఆడదానికి సుఖము ఎక్కువ పంచవచ్చునట అన్నాడు ఒక కవి, అబ్బో మీకోరికల కోసం ఎన్నో కధలు చెపుతారు, ఇదుగో చూడు నామాటలు కొంచం అర్ధం చేసుకో అంటూ పాత పాడటం మొదలు పెట్టాడు మాధవ్     

ఆనందం సొంతము అయితే , అనురాగం ఆకలి చూస్తే ,  అనురాగపు తంచులు చూస్తాం  ఆనందపు లోతులు తీస్తాం. 

నీ కంకణ నిక్వాణంలో, నా జీవన నిర్వాణంలో , నీ మదిలో డోలలు తూగీ,  నా హృదిలో జ్వాలలు రేగీ, నీ తలపున రేకులు పూస్తే,  నా వలపున బాకులు దూస్తే, నూతన తేజానికి  ప్రాణం పోస్తాం, స్వర్గానికి నిచ్చెన వేస్తాం

నానికి రాణివి నీవై, వ్యసనానికి బానిస నేనై,  వాసంత సమీరం నీవై,  హేమంత తుషారం నేనై 
నీ ఎగిరిన జీవవిహంగం, నా జత హృదయ తరంగం,  

చిగురించిన తోటలలోనో,  వికసించిన పువ్వులలోనే, అమృత వలయములు జనించినప్పుడు, విలయములై జ్వలించి నప్పుడు,  కాలానికి నమస్కారం చేద్దాం, ప్రేమకు గొళ్ళెం తీద్దాం, ఆనందపు అంచులు చూద్దాం, భవిషత్తుకు పునాది వేద్దాం, నవ వసంత మార్గంలో యవ్వన సమరంలో పోరాడి గెలుద్దాం, స్వర్గ సుఖాలు అనుభవిద్దాం అని పాట పాడాడు మాధవ్ 

ఆనందం సొంతము అయితే , అనురాగం ఆకలి ,  అనురాగపు తంచులు చూస్తాం  ఆనందపు లోతులు చూ స్తాం. నవ వసంతపు నిర్మాణానికి పునాది వేద్దాం 


చూడండి మీరు రచయితలని నాకు తెలుసు, నీ పాటకు లొంగే మనస్తత్వ నాది కాదు అయినా వేళాపాళా ఉండదా, అయినా మీ మొగవారు ఎలా ఉంటారో నేను చెపుతా వినండి అంటూ ఒక పాట గా చెపుతాను. ఆ ... ఆ .. చెప్పు
ఆమ్మో నీకు కవిత్వం వస్తున్నదా
ఎంతైనా మీ భార్యను కదండీ, మీలో సగ భాగం నేను, మీ నాలుకపై నేనే ఉన్నాను, మీ  హృదయంలో ఉన్నాను, నన్ను వదలి మీరెక్కడకు పోలేరు, అయినా మీకు నేను ఎప్పుడో  సొంతం అయినాను, మీకు సుఖం అందించటమే నా జీవన మాధుర్యం అయినా వినండి

నన్ను మృదువుగా నిమురుతూవు నీవు, దగ్గరగా తీసుకున్నపుడు నీలో నాప్రేమను చూసా నంటావు
 
పుట్టిన నాటినుండి నీ ప్రేమకోసం నీ చుట్టు తిరిగానని అంటావు,  నీవే ప్రాణమని నీవు లేకపోతే బ్రతకలేనని అంటావు, కొద్ది ఆలస్యమైతే చాలు ఎక్కడ లేని కోపం ప్రవర్తిస్తావు, దగ్గర వచ్చేదాకా చిన్న పిల్లడు గొడవ చేసినట్లు గొడవ చేస్తావు.

అధికంగా తినటం  అజీర్తి యంటూ, శ్రద్ధగా దగ్గరగా వచ్చి తినిపిస్తావు,  నీవు భారం కాదని నీవు నమ్మ పలుకుతావు,   ఈమాట అంటే ఆమాట, ఆమాట అంటే ఈమాట వాదిస్తావు,  ఏపని అంటే ఆపని క్షణంలో చేస్తానంటావు, పూలు, సువాసన ద్రవ్యాలు  పూటపూటా దెచ్చి, ఉత్తేజ పరుస్తావు 


కన్న బిడ్డ కన్నా ఎక్కవ ప్రేమను నా మీద చూపిస్తావు, మానవతను చూపి అనురాగము ఆత్మీయం ఆనందము పంచుతావు, నామీద ప్రేమా నమ్మకము చూపుతావు. 


నీలో ఉన్న దానవుడ్ని కట్టేసి మానవున్నే నాకు చూపుతావు, అధర్మమంపై రెచ్చి పోతావు,     

నా విశ్వాసం నీవు కొల్ల గొడతావు, నానోటి ఈమాట రాకుండా ముద్దులతో ముంచేస్తావు, నా మీద ఉంచుకున్న ప్రేమను కెరటం లా కప్పేసి చల్ల పడతావు, కొన్ని సార్లు నటనలుకు నేను తప్పక లొంగి  పోతాను, తర్వాత తెలిసిన ఇది పెద్ద తప్పు కాదులే అని సర్దుకొని పోమంటావు, మౌనం వీడి  బ్రతుకు వేదంలో మనం పావులవుదా మంటావు.

అంటూ కిల కిలా నవ్వు కుంటూ ముందు స్నానము చేద్దాం పందండి, ఆతర్వాత భోజనం ఆతర్వాత మీ సొంతం అనగానే 

మాధవ్ రాధ దగ్గరకు చేరి గట్టిగా కౌగలించుకొని ఇది అడ్వాంస్ తర్వాత ఫుల్ అన్నాడు
అప్పుడే రాధ నవ్వుకుంటూ నోటితో ద్రాక్ష పళ్ళు అందిస్తూ ..................
              

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి