ప్రాంజలి ప్ద్రభ -తత్వసారము
రచయిత మల్లాప్రగడ రామకృష్ణ
శాస్త్రలలో ఉన్న ధర్మాలను తెలుసుకోరన్నా
వినిన వాక్యము ఎల్లవేళల స్మరణ చేయురోరన్నా
యోగాహ్యాసంతో ధ్యానాన్ని నిష్ఠగా చేయురోరన్నా
విశ్లేషించుట, వివేకించుడట, ఎప్పటికి వదలొద్దన్నా
సహనము, శాంతము, కష సుఖములు నేర్చుకోరన్నా
ద్వందములన్నియు ధర్మ బుద్ధితో నేర్చుకోరన్నా
పొగడినప్పుడు పొంగిపోక, తిట్టినప్పుడు క్రుంగిపోకన్నా
ఎట్టి స్థితిలో దృష్టి సమముగా ఉంచాలన్నా
అన్నసుద్ధి నిత్యము అవసరమన్నా
జీవితంబున అన్న దోషము లేక ఉండన్నా
సాత్వికాహారం తిని ధర్మబోధ చేయురన్నా
భోజనంతో చిత్త మంతయు శుధ్ధి పడురన్నా
--((**))--
శిష్యుడుగా సత్యపదమున పయనించి
లోకమున మంచిని పంచ వలయు
పంచినదే ప్రేమాను రాగమున పయనించి
లోకమున నోరూర నాట వలయు
పంచినదే ప్రేమాను రాగమున పయనించి
లోకమున నోరూర నాట వలయు
నాటినదే సాటి మానవజాతి ఊపిరిగా సాగి
లోకమున సంక్షోభాలను తొలగించవలయు
తొలగించినదే ప్రజా సంక్షేమములుగా మారి
లోకమున ప్రతి ఒక్కరి జీవితముగా సాగవలయు
తొలగించినదే ప్రజా సంక్షేమములుగా మారి
లోకమున ప్రతి ఒక్కరి జీవితముగా సాగవలయు
సాగినదే సకల మతమ్ముల సారమొకటి యే అని
లోకమున దయార్ద్ర హృదయముతో చాటవలయు
ప్రతి ఒక్కరు ఆశయ సిద్ధికొరకు బ్రతక వలయునని
లోకమున ధర్మంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయవలయు
--((**))--
ప్రతి ఒక్కరు ఆశయ సిద్ధికొరకు బ్రతక వలయునని
లోకమున ధర్మంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయవలయు
--((**))--
.
మరో సమావేశంలో ఎవరో భగవద్గీత పుస్తకంపై మరేవో మత గ్రంథాలు పేర్చి స్వామి దగ్గరకు వచ్చి ” చూశారా ఇదీ భగవద్గీత స్థాయి” అన్నారు. స్వామి భగవద్గీత పుస్తకాన్ని ఒక్కసారిగా పక్కకు లాగడంతో మిగతా పుస్తకాలన్నీ కిందపడిపోయాయి. అప్పుడు స్వామి “చూశారా అన్నింటికీ ఇదే ఆధారం” అన్నాడు.
.
ఇంకో సమావేశంలో వివేకానంద మాట్లాడుతుండగా ఎవరో ఒక కాగితం పై “FOOL” అని రాసి ఆయన చేతికిచ్చారు. స్వామీజీ దాన్ని చూసి నెమ్మదిగా నవ్వుకుని అందరితో “మామూలుగా మనం ఏదైనా లేఖ రాసి చివర్న సంతకం పెట్టడం మరిచిపోతుంటాం. కానీ ఇక్కడ చూడండి. సంతకం పెట్టి లేఖ రాయడం మరిచిపోయాడు పాపం” అన్నాడు
మరో సమావేశంలో ఎవరో భగవద్గీత పుస్తకంపై మరేవో మత గ్రంథాలు పేర్చి స్వామి దగ్గరకు వచ్చి ” చూశారా ఇదీ భగవద్గీత స్థాయి” అన్నారు. స్వామి భగవద్గీత పుస్తకాన్ని ఒక్కసారిగా పక్కకు లాగడంతో మిగతా పుస్తకాలన్నీ కిందపడిపోయాయి. అప్పుడు స్వామి “చూశారా అన్నింటికీ ఇదే ఆధారం” అన్నాడు.
.
ఇంకో సమావేశంలో వివేకానంద మాట్లాడుతుండగా ఎవరో ఒక కాగితం పై “FOOL” అని రాసి ఆయన చేతికిచ్చారు. స్వామీజీ దాన్ని చూసి నెమ్మదిగా నవ్వుకుని అందరితో “మామూలుగా మనం ఏదైనా లేఖ రాసి చివర్న సంతకం పెట్టడం మరిచిపోతుంటాం. కానీ ఇక్కడ చూడండి. సంతకం పెట్టి లేఖ రాయడం మరిచిపోయాడు పాపం” అన్నాడు
ప్రాంజలి ప్రభ - (నేటి కధ -15 )
మల్లాప్రగడ రామకృష్ణ
హల్లొ హల్లో బాగున్నారా
నేను మీకు ఎలా గుర్తు వివరించగలరా
ఎమిటోయ్ నన్ను మరిచిపోతే యెట్లా
నామాటను బట్టి వెంటనే గుర్తుకు రావాలి
నేనెవర్నో ఇంకా గుర్తుకు రాలేదా
పొద్దున్నే ఊడ్చేవాడు వస్తాడు, కూరలు తెచ్చేవాడు వస్తాడు, వంటవాడు వస్తాడు, బట్టలుతికే వాడు వస్తాడు, ఇస్త్రీ చేసేవాడు వస్తాడు, లంచ్ ఎర్పాటు చేసేవాడు వస్తాడు, గిన్నెలు తోమేవాడు వస్తాడు. ఇంకా డ్రైవరూ, లాయరు, డాక్టర్, ఎందరో ఉన్నారు అందులో మీరెవరో నాకేం తెలుసు అసలు మీరెవరో తెలపండి.
అదేసార్ మీపదవీకాలం చివరకు వచ్చింది, ఇప్పుడు మన పార్టీ సీటు కేటాయించారు మీ ఆశీర్వాదాల కోసం వచ్చానండి. నేను నిన్ను ఆశీర్వదించి పంపుట తప్ప ఏమి చేయలేను మంచిదండి ఇంక తెనీటి విందు తీసుకొని సెలవు తీసుకోండి నాకు వేరే పని ఉన్నది.
మీరు చెప్పేమాట నిజమేనా
ఇదిగోనండి నాకు సిటు అని నిర్ధారణ ఉత్తరం ఇచ్చారు అంటున్నప్పుడు ఫోన్ మోగింది. మిమ్మళ్ని అధిష్టాన వర్గం కలవ మన్నది అని ఇద్దరికీ ఫోన్వచ్చింది.
మరి ఇప్పుడేంచేద్దాం మీరేచెప్పండి వెళ్ళి కలుద్దాం అంతకన్నా ఏమిచేయగలం ప్రస్తుతానికి అన్నారు.
సంప్రదింపుల్లో మీ ఇద్దరి సమస్యల దృష్టిలో పెట్టుకొని ఓదార్పుతో సిఫార్సు ఉతరం రద్దు పరచి ఈ నియోజకాన్ని ఆడవారికి మార్చటం జరిగింది మీరిద్దరు పోద్తి చేసే స్త్రీకి సహకరించండి అని హచ్చరించారు.
మీరిద్దరూ పార్టీకి అవసరం మీరిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి మనపార్టీ తరుఫున ఒకరిని పోటీకి సిద్ధం చేసి మా దగ్గరకు రండి అది కుడా ఒక్క గంటలో చెప్పాలి లేదా మేము నిర్ణయించిన వారి తరుఫున మీరు కాన్వాసు చేసి గెలిపించాలి అది హాయ్ కమాండ్ నిర్ణయం.
ఒకరు భార్యను నిలబెడతానని మరొకరు కూతుర్ని నిలబెడతానని చెప్పారు. చివరకు యువజన నాయకురాలుగా ఉన్న మంచి వాక్ చాతుర్యము ఉన్న కూ తుర్ని పోటి చేయుటకు ఒక వర్గం తీర్మానించింది. రెండవ వర్గం వారికి పార్టీకి సహాయము అందించండి, మీ సహాయమునకు ఫలితము తర్వాత చూడగలరు.
అని వాగ్దానము చేసారు పార్టీ అధ్యక్షుడు ఆ విధముగా ఒక ఎన్నికలో ఒక పార్టీ పోటీ చరిత్ర అలా మొదలైంది.
ఇక ప్రారంభమైనది ప్రజల్లోకి వెళ్లి ఓట్లు ఎట్లా రాబట్టుకోవాలో ఆలోచిస్తున్నారు.
ప్రజలచేత, ప్రజలకొరకు, ప్రజా ప్రభుత్వాన్ని నడిపేందుకు మీరందరు మా పార్టీ గుర్తుకె ఓటువేసి గెలిపించాలని మిమ్మల్ని కోరుతున్నాము ఈ ఒక్క అవకాశం మాకివ్వండి
--((**))--
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్రభ - (నేటి కధ -14 )
మల్లాప్రగడ రామకృష్ణ
ఇది రాజకీయ మా అవకాస వాదమా, అత్తసొమ్మ అల్లుడు దానం పాతసామెత మరి కొత్త సామెత ప్రభుత్వపు సొమ్మ ప్రజలకు దానం, నోరు ఉందికదా అని గెలిస్తే అడిగినవన్నీ తీరుస్తా ననేవాడు ఒకరు, నదులు సంధానం చేస్తామనే వారు మరో ఒకరు చదరంగంలో గుర్రపు ఆట జరుగుతున్నది.
కాలమెప్పుడు ఒకేమాదిరిగా ఉండదు. గుర్రాల ఉపయోగం పోయింది, గాడిదల ఉపయోగం పోయింది, ఏనుగుల ఉపయోగం పోయింది ప్రస్తుతం బంటుల ఉపయోగమున్నది కేవలం ఆశలకు లొంగేవారు వీరే, డబ్బు చూపి, మందుచూపి లోబరుచు కుంటున్నారు. క్షణిక సుఖానికి లొంగేవారు మనుష్యులే, కొందరి చేతుల్లో ఆడే గుర్రాలు, గాడిదలు, ఏనుగులు. కప్పల బేరం పెరిగింది నీల్లలో సుఖం వదలి నేలపై గెంతాలని వస్తున్నాయి, ఎంతైన నీల్లలోకి రాకతప్పదు. సిధ్ధాంతాన్ని త్రికరణసుధ్ధిగా ఆచరించినవానికి పుట్టుకస్తానాన్ని మరచి వెళ్ళలేరు. వెళ్ళిన ఎక్కువ కాలం అక్కడ ఉండలేరు, ఆశకు అంతు ఉండదు.
నక్క బుధ్ధులు కనబడుతున్నాయి, లొంగి కుటుంబ సమేతంగా నాశన మయ్యేవారు ఎక్కవగా తయారవుతున్నారు, లేదా వారు కూడా నక్కకు మించిన బుధ్ధులు గలవారుగా మారుతున్నారు.
ఒక పెద్దమనిషి బస్సు ఎక్కాడు టికెట్టు తీసుకోమనగా జేబులో డబ్సులు పోయినాయి అన్నాడు కండెక్టర్ నోటికి పదునుపెట్టాడు ఆమాటలకు ప్రక్కనే ఉన్న వేరొక పెద్దమనిషి టిక్కెట్టు కొని ఆదుకున్నాడు, అతడే ఆపత్ బాంధవుడుగా మారాడు పెద్దమనిషి పనికోసం దిగిపొయ్యాడు, ఉన్నవాడు లాభం 95 రూపాయలు అనుకున్నాడు.
అందుకే రాజకీయంలో తెలివితేటలు ఉండాలి, డబ్బున్నా ఓట్లు పడవు
అందుకే నాకు ఒక తల్లి మాటలు గుర్తుకు వస్తున్నాయి
ఒక బడిలో పిల్లలందరిని మీరు పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారని బడిలో టీచరు అడిగారు. ఒకరు డాక్టరవుతానని, ఇంకొకరు ఇంజినీరవుతానని, మరొకరు లాయరు అవుతానని చెబుతుండగా, ఈ బాలుడు మాత్రం నాయకుడ్ని అవుతానని జవాబిచ్చాడు.
టీచరు, పిల్లలు గొల్లున నవ్వారు
బాలుడు ఇంటికి చేరే లోపలే ఈ కబురు ఊరికీ, ఊళ్లోని తల్లికి అందిపోయింది.
ఇంటికి రాగానే తల్లి ప్రశాంతవదనంతో బాబూ! పెద్దయ్యాక ఏమవుదామనుకుంటున్నావని అడిగింది. అతడు పాత సమాధానమే చెప్పాడు. ఆమె తప్పకుండా అవుదువుగానీ, ఇలా రా అంటూ పూజామందిరం తలుపులు తెరిచింది.
నీవు ఒక్క నాయకుడవటం కాదు బాబూ, నాలుగు గుర్రాలు నడిపే బండీకి నువ్వు జట్కావాలావి కావాలి, (అనగా నాలుగుదిక్కుల్లో ఉన్న మనుష్యులకు మన:శాంతి కల్పించే విధముగా) అదిగో, ఆ శ్రీకృష్ణుడిలాగా - అని బోధించింది ఆ తల్లి..*_
ఆ నాలుగు గుర్రాల పేర్లు ధర్మ, అర్థ, కామ, మోక్షాలనీ, ఆ విషయాలను బోధించే రాధసారధి జగద్గురువైన శ్రీకృష్ణుడనీ చెప్పింది. నువ్వు కూడా జగత్తుకి ఈ నాలుగింటిని బోధించే గురువువి కావాలి, సరేనా! అంటూ అతడి ఆలోచనను చక్కని మలుపు తిప్పింది.
ఇటువంటి తల్లి వాక్కు నిజం కావాలని నిజమైన నాయకుడు వస్తాడని ఎదురుచూద్దామ్ మనవంతు ధర్మంగా ఒటు వేద్దాం
--((**))--
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
ఎందుకే అంత కష్టపడతావ్, అంతా నీ తాపత్రయం తప్పా, నిన్నెవరు గుర్తించరు, ఇంకా విమర్శిస్తారు తెలుసుకో అన్నాడు మధవ్ రాధతో
ప్రాంజలి ప్రభ - (నేటి కధ -13)
ఎందుకే అంత కష్టపడతావ్, అంతా నీ తాపత్రయం తప్పా, నిన్నెవరు గుర్తించరు, ఇంకా విమర్శిస్తారు తెలుసుకో అన్నాడు మధవ్ రాధతో
ఏదోనండి నాతృప్తి నాది, మీరు మాత్రం ఏమన కుండా నాకు సహకరిస్తే చాలు, అదే నాకు ఎనలేని సంతృప్తి.
అందుకే అన్నారు కష్ట బడే వారిని కష్టపెడతారు, సుఖ పడే వారిని పట్టించుకోరు అన్నాడు మాధవ్
ఇప్పుడు మనం తినలేం ఆవకాయ, మాగాయ, గోంగూర, చింతకాయ పచ్చడ్లు పెట్టి మరీ ఇద్దరు కొడుకు, కోడళ్ల కు ఇద్దరు కూతురూ అల్లులకు కొరియర్ ద్వారా పంపిస్తు న్నావు, పచ్చళ్ళు దేవు డెరుగు కనీసం మనల్ని గుర్తించే పరిస్థితే లేదు, అంతా నీ శ్రమ తప్ప .
ఏ మోనండి పిల్లలు మనల్ని గుర్తించక పోయినా మనం వారిని మరిచి ఉండలేమండీ.
ఇప్పుడు మరచి పోయానని చెప్పానా, లేదే వాళ్ళ గుణాలను గుర్తించి చెపుతున్నాను.
నమస్కార మండి అంటూ కొందరు ఉద్యోగులు కలిశారు మాధవ్ గారిని, అందరిని సానుకూలంగా ఆహ్ఫానించి వారికి తగు అల్పాహారములు ఏర్పాటు చేసింది శ్రీమతి రాధా.
వచ్చిన విషయము తెలియపరుస్తు, మీరు వ్రాసిన "లోకమింతే " అనే కావ్యానికి భాష ప్రాతిపది కముగా మొదటి బహుమతి కేంద్ర ప్రభుత్వం వారు గుర్తించారు, కాశీ లో జరిగే ప్రత్యేక ఉత్సవము నందు రాష్ట్ర పతి చేతులు మీదగా మీరు అందు కోబోతున్నందుకు మా టీచర్ అసోసియేషన్ ద్వారా సంతోషము వక్త పరుచుటకు వచ్చామని చెప్పారు. మీరు అవార్డు తీసుకోని తిరిగి వచ్చుటకు అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాము మీ తరుఫున ఎవరైనా వస్తానంటే మాకు తెలియ పరచండి ఏర్పాటు చేసుకోవాలి అని తీలియపరిచారు.
వారి మాటలకూ ఒక్కసారి మాధవ్ గారికి కళ్ళు చెమ్మగిల్లినాయ్ ఇప్పుడే ఉండండి అంటూ లోపలకు పోయి వచ్చినవారికి తాను రచించిన కావ్యాన్ని తలా ఒకటి చేతిలో పెట్టాడు.
మీకు అన్ని వివరముగా రెండు రోజుల్లో తెలియపరుస్తా అని అందరికి నమస్కార బాణాలు చెప్పాడు మాధవ్
రాధా అంతా విన్నావు కదా కొడుకుల్లకు, కూతుర్లకు కబురు చేయి, వాళ్ళ అభిప్రాయాలు కనుక్కొని చెప్పు అన్నాడు, నేను ఆ హనుమంతుని గుడిదాకా పోయి నమస్కరించి వస్తా అని గుడికి నడిచాడు మాధవ్.
కొడుకులు కూతుర్ల మాటలు విని ఓక్కసారి బాధపడింది, భర్తకు ఏమిచెప్పాలో తెలియక ఉండి పోయినది.
మాధవ్ అడుగు పెడుతూనే ఏమన్నారు మనబిడ్డలు అని అడిగారు, తడబడుతూ ఈ అవార్డు తీసుకోకపోయినా పోష్టులోవస్తుంది నాన్న శ్రమ పడి పోవుట ఎందుకు ?
అవునే కష్టం విలువ వాళ్లకు తెలియదు, ఎదో కంప్యూటర్ విద్యనేర్చుకొని లక్షలు సంపాయించు తున్నారు, నేను లక్షలు సంపాదించ లేక పోయిన ప్రశంసా బహుమతితో ధనం పొందుట నాకు గొప్ప.
పిల్లలు వచ్చినా రాక పోయినా మన ఇద్దరం కాశీకి బయలు దేరుదాము, నీకు నామీద నమ్మకం లేకపోతే నీవు రావద్దు.
అంత మాట అనకండి నేను మీతో వస్తాను, నా పిల్లల కన్నా మీరే ముఖ్యం
సరే రెండు రోజుల్లో మనం కాశీకి పోదాం, బహుమతి తీసుకోని పుణ్యక్షేత్రాలు తిరిగి వద్దాం, అన్నాడు.
అను కోని విధముగా బహుమతి ప్రధానము తారీఖు మార్చటం జరిగింది. అనుకున్న ప్రకారముగా ఉపాధ్యాయ పదవీ విరమణ జరిగింది. కొడుకులు కూతుర్లు ఎదో ఆశించి విరమణ సమయమున హంగామా చేశారు.
మాధవ్ మాత్రం లాయర్ పిలిపించి తనఆస్తి వివరాలు, రొక్ఖం వివరాలు తెలిపి వీలునామా రిజిస్ట్రేషన్ చేసాడు, ఆవిషయమే పిల్లలకు తెలియ పరిచాడు, నాన్న వచ్చిన డబ్బు ఎక్కడ దాస్తున్నాడో ఎవరికీ పెడుతున్నాడో, నీకు తెలియకుండా, మాకు ఇవ్వ కుండా ఉన్నాడు. అమ్మా నీవు జాగర్త పడాలి అని హెచ్చరించి వెళ్లారు.
అనుకున్న ప్రకారముగా రాధా మాధవ్ కాశీలో బహుమతి తీసుకున్నారు, గంగలో స్నానమాచరించి పరమేశ్వరుని దర్శించి, గంగా హారతి చూడాలని పడవలో కూర్చున్నారు. ఒకవైపు హారతి మరోవైపు మాధవ్ కు గుండె దడ పెరిగింది, పడవలోనుండి గంగలోకి విరిగి ప్రాణాలు అనంత వాయువులో కలిసాయి.
మాధవ్ అకాల ముర్చువుని తట్టుకోలేక ఒక్కసారి మూర్ఛ పోయింది రాధ. తమతో పాటు వచ్చిన ఉపాద్యాయులు కొడుకులకు, కూతుర్లకు కబురుచేయక అందరూ వచ్చారు కర్మలు చేశారు, ఆస్తి వివరాలు అడిగారు.
లాయర్ ద్వారా వీలునామా చదివించారు, దానిలో " నేనుకాని నాభార్య కానీ ముందుగా ఎవరు చనిపోయినా రెండవనారికి పూర్తి అధికారము వచ్చును, ఇరువురము చని పోయిన తర్వాత కొడుకులకు కూతుర్లకు సమాన భాగముల్లాగా పంచు కొన వలెను. లాకర్ లో ఉన్న డబ్బు ఈ ఇల్లు వృద్ధులకు నివాసమునకు మందులకు, వ్యాయామ శాలకు వాడవలెను. అనివ్రాసిన దాన్ని వివరించారు
కొడుకులు, కూతుర్లు ఆస్తి రాదని తెలుసుకొని తల్లిని అడిగి వెనుతిరిగారు ఫలితములేక.
మాధవ్ రచించిన కవిత్వాలను ముద్రికవల్లా, వృద్దాశ్రమము వల్ల దినదినాభి వృద్దిగా మాధవ్ గారి పేరుతో అభివృద్ధి దిశలో తీసుకొచ్చింది రాధా
ఇద్దరు కొడుకులు సంపాదన తారుమారై తల్లి పంచన చేరారు, అల్లుళ్ళ కోరికపై కూతుర్లు ఇంటికి వచ్చారు. ఎవ్వరిని వద్దనకుండా పని పురమా యించి అభివృద్ధి దశలో కొచ్చారు, మాధవ్ ఆబ్దికం ఘనంగా ఏర్పాటు చేసారు.
దు:ఖము వచ్చిన, సంతోషము పెరిగిన, గుండె ఆగి పోతుంది మరణ శాసనం అనే నిజం అదే రోజు రాధను వెంబ డించింది అట్లు జరుగుట ఎవరి వళ్ళ ఏమో తెలియదు - డబ్బుకోసం కొందరి ఆశపరుల చర్యే .......
--((**))--
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
రైలు ప్రయాణంలో ఒకరోజు (12 )
ప్రాంజలి ప్రభ - (నేటి కధ
తాత హిందూ ఋషులు జాబితా తెలియపరుస్తావా
అక్షర క్రమంలో హిందూ ఋషుల పేర్లు తెలియపరుస్తా వ్రాసుకో అని చెప్పటం మొదలు పెట్టాడు.
అ - ఆ - ఇ - ఈ - ఉ - ఊ - ఋ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ - అం - క - ఖ - గ - ఘ - చ - ఛ - జ - ఝ - ట - ఠ - డ - ఢ - త - థ - ద - ధ - న
ప - ఫ - బ - భ - మ -య - ర - ల - వ - శ - ష - స - హ - ళ - క్ష
దేవర్షి : దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు.
బ్రహ్మర్షి : ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు.
మహర్షి : సామాన్య ఋషి స్థాయిని దాటిని గొప్ప ఋషులను మహర్షి అంటారు.
రాజర్షి : రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజర్షి.
అ
అగ్ని మహర్షి, అగస్త్య మహర్షి, అంగీరస మహర్షి, అంగిరో మహర్షి, అత్రి మహర్షి, అర్వరీవత మహర్షి
అభినామన మహర్షి, అగ్నివేశ మహర్షి, అరుణి మహర్షి, అష్టావక్ర మహర్షి, అష్టిక మహర్షి, అథర్వణ మహర్షి, ఆత్రేయ మహర్షి, అథర్వాకృతి, అమహీయుడు, అజామిళ్హుడు, అప్రతిరథుడు, అయాస్యుడు, అవస్యుడు, అంబరీషుడు.
ఇ
ఇరింబిఠి
ఉ
ఉపమన్యు మహర్షి, ఉత్తమ మహర్షి, ఉన్మోచన, ఉపరిబభ్రవుడు, ఉద్దాలకుడు, ఉశనసుడు
ఉత్కీలుడు.
ఊ
ఊర్ఝ మహర్షి, ఊర్ద్వబాహు మహర్షి
ఋ
ఋచీక మహర్షి, ఋషభ మహర్షి, ఋష్యశృంగ మహర్షి, ఋషి
ఔ
ఔపమన్యవ మహర్షి, ఔరవ మహర్షి
క
కపిల మహర్షి, కశ్యప మహర్షి, క్రతు మహర్షి, కౌకుండి మహర్షి, కురుండి మహర్షి, కావ్య మహర్షి
కాంభోజ మహర్షి, కంబ స్వాయంభువ మహర్షి, కాండ్వ మహర్షి, కణ్వ మహర్షి, కాణ్వ మహర్షి
కిందమ మహర్షి, కుత్స మహర్షి, కౌరుపథి, కౌశికుడు, కురువు, కాణుడు, కలి, కాంకాయనుడు
కపింజలుడు.కుసీదుడు
గ
గౌతమ మహర్షి, గర్గ మహర్షి, గృత్సమద మహర్షి, గృత్సదుడు, గోపథుడు, గోతముడు, గౌరీవీతి
గోపవనుడు, గయుడు
చ
చ్యవన మహర్షి, చైత్ర మహర్షి, చాతనుడు
జ
జమదగ్ని మహర్షి, జైమిని మహర్షి, జ్యోతిర్ధామ మహర్షి, జాహ్న మహర్షి, జగద్బీజ, జాటికాయనుడు
త
తండి మహర్షి, తిత్తిరి మహర్షి, త్రితుడు, తృణపాణి
ద
దధీచి మహర్షి, దుర్వాస మహర్షి, దేవల మహర్షి, దత్తోలి మహర్షి, దాలయ మహర్షి, దీర్ఘతమ మహర్షి, ద్రవిణోదస్సు
న
నచికేత మహర్షి, నారద మహర్షి, నిశ్ఛర మహర్షి, సుమేధా మహర్షి, నోధా, నృమేధుడు
ప
పరశురాముడు, పరాశర మహర్షి, పరిజన్య మహర్షి, పులస్త్య మహర్షి, ప్రాచేతస మహర్షి, పులహ మహర్షి, ప్రాణ మహర్షి, ప్రవహిత మహర్షి, పృథు మహర్షి, పివర మహర్షి, పిప్పలాద మహర్షి
ప్రత్య్సంగిరసుడు, పతివేదనుడు, ప్రమోచన, ప్రశోచనుడు, ప్రియమేథుడు, పార్వతుడు
పురుహన్మ, ప్రస్కణ్వుడు, ప్రాగాథుడు, ప్రాచీనబర్హి, ప్రయోగుడు, పూరుడు, పాయు
బ
భరద్వాజ మహర్షి, భృగు మహర్షి, భృంగి మహర్షి, బ్రహ్మర్షి మహర్షి, బభ్రుపింగళుడు, భార్గవవైదర్భి
భాగలి, భృగ్వంగిరాబ్రహ్మ, బ్రహ్మస్కందుడు, భగుడు, బ్రహ్మర్షి, బృహత్కీర్తి, బృహజ్జ్యోతి, భర్గుడు
మ
మరీచి మహర్షి, మార్కండేయ మహర్షి, మిత మహర్షి, మృకండు మహర్షి, మహాముని మహర్షి
మధు మహర్షి, మాండవ్య మహర్షి, మాయు, మృగారుడు, మాతృనామ, మయోభువు, మేధాతిథి
మధుచ్ఛందుడు, మనువు, మారీచుడు
య
యాజ్ఞవల్క మహర్షి, యయాతి
ర
రురు మహర్షి, రాజర్షి మహర్షి, రేభుడు
వ
వశిష్ట మహర్షి, వాలఖిల్యులు, వాల్మీకి మహర్షి, విశ్వామిత్ర మహర్షి, వ్యాస మహర్షి, విభాండక ఋషి
వాదుల మహర్షి, వాణక మహర్షి, వేదశ్రీ మహర్షి, వేదబాహు మహర్షి, విరాజా మహర్షి, వైశేషిక మహర్షి
వైశంపాయన మహర్షి, వర్తంతు మహర్షి, వృషాకపి, విరూపుడు, వత్సుడు, వేనుడు, వామదేవుడు
వత్సప్రి, విందుడు
శ
శంఖ మహర్షి, శంకృతి మహర్షి, శతానంద మహర్షి, శుక మహర్షి, శుక్ర మహర్షి, శృంగి ఋషి, శశికర్ణుడు, శంభు, శౌనకుడు, శంయువు, శ్రుతకక్షుడు
స
సమ్మిత మహర్షి, సనత్కుమారులు, సప్తర్షులు, స్థంభ మహర్షి, సుధామ మహర్షి, సహిష్ణు మహర్షి
సాంఖ్య మహర్షి, సాందీపణి మహర్షి, సావిత్రీసూర్య, సుశబ్దుడు, సుతకక్షుడు, సుకక్షుడు, సౌభరి
సుకీర్తి, సవితామహర్షి సామావేదానికి మూలము, సింధుద్వీపుడు, శునఃశేపుడు, సుదీతి
హ
హవిష్మంత మహర్షి, హిరణ్యరోమ మహర్షి
ఈ తాతగారికి పిల్లలతో మాట్లాడటం చెప్పటం వారు రాసుకోవటం అలా జరిగి పోయే ఈ నటి కాలక్షేపం రైలులో
--((*))--
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
రైలు ప్రయాణంలో ఒకరోజు (11 )
ప్రాంజలి ప్రభ - (నేటి కధ
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
అమ్మా నాన్నా ఫోన్ చేస్తున్నాడు తీయనా, నీవు తీస్తావా అన్నది పుత్రిక రత్నం " హిమబిందు "
తియ్యవే మీనాన్న గారితో మాట్లాడు మీరిద్దరూ ఒకటేగా, నీమీద ఈగ వాలనీడు, నీవు ఏదంటే అది తెచ్చి ఇస్తాడు.
అట్లయితే నువ్వే మాట్లాడు నేను మాట్లాడునులే అని లోపలకు వెళ్ళింది.
ఫోన్ మళ్ళీ మ్రోగింది, హలొ అని మొదలు పెట్టింది శ్రీమతి శ్రీదేవి
ఏమండి మీరెలా ఉన్నారండి అని అడిగింది
నేను బాగానే ఉన్నా, ముందు అమ్మాయి కి ఫోన్ ఇవ్వు
అట్లాగేనండి
హిమబిందు నాన్నగారు నీతో మాట్లాడుతారుట మాట్లాడు
అమ్మా చిట్టితల్లీ " నీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెపుదామని ఫోన్ చేసాను"
మంచిది నాన్న మీకు ధన్యవాదములు,
చిట్టితల్లీ నీకు కొరియర్ లో గిఫ్ట్ పంపుతున్నాను, నాన్న మీరు రావటంలేదా
లేదమ్మా నాకు చిన్న పని ఉండటంవల్ల రాలేక పోతున్నాను, అమ్మ నువ్వు జాగర్తగా ఉండండి, నాన్న మీరు రాక పొతే నేను పుట్టిన రోజు ఏమి చేసుకోను, మీరొస్తేనే చేసుకుంటాను అంతే అంటూ ఫోన్ కట్ చేసింది.
మల్లా ఫోన్ మోగింది
ఏమండి మీరెలా ఉన్నారండి, వేలకు భోజనం చేస్తున్నారా, నిద్రపోకుండా ఎక్కవ కష్టపడకండి, మీ మీద ఆధారపడినవారు ఉన్నారండి అది మాత్రం మర్చిపోకండి. నీవు చెప్పినవన్నీ పాటిస్తున్న ముందు అమ్మాయికి ఫోన్ ఇవ్వు
హిమబిందు నాన్నగారు నీతోనే మాట్లాడుతారుట
ఏమిటి నాన్న
నీకు కోపం వచ్చిందని నాకు తెలిసింది, ఇక్కడ నా పరిస్థితులు నీకు, మీ అమ్మకు వివరించలేను అది అర్ధం చేసుకో,
నేను నీకు పంపినది స్మార్ట్ ఫోన్ దాన్ని ఎలా ఉపయోగించాలో నేను నీకు చెప్ప నవసరము లేదను కుంటాను, థాంక్స్ నాన్న అంటూ ఫోన్లో ముద్దు పెట్టింది హిమబిందు
చూడమ్మా నీ పుట్టిన రోజు ఆన్లైన్ వీడియో లో నేను దీవిస్తాను, నీవు ఆన్ చేసి ఉంచు, ఒక్క సారి అమ్మకు ఫోన్ ఇవ్వు.
ఏమిటే అమ్మాయి పుట్టినరోజు కదా, ఈరోజు స్పెషల్ ఏమి చేస్తున్నావు
నామతి మండా ఆవిషయమే మరిచాను, మీరు దూరముగా ఉన్నప్పటినుండి నామనసు మనసులో లేదు, ఎంత సేపటికి మీ ఆలోచనలే, మీరు జాగర్తగా ఉండాలని, దేవళ్ళందరినీ మొక్కుకుంటున్నాను.
నీ మొక్కుల ఫలిత మేమో ఒక్క వారంలో నీదగ్గర వాలిపోతా
ఎంత చక్కటి వార్త చెప్పారండి అమ్మాయి బర్తడే కేక్ కొరియర్లో పంపిస్థాను వెంటనే తినండి.
నా బంగారు చిట్టి తల్లి హిమబిందు మీ నాన్నగారు వారం రోజుల్లో వస్తారట, ఇంటిని శుభ్రం చేయాలి అందులో ఈ రోజు నీ పుట్టినరోజు కదా అందరిని పిలువు గ్రాండుగా చేసు కుందాం
అట్లాగేనమ్మా
అమ్మహడావిడితో నాన్న వీడియో సెల్ ఫోన్ దీవెనలతో నవ్వుల కేరింతల మధ్య జరిగింది పుట్టినరోజు .
మనుషులు దూరముగా ఉన్నా వస్తున్నాను అనే శుభవార్తె కొందరిలో ఉన్న అశాంతి తొలగించి ఉత్సాహం నింపుతుంది.
--((**))--
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
రైలు ప్రయాణంలో ఒకరోజు (10 )
ప్రాంజలి ప్రభ - (నేటి కధ
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
రైలు కదులుతుంది, ప్రతిఒక్కరూ ఫోన్ చేస్తున్నారు, సమాధానాలు చెప్పలేక భాదపడుతున్నారు.
ఒకరోజు భార్యాభర్తలు ఎదో పనిమీద రైల్లో ప్రయాణ మయ్యారు ఆ విషయం ఎవ్వరి కీ చెప్పఁ కూడదనే అనుకున్నారు కానీ తెలిసి పోయినది కొందరికి
స్టేషన్లో కూర్చొని ఉన్నారు ఏమండోయి మీకు ఫోన్ వచ్చింది
అట్లా అరవకే ఏదో మాట్లాడు, ఇక్కడ నేను మాట్లాడుతున్నానుగా ఈ ఫోన్ లో
ఇప్పుడు మాట్లాడమంటారు మాట్లాడాకా ఎదో సలహ ఇవ్వ బోతారు కదా
అట్లా అనన్లే ముందు వివరం తెలుసుకో
మార్పుకు మార్గలు ఉపయోగాలు తెలప మంటున్నారు
రైల్లో మిమల్ని కలవటానికి వస్తారుట, సరే రమ్మనమను అన్నాడు
ఎవన్నారే ఇప్పుడే వస్తారుటా, ఇంకా ఆల్సస్యం ఉందన్నారా మనం ఇక్కడ ఉన్నట్లు వాళ్లకు ఎట్లా తె లిసింది
ఆ మీరేచెప్పుంటారు మర్చిపోతారు, మీరు అందరికి సలహాలు ఇస్తారు, నేను చెప్పిన పని ఒక్కటికూడా చేయరు ఏమిటో ఈ లోకం,
ఆ మీరేచెప్పుంటారు మర్చిపోతారు, మీరు అందరికి సలహాలు ఇస్తారు, నేను చెప్పిన పని ఒక్కటికూడా చేయరు ఏమిటో ఈ లోకం,
మరలా ఫోన్
ఏమండి ఫోన్ బాయ్ ను పెట్టుకొండి
నీవేం చేస్తావు
నాకెందుకు మీరే ఫోన్ తీయండి
బోగిలోకి కొందరొచ్చారు నమస్కారం పెట్టారు
కూర్చోండి అంటూ, రామక్రృష్ణ నమస్కారములు తెలిపాడు.
నిత్య సత్యాలు మాకు తెలపండి, నేను రోజు పేస్ బుక్లో వ్రాస్తున్నాగా అవేనండి, ఇక ప్త్రాత్యేకమైనవి ఏముంటాయి.
సరే ఎలిసినవి తెలియపరుస్తాను
ముందు నేను చెప్పే విషయాలు మీజీవితానికి మార్గదర్శకాలు
ఒక్కనిముషం నేను రికార్డు చేస్తాను
1. ఆచరణ వల్లే జీవితం యోక్క పరమార్ధం తెలుస్తుంది
2. ఆంతరాత్మ చెపుతున్నది అని ఆలోచన మానండి
3. ఓడిపోతానని భయాన్ని తొలగించు కోండి
4. మార్పుని ధైర్యంగా ఎదుర్కోండి
5. అవాంతరాలను ఎదుర్కొని శక్తిని పెంచుకోండి
6. మార్పు ఫలితాల కోసం ఎదురు చూడకండి
7. మిమ్ము గుర్తించినది ఏదీ మిమ్మ వదలదని తెలుసుకోండి
8. జీవితం సాగిపోయే ప్రవాహం అని తెలుసు కోండి
9. భంధాలను వదలి బ్రతుకు కలియుగంలో కష్టమని తెలుసుకోండి
10. మార్పు ప్రకృతిబట్టి పిల్లల బట్టి ఆరోగ్యాన్ని బట్టి మనసుని బట్టి శ్రీ మతి అనుకరన బట్టి నడుచుకోవటమే నిజమైన మార్పు
11. భగవద్ గీత నమ్మండి, ఆ పరమాత్మల లీలలు తెలుసుకొని ప్రవర్తించండి, రామాయణం చదవండి మనస్సునుప్రశాంతపరుచుకోండి
ఈ పదకుండు సూత్రాలే జీవిత సమస్యలు తొలిగిస్తాయి
మీమార్పుకు కారణం చెపుతారా
ఈ పదకుండు సూత్రాలే జీవిత సమస్యలు తొలిగిస్తాయి
మీమార్పుకు కారణం చెపుతారా
నేను తెల్లవారున లేచి ఓం శ్రీ రాం శ్రీ మాత్రేనమః నా ఆలోచనకు ఆచరణకు ప్రాణం
నేను యెప్పుడూ చెపుతూ ఉంటా
నిన్నటి దాన్ని ఆలోచించకు
రేపటి దాన్ని గురించి విచారించకు
నేటి పనిని ధర్మమార్గాన చేస్తూ సాగు ముందుకు
ఆనందాన్ని పంచి పోందటమే నిజమైన మార్పు
మీకందరికి ధన్యవాదాలు
మీ దారిన మీరు సలహలను తెలుసుకొని ప్రవర్తిసే ఫలితం ఉండదు, అనుభవించిన వారికి తెలుస్తుందండి
ఆ ఆ తెలుస్తుంది సలహాలు కడుపునింపవు, ఏదైనా తినే కడుపు నిండుతుంది అన్నది భార్య పెద్దగా
అందరూ నవ్వుకున్నారు
మీకోసం పళ్ళు తెచ్చాం మీ మాటల్లో పడి మర్చిపొయ్యాం ఇవిగోనండి
వద్దులెండి ఇక్కడ చాలా ఉన్నాయి
ఎందుకండి ఇస్తానన్నప్పుడు తీసుకుంటేనే మంచిది, అసలే రైలు ప్రయాణం, ఏవి దొరుకు తాయో, ఏవి దొరకవో ......
అవును అవునవును ...
రైలు ప్రయాణంలో ఒకరోజు (9 )
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
ప్రాంజలి ప్రభ - (చిన్న కథ )
రైల్లో కూర్చొని శ్రీమతి సుభద్ర ఫోన్ ల్లో మాటాడుతున్నది
అదేపనిగా ఫోన్లో మాట్లాడుతున్నావు ఎవరితో దేవీ
అదేనండి మీ స్నేహితురాలు రూపతో
ఆమ్మో ఆవిడతోనా, నేను ఏమి చెప్పి0ది, నీవు ఏమి చెప్పావు అసలే వాళ్ళ ఆయన శాడిష్టు
ఎదో చెప్పింది లెండి, అది మీకెందు కండి
నేను జాగర్త పడాలి, వాళ్ళ ఆయన అసలే అనుమాన పక్షి
ఎదో ఫోన్ గురించి భాధ వ్యక్త పరిచింది
ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిం తర్వాత, అదేపనిగా చూస్తున్నావు అంటాడు, వీడియో ఫోన్లో మాట్లాడితో ఎవరితో మాట్లాడు తున్నావ్ అంటాడు, అన్ని నువ్వే నేర్పావు, ఆడవాళ్లు పైకి రావాలి అన్నీ తెలుసుకోవాలి అని చెప్పి ఒక్క నిముషం మాట్లాడితే ఓర్చుకోలేడు, ఒకసారి ప్రేమగా మాట్లాడుతాడు, మరోసారి కోపంగా మాట్లాడుతాడు అంటూ ఫోన్ లో చెపుతున్నది వాళ్ళ పెనిమిటి గురించి స్నేహితురాలు రూప
నీవేం చెప్పఁవు, ఇంకా చెప్పలేదు.
నీవేం సలహా ఇవ్వకు, వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ కలుస్తారు, తొందరపడి మాట సలహా ఇచ్చావో వాళ్లిద్దరూ ఏకమై నిన్నే తిడతారు జాగర్త.
భర్త ఈవిధంగా చెప్పుడు
ఒక సందేశాన్ని అత్యంత వేగంగా చేరవేయాలంటే "ఈమైయిల్" అయినా ఉండాలి లేదా "ఫీమేల్" అయినా ఉండాలి.
రెండవది మరింత వేగంగా చేరవేస్తుంది.కదండీ అంటూ నెమ్మదిగా మాట్లాడింది.
అవునే మనం మాటల్లోనే ప్రేమ ఉద్భవిస్తుంది అది తెలుసుకో, అందుకే ఫోన్ ల్లో జాగర్తగా మాట్లాడ మంటాను, ఎందు కంటే రికార్డుకూడా చేస్తున్నారు ఇప్పుడు.
అందుకే నేను అంటాను
తల్లితో ప్రేమగా మాట్లాడాలి...!
తండ్రితో మర్యాదగా మాట్లాడాలి...!
అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళతో అభిమానంగా మాట్లాడాలి...!
గురువులతో గౌరవంగా మాట్లాడాలి...!
మిత్రులతో మనస్ఫూర్తిగా మాట్లాడాలి...!
బావా, బామర్దులతో వెటకారంగా మాట్లాడాలి...!
మరి భార్యతో...
అంత సినిమా లేదు గాని... నోరు మూస్కుని ఆవిడ చెప్పింది "వినాలి"...!
అంటూ నాలుకలా కొరుక్కున్నాడు
ఎన్నాళ్లకు ఒక మంచి మాట చెప్పారు అంటూ ఇద్దరు నవ్వు కున్నారు
అవును ఇప్పుడే అందరూ మాట్లాడు కుంటున్నారు హత్యా రాజకీయం అంటున్నారు నాకేం అర్ధం కావటం లేదు.
అవునండి మన లాంటి మధ్య తరగతి ఉద్యోగులకు అసలు అర్ధం కాదు రాజకీయం.
మనం ఒకపార్టీ అని ఓటు వేస్తాము గెలిచాక మరో పార్టీలోకి దుముకుతున్నారు, ఇలాంటి రాజకీయములో నాకు నమ్మకం లేదు.
వేటు వెయ్యవా ఏంటి
ఓటు వేస్తానండి వేస్తాను మాటల్తో మభ్యపెట్టకుండా ప్రజా సేవ చేసేవారెవరో తెలుసుకొని మరి ఓటు వేస్తాను. వారు మోసం చేస్తే
కడుపు కొడితే వదిలేస్తా మనసుమీద కొడితే నరికేస్తా అన్నది
కూల్ కూల్ నీకు ఆవేశం రావటం మంచిది కాదు, నోరు జారకు కోడలు చెవులుంటాయి
గోడలు లేవండి ఇక్కడ
రైల్లో ఉన్న వారందరు మనుష్యులు కారా
ఏమోనండి ఎదో మాట్లాడేస్తున్నాను
స్టేషన్ వచ్చినటున్నది దిగుదాం పదండి
అట్లాగే, బ్యాగులు మనవో కాదోచూసి సర్దు దిగుదాం
ఆట్లాగేనండి ... మరి అట్లాగేగదండీ
అంతొద్దు వినయం నన్ను మర్చిపోకుండా ఉంటే చాలు
ఆ .......ఆ ......
--((*))--
good
రిప్లయితొలగించండిgood
రిప్లయితొలగించండి