13, మార్చి 2019, బుధవారం





ప్రాంజలి ప్రభ - నేటి కవిత 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

మళ్ళి మళ్ళి పిలుస్తుంది పువ్వు
పరిమళంతో మత్తెక్కించే పువ్వు 
మనసును దోచి నవ్వించే పువ్వు
ఆకర్షణతో అంకురింపచేసే పువ్వు

దేవుని పాదాలు తాకి పరవశించే పువ్వు
దారంలో చీక్కి మాలగామారును పువ్వు
ఏరోజుకారోజు శోభాయమానంగా పువ్వు
స్త్రీల కొప్పును చేరి శ్రృంగారించేటి పువ్వు

ఏమరపాటు (దుఃఖం) మరిపించే పువ్వు
మమేకం ( శాంతి) తో ఆనందపరిచే పువ్వు
సృజనాత్మకత శక్తిని వృద్ధి పరచేటి పువ్వు
ప్రేమికులను ఏకంచేసి ఉల్లాసపరిచే పువ్వు


Image may contain: one or more people and text
ప్రాంజలి ప్రభ
అంత్య ప్రాస భావకవిత్వం (వెయ్యాలి ఓటు)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
రంగు రంగుల జండాల హడావిడి
రోజు వారి కూలీలతో సందడి
ఓటు విలువ తెలిపే పలుక బడి
మా పార్టీ గుర్తుకే వెయ్యాలి ఓటు

చిరునవ్వుల చిన్మయ ఒరవడి
కలసి వుంటే కలదు సుఖం ఒడి
చేసిన పని తెలిపే ఉపణ్యాస దడి
ఆశలు తీర్చే మహానుభావకే ఓటు

ముందు నాయకులను గమనించండి
కోట్లు ఖర్చు చేసి వస్తే నీతి ఉండదండి
ఓటు వేసి నాయకులను ఎన్నుకోండి
దేశ సేవకు సహకారం అందించండి

పార్టీ చేసిన మేలును తెలుసుకోండి
దేశాన్ని అభివృద్ధి చెందేటట్లు చూడండి
దేశ ప్రగతి ప్రపంచదేశాల్లో గుర్తించేదుకండి
గుణ విద్యాసంపన్నుడుకు వెయ్యాలి ఓటు

నమ్మక పలుకుకు లొంగి మోసపోకండి
డబ్బుకు, మందుకు లొంగిపోకండి
నీతి నిజాయితీ ని బ్రతికించండి
ప్రజాస్వామ్యం కోసం వెయ్యాలి ఓటు

మాది ప్రాంతీయ పార్టీ అని వస్తారండి
మాది జాతీయ పార్టీ అని వస్తారండి
మాది యువజన పార్టీ అని వస్తారండి
అభివ్రుద్ధి పరిచే వారికే వెయ్యాలి ఓటు

ధనము కొరకు దొడ్డి దారిన పోతారండి
కులము కులము అని ఓటు వేసారనుకోండి
అధికారం కోసం అడ్డదారులుపోతారండి
కళ్లునెత్తికెక్కి కాటు వేస్తారు జాగర్తండి
మమత లందించే వారికే వెయ్యాలి ఓటు

--((**))--

ప్రాంజలి ప్రభ 
రచయత మల్లాప్రగడ రామకృష్ణ 
ఇది గోలుసుకట్టు కవిత నచ్చినవారు అభిప్రాయం వ్రాయండి 

1 ఇంటి గుమ్మానికి కట్టాలి మామిడి తోరణాలు
తోరణంలా అల్లుకున్న తీగలకు మల్లెపూలు
మల్లెపూలపై మంచు బిందువులల్లె  మెరుపులు
మెరుపులు చూడగా వెలిగే  పసిడి మొగ్గలు

2 మొగ్గలు ఒకవైపు నీడ మరోవైపు వెన్నెల
వెన్నెల తన్మయత్వంతో పొందె చిలిపికోర్కలు
కోర్కలు తీరగ ఇంటిలొ వె ల్సే నవకాంతులు
నవకాంతులతో కళ్ళు చెమ్మగిల్లే ఉత్చాహాలు

3 ఉత్చాహముతో చేస్తారు పెళ్ళిల్లలో సంబరాలు
సంబరాలలో కలిసేను స్నేహితులు, చుట్టాలు
చుట్టాలు డబ్బు ఎక్కడిదనేటి గుసగుసలు
గుసగుసల్లో చెప్పె స్నెహితులకు హెచ్చరికలు

4 హెచ్హరికలో ఓర్పులేనివారి వాదనలు
వాదనలలో తెలిసుకొనెను కొత విషయాలు
విషయాలలో బయటపడే కొందరి ప్రేమ కధలు
ప్రేమకధల్లో బయటపడ్డ పెళ్ళి కూతురి ప్రేమలు

5 ప్రేమలు పెరుగుటకు యవ్వనంలో కలిగే మార్పులు
యవ్వనం కొరకు కొందరు చేస్తారు యోగాబ్యాసాలు
యొగాభ్యాసాలలో తింటారు పచ్చి కాయ కూరలు
పచ్చి కాయ కూరల్లో విటమిన్సు ఎక్కువని ఊహలు

--((**))--

తప్పుచేస్తున్నావు తెలుసుకో -  అంటాడు గట్టిగా
మాటవిని మాట్లాడటం నేర్చుకో - అంటాడు కోపంగా
మనస్సును అర్ధం చేసుకో  - అంటాడు ప్రేమగా
నీలో ఉన్న మృగత్వాన్ని వదులుకో - అంటాడు భాదగా

అహంకారం వదలి కష్టం తెలుసుకో - అంటాడు నెమ్మదిగా
సానుభూతి వ్యక్తపరచటం నేర్చుకో - అంటాడు స్నేహముగా
వైకుంఠపాళి ఆడటం నేర్చుకో - అంటాడు నాయకుడిగా
ఆధిపత్యం కోసం ఎత్తులు నేర్చుకో - అంటాడు చాణిక్యుడిగా

సమానత్వం ఉందని తెలుసుకో - అంటాడు సంపాదనతో
నీ శక్యతే నాకు సుఖ మనుకో - అంటాడు నవ్వులతో
హృదయం అర్ధం చేసుకో - అంటాడు కన్నీరుతో
నోరువిప్పలేనని తెలుసుకో  - అంటాడు కళ్ళతో

--((**))--

ప్రాంజలి ప్రభ 
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం   

కపాల పుర్రెల మాల తోడ - ఘనమైన నాగ కంకణంబులు తోడ 

చేత సూలాయుధము తోడ - కొప్పులో బాల చంద్రుని తోడ
కమనీయ మైనట్టి కందుకంఠముతోడఁ- మొల పులితోలు తోడ
తనువంతా నేరపూత భూతి తోడ - దయతోడ నభయ హస్తము తోడ    

భక్త భాంధవుండు భవుడు ప్రత్యక్షమై 

పార్వతిని ఆహ్వానించే, గంగను ఊర డించే  



--((**))--
ఉగ్రవాదం 
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ 

తీవ్ర వాదం వివాదంగా మారి 
ఆశావాదులకు అదొక దారి 
ముష్కర మూకల రహదారి 
తీవ్రవాదం నిత్యం ఊరికే గోదారి 

మేధావులే సంపదకు పెడదారి 
నిరుద్యోగుల ఉపాధికి దారి
నిగ్రహశక్తిని లోపరుచుకొనే దారి   
తీవ్రవాదం నిత్యం ఊరికే గోదారి

శిక్షణతో మారుస్తారు కొందరి దారి
స్త్రీలలో కూడా ప్రోత్సాహపు దారి
ప్రజల సమస్యల్ని తీర్చే దొకదారి
తీవ్రవాదం నిత్యం ఊరికే గోదారి

ఈ దారి ఎవ్వరికి మంచిది కాదు        

క్షణికవాసానికి లోను కాకండి 
ఒక్క నిముషం ఆలోచించండి 
అడుగు వేసేముందు చూడండి 
మూగజీవులను కూడా బాధపెట్టకండి 

మానవత్వానికి చేయూత నివ్వండి 
ప్రబల శత్రుత్వాన్ని వదలండి 
సమానత్వాన్ని ఏకం చేయండి  
నిర్మలత్వానికి సహకరించండి 

తల్లి తండ్రులకు బిడ్డలందరు సమానము 
బిడ్డల తప్పుమార్గం ఖండించుట కర్తవ్యము 
బలహీనతలను వక్రమార్గంలో తిప్పకము 
జీవితము మంచి చెడుల ప్రయాణము 

--((**))-- 

పొడుపు కధలు  

1। కణుపు కణుపు పెరుగుతూ కట్టేలాగ కనబడు
పచ్చ  జండా  తొడ  బడుగు తరువు
తెచ్చి చీల్చి తినగ తెలుగంత తియ్యన  
ఇంతకీ నేనెవ్వరో చెప్పగలరా ?

2। మొదటి రెండక్షరాలు మాసమును తెలుపు
రెండు మూడు అక్షరాలూ రెమ్మయగు
మూడు గూడ నొకట ముద్దు గుమ్మ పేరు
ఆపేరు ఏమిటో చెపుతారా మీరు ?
3। రాగమునకు తోడుగా  ఉండు  
గాచు చుండు చోర గుణము నుండి
చెవి  ఉంటేనే  దీని  విలువ  
ఇంతకీ నేనెవరు ?  

4। చీకటి  కమ్ముకొని కప్పు ఉండు
పూలు బూయు నెల రాలకుండు
గాయును రేవగుల్ కాయలేమో రెండు
ఇంతకీ ఇవి ఏమిటి ?

౧। చెరకు ౨। నెలత  త్రీ। తాళము ౪। ఆకాశము, నక్షత్రములు, సూర్యచంద్రులు 



ఆరాధ్య భక్తి లీల 

మామిడి  తోరణం కట్టానమ్మా
మల్లెపూల మాల వేసితినమ్మా
మనో నిగ్రహంతో సేవించానమ్మా    
మధుర స్తోత్రంతో ప్రార్ధించానమ్మా 

మందార పూలతో పూజించానమ్మా 
మమతల కోవెల్గా మార్చానమ్మా 
మధు మోహితుల్లాగ మార్చావమ్మా 
మదిలో మాయ మత్తు పెంచిందమ్మా 

మగువ మాంగల్యం కాపాడావమ్మా
మగువకు ప్రేమ సృష్టించావమ్మా  
మహిళకు లక్ష్యం తోడన్నావమ్మా 
మహిళకు ధ్యేయం నిధన్నావమ్మా 

మనసు నిగ్రహంగా ఉండదమ్మా  
మౌనం నాకెప్పుడూ కుదరదమ్మా 


**మధురవాణి 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
పట్టుదల ఉన్నచోట శుభంతో 
విజయం మీకు తధ్యమంటున్నది 
మౌనం ఉన్నచోట మమతలతో 
కోరికను సంతోషంతో ఇమ్మంది 

బాధ్యత ఉన్నచోట కర్తవ్యంతో 
స్నేహభావంతో మెలగమన్నది 
స్త్రీగౌరవం లేనిచోట ప్రేమతో 
ధైర్యంతో బ్రతకాలంటున్నది

మనసున్నచోట మానవత్వంతో 
నవ్వులతో బ్రతకమంటున్నది
కన్నీరు ఉన్నచోట ప్రేమలతో 
హాస్యముతో బ్రతకమంటున్నది 

చీకటి ఉన్న చోట వెలుగు తో 
తపనతో బ్రతకమంటున్నది 
స్నేహ భావాల ప్రేమ పరీక్షతో 
వినయంతో బ్రతకమంటున్నది 


 వెలుగుకు కన్నీటి సాక్షమన్నది
ప్రమిదకు వెలుగివ్వాలని తపన ఉన్నది-
 స్నేహితులతో కలసి వెలుగిస్తున్నది
 కాంతి ధార పంచమన్నది -
నిగ్రహశక్తితో నలుగురిని బ్రతికించమన్నది   
నేల చినుకును కోరుకుంటుంది -
 నింగి సహకారంతో పులకరించిపోతుంది

మధురవాణి మనవెంటే ఉన్నది -
 మమతలు పంచుతూ విజ్ఞావంతులుచేయమన్నది
తనువును స్పర్శ అవసరమన్నది -
 జిహ్వచాపల్యంనకు  స్పర్స్ సుఖమన్నది

రచ్చబండ రాజకీయ మొద్దన్నది
ఉడతలా సహాయ బడమన్నది 
వయసుని బట్టి  ప్రవర్తించమన్నది
వానరుడులా సహాయపడుతూ బ్రతకమన్నది

--((*))--




ఇందిరాలయ - ర/స/జ/భ/ర/జ/జ/ర/గగ
UIU IIUI - UIU IIUI - UIU IIUI - UIU UU
26 ఉత్కృతి 5680475


1 కామెంట్‌: