25, ఫిబ్రవరి 2019, సోమవారం



#బెల్లంబూందీ


#దశరధరామయ్య, వరలక్ష్మమ్మ దంపతులు ఆ రోజు హడావిడిగావున్నారు. ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్న కూతురూ కొడుకూ వాళ్ళు పిల్లలతో పండక్కితమ దగ్గరికి వస్తూండడమే ఆ హడావిడికి కారణం. అరవైదేళ్ళు దాటిన వరలక్షమ్మ తెల్లవారుఝామునేలేచి నానాహైరానా పడుతూ డెభైదేళ్ళ భర్త దశరధరామయ్యని హైరాన పెడుతూ హడావిడి పడిపోతోంది. ఏమండీ మంచాలమీద మంచిదుప్పట్లు పరిచారా. దిళ్ళగలీబులు మార్చారుగా అంటూ తోమినగిన్నే తోముతూ భర్తని ప్రశ్నలమీద ప్రశ్నలేస్తోంది. ఎందుకంటే ఆవిడకోడలికి ఏదిచ్చినా అది తినే తిండయినా కట్టుకునే బట్టయినా కప్పుకునే దుప్పటైనా మొదట వాసన చూడడం అలవాటు. తన ముక్కుకి ఏమాత్రం తేడా కనుపించినా షిట్ న్యాష్టీగా వున్నాయ్ కంపుకొడుతూ అంటూ నూరుఆరైనా ఆరునూరైనా ఇక వాటిని ముట్టుకోదు. అదీ వరలక్షమ్మ భయం.



ఇక కూతురు సంగతి ఏడాదిన్నరక్రితమే పెళ్ళయి వెళ్ళింది. తనలో ఏమార్పులొచ్చాయో ఇంకా తెలీదు.

భార్య గుప్పించిన ప్రశ్నలకు అబ్బ అన్నీ మార్చానే ఓ టెన్షన్ పడిపోకు. నేను సుబ్బిగాడితో స్టేషన్ కి రెండుబళ్ళు కట్టించుకెళ్ళమని చెప్పొస్తా అంటూ దణ్ణంమీది కండువాతీసి భుజానవేసుకుని ఇదిగో తలుపు ఓరగావేసి వెళ్తున్నా అంటూ గుమ్మందాటాడు.


ఒక మూడునాలుగొందల గడపలున్న ఊరు ధశరధరామయ్యది. ఉదయం సాయంత్రం బస్సుసౌకర్యంతప్పు రైల్లేదు ఆవూరికి. ఒక ఏడెనిమిది కిలో మీటర్లదూరంలో ఎమ్మెల్యే ఎంపిలు సాధించిన ఎక్స్ ప్రెస్ రైళ్ళు కూడా ఆగే స్టేషన్ మాత్రం వుంది.



కొడుకు కోడలు మనుమడు మనుమరాలు కూతురు అల్లుడు బిలబిలా బళ్ళుదిగారు. వరలక్షమ్మ మొహంచేటంతయింది. పిల్లలు మామ్మాతాతయ్యా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ మెడను చుట్టేశారు. కొంతసమయం సెల్ ఫోన్ లు ల్యాప్ ట్యాప్ లు పొట్టన పెట్టుకున్నా ఎప్పుడూ దంపతులిద్దరితో బిక్కుబిక్కు మంటూ ప్రేమదాహార్తితో వుండే ఆ ఇల్లు వారంరోజులపాటు గలగలపారే సెలఏరై ఆవృధ్ధదంపతుల సేదతీర్చింది. పైగా ముందు జాగ్రత్తలు తీసుకున్న వరలక్షమ్మకు తన కోడలికి ఏ వాసనలు రాకుండా వుండడంతో మరింత ఆనందం కలిగింది. కానీ ఆనందం దుఃఖం ఏదైనా, కాలం దేంట్లోను ఆగిపోయివుండదుగా. వారం గిర్రునతిరిగి తిరుగుప్రయాణంరోజు రానేవచ్చింది. అంతవరకూ ఆనందం అనుభవించిన వరలక్షమ్మకు మళ్ళీ ఏదో దిగులు. ఓపికలేకపోయినా నడుంవిరగ్గొట్టుకుని పిల్లలకోసం తను చేసిన పొడులూ పచ్చళ్ళూ అన్నీ జాగ్రత్తగా సర్దుకుంటున్న వాళ్ళదగ్గరకొచ్చి ముక్కాలిపీటదగ్గరకు లాక్కొని కూర్చుంటూ ఇంకో పదిరోజులన్నా వుంటే బాగుండేదర్రా. అసలు వున్నట్టేలేదు అంది. ఆవిడమాట పూర్తికాకముందే ఇంతకన్నా కుదరదమ్మా మీ అల్లుడికి ఆఫీసు. అసలు సెలవుదొరకడమే గగనం. ఈ మాత్రం వచ్చాం సంతోషించు అంటూన్న కూతురి మాటలు వరలక్షమ్మకు కటువుగాతోచినా నిజమేలే అనుకోక తప్పలేదు.. పక్కనే సూట్ కేస్ లో బట్టలు సర్దుకుంటున్న అల్లుడు మాత్రం అదికాదత్తయ్యగారూ వుద్యోగాలగోలకదా శెలవు దొరక్క ఇలా.. అయినా మీరు మామయ్యగారూ మాతో వచ్చేయండి హాయిగా అంటూంటే వరలక్షమ్మ మనసుకి కాస్త ఊరట కలిగింది. ఈ సంభాషణంతా వింటున్న వరలక్షమ్మ కోడలు ఏమనుకున్నదోఏమో ఆ వాళ్ళు రారు అన్నయ్యగారూ అందుకే మేమెప్పుడూ రమ్మని పిలవం అన్నది మాటల్ని నొక్కుతూ. అవునుబావగారూ వాళ్ళీ దిక్కుమాలినఊరు వదిలిపెట్టరు అంటూ పెళ్ళాంమాటకు శృతి కలిపుతూ చేతులుదులుపేసుకున్నాడు కొడుకు. అసలెప్పుడూ మాటవరసకయినా రమ్మని పిలవకుండా కొడుకూ కోడలూ అంటున్న మాటలు వరలక్షమ్మకు చురుక్కుమనిపిస్తే, గుమ్మంపక్కన పడక కుర్చీలో తలకింద అరిచేతులానించి కళ్ళుమూసుకుని అన్నీ వింటున్న దశరధరామయ్య ఏమీపట్టించుకోలేదుగానీ కొడుకు దిక్కుమాలిన ఊరన్న మాట ఆయన గుండెల్లో గునపంలా గుచ్చుకుంది. ఆబాధను తమాయించుకుంటూ చివుక్కున పడకకుర్చీలోంచి లేచి... వరా... ఇప్పుడేవస్తా అంటూ విసవిసా బయటికి నడిచాడు. ఏభైసంవత్సరాలుగా భర్తగుండెలో గూడుకట్టుకుని కూర్చున్న వరలక్షమ్మకు ఇట్టే అర్ధమయింది దశరధరామయ్య వెళ్ళింది మిఠాయికొట్టు నరసయ్యతాత దగ్గరకని. నిష్కల్మషహృదయంతో ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే నర్సయ్యతాతతో కాసేపు మాటలుమార్చుకుంటే ఏవరికైనా మనసు ప్రశాంతంగా వుంటుంది.



నరసయ్యతాతకు తొంభై సంవత్సరాలు దాటుంటాయి. ఈనాటికీ తనపని తానే చేసుకుంటూ మిఠాయిషాపులో కొడుకులకు సలహాలిస్తూ, మంచి ఆథ్యాత్మిక చింతన కూడాతోడైనవాడవడంవల్ల అక్కడేకూర్చుని భారతభాగవతాలు చదువుకుంటూ దశరధరామయ్యలాటివాళ్ళు వస్తే వాళ్ళతో ఆ విషయాలుపంచుకుంటూ హాయిగా వినాదైన్యేనజీవితం గడుపుతున్నాడు. వీటన్నిటి నడుమ నరసయ్యతాత ఈనాటిదాకా వదిలిపెట్టంది బెల్లంబూందీ తయారీ. దానికి మాత్రం పిల్లలు నీకెందుకునాన్నా శ్రమ చేసినన్నాళ్ళు చేశావుగా అంటున్నా వినకుండా ఆ పాకానికీ నాకూవున్న పాశం మీకుతెలియదర్రా అయినా యింకా ఓపికైతే వుందిగా అంటూ బూందీ భాండీముందు కూర్చోవల్సిందే. మరి మూడునాలుగు తరాలవాళ్ళకి బెల్లంబూందీ తీపిదనాన్ని రుచి చూపించిన ఘనతాయెను నర్సయ్యతాతది.



అప్పుడే తయారైన బెల్లంబూందీని బుట్టల్లో సర్దుతూండగా వరలక్షమ్మ ఊహించినట్టే అక్కడికొచ్చాడు దశరధరామయ్య. ఆయన్ని చూడగానే రండిరండి పంతులుగారూ పిల్లలొచ్చారటగా. అంతాబాగున్నారా అంటూ ఆప్యాయంగా అడుగుతున్న నర్సయ్యతాతవంకచూస్తూ బాగానే వున్నారుకానీ, నర్సయ్యా నన్ను గారూ అనకుస్వామీ అన్నాడు రెండుచేతులూజోడించి. ఇంకానయం చదువుకున్నవారు, చదువుకు మించిన సంస్కారవంతులు మిమ్మల్ని ఏకవచనసంభోదనమా తప్పుకదూ అంటూ ఏమిటి బెల్లంబూందీ వేడిగా వుంది పిల్లలకివ్వండి ఊరికితీసుకెళ్తారు అంటూ దశరధరామయ్య సమాధానానికెదురుచూడకుండానే రెండు పెద్దపొట్లాలు కట్టి చేతిలో పెట్టాడు. నర్సయ్య ఆప్యాయతకు నవ్వుతూ జేబులోనుంచి డబ్బులుతీస్తుంటే ... ఆఁఆఁ వుంచండి వుంచండి మీనాన్నగారి కాలంనుంచీ మీ డబ్బులు తీసుకుంటూనేవున్నా పిల్లలు మళ్ళీ ఎన్నాల్టికొస్తారో ఇది వాళ్ళకి నా బహుమానం అంటూన్న నర్సయ్యతాత అభిమానానికి దశరధరామయ్య కళ్ళు చెమర్చాయి. ఎంతచెప్పినా ఆరోజు డబ్బులు తీసుకోడానికి వొప్పుకోలేదు నర్సయ్యతాత.



సర్దుకోవడాలుముగించి పిల్లలు తయారయివున్నారు. ఇక నాలుగుమెతుకులునోట్లోవేసుకుని బయలుదేరడమే. భర్త కోసం ఎదురుచూస్తున్న వరలక్షమ్మకు చేతుల్లో బూందీ పొట్లాలతో వస్తున్న దశరధరామయ్య కనుపించాడు. అనుకున్నా నర్సయ్యతాత దగ్గరికెళ్ళుంటారని.

రండి రండి మీకోసమే ఎదురుచూపులు ఇంకా భోజనాలు చెయ్యాలి, అన్నట్టు బండి సుబ్బడికి చెప్పారా సమయానికి రమ్మని వరుసగా ప్రశ్నల వర్షంతో ముంచెత్తింది భర్తని. 
అబ్బా అన్నీ అయినాయిగానీ ఆ పిల్లకూనల్ని ఇటురమ్మను నర్సయ్యతాత బుల్లంబూందీ కాస్త నోట్లో వేస్తాను అంటూరెండు చిన్న గడ్డలు తుంచి తీసి ఇదిగో ఇవి పిల్లల చేతికియ్యి రైల్లో నములుతారు అంటూ భార్యచేతికి పొట్లాలందించాడు.


మనుమడు మనుమరాలు పరుగెత్తుకొచ్చి తాతయ్యా అంటూ నోరుతెరవగానే ఆచిన్నబూందీ ముక్కల్ని పిల్లల నోట్లో వెయ్యబోతుంటే .,. మామయ్యగారు ఆ బజారు వంటకాలు పిల్లలకి పెట్టకండి. అన్నిట్లో బ్యాక్టీరియా వుంటుంది . చాలా అనారోగ్యం అంటూ దాదాపు శాసించినట్లు చెబుతున్న కోడలివైపు ఆ అమ్మాయి అలా అంటున్నా పదిహేనేళ్ళు నర్సయ్యతాతబూందీ తెగతిని ఉలుకూ పలుకూ లేకుండానించున్న కొడుకువైపు నిర్ఘాంతంగా చూస్తూంటే చేతిలోని బెల్లంబూందీ ముక్కలు జారిపోయాయ్. కోడలు నర్సయ్యతాతను తిడుతున్నట్లనిపించింది, అంతలో తేరుకుని అవునమ్మా ఆబూందీలోవున్నదంతా బ్యాక్టీరియానే. కానీ అది మనుషుల ఆరోగ్యాన్ని పాడుచేసేదికాదు, కణం కణంలో ప్రేమాభిమానాలు నింపుకుని అనురాగంఆప్యాయతల విలువలను రుచి చూపించే బ్యాక్టీరియా అది. మీడీఫ్రిజ్ల్లోని చల్ల దనంకంటే చల్లగా వుండే మనసులతో తయారుచేసినది అది, ఇదిగో అరవై ఏళ్ళుగా తింటూ ఇదిగో ఇలా ఉక్కు శరీరాలతో తిరుగుతున్నామే అదీ ఆ బెల్లంబూందీలోని బ్యాక్టీరియా లక్షణం. తెచ్చి పెట్టుకున్న కుహనా గాంభీర్యమో మరేమైనా భయమో మీ ఆయన్ని పెదవి విప్పనీయడంలేదు కానీ ఆసంగతి వాడికీ తెలుసు. ఇక అదిగో మీ ఆడబడుచు మీరేదో అంటారే అదేమిటది ఆ అదే కార్పొరేట్ కల్చర్ అది దానికి రెండేళ్ళలోపే బాగా తలకెక్కి, ఆబెల్లంబూందీ ఒక్కరోజు తేవడంమర్చిపోతే కిందపడి దొర్లి మారాంచేసిన విషయం మర్చిపోయి అలానోరుతెరవకుండా నుంచుంది. అయినా ఒక్కమాట తినేతిండికంటే నిష్కల్మషమైన మనస్సులే మన ఆరోగ్యంపైనా అనారోగ్యం పైనా తమ ప్రభావం చూపిస్తాయ్. రోడ్డుపక్కన మండుటెండలో పనిచేస్తూ గొడ్డుకారంలో ఉల్లిపాయనంచుకుంటూ గంజితాగుతూ బతికే మనిషి ఆరోగ్యానికి కారణం వాడి మనుగడ. మందులకంటే మమతానురాగాలు ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. తినేఆహారంకన్నా అందించే ఆప్యాయతలు ఎక్కువ ఆరోగ్యాన్నిస్తాయి. పిల్లల్ని తినొద్దన్న ఈ బెల్లంబూందీ తీపిదనంలో ఆరోగ్యాన్ని సంరక్షించే అవన్నీ వున్నాయని నా అరవైదేళ్ళ అనుభవం చెబుతోంది. అంతగా ఎప్పుడూ మాట్లాడని దశరధరామయ్యని చూస్తూ అందరూ అవాక్కయ్యారు. దశరధరామయ్య అల్లుడు ఆయన రెండుచేతులూ పట్టుకుని మామయ్యగారూ నిజమైన రుచులు తెలియక పోవడంతో ఇలా వస్తాయి. చూడండి రైలు కదిలిన మరుక్షణం బెల్లంబూంది పొట్లాం ఖాళీచేసేస్తాం అంటూ ఆయన ఆవేశానికి చెలియలికట్టయినాడు.



మరి రైల్లో ఆ బెల్లంబూందీ వాళ్ళు తిన్నారో లేక వాళ్ళకు తెలిసిన బ్యాక్టీరియా భయంతో అవతల పారేశారో తెలియదుగానీ ... ఆ తరువాత కొన్నేళ్ళకు దశరధరామయ్యగారి పిల్లలు ఆవూళ్ళో ఆస్తులన్నీ అమ్ముకుని పంచుకోడానికి వచ్చినప్పుడు.. నర్సయ్యతాత లేడు, ధశరధరామయ్యలేడు. వరలక్షమ్మాలేదు. బెల్లంబూందీలేదు. నిజంచెప్పాలంటే పెరిగిపోయిన ఆవూళ్ళో అసలు ఇదివరకటి తియ్యందనమేలేదు.



మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

ధన్యవాదాలు,
శుభదినం.







అడిగిన సుఖము ఇవ్వననిన    

మిడిమేలపు వనిత కొలిచిన   
వడిగల మహిమలు తలచిన    
మడి దున్నకయు మౌనమే మ్రొక్కిన        


అల్లుని మంచి తనం ఎంతవరకు 

గొల్ల సాహిత్య విద్య ఎంత వరకు 
బొల్లున దంచే బియ్యం ఎంతవరకు 
తెల్లవి నల్లగా మారేంత వరకు 


ఇచ్చునదే విద్య సమస్త లోకంబు 

ముచ్చునదే నీవు చేసిన ధర్మంబు  
జొచ్చునదే నిత్యం మనో నిగ్రహంబు
వచ్చునదే సుఖాల వాద కుటుంబు  


ఎప్పటి కయ్యెది అప్పుడే చేసియు

అప్పటి కప్పుడు మాటలు మెచ్చియు  
నొప్పింపక కధలు గొప్ప చెప్పియు 
తప్పించుక తిర్గేవాడు సంతోషియు 


ఎప్పుడు సంపద నిలకడగా ఉన్నా  

అప్పుడు బంధువులు వచ్చేడి రన్నా
దెప్పలుగ చెరువంతా నిండి ఉన్నా
కప్పలు పదివేలు చేరుట రన్నా 


నమ్మకు జూదరి సుంకరి పోకిరి  

నమ్మకు అంగడి మాటల వైఖిరి 
నమ్మకు వెలయాలి సొగసు సిరి
నమ్మకు వామహస్తపు దెబ్బ మరి


కూరిమి గల దినములు సంతసం 

నేరము లెన్ని చేసిననూ సంబరం
కూరిమియు విరసంబైన విషాదం
నేరములే తోచు చుండు ప్రతి నిత్యం 


      

సముద్రం
------- 
దేవతలూ దయ్యాలూ 
దాన్ని సరళీకృతం చేయక ముందే 
నేను సముద్రాన్ని చూసాను


ధ్రువ జలాంతర్గామి 

జ్వాలా కాంతిలో నేను నీటిని చూసాను 
నీరూ నిప్పూ ఒకటే 
కాలిపోవడమూ 
తడిసి పోవడమూ 
రెండూ ఒకటే


నేను సముద్రాన్నుంచి ఉద్భవించినప్పుడు 

నా చేతుల్లో ముత్యాలు లేవు 
నేను లో ఈతగాన్ని కాను


నేనో కవిని 

అక్కడ ఉన్నదేదో 
నా కళ్ళల్లో వుంది 
-----
గుజరాతీ : సితాంశు యశస్ చంద్ర 
ఇంగ్లీష్:సలీమ్పీరడిన రసిక్ షా, పరీక్, గులాం మొహమ్మద్ షేఖ్ 
తెలుగు: వారాల ఆనంద్ 
------ 
సితాంశు యశస్ చంద్ర 1941 లో గుజరాత్ లోని భిజ్ జిల్లాలో జన్మించారు। మూడు కవితా సంకలనాలు వెలువరించారు। పది నాటికలు, మూడు విమర్శ పుస్తకాలు వెలువడ్డాయి। పద్మశ్రీ, కబీర్ సన్మాన్, సాహిత్య అకాడెమి అవార్డుల్ని అందుకున్నారు
ఇరుగు పొరుగు (అనువాద కవిత్వం)
ప్రతి శుక్రవారం 
----------------------------- 
రాజస్తానీ కవిత 
------------------------------- 
సరే మనమెందుకు ఇలా 
---------------- 
సరే 
మనమెందుకింత 
దగ్గ్గరగా నిలబడ్డాము పాముల్లాగా 
ఎలుక రంద్రాలే మనకు సరైన నివాసాలు


ఇది నగరం 

ఇక్కడ రహదారి అంతం లేకుండా 
ప్రవహిస్తుంది 
ఎక్కడ చూసినా 
గుంపులుగా జనం


మనమంతా వట్టి అస్థిరం గాళ్ళం 

ఏ నిర్దాక్షిన్యమయిన 
కాలి మడమల కింద నలిగిపోతామో


మనం కలిసికట్టుగా 

అప్రమత్తంగా కూడా వుండాలి 
గుంపులుగా విడిపోకూడదు


మన నోళ్ళల్లో విషమేదయినా వుంటే 

బయటకు ఉమ్మేయద్దు 
ఎప్పుడయినా సంచీ నిండి దురదపెడితే 
రాళ్ళనయినా కరకరా నమలాలి లేదా 
నేలపై పడుకొని మనకు మనమే 
గట్టిగా ధైర్యం చెప్పుకోవాలి


సరే 

మనమెందుకింత దగ్గరగా 
నిలబడ్డాము పాముల్లాగా 
ఎలుక రంద్రాలే మనకు సరయిన స్తలాలు 
--------------- 
రాజస్తానీ మూలం : మోహన్ అలోక్ 
ఇంగ్లీష్: ఐ।కె।శర్మ 
తెలుగు: వారాల ఆనంద్ 
------------------- 
మోహన్ అలోక్ 1942 లో పుట్టారు। నాలుగు కవితా సంకలనాలు వెలువరించారు,ఐత్వారీ పత్రిక లో కవిత్వ కాలం వెలువరించారు ప్రిత్వీరాజ్ రాథోడ్ స్మారక పురస్కారం, రాజస్తానీ సాహిత్య అకాడెమి అవార్డు, 1983 లో కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు అందుకున్నారు


Venkata Ramakrishana Mallapragada 

UI UII UI UII - UI UII UIU


రామ లీలలు, కృష్ణ లీలలు  - ప్రేమ లీలల భావమే  

సామ దానము బేధ భావము - నిత్య సాయము లక్ష్యమే 
దండ నీతియు  ప్రేమ నీతియు - సత్య సాదర మార్గమే
మంచి పంచియు కీడు తుంచియు - ధర్మ మార్గపు భావ్యమే 
    
నిత్య సత్యము, నిర్మ లత్వము - కాల మాయకు చిక్కుటే  
ధర్మ భావము,  నీతి లక్ష్యము - వెల్గు నీడకు చిక్కుటే 
స్నేహ దేహము, ప్రేమ దేహము - కొద్ది దూరము చిక్కుటే     




విద్యా కకార రూపవతివమ్మా 

సమస్త కళ్యాణ రూపిణివమ్మా 
గుణాల నిర్ణయ సుశీలవమ్మా 
నేను వ్రాయుట నీ లక్ష్యమేనమ్మా


భక్తిని పంచేటి జననివమ్మా 

త్రిమూర్తి కళా స్వరూపిణివమ్మా  
కమల నయన భవానివమ్మా        
నేను వ్రాయుట నీ లక్ష్యమేనమ్మా


పాపాన్ని భరించే కల్మషివమ్మా 

కరుణామృత పరాంబికవమ్మా 
లత లందించిన లలితవమ్మా 
నేను వ్రాయుట నీ లక్ష్యమేనమ్మా


కదంబ వృక్షాల నివాసివమ్మా  

పంచాక్షరీ మంత్రం నందించావమ్మా 
మన్మధభాణం సంధించవమ్మా 
నేను వ్రాయుట నీ లక్ష్యమేనమ్మా

                               ఇంకా ఉంది 



మతం వటవృక్షం లాంటిదాన్నావమ్మా  



చిరునవ్వుల చిద్విలాసి   

చిరునామా తెల్పవా
మరిచావా  ప్రేమపిపాసి  
విధిరాత మార్చవా 
జాబిల్లివంటి వెన్నెలమ్మా 


ఆపేక్షతో అక్షయపాత్ర 



చిరునవ్వుల చిద్విలాసి   

చిరునామా తెల్పవా
మరిచావా  ప్రేమపిపాసి  
విధిరాత తెల్పవా 


కల్పలతల సహవాసి 

ప్రేమత్వము తెల్పవా  
ప్రాణాలర్పించే స్నేహవాసి 
శుభమస్తు తెల్పవా 


లయస్వభావం గల వాసి  

లాలిత్వము తెల్పవా 
లబ్దిప్రభావం వర వాసి  
సుఖమును తెల్పవా 


అతడే రక్షకుడందరికతడే

పతియుండగ భయపడచోటేది॥


అనంతకరము లనంతాయుధము

లనంతుడు ధరిం చలరగను
కనుగొని శరణాగతులకు మనకును
పనివడి యిక భయపడ చోటేది


ధరణి నభయహస్తముతో నెప్పుడు 

హరి రక్షకుడై అలరగను
నరహరి కరుణే నమ్మిన వారికి 
పరదున నిక భయపడ చోటేది


శ్రీ వేంకటమున జీవుల గాచుచు

ఆవల నీవల నలరగను
దైవ శిఖామణి దాపగు మాకును
భావింపగ భయపడ చోటేది
అతడే రక్షకుడందరికతడే ।।।



జాబిల్లి  ఉంటే వెన్నెల పంటయే  

పుడమి ఉంటే ప్రాణుల పంటయే 
సంస్కారం ఉంటే దాపత్యం పంటయే 


దాతృత్వం ఉంటే విద్యల పంటయే 

అర్చన ఉంటే ధనము పంటయే   
ధనము ఉంటే చుట్టాల పంటయే 


మహిళ ఉంటే సంతృప్తి పంటయే 

హితము ఉంటే మగని పంటయే
ఇష్టము ఉంటే అందరి పంటయే 
   
చెప్పేది నీతి ఒప్పేది భేద నీతి దూరేది గుడిసె  
ప్రవచనాల జెప్పు పరమసాధువయిన 
ధర్మమార్గమేను తాను విడువు
మనసు గెలవ లేక మర్మజ్ఞుడెట్లగు?
నందిపాటి నోట నరుల మాట!


గొప్పగా బ్రతకాలని సంకల్పించు।।।

నీ ప్రేమని పొందాలంటే కూడా
ఓ అర్హత ఉండాలని గుర్తించు


పైకి బలంగా కనపడే కండల్లో ఏముంది।।।?

ఉత్తేజమై ఒంట్లో తిరిగే కణ కణంలోనూ 
నిక్షిప్తమై ఉంది నీ ప్రాణం


కింద పడేసే సమస్యల్లో ఏముంది।।।?

తలబడి నిలబడగననే నీ నమ్మకంలోనే
ఉంది అసలైన జీవితం


లే।।।।

భూమిని చీల్చుతూ విత్తెలా మెలకెత్తుతుందో చూడు 
అంతా ఐపోయిందనే నీ నిరాశా భావాలను విడిచి 
కొత్త ఆశల ఆరంభాల వైపు అడుగిడు


ఒప్పుకుంటాను।।।।

కొన్ని బాధలు గుండెలని పిండేస్తాయనీ।।।।
ఎముకలని విరిచేస్తాయనీ।।।
కానీ।।।నీకు తెలుసా।।।।?
కొన్ని నమ్మకాలు ఆగిన గుండెలని కూడా ఆడిస్తాయి
విరిగిన ఎముకలని కూడా అతికిస్తాయని


తెలుసుకో।।।।

జీవితంలో పడని వాడే లేడు
పడకపోతే వాడు మనిషే కాడు
పడినా పైకి రాకుండానూ లేడు।।।


నీ నరాల వేగాన్ని తెలుసుకో।।।

చిక్కటి నీ నెత్తుటి వేడిని గుర్తుంచుకో।।।


లే।।।।।

అవసరం లేదని విసిరేసిన వాళ్ళే విస్తుపోయోలా।।।
పడగొట్టిన వాళ్ళ ముందే తలెత్తుకు నిలబడు
కాదనుకుంటే తనెంత ।।।।నీ చెప్పుకంటిన దుమ్మంత


నీకే చెప్పేది అర్థమౌతుందా।।।।????

నీ నీడ కూడా నువ్వు వెలుగులో
ఉన్నప్పుడే నీ తోడుగా ఉంటుంది
మరి నువ్వు చీకట్లో ఉన్నప్పుడు నమ్మిన వాళ్ళెలా 
తోడుగా ఉంటారనుకుంటున్నావ్।।????


పిచ్చి మాలోకం।।।।

ఈ నిశీధి నీడల్లో ఎన్నాళ్ళిలా 
ఒంటరిగా నిలబడతావ్।।।
నమ్మి మోసపోయాననో।।।।నమ్మించి మోసం చేసారనో
ఆలోచిస్తూ కూర్చోకు
నీ సమయాన్ని వృధా చేసుకోకు


సీతాకోక చిలుకను కూడా గొంగళి పురుగులా ఉన్నప్పుడు అందరూ అసహ్యించుకుంటారు

జరిగిపోయిన దాన్నే ఆలోచిస్తూ।।।
గొంగళి పురుగులాగానే మిగిలిపోతావో।।।।
ఆశల రంగులద్ది।। కొత్త ఆలోచన
సీతాకోక చిలుకలా వెలిగిపోతావో।।।తేల్చుకో।।।
నీ జీవితాన్ని నువ్వే మార్చుకో
 పేస్        

     
--((**))--
వాట్సప్ లో వచ్చిన మంచి కథ మన కోసం...
ఇద్దరు వ్యక్తులు కాలక్షేపానికి ఊర్లోఉన్న గుడి దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.
అప్పటికి కాస్త చీకటి పడుతోంది. కొంచెం మబ్బుకూడా పట్టింది. ఇంతలో అక్కడికి మరో వ్యక్తి వచ్చాడు. మీఇద్దరితో పాటు నేను మీతో కూర్చోవచ్చా అని అడిగాడు.
అందుకు ఆ ఇద్దరు అదేం భాగ్యం ఈ చోటు మాదికాదు, మేము కూడా కాలక్షేపానికే కూర్చున్నాం నువ్వు కూడా కూర్చోమన్నారు. ముగ్గురు కూర్చుని కబుర్లలో పడ్డారు.

ఇంతలో గాలి వాన మొదలయ్యింది.
వాళ్లు ఇక అక్కడ నుంచి వెళ్లిపోలేకపోయారు.
ఇంతలో మూడో వ్యక్తికి ఆకలేసింది. అదే విషయం మిగిలిన ఇద్దరితో చెప్పాడు. మేము కూడా అదే ఆలోచిస్తున్నాం అతడి దగ్గర మూడు నాదగ్గర ఐదు రొట్టెలున్నాయి ఇవే అందరం పంచుకొని తిందాం అని రెండో వ్యక్తి అన్నాడు.
కానీ ఎనిమిది రొట్టెలను మగ్గురు సమానంగా పంచుకోవడం ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది.
అందుకు మూడో వ్యక్తి ఒక ఉపాయం చెప్పాడు. మొత్తం ఎనిమిది రొట్టెలను మూడు మూడు ముక్కలుగా చేద్దాం అప్పుడు వచ్చిన ఇరవైనాలుగు ముక్కలను ముగ్గురం సమానంగా తిందాం అని అంటాడు.
అది అందరికి సబబుగా తోచి ఎనిమిది రొట్టెలను మూడు మూడు ముక్కలుగా చేసి తలా ఎనిమిది ముక్కలు తిని ఆకలి తీర్చుకొని నిద్రపోతారు.
తెల్లవారి లేచిన తర్వాత మూడో వ్యక్తి వెళ్లిపోబోతూ మీరు రాత్రి నాకు తోడుగా ఉండటమే కాకుండా నాకు మీ రొట్టెలు పెట్టి ఆకలి కూడా తీర్చారు. మీకు చాలా కృతజ్ఞతలు.
నా దగ్గరున్న ఎనిమిది బంగారు నాణాలు మీకు ఇస్తాను. మీరిద్దరూ తీసుకోండి అని చెప్పి ఎనిమిది బంగారు నాణాలు ఇచ్చి వెళ్లిపోతాడు. అతడు వెళ్లిపోయాక మొదటి వ్యక్తి నా నాలుగు బంగారు నాణాలు నాకిస్తే నేను వెళ్లిపోతాను అంటాడు రెండో వాడితో.
అయితే రెండో వ్యక్తి నీవి మూడు రొట్టెలే నావి ఐదు రొట్టెలు కాబట్టి లెక్క ప్రకారం నాకు ఐదు బంగారు నాణాలు, నీకు మూడు బంగారు నాణాలు చెందుతాయి అని అంటాడు. ఇలా వీళ్లిద్దరి మధ్య వివాదం మొదలవుతుంది.
ఈ చిక్కు తీర్చుకోడానికి ఇద్దరు రచ్చబండకెక్కుతారు. అక్కడ న్యాయాధికారి మొత్తం కథ విని బంగారు నాణాలు తన దగ్గర పెట్టమని చెప్పి తీర్పు తెల్లవారికి వాయిదా వేస్తాడు.
రాత్రి పడుకున్న తర్వాత న్యాయాధికారి కలలో దేవుడు కనిపించి ఏం తీర్పు చెప్పబోతున్నావని అడుగుతాడు. నాకు రెండో వాడు చెబుతున్నదే న్యాయంగా తోస్తున్నది అని అంటాడు.
అందుకు దేవుడు నవ్వేసి నువ్వు కథ సరిగా విన్నావా అని అడిగి మూడు రొట్టెలు ఇచ్చిన వాడికి న్యాయంగా ఒక్క బంగారు నాణెం మాత్రమే ఇవ్వాలి అని అంటాడు. న్యాయాధికారి అదెలా అని అడుగుతాడు. ఎలాంగంటే మొదటి వాడి దగ్గర ఉన్నవి మూడు రొట్టెలు వాటిని అతడు 9 ముక్కలు చేశాడు. రెండో వాడి దగ్గర ఉన్నవి ఐదు రొట్టెలు వాటిని అతడు 15 ముక్కలు చేశాడు.
అయితే మొదటి వాడు వాడి రొట్టెల్లోని 9 ముక్కల్లో 8 అతడే తినేశాడు. కానీ రెండో వాడు తన 15 ముక్కల్లో 7 ముక్కలు మూడో వాడికి పెట్టాడు.
కాబట్టి ఏడు నాణాలు రెండో వాడికి చెందాలి ఇదే నాలెక్క, ఇదే న్యాయం కూడా అని తేల్చేశాడు. తెల్లవారి న్యాయాధికారి ఇదే తీర్పు చెప్పాడు. అది విని మొదటి వాడు ఇతడే నయం 3 నాణాలు ఇస్తానన్నాడు మీరు ఒక్కటే ఇస్తున్నారు అని వాపోయాడు.
అది విని న్యాయాధికారి అతడికి ఒకటే ఎలా చెందుతుందో వివరించాడు. దీన్ని బట్టి అర్థం అయ్యిందేమిటంటే మనం వేసుకునే లెక్కలు వేరు, దేవుడి లెక్కలు వేరు.
మనదగ్గర ఉన్నదాంట్లో మనం ఎంత ఇతరులతో పంచుకోగలుగుతున్నమన్నదే దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. 30 కోట్లు ఉన్నవాడు 3 లక్షలు దానం చెయ్యడం గొప్పగా దేవుడు పరిగణించడు, 3 వేలు ఉన్నవాడు 300 దానం చెయ్యడాన్నే గొప్పగా భావిస్తాడు. పుణ్యంగా జమకడతాడు.
దేవుడి దృష్టిలో మనకెంత ఉంది అన్నది కాదు మనం ఎంత దానం చేశాం అనేదానికే విలువ.
కాదంటారా...???





ప్రాంజలి ప్రభ (చిన్న కధ -5) 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
  
ఒక స్వామి నిరాశతో నది ఒడ్డుకు వెళ్లి, నీటి యందు తన ప్రేతి బింబమును చూస్తూ ఉన్నాడు అప్పడే ఒక వృద్ధుడు వచ్చి స్వామి ఏమయినది నీటిలో ప్రతిబింబమును చూచుట తప్పు కాదా అని తెల్పాడు, తప్పు అని తెలుసు ఆత్మహత్య చేసుకోవాలని నా మొఖం చూసుకున్నాను అన్నాడు. ఎందుకు అంత బాధ పడుతున్నావు, కష్టమేమొచ్చింది అని అడిగాడు.
ఎంచెప్పాలి తాతగారు టి.వి., ఫేస్ బుక్కులు, ట్విట్టర్లు, వాట్సప్ లు వచ్చాక ప్రతి ఒక్కరు జ్ఞానబోధ చేస్తున్నారు, మా అవసరం లేకుండా పోయింది. ఇంతకూ మీరెవరు అన్నాడు స్వామి. 
నాపేరు ఆత్మ బంధువు, "స్వామీజీలు ఎమన్నా తక్కువ తిన్నారా, ఆత్మారాముని మరచి మధ్యన పుట్టుకొచ్చిన బాబాల వెంట బడుతున్నారు, డబ్బుకోసం జ్ఞాన్నాన్ని అమ్ము కుంటున్నారు", ఒక దేవుణ్ణే పూజించకుండా అనేక దేవుళ్ళని పూజిస్తున్నారు, దేనిలో ఎవరు ఏది చెపితే దానిని  నమ్ము తున్నారు, నీలో జ్ఞానం ఉన్న బోధ చేసే తెలివి ఉన్నా అహం, ఈర్ష్య, పెరిగింది. దాన్ని మార్చకోలేక పోతున్నావు ఈ శ్లోకంఒక్క సారి విను నీకె అర్ధం అవుతుంది అన్నాడు ఆత్మ బంధువు.                     

శ్లో === న లంఘయే ద్వత్సతశ్రీం నా ప్రదావేచ్చ వర్షతి | 
           నా చోదకే నిరిక్షేట స్వం రూప మితి ధారణా || 

భావము === లేగదూడను గట్టిన త్రాడును దాటరాదు. వానకురుస్తుండగా పరుగేత్తరాదు .  నీటి యందు తన ప్రతి బింబమును చుసుకోనరాదు . ఇది అన్నియు తప్పక జ్ఞాపక ముంచు కొనవలెను.

ఆత్మబంధువు నమో నమ:  అన్నాడు నేను లేగదూడను కట్టిన త్రాడును దాటాను, డబ్బు కోసమ్ వాన కురుస్తున్న పరుగెత్తాను, నన్ను క్షమించు ఆత్మ బంధువు అని కళ్ళు మూసుకున్నాడు. అంతే   వచ్చిన తాతగారు అంతర్ధాన మయ్యారు. నా తప్పు తెలిసింది ఎన్ని అవాంతరాలు వచ్చిన  
ఎన్ని ఆధునిక యంత్రములు వచ్చిన, మేధస్సుతో చెప్పే ఆత్మ జ్ఞానమునకు మించినది లేదు. 
నమో నమో ఆత్మబంధువు , నమో నమో అని దేవాలయము చేరాడు, డబ్బును ఆశించక బోధ  చేయుటకు. 



--((**))--

కొత్తసంవత్సరం కానుక*
అనువాదం... శ్రీ అరిపిరాల సత్య ప్రసాద్ గారు.



జాక్ దె రాండల్ ఒంటరిగా భోజనం ముగించాడు. బయటికి వెళ్ళాలనుకుంటే వెళ్ళమని కారు డ్రైవర్ కి చెప్పాడు. ఆ తరువాత కొన్ని వుత్తరాలు రాయాలన్న ఆలోచన రావడంతో తన టేబుల్ దగ్గర కూర్చున్నాడు.

అతను ప్రతి సంవత్సరంలోని ఆఖరు రోజున ఇలాగే రాసుకుంటూ, కలలు కంటూ గడుపుతుంటాడు. నిర్జీవమైపోయిన గత సంవత్సరం మొత్తాన్ని ఓసారి సింహావలోకనం చేసుకుంటాడు. ఆ జ్ఞాపకాలలో కనిపించిన మిత్రులకు కొన్ని వాక్యాలు రాయడం అతని అలవాటు. ఆ వుత్తరాలని మర్నాడు కొత్త సంవత్సం రోజున వాళ్ళకి అందించేవాడు.

ఇప్పుడు కూడా అలాగే చేద్దామని టేబుల్ ముందు కూర్చోని, సొరుగును బయటకు లాగి, అందులోనుంచి ఓ స్త్రీ ఫొటో బయటికి తీశాడు. ఆ ఫొటో వైపే కొద్ది క్షణాలు చూపు నిలిపి ఆపైన దానికి ముద్దుపెట్టాడు. దాన్ని అక్కడే వున్న పేపర్ల దొంతర పక్కన పెట్టి రాయటం ఆరంభించాడు.
"ప్రియమైన ఐరీన్: నేను మీ పనెమ్మాయి పేరు మీద పంపిన చిరు కానుక ఈ పాటికి నీకు అందే వుంటుంది. నీతో ఓ విషయం చెప్పాలని తలుపులన్నీ బంధించుకోని కూర్చున్నాను.."
ఆ తరువాత రాయడానికి అతని కలం నిరాకరించింది. జాక్యుయస్ లేచి గదిలో అటూ ఇటూ పచార్లు చేయడం మొదలుపెట్టాడు.
గత పది నెలలుగా అతని మనసుని ఓ ప్రియురాలు ఆక్రమించింది. నాటకప్రదర్శనకు తోడుగా వస్తూ, ఏదో కాలక్షేపం కబుర్లు చెప్తూ వుండే అందరమ్మాయిల్లాంటి అమ్మాయి కాదు. అతను ప్రేమించి సాధించుకున్న అమ్మాయి. నిజానికి అతనేమీ కుర్రవాడు కాదు. వయసుకూడా ఏం మించిపోలేదు. జీవితాన్ని కేవలం ఆశావాదంతోనే కాకుండా కొంత వాస్తవికంగా కూడా చూడగలిగిన వయసు అతనిది.
అందుచేత, ప్రతి సంవత్సరం చివర్లో అతను, తన జీవితంలోకి వచ్చిన ప్రేమలకీ, కొత్తగా కలిసిన స్నేహాలకీ, ముగిసిపోయిన బంధాలకీ, అలాంటి పరిస్థితులకీ అన్నింటికీ కలిపి ఒక బాలన్స్ షీట్ లాంటి బేరీజు పట్టిక వేసుకుంటాడు.
ఆ క్రమంలో తన ప్రియురాలి మీద వున్న ప్రేమ తాలూకు ఉద్రేకం కాస్త చల్లబడ్డాక, ఈ ప్రేమ ఎక్కడికి దారితీస్తుందో అని అతని మనసు శంకించింది. తులాలతో తూకం వేసే వ్యాపారిలా ఆమె పట్ల అతని మనసులో వున్న భావనలనీ, ఆమెతో అతని భవిష్యత్తు గురించి క్షుణ్ణంగా అంచనా వేయడం మొదలుపెట్టాడు.
ఆ ప్రయత్నంలో అతని మనసులో వున్న బలమైన భావాన్ని అతను గుర్తించాడు. అతి సున్నితమైన భావాలు నిండిన బలమైన అనుబంధమేదో అప్పటికే పుట్టిందన్న సంగతి గమనించాడు.
ఉన్నట్టుండి మోగిన కాలింగ్ బెల్ అతణ్ణి ఉలిక్కిపడేలా చేసింది. తలుపు తీయాలా వద్దా అని కాస్త తర్జనభర్జన పడ్డాడు. కొత్త సంవత్సరం ముందురోజు ఏ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తలుపుకొట్టినా తప్పకుండా తీయాలని తనకి తానే నచ్చజెప్పుకున్నాడు.
చేతిలో కొవ్వొత్తి పట్టుకోని ముందుగది దాటుకోని తలుపుల బోల్టు తెరిచి, నాబ్ తిప్పి, వెనక్కి తెరిచాడు. ఎదురుగా అతని ప్రియురాలు. జీవం లేనిదానిలా పాలిపోయిన ముఖంతో గోడకి జారిగిల పడి వుంది.
అతను తడబడ్డాడు.
"ఏంటి? ఏమైంది?"
"ఒక్కడివే వున్నావా?" ఆమె అడిగింది.
"అవును"
"పనివాళ్ళు కూడా లేరా?"
"లేరు"
"నువ్వు బయటికి ఎక్కడికీ వెళ్ళటంలేదా?"
"లేదు"
ఆ ఇంటిని పూర్తిగా తెలిసినదానిలా ఆ అమ్మాయి లోపలికి చొరబడింది. డ్రాయింగ్ రూంలోకి అడుగుపెట్టగానే అక్కడే వున్న సోఫాలో కూలబడి ముఖాన్ని చేతుల్లో దాచేసుకోని గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది.
అతను ఆమె కాళ్ళదగ్గర మోకాళ్ళమీద కూర్చోని ఆమె చేతుల్ని తొలగించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం సఫలమయ్యాక ఆమె ముఖాన్ని చూసి అవాక్కయ్యాడు.
"ఐరీన్..? ఐరీన్ ఏమైంది నీకు? ఎందుకలా ఏడుస్తున్నావు? అసలేం జరిగిందో నాకు చెప్పనిదే వూరుకోను." అన్నాడు.
అప్పుడా అమ్మాయి వెక్కిళ్ళు పెడుతూ చిన్నగా గొణిగింది - "ఇంక ఇలా బతకటం నా వల్ల కాదు"
"ఇలా బతకడం అంటే? ఏం చెప్తున్నావు?"
"అవును ఇలా బతకడం నా వల్ల కదు. చాలా సహించాను. ఈ రోజు మధ్యాన్నం కొట్టాడు"
"ఎవరు? నీ మొగుడా?"
"అవును, నా మొగుడే."
"ఓహ్"
అతను విస్తుపోయాడు. ఆమె భర్త అంత క్రూరంగా ప్రవర్తిస్తాడని అతను కలలో కూడా ఊహించలేదు. ఎలా ఊహిస్తాడు. అతని గురించి వూరందరికీ తెలుసు. బయటికి పెద్దమనిషిలా వుంటాడు, గుర్రాలను ఇష్టపడతాడు, నాటకాల ప్రదర్శనకి తప్పక వెళ్ళేవాడు, కత్తి యుద్ధంలో నిష్ణాణుతుడు... అందరూ అతన్ని అభినందించేవాళ్ళే. మర్యాద కలిగిన ప్రవర్తన, కాస్తో కూస్తో తెలివితేటలు, చదువు అంతగా లేకపోయినా మేధావుల్లా ఆలోచించగల నేర్పు వున్నవాడు. అతని నడత, సంప్రదాయం చూసే అందరూ గౌరవిస్తారు.
బాగా కలిగిన కుటుంబాలలో లాగే అతను కూడా భార్యకి విధేయుడుగానే వున్నటు కనిపించేవాడు. ఆమెకు సంబంధించిన కోరికలు, ఆరోగ్యం, ఆఖరుకు ఆమె బట్టల విషయంలో కూడా అతను ఆందళన ప్రదర్శించేవాడు. అన్నింటినీ మించి ఆమెకు పూర్తి స్వతంత్రం ఇచ్చాడు.
ఐరీన్ స్నేహితుడిగా జాక్ కి పది మందిలో కూడా ఆమె చేతిని పట్టుకునేంత చనువుంది. మర్యాదస్తుడైన ప్రతి భర్త లాగే ఆమె భర్త కూడా దగ్గరి స్నేహితుడు అలా మెలగడంలో తప్పేమీ లేదనే భావించాడు. అయితే జాక్ కొంతకాలం స్నేహితుడిగా వుండి ఆ తరువాత ప్రేమికుడిగా మారాడు. ఆమె భర్తతో కూడా అనుకూలమైన స్నేహాన్ని కొనసాగించాడు.
ఆ ఇంట్లో తుఫాన్ లాంటి వాతావరణం వుందన్న సంగతి జాక్ ఊహించలేదు. అనుకోని కొత్త విషయం తెలిసి విస్తుపోయాడు.
“అసలు ఎలా జరిగింది? చెప్పు” అడిగాడు.
ఆమె చెప్పడం మొదలుపెట్టింది. పెళ్ళైన నాటి నుంఛి ఆమె జీవితంలో జరిగినవన్నీ పూసగుచ్చినట్లు చెప్పింది. తొలిసారి అకారణంగా మొదలైన అభిప్రాయభేదం నుంచి అది క్రమ క్రమంగా పెరుగుతూ పోయి చివరికి రెండు పరస్పర విరుద్ధమైన స్వభావల మధ్య మిగిలిపోయిన విబేధం దాకా అంతా విషయం చెప్పింది.
ఇక ఆ తరువాక జరిగిన కొట్లాటలు, పైకి కనపడకుండా లోపల లోపలే ఏర్పడ్డ అగాధాలు ఇవన్నీ చెప్పింది. ఆ తరువాత ఆమె భర్త గొడవలు పెట్టుకోవడం మొదలుపెట్టాడట. అనుమానించడం మొదలుపెట్టాడట. చివరికి ఆమెను గాయపరచడానికి కూడా వెనుకాడని స్థితికి వచ్చాడు. ఇప్పుడు అతనికి ఈర్ష. జాక్ అంటే ఈర్ష.
ఇలాంటి విషయమై ఈ రోజు జరిగిన ఓ గొడవ తరువాత అతను ఆమెను కొట్టాడు.
“నేను తిరిగి అతని దగ్గరకు వెళ్ళను. నీతోనే వుంటాను. నువ్వు ఏం చేసినా సరే.. అక్కడికి మాత్రం వెళ్ళను” అంది స్థిరంగా.
జాక్ ఆమె ముందు ఇద్దరి మోకాళ్ళు తగిలేలా దగ్గరగా కూర్చున్నాడు. ఆమె చేతుల్ని అందుకున్నాడు –
“మై డియర్... నువ్వు ఎంట పెద్ద తప్పు చేస్తున్నావో తెలుసా? మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం కూడా వుండదు. నువ్వు నీ భర్తని వదిలి వచ్చేయాలనుకుంటే, అందుకు కారణం అతని తప్పు అయ్యుండాలి. అప్పుడు ఒక స్త్రీగా నీకు ఈ ప్రపంచంలో గౌరవం వుంటుంది”
ఆమె అతని వైపు అసహనంగా చూసింది
“అయితే నన్నేం చెయ్యమంటావు చెప్పు?”
“ఇంటికి తిరిగి వెళ్ళిపో... అతని దగ్గర్నుంచి విడాకులు తీసుకునేదాకా సర్దుకోని వుండు. అది నీకు మర్యాదగా వుంటుంది.”
“నువ్వు నాకు పిరికితనాన్ని సలహాగా ఇస్తున్నావు”
“కాదు.. కాదు.. ఇది తెలివైన సలహా. అందరూ ఒప్పుకునే సలహా. నీకంటూ ఓ పరపతి వుంది. పరువు మర్యాదలు వున్నాయి. స్నేహితులు, బంధువులు... వీరందరితో నువ్వు కాపాడుకోవాల్సిన బాంధవ్యం వుంది. ఆలోచన లేని ఒక్క పనితో వీటన్నింటినీ పోగొట్టుకుంటావా? చెప్పు?”
ఆ మాటలు వింటూనే ఆమె కోపంగా లేచి నిలబడింది.
“నో... నా వల్ల కాదు. ఇక భరించలేను! అంతే.. ఇక ఇంతటితో అంతా అయిపోయింది. అంతే!!” అని ఆమె తన చేతుల్ని ఎదురుగా వున్న ప్రేమికుడి భుజాలపైన వేసింది. అతని ముఖంలోకి సూటిగా చూస్తూ – “నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా”
“ప్రేమిస్తున్నాను”
“నిజంగా.. ఒట్టు?”
“ఒట్టు”
“అయితే నేను నీతోనే వుంటాను”
అతను ఆశ్చర్యపోయడు.
“నాతో వుంటావా? ఈ ఇంట్లో? ఇక్కడ? నీకేమైనా పిచ్చి పట్టిందా. అలా చేస్తే ఇక ఎప్పటికీ మనం ఒకటి కాలేము. ఇక నిన్ను జ్ఞాపకలలో నుంచి కూడా తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. పిచ్చిగా మాట్లాడకు!”
ఆమె నెమ్మదిగా, నింపాదిగా, సూటిగా మాట్లాడింది. తను మాట్లాడుతున్న మాటల బరువు తెలిసినదానిలా పలికింది.
“చూడు జాక్, వాడు ఇక నిన్ను చూడటానికి వీల్లేదని చెప్పాడు. ఇలా దొంగచాటుగా వచ్చి నిన్ను కలుసుకోవడం నాకేం నచ్చడంలేదు. నా వల్ల కాదు కూడా. రెండే మార్గాలు – నన్ను అందుకుంటావా? వదులుకుంటావా?”
“అలాగైతే డియర్.. ముందు నువ్వు విడాకులు తీసుకో.. నేను నిన్ను పెళ్ళి చేసుకోడానికి సిద్ధమే.”
“అవును సిద్ధమే పెద్ద... ఎప్పడు? ఇంకో రెండు సంవత్సరాలకా? ఎంతో ఓర్పు నిండిన ప్రేమ కదా నీది”
“కొంచెం ఆలోచించు ఐరీన్... నువ్వు ఇక్కడే వుంటే రేపు పొద్దున్నే అతను వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతాడు. అతని నీ భర్త. అలా చేసేందుకు అతనికి హక్కు వుంది, అధికారం వుంది. చట్టం అతని వైపు వుంటుంది.”
“నన్ను ఇదే ఇంట్లో వుంచుకోమని చెప్పడంలేదు జాక్. ఇంకెక్కడికైనా తీసుకెళ్ళిపో... అంతమాత్రం ధైర్యం చేసే ప్రేమ కూడా లేదా నా మీద? అయితే నాదే పొరపాటు అనుకుంటాను.. గుడ్ బై!”
ఆమె వెంటనే వెనక్కి తిరిగి తలుపు దగ్గరకు వెళ్ళింది. ఆ వేగానికి తేరుకొని ఆమెను అందుకొనే సరికే ఆమె గది బయట వుంది.
“నేను చెప్పేది విను ఐరీన్”
ఆమె వినిపించుకునే ప్రయత్నం చెయ్యకపోగా విడిపించుకునే ప్రయత్నం చేసింది. కళ్ళలో నీళ్ళు ఉబికి వచ్చాయి. తడబడుతూ అరిచింది.
“వదిలేయ్... వద్దు.. నన్ను వదిలేయ్... ఒంటరిగా వదిలేయ్..”
అతను వదల్లేదు. ఆమెను బలవంతంగా కూర్చోబెట్టి, మళ్ళీ మోకాళ్ళమీద ఆమె ముందు కూర్చున్నాడు. ఆమె చెయ్యదల్చుకున్న పనిలో వున్న తప్పొప్పులనూ, అలా చెయ్యడం వల్ల జరిగే అనర్థాలను అర్థం అయ్యేలా నింపాదిగా వివరించాడు. ఒప్పించాలని విశ్వప్రయత్నం చేశాడు. ఆమెను ఒప్పించేందుకు అవసరమైనా ఏ చిన్న విషయాన్ని కూడా అతను వదిలిపెట్టలేదు. తన ప్రేమని సైతం ఒక ప్రోత్సాహకంలా చూపించి ఒప్పించాలనుకున్నాడు.
ఆమె స్థిరంగా చడీ చప్పుడు చెయ్యని మంచుగడ్డలా వుండిపోయింది. అతను ఆమెను మాట వినిపించుకోమని, తనని నమ్మమనీ, తాను చెప్పే సలహా పాటించామనీ ప్రాధేయపడ్డాడు.
అతను చెప్పడం పూర్తైన తరువాత ఆమె కేవలం ఒకటే మాట అడిగింది -
“అయిపోయిందా? ఇకనైనా నన్ను వెళ్ళనిస్తావా? నీ చేతులు నా మీద నుంచి తీసేస్తే నేను లేస్తాను”
“ఏంటిది.. ఐరీన్”
“వెళ్ళనిస్తావా లేదా?”
“నీ నిర్ణయంలో ఏ మార్పు లేదా?”
“వెళ్ళనిస్తావా లేదా?”
“ముందు అడిగినదానికి సమాధానం చెప్పు. నువ్వు తీసుకున్న నిర్ణయం... నీ పిచ్చి నిర్ణయం.. నువ్వు తరువాత తరువాత బాధపడటానికి తీసుకున్న ఈ నిర్ణయం... మార్చుకోవా?”
“మార్చుకోను... ఇక వెళ్ళనిస్తావా?”
“అయితే వుండు. నీకు ఈ ఇల్లేమీ కొత్తకాదు. హాయిగా వుండు. రేపు ఉదయం ఎటైనా వెళ్ళిపోదాం”
అయినా ఆమె వినిపించుకోనట్లే లేచి నిలబడి, కరకుగా సమాధానం చెప్పింది –
“వద్దు... ఆ అవకాశం లేదు. నాకు నీ త్యాగాలూ వద్దు, నేనేదో దేవతలాగా నువ్వు భక్తిగా నేను చెప్పింది వినాల్సిన పనిలేదు”
“ఆగు! నేను ఏం చెయ్యాలో అది చేశాను. ఏం చెప్పాలో అది చెప్పాను. ఇక జరిగబోయే పరిణామాలకు నాకు ఎలాంటి బాధ్యత వుండదు. తరువాతెప్పుడో నేను పశ్చాత్తాపపడాల్సిన పనిలేదు. అయిపోయింది. ఇక నువ్వే చెప్పు. ఏం చెయ్యమంటే అది చేస్తాను.”
ఆమె స్థిమితపడి కూర్చుంది. అతని వైపు చాలా సేపు చూసి ఆ తరువాత శాంతంగా అడగింది –
“అయితే వివరంగా చెప్పు”
“వివరంగా చెప్పాలా? ఏం చెప్పాలి?”
“మొత్తం చెప్పు. నువ్వు నీ నిర్ణయం మార్చుకోడానికి ముందు ఏమేమి ఆలోచించావో అదంతా చెప్పు. అప్పుడు నేను ఏం చెయ్యాలో నిర్ణయం తీసుకుంటాను.”
“నేనేమీ ఆలోచించలేదే.. నువ్వు చేస్తున్నది తప్పని హెచ్చరించాలనుకున్నాను. నువ్వు చెయ్యక తప్పదన్నావు. తప్పనప్పుడు నేను కూడా నీతో కలుస్తానని అన్నాను. ఇప్పుడు కూడా అదే అంటున్నాను..”
“అంత త్వరగా ఎవరూ నిర్ణయాలు మార్చుకోరు”
“చూడు డియర్, ఇదేదో త్యాగమో, నువ్వంటే భయతోనో భక్తితోనో తీసుకున్న నిర్ణయం కాదు. ఎప్పుడైతే నిన్ను ప్రేమించానో ఆ రోజే నేను ఓ నిర్ణయం తీసుకున్నాను. ప్రతి ప్రేమికుడూ తీసుకోవాల్సిన నిర్ణయం అది. ఏమిటో తెలుసా? ఒక మగవాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తే, ప్రయత్నపూర్వకంగా ప్రేమని గెలుచుకున్నట్లైతే, ఆమెను అందుకున్న క్షణంలో ఓ పవిత్రమైన ఒప్పందం చేసుకున్నట్లుగా భావించాలి. అది అతను తనతోనే చేసుకున్న ఒప్పందం. తన ప్రియురాలితో చేసుకున్న ఒప్పందం. పెళ్ళి కన్నా గొప్పదైన ఒప్పందం.
“పెళ్ళికి సామాజికంగా, చట్టపరంగా ఎంతో విలువ వుండచ్చు. కానీ నా దృష్టిలో దానికి నైతికవిలువేమీ లేదు. ముఖ్యంగా పెళ్ళిళ్లు జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే ఆ విలువకి బద్ధులం కావాల్సిన అవసరం లేదనిపిస్తుంది.”
కాబట్టి కేవలం చట్టపరమైన ఒక బంధంలో మాత్రమే వున్న ఓ స్త్రీకి ఆమె భర్తతో ఏ అనుబంధం లేకుండా, అతన్ని ప్రేమించలేని స్థితిలో వుండే అవకాశం వుంది. అప్పుడు స్వేఛ్ఛగా వున్న ఆ హృదయంతో మరో మనిషి తారసపడవచ్చు. అతనికి కూడా మరే స్త్రీతో బంధం లేని పక్షంలో, వాళ్ళిద్దరూ ఒకరికరుగా వుంటామని నమ్మకంగా చెప్పుకునే మాట, స్వచ్చమైనది అవుతుంది. ఆ మాట చట్టప్రతినిధులముందు జరిగే పెళ్ళిలో పలికే అంగీకారం కన్నా గొప్పదని నా అభిప్రాయం. నా దృష్టిలో వాళ్ళిద్దరూ మర్యాదస్తులే అయితే వారి సమాగమం, కేవలం మతం ఆమోదించి పవిత్రమైనదిగా భావించే పెళ్ళికన్నా ఎంతో అన్యోన్యమైనది, పరిపూర్ణమైందీ అవుతుంది.
నా ఎదురుగా వున్న ఈ అమ్మాయి అన్నీ వదులుకోడానికి సిద్ధపడుతోంది. ఆమెకు అన్నీ తెలుసు. ఆమె తన సర్వస్వాన్నీ ఇవ్వడానికి సిద్ధపడుతోంది. తన హృదయం, శరీరం, ఆత్మ, గౌరవం చివరికి జీవితాన్ని కూడా. ఎందుకంటే ఆమె రాబోయే దురవస్థను ముందే ఊహించింది. రాబోయే అన్ని ప్రమాదాలను, విపత్తులను పసిగట్టింది. అందుకే ఒక సాహసం చెయ్యడానికి పూనుకుంది. నిర్భయంగా నిలబడింది. ఎవరినైనా ఎదిరించడానికి సిద్ధపడింది. అది తనని చంపాలని చూసే భర్తనైనా సరే, వెలి వేయడానికి సిద్ధపడే సమాజాన్నైనా సరే. అందుకే ఆమె చేసేది దాంపత్యానికి ద్రోహమైనా సరే గౌరవించాలని అనిపించింది. అయినా ఆమె ప్రేమికుడిగా ఆమెను స్వీకరించే ముందు జరగబోయేది ఊహించాల్సిన అవసరం వుందని కూడా అనిపించింది. ఏ అనర్థం జరిగినా అందుకు సిద్ధపడే ధైర్యాన్ని ఆమె ఇవ్వాల్సిన అవసరం వుందని అనిపించింది.
ఇక ఇంతకన్నా నేను చెప్పాల్సిందేమీ లేదు. నేను ముందు బాధ్యతగా ఆలోచించి, ఒక వివేకమున్న వ్యక్తిగా నిన్ను హెచ్చరించాను. ఇప్పుడు నేను మామూలువాడిని. నిన్ను ప్రేమించేవాడిని. నువ్వు ఎలా చెప్తే అలా.. ఆదేశించు, పాటిస్తాను..”
మెరుపులా అతని మాటల్ని ముద్దుతో ఆపేసిందామె. లో గొంతులో పలికింది.
"అదంతా నిజం కాదు డార్లింగ్. అలాంటిదేమీ లేదు. నా భర్తకు ఎలాంటి అనుమానం లేదు. నువ్వు నాకు పంపిన నక్లెస్ కాకుండా మరో బహుమతి కావాలనిపించింది. నీ హృదయాన్నే బహుమతిగా కోరాలనిపించింది. ఇలా అడిగితే నువ్వేమంటావో తెలుసుకోవాలనిపించింది. ఇలా నిన్ను చూడాలనిపించింది. నువ్వు నేను కోరుకున్న బహుమతి ఇచ్చావు. థాంక్స్.. థాంక్స్. నువ్విప్పుడు నాకిచ్చిన ఆనందానికి ఆ భగవంతుడికి కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి."
***
By....Aripirala Satyaprasad



2 కామెంట్‌లు:

  1. నమస్కారం సర్.... బూందీ మిఠాయి కథ చాలా బాగుంది.ఆ రచయిత మీరేనా ?? మీరు కాకపోతే ఆ రచయిత రాసిన కథలు ఏవైనా ఉంటే చెప్పగలరా.. మంచి కథని అందించినందుకు మీకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి