ఓం శ్రీ కృష్ణాయనమ: - శ్రీ మాత్రేనమ:
సర్వేజనా సుఖినోభవంతు
*1. గోపాల కృష్ణుడు
రారమ్మ రారయ్యా చూడాలి చిన్న గోప బాలుడు
నిర్మల మైన వాడు, మన మువ్వ గోపాలుడు
శ్రీ రమ్య మైన వ్రేపల్లెలో, కాంతులు పంచు వాడు
చేరి కొలుతుము, మనసు ప్రశాంత పరుచు వాడు
ఇప్పుడు పున్నమి, వెన్నెల, వెలుగు నందించే వాడు
ఎప్పటి కప్పుడు, మదిలో ప్రశాంతత, కల్పించే వాడు
తప్పులు చేసిన, మానవులను సరిదిద్ది కాపాడే వాడు
చెప్పుడు మాటలలో నిజము ఉండదని, చెప్పిన వాడు
మరి మరీ, కని వినీ, ఎరగని కళ్ళతో ఆకర్షించే వాడు
మురిసే యశోదమ్మకు ముద్దుల అల్లరి పిల్ల వాడు
కరితో ఆడుకొని పైకిఎక్కి, ఆనందం అనుభవించే వాడు
సిరి కల్పించి, సంతోష పంచిన చిన్మయ స్వరూపుడు
అరుణో దయ, వెలుగు, అందరికి సమంగా పంచు వాడు
కరుణ చూపి ప్రాదించుచున్న వారిని కాపాడిన వాడు
వరములు కోరిన వారికి వెంటనే సహకరించిన వాడు
పరుష వాక్కులకు 100 తప్పుల వరకు రక్షించిన వాడు
--((*))--
2 .* శ్రీకృష్ణ లీలలు
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
వినరమ్మా, చూడడండమ్మా, మన కృష్ణయ్య తీరు
పనిఁబూని మనం సేవించిన సిరులు కురిపించే తీరు
కన్నీరు తుడిచి మమకారం అందించే నవ్వుల తీరు
ఆన్న వారికి సుఘంద పరిమళాలు అందించే తీరు
ఆల పాలకడలిలో ఊయల శేషశయ్యపై ఉన్న తీరు
కలలు సఫలీ కృతము చేసి శుభములందించే తీరు
పలుకులో ధర్మ మార్గమున ఉండి ఉండమన్న తీరు
అలుకలో కూడా ఆనందము ఉన్నదని చూపినతీరు
నీల మేఘ శ్యాముడైన కృష్ణ కళ్ళకు కాటుక తీరు
వలదు వలదు అంటూ పింఛము పెట్టుకున్న తీరు
తలచుకున్న వెంటనే కృష్ణుఁడు ప్రత్యక్షమైన తీరు
పాలు త్రాగి యశోదకు నోటిలో లోకాలు చూపిన తీరు
పద్ధతులనుచూసి పక పక నవ్వి ఏడి పించిన తీరు
పడుకున్న వారి కొంగులు ముడివేసి ఆడిన తీరు
తడబడుతూ నవ్వులు కురిపిస్తూ ఆదుకున్న తీరు
అడగకుండా తలచిన వెంటనే కోరిక తీర్చే తీరు
--((*))---
3 * శ్రీకృష్ణ లీలలు .
ఎనలేని సిరులను అందించు శ్రీకృష్ణ ప్రేమ
కనరాని కడు ఈతిభాదలను తొలగించే ప్రేమ
మునులు నిత్యమూ త్రివిక్రముని ఆరాదించే ప్రేమ
కనుల చూపులతో కలతలు తొలగించే కమ్మని ప్రేమ
నెల నెలా మూఢు వానలు కురిపించే ప్రేమ
కల కళలాడుతూ పైరును ఏపుగా పెంచే ప్రేమ
కలువల పూలతో పూజించే నిస్వార్ధ ప్రేమ
అలల తాకిడిలా సాగె జీవితంలో ఉండే ప్రేమ
కడిగి కూర్చుండి పొంకపు చన్నుల పాల ప్రేమ
ఒడిసి పట్టి పాలు త్రాగుతూ రక్కసిని చంపిన ప్రేమ
బండి రూపములో వచ్చిన రాక్షసుని చంపిన ప్రేమ
కడవలు ఆవుపాలను అందించి ఆరగించే ప్రేమ
--((*))--
* 4 శ్రీకృష్ణ లీలలు .
నరులకు అకాలమున - దప్పికను గనిరో
కురియును సకాలమున - వర్షములు దయతో
పయనమున ఒంటరిగ - వేదనలు గొలుతున్
కలత తొలగించియును - హర్షమును దెలుపున్
జలనిధిలో జొర బడిన సర్పమును సంహరించి
జలమును శుభ్రపరిచి త్రాగుటకు సహకరించి
తలలు మార్చే దుష్ట రాక్షసులను సంహరించి
కలకాలం శ్రీకృష్ణ ప్రార్ధించిన వారిని కాపాడుచుండెన్
సుందర బాహువులతో పిల్లన గ్రోవిని ధరించి
పొందిన ఆనందము తో వేణుగానము చేసి
అందరిని ఆనందపారవశ్యములో ముంచి
వందనాలు స్వీకరించి మనస్సు ప్రశాంత పరిచే
--((*))---
5 * శ్రీ కృష్ణ లీలలు .
చెప్పరే చెప్పరే శ్రీకృష్ణ నామమ్ములు
ఒప్పుల కుప్పగా ఉన్న ఓ వనితలారా
తప్పక చూచును మన స్థితిగతులు
ఎప్పుడో చేసిన తప్పులను రక్షించును
కళ్యాణదీప్త మైన వాని కనికరములు
అల్లన మెల్లగా ధ్యానించి పొందు దామురా
తల్లి కడుపున చల్లగా వెలిగేటి వానిని
సల్లలిత సుమము లర్పించి వేడుకొందుమరా
హాయిగా యమునా నదిన విహరించువానిని
మాయను తొలగించే మధురాపురికి రేడైన వానిని
భయము వదలి పరమాత్మునిని ప్రార్ధించి
తీయని పువ్వులతో సేవించి ప్రార్ధించెదమురా
--((*))---
ప్రాంజలి ప్రభ
6.* శ్రీకృష్ణ లీలలు
తెలవారు తున్నది లేవే లేవవే
కల కల కూసే కోయిల పాటలు
అల కృష్ణని గుడి గంటలు మ్రోగెనే
పిలిచెనే సుప్రభాత సేవలకు
ఓలి విషపు చను బాలు త్రాగిన వానిని
లాలి పాడుతున్న మాయారక్కసి చంపిన వానిని
గాలిలో మాయా శకటములను కూల్చిన వానిని
నిల మేఘశ్యాముని దర్శించుదాము లేవవే
మేలుకొని ఋషులు,మునులు కొలిచేటి
మలుపు మాయానుండి మమ్ము రక్షించేటి
గెలుపు కోసం చేసిన ప్రార్థనలను చూసేటి
చలువ రాతిపై ఉన్న గోపాలా నీవే నాకు దిక్కు
--((*))--
Pranjali Prabha
7 .గోపికల లీలలు
విన లేదేంటి వెర్రి జవరాలా
కన లేదుటే కృష్ణ లీలలు
తనితనిగా తెల్లవారి గోలలా
వినియే హాయిగా పవళించితివా
ఘల్లు ఘల్లుమని ఘంటల శబ్దాలు
చల్లగా శుఘంధ పరిమళ వాసనలు
పెళ్ళుగా చల్లకుండ కవ్వం కదలికలు
మెల్ల మెల్లగా ఆవు మువ్వల కదలికలు
ఆలకించవె ఆలమందల గోలా
పాలధారలు కృష్ణుఁడికి పట్టవే
గోల చేయకే కృషుడిని వేడుకోవే
బాలకృష్ణుడిని ముద్దుగా ఆడించవే
--((*))--
Pranjali Prabha8 * గోవింద లీలలు .
ఒకటే కోరిక మాకిక గోవిందా
మకుటముతోనున్న రాజువు గోవిందా
ఇక మాకు దిక్కువు నీవే గోవిందా
ఒక పరి మా విన్నపములు వినవా గోవిందా
మనసు నీకు తెలియదనా
మనవి చేయుట నావంతు
ఏనాటికి నిన్ను వదలి ఉండలేను
నన్ను ఎప్పుడూ కాపాడేవాడవు గోవిందా
తెల వారక ముందే నీ సన్నిధిన ఉన్నా
కలల కోరికలను తీర్చమని కోరుతున్నా
తలపులు తెలుసుకొని ఆదుకుంటున్నావు
కలువ పూలతో నిను కొలుస్తూ ఉన్నా గోవిందా
చెలులను వదలి మాకోసం ఉన్నావా
చల్లని నీ చూపులు మా కందిస్తున్నావా
మెల్లగా నిన్ను అర్థిస్తూ ప్రార్ధిసున్నాను దేవా
మల్లి మళ్ళీ నీ దర్శనం చేస్తే మన: శాంతి గోవిందా
--((*))--
Pranjali Prabha
9 * గోవింద లీలలు .
అల్లదే చూడు మేలుకొలుపు తూరుపు సింధురం
తెల్లవారే దేవాలయ భక్తుల ఘంటల శబ్దం
మెల్లగా వినబడు చుండెనే దైవ సుప్రభాతం
మేళంతో ఊరేగుతున్నాడు దేవుడ్ని చూద్దాం పదా
కూరిమితో దేవుడు కృపను మనపై చూపునే
క్రూర రక్కసులందర్నీ సంహరించి కాపాడునే
అరుణోదయ కాంతిని అందించి ఆదుకొనునే
కరములతో వేడుకుందాము గోవిందునీ పదా
కోనేరులో స్నానమాడి గోవిందుడ్ని కొలుద్దాం
అనేక భాధలు తొలగించమని వేడుకుందాం
ఔనే తక్షణం గోవిందా అంటూ అంటూ కదులుదాం
మన అహాన్ని వదలి గోవిందుని చూద్దాం పదా
--((*))--
ప్రాంజలి ప్రభ
*.శ్రీకృష్ణ లీలలు
మేలుకో మేలుకో
చాలించి నీ నిద్దుర నుండి మేలుకో
ఏలికా నంద గోపాలా మేలుకో
మేలెంచి మమ్ము ఏలుకో
తల్లి యశోదమ్మ పిలుస్తుంది మేలుకో
అల్లన మేలుకో నంద గృహ దీపమా
మేలెంచి మా మనవి ఏలుకో
తలచిన ప్రత్యక్షమయ్యే గోపాలా మేలుకో
భువిని దివిని రక్షించే ఓ నాయకా
భవ్య మైన వెలుగులు పంచె నాయకా
శ్రావ్య సంగీతమును ఆలకించు నాయకా
దివ్య చరితముగల గోపాలకృష్ణ మేలుకో
.--((*))--
Pranjali prabha
11. *శ్రీకృష్ణ లీలలు
పలుకవా నళి నేత్రా
పలుకవా నవ మోహనా
పలుకవా ముద్దు గోపాలా
అలక మాని కుచములనుండి లేవవా
తళ తళ మెరిసి మంచముపై
లలితా సుమధుర సువాసనలతో ఉన్న
తల్పంపై పవళించి ఉన్న నాయకా
ఆలసింపక నన్ను వదలి లేవవా
ఘడి అయినా ప్రియురాలును వదలవు
తడవైన గాని నిద్దుర లేవవు
మడి అన్న సొగసుకన్నులదానందువు
కొంగుముడి కదలవా గోపాలా
.--((*))--
కృష్ణం కలయ సఖి సుందరం!
(నారాయణ తీర్థులవారి కృతి...రాగం: ముఖారి .)
కృష్ణం కలయ సఖి సుందరం
బాల కృష్ణం కలయ సఖి సుందరం
కృష్ణం కథవిషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం
సదా బాలకృష్ణం కలయ సఖి సుందరం
నృత్యంతమిహ ముహురత్యంతమపరిమిత భృత్యానుకూలం అఖిల సత్యం
సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం
ధీరం భవజలభారం సకలవేదసారం సమస్తయోగిధారం
సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం
శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరికేళ సంగం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం
రామేణ జగదభిరామేణ బలభద్రరామేణ సమవాప్త కామేన సహ బాల
కృష్ణం కలయ సఖి సుందరం
దామోదరం అఖిల కామాకరంగన శ్యామాకృతిం అసుర భీమం
సదా బాలకృష్ణం కలయ సఖి సుందరం
రాధారుణాధర సుతాపం సచ్చిదానందరూపం జగత్రయభూపం
సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం
అర్థం శితిలీకృతానర్థం శ్రీ నారాయణ తీర్థం పరమపురుషార్థం
సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం
Pranjali Prabha
12. గోపికల -శ్రీ కృష్ణ లీలలు
చీకాకు పడకు
చిడిముడి పడకు
చిందులు వేయుకు
చిన్న తనముకోకు
మాకోసమేకాదా
మా పున్నెము వలన కాదా
మా గోపాలుడివి కదా
మమ్ము కరుణతో ఆదుకున్నావుకదా
మా అందరి రక్షగా గోవిందుడవై ఉన్నావు కదా
గోవులవెంబడి తిరిగావు కాదా
కోణల వెంబడి తిరిగావు కాదా
గొల్ల పిల్లలతో ఆడావు కాదా
గోపికలతో సరస మాడావు కాదా
అయినా మమ్ము రక్షించే కృష్ణుడివి కదా
చిన్ని చిన్ని మాటలన్నాము
ఎన్నోసార్లు నిన్ను భాదపెట్టాము
మనది జన్మ జన్మల బంధము
గోపాల నిన్ను వీడి ఉండలేము
గోపాల నిన్ను చూసిన పుణ్యము
గోపాల నిశక్యతే మాకు స్వర్గము
--((*))--
షేర్ చేయండి -దేవుని స్మరించండి
ప్రాంజలి ప్రభ
13 * రాధా కృష్ణ మనోహరం
ఒక మాటైనా అనవు గానీ రాధా
ఒక్క సారి నీ దర్శనంతో నా మనసుని
ఒకే విధముగా లేకుండా చేసావు కానీ
చిక్కావు నా ఉహల ప్రపపంచమ్ లోకి
వెన్నెల రాణివైతే ఈ జాబిల్లికోసం రావా
మెరుపుల తీగవైతే ఈ నింగి కోసం రావా
వానదేవతవయితే వనరాజును చూడవా
జల దేవత అయితే కడలిలో కలువవా
ఎలా కనిపించెదవో ఊహలకందుటలేదు
ఎలా కవ్వవించెదవో మనసుకు చిక్క లేదు
ఎక్కడున్నా వో ఏమీ అర్ధం ఆవుట లేదు
ఎం చేస్తున్నావో ఏమిటో తెలియుటలేదు
నా ప్రేమ నాయిక వైనావు నీవే రాధా
భోగములు అందించ గా రావా రాధా
నోరారా పలకరించుటకు రావా రాధా
తలపు వలపు కోసం వేచి ఉన్నా రాధా
--((*))--
షేర్ చేయండి -దేవుని స్మరించండి
14. గోవింద లీలలు
అందమగు నీ దివ్య దర్శనమునకు
అందరము మానాభిమానములు వీడి
సుందరమగు నీపాదాల క్రింద బృందములై
చందమున ఉన్న, మా డెందములు చల్ల బడే
నీ ఒక్కసారి మా ఒంక చూసిన చాలును
నీ దయా వీక్షణాలు కురిపించినా చాలును
నీ కనుపాప కదలిక మాపై చూపినాచాలును
మా పాపములు తొలగి, తాపము చల్లారును
చిరునగవు మోము గల ఓ వైకుంఠ వాసా
ఏడు కొండలపై వెలసి ఉన్న ఓ వేంకటేశ
నీలాలు అర్పించి నీచెంతను మేము చేరాము
మా మొక్కులు స్వీకరించి, నీ వీక్షణాలు
మా కురిపంచి మా జన్మ చరితార్ధము చేయు దేవా
--((*))--
షేర్ చేయండి -దేవుని స్మరించండి
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:శ్రీ కృష్ణాయనమ:
ప్రాంజలి ప్రభ (రాధ కృష్ణ లీల -1)
"గోవిందా" గోవిందా
ఊహల ఊయల సడిలో
ఆకలి ఆరాట మదిలో
తియ్యని తలపుల తడిలో
నీరూపే నా మదిలో నిలిచింది
లతలా అల్లుకోవాలని
పరిమళాలందించాలని
విరిసిన పువ్వగా ఉండాలని
నీ తలుపు నన్ను పులుస్తున్నది
కురిసేను విరిజల్లులు
మెరిసెను హరివిల్లు సౌరభములు
నాట్యమాడెను మయూరములు
నామది ఆనందంతో ఉన్నది
మదిలో నిండే మధుర భావాలు
పెదాలు పలికే మధుర గీతాలు
నాలో చెరగని నీ ప్రతి రూపాలు
అడుగుల సవ్వడికే పరవసిస్తున్న ముకుందా
నీ మధుర పావన తలపులు
ఈ రాధను వరించే కళలు
అందుకో పూల మకరందాలు
ఆదుకో ఆరాధించిన వారిని గోవిందా
--((*))--
ప్రాంజలి ప్రభ
భక్తులు శ్రీకృష్ణుని ఈవిధంగా ప్రార్ధించుతున్నారు
అంతర్మధనానికి అర్ధం ఏమిటో
ఆంత రంగాల భావ మేమిటో
అనురాగ బంధాల భేదమేమిటో
మాకు తెలపవయ్యా కృష్ణయ్యా
కాలమార్పుకు అవసర మేమిటో
కాపురానికి కాంచనానికి ప్రమఏమిటో
కాని దవుతుంది, అవ్వాల్సింది కాదేమిటో
మాకు తెలపవయ్యా బాల కృష్ణయ్యా
అకాల వర్షాలకు కారణాలేమిటో
ఆత్మలకు తృప్తి కలుగుట లేదేమిటో
ఆకలి మనిషికి తగ్గకున్నదేమిటో
మాకు తెలపవయ్యా ముద్దులకృష్ణయ్యా
గాలిలో మాటలు తరలి వస్తున్నాయేమిటో
గాఁపు లేకుండా ప్రార్ధించినా కరుణించవేమిటో
గిరి గీసినా దాటివచ్చి మనిషి ప్రశ్న లేమిటో
మాకు తెలపవయ్యా గోపాల కృష్ణయ్యా
చిత్తశుద్ధి కల్పించి నిగ్రహాన్ని ఇవ్వవేమిటో
చింతలు తొలగించి ఐక్యత్వజ్ఞానమివ్వమేమిటో
చిరునవ్వులతో జితేంద్రియత్వము కల్పించవేమిటో
మాలో తప్పులు తెలపవయ్యా మువ్వగోపాలయ్యా
ఇంద్రియసుఖములందలి ఆసక్తిని విడువలేకున్నావేమిటో
కర్మల యందలి అభిమానము వదలి లేకున్నావేమిటో
సమస్త వాసనలను, సుఖాలను మరువలేకున్నావేమిటో
మాతప్పులు మన్నించి నీలో ఐక్యం చేసుకో కృష్ణయ్యా
ప్రాంజలి ప్రభ
కన్నెల మనసు సుతారం
రంజిల్లును నిత్య సుకుమారం
రంగు బంగారం, రసరమ్య సౌభాగ్యంతో
రమా రమ మనసు నర్పించే శ్రీకృష్ణకు
తాంబూల పెదాల ఎరుపు దనంతో
వంటిమీద పుత్తడిపూత మెరుపుతో
వెన్నెల వెలుగులో కళ్ళ చూపులతో
కవ్వించి నవ్వించి సంతోషం పంచె శ్రీకృష్ణకు
ఆనందపు మాటలన్ మిపుల నందపు టాటాలన్
బాటలాన్ ముద మందంచుచు సుఖంబులన్
సందియము ఏమి లేక సర్వంబు అర్పించుటకున్
పోటీపడి ప్రియంబు కల్పించే కన్యలు బాలకృష్ణకు
లలిమనోహర రూప విలాస హావా భావములచే
యతిశయాను భవవిద్యా గోచర పరమార్ధముచే
గాత్ర కంపన గద్గదా లాపవిధులవయ్యారములచే
కన్యలందరు నింపారు గాచి ప్రేమను పంచె శ్రీకృష్ణకు
__((*))--
ప్రాంజలి ప్రభ
చిరు నగవుల చిన్మయ రూపం
చింతలు తొలగించే విశ్వరూపం
చంచలాన్ని తొలగించే రూపం
చిరస్మరణీయులకు దివ్య రూపం
ఆత్మీయుల ఆదుకొనే ఆదర్శ రూపం
అంధకారాన్ని తొలగిన్చే రత్న రూపం
అక్షయ పాత్ర నందించిన రూపం
అన్నార్తులను ఆదుకొనే రూపం
ఉజ్వల భవషత్తును చూపే రూపం
ఉత్తేజాన్ని శాంతపరిచే రూపం
ఉన్మత్త, అప్రమత్తలను మార్చేరూపం
ఉషోదయ వెలుగును పంచె రూపం
దృఢసంకల్పాన్ని పెంచే రూపం
దుష్టత్వాన్ని అరికట్టే రూపం
దుర్మార్గులను సంహరించే రూపం
దు:ఖాలను దరి చేర నీయని రూపం
పరబ్రహ్మపరమాత్మ ప్రాప్తి రూపం
అపరిమితానంద హాయిగొలిపే రూపం
ఆత్మా పరమాత్మా యందె లగ్న పరిచే రూపం
అఖిలాండకోటికి ఆనందం పంచే శ్రీ కృష్ణ రూపం
ప్రాంజలి ప్రభ
అమ్మా యశోదమ్మా
అల్లరి తట్టుకోలేకున్నామమ్మా
ఆలూమగలమధ్య తగువులమ్మా
ఆ అంటే ఆ అంటూ పరుగెడుతాడమ్మా
పాలు, పెరుగు, వెన్న, ఉంచడమ్మా
పాఠాలు నేర్పి మాయ మౌతాడమ్మా
పాదాలు పట్టుకుందామన్న చిక్కడమ్మా
పాదారసాన్ని అయినా పట్టుకోగలమామ్మా
కానీ కృష్ణుడి ఆగడాలు ఆపలేకున్నామమ్మా
అల్ల్లరి చేసినా అలుపనేది ఎరుగని వాడమ్మా
ఆడపడుచులతో ఆటలాడుతాడమ్మా
ఆశలు చూపి అంతలో కనబడడమ్మా
అల్లరి పిల్లలతో చేరి ఆడుతాడమ్మా
తామరాకుమీద నీటి బిందువుల ఉంటాడమ్మా
వజ్రంలా మెరిసే కళ్ళతో మాయను చేస్తాడమ్మా
మన్ను తింటున్నాడు ఒక్కసారి గమనించమ్మా
బాల కృష్ణ నోరు తెరిచి చూస్తే తెలుస్తుందమ్మా
అమ్మ చూడమ్మా వాళ్ళ మాటలు నమ్మకమ్మా
సమస్త సుఖాలకు కారణం పుణ్యం కదమ్మా
పాపం చేసిన వారికి దుఃఖం వాస్తుంది కాదమ్మా
నా నోరుని చూడమ్మా ఏమి తప్పు చేయలేదమ్మా
కృష్ణుని నోటిలో సమస్తలోకాలు చూసింది యశోదమ్మా
ఆనంద పారవశ్యంతో మునిగి పరమాత్మను చూసిదమ్మా ముద్దుగారే యశోదముంగిట ముత్యము
ప్రార్ధించిన వారికి మన:శాంతి నిత్యము
ఓర్పుతో ప్రార్ధిస్తూ చేయాలి పత్యము
శ్రీకృష్ణుని పలుకులు ఎప్పుడు సత్యము
ఆపద వచ్చినప్పుడు ధైర్యము కల్పించు
శ్రేయస్సు కలిగినపుడు సహనం వహించు
వాక్చాతుర్యంతో మనస్సును ఆకర్షించు
శ్రీకృష్ణుని పలుకులు ఎప్పుడు సత్యము
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్రభ
బాల కృష్ణుడు తల్లి ని గూర్చి ఈవిధముగా చెప్పుట
అమ్మా నన్ను చూస్తే
నీ కేమనిపిస్తుందమ్మా
నీ మాటను దాటే ఏమైనా చేస్తే
నీకు శిక్షించే హక్కు ఉన్నదమ్మా
మనసు మల్లెపూల తోట
పలుకు తేనెలూరు ఊట
మమత బ్రతికించే బాట
అమృతం పంచె ఆమ్మవు కదమ్మా
బిడ్డకోసం శ్రమించే మాత
అన్నార్తులకు ఎప్పుడు దాత
జీవితానికి దారిచూపే నేత
మనుష్యులకు శాంతి దూత అమ్మా
పనియందు ఎప్పుడూ చూపు ఓర్పు
అది తెస్తుంది మనలో కొంత మార్పు
సమస్యలనుండి తొలగించుటలో నేర్పు
ప్రతి ఒక్కరికి శిరోధార్యం అమ్మ తీర్పే
బాల కృష్ణుడు తల్లి ని గూర్చి ఈవిధముగా చెప్పుట
అమ్మా నన్ను చూస్తే
నీ కేమనిపిస్తుందమ్మా
నీ మాటను దాటే ఏమైనా చేస్తే
నీకు శిక్షించే హక్కు ఉన్నదమ్మా
మనసు మల్లెపూల తోట
పలుకు తేనెలూరు ఊట
మమత బ్రతికించే బాట
అమృతం పంచె ఆమ్మవు కదమ్మా
బిడ్డకోసం శ్రమించే మాత
అన్నార్తులకు ఎప్పుడు దాత
జీవితానికి దారిచూపే నేత
మనుష్యులకు శాంతి దూత అమ్మా
పనియందు ఎప్పుడూ చూపు ఓర్పు
అది తెస్తుంది మనలో కొంత మార్పు
సమస్యలనుండి తొలగించుటలో నేర్పు
ప్రతి ఒక్కరికి శిరోధార్యం అమ్మ తీర్పే
ప్రాంజలి ప్రభ
రెండు మనసుల్ని ఒక టి చేసేది
రెండు వర్గాలను ఒకటిగా కల్పేది
రెండు దేశాల్ని ఒకటిగా మార్చేది
ఇద్దరి మనుష్యులను కలిపేదే స్నేహం
కృతజ్ఞతకు మించినది స్నేహం
స్నేహానికి మించినది కృతజ్ఞత
స్నేహం వలన సహ్రుద్బావ వాతావరణం
ఒకరిపై ఒకరికి ఏర్పడు ఆహ్లాదభరితం
జీవన సౌందర్యాన్ని విపులీకరిస్తూ
ప్రాకృతి వైపరీత్యాన్ని తెలియపరుస్తూ
పంచభూతాలను బట్టి అనుకరిస్తూ
అనుబంధం ప్రేమబంధంగా మార్చేది స్నేహం
స్నేహితుని సమాగమనం సహజ సిద్ధం
కోరికలేని ముల్లును చేరితే యుద్ధం
స్నేహం అనుమానమా మారితే నరకం
ప్రేమను ఇచ్చి పుచ్చుకుంటే సుఘంధమ్
ఒకరి కొక్కరు తోడైతే కొండత ధైర్యం
విజ్ఞానం పంచుకుంటే మనసు ప్రశాంతం
స్నేహానికి కులమతాలకడ్డురాని ప్రపంచం
బంధం వదిలిన ఆస్తిపోయినా వీడనిది స్నేహం
కృష్ణ కుచేలుని స్నేహం సుస్థిరం
గుప్పెడు అటుకళులకు మోక్షం
సకల ఉపచార గౌరవ పర్వం
స్నేహానికి జీవితాలే సంతర్పణం
--((*))--
రాధ కృష్ణునికోసం వేచి ఉంటూ భావం తెలిపే
మహాద్భుతముగా గాలితో
కలసి కనబడకుండా గగుర్పాటు చేయుట ఎందుకు
ఎండలో నావెంట పయనించి
నీడగా నన్ను అనుకరించి అంతలో మాయమౌతావెందుకు
సంద్రపు కెరటం పొంగులా
ఎగసిపడుతూ నావెంట వచ్చి చల్లగా జారుకున్నావెందుకు
అడవిలో కారుచిచ్చులా
నా వెంట పడుతూ చిరుజల్లుకే చల్లబడి పోయా వెందుకు
నింగి లోన నక్షత్రము లా
నను చూస్తూ, నావెంట వస్తూ, ఇంతలో నాకన్ను దాటావెందుకు
నింగిలోని మేఘము లా
కదులుతూ చిరునవ్వు చూపిస్తూ గాలికే ననుదాటి వెల్లావెందుకు
రాధా నన్ను వెదుకుట ఎలా
నిరంతరమూ నీ మదిలోనే వెలసి ఉన్నాను కదా వేదికు టెందుకు
రాధా నా ప్రాణము అంతయు
నీప్రేమ చుట్టూ తిరుగుటయే ఈ కృష్ణలీలను తెలుసుకో లేవెందుకు
శ్రీ కృష్ణుని చరితము వినుము
ఆ దేవదేవుని కొలిచి మోక్షము పొందుము
రంగ రంగ వైభవముగా
దేవకీ వసుదేవులకు పెళ్లి చేసి, స్వయాన సారధి వహించగా, ఆకాశవాణి దేవకీ వసుదేవులకు, పుట్టే అష్టమ గర్భము నీ మృత్యువని తెలిపే.
కంసునికి కంటి కునుకు రాదు, ఎవరు ఏమిచెప్పినా బోధపడదు, చేసిన పాపము అనుభవింపక తప్పదు, మృత్యువుని జయించే మార్గాలను వెతకక తప్పదు అని భావించి దేవకీ వసుదేవులకు కారాగారమునందు సకల సదుపాయాలూ కల్పించి పుట్టిన బిడ్డను నాకు అందించాలని హెచ్చరించి. తగిన రక్షక భటులను ఏర్పాటు చేసి చీమ చిటుక్కుమన్న తెలుపమని తెలిపి అజాగర్తగా ఉన్న వారెవరైనా సరే వారికి మరణదండనమని తెలిపి వెనుతిరిగెను.
కాల గర్భాన సంవత్సరములు దొర్లిపోవు చుండెను. వసుదేవుడు పుట్టిన బిడ్డను కంసునికివ్వడం దేవకీ విలపించటం జరుగుతున్నది, ఆబిడ్డను పైకి ఎగరవేసి కత్తికి బలివ్వడం జరుగుతున్నది, ఈ విధముగా 7 (ఏడుగురిని మగపిల్లలను సంహరించెను).
అష్టమ గర్భము ఇప్పుడా అని అతృతతో కంసుడు ఉండెను, భయముతో రక్షకభటులను హెశ్చరించెను,
శ్రీ కృష్ణుని చరితము వినుము
ఆ దేవదేవుని కొలిచి మోక్షము పొందుము
ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
సర్వేజనా సుఖినోభవంతు
ఎందరో మహానుభావులు అందరికి వందనములు
*--
ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్
ప్రాంజలి ప్రభ - గోకులాష్టమి ( పాటల సంగీత రూపకం)
వినండి - వినమని చెప్పండి
వ్యాఖ్యానం: మల్లాప్రగడ రామకృష్ణ
ఒకారో టిక్ చేసి సంగీత రూపకం వినండి
సర్వేజనా సుఖినోభవంతు
--((*))--
- రాధాకృష్ణ ప్ర్రేమ లీలలు
*సుఖసౌఖ్యాలు పొందవాకృష్ణా
శ్రీ కృష్ణ నీవు నాకు కనబడకున్నావు
నా మనసు నీ వెంట ఉన్నది
అయినా ఈ రాధను
కొన్ని శబ్దాలు తాకు తున్నాయి కష్ణా
నా మనస్సును ఓదార్చుటకు రావా కృష్ణా
జలపాతాల శబ్దం ఒక నాదాలుగా
కెరటాల ఉరవడి ఒక వాదనలుగా
తరంగాల లాస్యాలు ఒక స్పందనలుగా
చినుకుల విన్యాసాలు ఒక వందనాలుగా
నన్ను తాకు తున్నాయి కృష్ణా
ఆకుల గల గల శబ్దం ఒక కలగా
ఊగే చెట్ల కొమ్మలు ఒక గాలిగా
వాయు తరంగ గాలులు ఒక లాలిగా
స్వర విహారాలు మనసుకు ఒక జాలిగా
నన్ను వెంబడిస్తున్నాయి కృష్ణా
మబ్బుల గర్జనలు ఒక స్వరాలుగా
హృదయ శబ్దాలు ఒక ప్రేమలుగా
స్నేహాల భావాలు ఒక చిహ్నాలుగా
మాటల కలయకలు ఒక ఆందాలుగా
నామనస్సును లాగుతున్నాయి కృష్ణా
ఈ రాధను అందుకొని
కనీ వినీ ఎరుగని సుఖ సౌఖ్యాలు
పొందవాకృష్ణా
ఈ తనువు నీకే అర్పించాలని ఉంది కృష్ణా
ఈ రాధ కోరిక తీర్చగ రావా కృష్ణా
--((*))--
*రాధా కృష్ణ మనోహరం
కాలి మువ్వలై- నవ్వులు పువ్వులై
వెన్నెల రాత్రులై - సవ్వడి చేయవే రాధా
మనసు మంగళమై
తనువు తుంబుర నాదమై
శ్వాస సప్త స్వరమై
ద్యాస దివ్య ధ్యానమై
నాట్య సుందరి వైన్నావు రాధా
నీ కోసం ఆటు పోట్లతో చిక్కి ఉన్నాను
కుంగుతూ, పొంగుతూ అల్లాడుతూ యున్నాను
నీ అడుగుల సవ్వడికోసం విలపిస్తూ ఉన్నాను
నీవు ఉండి ఉండ నట్లుగా ఎందుకు ఉంటావు మాధవా
నీ స్పందనలు నా ఊహలై
నీ ఆలాపనలు నాకు ప్రాణాలై
నీ ప్రణయ చూపులు వరాలై
నీ ప్రేమను నాకు అందించవే రాధా
నీ కోసం సుధా చందన తాంబూలాలను ఉంచాను
నీ కోసం కళ్ళు విప్పారి ఎదురు చూసాను
నీ కోసం మనో వనాన పుష్పాలను ఉంచాను
నీవు స్వప్నంలో కనిపిస్తావు, తెరుస్తే ఉండవు మాధవా
నీ సుమ సౌరభ రాగాలను వినిపించేవే
నీ లాస్య లీలల్ని నాకు చూపించవే
నీ హావ భావాలు నన్నుఆకర్షించు తున్నవే
నీ హృదయతాపాన్నినాకోసం ఉంచానే రాధా
నీ మధురాతి మధుర స్పర్శ కోసం వేచి ఉన్నా
నీ కౌగిలిలో చిక్కి తన్మయం చెందాలని ఉన్నా
నిన్నే ఆరాధిస్తూ వేయికళ్ళతో ఎదురుచూస్తున్నా
నామనసులోని కోర్కలను తీర్చవా మాధవా
--((*))--
* రాదా మాధవ మనోహరం
రాదా నీ మనసు నాకు తెలుసు
మాధవా నీ మనసు నాకు తెలియదా!
అలా సరదాగా పూల సరస్సు ఒడ్డున
విశ్రమించి సరదాగా ఉందామా! ఓ అలాగే !
రాధ ఇటు చూడు
కలువలు రెండు
కల్లప్పగించి చూస్తున్నాయి మనల్ని
కనికరము చూపుట కొరకా
కార్యసాధనం కొరకా
కాలంతో కలవ లేకా
కోపానికి చెదిరాయ చెప్పు రాధా
"సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నాయి మాధవా"
మాధవా ఇటు చూడు
చామంతి పువ్వులు రెండు
బుగ్గలు రాసుకుంటూ ఉన్నాయి
చెప్పుకున్న కధల కా
చెలిమి సంభాషణల కా
తన్మయత్వం చెందుట కా
జలచరాల సవ్వాడి కా చెప్పు మాధవా
"తన్మయత్వ తపనలతో తపిస్తున్నాయి రాధా "
రాధ ఇటు చూడు
మల్లెలు మరువం రెండు
పెన వేసుకొని ఉన్నాయి
మనసుని పరవసింప చేయుటకా
మది తలపులను తెలుపుటకా
మృదు మాధుర్యాన్ని అందు కొనుటకా
మాయను చేదించుటకా, చెప్పు రాధా
"తడి పొడి తపనలతో తపిస్తున్నాయి మాధవా"
మాధవా ఇటు చూడు
గులాబీలు గుభాలిస్తున్నాయి
స్త్రీల కొప్పులో చేరటానికా
కోపానికి నలిగి పోవటానికా
కోరుకున్నవాడి కోరిక తీర్చటానికా
బంతుల్లా ఆడుకోవటానికా చెప్పు మాధవా
"పవలింపులో నలిగి పోవాలని ఉన్నాయి రాధా "
"రాధా పోదామా గూటికి చలికాచు కుందాము
అట్లాగే మాధవా వెచ్చని కబుర్లు చెప్పుకుందాము"
--((*))--
రాధామాధవ మనోహరం -3
మనసు లయమై తే
తనువంతా తేలిపోతుంది రాధా
వయసు ముదిరిపోతే
గుర్తింపు లే ఉండవు రాధా
మనసు కు ఖాళీ లేకపోతే
పరుష వాక్యాలు వచ్చును రాధా
సొగసు మరిగి పొతే
గుర్తింపే కష్టమై పోవును రాధా
సరసులో నీరు ఎండిపోతే
జల చరాలు బ్రతకలేవు రాధా
కోరికలు తీర్చు కోక పోతే
బ్రతుకుట కష్టమై పోవును రాధా
ప్రేమ మనసులో ఉండిపోతే
కళ్ళులేని దాన వవుతావు రాధ
దురుసు తనం నీలో పెరిగితే
మాటలు తడబడక తప్పవు రాధా
అలుసు చూసి పోరాడితే
అను కున్నట్లు గెలవ లేవురాధా
తెలుసుకున్న నిజంచెప్పితే
కష్టాలు వచ్చినా నిగ్రహించు కోవాలి రాధా
ఉషస్సు ఇచ్చే మనస్సుతో
తేజస్సుతో ప్రకాశించితే
యశస్సు సొంత మైతే
మనస్సు ఉల్లాసమగా
ఉత్సాహముగా ఉంటుంది
కదా మాధవా
అవును రాధా
--((*))--
*రాధాకృష్ణ ప్రణయ సాగరము
వలపుల తలపులు తెలుపవా
మెరుపుల సొగసులు చూపావా
మనుసున మమతలు పంచవా
ఓ రాధికా నీ మనసు నాదికా
గంధము పూసెద, చందనం పూసెద
తులసి మాలను వేసెద,
మేఘశ్యామ రూప
శిఖ పింఛమౌళి ముకుందా
ద్రాక్షాపాకం త్రాగెదవా
కదళీ ఫలములను గ్రోలెదవా
మదన కదన కుతూహలము కొరకు
మనసును రంజింప చేయుటకు
ఓ రాధికా నీ మనసు నాదిక
నారి కేళములు కావలెనా
కదళీ ఫలములు కావలెనా
నవనీతము కావలెనా
ఇక్షు రసములను కావలెనా
శిఖ పింఛమౌళి ముకుందా
మూగ మనసుతో కోరుతున్నావు
మౌన గీతములు పడుతున్నావు
నుదుటి రాతలు గురించి చూస్తున్నావు
ప్రేమను పంచు తున్నావు
ఓ రాధికా నీ మనసు నాదిక
మోహన మురళి నీకోసమే ఉన్నా
యదు వంశీకృష్ణ నిన్ను ప్రార్ధిస్తూఉన్నా
అధరామృతాములను అందించాలని ఉన్నా
నంద గోపాల కృష్ణ, గోకులానందా
ఈ రాధిక ఆరాటం తగ్గించుకు రావా
;
వలపుల తలపులు తెలుపవా రాధిక
మెరుపుల సొగసులు చూపావా కృష్ణ
--((*)--
6.రాధ కొరకు కృష్ణుని -పారవశ్యం
కలల అలలపై తేలెను మల్లెపూవై
వలపు వయ్యారంగా మందారమై
మనసు సువాసనల సంపెంగమై
కలలో తేలుతు కలిసే పారిజాతమై
వయసుకు గుబాళింపు అందించే మకరందమై
తనువు తనువు తపింపచేసే మొగలి పూవై
వలపు తలపు మెరుపు చల్లబరిచే నందివర్ధనమై
స్వప్నంలో కనిపించే ముద్దాడే ముద్ద బంతివై
మక్కువకు హాయి గొలిపే విరజాజివై
జలకాలాటలకు సైఅన్న కలువ పూవువై
మకరందాన్ని దోచు అన్న తామర పూవువై
ఆధరాలు అందాలను తలపించే గులాబీవై
చిరునగవులు చిందింస్తూ కదిలే పూల దండవై
వయసు అందాలు చూపిస్తూ బూరుగ పూవువై
తేన రసాలతో తృప్తి పరిచే మధుర మమ్మిడివై
నా మనసుదోచుకున్న అందాల సుందరి నీవే రాధా
నామదిలో నిలిచిన రాధవు నివే
ఒక పుష్పమై
నాహృదయంలో ఉన్నావు
--((*))--
7.గోవిందా గోవిందా గోవిందా
చిరునవ్వులు చిన్మయ రూపంలో
చూస్తూ ఉంటే తరించు పోవు హృదయం
ఊహలు అనంత వాయువులలో
ఉన్నా తన్మయ రూపానికి
పరవశం చెందే నా హృదయం
అక్షర దీప దివ్య వెలుగులలో
ఆత్మీయంగా ఆదరించిన దివ్యరూపం
ఆనంద బాష్పాల కాంతులలో
కావ్య నాయకుడైన అద్భుత రూపం
కాలానికి అతీతమైన పసిడి కాంతులలో
మనస్సును ఆహ్లాద పరచిన దివ్య రూపం
మనసు తన్మయత్వం పొందే కాలాలలో
సుఖాన్ని అందించే చిద్విలాసం రూపం
.
రేయి పగలు లో ఆవహిస్తున్న నిట్టూర్పులలో
కనుపాపాను ఒదార్చిన నీ మంగళ స్వరూపం
విశ్రాంతి ఎరుగని నీ ఆకర్షించే చూపులలో
చిక్కని మానవులు లేరు ఈ కలియుగం లో
ఓదార్పుకోసం గాయ పడిన హృదయాలలో
నిరంతరం నీ స్వరణామం చేస్తున్న మాయాలోకం
సర్దుకుంటూ సాగిపోతున్న ఈ సమయంలో
ఆత్మ సంతృప్తినిచ్చే నీ దివ్యమంగళ స్వరూపం
మానసిక మదిని తొలిచే మౌన భాషలలో
మానవులను ఆదుకుంటున్న ఆత్మ స్వరూపం
కమ్ముకు వస్తున్న కష్టాలలో, తీరని ఆశలలో
మరువని ప్రాణానికి ప్రాణమైన దివ్యాభరణ రూపం
.
విధిరాత ఎలాఉన్నా నిన్ను మరువలేదు ఏ క్షణంలో
కాలానుగుణంగా నడుస్తున్న ధర్మ ప్రవర్తనలో
దుష్ట శక్తులు ఎన్నో కమ్ముకు వస్తున్న ఈ తరుణంలో
నివేదిక్కు ఆపద్భాంధవా, అనాదరక్షకా, ఆత్రుతతో
ఆదుకొనే వేంకట రమణా గోవిందా గోవిందా గోవిందా
--((*))--
8*రాధా గోపాలం
నమ్మినాను, చేరి కొలిచినాను
నల్లని వాడవైనను, మనోహరుడవని
మనసును దోచిన అతి సుదరుడవని
మనసును అర్పించటానికి పిలుస్తున్నాను 'గోపాలా'
పిలిచినా పలుకవు, నా మీద అలకా
నిన్నే నమ్మినానని, ఎక సెక్కముతో నవ్వులాటా
కపటము నాలో లేదు, నంద కుమారా
కళ్ళు కాయలు కాచినవి, నన్ను చూడవా 'గోపాలా'
మురళి విని నంతనే, పరుగెడి వత్తును
అల్లరేల చేయుదువురా, వెన్నముద్దలు తెచ్చి ఇచ్చెద
ముద్దులివ్వమని కోరే బేలను నేను బాలను కాను
నా మనసులోని కోరికను తీర్చుటకు రా 'గోపాలా '
ఈ రాధ నీ కోసమే వేచియున్నది మరువకుమా
నీ తనువూ నా తనువూ పెనవేసుకొని కలసి పోదామా
ఒకరి కొకరు ఐక్యమై ష్వర్గధామాన్ని చేరు కొందుమా
హృదయాలతో పారవశ్యము చెంది పరవశించుదామా ' గోపాలా'
గోపాల గోపాలా ; గోపాల గోపాలా
--((*))--
9*రాధ కృష్ణుని కోసం ఆలాపన
నా ఏకాంతపు నుదుట గీతలపై
నవ మన్మధాకారునికి లొంగి పోతానని
ఆ బ్రహ్మ వాసి యుండవచ్చు
నా యద కాగీతం పై నీ సుఖస్పర్శ ఉందని
నిత్య సౌభాగ్యం పొందు తానని
విరంచి విపులంగా వివరించ వచ్చు
నా నవ్వులు నీ కోసం దాచి వుంచ మని
ప్రాణయానందము పొందుటకు సుఖమని
సృష్టికర్త వెన్నలను కురిపించ వచ్చు
నా బ్రతుకు నిత్య వసంత మౌతుందని
నల్లనయ్య నవమన్మధుడై వస్తాడని
విధాత విపులీ కరించవచ్చు
గోమాతలతో కూడి గోపాలుడు వస్తాడని
ఆదమరచి నిదురించక వేచి ఉండమని
పకృతి మాత హెచ్చరించవచ్చు
మురళితో సరాగాలు పాడుతావని
నీ గాన మాధుర్యంలో నాట్యమాడాలని
నవనీతము అందించి ముద్దు లాడాలని
నవ మాలికలతో నిన్ను అలంకరించాలని
నా మనసును నీకె అర్పించు కోవాలని
నీవే సర్వ భూతములకు నాయకుడవని
సుగుణ పురుషోత్తమ రూపుడ వని
లీలా మానుష రూపములో ఘనుడవని
ఆశ్రీత అంతర్ధాన రూపుడ వని
అక్షరుడవని, శాస్వి తుడవని ఈ రాధకు
ఆ పరబ్రహ్మ భగవత్ప్రాప్తికి, మోక్షానికి
కృష్ణుడే సరియైన ప్రేమికుడిని చెప్పియుడవచ్చు
ఈ రాధ మనస్సును ఊరడించుటకు
కృష్ణుడెప్పుడు వచ్చును,
ఈ కలల కోరికలు ఎప్పుడు తీర్చును,
సర్వదా నిన్నే తలుస్తూ నీప్రేమ పొందాలని
ఆహ్వానిస్తూ వేచి ఉన్నాను కృష్ణా...
--((*))--
*రాధ కృష్ణుని కోసం ఆలాపన
ఎవరో కాదు కృష్ణుడే వస్తాడని
నాలో ఆశలు తీరుస్తాడని
ఎదురు చూపులతో
ఉన్నాను
నవ నాటక సూత్రధారుడై వస్తాడని
ఈ అమాయకురాలి చూపులను
ఆదు కుంటాడని ఆశతో ఉన్నాను
నిను విడజాలనునేను, నీ మనసునై,
నీ ప్రియసఖినై, నీ ప్రేమను పొందుటకై
కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నను
న్యాయమో అన్యాయమో నాకేమి తెలుసు
ఈ విశాల హృదయాన్ని నీకే అర్పించాలని
నీ ఆశలకు నేను బానిస నవ్వాలని
పవిత్ర భావముతో నిన్నే ఆరాధిస్తూ ఉంటానని
సర్వ ధర్మములను ఆచరిస్తూ ఉంటానని
భక్తి భావముతో నిన్నే ఆరాధిస్తూ ఉంటాను
కృష్ణా, కృష్ణా , కృష్ణా
ఈ రాధను కనికరించుటకు మోహనరూపడవై
నా మనసును ఊరడించుటకు రావా కృష్ణ
కృష్ణా, కృష్ణా , కృష్ణా
--((*))--
*రాధ కృష్ణ ప్రేమ తత్త్వం
'శ్రీ కృష్ణ 'నీ చిరునగవుల మోము చూస్తుంటే
నా మనసులో ఉన్న ఆలోచనలన్నీ మటుమాయం
'శ్రీ కృష్ణ 'నీ చిరి మువ్వల గజ్జలు నాదం వింటుంటే
నా మనసు ఆహ్వానిస్తూ తెలియని స్వరమయం
'శ్రీ కృష్ణ 'నీ భావ ప్రకంపనలు చూస్తూ ఉంటే
నా మనసులో ఉన్న కల్లోలాలు ఆవిరి మయం
'శ్రీ కృష్ణ ' నీ మది నుండి వీణ శబ్దాలు వింటుంటే
నా మనసులో అనురాగం విచ్చే పుష్ప మయం
'శ్రీ కృష్ణ ' నీ మాటలు కవితాక్షరాలుగా మారుతుంటే
నా మనసులో ప్రభా ప్రశాంతత చేకూర్చే మయం
'శ్రీ కృష్ణ' నీ పెదవులపై గమకాలూ నాట్య మాడుతుంటే
నా మనసంతా ఆనంద పారవశ్య నిలయం
'శ్రీ కృష్ణ ' నీ వలపు పూల వానజల్లులా కురుస్తుంటే
నా మనసంతా ఉష్ణం తగ్గి నవ వసంత మయం
'శ్రీ కృష్ణ 'నీకు ప్రేమతో పూజించేపువ్వు పరిమళిస్తూ ఉంటే
నా మనసులోని ప్రేమంతా సర్వ వ్యాపక మయం
'శ్రీ కృష్ణ' నీవు సత్యం జ్ఞానం ప్రేమతత్వం తో ఉంటే
ఈ రాధ హృదయం నీకే అర్పిస్తున్నాను ఇక నీకు సొంతం
--((*))--
*రాధాకృష్ణ ప్రణయ సాగరము
వలపుల తలపులు తెలుపవా
మెరుపుల సొగసులు చూపలేవా
మనుసుకు మమతలు పంచలేవా
ఓ రాధికా నీ మనసు నాదికాదా
గంధము పూసెద, చందనం పూసెద
నిండుగ తులసి మాలను వేసెద,
మేఘశ్యామ, మన్మధ కరుణ రూప
శిఖ పింఛమౌళి మురళీ ముకుందా
నిమ్మరసం ద్రాక్షాపాకం త్రాగెదవా
కదళీఫలములను గ్రోలెదవా
మదన కదన కుతూహలములే
మనసును రంజింపచేయునుకదా
ఓ రాధికా నీ మనసు నాదికదా
నారికేళ రసములు కావలెనా
కదళీఫల రసము కావలెనా
నవనీతము కావలెనా
ఇక్షు రసములను కావలెనా
శిఖ పింఛమౌళి ముకుందా
మూగ మనసుతో కోరుతున్నావు
మౌన గీతములు పాడుతున్నావు
నుదుటి రాతలు చూస్తున్నావు
ప్రేమను పంచుతున్నావు
ఓ రాధికా నీ మనసు నాదికాదా
మోహనమురళి నీకోసమే ఉన్నా
వంశీకృష్ణ నిన్ను ప్రార్ధిస్తూఉన్నా
అధరామృతాములను అందిస్తున్నా
నంద గోపాల కృష్ణ, గోకులనందా
రాధిక ఆరాటం చూడగా రావా
వలపుల తలపులు తెలుపవా రాధిక
మెరుపుల సొగసులు చూపావా కృష్ణ
. --((*))--
వలపుల తలపులు తెలుపవా
మెరుపుల సొగసులు చూపలేవా
మనుసుకు మమతలు పంచలేవా
ఓ రాధికా నీ మనసు నాదికాదా
గంధము పూసెద, చందనం పూసెద
నిండుగ తులసి మాలను వేసెద,
మేఘశ్యామ, మన్మధ కరుణ రూప
శిఖ పింఛమౌళి మురళీ ముకుందా
నిమ్మరసం ద్రాక్షాపాకం త్రాగెదవా
కదళీఫలములను గ్రోలెదవా
మదన కదన కుతూహలములే
మనసును రంజింపచేయునుకదా
ఓ రాధికా నీ మనసు నాదికదా
నారికేళ రసములు కావలెనా
కదళీఫల రసము కావలెనా
నవనీతము కావలెనా
ఇక్షు రసములను కావలెనా
శిఖ పింఛమౌళి ముకుందా
మూగ మనసుతో కోరుతున్నావు
మౌన గీతములు పాడుతున్నావు
నుదుటి రాతలు చూస్తున్నావు
ప్రేమను పంచుతున్నావు
ఓ రాధికా నీ మనసు నాదికాదా
మోహనమురళి నీకోసమే ఉన్నా
వంశీకృష్ణ నిన్ను ప్రార్ధిస్తూఉన్నా
అధరామృతాములను అందిస్తున్నా
నంద గోపాల కృష్ణ, గోకులనందా
రాధిక ఆరాటం చూడగా రావా
వలపుల తలపులు తెలుపవా రాధిక
మెరుపుల సొగసులు చూపావా కృష్ణ
. --((*))--
om
రిప్లయితొలగించండి