20, జనవరి 2019, ఆదివారం

ఆరాధ్య భక్తి లీల - 100



ఆరాధ్య భక్తి లీల - 100 

ప్రాంజలి ప్రభ  
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

ఐక్యతన్నది లేక కలహంబులు పెరిగే   
సౌఖ్యంబులు కల్లలై కోపంబులు పెరిగే 
సద్గుణంబులు లేక పోకిరిలు పెరిగే
చదువు కల్లలై నిరుద్యోగలు పెరిగే 

యోగ్యతన్నది లేక మేధావులు పెరిగే 

భాగ్యంబులివి కల్లలై భయాలు పెరిగే 
దానమన్నది లేక బిచ్చగాళ్ళు పెరిగే   
తనువు కల్లలై రోగములు పెచ్చు పెరిగే

సరితూకములు లేక నష్టములు పెరిగే  
సాంగత్యము కళ్ళలై విడాకులు పెరిగే 
పతి మాట వినలేక పోట్లాటలు పెరిగే 
సతియు మాట కల్లలై వేదనలు పెరిగే         

దేశ ప్రియము లేక దోపిడులు పెరిగే 

దేహమన్నది కల్ల ఆశ వెల్లువ  పెరిగే  
శుచియన్నదియు లేక అసుబ్రత పెరిగే  
రుచియు కల్ల ఆకలి ఆరాటం పెరిగే 

కల్పితాలు చేర్చగా కధలు పెరిగే 

కష్టాలు వెంబడించగా భారం పెరిగే 
కల్లలాడు కవులుండగా గుర్తింపు తరిగే
కలము వ్రాత తగ్గగా కాపీలు పెరిగే 

మనిషి మనిషికి మధ్య దూరం పెరిగే 

మానవత్వం విలువలు తరిగే 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 
గమనించావా మా దేశప్రగతి  

--((**))--



ఆరాధ్య భక్తి లీల-99 
 - ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

చూడు అటుచూడు 
ఆ కనిపించేది శ్రీ హరివాసము 
ఏడుకొండలా మయము 
సంతృప్తి పరిచే దైవమందిరము !!

అదే శ్రీ వేంకటేశ్వరా నిలయము  

అదియే దేవతల కపు రూపము 
అదియే  సకల ప్రపంచ ప్రజలకు 
మొక్కులు తీర్చే ఆనంద మయము 

చెంగట ఉండు సుఖ సంతోషము  

శాంతి సంపద అందించే సౌఖ్యము 
బంగారు శిఖరాల పుణ్య ధామము 
నిత్యకళ్యాణ నిర్మల ప్రాంతము 

కైవల్యము చెందే సుమ వాసము

సిరి సంపద లందించే నివాసము   
పాపములు తొలగించే పావన మయము 
నిత్య దర్శనమిచ్చే ఆనంద నిలయము 

చూడు అటుచూడు 

ఆ కనిపించేది శ్రీ హరివాసము 
ఏడుకొండల మయము 
సంతృప్తి పరిచే దైవమందిరము !!

--((**))--


ఆరాధ్య భక్తి లీల-98 

 - ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

ఝాటల - స/త/జ/గగ IIU UU - IIUI UU 

11 త్రిష్టుప్పు 356 
సకలానందం - సుమ తేజ మార్గం 
సమయానందం - సుఖ భావ యుక్తం 
మనసా నందం - సమ భక్తి భావం  
తపసా నందం - దరి చేరు మోక్షం 

మదిలో రాగం మమతాను నేస్తం 

సమయానందం సమ భావ ప్రేమమ్ 
మనసానందం సుఖ భావ మోక్షం 

మనసావాచా - మహిలోన నిన్నే 

తిరువీధుల్లో - తిరిగే భూ దేవీ
రమ శ్రీ నాధా - మమతానురాగా 
లను అందించే - సిరి వళ్లి దేవా  
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా
  
--((**)-- 

ఆరాధ్య భక్తి లీల -97

రచయత: మాలాప్రగడ రామకృష్ణ 

రా బాల కృష్ణ రా రా గోపాల కృష్ణా 
ముద్దు లొలికే మోహన  కృష్ణా 

బంగారు గిన్నెలో పాలు పోసానురా 

పరవశిస్తూ త్రాగటానికి రారా కృష్ణా
దొంగ నీవని పడచులు అంటున్నారురా 
నీ మాయలు తెలియక పల్కెను కృష్ణా 
  
గోవర్ధనా గిరి నెత్తావు కృష్ణా
కాళియ మర్దనం చేసావు కృష్ణా  
పూతనను మట్టి కరిపించావు కృష్ణా
సర్పాన్నుండి బాలల్ను రక్షించావు కృష్ణా 
  
రక్కసులను సంహరించావు కృష్ణా
తల్లి తండ్రులను ఆదుకున్నావు కృష్ణా
బాలుగా మునుల కభయమిచ్చావు కృష్ణా
యశోదకే నోటిలో లోకాల్ని చూపావు కృష్ణా

రా బాల కృష్ణ రా రా గోపాల కృష్ణా 

ముద్దు లొలికే మోహన  కృష్ణా 


--((**))--
ఆరాధ్య భక్తి లీల -96
ప్రాంజలి ప్రభ   
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

అవియే నన్ను, వెంబడించాయరా ...   

అదే కారణ హేతువు,  గురువర్యులా .... 

ధన, వాంఛ మదిలోన - దగిల నప్పటి రోజు  
దేవా, మీమీద మాకు చింత గలుగు
భయ, దు:ఖములు - కలిగి నప్పటి రోజు  
దేవా, మీమీద ప్రాత్యేక  భక్తి గలుగు   

చెలఁగి పాపములు మించిన రోజు  

హరి నామోచ్ఛారణ చేయాలని బుధ్ధి గలుగు
బలిమి భవరోగములు బడలినప్పటి రోజు  
హరిణి పలుమార్లు ప్రార్ధించాలని గలుగు 

అన్ని తొలగి నీ వెవరో తెల్సిన రోజు  
మన్ననలకు ప్రాప్తి గలుగు   
శ్రీ వేంకాటేశ్వరుని కనులారా చూసిన రోజు  
సమస్త సౌఖ్యంబులు గలుగు

అవియే నన్ను వెంబడించాయరా ...   

అదే కారణ హేతువు గురువర్యులా .... 

--((**))--

  


ఆరాధ్య రక్తి లీల -95

ప్రాంజలిప్రభ 
మల్లాప్రగడ రామకృష్ణ 

చెలి చన్నుల ఊపులకు  
చెలియ చమత్కార మాటలకు 
చిగురుబోడి చిరుహాసమునకు 
చిలుకలకోలోకి పొడుపుకథలకు 
లొంగావా శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

చోరుబుడత చోరత్వమునకు  
చెలువ చామరం ఉడుపులకు 
జక్కువచంటి జిమ్ముకులకు 
జలజనేత్రి ఈదులాటకు
లొంగావా శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

తనుమధ్య తాపత్రయమునకు 

ఝషలోచన ఆలోచనలకు 
తాటంకిని ఉబలాటలకు  
తాటంకావతి తాంబూలముకు 
లొంగావా శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా  
\
--((**))-- 

Radha Krishna

ఆరాధ్య భక్తి లీల -94
రచయత:  మల్లాప్రగడ రామకృష్ణ
భావము :భౌతిక బంధాలు సాస్వితమా అసాస్వితమా ఈ సంకీర్తన .

సమస్త బంధాలు, సముద్రములో సిడిగుండాలు 

కాల చక్రంలో, తిరిగి కలిసే పేగుబంధాలు  

అడుగులో అడుగులు వేస్తూ భూమాతతో బంధం 

ప్రకృతి మనతో స్నేహం కలిపే జీవన బంధం 
నీలా కాశంలో గాలికి కదిలే మేఘాల బంధం 
నక్షత్రాల తళుకులు చీకటిలో ఉండేభంధం   

ప్రతి శ్వాసలో ఒకటిగా కలిసే ప్రేమ బంధం  

ఒకరికొకరు పంచు కొనేటి వివాహ బంధం  
9 నెలలు మోసి జీవన్మరణాల పేగు బంధం 
మానుకు తీగ చుట్టుకొన్నట్లే శ్రీపురుష బంధం 

నిత్యమూ ధనమున్న చోట తోబుట్టువుల బంధం   

అర్ధంలో అర్ధము పరమాత్మ చూపే ఆత్మ బంధం  
దేవునికి పూజారికి మధ్య తలపుల బంధం 
మనుష్యుల మొక్కులుతీర్చే శ్రీనివాసుని బంధం  

--((**))--






ఆరాధ్య భక్తి లీల -93
రచయత:  మల్లాప్రగడ రామకృష్ణ

భావము :భౌతిక యాగ యజ్ఞాల కన్నా జ్ఞానయజ్ఞం మోక్ష సాధనమని ఈ సంకీర్తన  .


మోక్ష సాధనకూ, జ్ఞానయజ్ఞమే సులభ మార్గం 

సమస్యలను పరిష్కరించే, ది గురువు మార్గం  

శరీరంలో, అజ్ఞానమ్ కత్తితో, తొలగించే మార్గం 

వైరాగ్యం అనే, కత్తి పశువును నరికే మార్గం  
జ్ఞానమనే, అగ్ని గుండంలో, మరిగించిన మార్గం 
జ్ఞానాభివృద్ధికీ, గురుశిష్యుల శిక్షణా మార్గం  

బ్రాహ్మణులు ఏకమై, పరమాత్ముని చేరే మార్గం 

శ్రీహరి పాదతీర్థం అనే, సోమ రసమే మార్గం
సంకీర్తన అనే, సామగానం సంపూర్ణ మార్గం   
గురుబోధతో, శ్రీవేంకటేశ్వరుని చేరే మార్గం 

యజ్ఞం చేయుటే, దైవసంకల్పానికి మోక్షమార్గం

గురువుతో ద్వయమనే, ప్రసాదాన్ని పొందే మార్గం   
మొదట యదలో శ్రీనివాసుని పొందేటి మార్గం 
తదుపరి జ్ఞాన దీక్షతో, శాంతి కల్పించే మార్గం   

భౌతిక యజ్ఞాల నుండీ, మనస్సును మార్చేమార్గం 

అంతర్గత ఆలోచన లన్నీ, తొలగించే మార్గం 
స్త్రీ పురుష భేదం లేకుండా, జ్ఞానమ్ పొందేటి మార్గం 
గురుబోధతో శ్రీనివాసునీ ఆరాధించే మార్గం 

మోక్ష సాధనకు జ్ఞానయజ్ఞమే సులభ మార్గం 

సమస్యలను పరిష్కరించేది గురువు మార్గం  

--((**))--




ఆరాధ్య భక్తి లీల- 92
రచయత:  మల్లాప్రగడ రామకృష్ణ
భావము : పాపపుణ్యములు రెండు భగవంతుని మాయచేత చేస్తున్నాం. వీటిని దాటాటం ఆయన దయ వలనే సాధ్యం.

నీవేగతి మాకు, వేరు దారి లేదు, శ్రీ వేంకటేశ్వరా   

మమ్ము కాపాడ కుండా, ఎట్లా ఉందువు శ్రీవేంకటేశ్వరా   

దేవా నీవను కున్నట్లే, మమ్ము నడిపిస్తూనే ఉంటావు 

మేము ఏది సాధించలేమూ, అయినా ఏలుకో మంటావు  
తీపి ఎక్కువ తిన్నప్పుడూ, కారం తినాలని పిస్తావు 
పుణ్యాలు చేసినప్పుడూ, అహం చేరి పాపమ్ చేయిస్తావు 
  
చేతికి సంకెళ్లు వేసీ, పాప పుణ్యాలు చేయిస్తుంటావు 
మనస్సుకు శాంతి కల్పించకా, మమ్ము ఆడిస్తూ ఉంటావు
చలి కల్పించీ, సుఖం ఇచ్చేటి వేడితో కల్వ మంటావు 
సంసార పోషణకూ, సంపద కొరకూ, తిప్పు తుంటావు 

భోగవిరాగముల చుట్టూ, తిప్పి సంతోష పడతావు
ఒక్కరి కష్టంతో, కొందరి ప్రాణాల్ని రక్షించ మంటావు  
మంచో చెడో, తెల్సుకునే శక్తి ఇవ్వక మాయ చేస్తావు
ఇష్టాల్ని కష్టాలుగా, కష్టాల్ని ఇష్టాలుగా మారుస్తావు  

నీవేగతి మాకు, వేరు దారి లేదు, శ్రీ వేంకటేశ్వరా   

మమ్ము కాపాడ కుండా, ఎట్లా ఉందువు శ్రీవేంకటేశ్వరా   



--((**))--

ఆరాధ్య భక్తి లీల -91
Pranjali Prabha.  
రచయత: మాలాప్రగడ రామకృష్ణ

రా బాల కృష్ణ రా రా గోపాల కృష్ణా

ముద్దు లొలికే మోహన  కృష్ణా

బంగారు గిన్నెలో పాలు పోసానురా

పరవశిస్తూ త్రాగటానికి రారా కృష్ణా
దొంగ నీవని పడచులు అంటున్నారురా
నీ మాయలు తెలియక పల్కెను కృష్ణా

గోవర్ధనా గిరి నెత్తావు కృష్ణా

కాళియ మర్దనం చేసావు కృష్ణా
పూతనను మట్టి కరిపించావు కృష్ణా
సర్పాన్నుండి బాలల్ను రక్షించావు కృష్ణా

రక్కసులను సంహరించావు కృష్ణా

తల్లి తండ్రులను ఆదుకున్నావు కృష్ణా
బాలుగా మునుల కభయమిచ్చావు కృష్ణా
యశోదకే నోటిలో లోకాల్ని చూపావు కృష్ణా

రా బాల కృష్ణ రా రా గోపాల కృష్ణా

ముద్దు లొలికే మోహన  కృష్ణా

--((**))--


ఆరాధ్య భక్తిలీల-90
Pranjali Prabha. 
మల్లాప్రగడ రామకృష్ణ 
 శ్రీకాంతుని తప్ప తక్కిన దేవతలను కొలుచుట వలన ప్రయోజనం లేదు. నిష్ఫలం

శ్రీకాంతుని వేడుకో, చింతలు తొలగించుకో 

అన్యుని కొల్చినా, ఫలితంలేదని తెల్సుకో

మోదముతో, మొక్క వేళ్ళకు, నీరు పోస్తే 
కొమ్మ, ఆకు, మొగ్గ, పువ్వు, కాయలు కాస్తే
గాలి, నీడను పంచి, ఉపయోగ పడ్తే  
అట్టిదే మర్చి ఉన్న జీవితం వ్యర్ధమే       

ఆదిమూలమైన శ్రీహరిని ప్రార్ధిస్తూ 

అన్యదైవాలను స్మరించుట వ్యర్ధమే   

గర్భస్తురాలు భుజించి శాంత పడితే  
శిశువు క్షేమంగా ఉండి ఉద్బవించు
హృదయంలో ఉన్న శ్రీహరిని స్మరిస్తే 
నిత్యసౌభాగ్య సంతోషాలు ఉద్భవించు   

ఎంత ఎగిరినా నేలను విడువవు 

వరదలో చింతపండులా అవుతావు
శ్రీహరొక్కడే రక్షించునని తెల్సుకో   
ఏ ఒక్కరూ రక్షించరని తెలుసుకో

శ్రీకాంతుని వేడుకో, చింతలు తొలగించుకో 

అన్యుని కొల్చినా, ఫలితంలేదని తెల్సుకో

--((**))--



GIFS HERMOSOS: FLORES ENCONTRADAS EN LA WEB


ఆరాధ్య భక్తి లీల- 89

Pranjali Prabha.  
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ
భావము : ఆత్మ స్వరూపము తెలిసేది అంతర్ముఖులకే గాని బాహ్య దృష్టి కల వారికి కాదు

ఎంతా వెతికినా, ఆత్మ స్వరూపాన్నీ, తెలుసుకో,లేమేమో  

శ్రీ హరిణి అభ్యాసంతో,  ఆరాధిస్తే, తెలుసుకో గలమూ 
    
మన మనసులో, కలిగే చింతలన్నీ, మరవలేమేమో 
మన ఇంద్రియాలను, నిగ్రహించుకుంటే, మరువగలమూ  
హృదయ పద్మలో ఉన్నా, పరమేశ్వరునీ, గాంచ లేమేమో 
ఆణువణువూ, ప్రేమనూ పంచి పుచ్చుకొంటే, గాంచ గలమూ  

కర్తృత్వ కర్మ ఫలాపేక్షగానీ అర్ధం చేసుకోలేమేమో 

ప్రకృతి ప్రారబ్ద ప్రభావమును అర్ధం చేసుకోగలమూ 
ఇచ్చి పొందేటి సత్యం ధర్మం న్యాయం చెప్పలేమేమో   
వేదపఠనం, జ్ణాణయజ్ఞం, దానధర్మాలు చేయగలమూ 

చేసిన పాపల వల్లా, అంతర్ ముఖుణ్ణి తెల్సుకోలేమేమో 

బాహ్య ప్రపంచాన్నీ, వదలి కీర్తిసే తెలుసుకోగలమూ   
హృదయ కమలంలోని చిదాకాశం గమనించలేమేమో 
నిత్యమూ "ఓం శ్రీ రాం" నామ జపముతో గమనించగలుమూ 

ఎంతా వెతికినా, ఆత్మ స్వరూపాన్నీ, తెలుసుకో,లేమేమో  
శ్రీ హరిణి అభ్యాసంతో,  ఆరాధిస్తే, తెలుసుకో గలమూ 

--((**))--
ఆరాధ్య భక్తి లీల -88
Pranjali Prabha. 
మల్లప్రగడ రామకృష్ణ  

విష్ణువు మూడుకోట్ల దేవతల సమేతముగా ఆశీసులందించు పుణ్యదినము ముక్కోటి ఏకాదశి సందర్భంగా బంధుమిత్రులకు శుభాకాంక్షలు....

ముక్కోటి దేవతల తోడుగా

భువికి దిగివచ్చిన శ్రీ శ్రీనివాసా 
వైకుంఠ వాకిళ్ళు తెరవగా
ఉత్తర ద్వారమున భక్తులకే 
దర్సనం ఇచ్చిన  శ్రీ శ్రీనివాసా .....   

ఏడుకొండలు ఎక్కి వేడు కుంటున్నా 
ఎటేటా మొక్కులు సమర్పిస్తున్నా 
నలు దిశల నుండి తరలివస్తున్నా   
గోవింద గోవిందా అంటూ కీర్తిస్తున్నా 

నీ పాదముల సేవను నిక్కముగా చేస్తున్నా 

నిత్యమూ నిన్నే ఆరాధిస్తూ జీవిస్తున్నా 
నీ నగుమోము చూసి పరవసిస్తున్నా  
నిండైన మనస్సుతో కరుణించే దైవమా  

శరణం శరణం అంటూ వేడుకుంటున్నా  

పాపములు తొలగించి, పేదరికం మాపుతున్నా  
ఏమి నీ మాయ, ఏమి నీ వైభవం శ్రీ శ్రీనివాస    
కరుణించి కటాక్షించే శ్రీ పద్మావతి వల్లబా 

ముక్కోటి దేవతల తోడుగా

భువికి దిగివచ్చిన శ్రీ శ్రీనివాసా 
వైకుంఠ వాకిళ్ళు తెరవగా
ఉత్తర ద్వారమున భక్తులకే 
దర్సనం ఇచ్చిన  శ్రీ శ్రీనివాసా 

--((**))--



ఆరాధ్య భక్తి లీల - 87

Pranjali Prabha.  
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ

కులకక ఒయ్యారి భామలారా నడవరో నడవరో

అలమేల్మంగమ్మ పల్లకిలో ఉంది నడవరో

జలజల రాలును జాజులు మాయమ్మకు 
నుదురు కదలక ఉండేటట్లు నడపరో 
పాపిట గంధపు పొడిరాలును మాయమ్మకు  
శరీరము కదలక ఉండేటట్లు నడపరో 

కులకక ఒయ్యారి భామలారా నడవరో నడవరో
అలమేల్మంగమ్మ పల్లకిలో ఉంది నడవరో

ముత్యాల జడకుచ్చుళ్ళు కదులు మాయమ్మకు 
కర కంకణాలు కదలక ఉండేటట్లు నడపరో 
కాళ్లకు పట్టాలు కదులును మాయమ్మకు 
ఓ భామలరా పల్లకిని కడు జాగర్తగా నడపరో 

కులకక ఒయ్యారి భామలారా నడవరో నడవరో
అలమేల్మంగమ్మ పల్లకిలో ఉంది నడవరో

భారపు గుబ్బలమీద పమిట జరుగు మాయమ్మకు 
పల్లకీ పట్టే ముద్దుగుమ్మలారా నెమ్మదిగా నడపరో   
పల్లకీ దించి ముత్యాల పాదరక్షలు అందించరో 
మనసుదోచే చెలికత్తలారా అమ్మవారికి హారతి పట్టరో  

సమకూడె వేంకటేశ్వరుడు మాయమ్మకు 
సంతోషంతో సంతృప్తి పరిచేది మాయమ్మరో  

సమకూడె వేంకటేశ్వరుడు మాయమ్మకు 
సంతోషంతో సంతృప్తి పరిచేది మాయమ్మరో  

--((**))--



ఆరాధ్య భక్తి లీల-86

Pranjali Prabha.  
రచ్చయతా: మల్లాప్రగడ రామకృష్ణ 

జన్మమేదైనా, పరిస్థితి ఏదైనా,

కలిమిలేములు, సుఖదుఃఖాలు ఏవైనా,
మంచి చెడులు, పుణ్య పాపాలు ఏవైనా  
అంతా నీ చలవే 
శ్రీ శ్రీ  శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా   

మృగజన్మ ఐన, మనిషి జన్మ ఐన

మనస్సు సంఘర్షణలే అని తెలుసుకో   
మృగజన్మలో చెప్పుకోలేని బాధ
మనిషి జన్మలో చెప్పలేని భాధ అని తెలుసుకో
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 
అని కొలిచేవారికి  అంతా ముక్తే 

మనస్సు విరక్తి చెందితే మంచి కానరాదు 
అంతరాత్మలో ఉన్న దేవుడ్ని మరవక తప్పదు 
మృగం కాని, మనిషి గాని ఉండే ప్రదేశమే 
తృప్తి పడి, సంతృప్తి పడక తప్పదు
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 
అని కొలిచేవారికి  అంతా ముక్తే 

జ్ఞానం పొందిన వ్యక్తికీ, అంతా వైకుంఠమే 

అజ్ఞానం తో ఉన్న వ్యక్తికీ, అంతా ఆగమ్యగోచరమే
విశ్రాంతి జీవికి ముక్తి ప్రసాంధించేది వైకుంఠుడే
దాసుడవైతే హెచ్చు తగ్గులు చూడక రక్షకుడే 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 
అని కొలిచేవారికి  అంతా ముక్తే 

జన్మమేదైనా, పరిస్థితి ఏదైనా,

కలిమిలేములు, సుఖదుఃఖాలు ఏవైనా,
మంచి చెడులు, పుణ్య పాపాలు ఏవైనా  
అంతా నీ చలవే 
శ్రీ శ్రీ  శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా   

--((**))--





ఆరాధ్య భక్తి లీల- 85

Pranjali Prabha.    
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఎవ్వరెవ్వరితో - ఎందరెందరితో 

ఎన్నెన్నో సేవలతో - ఎదుర్కొంటున్నా             
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

అహంతో ఏదోచేస్తా - ఆశచూపిస్తా 

అయినా పంచేద్రియాల్కి లొంగిపోతా   
కర్మబంధానికి చిక్కి - సంసారాన్ని మోసా 
అయినా జ్ఞానేంద్రియాల్కి లొంగి పోతా  
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

వయసు ఉడుకుతో - వల్ళమాలిన ప్రేమతో

అయినా మాయను జయించక లొంగిపోతా   
కురిసే మేఘంలా, వీచే వెన్నెల తీరుగా 
అయినా మనసు జాయించక లొంగిపోతా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

ధ్యానం చేస్తుంటే, అజ్ఞానం గుర్తుకొస్తుందే   

అయినా నీపనేనని తెల్సి మౌనంగా ఉంటా 
మంచో చెడో తెల్సి తెలియక చేస్తున్నా 
శ్రీ హరి నివే నాకు దిక్కు అని వేడు కుంటా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

ఎవ్వరెవ్వరితో - ఎందరెందరితో 

ఎన్నెన్నో సేవలతో - ఎదుర్కొంటున్నా            
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 
--((**))--



ఆరాధ్య భక్తిలీల- 84

ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
భావము :సర్వస్వము భగవంతునిది అయినప్పుడు తిరిగి ఆయనకు ఆయన సంపద సమర్పించడం ఏమిటి

నీవిచ్చిన ధనాన్ని - నీకే సమర్పిస్తున్నా 
శ్రీ వేంకటేశ్వరా - నేను సిగ్గు పడుతున్నా  

భార్య శీలంతో - బిడ్డల్కి జన్మ ఇచ్చియున్నా   
భర్తకే బిడ్డల  - పోషణకు స్వేశ్చ యున్నా   
నీ ప్రేమతో పుణ్య కార్యాలను చేసియున్నా  
ఆపుణ్యం నీకే అర్పిస్తే నవ్వు వస్తుందన్నా

నీవిచ్చిన ధనాన్ని - నీకే సమర్పిస్తున్నా 

శ్రీ వేంకటేశ్వరా - నేను సిగ్గు పడుతున్నా  
  
ప్రోత్సాహక శక్తిగా, నాహృదయంలో ఉన్నా 
లక్ష్మీనారాయణా, నీ సేవకుడనై ఉన్నా
ఇది గొప్ప కాదని, నీ దయాదితో ఉన్నా 
సేవచేస్తూ, మాటిమాటికి చెప్పుకుంటున్నా   

నీవిచ్చిన ధనాన్ని - నీకే సమర్పిస్తున్నా 

శ్రీ వేంకటేశ్వరా - నేను సిగ్గు పడుతున్నా  

అద్దంలోని బింబాన్ని చూసి తృప్తిగా ఉన్నా  

అంతరాత్మలో నీవే నని బ్రమతో ఉన్నా 
శరణాగత వత్సలుడనై వేచి యున్నా 
ఆత్మార్పణ చేయుటకు వెనుకాడకున్నా 

నీవిచ్చిన ధనాన్ని - నీకే సమర్పిస్తున్నా 

శ్రీ వేంకటేశ్వరా - నేను సిగ్గు పడుతున్నా  

--((**))--


ఆరాధ్య భక్తిలీల- 84
ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

అందరం కలసి వచ్చామయ్యా 
దూరమని చూడకుండా మెట్టు మెట్టు నడిచామయ్య  
ఎలాచేరామో ఎలావచ్చామో మాకేతెలియదయ్యా 
అంట నీ లీలా మహత్యం 
ఉడుకు రక్తమే కాక, వయో వృద్ధులు కూడా 
ఏడూ కొండలు నడిచి నిన్ను చేరారయ్యా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

నీ దర్శనం కోసం పడిగాపులు కాసారు వారు     

గంట కాదు ఏకంగా 18 గంటలు వేచి ఉన్నారు
నీ నిర్ణయమో కాలనిర్ణయమో తెలియక వారు
ఎవరికీ చెప్పుకోలేక, సరైన వసతులు లేక      
ఎవ్వరిని అడగ లేక, మాట్లాడక, మౌనంగా ఉండ లేక 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా అని ప్రార్ధించారు  

తిరుమలలో భక్తులు వచ్చిన భక్తులకు ప్రసాదం పెట్టారు  
ఆత్మారాముడు శాంత పడే విదముగా గౌరవించారు 
మనస్సులో ప్రశాంతత కల్పించి నిత్యకార్యక్రమాలు చూపారు 
ఎంతో ప్రయాశతో నీ మందిర సన్నిదానం లో వచ్చాక 
క్షణకాలం కుడా ఉండనీయక జరుగు జరుగని తోసేశారు  
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా అని ప్రార్ధించారు 
--((**))--





ఆరాధ్య భక్తి లీల -83

ప్రాంజలి ప్రభ 
రచయత:మల్లాప్రగడ రామకృష్ణ  

కామక్రోధమదమాత్సర్యాలు వెంటాడు తున్నాయయ్యా  

నిన్నే  శరణ మంటూ పార్ధిస్తున్నామయ్యా
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

అజ్ఞానంకు తోడు, కరువుకాల మయిందయ్యా 

మాభయాలన్నీ తొలగించి ధైర్యం చెప్పవయ్యా  
పాపాలు పొలంలో మృగాల్లా మాలో చేరాయయ్యా 
పుణ్యమనే పంట నాశనం చేసి ఉన్నాయయ్యా  
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

కలిమాయలతో చెరువు లెండి పోయాయయ్యా 

మాలో ధర్మమనే చెరువు ఎండి పోయ్యిందయ్యా 
దీనులమై నీదయకోసం అర్ధిస్తున్నామయ్యా 
మమ్మల్ని రక్షించే నిత్యకల్యాణ దైవమయ్యా  
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

కామ మొహాలకు చిక్కి పతనమయ్యా మయ్యా 

జ్ఞానం ఈ స్థితిలో సంపాదించ లేకున్నామయ్యా   
శ్రీ వేంకటేశ్వరా  మీ పాదాలే మాకు దిక్కయ్యా 
త్వరగా వచ్చి మమ్మల్నందర్నీ కాపాడవయ్యా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

కామక్రోధమదమాత్సర్యాలు వెంటాడు తున్నాయయ్యా  

నిన్నే శరణ మంటూ పార్ధిస్తున్నామయ్యా
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 


--((**))--





ఆరాధ్య భక్తి లీల-82

Pranjali Prabha.  
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 
భావము :భగవంతుని ఇచ్ఛ అతిక్రమించి నడుచుట తప్పు అది ముక్తి కోసమైనా సరే

సృష్టి కర్త ఉద్దేశ్యం అర్ధం కాదు, ప్రయత్నం మారదు 

భగవంతుని మహిమ తెల్వదు, పశుబుద్ధి మారదు    
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

జన్మసార్ధకం ఎదో తెలుసుకోలేక బ్రతికేవున్నా  
ఏదిమోక్షమో తెల్వక పృద్విపై ఉండి ద్రోహం చేస్తున్నా 
సంపద సుఖసంతోషాలు నందించే  ప్రభువుగా ఉన్నా  
సేవకులుగా ఉండి నీ ఆజ్ఞలను పాటించలేకున్నా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

సృష్టి కర్త ఉద్దేశ్యం అర్ధం కాదు, ప్రయత్నం మారదు 

భగవంతుని మహిమ తెల్వదు, పశుబుద్ధి మారదు    
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

పంచేంద్రియాలు అందించావు అదుపులో పెట్టలేకున్నా 

తల్లి తండ్రి గురువు మాటలను పట్టించు కోలేకున్నా 
సంసార సాగరాన్ని ఈదుతూ గట్టున చేర్చలేకున్నా 
తల్లి తండ్రులకన్నా నీవే దిక్కని నమ్మి ప్రార్ధిస్తూ ఉన్నా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

సృష్టి కర్త ఉద్దేశ్యం అర్ధం కాదు, ప్రయత్నం మారదు 

భగవంతుని మహిమ తెల్వదు, పశుబుద్ధి మారదు    
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా
--((**))--


Libia María Gutiérrez Ramírez - Google+
















ఆరాధ్య భక్తి లీల -81

Pranjali Prabha. 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ

భావము : వేదాలలో చెప్పినది, భగవద్గీత లో చెప్పిన పరమార్ధం ఒకటే - శరణాగతి


 ఒక్కడే మోక్షకర్త, వొక్కటే శరణాగతి 

సంతోషముతో మన:శాంతినిచ్చేది       
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

లోకాలెన్నెన్నో ఉన్నా, దేవతలెందరో ఉన్నా,

వ్రతాలెన్నీ చేసినా సుఖం తప్ప మోక్షం కాదు 
వేదంల్లో దేవతల్ని ఆరాధించమని ఉన్నా  
అనిత్యసుఖం తప్ప నిత్యమైన మోక్షం కాదు  
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

కోరికలు ఎన్నో ఉన్నా, అందుబాటులో ఉన్నా 

దక్కేదే దక్కు, దక్కిన దేదియు మోక్షం కాదు
జ్ఞాని వేదాల్లో ఉన్నా సారార్ధం గ్రహించి ఉన్నా 
విషయ పరిష్కారం చేసిన మోక్షము కాదు      
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

సంపదతో మనోధైర్యం ఉన్నా, శక్తియేఉన్నా  

ఓర్పుతో జ్ఞానం పంచితే నిత్యం మోక్షం కాదు 
స్త్రీలు సభ్యతతో సంస్కారంతో ధర్మంగా ఉన్నా       
జీవితంలో విద్యాబుద్దు లిచ్చినా మోక్షం కాదు 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

ఒక్కడే మోక్షకర్త, వొక్కటే శరణాగతి 

సంతోషముతో మన:శాంతినిచ్చేది      
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 
--((**))--




ఆరాధ్య భక్తి లీల -80

Pranjali Prabha. 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ

ప్రతి ఒక్కరు మాయకు, ఆకర్షణకు లొంగి పోతారు, నిగ్రహించుకొని నిజం తెలుసుకొని 

మన:శాంతి కొరకుదైవాన్ని తలుస్తూ కొన్ని విషయాలు తెల్సుకొని ప్రవర్తించటమే మానవుల లక్షణం  

చిక్కులు, కష్టాలు, కల్పించేది దైవము కాదనీ   

మనుష్యులమధ్య సఖ్యతా భావమని  తెలుసుకొన్నా    
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

మన మేలో, కీడో, కల్పించేది దైవమకాదనీ  

పృథ్విపై మనం చేసే, పుణ్య పాపాలు అనీ తెలుసుకొన్నా  
పొగడ్తలు, తిట్లు మన గుణ దోషాలనీ  
కీర్తి, అపకీర్తి, మన నడతలే ననీ తెలుసుకొన్నా   
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

జ్ఞానం, అజ్ఞానం, మనస్సు బంధ మోక్షాలనీ   

తల్లి తండ్రుల పుణ్యఫలం వల్లే జన్మనీ తెలుసుకొన్నా    
మనకు సద్గతి కల్పించేది గురువననీ తెలుసుకో  
సర్వం తెలిపే తల్లి తండ్రులే  ననీ తెలుసుకొన్నా   
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

నిరంతర హరినామమే స్మరణ ముఖ్యమనీ 
త్రివిధ తాపం రక్షించేది శ్రీనివాసేననీ తెలుసుకొన్నా  
శోక మోహ రాహిత్యమునకు శాస్త్రమనీ  
సంసార సాగరం దాటించేది దైవమనీ తెలుసుకొన్నా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

చిక్కులు, కష్టాలు, కల్పించేది దైవము కాదనీ   

మనుష్యులమధ్య సఖ్యతా భావమని  తెలుసుకొన్నా    
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 
(ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక)
--((**))--





ఆరాధ్య భక్తి లీల -79
Pranjali Prabha. 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ

చెడులోకూడా, మంచి గ్రహించటం అంటే ఇదేనేమో 

రామాయణ భారత భాగవత,  కధలివే నేమో

రావణుఁడుగా పుట్టించావు, స్త్రీ చోరుడుగా మార్చావు  

రాముడై రావణుని చంపి, అవతారుడ వైనావు 
మాకు దర్శనమిచ్చి, మమ్ము రక్షించి, ఉద్దరించావు 
సరి అయిన జోడు ఉంటె గాని, అవతరించవు
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

కంసుడిగా పుట్టించావు, మృత్యుభయం చెప్పి మార్చావు 
కృష్ణుడై కంసుడిని చంపి, అవతారుడవైనావు 
మాకు దర్శనమిచ్చి హితభోధతో, ఉద్దరించావు  
సమాన పరాక్రమం ఉంటె గాని, అవతరించవు 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

హిరణ్య కశిపుడుగా పుట్టించి, మహిమ చూపావు 

నారసింహుడై హిరన్యుణ్ణి చంపి, రక్షకుడైనావు  
వేంకటేశ్వరా కలియుగ అవతారంగా, పుట్టావు 
శరణు తో కలి నుండి రక్షించే, పరమాత్ముడవు  
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

చెడులోకూడా మంచి గ్రహించటం అంటే ఇదేనేమో 

రామాయణ భారత భాగవత  కధలివే నేమో 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

--((**))--

ఆరాధ్య భక్తి లీల- 78
Pranjali Prabha. 

నా హృదయాన విచ్చిన కిరణాలు !

నేను చూసిన నీపాద చరణాలు !

ఈ నేలను పాలించే వెలుగులు !
నీచూపులు లాలించే జిలుగులు !

నదాలను మెరిపించే కిరణాలు !
నీభక్తుల ఆశలు తీర్చే కిరణాలు 

సంద్రాలను మరిగించే అగ్నికణాలు !
దుర్మార్గుల హృదయంలో ఉండే కణాలు 

మట్టిని తట్టిలేపే రసాయనాలు !
నీకిరణాలతో విస్తరించే పంచభూతాలు !

మట్టిని గట్టిపరిచి మెత్తపరిచే లేపనాలు !
నీ కిరణాలు జీవగ్రహాలకు ప్రాణహితాలు
శ్రీ శ్రీ శ్రీ తిరుమల  తిరుపతి వేంకటేశా 
--((**))--

ఆరాధ్య భక్తి లీల- 77
Pranjali Prabha. 

మరులుగొన్న నీరూపం 

మనసంతా నిండిందీ మనోహరా...
మమతలన్ని దాచుకున్న
 ప్రేమంతా పొంగిందీ మనోహరా..

లోలోపల జరుగుతున్న కోలాటపు
సందడిలో నువ్వేలే నింపాడు మనోహరా 
నామదిలా నీఆటల గారడిలో 
మురిసిందీ మనోహరా..

నీఎదపై వాలిపోయి నాతనువే
కౌస్తుభమై మెరిసెనులే మనోహరా  
మధురమైన భావనంత 
వకుళమాల అల్లిందీ మనోహరా

నీపెదవుల ముద్రలన్ని నాపాపిట
 సింధురమై వెలిగెనులే మనోహరా 
నాగుండెకు సవ్వడిగా 
నీమురళీ మ్రోగిందీ మనోహరా

నీసన్నిధి చేరినదీ నీరాధా 
ఆరాధన.స్వీకరించు మనోహరా 
సుజలనదిగ నీకౌగిలి 
సింధువులో కరిగిందీ మనోహరా
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి మనోహరా  
--((**))--


ఆరాధ్య భక్తి లీల- 76
Pranjali Prabha. 

అన్నమాచార్యుని । వెన్నెల విరితోట 
నన్నయ పోతన । వెన్న ఊట
ఆలకించావా శ్శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 
   
గోపన్న కూర్చిన । తీపైన సిరి మూట 
రాయలు మురిసిన । రత్న కోట 
ఆలకించావా శ్శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

నండూరి నెరజాణ । నడచిన పూబాట 

నర్తించిన సినారె । నవ్య పాట
ఆలకించావా శ్శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

విశ్వనాధుని చేత । విరిసిన పాపిట

శ్రీనాథు పదమున । చెలగి పవిట
ఆలకించావా శ్శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

అవని వాకిట ఘన । అవధాన యతులందు 

వెలిగెఁ భాష నోట । తెలుగు మాట
ఆలకించావా శ్శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా


-((**))--

1 కామెంట్‌: