25, అక్టోబర్ 2019, శుక్రవారం



నరక చతుర్దశి విశేషాలు
 

ఆశ్వీయుజ బహుళ చతుర్దశి - నరక చతుర్దశి
పురాణ ప్రాశస్త్యం: పూర్వం నరకాసురుడనే రాక్షసుడు ప్రాక్ జ్యోతిష్యపురాన్ని పరిపాలించేవాడు. ఆ ప్రాక్ జ్యోత్సిహ్యపురం అనే ప్రాంతం ఈ రోజు ఈశాన్య భారతంలో అస్సాంలోని గౌహతి ప్రాంతం. వాడు 16,000 మంది కన్యలను తన కారాగారంలో బంధించగా, శ్రీ కృష్ణుడు సత్యంభామ సమేతంగా వెళ్ళి, వాడితో యుద్ధం చేసి, వాడిని చంపి, ఆ కన్యలను విడిపిస్తాడు. నరకాసుర వధ జరిగి, స్త్రీలకు దుష్టుడైన నరకుడిని నుంచి విముక్తి లభించినందుకు ప్రతీకగా ఈ రోజు నరక చతుర్దశి జరుపుకుంటారు. నరకుడి వధతో వాడు చేత హింసించబడి అంధకారంలో మగ్గుతున్న అనేకమంది బయటకు వచ్చారు, విముక్తి పొందారు, అందుకు ప్రతీకగా దీపాలు వెలిగిస్తారు. ఈ నరక చతుర్దశికి అంతరిక్షంలో జరిగే కొన్ని వింతల కారణంగా కూడా దీనికి ఈ ప్రత్యేకత వచ్చింది. 

నరక చతుర్దశి సంధర్భంగా అందరూ ఆచరించవలసిన విషయాలు తెలుసుకుందాం.
నరక చతుర్ద రోజు తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి గంటన్నర ముందే నువ్వుల నూనెతో తల అంటుకొని స్నానం చేయాలి. దీనినే తైలాభ్యంగనస్నానం అంటారు. ఇది నరక చతుర్దశి రోజు తప్పక చేయవలసిన విధి. స్నానానికి ఉపయోగించే నీటిలో ఉత్తరేణి, తగిరస, తుమ్మి చెట్లకొమ్మలను కలియబెట్టాలి. స్నానం మధ్యలో ఉత్తరేణి ఆకులను తలపై త్రిప్పుకొని పారేయాలి. ఈరోజు చేసే స్నానం నరక భయాన్ని పొగొడుతుందని, మంగళకరమని చెప్పబడింది. ఆ సమయంలో స్నానం చేయకపోతే దరిద్రం పట్టుకుంటుందని శాస్త్రం చెప్తోంది.

నరకుడనే అహకారాన్ని వెతికి చంపినందుకు గుర్తుగా చేసే స్నానం ఇది. నరకాసురుడంటే అహకారం. జ్ఞానం మాత్రమే అహాన్ని నశింపజేస్తుంది. కనుక చతుర్దశి రోజు చేస్తున్న ఈ స్నానం జ్ఞానానికి సంకేతం అన్నారు భగవాన్ రమణ మహర్షి.

ఈ రోజున సూర్యోదయానికి ముందు నువ్వులనూనెలో లక్ష్మి దేవి, నీటిలో గంగా దేవి ఉంటారని, అందువల్ల ఆ సమయంలో చేసే పైన చెప్పిన విధంగా చేసే స్నానం వల్ల లక్ష్మీదేవి, గంగాదేవిల అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెప్తోంది. స్నానాంతరం దక్షిణదిశగా తిరిగి యమనామాలు స్మరిస్తూ మూడుసార్లు యమునికి తర్పణం విడువాలి. తల్లిదండ్రులు లేనివారు మాత్రమే ఈ తర్పణాలు వదలాలి.

ఈరోజు ప్రదోషంలో అంటే సాయంకాలం ఇంటిముందు, ఆలయాల్లోనూ దీపాలను వెలిగించాలి. నాలుగు వత్తులతో దీపాన్ని వెలిగించి దీపదానం చేయాలి

--((***))--

23, అక్టోబర్ 2019, బుధవారం


🕉🌞🌎🌙🌟🚩

*_Swami Vivekananda's wisdom for daily inspiration - Oct 22._*

*_స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - అక్టోబరు 22._*

*The main cause of all bondage is ignorance. Man is not wicked by his own nature-not at all. His nature is pure, perfectly holy. Each man is divine. Each man that you see is a God by his very nature.*

*సమస్త దౌర్బల్యం, సమస్త బంధం కేవలం మనోకల్పనయే. ఒక్క మాటతో అది అదృశ్యమై తీరాలి. దౌర్బల్యాన్ని విడనాడు. లే! ధృడంగా ఉండు. నాకు తెలిసిన మతం ఇదే. అదే దైవం.*

🕉🌞🌎🌙🌟🚩

♻ *ఇదొక ఆరోగ్య సలహా.* ♻

*1. ఈ రెంటిని అప్పుడప్పుడు పరీక్ష చేయించండి.*

1. బి.పి.
2. షుగరు

*2. ఈ నాలుగింటిని సాధ్యమైనంత తగ్గించండి.*

1. ఉప్పు
2. చక్కెర
3. డైరీ తయారీలు
4. పిండిపదార్థాలు

*3. ఈ నాలుగింటిని ఎక్కువ తీసుకోండి.*

1. ఆకుకూరలు
2. కూరగాయలు
3. పండ్లు
4. గింజలు

*4. ఈ మూడింటిని మరచిపొండి.*

1. మీ వయస్సు
2. గడిచిపోయిన రోజులు
3. కోపతాపాలు

*5. ఈ మూడింటినీ పొందుటకు చూడండి.*

1. ప్రాణ ‌స్నేహితులు
2. ప్రేమించే కుటుంబం
3. ఉన్నతమైన ఆలోచనలు

*6. ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఈ క్రింది వాటిని పాటించండి.*

1. నియమిత ఉపవాసం
2. నవ్వడం
3. వ్యాయామం
4. బరువు తగ్గుట

*7. ఈ నాలుగు విషయాలకై ఎదురు చూడకండి.*

1. నిద్ర పోవడానికై  నిద్ర వచ్చేవరకు కాచుకొని ఉండకండి.
2. విశ్రాంతి తీసుకోవడానికై అలసిపోయే వరకు ఉండకండి.
3. స్నేహితుడిని కలవడానికై అతను ఎదురుచూడడం మానేసేంత ఆలస్యం చేయకండి.
4. దేవుడిని ప్రార్థించడానికై కష్టాలు వచ్చేంతవరకు ఆగకండి.

♻ *మీ ఆరోగ్యం కాపాడుకోండి.* ♻
🕉🌞🌎🌙🌟🚩

*_Swami Vivekananda's wisdom for daily inspiration - Oct 23._*

*_స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి -

అక్టోబరు 23._*

  *What is the use of living a day or two more in this transitory world? It is better to wear out than to rust out - specially for the sake of doing the least good to others.*

  *ఈ అశాశ్వతమైన ప్రపంచంలో ఇంకా ఒకటి రెండు రోజులు ఎక్కువ బ్రతికి ప్రయోజనమేముంది? తుప్పు పట్టేకన్నా, ఏ కొంచమైనా పరులకు మేలు చేయడంలో అరిగిపోవడమే మంచిది.*

🕉🌞🌎🌙🌟🚩

చెట్టంతమనిషిని పక్షవాతం నిట్టనిలువునా కూల్చేస్తుంది. సమయానికి చికిత్స అందకపోతే మంచానికే పరిమితం చేయొచ్చు. అందువల్ల పక్షవాతం వచ్చాక బాధపడేకన్నా అది రాకుండా చూసుకోవటమే మేలు. ఇందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వీటిల్లో చాలావరకు మనకు సాధ్యమైనవే కావటం మన అదృష్టం.
రక్తపోటు అదుపు
అధిక రక్తపోటుతో పక్షవాతం ముప్పు పెరుగుతుంది. అందువల్ల రక్తపోటు 120/80 మించకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువుంటే ఆహార, వ్యాయామ నియమాలతో తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అప్పటికీ అదుపులోకి రాకపోతే మందులు వేసుకోవాలి.
గుండెలయను కనిపెట్టండి
గుండెలయ అస్తవ్యస్తమయ్యే సమస్య(ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌)తో పక్షవాతం వచ్చే అవకాశం 5 రెట్లు ఎక్కువ. ఒకవేళ గుండె వేగంగా, అస్తవ్యస్తంగా కొట్టుకుంటుంటే డాక్టర్‌ను సంప్రదించి కారణమేంటో తెలుసుకోవటం మంచిది. ఒకవేళ ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌ సమస్య ఉన్నట్టయితే గుండె వేగాన్ని, రక్తం గడ్డలు ఏర్పడటాన్ని తగ్గించే మందులు సూచిస్తారు.
ఒత్తిడికి కళ్లెం
ఒత్తిడి మూలంగా ఒంట్లో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) తలెత్తుతుంది. ఇది పక్షవాతం ముప్పు పెరగటానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. తీరికలేని పనులతో ఆఫీసులో ఒత్తిడికి గురవుతుంటే మధ్యమధ్యలో కుర్చీలోంచి లేచి కాసేపు పచార్లు చేయండి. గాఢంగా శ్వాస తీసుకోండి. ఒకేసారి బోలెడన్ని పనులు ముందేసుకోకుండా ఒక పని పూర్తయ్యాక మరో పని ఆరంభించండి. పని చేసే వాతావరణం ప్రశాంతంగా ఉంచుకోవటం ఉత్తమం. వీలైతే చిన్న చిన్న మొక్కలు పెంచుకోవచ్చు. ఆఫీసు పనులను ఇంటిదాకా తెచ్చుకోకుండా కుటుంబ సభ్యులతో హాయిగా గడపటం అలవాటు చేసుకోండి.
మధుమేహం నియంత్రణ
మధుమేహంతో బాధపడేవారికి పక్షవాతం ముప్పు 1.5 రెట్లు ఎక్కువ. దీనికి ప్రధాన కారణం గ్లూకోజు స్థాయులు అధికంగా ఉండటం వల్ల ర�

21, అక్టోబర్ 2019, సోమవారం

*కార్తీక మాసము ముప్పది రోజులు /నెలలొ పాటించవలసిన నియమాలు .*

*కార్తీక మాసము ముప్పది రోజులు /నెలలొ పాటించవలసిన నియమాలు .*

*మొదటి రోజు*

నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, చద్ది. ఎంగిలి. చల్లని వస్తువులు
దానములు :- నెయ్యి, బంగారం
పూజించాల్సిన దైవము :- స్వథా అగ్ని
జపించాల్సిన మంత్రము :- ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా
ఫలితము :- తేజోవర్ధనము

*రెండవరోజు*

నిషిద్ధములు :- తరగబడిన వస్తువులు
దానములు :- కలువపూలు, నూనె, ఉప్పు
పూజించాల్సిన దైవము :- బ్రహ్మ
జపించాల్సిన మంత్రము :- ఓం గీష్పతయే - విరించియే స్వాహా
ఫలితము :- మనః స్థిమితము

*3 వ రోజు*

నిషిద్ధములు :- ఉప్పు కలిసినవి, ఉసిరి
దానములు :- ఉప్పు
పూజించాల్సిన దైవము :- పార్వతి
జపించాల్సిన మంత్రము :- ఓం పార్వత్యై - పరమేశ్వర్యై స్వాహా
ఫలితము :- శక్తి, సౌభాగ్యము

*4 వ రోజు*

నిషిద్ధములు :- వంకాయ, ఉసిరి
దానములు :- నూనె, పెసరపప్పు
పూజించాల్సిన దైవము :- విఘ్నేశ్వరుడు
జపించాల్సిన మంత్రము :- ఓం గం గణపతయే స్వాహా
ఫలితము :- సద్బుద్ధి, కార్యసిద్ధి

*5 వ రోజు*

నిషిద్ధములు :- పులుపుతో కూడినవి
దానములు :- స్వయంపాకం, విసనకర్ర
పూజించాల్సిన దైవము :- ఆదిశేషుడు
జపించాల్సిన మంత్రము :- (మంత్రం అలభ్యం, ప్రాణాయామం చేయాలి)
ఫలితము :- కీర్తి

*6 వ రోజు*

నిషిద్ధములు :- ఇష్టమైనవి, ఉసిరి
దానములు :- చిమ్మిలి
పూజించాల్సిన దైవము :- సుబ్రహ్మణ్యేశ్వరుడు
జపించాల్సిన మంత్రము :- ఓం సుం.బ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా
ఫలితము :- సర్వసిద్ధి, సత్సంతానం, జ్ఞానలబ్ధి

*7 వ రోజు*

నిషిద్ధములు :- పంటితో తినే వస్తువులు, ఉసిరి
దానములు :- పట్టుబట్టలు, గోధుమలు, బంగారం
పూజించాల్సిన దైవము :- సూర్యుడు
జపించాల్సిన మంత్రము :- ఓం. భాం. భానవే స్వాహా
ఫలితము :- తేజస్సు, ఆరోగ్యం

*8 వ రోజు*

నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం
దానములు :- తోచినవి - యథాశక్తి
పూజించాల్సిన దైవము :- దుర్గ
జపించాల్సిన మంత్రము :- ఓం - చాముండాయై విచ్చే - స్వాహా
ఫలితము :- ధైర్యం, విజయం

*9 వ రోజు*

నిషిద్ధములు :- నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి
దానములు :- మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు
పూజించాల్సిన దైవము :- అష్టవసువులు - పితృ దేవతలు
జపించాల్సిన మంత్రము :- ఓం అమృతాయ స్వాహా - పితృదేవతాభ్యో నమః
ఫలితము :- ఆత్మరక్షణ, సంతాన రక్షణ

*10 వ రోజు*

నిషిద్ధములు :- గుమ్మడికాయ, నూనె, ఉసిరి
దానములు :- గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె
పూజించాల్సిన దైవము :- దిగ్గజాలు
జపించాల్సిన మంత్రము :- ఓం మహామదేభాయ స్వాహా
ఫలితము :- యశస్సు - ధనలబ్ధి

*11 వ రోజు*

నిషిద్ధములు :- పులుపు, ఉసిరి
దానములు :- వీభూదిపండ్లు, దక్షిణ
పూజించాల్సిన దైవము :- శివుడు
జపించాల్సిన మంత్రము :- ఓం రుద్రాయస్వాహా, ఓం నమశ్శివాయ
ఫలితము :- ధనప్రాప్తి, పదవీలబ్ధి

*12 వ రోజు*

నిషిద్ధములు :- ఉప్పు, పులుపు, కారం, ఉసిరి
దానములు :- పరిమళద్రవ్యాలు, స్వయంపాకం, రాగి, దక్షిణ
పూజించాల్సిన దైవము :- భూదేవీసహిత శ్రీమహావిష్ణు లేక కార్తీక దామోదరుడు
జపించాల్సిన మంత్రము :- ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా
ఫలితము :- బంధవిముక్తి, జ్ఞానం, ధన ధాన్యాలు

*13 వ రోజు*

నిషిద్ధములు :- రాత్రి భోజనం, ఉసిరి
దానములు :- మల్లె, జాజి వగైరా పూవులు, వనభోజనం
పూజించాల్సిన దైవము :- మన్మధుడు
జపించాల్సిన మంత్రము :- ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా
ఫలితము :- వీర్యవృద్ధి, సౌదర్యం

*14 వ రోజు*

నిషిద్ధములు :- ఇష్టమైన వస్తువులు, ఉసిరి
దానములు :- నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె
పూజించాల్సిన దైవము :- యముడు
జపించాల్సిన మంత్రము :- ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా
ఫలితము :- అకాలమృత్యువులు తొలగుట

*15వ రోజు*

నిషిద్ధములు :- తరగబడిన వస్తువులు
దానములు :- కలువపూలు, నూనె, ఉప్పు
'ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః'

*16 వ రోజు*

నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, చద్ది ,ఎంగిలి, చల్ల
దానములు :- నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం
పూజించాల్సిన దైవము :- స్వాహా అగ్ని
జపించాల్సిన మంత్రము :- ఓం స్వాహాపతయే జాతవేదసే నమః
ఫలితము :- వర్చస్సు, తేజస్సు ,పవిత్రత

*17 వ రోజు*

నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు
దానములు :- ఔషధాలు, ధనం
పూజించాల్సిన దైవము :- అశ్వినీ దేవతలు
జపించాల్సిన మంత్రము :- ఓం అశ్విన్యౌవైద్యౌ తేనమః స్వాహా
ఫలితము :- సర్వవ్యాధీనివారణం ఆరోగ్యం

*18 వ రోజు*

నిషిద్ధములు :- ఉసిరి
దానములు :- పులిహార, అట్లు, బెల్లం
పూజించాల్సిన దైవము :- గౌరి
జపించాల్సిన మంత్రము :- ఓం గగగగ గౌర్త్యె స్వాహా
ఫలితము :- అఖండ సౌభాగ్య ప్రాప్తి

*19 వ రోజు*

నిషిద్ధములు :- నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైధునం, ఉసిరి
దానములు :- నువ్వులు, కుడుములు
పూజించాల్సిన దైవము :- వినాయకుడు
జపించాల్సిన మంత్రము :- ఓం గం గణపతయే స్వాహా
ఫలితము :- విజయం, సర్వవిఘ్న నాశనం

*20 వ రోజు*

నిషిద్ధములు :- పాలుతప్ప - తక్కినవి
దానములు :- గో, భూ, సువర్ణ దానాలు
పూజించాల్సిన దైవము :- నాగేంద్రుడు
జపించాల్సిన మంత్రము :- ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్వాయపాతుమాం
ఫలితము :- గర్భదోష పరిహరణం, సంతానసిద్ధి

*21 వ రోజు*

నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం
దానములు :- యథాశక్తి సమస్త దానాలూ
పూజించాల్సిన దైవము :- కుమారస్వామి
జపించాల్సిన మంత్రము :- ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహా
ఫలితము :- సత్సంతానసిద్ధి, జ్ఞానం, దిగ్విజయం

*22 వ రోజు*

నిషిద్ధములు :- పంటికి పనిచెప్పే పదార్ధాలు, ఉసిరి
దానములు :- బంగారం, గోధుమలు, పట్టుబట్టలు
పూజించాల్సిన దైవము :- సూర్యుడు
జపించాల్సిన మంత్రము :- ఓం సూం - సౌరయే స్వాహా, ఓం భాం - భాస్కరాయ స్వాహా
ఫలితము :- ఆయురారోగ్య తేజో బుద్ధులు

*23 వ రోజు*

నిషిద్ధములు :- ఉసిరి, తులసి
దానములు :- మంగళ ద్రవ్యాలు
పూజించాల్సిన దైవము :- అష్టమాతృకలు
జపించాల్సిన మంత్రము :- ఓం శ్రీమాత్రే నమః , అష్టమాతృ కాయ స్వాహా
ఫలితము :- మాతృరక్షణం, వశీకరణం

*24 వ రోజు*

నిషిద్ధములు :- మద్యమాంస మైధునాలు, ఉసిరి
దానములు :- ఎర్రచీర, ఎర్ర రవికెలగుడ్డ, ఎర్రగాజులు, ఎర్రపువ్వులు
పూజించాల్సిన దైవము :- శ్రీ దుర్గ
జపించాల్సిన మంత్రము :- ఓం అరిషడ్వర్గవినాశిన్యై నమః శ్రీ దుర్గాయై స్వాహా
ఫలితము :- శక్తిసామర్ధ్యాలు, ధైర్యం, కార్య విజయం

*25 వ రోజు*

నిషిద్ధములు :- పులుపు, చారు - వగయిరా ద్రవపదార్ధాలు
దానములు :- యథాశక్తి
పూజించాల్సిన దైవము :- దిక్వాలకులు
జపించాల్సిన మంత్రము :- ఓం ఈశావాస్యాయ స్వాహా
ఫలితము :- అఖండకీర్తి, పదవీప్రాప్తి

*26 వ రోజు*

నిషిద్ధములు :- సమస్త పదార్ధాలు
దానములు :- నిలవవుండే సరుకులు
పూజించాల్సిన దైవము :- కుబేరుడు
జపించాల్సిన మంత్రము :- ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా
ఫలితము :- ధనలబ్ది, లాటరీవిజయం, సిరిసంపదలభివృద్ధి

*27 వ రోజు*

నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, వంకాయ
దానములు :- ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు
పూజించాల్సిన దైవము :- కార్తీక దామోదరుడు
జపించాల్సిన మంత్రము :- ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా
ఫలితము :- మహాయోగం, రాజభోగం, మోక్షసిద్ధి

*28 వ రోజు*

నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి ,వంకాయ
దానములు :- నువ్వులు, ఉసిరి
పూజించాల్సిన దైవము :- ధర్ముడు
జపించాల్సిన మంత్రము :- ఓం ధర్మాయ, కర్మనాశాయ స్వాహా
ఫలితము :- దీర్ఘకాల వ్యాధీహరణం

*29 వ రోజు*

నిషిద్ధములు :- పగటి ఆహారం, ఉసిరి
దానములు :- శివలింగం, వీభూది పండు, దక్షిణ, బంగారం
పూజించాల్సిన దైవము :- శివుడు (మృత్యుంజయుడు)
జపించాల్సిన మంత్రము :- ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం,
ఉర్వారుకమివ బంధనాన్తృత్యో ర్ముక్షీయ మామృతాత్
ఫలితము :- అకాలమృత్యుహరణం, ఆయుర్వృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం

*30 వ రోజు*

నిషిద్ధములు :- పగటి ఆహారం, ఉసిరి
దానములు :- నువ్వులు, తర్పణలు, ఉసిరి
పూజించాల్సిన దైవము :- సర్వదేవతలు + పితృ దేవతలు
జపించాల్సిన మంత్రము :- ఓం అమృతాయ స్వాహా మమసమస్త పితృదేవతాభ్యో నమః
ఫలితము :- ఆత్మస్థయిర్యం, కుటుంబక్షేమం

11, అక్టోబర్ 2019, శుక్రవారం


నేటి శ్లోకాలు 
ప్రాంజలి ప్రభ 
సేకరణ : మల్లాప్రగడ రామకృష్ణ 

శతగాయత్రి-మంత్రావళి

💠-: బ్రహ్మ గాయత్రి :-
1. వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.!!
2. తత్పురుషాయ విద్మహే చతుర్ముఖాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.!!
3. సురారాధ్యాయ విద్మహే వేదాత్మనాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్. !!

💠-: విష్ణు గాయత్రి :-
4. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ !!
5. లక్ష్మీనాధాయ విద్మహే చక్రధరాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్!!
6. దామోదరాయ విద్మహే చతుర్భుజాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ !!

💠-: శివ గాయత్రి :-
7. శివోత్తమాయ విద్మహే మహోత్తమాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ !!
8. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్.!!
9. సదాశివాయ విద్మహే జటాధరాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్!!
10. పంచవక్త్రాయ విద్మహే అతిశుద్ధాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ !!
11. గౌరీనాధాయ విద్మహే సదాశివాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ !!
12. తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ !!

💠-: వృషభ గాయత్రి :-
13. తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్.!!
14. తీష్ణశృంగా విద్మహే వేదపాదాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్.!!

💠-: చండీశ్వర గాయత్రి :-
15. ద్వారస్థితాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.!!
16. చండీశ్వరాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.!!

💠-: భృంగేశ్వర గాయత్రి :-
17. భృంగేశ్వరాయ విద్మహే శుష్కదేహాయ ధీమహి తన్నోభృంగి ప్రచోదయాత్.!!

💠-: వీరభద్ర గాయత్రి :-
18. కాలవర్ణాయ విద్మహే మహాకోపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.!!
19. చండకోపాయ విద్మహే వీరభద్రాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.!!
20. ఈశపుత్రాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.!!

💠-: శిఖరగాయత్రి :-
21. శీర్ష్యరూపాయ విద్మహే శిఖరేశాయ ధీమహి తన్న స్థూపః ప్రచోదయాత్.!!

💠-: ధ్వజగాయత్రి :-
22. ప్రాణరూపాయ విద్మహే త్రిమేఖలాయ ధీమహి తన్నోధ్వజః ప్రచోదయాత్.!!

💠-: దత్త గాయత్రి :-
23. దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్.!!

💠-: శాస్త [అయ్యప్ప] గాయత్రి :-
24.భూతనాధాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నశ్శాస్తా ప్రచోదయాత్.!!

💠-: సుదర్శన గాయత్రి :-
25. సుదర్శనాయ విద్మహే జ్వాలాచక్రాయ ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.!!
26. సుదర్శనాయ విద్మహే యతిరాజాయ ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.!!

💠-: మత్స్య గాయత్రి :-
27. జలచరాయ విద్మహే మహామీనాయ ధీమహి తన్నోమత్స్యః ప్రచోదయాత్.!!

💠-: కూర్మ గాయత్రి :-
28. కచ్చపేశాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నోకూర్మ: ప్రచోదయాత్.!!

💠-: వాస్తుపురుష గాయత్రి :-
29. వాస్తునాధాయ విద్మహే చతుర్బుజాయ ధీమహి తన్నో వాస్తుః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ గణపతి గాయత్రి :-
30. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్.!!
31. ఆఖుధ్వజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ కృష్ణ గాయత్రి :-
32. దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.!!
33. గోపాలకాయ విద్మహే గోపీ ప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.!!
34. వాసుదేవాయ విద్మహే రాధాప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ రామ గాయత్రి :-
35. దాశరధాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.!!
36. ధర్మ రూపాయ విద్మహే సత్యవ్రతాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ ఆంజనేయ గాయత్రి :-
37. ఆంజనేయాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్.!!!
38. పవనాత్మజాయ విద్మహే రామభక్తాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ హయగ్రీవ గాయత్రి :-
39. వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నో హగ్ం సహః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ స్కంద గాయత్రి :-
40. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.!!
41. తత్పురుషాయ విద్మహే శిఖిధ్వజాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.!!
42. షడాననాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ సుబ్రహ్మణ్య గాయత్రి :-
43. భుజగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్.!!
44. కార్తికేయాయ విద్మహే వల్లీనాధాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ గరుడ గాయత్రి :-
45. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ అనంత గాయత్రి :-
46. అనంతేశాయ విద్మహే మహాభోగాయ ధీమహి తన్నో నంతః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ ఇంద్రాద్యష్టదిక్పాలక గాయత్రి :-
47. దేవరాజాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్రః ప్రచోదయాత్.!!
48. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్.!!
49. కాలరూపాయ విద్మహే దండధరాయ ధీమహి తన్నో యమః ప్రచోదయాత్.!!
50. ఖడ్గాయుధాయ విద్మహే కోణ స్థితాయ ధీమహి తన్నో నిఋతిః ప్రచోదయాత్.!!
51. జలాధిపాయ విద్మహే తీర్థరాజాయ ధీమహి తన్నో పాశిన్ ప్రచోదయాత్.!!
52. ధ్వజహస్తయ విద్మహే ప్రాణాధిపాయ ధీమహి తన్నో వాయుః ప్రచోదయాత్.!!
53. శంఖ హస్తయ విద్మహే నిధీశ్వరాయ ధీమహి తన్నో సోమః ప్రచోదయాత్.!!
54. శూలహస్తయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ఈశః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ నవగ్రహ గాయత్రి :-
55. భాస్కరాయ విద్మహే మహా ద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్.!!
56. అమృతేశాయ విద్మహే రాత్రించరాయ ధీమహి తన్న శ్చంద్రః ప్రచోదయాత్.!!
57. అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో కుజః ప్రచోదయాత్.!!
58. చంద్రసుతాయ విద్మహే సౌమ్యగ్రహాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్.!!
59. సురాచార్యాయ విద్మహే దేవ పూజ్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్.!!
60. భార్గవాయ విద్మహే దైత్యాచార్యాయ ధీమహి తన్నో శుక్రః ప్రచోదయాత్.!!
61. రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నో శనిః ప్రచోదయాత్.!!
62. శీర్ష్యరూపాయ విద్మహే వక్రఃపంథాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్!!
63. తమోగ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహి తన్నో కేతుః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ సాయినాథ గాయత్రి :-
64. జ్ఞాన రూపాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నస్సాయీ ప్రచోదయాత్.!!

💠-: శ్రీ వేంకటేశ్వర గాయత్రి :-
65. శ్రీ నిలయాయ విద్మహే వేంకటేశాయ ధీమహి తన్నోహరిః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ నృసింహ గాయత్రి :-
66. వజ్రనఖాయ విద్మహే తీష్ణదగ్ ష్ట్రాయ ధీమహి తన్నః సింహః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ లక్ష్మణ గాయత్రి :-
67. రామానుజాయ విద్మహే దాశరధాయ ధీమహి తన్నః శేషః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ క్షేత్రపాల గాయత్రి :-
68. క్షేత్రపాలాయ విద్మహే క్షేత్రస్థితాయ ధీమహి తన్నః క్షేత్రః ప్రచోదయాత్.!!

💠-: యంత్ర గాయత్రి :-
69. యంత్రరాజాయ విద్మహే మహాయంత్రాయ ధీమహి తన్నోః యంత్రః ప్రచోదయాత్.!!

💠-: మంత్ర గాయత్రి :-
70. మంత్రరాజాయ విద్మహే మహా మంత్రాయ ధీమహి తన్నోః మంత్రః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ సరస్వతీ గాయత్రి :-
71. వాగ్దేవ్యైచ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నోవాణీః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ లక్ష్మీ గాయత్రి :-
72. మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.!!
73. అమృతవాసిని విద్మహే పద్మలోచని ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ గౌరి గాయత్రి :-
74. గణాంబికాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.!!
75. మహా దేవ్యైచ విద్మహే రుద్ర పత్న్యై చ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.!!

💠-: శ్యామలా గాయత్రి :-
76. శుకప్రియాయ విద్మహే క్లీం కామేశ్వరి ధీమహి తన్నః శ్యామలా ప్రచోదయాత్.!!
77. మాతంగేశ్వరి విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నః క్లిన్నే ప్రచోదయాత్.!!

💠-: భైరవ గాయత్రి :-
78. త్రిపురాదేవి విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నో భైరవీ ప్రచోదయాత్.!!

💠-: శక్తి గాయత్రి :-
79. త్రిపురాదేవి విద్మహే సౌః శక్తీశ్వరి ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ కన్యకాపరమేశ్వరీ గాయత్రి :-
80. బాలారూపిణి విద్మహే పరమేశ్వరి ధీమహి తన్నః కన్యా ప్రచోదయాత్.!!
81. త్రిపురాదేవి విద్మహే కన్యారూపిణి ధీమహి తన్నః కన్యా ప్రచోదయాత్.!!

💠-: శ్రీ బాలా గాయత్రి :-
82. త్రిపురాదేవి విద్మహే కామేశ్వరిచ ధీమహి తన్నో బాలా ప్రచోదయాత్.!!

💠-: శ్రీ సీతా గాయత్రి :-
83. మహాదేవ్యైచ విద్మహే రామపత్న్యై చ ధీమహి తన్నః సీతా ప్రచోదయాత్.!!

💠-: శ్రీ దుర్గా గాయత్రి :-
84. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ శూలినీ దుర్గా గాయత్రి :-
85. జ్వాలామాలిని విద్మహే మహాశూలిని ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్.!!

💠-: శ్రీ ధరా గాయత్రి :-
86. ధనుర్దరాయ విద్మహే సర్వసిద్దించ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్.!!

💠-: శ్రీ హంస గాయత్రి :-
87. హంసహంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ ముక్తీశ్వరీ గాయత్రి :-
88. త్రిపురాదేవి విద్మహే ముక్తీశ్వరీ ధీమహి తన్నో ముక్తిః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ గంగా దేవీ గాయత్రి :-
89. త్రిపధగామినీ విద్మహే రుద్రపత్న్యై చ ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్.!!
90. రుద్రపత్న్యై చ విద్మహే సాగరగామిని ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్.!!

💠-: శ్రీ యమునా గాయత్రి :-
91. యమునా దేవ్యైచ విద్మహే తీర్థవాసిని ధీమహి తన్నో యమునా ప్రచోదయాత్.!!

💠-: శ్రీ వారాహీ గాయత్రి :-
92. వరాహముఖి విద్మహే ఆంత్రాసనిచ ధీమహి తన్నో వారాహీ ప్రచోదయాత్.!!

💠-: శ్రీ చాముండా గాయత్రి :-
93. చాముండేశ్వరి విద్మహే చక్రధారిణి ధీమహి తన్నః చాముండా ప్రచోదయాత్.!!

💠-: శ్రీ వైష్ణవీ గాయత్రి :-
94. చక్రధారిణి విద్మహే వైష్ణవీ దేవి ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ నారసింహ గాయత్రి :-
95. కరాళిణిచ విద్మహే నారసింహ్యైచ ధీమహి తన్నః సింహేః ప్రచోదయాత్.!!

💠 శ్రీ బగాళా గాయత్రి :-
96. మహాదేవ్యైచ విద్మహే బగళాముఖి ధీమహి తన్నో అస్త్రః ప్రచోదయాత్.!!

💠 శ్రీ సాంబ సదాశివ గాయత్రి :-
97. సదాశివాయ విద్మహే సమాస్రాక్షాయ ధీమహి తన్నః సాంబః ప్రచోదయాత్.!!

💠 శ్రీ సంతోషీ గాయత్రి :-
98. రూపాదేవీచ విద్మహే శక్తిరూపిణి ధీమహి తన్నస్తోషి ప్రచోదయాత్.!!

💠 శ్రీ లక్ష్మీ గణపతి గాయత్రి
99. తత్పురుషాయ విద్మహే శక్తియుతాయ ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.!!
100. దశభుజాయ విద్మహే వల్లభేశాయ ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.!!

--((***))--


10, అక్టోబర్ 2019, గురువారం

pdf fils

ఓం శ్రీ రామ్ - మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ: 
ప్రాంజలి ప్రభ 1వ వారం అంతర్జాల పత్రిక 

చిన్న కధ మానవసేవ-మాధవసేవ

ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది. 

దేవుడు: మానవా..నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.

మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!

దేవుడు: తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.

మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను

దేవుడు: నీకు చెందినవి ఉన్నాయి.

మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?

దేవుడు: అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి

మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?

దేవుడు: కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి

మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!

దేవుడు: అవి పరిస్థితులవి నీవి కావు 

మనిషి: నా స్నేహితులున్నారా అందులో?

దేవుడు: వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే

మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?

దేవుడు: వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు

మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!

దేవుడు: తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.

మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?

దేవుడు: ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.

మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.

మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.

మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?

దేవుడు: ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.
 ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.
అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి. 
పశ్చాతాపులను క్షమించాలి. 
 తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి.

--((**))--
సేకరణ :రచయిత  మల్లాప్రగడ శ్రీదేవి  రామకృష్ణ 

4. ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం
నేటి కవిత ( అధిక్షేప ప్రేమ లీల ) -1
ఇది వేణుగోపాల ప్రేమ సుమా  ప్రాంజలి ప్రభ రచయత: మల్లాప్రగడ sridevi రామకృష్ణ 

1 . దీనశరణ్య మహాను భావా - శోభన కీర్తి  శుభాల భావా
     రాజ్యసునేత్ర సుమాల భావా - శ్రీకర పాద  విహార  భావా
      కౌస్తుభ వక్ష అకార భావా - విశ్వాస సేన విశాల భావా
     యోగసునంద సమాన భావా  -  శ్రీ విద్య విధాత విలోల భావా

     సద్గుణ సోమా,  యదుకుల సార్వభౌమా
       శ్రీ లక్ష్మి కూడి స్వర్గధామా,  ఇది వేణుగోపాల ప్రేమ సుమా
                           --((**))--

2   నీ నామంబుతో కష్టాల నుండి  గట్టెక్కే  ప్రహ్లాదుడను కాను   .
     నీ ధ్యానంబుతో పిల్లాడి వల్లే ఉన్నట్టి  ద్రువుడను కాను
     నీ పవలింపునే మోసేటి  సర్పరాజైన భుజంగాన్ని కాను 
     నీ నిత్యారూపాన్ని వీక్షించే వేయి కళ్ళున్నా ఇంద్రుంన్ని  కాను

       సద్గుణ సోమా ,   యదుకుల సార్వభౌమా
       హ్రదయానంద  రమా,  ఇది వేణుగోపాల ప్రేమ సుమా
                         --((**))--

3. కోటి ప్రభలతో కొండంత వెల్గు - పరులు చూసిన కానరాని వెల్గు
    గురుకృపచే కాక గుర్తెరుంగని వెల్గు - అమృత్ మహిమచే వ్యాపించె వెల్గు
    విధ్యుత్ లతల పరివేష్టిత వెల్గు - ఘననీల కాంతుల గ్రక్కు వెల్గు
    ప్రణవ నాదములు గల్గిన వెల్గు  మౌనులెన్నగ రమ్యమైన వెల్గు

    ఆది మధ్యంతర రహితమైన వెల్గు,     ఆత్మనే కదిలించు పరమాత్మ వెల్గు
    హృదయానంద పరమానంద వెల్గు,     ఇది వేణుగోపాల ప్రేమ సుమా
                                                --((**))--

4.  వేదంబులు నీవె, వేదాంగములు నీవె - జాలరులు నీవె, భూజాములు నీవె
     క్రతువులు నీవె, పర్వతములు నీవె  - మంచువు నీవె, నదులు నీవె 
     కనకాద్రి నీవె, యాకాశంబు నీవె - తరువులు నీవె,  అగ్ని నీవె
     అనురూపము నీవె, అవనీతలము నీవె  - బ్రహ్మము నీవె, గోపతియు నీవె

     నిన్ను గొల్చుటకు నేనెంత,  అణువులో అణువంత
     హృదయానంద సుమంత,  ఇది వేణుగోపాల ప్రేమ సుమా
                                          --((**))--

5. బ్రహ్మవేద మందించిన వెల్గు - నాదాంత సీమల నడచు వెల్గు
    సాదు జనానంద పరిపూర్ణ వెల్గు - బోధకు నిలయమై పరిపూర్ణ వెల్గు
    సుషమ్న నాలంబున  జొచ్చు వెల్గు - ఆది మధ్యాంతర ప్రేమ వెల్గు
    చూడు జూడగా మహాశోభితంబగు వెల్గు  -  నఖిలజగంబుల నిండు వెల్గు

    మేరుశిఖరంబు వెల్గు,    మోహావేశంబు పెంచు వెల్గు
    మేను పులక రించే వెల్గు,   ఇది వేణుగోపాల ప్రేమ సుమా
                                         --((**))--

6. వేదాంత సూక్తులు విని కొన్ని తెల్పినంత మాత్రాన రాజయోగి కాడు
 
     కుండంత కళ్ళు త్రాగి  తెలియక వాగినంత మాత్రాన శాస్త్రవేక్త కాడు
     ప్రధాని అయినంత మాత్రానా ఎప్పటికి అసలు గుణాన్ని మార్చలేడు 
     పరస్త్రీ వెంట తిరిగి నంతమాత్రాన భార్యని చూడనివాడు బద్ధుడు కాడు

     ఎంత చదివిన గుణహీనుడెచ్చు గాడు,      సింహము జయించె నంత బలుడుకాడు 
     నమ్మ పల్కువాడు బుద్ధిమంతుడు కాడు,      ఇది వేణుగోపాల ప్రేమ సుమా
                                                   --((**))--

7.   దండ కమండల దారులై కాషాయమ్ములు ధరించిన బోధకు ముక్తి రాదు
      విభూతి పూసి, పులిచర్మము ధరించి ముక్కుమూసి మౌనానికి ముక్తి రాదు   
      సంసారిగా ఉన్న, సన్యాసిగా ఉన్న గుణాలు సరిగా లేకున్నా  ముక్తి రాదు
      పుణ్యక్షేత్రాలు తిరిగి, దాన ధర్మాలు చేసిన అహంకారం ఉంటె ముక్తి రాదు

      గురు వాక్యాలు ఆచరించి,       తల్లి తండ్రులను గౌరవించి
      భక్తితో దయచూపితే ముక్తి వచ్చు,    ఇది వేణుగోపాల ప్రేమ సుమా
                                             --((**))--

8.
   ప్రజల దారిద్రం తొలగించేది హరి భక్తే వజ్రాయుధంబు
      అజ్ణాణమనే అంధకారం తొలగించేది నీ భానూదయంబు
      దుర్భుద్ధి మాపి ధర్మబుద్ధి పెంచేది నీ సేవ దావానలంబు
      నిత్య  అమృత తత్వం ఇచ్చేది నీ స్మరణ దివ్యౌషధంబు

      వెన్న ఉన్న నేతిని వెతికినట్లు,  భార్య ఉన్న పరస్త్రీ కోరినట్లు
      పర దేవతను ప్రార్ధించి నట్లు,  ఇది వేణుగోపాల ప్రేమ సుమా
                                        --((**))--

9.   మధ్యపానముతో మత్తెక్కిన వేళ - బడాలికతో నడిచొచ్చిన వేళ
      సుఖముకొరకు వెహ్ ఉండిన వేళ -  ఒప్పు తప్పని వాదించిన వేళ 
     ఒంటరిగా చీకతింటే ఉండిన వేళ - నాలుకతో పవళించు వేళ 
     దొర మనసున దిగులు ఉన్న వేళ -  భక్తి గన్నట్టి విరక్తి వేళ

     ఆశా భావం సలక్షణ మగు, లాభ్య భావము కనుమరుగు
     వెన్నెలలా ప్రవర్తిస్తే శక్తి కలుగు ఇది వేణుగోపాల ప్రేమ సుమా
                                    --((**))--

10  సౌందర్య మతి దృఢ శక్తి విలాసంబు - సంగీత్ సాహిత్య మతి రసికత సౌఖ్యంబు   
      అగ్రజన్మ మతి ఆదరణ వాసంబు -  యుక్త వయసు మతి నననుభవించు నేర్పు0బు
      సంపన్నత మతి  బంధు సంరక్షణంబు -  అనుకూల సతి నిత్య మానసంబు   
      సౌందర్య  మతి దృఢ శక్తి విలాసంబు -  నిష్ఠ జ్ఞానము నీ పద ద్యాసంబు

      ఇన్నియుకలిగి వర్తించు చున్న నరుడు,  భూతాల స్వరమును  పొందు చుండు
      ఇది అక్షర సత్యమని  నమ్మి యుండు,   ఇది వేణుగోపాల ప్రేమ సుమా
                                   --((**))--

11  తండ్రి ఓర్వలేని వాడైన - తల్లి మోహంబు గల మూగదైన
      అల్లుడు రాక్షుసుడైన  - కూతురు పెను రంకు బోతైన   .
      కొడుకు తస్కరుడైన  -  ఎవరికి వారు సంపాదన పరులైన
      విధిన బడ్డ చెడ్డ చెల్లెలైన - తమ్ముడు పిచ్చివాడైన 

      నరుని బేధంబు వర్ణించుట ఎవరి తరము కాదు,  కాలం ఎదురెగి మనస్సును ఓదార్చుట సరి కాదు
      అందరూ మారలేక పొతే  సన్యసించుట మేలు,  ఇది వేణుగోపాల ప్రేమ సుమా
                                  --((**))--

12 . పూట కూలమ్మకు పుణ్యమేల - వజ్రపు గమ్ము ఆరవ చెవుల కేల   
       గ్రుడ్డి తరుణికి గొప్ప యుద్ధమేల - కుంటి కాలుకి గొప్ప నాట్యమేల
       ఊరబంతులకు పన్నీరు లేల - చెవిటివాని ముందు వీణపాట లేల         
       ఊరు తొత్తుకు విటుండుండ నేల - నాయకుని నమ్మి మోసపొవు టేల

   
        మతి చెడకొట్టే రండకు  గుర్తింపులేల,  కాలంలో మార్చుట ఎవ్వరి తరం కాదు ఏల   
        నమ్మి మోసపోక ఉండుట ఏల ,  ఇది వేణుగోపాల ప్రేమ సుమా  
                                 --((**))--

13  లక్ష్మీ పతికి నేస్త మైనప్పటికీ - శివుడు బిచ్చమెత్త వలసి వచ్చే .
      పువ్వు మక రందాన్ని ఇచ్చి నప్పటికీ  -  తుమ్మెద బువ్వులవెంట పడవలసి వచ్చే 
      పాల సముద్రములో చేరి నప్పటికీ - నత్తగుళ్ల తిండికి తిప్పలు పడవలసి వచ్చే
      రాజ్యాన్ని ఏలిన రాజైనప్పటికీ - భార్య కోరిక తీర్చుటకు కష్టపడవలసి వచ్చే
   
      స్నేహ సంతృప్తిని చెప్పలేక - పొందిన మకరందానితో తృప్తి పడలేక
      అనువుగాని చోట ఆహారం పొందలేక - ఎంత ధనమున్న తిండి తినలేక
      ఒకరి మేలుచూసి నేడ్వగ రాదు  -  ఇది వేణుగోపాల ప్రేమ సుమా   
                                           --((**))--

14 . అల్పుని తెచ్చి అధికున్ని చేసిన - కుక్క బుద్ది ఎప్పటికి మారదు
       మగవానికి చలి ఉందని గంబలి కప్పిన  -  పడతి పొందు బుద్ది మారదు
       గుబ్బలు అదేపనిగా  పడతి ఊపిన -  చనువు చేసి చంక చేర బుద్ది మారదు 
       బలముందని సరసం చేయదలచిన  -  మంత్రిగా మారిన వెనక బుద్ధి మారదు
     
       కనుక నేచెప్పునది బుద్ధి ఎరిగి ప్రవర్తించు, లేదా బుద్ధి మరచి దేశంలో సంకెహ్రించుఁ
        లేదా అల్పుని అధికారానికి నమస్కరించు,  -  ఇది వేణుగోపాల ప్రేమ సుమా 
                               --((**))-

15 . అల్పుడు చెప్పిన పలుకు అధికముగా నుండు  -  గొద్ది తొత్తుల పొందు రద్ది కీడ్చు చుండు
    స్త్రీ చెప్పిన మాట వేదమనిపించు చుండు  -  ముద్దు చేసిన కుక్క మూతి నాకు చుండు
    బంధువులు వచ్చిన కొంప నాశనమగు చుండు  - బలుపుతో సరసం ప్రాణహాని కలుగు చుండు
    దుష్టుడు మంత్రిగాఉంటె మంచి బుద్దిమారు చుండు  - చనువిస్తే ఎవడైనా చంక నెక్కు చుండు     

     కనుక ఎల్లరు జాగా రూకత ముఖ్యం,  ఆశకు పోక ఉంటె అదే సౌఖ్యం
     అందరితో మంచిగా ఉంటె అదే లౌఖ్యం,  ఇది వేణుగోపాల ప్రేమ సుమా
                                 --((**))--

16  యజమాని మందు వాడైన తాగొద్దని చెప్పు   -  అమ్మువాన్ని ఇవ్వ వద్దని చెప్పు   
      మనిషికి పక్షులకు తాగుపోతని చెప్పు  -  మానక పోతే  తలతిప్పి మౌనభాష చెప్పు
      చెవిలో  కలియుట కష్టమని మొరిగి చెప్పు  -  మానక పోతే నమ్మిన వకీలుకు చెప్పు
      వైద్యుని వద్దకు పోయి చూపించి మరీ చెప్పు -  మారకపోతే నీవు కూడా తాగటమే ఒప్పు

     మార్చటానికి ప్రయత్నాలు అనేకం,  మగువ మార్చే ప్రయత్నమే మమేకం
     స్థల, స్నేహ మార్పిడి తెస్తే వివేకం ,      ఇది వేణుగోపాల ప్రేమ సుమా  
                                                 --((**))--

17. లోన రోగమున్న వాడికి పైన హుషారు మెండు - కళ్ల పసిండికి గాంతి మెండు 
      నేర రంకులాడికి  నిష్ఠ  మెండు - పాలు పిండిని  గొడ్డు బఱ్ఱె కీతలు మెండు
      ఆత్మ గానని యోగి కద్వైతములు మెండు -  గెలవని రాజుకు కోతలు మెండు   
      తత్తర పాటుకు తలతిప్పుట మెండు -  వంచిచు దానికి భర్తపై వలపు మెండు

      వండ లేనమ్మకు వగపులు మెండు, కూటికియ్యని విటకాని కోర్క మెండు
      మాహాకమ్మకు మనసున మరులు మెండు, ఇది వేణుగోపాల ప్రేమ సుమా
                                                         --((**))--

18. ఆలి ఆశ తీర్చుటకు తలవంచి బ్రతిమాలుకొను వాని బ్రతుకు రోత 
      నర్తనాంగనల వెనుక చేరి తాళముల్ వాయించు వాని జీవనము రోత
      వ్యభిచరించు వారవనిత గర్భమ్మున పురుషత్వము వహించు పుట్టు రోత
      కుటుంబానికి సరిపడు సంపాదన లేని  మనుజుని బతుకు నడక రోత 

      సంగీత సాహిత్యాల విలువ లేని రోత,  కృతులు రచించిన కవుల గీత రోత
      మదనుని మానసము నిత్యము రోత ,  ఇది వేణుగోపాల ప్రేమ సుమా
                                                 --((**))--

19. అల్ప విద్వాన్సుడు నాక్షేపణకు పెద్ద - మూర్ఖచిత్తుడు కోపమునకు పెద్ద
      పెట్టనేరని రండ పెక్కు నీతులు బెద్ద -  గొడ్రాలి పెళ్ళానికి  గొంతు పెద్ద 
      డబ్బురాని వకీలుకు దంబంబు పెద్ద - రిక్తుని మనస్సుకు కోరికలు పెద్ద
      వెలయు నాబోతుకు కండలు పెద్ద -  మధ్య వైష్ణువులకు నామములు పెద్ద

      అప్పు ఇచ్చి వద్దన్న వాడు అందరిలో పెద్ద,  ఆలస్యముగా వచ్చువాడు అందరిలో పెద్ద
      ఆద మరవక అందరితో సహకారించే వాడే పెద్ద,   ఇది వేణుగోపాల ప్రేమ సుమా
                                                     --((**))--

20. నమ్ముకున్న వాడికి శాలువా లిస్తి -
  చాకలి గంజికి జారీ కోకలిస్తి     
      కడియాల కుమ్మర కంకికి దర్శిస్తి -  పోగులు పొలంగికి పోగులిస్తి
      వంట మనిషికి దుప్పట్లు  దర్శిస్తి -  దాని తల్లికి నూరు ధార పోస్తి
      దాస రచ్చికి దేవతార్చన లమ్మిస్తి -  గుర్రాన్ని ఉప్పర కొండ కిస్తి 

      చేయు తప్పులు బయట పడకుండా,   నమ్మ పలికి  అపాత్ర దానము చేసి
       చెప్పు కొందురు సిగ్గు విడిచి,     ఇది వేణుగోపాల ప్రేమ సుమా
                                                           --((**))--
  
తలపు వలపు(1)

ఒక మాటైనా చెప్పక ఆలా ఉంటావా రాధా
ఒక్క సారి నీ దర్శనంతో నా మనస్సుని
ఒకే విధముగా లేకుండా చేసావు కానీ
చిక్కావు నా ఉహల ప్రపపంచమ్ లోకి
     
వెన్నెల రాణివైతే ఈ జాబిల్లికోసం రావా
మెరుపుల తీగవైతే ఈ నింగి కోసం రావా
వనదేవతవయితే వనరాజును చూడవా
జల దేవత అయితే కడలిలో కలువవా

ఎలా కనిపించెదవో ఊహలకందుటలేదు
ఎలా కవ్వవించెదవో మనసుకు చిక్క లేదు
ఎక్కడున్నా వో  ఏమీ  అర్ధం ఆవుట లేదు
ఎం చేస్తున్నావో ఏమిటో తెలియుటలేదు

నా ప్రేమ నాయిక వైనావు నీవే రాధా
భోగములు అందించ గా రావా రాధా
నోరారా పలకరించుటకు రావా రాధా
తలపు వలపు కోసం వేచి ఉన్నా రాధా  
--((*))-

1. Pranjali  ప్రభ - *శ్రీ ఆంజనేయ అష్టోత్తర శత నామావళి.*
సేకరణ: మల్లాప్రగడ  శ్రీదేవి రామకృష్ణ

ఓం శ్రీ ఆంజనేయాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం హనుమతే నమః
ఓం సీతాదేవి ముద్రాప్రదాయకాయ నమః
ఓం మారుతాత్మజాయ నమః
ఓం తత్త్వఙ్ఞానప్రదాయ నమః
ఓం అశొకవనికాచ్చేత్రే నమః
ఓం సర్వబంధ విమోక్త్రే నమః
ఓం రక్షోవిధ్వంసకారకాయనమః
ఓం పరవిద్వపరీ హారాయ  నమః
ఓం పరశౌర్య వినాశనాయ నమః
ఓం పరమంత్ర నిరాకర్త్రే నమః
ఓం పరమంత్ర ప్రభేధకాయ నమః
ఓం సర్వగ్రహ వినాశినే నమః
ఓం భీమసేన సహాయకృతే నమః
ఓం సర్వదుఃఖ హరాయ నమః
ఓం సర్వలోక చారిణే నమః
ఓం మనోజవాయ నమః
ఓం పారిజాత ధృమూలస్ధాయ నమః
ఓం సర్వమంత్ర స్వరూపవతే నమః
ఓం సర్వయంత్రాత్మకాయ నమః
ఓం సర్వతంత్ర స్వరూపిణే నమః
ఓం కపీశ్వరాయ నమః
ఓం మహాకాయాయ నమః
ఓం సర్వరోగహరాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం బలసిద్ధికరాయ నమః
ఓం సర్వ విద్యాసంపత్ప్రదాయ నమః
ఓం కపిసేనా నాయకాయ నమః
ఓం భవిష్యచ్చతు రాననాయ నమః
ఓం కూమార బ్రహ్మచారిణే నమః
ఓం రత్నకుండల దీప్తిమతే నమః
ఓం చంచల ద్వాల సన్నద్ధలంబమాన శిఖోజ్వలాయ నమః
ఓం గందర్వ విద్యాతత్వఙ్ఞాయ నమః
ఓం మహాబలపరాక్రమాయ నమః
ఓం కారాగృహ విమోక్త్రే నమః
ఓం శృంఖల బంధ విమోచకాయ నమః
ఓం సాగరోత్తారకాయ నమః
ఓం ప్రాఙ్ఞాయ నమః
ఓం రామదూతాయ నమః
ఓం ప్రతాపవతే నమః
ఓం వానరాయ నమః
ఓం కేసరిసుతాయ నమః
ఓం సీతాశోక నివారణాయ నమః
ఓం అంజనా గర్భసంభుతాయ నమః
ఓం బాలర్క సదృశాననాయ నమః
ఓం విభీషణ ప్రియకరాయ నమః
ఓం దశగ్రీవ కులాంతకాయ నమః
ఓం లక్ష్మణ ప్రాణదాత్రే నమః
ఓం వజ్రకాయాయ నమః
ఓం మహాద్యుతయే నమః
ఓం చిరంజీవినే నమః
ఓం రామభక్తాయ నమః
ఓం ద్తెత్యకార్య విఘాతకాయ నమః
ఓం అక్షహంత్రే నమః
ఓం కాంచనాభాయ నమః
ఓం పంచవక్త్రాయ నమః
ఓం మహాతపసే నమః
ఓం లంకిణేభంజనాయ నమః
ఓం గంధమాదన శ్తెలస్థాయ  నమః
ఓం లంకాపుర విదాహకాయ నమః
ఓం సుగ్రీవ సచివాయ నమః
ఓం ధీరాయ నమః
ఓం శూరాయ నమః
ఓం ద్తెత్యకులాంతకాయ నమః
ఓం సురార్చితాయ నమః
ఓం మహాతేజసే నమః
ఓం రామ చూడామణి ప్రదాయ 
నమః
ఓం కామరూపినే నమః
ఓం శ్రీ పింగళాక్షాయ నమః
ఓం నార్ధి ంతే నాక నమః
ఓం కబలీకృత మార్తాండమండలాయ నమః
ఓం కబలీకృత మార్తాండ నమః
ఓం విజితేంద్రియాయ నమః
ఓం రామసుగ్రీవ సందాత్రే నమః
ఓం మహారావణ మర్ధనాయ నమః
ఓం స్పటికా భాయ నమః
ఓం వాగ ధీశాయ నమః
ఓం నవ వ్యాకృతి పండితాయ నమః
ఓం చతుర్భాహవే నమః
ఓం దీనబంధవే నమః
ఓం మహత్మనే నమః
ఓం భక్త వత్సలాయ నమః
ఓం సంజీవన నగా హర్త్రే నమః
ఓం శుచయే నమః
ఓం వాగ్మినే నమః
ఓం దృఢవ్రతాయ నమః
ఓం కాలనేమి ప్రమధనాయ నమః
ఓం హరిమర్కట మర్కటాయనమః
ఓం దాంతాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం ప్రసన్నాత్మనే నమః
ఓం శతకంఠ మదావహృతేనమః
ఓం యోగినే నమః
ఓం రామకధాలోలాయ నమః
ఓం సీతాన్వేషణ పండితాయ నమః
ఓం వజ్ర నఖాయ నమః
ఓం రుద్రవీర్య సముద్భవాయ నమః
ఓం ఇంద్ర జిత్ప్ర్రహితా మోఘబ్రహ్మస్త్ర వినివార కాయ నమః
ఓం పార్ధ ధ్వజాగ్ర సంవాసినే నమః
ఓం శరపంజర భేదకాయ నమః
ఓం దశబాహవే నమః
ఓం లోకపూజ్యాయ నమః
ఓం జాంబవ త్ప్రీతి వర్ధనాయ నమః
ఓం సీత సమేత శ్రీరామపాద సేవా దురంధరాయ నమః
*శ్రీ ఆంజనేయం*