4, అక్టోబర్ 2019, శుక్రవారం

శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు సందర్భముగా (25 పాటలు )





ఆరాధ్య లీల - 25
ప్రాంజలి ప్రభ  
రచయత. మల్లాప్రగడ రామకృష్ణ

భలేమంచిరోజు పసందైన రోజు సంక్రాంతి రోజు,
వసంతాలు పూచే రోజు, చల్లఁదనం పొందిన రోజు   
అందరికీ ఆనంద పరిచే భోగి, సంక్రాంతి రోజు 
మనసు పులకించి తనువు తపించిన రోజు

ఉదయ భానుని, చల్లని కిరణాలు పంచేరోజు 
గుండేలో కోరికలన్నీ, నెరవేర్చు కొనే రోజు
గువ్వల్లా గూటికి చేరి, సంతోషం పంచుకొనే రోజు
నింగిలోని అందాలన్నీ ముంగిటలో ఉంచినరోజు

జీవిత సాహిత్య దృక్పధం, మనస్సుకు తెల్పిన రోజు 
స్థలకాల పధ్ధతి, వర్తమాన, నియమాన్ని తెల్పిన రోజు
తల్లి తండ్రుల ఆశల్ని,  బిడ్డలు నెరవేర్చిన రోజు
ఏడుకొండల పరమార్దాన్ని, తెలుసుకున్న రోజు

పరమాత్ముని బృందావనం పులకించిన రోజు
ఆరోజు ఈరోజు ఏరోజు 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని దర్శించన రోజు
 దేనికి సాటిరాదు
 మనః శాంతిని కల్పించే వేంకటేశ్వర సన్నిది రోజు

--((*))--


ఆరాధ్య ప్రేమలీల-24
ప్రాంజలి ప్రభ
రచయత మల్లాప్రగడ రామకృష్ణ

కదిలే ప్రయాణంలో, కదలని దేహం
తిరిగే చక్రాలతో, కదిలేటీ ప్రాణం
కరిగే మంచులా, తరిగేటి వయస్సు 
ఉడికే నీరులా, పరుగెత్తె మనస్సు
అందించావా శ్రీశ్రీశ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

వసతులు స్రృష్టించి, సుఖం అందిస్తున్నావే
సుఖంలో కష్టం తెల్సుకోలేక, మాయ చేస్తావే
నమ్మకం కల్పించి, తల్లక్రిందులు చేస్తున్నావే
భయ ఆందోలణ కల్పించి, సంబర పడతావే
శ్రీశ్రీశ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

కళ్ళకు దారిచూపి, కళ్ళను తిప్పి ఆడుతావే
నీడనుసృష్టించి, ఉండి ఉండనట్లు ఉంటావే
గాలిని అందించి. కల్షితం చేసి భాధిస్తావే
నీరుయే ఆరోగ్యమంటు రోగిని చేస్తావే
శ్రీశ్రీశ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

--((*))--


*ఆరాధ్య భక్తి లీల -23*
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 

కణకణము వెలుగు నీ చలవే 
- హృదయం లో దివ్యమైన జ్యోతిగా    
మదితలపు పిలుపు నీ చలవే
-  ఉదయం లో  అందమైన జ్యోతిగా     
శ్రీ శ్రీ శ్రీ  తిరుమల తిరుపతి వేంకటేశా 

అడుగడుగు మలుపు నీ చలవే
 - సమయం లో నిత్యమైన జ్యోతిగా 
లతకులుకు తెలుపు నీ చలవే
 - తరుణం లో భవ్యమైన జ్యోతి గా 
శ్రీ శ్రీ శ్రీ  తిరుమల తిరుపతి వేంకటేశా

సరిగమలు పలుకు నీ చలవే 
- ఫలితం లో రమ్యమైన  జ్యోతిగా  
తడిపొడిల తపన నీ చలవే 
 - నిలయం లో సాక్ష్యమైన జ్యోతిగా    
శ్రీ శ్రీ శ్రీ  తిరుమల తిరుపతి వేంకటేశా

కలిసికొన మెరుపు నీ చలవే 
- నయణం లో నాణ్యమైన జ్యోతిగా   
చిరునగవు కొలువు నీ చలవే 
- పయనం లో శ్రావ్యమైన జ్యోతిగా  
శ్రీ శ్రీ శ్రీ  తిరుమల తిరుపతి వేంకటేశా

అఖండ హారతి జ్యోతి గా 
ఆరోగ్య ఉదర జ్యోతిగా  
అనంత పరమాత్మ జ్యోతిగా  
నిత్యకల్యాణ వైభవ  జ్యోతిగా 
శ్రీ శ్రీ శ్రీ  తిరుమల తిరుపతి వేంకటేశా

--((**))--


ఆరాధ్య భక్తి లీల- 22  
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

భేదము నెంచకయ్యా 
 శ్రీ శ్రీశ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 
బాధ్యత తెల్పవయ్యా 
 శ్రీ శ్రీశ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

ఆవల నీవు దాత వయ్యా
 - ఈవళ నేను అర్థి నయ్యా 
కాలము నీది సర్వ మయ్యా 
 - యాచన నాది వేద మయ్యా 
శ్రీ శ్రీశ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

మౌనము ఏల ఉండు వయ్యా 
- కష్టము మాప  ఏల నయ్యా  
పృథ్విని నేలె నాయ కయ్యా
 - నమ్మక మేను కావు మయ్యా 
శ్రీ శ్రీశ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

దప్పులు లెంచ నేల నయ్యా 
- జీవము కాటి నంటు నయ్యా 
సర్వము గోడు విన్న వయ్యా 
- దైవము నమ్మి తెల్పి తయ్యా
శ్రీ శ్రీశ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

అన్నము ఆశ ఎందు కయ్యా 
- నిర్దయ చూపు పాపి నయ్యా       
పౌర్ణమి వెల్గు నీవె నయ్యా 
- రేయిని కమ్మి ఉన్న నయ్యా 
శ్రీ శ్రీశ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

భేదము నెంచకయ్యా
 శ్రీ శ్రీశ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

బాధ్యత తెల్పవయ్యా  
శ్రీ శ్రీశ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 
 శ్రీ శ్రీశ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

--((**))--
ఆరాధ్య భక్తి లీల- 21   
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

దాస దాసుండనయ్యా 
శ్రీ శ్రీశ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా
దాపరికం ఎందుకయ్యా 
 శ్రీ శ్రీశ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

రక్షణ ఇచ్చె దైవ మయ్యా 
- పాపము చేయు పాపి నయ్యా     
మాయను తుంచె నాయ కయ్యా 
- సేవయు చేసె మాను నయ్యా  
శ్రీ శ్రీశ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

ఏమని బాధ తెల్ప నయ్యా 
- ధర్మము మేది తెల్వ నయ్యా  
ప్రేమను తెల్పు తున్న నయ్యా 
- కామము తుంచి గావు మయ్యా 
శ్రీ శ్రీశ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

కావలి నాది వృత్తి నయ్యా 
- గాచుట నీది ధర్మ మయ్యా 
ఈవలి తీర్పు నీది నయ్యా 
- ఆవలి పూజ నాది నయ్యా  
శ్రీ శ్రీశ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

దాస దాసుండనయ్యా 
శ్రీ శ్రీశ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా
దాపరికం ఎందుకయ్యా  
శ్రీ శ్రీశ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 
 శ్రీ శ్రీశ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

--((**))--

ఆరాధ్య భక్తి లీల -20
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  

ప్రేమతో  పద్మావతి వల్లభా అంటున్నా  

మా ప్రేమ నీకోసమె సార్వం అర్పిస్తున్నా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

అంగరంగ వైభవంగా  

అలంకారం చేసానులే  
రకాల పిండి వంటలే    
నైవేధ్యాన్నిపెట్టానులే
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

నానా నాట్యములాడుచూ  
బహు విధ ప్రార్థనలే 
అంగ ప్రదక్షణములే   
స్తోత్ర పారాయణములే 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

కరుణ జూపవా రంగా 
అంతరంగ వేదనలే
అంగాంగము రోగములే   
మాయజయించలేనులే
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

హృదయాన్ని అర్పించియే  
ఘంటా నాదం చేసానులే   
నిత్యం నీకు సేవలులే 
సంగీతంతొ పాడానులే   

శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

ప్రేమతో  పద్మావతి వల్లభా అంటున్నా  
మా ప్రేమ నీకోసమె సార్వం అర్పిస్తున్నా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

--((**))--



ఆరాధ్య భక్తి లీల-(19 )
మల్లాప్రగడ రామకృష్ణ 

అల్పుడను నేను - పరిపూర్ణస్వరూపుడవు నీవు 
శక్తి హీనుడను నేను - సర్వాంతర్యామివిగా నీవు 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

నమస్కారం చేయుటనాపని- రక్షించుట నీపని 
ప్రేమతో నామ జపం నాపని - కాపాడుట నీపని 
శరణు కోరటం నాపని - పరుగు సేవ నీపని    
పూల పూజ నాపని - కోరికలు తీర్చేది నీపని 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

దాసుడుగా ఉండు నాపని  - ఆశ తీర్చేది నీపని 
శ్రమించుటయే నాపని- సంపద ఇవ్వడం నీపని  
వేడుట నాపని - పరమపురుష శ్రీపతివని 
ప్రేమించటం  నాపని - నన్ను ఆదరించుట నీపని
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

ఈర్ష్యలేని శ్రీనివాసుడవని  - కర్తవ్యం నీదని 
సంపద అందించేవాడవని - ప్రేమికుడవని 
మొక్కులు అందుకుండే వాడవని - శ్రీమూర్తివిఅని
నిత్యమూ నిన్నే నమ్ముకొని - ప్రేమించే అభాగ్యుడ్ని  
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా
    
అల్పుడను నేను - పరిపూర్ణస్వరూపుడవు నీవు 
శక్తి హీనుడను నేను - సర్వాంతర్యామివిగా నీవు 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

--((**))--


ఆరాధ్య భక్తి లీల - 18  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

శ్రీదేవి ఒకవైపు భూదేవి మరోవైపు ఉంచుకొని సరసమాడుట నీకే సొంతము  శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా  

కను రెప్పలు కదల్చక ఉంచావు      
పెదవంచున నవ్వును చూపావు 
బ్రమరమ్ముగ మనస్సు మార్చావు   
విహరించియు మక్కువ చూపవు      
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా  

తలచి వలపుల్లో బంధించావు 
మనసు మలుపుల్లో ఇర్కించావు
తనువు తలపుల్లో తర్కించావు    
పగలు జపముల్తో నమ్మించావు 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా  

మనస్సును మైకంలో ముంచేసావు   
వయస్సును మౌనంలో దాచేసావు  
ఉషస్సును రూపంలో చూపేసావు 
యశస్సును గోప్యంతో పంచేసావు 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా  

నవ్వుల చూపులకు దక్కినావు
పువ్వుల వాసనకు  చిక్కినావు 
రివ్వున ఆశలతొ నిల్చినావు
జివ్వున ఊహలతొ మల్చినావు    
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా  

ఆరాధన హారతి అందించావు  
మంత్రంమెదొ నేర్పుగ వేసేసావు 
మాటల్తోను నేర్పుగ దాచేసావు 
ప్రేమతో ఇద్దరిలో ఉన్నావు        
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

---((**))--


ఆరాధ్యభక్తి లీల -17  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

తల్లి వకుళాదేవి వడిలో వేంకటేశ్వరుడు 
పవళించగా ఆతల్లి పరవ శించగా

బాబూ రారా బాబూరా అమ్మా వచ్చా   
బాబూ రారా బాబూరా అమ్మా వచ్చా 
రా రా శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

సొంతం నీతేజం అందర్కీ పంచాలీ 
ఆదర్శం ఆనందం పంచాలీ బాబూ 
నుంచోనీ పాదాలే కందా యేమీ రా
భక్తుల్లో ప్రేమమ్ అందిస్తున్నా అమ్మా 
  
అమ్మానే ఓడేనే భక్తుల్లా ముందే
కల్లోలం వద్దూరా తల్లీబాధే రా
పన్నీరూ పంచీ కన్నీరూ తుడ్వాలీ 
పాషాణా హృద్యాన్నే మార్చీ రా బాబూ       

మర్మాన్నీ ప్రేమ ల్నీ నమ్మాకే రారా 
ధర్మాన్నీ న్యాయాన్నీ రక్షించాకే రా 
ప్రేమ ల్నీ స్నేహాన్నీ రక్షించాకే రా 
అన్నాన్నీ వంశాన్నీ  అందించాకే రా

బాబూ రారా బాబూరా అమ్మా వచ్చా   
బాబూ రారా బాబూరా అమ్మా వచ్చా 
రా రా శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

--((**))--

ఆరాధ్యభక్తి లీల -16  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
తల్లి వకుళాదేవి వడిలో వేంకటేశ్వరుడు 
పవళించగా ఆతల్లి పరవ శించగా 

బాబూ రారా బాబూరా అమ్మా వచ్చా   
బాబూ రారా బాబూరా అమ్మా వచ్చా 
రా రా శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

కల్లోలం లేదూరా ప్రాపంచంలోనా 
కష్టాలే నష్టాలే  వస్తాఈ రారా 
ఏ పుణ్యం ఏ ప్రాణం నీకే తెల్సురా  
ఏ పాపం ఏ శాపం నీకే తెల్సురా 

నిన్నే పూజించే వార్కి నీవేరక్షా 
అందర్వి తప్పుల్ క్షమించేసీ రారా 
అన్యాయం తెంచీ న్యాయం చేసీ రారా     
ఆరోగ్యాన్నీ ఇచ్చీ నావద్దకే రా  

నీలాలే అర్పించే కోర్కే తీర్చేరా
మోక్కూలే వేసారూ భాదే తీర్చేరా
నిత్యా కళ్యాణం చేస్కోనీ రా రా రా 
ఏడేడూ లోకాల్లో నీవే దిక్కూ రా  

బాబూ రారా బాబూరా అమ్మా వచ్చా   
బాబూ రారా బాబూరా అమ్మా వచ్చా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

--((**))--
          
ఆరాధ్యభక్తి లీల -15  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

తల్లి వకుళాదేవి వడిలో వేంకటేశ్వరుడు 

పవళించగా ఆతల్లి పరవ శించగా 

బాబూరారా బాబూరా అమ్మావచ్చా   
బాబూరారా బాబూరా అమ్మావచ్చా
రా రా శ్రీశ్రీశ్రీ తిరుమల తిరుపతి వెంకటేశా  

రావాలీ శ్రీవత్సా  సంతోషంగా రా   
సందేహంమేమీ లేదూనూలేరారా
కన్నీరూ వద్దూలే కాలాన్నీ చూడూ
పన్నీరూ పంచుతా ప్రేమంతా నీకే 

కన్నీరూ మున్నీరూ కార్చేస్తున్నానూ
లోకంలో పాపాలూ పాపాలూ  ఉండే
కల్లోలం వద్దూరా భూదేవీ నీదే 
నీధ్యేయం నీ గమ్యం అడ్డేదీ లేదే 

తప్పేమీ ఒప్పేమీ  కన్నాలేదూరా
ధర్మాన్నీ న్యాయాన్నీ  కాపాడీ రారా
అమ్మానే తప్పేమీ  చెయ్యాలేదమ్మా 
కాలాన్నీ బట్టే సాయం చేస్తానమ్మా            

బాబూరారా బాబూరా అమ్మావచ్చా   
బాబూరారా బాబూరా అమ్మావచ్చా
శ్రీశ్రీశ్రీ తిరుమల తిరుపతి వెంకటేశా  

--((**))--



ఆరాధ్య భక్తి లీల - 14. 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 

నీ భక్తుని కష్టాలు కడతేర్చి కాపాడుట నీవంతు
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా  ...... 2

కలువల మించిన నీ కనులు ...   చిలికెను నాలో వెన్నెలలు
మనసును దోచిన   నీ కనులు .... వలికెను నాలో తేనియలు 
పదములు పాడితి నీ కనులు .... పలికెను నాలో రాగములు 
వరములు కోరితి నీ కనులు .. తలఁచెను నాలో వాక్యములు  
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా  ...... 2
  
చేష్టలు చూపి .. జారుట చూసి . కసి కసి  నవ్వు వినిపించకు 
పల్టీలు చేసి  ......  కారుట చూసి .... కని విని నవ్వు తలపించకు 
వేల్పులు చూసి ....   వేదాలు విని ... తెలియని నవ్వు చూపించకు  
బాణాలు దూసి.. ప్రాణాలు తీసి... ముసిముసి నవ్వు విసిరేయకు

శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా  ...... 2

మనువు నడుమ తనువు నలిగితే కడదాకా సాగాలి 
కలసి నడుమ కధలు కదిలితే కడదాకా లాగాలి 
మనసు నడుమ మగువ పిలుపుతో  కడదాక ఏలాలి  
కడలి నడుమ పడవ మునిగితే కడదాక ఈదాలి

నీ భక్తుని కష్టాలు కడతేర్చి కాపాడుట నీవంతు
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా  ...... 2

--((**))--

ఆరాధ్య భక్తి లీల -13
రచయత: యల్లాప్రగడ రామకృష్ణ 

కర్మలకు అతీతుడవు నీవు, కర్మలకు చిక్కిన  
నా మనస్సును తేలిక పర్చవయ్యా నమో వేంకటేశా    
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా  ...... 2
  
కారుచిచ్చులా మండు తున్నది నా హృదయం
నాలో ఉన్న అహంకారాన్ని తొలగించ వయ్యా 
నామది నీపాదాల చెంత ఉండేందుకు అవకాశం 
కల్పించవయ్యా  నమో నమో వేంకటేశా
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా  ...... 2

తల్లి తండ్రులకు సేవలందించి నీ పాదాల చేరా     

కరుణ సాగర భందాలను దరిచేర్చి ఇక్కడకు వచ్చా 
హృదయ వేదనతో కడుగుతున్నా నీ పాదాలు
కందకుండా  పాదరక్షలుగా ఉంటా నమో వేంకటేశా    
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా  ...... 2
  
కర్మలకు అతీతుడవు నీవు, కర్మలకు చిక్కిన  
నా మనస్సును తేలికపర్చవయ్యా నమో వేంకటేశా    
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా  ...... 2

--((**))--
ఆరాధ్య భక్తి లీల -12 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 

దివి నుండి భువికి దిగి వచ్చావు 
మా కోర్కలు తీర్చుటకు నిలబడినావు 
మా కన్నీరుతో నీ పాదాలు కడగాలని 
మాభాదలను, కష్టాలను తీర్చే నాధుడవు
అని తలచాము నమో నమో వేంకటేశా
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 2 ..

నవమాలికలను , తులసీదళాలను ధరించి 
నవరత్నములను, లలాట తిలకమును ధరించి 
నిలబడి హృదయంలో లక్ష్మిదేవిని భరించి 
నవమన్మధాకారా రూప నమో వేంకటేశా
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 2 ... 

నవ రాగాల ప్రార్థనలను ఆలపించు   

నవ మేళ వాయిద్యాలతో స్వరపరచి 
సంగీత గాణ మాధుర్యముతో పిలిచి
సతి పతులను మేల్ కొల్పుతున్నాము 
మమ్ము క్షమించవయ్యా నమో వేంకటేశా
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 2 ... 

దివి నుండి భువికి దిగి వచ్చావు 
మా కోర్కలు తీర్చుటకు నిలబడినావు 
మా కన్నీరుతో ని పాదాలు కడగాలని 
మాభాదలను, కష్టాలను తీర్చే నాధుడవు
అని తలచాము నమో నమో వేంకటేశా
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 2 ..

--((**))--

ఆరాధ్య భక్తి లీల - 11  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

మోగేలే హృదయ వీణా
రస అసిధారా పాట పాడేలే
కదిలే మనసు వీణా 
నీపై ప్రేమ కురిపించే పాటేలే
మమతలు పంచె వీణా 
భక్తితో పురోగమించే నిత్య పూజేలే
తరుణానంద పరిచే వీణా  
శాంతి సౌభాగ్యా లందించే నీ సేవేలే 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా          

లోలకములా కదిలే వయస్సు నాది 
నక్షత్రం లా మెర్సేటి ఉషాస్సు నాది
నవనీతంలా కర్గేటి మనస్సు నాది    
జలపాతంలా ఉర్కేటి తపస్సు నాది
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

చిత్తం ఉంచి నిన్నే ప్రార్థిస్తున్నా 
విత్తం పంచి నిన్నే ఆరాధిస్తున్నా  
అహం వదలి నిన్నే వేడుకుంటున్నా 
అన్యపుణ్యం ఎరుగని వారిని ఆడుకుంటున్నా 
ఎన్ని చేసినా నీపై మనస్సు లేక బతుకుతున్నా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

మోగేలే హృదయ వీణా
రస అసిధారా పాట పాడేలే
కదిలే మనసు వీణా 
నీపై ప్రేమ కురిపించే పాటేలే
    
--((**))--
ఆరాధ్య భక్తి లీల-10  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

సేవలు లయబద్దంగా చేశాను 
నీ మాయలు తెలుసుకో లేకున్నాను
నమ్మి నిను కోలుస్తున్నాను 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా ... 2 
  
లేదనుకున్న వాళ్లకు 
మనస్సు నందించే వాడవు 
సకలం సమదృష్టితో 
సమరాన్ని ఆపెవాడవు 
శ్రీ పద్మావతీ వల్లభుడవై 
లేలలీలల కళలు నెరవేర్చి 
కంటికి రెప్పలా కాపాడే వాడవు   
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా ... 2  

నడకను నేర్పి, నాణ్యత తెల్పి 
నడమంత్రపు సిరి అందించి 
సుడిగుండంలో ఇరికించి 
నేనున్నానని గుర్తు చేస్తున్నావా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా ..... 2   

సేవలు లయబద్దంగా చేశాను 
నీ మాయలు తెలుసుకో లేకున్నాను
నమ్మి నిను కోలుస్తున్నాను 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా ... ౨

--((**))--

ఆరాధ్య భక్తి లిల -9 
రచయత మల్లాప్రగడ రామకృష్ణ
  
లోలాళిలాలిలీలా 
ళీలాలీలాల మనస్సులో
హాయిని అందించే 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా ... 2 

లోకాలన్ని  
లాలించి పాలించి  
నిశ్శబ్ద సాహిత్యాన్ని అందించి 
లాస్వాన్ని సృష్టించి 
నిమ్న హృదయాన్ని అందించి 
లీలలెన్నో చేసి చేయించి 
లోలాళిలాలిలీలా చూపించి 
ఆకార స్వరూపుడుగా కలియుగంలో ఉన్నావా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా ... 2 

చీకటిని తరిమే వెలుగులా 
కార్యాన్ని సఫలీకృత చేసే శక్తి లా
నీలిమేఘాలలో సూర్యుడులా
బారాన్ని మోసే భాధ్యుడిలా 
ళీలాలీలాల మనస్సులో 
నయనాలతో నమ్మకం కల్పించే 
 శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా .... 2  

లోలాళిలాలిలీలా 
ళీలాలీలాల మనస్సులో
హాయిని అందించే 

శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా ... 2 

--((**))--

ఆరాధ్య భక్తి లీల - 8     
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

చలిలో వానలో తడిసి 
పొగలో సెగలో మునిగి 
వెతలే మదిలో నలిగి 
సిరులే స్త్రీలతో మరిగాను   
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా....2  

కథలే  తెల్పుచున్నా  సందర్భ సంఘర్షణాలతో  
సమరం చేస్తున్నా జీవిత సంగ్రామ భాష్యాలతో    
నిత్యం సహనం మార్గముగా భావ ప్రాధాన్యతతో   
ప్రార్ధిస్తున్నా మరులే గొల్పుచు భావాల సాహిత్యంతో 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా....2 

తరుణం నీదియు ధార్మిక భావాలు నీవల్లనే   
సమస్త విషయ వాంఛలు అబ్బుట నీవల్లనే
నేను చేయునది ఎమీ లేదు అంతా నీవల్లనే 
పాలముంచినా నీట ముంచినా నిన్నేప్రార్దిస్తున్నా  
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా....2 

చలిలో వానలో తడిసి 
పొగలో సెగలో మునిగి 
వెతలే మదిలో నలిగి 
సిరులే స్త్రీలతో మరిగాను   
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా....2  

--((**))--
ఆరాధ్య భక్తి లీల - 6   
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

పూసింది ఈ పువ్వు నీకొరకే 
నీ పాదాల చెంత చేరేందుకే
పరిమళ భరితం అందించేందుకే 
జన్మ సార్ధకం చేసేందుకే 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా .... 2 
  
సకలపుష్పాలకు ఆధారమైనవాడవు 
సమస్త తరువులకు నిలయమైన వాడవు   
స్వశ్చంద పరిమళాన్ని ఆస్వాదించు వాడవు 
స్వత్సమైన వాయువును అందించువాడవు 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా .... 2 

సకలం నివాసం కల్పించే వచ్చరుడవు 
తరుణం సద్వినియోగ పరిచేవాడవు 
వాచ్చల్య భావ స్వరూపుడవు 
కోరినవారికి భక్తవత్సలుడవు 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా .... ౨

పూసింది ఈ పువ్వు నీకొరకే 
నీ పాదాల చెంత చేరేందుకే
పరిమళ భరితం అందించేందుకే 
జన్మ సార్ధకం చేసేందుకే 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా .... 2 

--((**))--
ఆరాధ్య భక్తి లీల -5  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

వరముల నియ్యగ రావా 
వందనములు స్వీకరించవా 
వద్దన్నవాడికి మోక్షమిస్తావా  
వంత పలికేవారిని ఉద్ధరిస్తావా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా .... 2  

గతాన్ని మరచి, కాలాన్ని గమనించి,
నిన్ను కోరి, నీ చెంతను చేరి 
నిత్య పూజా కార్యక్రమాలు చేసి  
నిర్మొహమాటంగా నిన్నే ప్రార్ధించా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా.... 2  

విశ్వమునందు సమస్త కార్యములను  
సృష్టి లయ స్థితులను చక్కబరిచి    
సర్వకార్యదక్షుడుగా సహకరించి 
శబ్దవాచ్యుడుగా మారినావా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా .... 2 

వరముల నియ్యగ రావా 
వందనములు స్వీకరించవా 
వద్దన్నవాడికి మోక్షమిస్తావా  
వంత పలికేవారిని ఉద్ధరిస్తావా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా .... 2  
--((^^))-- 
ఆరాధ్య భక్తి లీల - 4 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

నిత్యము నిన్నే నమ్మితి
నిరతము నిన్నే కొలిచితి
నిజమును నీతో చెప్పితి
నిన్ను మౌనంగా సేవించితి 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా ... 2 

జగత్పిత జగన్మాతగా ఏలువాడా
వత్సములు (సంతానములు) పాలించువాడా 
భక్తుల వాత్సల్యమును తీర్చువాడా
శాంత్యా నందసౌఖ్యము లందించువాడా
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

ఆధ్యాత్మిక సాగరమును వృద్ధిచేయువాడా
అధిపతిగా ధనరాశుల నందించు వాడా   
అర్హతను బట్టి ధనధాన్యాలు అందించువాడా
వైరాగ్యసంపన్నులకు మోక్షధనం ఇచ్చువాడా 

నిత్యము నిన్నే నమ్మితి
నిరతము నిన్నే కొలిచితి
నిజమును నీతో చెప్పితి
నిన్ను మౌనంగా సేవించితి 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా .... 2

==((**))== 

ఆరాధ్య భక్తి లీల-
ప్రాంజలి ప్రభ.
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

చీకట్లను తరిమే వెలుగును
ఆశలు తీర్చే పరుగును 
ప్రకృతి అమర్చే తీరును
మనస్సు జతకూర్చే వరుసను
ఏర్పరిచే అఖిలాండకోటి బ్రహ్మాండ  నాయకా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా ... 2

కాలాన్ని మురిపింపచేసి గతాన్ని మరిపిస్తావు
ఆకర్షణతో అందాన్ని చూపి మనసే మురిపిస్తావు
రసవిద్యలు నేర్పి కొంగు బంగారము అందిస్తావు
మనస్సుతో ప్రశ్నలు వేసి జవాబులు అందిస్తావు
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా ... 2

పాతనమ్మకాలనే కొత్తవిగా సృష్టిస్తున్నావు
కొత్త పంధాలో విజ్ఞానాన్ని అందిస్తున్నావు
మమ్ము పరువపువేటలో  ఉడికిస్తున్నావు
దారుణాన్ని చూసి తీర్చలేని స్థితి ఉంచావు 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా ... 2

చీకట్లను తరిమే వెలుగును
ఆశలు తీర్చే పరుగును 
ప్రకృతి అమర్చే తీరును
మనస్సు జతకూర్చే వరుసను
ఏర్పరిచే అఖిలాండకోటి బ్రహ్మాండ  నాయకా 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా ... 2
--((**))--




ఆరాధ్య భక్తి లీల -3 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

వేదాంత రహస్యాలు తెలిపే గురువా 
మూడు మూ0డ్ల తొమ్మిది మాటల్లో తెల్పావే      

పుట్టుక రహస్యాలు తెలిపే జీవన్ముక్తా 
సర్వకాల సర్వా వ్యస్థలయందు వైభవోనేతా
సర్వం ప్రకృతి సంపద వృద్ధి ప్రదాతా       

అంతరాత్మలో వృద్ధిచెందే జ్ఞానాన్ని 
జ్ఞానం సమ విస్తరణ చేసే భక్తిని 
భక్తి ద్వారా కలిగే వైరాగ్యాన్ని కల్పించే దేవా 

గురు బోధ ద్వారా నిత్య సంతోషాన్నిపొంది 
గురువు నిర్దేశించిన మార్గాన్ని అనుసరించి 
శ్రీ వేంకటేశ్వరుని దాసునిగా సేవలు చేసి 

వేదాంత రహస్యమంతా 1)జీవుడు 2)దేవుడు
3)ప్రకృతి 4)జ్ఞానం 5)భక్తి 6)వైరాగ్యము
 7)గురువు 8)శరణాగతి 9)భగవత్ దాస్యం.చుట్టూ 
ఉంటుందని చెప్పిన శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 

వేదాంత రహస్యాలు తెలిపే గురువా 
మూడు మూ0డ్ల తొమ్మిది మాటల్లో తెల్పావే      

--((**))--



ఆరాధ్య భక్తి లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

అమ్మా  నీ పాద పద్మాలకు నమస్కరిస్తూ 
మీ శృగార లీలా వినోదాన్ని వర్ణించినందుకు క్షమించమ్మా 
  
సుధలు పొంగేటి యధరాలు పిలుస్తున్నాయి 
నిదుర పోయేటి నెలవంక కలువమన్నాది         
ఎదురు చూసేటి నయనాలు పిలుస్తున్నాయి 
బదులు రానట్టి మరు మాయ కలువమన్నాది  

మదిని రేపేటి కధనాలు పిలుస్తున్నాయి 
కదలి రావాలి మను బేల కలువమన్నది    
ఎదను పర్చాను మునగంగ పిలుస్తున్నాయి 
బెదురు పోవద్దు మనసంత కలువమన్నది        

మనసు రమ్మంది రణరంగ పిలుస్తున్నాయి    
వయసు పిల్చింది తనువంత కలువమన్నది  
మమత చూపంగ మమకార పిలుస్తున్నాయి  
సోగసు రాగాలు పిలవంగ కలవమన్నది  

రసకేళి ఆడుట - మాధుర్యం పంచవా వేంకటేశా 
సంతసము పొందుట - సహచరించుటే కదా వేంకటేశా  
నీ ప్రేమ పంచి  - సౌందర్యోపాసన పొంది 
నా  ఆలనా పాలనా చూడవా శ్రీ వేంకటేశా   
  

--((**))--





ఆరాధ్య భక్తి లీల- 1 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

గుణాన్ని మంచిగానో, చెడ్డగానో - నీకోసం వెచ్చించాను 
నన్నాదుకొన్నా, గుర్తించ లేని -  భక్తుడై ఉండి పోయాను  

మనసంతా నీపై ఉంచి ప్రేమతో సంసారిగా మారాను  
నీ విరోధులతో శతృత్వం వహించి పోరాడు తుంటాను  
నీ సుందర రూపానికి మోహితున్నై నిల్వ లేకున్నాను   
నీ నామ మంత్రం మాన్యుల కియ్యని పిసినారి నయ్యాను..... గు  

నీ సేవా దాసుడునని గర్వమెక్కి తప్పు చేస్తున్నాను 
ప్రసాదించిన చదువును కూడా తిరస్క రిస్తున్నాను   
భక్తి మార్గం మారకుండా మనసు నీపై ఉంచుతున్నాను
సమర్పించ లేని పనుల్ని నిర్భయంగా చేయ కున్నాను ..... గు   

కర్మ ఫలమంతా నీ కైంకర్యములకు వాడుచున్నాను  
అహంకారం చేరకుండా మమకారంతో పూజిస్తున్నాను
ఆపద మొక్కల శ్రీ వేంకటేశా అని పిలుస్తుంటాను    
బతికి నంతకాలం సేవచేసి ధనుడనౌతున్నాను .... గు 

గుణాన్ని మంచిగానో, చెడ్డగానో - నీకోసం వెచ్చించాను 
నన్నాదుకొన్నా, గుర్తించ లేని -  భక్తుడై ఉండి పోయాను  

--))**((--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి