5, అక్టోబర్ 2019, శనివారం

కధలు



వాకింగ్ ... గురించి ఈ 10 విషయాలు తప్పక తెలుసుకోవాలి!!

         మీకు హిపోక్రాట్స్ తెలుసా? ఆయ‌న ఇప్ప‌టి వాడు కాదు. క్రీస్తు పూర్వం 460వ సంవ‌త్స‌రానికి చెందిన వాడు. అప్ప‌ట్లోనే వైద్య రంగ నిపుణుడిగా పేరుగాంచాడు. అందుకే ఆయ‌న్ను ఫాద‌ర్ ఆఫ్ మెడిసిన్ అని పిలుస్తారు. ఇంతకీ అస‌లు విష‌యం ఏంటో తెలుసా..? ఏమీ లేదండీ.. స‌ద‌రు హిపోక్రాట్స్ అనే ఆయ‌న వాకింగ్ గురించి ఓ కొటేష‌న్ చెప్పారు. అదేమిటంటే.. వాకింగ్ ఈజ్ ఎ మ్యాన్స్ బెస్ట్ మెడిసిన్‌.. అని ఆయ‌న అన్నారు. అవును, మీరు విన్న‌ది నిజమే. ఈ క్రమంలోనే ప్ర‌తి రోజూ క‌నీసం 15 నుంచి 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేస్తే దాంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని ఆయ‌న చెప్పారు. మ‌రి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. వాకింగ్ రెగ్యుల‌ర్‌గా చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎండార్ఫిన్లు అన‌బ‌డే హార్మోన్లు విడుద‌ల‌వుతాయి. ఇవి మాన‌సిక ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి. ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్‌, కంగారు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అలాగే వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వచ్చే దెమెంతియా, అల్జీమ‌ర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

2. నిత్యం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. కంటికి సంబంధించిన ప‌లు నాడులు కాళ్ల‌లో ఉంటాయి. అందుక‌నే కాళ్ల‌తో వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగు ప‌డుతుంద‌ట‌. నిత్యం వాకింగ్ చేస్తే క‌ళ్ల‌పై అధిక ఒత్తిడి త‌గ్గ‌డంతోపాటు గ్ల‌కోమా వంటి కంటి వ్యాధులు రాకుండా ఉంటాయట‌.

3. నిత్యం ర‌న్నింగ్ చేస్తే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అదేలాంటి బెనిఫిట్స్ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కూడా క‌లుగుతాయ‌ని అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ చెబుతోంది. నిత్యం వాకింగ్ చేస్తే గుండె స‌మ‌స్య‌లు, హార్ట్ ఎటాక్‌లు రావ‌ట‌. అలాగే హైబీపీ, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయ‌ట‌. దీంతోపాటు శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంద‌ట‌.

4. వాకింగ్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరం ఆక్సిజ‌న్‌ను ఎక్కువ‌గా గ్ర‌హిస్తుంది. దీంతో అదే ఆక్సిజ‌న్ ర‌క్తంలో చేరి అది ఊపిరితిత్తుల‌కు అందుతుంది. ఈ క్ర‌మంలో స‌ద‌రు ఆక్సిజ‌న్ ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్లు, విష‌, వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. అలాగే ఇత‌ర ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.

5. డ‌యాబెటిస్ ఉన్న‌వారు నిత్యం ర‌న్నింగ్ క‌న్నా వాకింగ్ చేస్తేనే ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ట‌. 6 నెల‌ల పాటు వాకింగ్‌, ర‌న్నింగ్ చేసిన కొంద‌రు డ‌యాబెటిస్ పేషెంట్ల‌ను సైంటిస్టులు ప‌రిశీలించ‌గా ఈ విష‌యం వెల్ల‌డైంది. వాకింగ్ చేసిన వారిలో ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా అదుపులోకి వ‌చ్చాయ‌ని సైంటిస్టులు గుర్తించారు. అందువ‌ల్ల రోజూ వాకింగ్ చేస్తే డ‌యాబెటిస్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు.

6. నిత్యం క‌నీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే పెద్ద పేగు క్యాన్స‌ర్ వ‌చ్చే ముప్పు చాలా వ‌ర‌కు త‌గ్గుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. అలాగే జీర్ణ‌ప్ర‌క్రియ మెరుగు ప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం పోతుంది. విరేచ‌నం రోజూ సాఫీగా అవుతుంది.

7. నిత్యం 10వేల స్టెప్స్ (100 నిమిషాలు) పాటు వాకింగ్ చేస్తే అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతార‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. దీంతోపాటు కండ‌రాలు దృఢంగా మారుతాయ‌ట‌.

8. నిత్యం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కీళ్లు బాగా ప‌నిచేస్తాయి. అవి అంత త్వ‌ర‌గా అరిగిపోవు. అలాగే ఎముక‌ల్లో సాంద్ర‌త పెరుగుతుంది. దీంతో ఫ్రాక్చ‌ర్లు, కీళ్ల నొప్పులు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. ఇందుకు రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేయాలి. ఇలా చేస్తే కీళ్ల నొప్పులు, వాపులు కూడా త‌గ్గుతాయి.

9. బ్యాక్ పెయిన్‌తో స‌త‌మ‌త‌మ‌య్యేవారికి వాకింగ్ చ‌క్క‌ని ఔష‌ధం అనే చెప్ప‌వ‌చ్చు. లో ఇంపాక్ట్ వ్యాయామం కింద‌కు వాకింగ్ వ‌స్తుంది. క‌నుక న‌డుంపై పెద్ద‌గా ఒత్తిడి ప‌డ‌దు. దీనికి తోడు ఆ భాగంలో ఉండే ఒత్తిడి, నొప్పి కూడా పోతాయి. ర‌క్త స‌ర‌ఫ‌రా పెరిగి నొప్పి త‌గ్గుతుంది. క‌నుక వెన్ను నొప్పి ఉన్న‌వారు నిత్యం వాకింగ్ చేయ‌డం మంచిది.

10. నిత్యం వాకింగ్ చేయడం వ‌ల్ల ఎప్పుడూ డిప్రెష‌న్‌లో ఉండే వారు మంచి మూడ్‌కు వ‌స్తార‌ట‌. వారు హ్యాపీగా ఉంటార‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. క‌నుక నిత్యం వాకింగ్ చేయ‌డం మంచిది.

--((**))--

--((***))--
గురు పౌర్ణమి సందర్భముగా ప్రాంజలి ప్రభ శుభాకాంక్షలు తెలియ పరుస్తున్నది

సత్త్వసంశుద్ధిః :- 'సత్త్వం' అంటే అంతఃకరణం - మనస్సు. 'శుద్ధి' అంటే కల్మషాలు లేకుండా స్వచ్ఛంగా ఉండటం. 'సంశుద్ధి' అంటే పూర్తిగ స్వచ్ఛంగా, నిర్మలంగా ఉండటం. ఇలా మనస్సు పూర్తిగా నిర్మలంగా, నిష్కల్మషంగా, స్వచ్ఛంగా ఉంటే అది దైవీసంపద అవుతుంది. మనస్సు స్వచ్ఛంగా ఉంటేనే అందులో పరమాత్మ ప్రకాశం ఉండేది. నిర్మలమైన అద్దంలో ప్రతిబింబం బాగా ప్రకాశిస్తుంది గాని, దుమ్ము కొట్టుకొని ఉన్న అద్దంలో ప్రతిబింబం సరిగ్గా కనిపించదు గదా! కనుక నీలో పరమాత్మ జ్ఞానం ప్రకాశించాలంటే నీ అంతఃకరణం స్వచ్ఛంగా - నిర్మలంగా ఉండాలి. 
మనస్సు నిర్మలంగా ఉంటేనే బయటి ప్రవర్తన - ఆచరణ పవిత్రంగా ఉంటుంది. బయటి ప్రవర్తన - లోపల మనస్సు రెండూ ఒక్కటిగా ఉంటేనే ధ్యానంలో మనస్సు నిలుస్తుంది. జ్ఞానాన్ని చక్కగా గ్రహించగలుగుతారు. అప్పుడే పరమాత్మకు సమీపంగా నీ మనస్సు ఉంటుంది. 
ఇలా మనస్సు నిర్మలంగా స్వచ్ఛంగా ఉండాలంటే - నిరంతరము భగవత్ సంబంధమైన పూజాదికాలు, యజ్ఞ దాన తపస్సులు, శ్రవణం, సత్సంగం, గురుభక్తి, గురుసేవ, ఆధ్యాత్మిక సాధనలు ప్రీతితో ఆచరించాలి. అలాగాక ఆచరణ గొప్పగా ఉండి మనస్సు మాత్రం ప్రాపంచిక విషయాలతో, స్వార్థపూరిత భావాలతో, రజోగుణ తమోగుణ ప్రాబల్యంతో ఉన్నట్లైతే అది ఆసురీ సంపదను పెంచి పరమాత్మకు దూరం చేస్తుంది. 
--((***))--

(3) జ్ఞానయోగ వ్యవస్థితిః:- శాస్త్రాలలోని విషయాలను గురుసమ్ముఖంలో కూర్చొని శ్రవణం చేసి, గ్రహించిన జ్ఞానాన్ని ఏకాగ్రమైన మనస్సుతో అనుభవానికి తెచ్చుకొనే నిష్ఠయే జ్ఞానయోగ వ్యవస్థితి. నీ స్వరూపాన్ని తెలుసుకోవటం 'జ్ఞానం'. ఆ జ్ఞానాన్ని ఏకాగ్రతతోఅనుభవానికి తెచ్చుకొనుటకు ఆచరించే ఉపాయమే 'యోగం'. అలాంటి జ్ఞానం కలిగి, నిరంతరం యోగం నందే స్థితిని కలిగి ఉండటమే 'జ్ఞానయోగ వ్యవస్థితి' అంటారు. ఇక్కడ స్థితి అనక వ్యవస్థితి అంటున్నారు. అంటే ఇంటికి వచ్చిన అతిధిలా కాకుండా ఇంటి యజమానిగా ఉండాలి. అతిధి 1-2 రోజులుండి పోయేవాడు. యజమాని శాశ్వతంగా ఉండేవాడు. అంటే ఏదో కొద్దిసేపు నేను ఆత్మను అనే జ్ఞానంలో ఉండటం కాక శాశ్వతంగా - స్థిరంగా ఆత్మగా ఉండిపోవాలి. 
ఇలా ఉండాలంటే శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడే గాక కరుణా సముద్రుడైన గురువును ఆశ్రయించాలి. నిత్యము శాస్త్రశ్రవణం చేయాలి. సందేహాలను తొలగించుకోవాలి. అలా నిత్యశాస్త్ర శ్రవణం వల్ల జ్ఞానంలో నిలబడటం జరుగుతుంది. బుద్ధి ద్వారా పరమాత్మను గురించి శ్రవణం చేయటం, విచారణ చేయటం. ఆయనను చేరుకొనేందుకు కృషి చెయ్యటం. ఇదే జ్ఞానయోగ వ్యవస్థితి. ఇది దైవీసంపద. 

https://chat.whatsapp.com/EOpZFO5ruUl10bCCKx3Iimటి  పద్యం 

ఉద్యద్భాను సహస్ర కోటి సదృశామ్ కేయురహోరోజ్వలాం 
బింబోష్టిం స్మిత దంత పంక్తి రుచిరాం పీతాంబరలాంకృతాం 
విష్ణుర్ర్బ్రహ్మ  సురేంద్ర సేవిత పదాం తత్వ స్వరూపాం శివా౦
మీనాక్షిం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిమ్           

               అనేక వేల కోట్ల సూర్యుల తేజస్సుతో సమానమైన తేజస్సు కలది. కేయూరమణి హారముల కాంతితో ప్రకాశించేది. దొండపండు వంటి అధరోష్టముగలది, చిరునవ్వుతో కూడినట్టి దంతపంక్తి మనోహరమైనది,  పట్టువస్త్రములతో అలరారు చున్నది, బ్రహ్మవిష్ణు ఇంద్రాది దేవతలచే పూజింపబడు పాద పద్మములు కలిగినది,  తత్వస్వరూపిణి,  దయాసముద్రనిధి మంగళప్రదురాలు ఆయన శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కరించు చున్నాను.     

--((**))--

నేటీ పద్యం
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

ఓదేవా నిట గోపురాలు గుడులన్ నిర్మింపగా లేను పూ
జా కార్య క్రమమే సహస్త్ర జపమే స్వల్పంగ శక్తుండగా
ఏకాంతమ్మున నా మనస్సు కధలే ఇష్టంబు గా చెప్పెదా
నే చేయించు పనే నిరంత రముగా నిన్నేను ప్రార్ధించెదా

నేటి పద్యం
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

శ్రీ విధ్యే పరమార్ధ సార్ద కముగా క్షేమంబుగా మంచి స
ద్భావమ్మే  వినయామృతాను తరుణం కారుణ్య భావమ్ములే
వెంకన్నే సకలం భరించి కవితా ధ్యానంబు యోగంబుగా
ఆవాగ్ధాత వరంబుగా స కృతులన్ సంసార సాహిత్యమే     

 వాగ్ధాత సృష్టించిన జన్మలో సంసార సాహిత్యములో  కవితా ధ్యానములే యోగంబుగా సమస్తం భరించమని ఆ వెంకన్నను వేడుకొనగా  వినయ వినమృతా కారుణ్య భావాలు కల్పించి శ్రీ విద్య పరంగా తరుణాన్ని సద్వినియోగం చేసుకొనే  టట్లు క్షేమం కల్పించు.   

5. మాణిక్యం ఎరుపే, పెదాల మెరుపే, కావ్యాన్ని సృష్టించె లే

    బంగారం తనువే ఉగేటి నడుమే ఉల్లాస విజ్రుంభ ణే

    నాడెంతో తడిసే, సుఖాన్ని తెలిపే పాన్పును పంచేను లే

    వక్షోజాల కదల్చుట వల్ల మనసే ఆత్రంగా ఆరాటమే

తాత్పర్యం : పెదాల ఎర్రదనం, ఎర్రటి మానిక్య మెరుపు దనం, కవుల కావ్య రచనకు, సృష్టి జరుపుటకు దోహద కారి యగునది, శరీరం బంగారు ఆభరణాలుగా మెరుపుదనం తో ఆకర్షణగా మారి, ఉల్లాసంగా కవ్వించి సుఖాన్ని పొందేది, అసలే చక్కని పాన్పు ఉన్నది, తడిసిన బిగువ అందాలు చూపుతూ సుఖాన్ని పంచేది, స్థనాల బిగువులు తొలగించి, ఆత్రపు చూపులకు చిక్కి మనసును అర్పించేది స్త్రీ మాత్రమే.

6. కోలాటం జరిపీ కోపంతో కొరికే కోపిష్టి మార్చేను లే

    కొమ్మంతా కుదిపీ  జ్వరంతొ తడిసీ చల్లాగ నిద్రించు లే

    మాగాణీ కలుపే అమోఘ కుదుపే కాదన్న ఒర్చుట యే

    పుష్పంలా నలిగే శుఘంధ పరువం అర్పించె ఆర్భాటమే

తాత్పర్యము : మొగవాడు ఎంత కోపంగా ఉన్నా, ఒకరికొకరు కోలాటం జరిపినా, కోపం పేరుగా కుండా జాగర్త పడేది, ఏంతో కష్టపడి, శారీర మంతా కదలి జ్వరం పోయి చల్లగా మార్చి  నిద్ర పుచ్చేది,  శారీర సౌష్ఠమునకు చిక్కి, బాగుగా నలిగి, ఇంకా కావాలన్న ఓర్పు వహించి, పువ్వు నలిగి నట్లు నలిగినా శుఘంధ పరిమళాలను అందించేది స్త్రీ మాత్రమే
--((**))--




--((***))--
ప్రస్తుతం మొత్తం ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధన నడుస్తుంది. తల్లితండ్రులకు మన ఇంటిలో ఉండే ప్రతి వస్తువుల పేర్లు ఇంగ్లీషులో తెలిసి ఉండాలి. అందుకే ఈ క్రింద ఇచ్చిన పదాలు తెలుసుకుంటే పిల్లలకు వస్తువుల పేర్లను ఇంగ్లీష్ లో చెప్పవచ్చు.

*Names of Spices 
1. cumin seeds - జీలకర్ర
2. Turmeric - పసుపు 
3. Cinnamon - దాల్చిన
4. Coriander leaves - కొత్తిమీర
5. Clove - లవంగం
6. Black Mustard seeds - ఆవాలు
7. Blackpepper - మిరియాలు
8. Bayleaves --. బిరియానీ ఆకు
9. Cardamom --. యాలకులు
10.Fenugreek --. మెంతులు
11.Asafoetida --. ఇంగువ
12.Fennel seeds --.సోపు గింజలు
13.Curry leaves ---. కరివేపాకు
14.Poppy seeds ---. గసగసాల
15.Sesame seeds - నువ్వులు
16.Watermelon -- పుచ్చకాయ
17. Dry mango powder - మామిడి పొడి
18.Carom seeds -- వాము
19.Garlic --. వెల్లుల్లి
20. Nutmeg -- జాజికాయ
21.Camphor --కర్పూరం
22.Saffron --. కుంకుమపువ్వ
23.Mace --. జాపత్రి
24.Wailong -- మరాఠిమొగ్గ
25.Basil -- తులసి
26.Sandal -- చందనం
27.Soap nuts - కుంకుడు
28.Betal nuts - వక్కలు
29.Dried ginger - శొంఠి
30.Sago --. సగ్గు బియ్యం
31.Jaggery -- బెల్లం
32.Mint ---. పుదీన
33.Coriander Seeds -- ధనియాలు
34.Almond -- బాదం
35.Cashew --. జీడిపప్పు.
*Names of Vegetable*
1. Sweet potato - చిలకడదుంప
2. Onions - ఉల్లి పాయలు
3. Yam --. కంద గడ్డ
4. Brinjal --. వంకాయ
5. Cucumber - దోసకాయ
6. Drumstick - మునగకాయ
7. Pumpkin/Squash - గుమ్మడికాయ
8. Mustard greens --. ఆవ ఆకులు
9. Peppermint leaves- మిరియాల ఆకులు
10.BitterGourd - కాకరకాయ
11.BottleGourd - సొరకాయ
12.Ridge Gourd - బీరకాయ
13.SnakeGourd - పొట్లకాయ
14.Soft Gourd -. దొండకాయ
15. Colocasia roots - చేమదుంప, చేమగడ్డ
16.Turnip-వోక
17.Broccoli - ఆకుపచ్చ కోసుపువ్వు, బ్రోకోలి
18.Chilli --- మిరపకాయ
19.Lady's finger-బెండకాయ
20.Aloo. ----. ఉర్లగడ్డ.
*Names of dry fruits:*
1. Almond Nut. -- బాదం
2. Apricot dried --- ఎండిన
సీమ బాదం/ జల్లారు పండు
3. Betel-nut -- తమలపాకుల గింజ
4. Cashew nut --. జీడి పప్పు
5. Chestnut --. చెస్ట్నట్
6. Coconut --. కొబ్బరి
7. Cudpahnut --. సార పలుకులు
8. Currant --. ఎండుద్రాక్ష
9. Dates Dried -- ఎండు ఖర్జూరం
10.Fig --. అత్తి పండ్లు
11.Groundnuts, Peanuts - వేరుశెనగ పప్పు
12.Pine Nuts - చిల్గోజా, పైన్ కాయలు
13.Pistachio Nut - పిస్తా
14.Walnuts - అక్రోటుకాయ.
*ధాన్యాలు, పిండ్లు మరియు పప్పుల పేర్లు -:*
1. Barley -. బార్లీ
2. Buckwheat -- కుట్టు, దానా
3. Chickpeas -- ముడిశెనగలు
4. Cracked wheat- గోోధుమ రవ్వ
5. Cream of wheat / semolina - సెమోలినా
6. Flour ---. పిండి
7. Chickpea flour -- శనగ పిండి
8. Pastry flour --. మైదా పిండి
9. Garbanzo beans - ముడిశెనగలు
10.Red gram --. కందులు
11.Green gram -- పెసలు
12.Blackgram --. మినుము
13.Bengal gram - శనగలు
14.Horsegram --. ఉలవలు
15.maize --. మొక్కజొన్న
16.Pearl millet -. సజ్జలు
17.Beaten paddy- అటుకులు
18.Rice --. బియ్యం
19.Sorghum - జొన్న


--((***))--

😊😀😁       ఒక ఉల్లిపాయ.. ఒక పచ్చి మిరపకాయ..ఒక టమాటా..
ఒక ఐస్ గడ్డ..ప్రాణ స్నేహితులు గా ఉండేవి..
ఒకరోజు ఇవి నాలుగు కలసి,సముద్ర స్నానం చేసి,
దైవ దర్శనం చేసుకోవాలని అనుకుని,బయలుదేరి రోడ్డు 
పక్కగా నడుచుకుని వెళుతున్నాయి..
అలా వెళుతుండగా,ఒక ఆటో వచ్చి ఢీ కొనగా,టైర్ కింద పడి టమాట చనిపోయింది..😭 టమాట చనిపోయిందన్న బాధతో..ఉల్లిపాయ,పచ్చి మిరపకాయ,ఐస్ గడ్డ 
భోరు భోరున విలపించాయి😭😭. కొంత సేపటి తరువాత
తిరిగి బయలుదేరి రోడ్డు పక్కగా నడచి వెళుతున్నాయి..
రోడ్డు పక్కన బజ్జీలు వేసేవాడు చూసి,పచ్చి మిరపకాయ ను పట్టుకుని,శనగపిండి లో ముంచి,నూనె మూకిడిలో
వేసేసాడు... అంతటితో పచ్చి మిరపకాయ చనిపోయింది..😭
ఇక ఉల్లిపాయ,ఐస్ గడ్డ చాలా సేపు ఏడ్చి...😭తిరిగి బయలుదేరి,సముద్రం చేరుకుని,స్నానానికి దిగాయి..
కొద్దీ సేపటి తరువాత స్నానం పూర్తి చేసుకుని ఒడ్డుకు చేరుకుంది ఉల్లిపాయ..ఎంతసేపటికి ఐస్ గడ్డ తిరిగి రాకపోవడంతో,ఏడుస్తూ కూర్చుంది ఉల్లిపాయ..😭
ఐస్ గడ్డ సముద్రపు నీటిలో కరిగి చనిపోయిందని తెలుసుకుని,ఏడ్చుకుంటూనే వెళ్లి,గుడిలో దేవుని ముందు
సొమ్మసిల్లి పడిపోయింది.😭.కొన్నిరోజుల అలాగే ఉండిపోయింది..కొన్నిరోజుల తరువాత............
దేవుడు ప్రత్యక్షం అయ్యాడు..అమ్మా ఉల్లిపాయ ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు..? ఏమిటి నీ బాధ అని అడిగాడు.
అప్పుడు ఉల్లిపాయ.....😭స్వామీ....ముగ్గురు ప్రాణ స్నేహితులను కోల్పోయాను అయినా తట్టుకున్నాను..

టమాట చనిపోయినప్పుడు నేను,పచ్చిమిరపకాయ,ఐస్ గడ్డ..కలసి ఏడ్చాము.😭

*ప్రకృతి సత్యం*
⚜⚜⚜⚜⚜⚜⚜⚜

*ఎవరినీ మీ నోటితో కానీ మనస్సుతో కానీ నాశనం అవ్వమని, పాడవ్వమని కాని తిట్టకండి.*

*బుద్ది బాగుపడాలి బావుండాలి అని కోరుకోండి.*
*ఒకడు బాగుపడితే వాడి వలన పదిమందికి ఉపయోగం కలుగుతుంది.*

*అంతేకాకుండా ఒకరి మేలు కోరుకున్న మీకు మంచే జరుగుతుంది.*
*ఎందుకంటే*
*ఈ సృష్టిలో మనం మనస్ఫూర్తిగా ఏది తలిస్తే అది జరగడం ఈ సృష్టి రహస్యం.* 

*ఏది మనం ఇస్తామో దానికి పదింతలు లభిస్తుంది.*
*చెట్టుకి నీరు పోస్తేనే కదా వృక్షమై పువ్వులు ఫలాలు ఇస్తుంది.*

*సూర్యుడు నీరు స్వీకరించే కదా వర్షాలు ఇస్తున్నాడు అలాగే ఇది కూడా ..*

*కనుక ఈరోజు నుండి కయ్యానికి కాలు దువ్వకుండా బుద్ధిమారి మంచివారిగా మారాలని కోరుకోండి.*

*అందుకే కదా*
*భార్యని అపహరించిన రావణుడిని రాముడు క్షమిస్తాను అని చెప్పి దేవుడయ్యాడు. అది వినని రావణుడు మృతుడయ్యాడు.*

*యుధిష్ఠిరుడు కూడా మహామహా పాపాత్ములని క్షమించాడు. చివరికి దుర్యోధనుడిని కూడా క్షమిస్తాను అయిదు ఊళ్ళు ఇవ్వమంటే వినకుండా కాలుదువ్వాడు. చివరికి చచ్చాడు.*

*మేలు కోరుకోవడం మనవంతు. వినకపోతే ఆఫలితం అనుభవించడం వాళ్ళ వంతు. మంచి చెప్పి మహాత్ములు అవ్వండి.*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

--((***))--

*పదవి కోసం పెన్షన్లు, ఋణ మాఫీలూ, ఉచిత సర్వీసుల ఆఫర్ ద్వారా మన నాయకులు దేశాన్ని మరో వెనిజులా చేస్తున్నారా?*

*వెనుజులా చరిత్ర చదవండి. మారండి*


*చిన్న చిన్న సెలయేళ్ళు, నదులు, పచ్చటి ప్రకృతి, సముద్ర తీరాల్లో సమృద్ధి గా ఆయిల్... 1970 లో వెనిజులా ప్రపంచపు 20 ధనిక దేశాల్లో ఒకటి. ఓ నాయకుడు అధికారంలోకి రావటం కోసం ఎన్నికల సమయంలో... ఖాళీగా ఇంట్లో కూర్చున్నవారికీ, బీద కుటుంబాలకీ నెల నెలా ధన సహాయం అని ప్రకటించాడు. గొప్పగా గెలిచాడు. దేశ ఐశ్వర్యం అందరికీ పంచాడు. తరువాతి ఎన్నికల్లో కార్మికుల, ఉద్యోగస్తుల జీతాలు 5 రెట్లు పెంచాడు. సింగిల్ పేరెంట్స్ ఆడవారికి అనూహ్యంగా కానుకలిచ్చాడు. 2008లో మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ‘ధర పెరగని రొట్టె ముక్క’ అని ప్రకటించి తిరిగి అధికారం సంపాదించుకున్నాడు. ప్రభుత్వం ప్రకటించిన ధరలకి రొట్టెలు, బ్రెడ్, మిగతా నిత్యావసర పదార్ధాలు ఇవ్వలేక చాలా కంపెనీలు మూత పడి పోయాయి. More than three million rich industrialists, skilled workers and intelligent students have left the country. ప్రెసిడెంట్ వెనక్కి తగ్గలేదు. దేశంలో ఆయిల్ ద్వారా వస్తూన్న డబ్బు బోలెడు ఉంది. టాయిలెట్ పేపర్ కూడా విదేశాలనుంచి దిగుమతి చేసుకున్నాడు. దేశంలో పని లేదు.*

 *హ్యాపిగా తినటం, ప్రభుత్వo ఇచ్చే భ్రుతి తో ఆనందించటం..! ఉచితంగా వచ్చే డబ్బు, సబ్సిడీలకోసం ఎగబడిన జనం రాబోయే సునామీని ఊహించ లేదు. 2005 లో ఆయిల్ ధర పడిపోయింది. దాంతో కరెన్సీ ముద్రణ పెంచాడు. ఎక్కడ చూసినా డబ్బే. పైసా విలువ లేని డబ్బు..! 2018 వచ్చేసరికి ఇన్-ఫ్లేషన్ 13,00,000% అయింది. ఉచిత సబ్సిడీలు ఆగిపోవటంతో దానికి అలవాటు పడ్డ యువకులు కత్తులు, పిస్టళ్లు పట్టుకుని లూటీ చేస్తున్నారు. తిండి లేక జూ లో జంతువులన్నీ చచ్చి పోయాయి. వెనిజుల ముఖ్యపట్టణం పేరు కారకాస్. Carcass అంటే జంతువు కళేబరం. (The dead body of an animal). ప్రతి ఏటా, ఆ నగరంలో ప్రతి లక్షమంది జనాభాలో లో 20 వేలమంది మర్డర్లకి గురి అవుతున్నారు. ప్రపంచంలో పదవ పెద్ద లంచగొండి దేశంగా మారిన వెనిజులా, ప్రస్తుతం ప్రపంచపు అత్యంత ప్రమాదకరమైన రక్తపాత దేశాల లిస్టులో నెంబర్ 1 స్థానంలో ఉంది. టూరిస్టులని ఆదేశానికి వెళ్ళవద్దని మిగతా దేశాలు హెచ్చరిస్తున్నాయి. దిగుమతులకి డబ్బు లేదు. కరెంటు లేదు. నాలుగు రోజులకొక కేవలం గంట నీళ్ళు. షాపుల్లో చివరికి టూత్-పేస్ట్ లేదు. ఉన్నా కొనటానికి డబ్బు లేదు. తినటానికి తిండి లేని వారి సంఖ్య అయిదేళ్ళలో 30 నుంచి 66% కి పెరిగింది. చిన్న రొట్టేముక్క కోసం శరీరo అమ్ముకోవటానికి రాత్రంతా రోడ్ల మీద నిలుచున్న బాలికలు, కాస్త తిండి కోసం తెల్లవారు నుంచి అర్థరాత్రి వరకూ క్యూలో నిలబడే పిల్లలూ, కాలుస్తున్న సగం సిగరెట్ ఇమ్మని రోడ్ల మీద అడుక్కునే పెద్దలు... ఇదీ ప్రస్తుతం ఆ దేశ పరిస్థితి.*

*సమ సమాజం కావాల్సిందే.*

*కానీ ఉచితం గా ఇవ్వటం ద్వారా కాదు. ఇది నాయకులు తెలుసుకోవాలి. దానికన్నా ముందు ప్రజలు ఆ నాయకులని రిజెక్ట్ చెయ్యాలి.*

*ఈ దేశ ఉదాహరణ గురించి అందరికీ చెప్పండి....మనదేశ ఎన్నికల విధానంలోనే పెద్ద లోపం ఉంది..*
*కేవలం  ఓటు హక్కును వినియోగించు కోవడం ద్వారా దేశ భవిష్యత్తుని మార్చలేము.*

*మార్పు నాయకులలోనో, పార్టీలలోనో కాదు..*

*రావాల్సింది....ప్రజల్లో*
🙏🙏🙏

గురు
 పౌర్ణమి సందర్భంగా (9)

ప్రాంజలి ప్రభ - ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - ఆచార్యదేవోభవ 
 రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
   
 గురుర్బ్రహ్మా  గురుర్విష్ణు: గురుద్దేవో మహేశ్వర: 
గురుస్వాక్షాత్ పరం బ్రహ్మ తస్మెశ్రీ  గురవే నమ:

అజ్ఞాన తిమిరామ్ధస్య జ్ఞానాన్జన సలాకయా
చక్షురున్మీలి తం యేన తస్మై  శ్రీ గురవే నమన:  

అజ్ఞానమనే చీకటి  ఆవరించిన కారణంగా అంధునిగా మారిన శిష్యునకు జ్ఞానమనే వెలుగును కల్పించేది గురువు.  ఆ గురువే జ్ఞాణమనే కాటుకతో దృష్టిని ప్రసదించుతాడు దీనివలన గురుశిష్యుల  భంధం ఏర్పడుతుంది.  అంతటి మహాత్యంగల గురువునకు శిష్యునిగా  నమస్కారములు సమర్పిస్తున్నాను 

నిజమైన గురువు అంటే ఎవరో వారిని గురించి ఓ చిన్న కధ చెప్పుతారా అని ఒక శిష్యుడు గురువుగారిని అడిగారు

ఆ నలుగురు అనే కధ ను మీకు తెలియపరుస్తాను వినండి అన్నాడు గురువు 

 నలుగురు విద్యార్దులు వేగముగా కొండప్రాంతమునకు పరిగెడుతున్నారు  ఆ కొండ ప్రక్కన లోయ ఉంది,  ఆలోయలో అనేక మంది పడి  చిని పోతునట్లు ఆ ఊరిలొ పుకారు ఉన్నది.  ఆలోయ ప్రక్కనే ఒక వృద్ధుడు ఎప్పుడు పకృతి అందాలని చూచుటకు ఓపికతొ అక్కడకు చేరి కాస్త విశ్రాంతి తీసుకొని తిరిగి వెల్లే  అలవాటు ఉన్నది. 

చనిపోవటానికి వచ్చిన ఆ ఆనలుగురు ఆ వృద్దున్ని చూసి మీకు ఎందుకు కష్ట మొచ్చింది ఈ లోయకొచ్చారు అని అడిగారు వచ్చినవారు. నా సంగతి అలా ఉంచండి, ఇంతకూ  మీరెందుకు వచ్చారో చెప్పలేదే అని అడిగాడు. ఎందుకోస్తాం మరణించ టానికి అని ముక్త కంఠం గా చెప్పారు వారు. 

మంచిది ఒక్కసారి మీ చిరునామాలు, మీ ఫోన్ నెంబర్లు  అన్నీ  నాకు ఇవ్వండి, మీ తల్లి తండ్రులు బాధ పడకుండా మీ వివరాలు వారికి చెప్పగలను ఎందుకంటే మిమ్మల్ని వారు కళ్ళలలో వత్తులు పెట్టుకొని పెంచుతారు,  జీవితాంతము  మీసేవ కొరకే  వేచి ఉంటారు వయసులో ఉన్నప్పుడు వారి సుఖాలు కుడా మీకు త్యాగం చేస్తారు, వయసుడికిన తర్వాతా  సుఖపడదా మంటే వయసు సహకరించక,  పిల్లలు చూడక భాదపడుట తప్ప ఏమిచేయగలరు. 

ఇంతకూ  మీరు ఇంట్లో చెప్పివచ్చార, చెప్పకుండా వచ్చారా అది చేప్పండి ముందు అన్నాడు వృద్ధుడు   . 

వృద్ధుని మాటలకు వచ్చినవారు వారిలో ఉన్న బాధను మరచి "చనిపోవాటానికి చెప్పి వచ్చిన చెప్పక వచ్చిన చివరికి భాధపడుతారు మమ్ము కన్నవారు, మేము కాదు కదా " అని మూర్ఖం గా వాదించారు వారు. 

ఆమాత్రం జ్ఞానం  ఉన్నవారు మీరు ఇక చావలేరు, నాతో రండి మీ భాదలు తొలగించే మార్గం చూపగలను అని వెంట తీసుకొని వెళ్లి, అక్కడ దగ్గర ఉన్న ఒక ఇంటి నుండి కొంత పైకము  తీసుకొని వచ్చి వారికిచ్చి చనిపోయే వారు ఎవరైనాసరే  చనిపోయే ముందు  ఆత్మ ఘోషించ కూడదు సుబ్రముగా మీకు ఇష్టమైన  తిండి తిని రేపు ఇక్కడకు రండి వచ్చేటప్పుడు   మీకు ఇష్టము కానిది పనికి రానిది ఏదైనా ఉంటె ఒకటి తీసుకొని రండి మరచి పోకండి రేపు మీ బాధలు తొలిగే మార్గం చూపు తానూ అన్నాడు ఆ వృద్ధుడు. 

వెంటనే ఆ నలుగురు యే పుట్టలో యేపామున్నదో ఎవరి తెలుసు "ఈ వృద్ధుడు యేమి చేపుతాడో చూద్దాం" అంతగా నచ్చకపోతే అప్పుడే చనిపోదాం అని వేనుతిరిగారు ఆ నలుగురు.

ఆ నలుగురికి ఇంటికి వెళ్ళటం జరిగింది కాని నిద్ర పట్టలేదు కారణం వారికి ఉపయోగము లేని వస్తువేదో తెలుసుకొని  వెళ్ళాలని తెల్ల వార్లు ఆలోచించారు.   అందరు కలసుకొని వృద్ధుని ఇంటివద్దకు పోదామని బయలు దేరారు. అందరు ఇంటివద్దకు చేరారు. కాని అక్కడ కోలాహలం గా ఉన్నది చాలామంది విద్యార్ధులున్నారు ఎందుకు వచ్చారని అడిగి లోపలకు వెళ్దామని అనుకున్నరు. లోపలకు వెళ్ళలేక అక్కడే నిల బడినారు చేసేది లేక. 

అక్కడ తెలుసుకున్నారు గురుపౌర్ణమి అని విద్యార్ధులు వచ్చి గురువు సన్మానము చేస్తున్నారని తెలుసుకున్నారు.  

అక్కడే మైకులో  విన బడుతున్నాయి " శుక్రాచార్యులు తానూ మరణిస్తానని తెలిసి శిష్యుడైన కచునికి మృత సంజీవనిని ప్రసాదించడం ద్వారా శిష్యునిపై గల వాత్సల్యం వ్యక్తమవుతుంది. అదేవిధముగా  అంగుష్టాన్ని ఇస్తే ఆయుధ దారణ చేయలేనని తెలిసిన గురుదక్షిణగా ద్రోణుడికి ఇస్తాడు.  ఇప్పుడు గురువు శిష్యుల సంభందము లేకుండా విద్యార్ధులు  పెరుగు తున్నారు, గురుశిష్యులు హృదయతాపాన్ని దూరం  చేయగల వారే నిజమైన గురువులు మన సంస్క్రుతిలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్నారు. జననం ఇచ్చినవారు తల్లితండ్రులైనప్పటికి  జీవిత పధాన్ని తీర్చి దిద్దేది గురువులు మాత్రమే నాని తెలుసుకోలేక  పోతున్నారు . 

ప్రియమైన విద్యార్దులారా ముందు వరుస కూర్చున్న నలుగురు విద్యార్ధు లేచి చివర నుంచొని ఉన్న వారిని సాదరముగ ఆహ్ఫానించి మీ స్థలముల లో కూర్చొ పెట్టగలరు అన్న మాటలు విన్నారు ఆ నలుగురు.

అనలుగురు కూర్చొనగా అప్పుడే వృద్ధుడు ఈవిధముగా చెపుతున్నాడు. 

ప్రేరకస్పూచకశ్చెవ వాచ్కో ధర్మకస్తథా 

శిక్షకో బొధకశ్చెతి షడేతే గురవ:స్త్రుతా:

1ధార్మిక విషయాలపట్ల ప్రేరణ ఇచ్చేవాడు.

2. పండంటి జీవితానికి చక్కని సలహాలుచ్చేవాడు

3. చదివిన్చేవాడు 

4. బ్రహ్మసాక్షాత్కారం కలుగజేసెవాడు.

5. విద్యనూ భోదిన్చేవాడు

6. అమూల్యమైనహితవచనాలు పలికే వాడు అని అరువిదాలుగా ఉంటారు. ఆ అరు లక్షణాలు ఒకే వ్యక్తి (ఆచార్యుడు ) వద్ద ఉండేవి , ఈనాడు అటువంటి గురు విద్య కన బడుటలేదు. సరిఅయిన విద్యనభ్యసించక దేశంలో బ్రతకలేక కొందరు ఆత్మ హత్యలకు చేసుకుంటున్నారు, కొందరు ప్రభుత్వ సహాయములు అందక కుటుంబ పరిస్థితులు బాగుండక మరణిస్తున్నారు. మనుష్య్లులు   ఓర్పు వహిస్తే సాధించలేనిది లేదు అని నేనుగట్టిగా చెప్పగలను. మీ సన్మానానికి నేను సంతోషించు తూ ఈ ఉపన్యాసమును   ఆపుతున్నాను. అందరు విందారగించి ఎవరిదారి వారు వెళ్లి పోయారు. కాని ఆ నలుగురు కూర్చున్న చోటే ఉన్నారు విందుకు కూడా పోలేదు

వారివద్దకు ఆ వృద్ధుడు వచ్చి మీమనస్సు నొప్పించినందుకు నన్ను క్షమించండి ముందు విందు తీసుకుందాం తర్వాత మాట్లాడుకుందాం పదండి అన్నాడు వృద్ధుడు.అందరు కలసి విందుకు బయలు దేరారు. 

విందైన తర్వత వచ్చిన విద్యార్ధు లందరూ వెళ్ళిపోయారు ఆనలుగురు వృద్ధుడు మాత్రం అక్కడ ఉన్నారు.  

సరే మీరు స్థిమితంగా కూర్చోండి, నేను ఇక్కడ కూర్చుంటాను. ఇంతకీ  నేను పనికిరాని వస్తువు  తెమ్మని  చెప్పాను కదా తెస్తే నాకు  చూపించండి,  అందరు ఒకరి మోఖం ఒకరు చూసు కున్నారు గాని ఎవ్వరు మాట్లాడలేదు, ఇంతకీ మీరు తెచ్చార లేదా అని అడిగాడు వృద్ధుడు. తెచ్చాం మీకు ఎట్లా చూపలొ మాకు అర్ధం కావటం లేదు అన్నారు అందరు. చూపించండి నేను ఏమి అనుకోను అని అడగగానే అందరు కలసి "మేమే పనికిరాని వస్తువులము " అన్ని మాకు పనికొచ్చే వస్తువులగా కనిపించాయి మేము తేలేక పోయాము అన్నారు. 

మంచిది మీ నిజాయితీకి నేను మెచ్చుకున్నాను నేను మీకు సహాయము చేద్దామను కున్నాను మీ నలుగురికి నాలుగు కాగితాలు ఇస్తున్నాను ప్రతి కాగితములో 4 రకాల ఉద్యోగాలు ఉన్నాయి వాటి జీతల వివరాలు ఉన్నాయి.  వాటిలో మీరు చదివిన చదువుకు పనికొచ్చె ఉద్యోగము అనుకుంటే రేపు మరల ఇక్కడకు రండి, వీటిని మీకు సంభందిన్చినవారికి చూప్పించు కోండి, ఆఉద్యోగాలు మీకు నచ్చకపోతే మరలా 4 ఉద్యోగాలు మీకు చెప్పగలను, మీకు ఇవ్వగలను ఒక గురువుగా మీకు చెపుతున్నాను. ఇక వెళ్ళిరండి రేపురండి దయచేసి ఇంటికి వెళ్ళాక కాగితాలలో జాబు చూసుకొని అందరిని సంప్రదించి మీకు ఇష్టమైన కాకా పోయినా రండి. 

ఆ నలుగురు మారు మాట్లాడకుండా వెనక్కు వెళ్లారు. 

అప్పుడే అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఆ కాగితములో ఏమి వ్రాసారో చెపుతారా   ఎందుకు చెప్పను చెపుతా వారురేపు ఇక్కడకు వస్తే అంతా  వారే చెపుతారు

రెండు రోజులు తర్వాత ఆ నలుగురు తో పాటు మరికొందరు వచ్చారు మా కుటుంబాలను బతికించినవారు మీరు,  మీరే మాకు నిజమైన గురువు అని చెప్పారు

మాకు ముందుగా ఇచ్చి పైకముతో మీకు పండ్లు తీసుకొచ్చాము మమ్మల్ని అసీర్వదించండి అన్నారు వారు. ఆవేశంతో చేసే నిర్ణయాలు అనర్ధాలు కలుగుతాయి, ఆలోచనతో చేసే నిర్ణయాలు సఫలమోతాయి

ఇంతకీ వారి ఉద్యోగాలు ఎలావచ్చాయో మాకు ఇంతవరకు 
తెలియుటలేదు అన్నారు శిష్యులు మనోధైర్యానికి మార్గాలు వెతకండి బతికి బాతికించే ఉద్యోగమూ ఇస్తారు ఈ చిరునామాను సంప్రదించండి అని వ్రాసాను, వారి ప్రయత్నాలు నేనే గమనించి వారికి ఉద్యోగాలు వచ్చేటట్లు ఏర్పాటు చేసాను అంతే ...... 
--((***))--

గురు పౌర్ణమి సందర్భంగా (8) 
ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయండి "ప్లాస్టిక్ వాడమని"

 ఒక పక్షి, ‌ ఒక ఆవు మరి యెన్నో  చావులను అంత దగ్గరగా చూశాక అయిన మార్పు వస్తుంది అని ఆశా.

 మన నిత్యజీవితంలో ఎన్నో ప్లాస్టిక్ వస్తువుల్ని వాడుతుంటాం. మటన్ కి, చికెన్ కి, పాల ప్యాకెట్ కి, పెరుగు పాకెట్ కి ఇలా ప్రతి చిన్న వాటికి కూడా షాప్ నుండి ఇంటికి తేవడానికి, స్టయిల్ గా ఉండడానికి,  ఎన్నో ప్లాస్టిక్ కవర్లు వాడుతుంటాం, తేగానే వాటిని తీసి పారేస్తుంటాం. అలాంటి కవర్స్ నీ మన చుట్టు పక్కల ఉన్న పశువులు తినడం కూడా చూస్తుంటాం. 

మనవంతు ప్రయత్నం గా ప్లాస్టిక్ వస్తువుల్ని వాడడం తగ్గిద్దం. వారానికి 5,6 కవర్స్ నీ వాడడం తగ్గించిన నెలకు 20-25. అలా సంవత్సరానికి 200 నుండి 300 వరకు తగ్గించిన వాళ్ళం అవుతాం.
ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు, కొన్ని ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాం. ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తే అదో పెద్ద యజ్ఞమే అవుతుంది. బట్టతో చేసిన సంచిలనే వాడదాం ప్లాస్టిక్ నీ తగ్గిద్దాం. అత్యవసరం అయితే తప్ప ప్లాస్టిక్ వస్తువుల్ని వాడొద్దు. మీరు ప్రతి చిన్న వస్తువులకు కూడా అనవసరంగా  ప్లాస్టిక్ కవర్స్ నీ వాడేటప్పుడు ఒకసారి ఈ వీడియో నీ గుర్తుకు తెచ్చుకోండి... తర్వాత ఆటోమేటిక్ గా మీరే ప్లాస్టిక్ వస్తువుల్ని వాడడం తగ్గిస్తారు. అందరూ వీలైనంత మట్టుకు ప్లాస్టిక్ కవర్స్ నీ, ప్లాస్టిక్ వస్తువుల్ని వాడడం తగ్గిస్తారు అని ఆశిస్తూ... 

మూగజీవులను రక్షించండి, ప్లాస్టిక్ వాడుట మానండి

ప్రాంజలి ప్రభ
సర్వేజనా సుఖినోభవంతు. శ్రీ రాం శ్రీ మాత్రే నమ: - గురుదేవోభవ 
ప్రాంజలి ప్రభ -(6 )
సర్వేజనా సుఖినోభవంతు 
వ్యాస పూర్ణిమ - గురు పూర్ణిమ

గురువుగారు మనం రైల్లో వెళుతున్నాం గదండి, ఈ పట్టాలు ఎందు కలవ వండి, ఈ చెట్లును చూస్తూ ఉంటె వేలిపోతున్నట్లుకనబడు తున్నాయి, అసలు గురువు ఎవరండి వివరంగా మాకు చెపుతార. మనం దిగే ఊరు వచ్చే దాకా కాస్త కాలక్షేపం. 

పరోపకార భావన, జపపూజాదులు  ఆచరణ, సర్ధక మైన పలుకు, శాంతా స్వభావం, వేద వేదాంగాలు క్షుణ్ణంగా తెలిసియున్డటం, యొగశాస్త్ర  సిద్దాన్తాలను సులువుగా భోదించడం, దేవతలా మనస్సులను సంతోష పెట్టడం, మొదలైన సుగుణాలతో పరిపూర్ణుడైన వాడే గురువు

పదిమందికి చెప్పదలచిన నీతినిమున్దుగా తానాచారించి ఇతరులకు చెప్పేవాడే గురువు.

ఇతరులకు ఏమిచేసే నీమనస్సుకు బాధ కలుగుతుందో, అది నీవు ఇతరులకు చేయకుండా ఉండటమే ఉత్తమెత్తమ ధర్మం 

శిశ్యులు ఇచ్చే సంపదను ఆశించక వారికాద్యాత్మిక విషయాలను సులువుగా తెలియపరచి బ్రహ్మసాయుజ్యానికి తోడ్పడేవాడే ఉత్తమ గురువు

 సాక్షాత్ గురువు:  విశ్వేశ్వరుడు 

గురువు నివసించే ప్రదేశం :కశీక్షెత్రమ్ 

గురుపాదోదకం : గంగానది

గురుమంత్రమే : తారక మంత్రం 

మనోధైర్యాన్ని , మనస్సును నిలకడగా ఉంచేవాడు : శివస్వరూపుడు  హనుమంతుడు

 గురు మంత్రం : ఓం శ్రీ రాం

గురువు 

పసిడి మనసులపై ప్రేమను ఉంచి 
భావిపౌరులుగా తీర్చి దిద్దే అక్షర శిల్పి 
యువతను సక్రమ మార్గములో నడిపిస్తూ 
విశ్వవిజ్ఞానవన్తులుగా మార్చే నిత్య విద్యార్ధి 

విద్యార్ధులను నిరంతరం కృషీ వరులుగా మార్చే 
నవసమాజ నిర్మాణానికి సహకరించే శ్రమజీవి
ప్రతి ఒక్కరిలో ఉన్న అజ్నానామ్ధకారాన్ని మార్చి 
నిత్య  జ్ఞాన జ్యోతులుగా మార్చే  తేజస్వి 

విద్యార్ధుల ఆలోచనలునలను గ్రహించి 
స్వయం కృషీవరులుగా మార్చే కృషీవలుడు
ఆటుపోటులకు తట్టుకొనే పడవ తెరచాపగా
ప్రతివిద్యార్ధిని ధర్మపరుడుగామార్చే నావికుడు 

యువతకు నూతన ఉత్తేజం కల్పించి 
భావితరాల భాద్యులుగా మార్చే బాటసారి 
భయాన్ని పారద్రోలి ధైర్యాన్ని కల్పించే 
విజయాన్ని సహకారరం అందించే సారధి 

మమతకు మార్గదర్శిగా 
మనోధైర్యానికి మార్గంగా    
ప్రేమామృత మూర్తిగా 
ప్రతిఒక్కరికి శక్తినిచ్చె విధాత

ప్రెమ మూర్తులగా,విద్యా వేక్తలుగా 
ఆరోగ్య వంతులుగా, ఆదర్శ వంతులుగా 
పారిశ్రామిక శక్తిగా, అనుభవాలను చెప్పే తాతగా
ఒకరేమిటి సమస్త ప్రాణులను విశ్వ విజ్ఞాన నిదిగా మార్చేదిగురువు

వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే!
నమో వై బ్రహ్మనిధయే వాశిశ్టాయ నమోనమ: !!

అని వ్యాసునికి విష్ణువుకు  అభేదం చెప్ప బడింది, వేదవ్యాసుడు అనంతంగా ఉన్న వేదాలని విభజించి  పైలునకు ఋక్సంహితను, వైసంపాయనునకు యజుస్సంహితను, జైమినికి సామసంహితను, సుమంతునకు అధర్వణ సంహితను భోధించి వానిని లోకములో  వ్యాపించు నట్లుగా విష్ణు, మత్య , భాగవత,  వాయు,  పురాణాలలో పేర్కోనటం జరిగింది. వ్యాసుడు వేదాలని విభాజిచటమే కాకుండా అశ్టా దశ పురాణాల్నిరచించాడు, బ్రహ్మసూత్రాల్ని వివరించాడు, భారత భాగవతాల్ని రచించాడు. మనజాతికి జ్ఞాన భాండా గారాన్ని అందించిన వేదవ్యాస మహర్షికి ముందుగా నమస్సుమాంజలిని అర్పిందాం. దీనినె వ్యాసపూర్ణిమని- గురుపూర్ణిమని పిలిస్తారు.  
--((***))--
     

 గురుపౌర్ణమి సంధర్భముగా (5)

శ్రీ భగవానువాచ  :-
శ్లో॥ అభయం సత్త్వ సంశుద్ధిః
         జ్ఞాన యోగ వ్యవస్థితిః   ।
         దానం దమశ్చ యజ్ఞశ్చ
          స్వాధ్యాయస్త ప ఆర్జవం ॥       (1)
తా ॥ భగవానుడంటున్నాడు. అభయం, అంతఃకరణ శుద్ధి, జ్ఞాన యోగంలో నిలవటం, దానం, ఇంద్రియనిగ్రహం, యజ్ఞం, స్వాధ్యాయం, తపస్సు, నిజాయితీ - (దైవీ సంపద)
వ్యాఖ్య :- ఈ శ్లోకంలో మొత్తం 9 లక్షణాలను దైవీ సంపదగా చెప్పారు.
(1) అభయం :- అభయం అంటే భయం లేకుండుట. Be fearless - నిర్భయంగా ఉండు - అనేది స్వామి వివేకానంద నిరంతరం చేసే ఉపదేశం. ఆయనలా బోధించటమే కాదు. అలా జీవించాడు కూడా.
         వీరుడు ఒక్కసారే చస్తాడు. భీరుడు పదేపదే చస్తుంటాడు. క్షణ క్షణమూ చస్తూ బ్రతుకుతుంటాడు. అందుకే మహాభారతంలో -
శ్లో॥ శోకస్థాన సహస్రాణి భయస్థాన శతానిచ । 
దివసే దివసే మూఢః మా వింశతి న పండితం - అన్నారు.
- మూర్ఖుడికి రోజుకు వందల భయాలు, వేలకొద్దీ దుఃఖాలు. శోకాలు భయాలు అతణ్ణి వెతుక్కుంటూ వస్తాయి. వాటితో వాడి జీవితమంతా మునగానాం తేలానాం. పండితుడి జోలికి అవి రావు.
ఈ ప్రపంచంతోను; ఇక్కడి వస్తువులు, ధన సంపదలు, భోగాలు మొదలైన వాటన్నిటితోను అతుక్కుపోయి, అవి లేకపొతే జీవించలేననుకొనే వారే మూఢులు. వారికి పిల్లిని చూచినా భయమే. బల్లిని చూచినా భయమే. శకునాలు చూచుకొని భయపడుతుంటారు. ఇలా భయపడేవారు మూరెడు ముందుకు బారెడు వెనక్కు అన్నట్లుంటారు.
భయంలేని చోటు స్వర్గం. భయముండే చోటు నరకం. వైకుంఠంలో గరుత్మంతుడు, ఆదిశేషువు కలిసే ఉంటారు. వారిద్దరూ బద్ధ శత్రువులు. అలాగే కైలాసంలో నంది, సింహం కలిసే ఉంటాయి. అవీ శత్రువులే అయినా ఆ చోటు భయానికి దూరం.
స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాలలో తిరిగేటప్పుడు ఆయన వేషాన్ని చూచి చాలా మంది వెటకారం చేసేవారు. ఒకనాడు ఒక నవనాగరిక స్త్రీ ఆయనను "ఏ దేశమండీ మీది?" అని ఎగతాళిగా  అడిగిందట. "గుడ్డలకు కాకుండా గుణాలకు విలువ ఇచ్చే దేశం మాది" అని మూతిమీద కొట్టినట్టు సమాధానం చెప్పాడట. ఆమె తెల్ల మొఖం వేసింది.
ఒకసారి ఆయన ట్రైన్ లో మొదటి తరగతిలో ప్రయాణం చేస్తున్నాడు. కాళ్ళకు తొడుక్కున్న బూట్లు ప్రక్కన విడిచి పడుకున్నాడు వివేకానందుడు.  ఒక తెల్లదొర ఆ కంపార్ట్ మెంట్ లోనే ప్రయాణం చేస్తున్నాడు. అతడు ఈ స్వామిని చూచి "ఈ బిచ్చగాడికి బూటు కావాల్సి వచ్చిందా?" అనే తృణీకార భావంతో ఆ బూటును  కిటికీ గుండా బయట పారవేసి పడుకున్నాడు. స్వామి లేచి చూచాడు. విషయాన్ని గ్రహించాడు. వెంటనే చుట్టూ చూచాడు. దొరగారి కోటు అక్కడ కొండీకి వ్రేలాడుతూ కనిపించింది. వెంటనే దాన్ని కిటికీ గుండా బయటకు విసిరేసి కూర్చున్నాడు. దొరగారు  లేచి చూచారు. కోటు కనిపించ లేదు. 'నా కోటు ఏది?' అని కోపంగా స్వామిని అడిగాడు. "నా బూటును వెదకటానికి పోయింది" అని తాపీగా చెప్పాడు స్వామి. తెల్లదొర ముఖం కందగడ్డ అయ్యింది.
ఒకసారి స్వామి తెల్లదొరలుండే  పెట్టెలో ప్రయాణిస్తున్నాడు. "ఈ బికారి సాధువులకు ఇంగ్లీషు ఏం తెలుస్తుందిలే" అని వాళ్ళు ఇంగ్లీషులో స్వామిని గురించి హేళనగా మాట్లాడుతున్నారు. ఒక స్టేషనులో బండి ఆగింది. స్టేషను మాస్టరును పిలిచి స్వామి "కొద్దిగా మంచి నీళ్ళు తెప్పించండి" అని ఇంగ్లీషులో అడిగాడు. ఓహో! ఈయనకు ఇంగ్లీషు కూడా తెలుసు అనుకొని ఇంత వరకు హేళనగా మాట్లాడిన వాళ్ళు బిక్కచచ్చి, తేలు కుట్టిన దొంగల్లాగా అయిపోయి, "స్వామీ! ఇంతవరకు మేము లోక విషయం మాట్లాడుకున్నాం, తమరి మాట కాదు. తమరేమీ అనుకోకండి" అన్నారట. దానికి స్వామి, "అబ్బే! మూర్ఖులను చూడటం నాకు ఇదే మొదటిసారి కాదు అన్నాడు. అంతే. వాళ్ళు అవాక్కయ్యారు.
'నిస్పృహస్య తృణం జగత్' ఆశలేని వాడికి ఈ ప్రపంచం గడ్డిపోచ. జ్ఞాని ఈ ప్రపంచంలో దేనికి భయపడతాడు? సర్వమూ భగవంతుడే అని నమ్మిన భక్తుడికి భయమేమిటి? శిక్షించేవాడికి రెండు చేతులైతే రక్షించేవాడికి వెయ్యి చేతులు. భక్తుడు భయపడడు. భయపెట్టడు.
భయపడేది పశు లక్షణం. భయపెట్టేది మృగ లక్షణం. పూర్ణ భక్తుడు పశువూ కాదు. మృగమూ కాదు. ఆనంద స్వరూప ఆత్మయే.
మృత్యువుకు అందరూ భయపడతారు. ఒకసారి కలరా వచ్చి అందరు చనిపోతున్నారు. దానితో అందరూ కలరా దేవతను పూజిస్తున్నారు. "అమ్మా! ఏమిటి ఈ ప్రళయం? ఇంతమందిని పొట్టన పెట్టుకుంటావా?" అని దీనంగా వేడుకుంటున్నారు. ఆ కలరా దేవత ప్రత్యక్షమై వారితో ఇలా అన్నదట. "అయ్యా! నేను చంపింది 10 మందినే. మిగతా 90 మందీ భయంతో చనిపోయారు. ఆ భారమూ నా నెత్తినే వేస్తారా?" అని. కలరా దేవతకన్నా ఈ భయం దేవత చాలా చెడ్డది. కనుకనే దైవీ సంపదలో  అభయానికి అగ్రతాంబూలం ఇచ్చారు. కనుక ముందుగా భయం నుండి విముక్తి సంపాదించాలి.

సేకరణ మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

--((***))--


గురుపౌర్ణమి
 సంధర్భముగా (3)


🌸 *ఉత్తమ కథ :-* 🌸

🌱ఒక్క క్షణం విలువ  🌱
ఒక ఊర్లో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన పండితుడు ఒకాయన ఉండేవాడు.
చాలా చక్కని వాక్పటిమ గలవాడు.
ఆయన ఆలయం ఆవరణలో కూర్చొని ప్రవచనం చెబుతూ వుంటే
వేలమంది జనం అలా కదలకుండా బొమ్మల్లా వింటూ ఉండిపోయేవాళ్ళు.
ఆయన ప్రఖ్యాతి చుట్టుపక్కల చాలా గ్రామాల్లో వ్యాపించింది.

 🌱ఒకసారి ఆయన ప్రవచనం నిమిత్తం పొరుగూరు వెళ్ళవలసి వచ్చింది.
ఆ ఊరు వెళ్ళే  బస్సు ఎక్కి  టికెట్ తీసుకున్నాడు.
అయితే పొరపాటున బస్సు కండక్టర్ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు.
పండితుడు అది గమనించి తిరిగి ఇవ్వాలని యోచించాడు.
కానీ బస్సునిండా జనం కిక్కిరిసి ఉండటంతో,
దిగేటప్పుడు ఇద్దాంలే అనుకుని కూర్చున్నాడు.

🌱 కొద్ది సేపు తరువాత అతని మనసులొ ఆలోచనలు మారాయి.

🌱'ఆ కండక్టరు కూడా ఎంతమంది దగ్గర చిల్లర కొట్టేయడం లేదు.

🌱 ఈ బస్సు కూడా ఒక సంస్థదే కదా! 🌱 ఎంత మంది తినటంలేదు?
🌱 నా పది రూపాయలకే నష్టపోతుందా ఏమిటి?

🌱 ఈ పది రూపాయలు ఏదైనా దైవ కార్యనికి ఉపయోగిస్తా......'
అని అనుకుని మౌనంగా కూర్చున్నాడు.

🌱 అంతలో వూరు వచ్చింది.... బస్సు ఆగింది.కానీ ఆయన దిగేటప్పుడు బస్సు కండక్టర్ దగ్గరికి రాగానేతన ప్రమేయం ఏమాత్రం లేకుండా  అసంకల్పితంగా కండక్టరుకు ఇవ్వవలిసిన పది రూపాయలు ఇచ్చి "మీరు నాకు టికెట్ ఇచ్చేటప్పుడు ఇవి ఎక్కువగా ఇచ్చారు" అన్నాడు.

🌱 దానికి ఆ కండక్టర్ "అయ్యా! నేను  మీ ప్రవచనాలు ఎంతో శ్రద్ధగా వింటాను. మీరు చెప్పడంతోటే సరిపెట్టుకుంటారా లేక పాటిస్తారా అని చిన్న పరీక్ష చేశాను" అని అన్నాడు.

🌱 పండితుడు చల్లటి చిరు చెమటలతో బస్సు దిగి 'పది రూపాయల కోసం తుచ్ఛమైన ఆశతోనా విలువలకే తిలోదకాలు ఇవ్వబోయాను... నా అదృష్టం బాగుంది.
నా మనస్సాక్షి  సరైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకొని నా విలువలను కాపాడింది' అనుకున్నాడు.

 🌱 *జీవిత కాలం పాటు సంపాదించుకున్న మంచితనం కూడా
సర్వనాశనం కావడానికి క్షణం చాలు....

🌱 ఒకానొక సందర్భం లో మీ శత్రువులు కూడా మీమీద ప్రయోగం చేస్తారు... మీ మంచితనాన్ని నాశనం చేయడానికి.... మీకు సంబంధం లేకుండానే మీ గురించి ప్రచారం చేస్తుంటారు... ఆ ప్రచారం అవునా కదా అని తెలుసుకోకుండా వాళ్ళు  కళ్ళు ఉండి కూడా  గుడ్డిగా నమ్ముతారు... అది వాళ్ళ కర్మ...

☘ కానీ మీరు మాత్రం జాగ్రత్త... గడియారం లో సెకండ్ ముళ్ళు ఎలా తిరుగుతుందో అలానే మీ జీవితాన్ని ప్రతి సెకండ్ ని గమనిస్తూ ముందుకు సాగండి....

 ☘ మంచితనానికి ఎపుడు చావు లేదు.... ☘

 మీరు బ్రతికి ఉన్నంత కాలము మంచి పేరుతో జీవించాలి... మరణించాకా కూడా ఆ మంచి పేరు నిలచిపోవాలి... 

--((***))--

గురు  పౌర్ణమి సందర్భంగా ప్రాంజలి ప్రభ
సేకరణ మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

*మహాభారతంలోని రెండు ప్రధాన పాత్రలైన కృష్ణుడు, కర్ణుడు మధ్యన ఒకసారి మంచి సంభాషణ జరిగింది*...

*కర్ణుడు కృష్ణుడుని అడిగాడు*...

*నేను పుట్టీపుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది*..

*అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్పా..కాదే*..

*ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేటందుకు నిరాకరించారు..ఎందుకంటే నేను క్షత్రియుని కాను అన్న కారణంతో*..

*పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు కానీ నేను క్షత్రియుడిగా గుర్తింపబడేవరకూ ఆ విద్యనంతా మరిచిపోయేలా నాకు శాపం పెట్టారు*..

*పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించారు*..

*ద్రౌపదీ స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది*..

*ఈనాడు కుంతీమాత వచ్చి నేను తన పుత్రుడిని అని నాకు నిజం చెప్పటం వెనకనున్న కారణం కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవటం కోసమే*..

*నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం వల్లనే*..

*అలాంటప్పుడు నేను దుర్యోధనుని పక్షాన ఉండటం తప్పెలా అవుతుంది అని చెప్పాడు కర్ణుడు*...

*దానికి కృష్ణుడు సమాధానంగా కర్ణునికి చెప్పాడు*...

*నేను పుట్టటమే కారాగారంలో పుట్టాను*..

*నేను పుట్టటం కంటే ముందే నా చావు నాకోసం కాచుకుని కూర్చుంది*..

*నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లితండ్రి నుండీ వేరుచేయబడ్డాను*..

*చిన్నతనంలో నువ్వు కత్తులు , రధాలు, బాణాలు, గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు*..

*నేను గోశాలలో పేడ వాసనల మధ్యన ఉన్నాను*...

*నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి..అప్పటికి నాకు నడిచే వయసు కూడా రాలేదు..కానీ ఎన్నో దాడులు ఎదుర్కున్నాను*..

*నాచుట్టూ ఉన్న వారు వారి సమస్యలకు నేనే కారణం అని నన్ను నిందించేవారు కూడా*..

*నాకు సైన్యమూ లేదు, విద్య కూడా లేదు*..

*మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచీ అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు కూడానూ*..

*సాందీపుని రుషి వద్ద నా పదహారో ఏట నా చదువు ప్రారంభం అయ్యింది*..

*నువ్వు నీకు ఇష్టమైన అమ్మాయిని వివాహం చేసుకోగలిగావు*..

*నేను నాకిష్టమైన అమ్మాయిని చేసుకోలేకపోయాను..పైగా నన్ను వివాహం చేసుకున్నవారు..వారు నన్ను కోరుకుని కొందరూ, నేను రాక్షసుల నుండీ కాపాడబడినవారు కొందరూనూ*..

*జరాసంధుని బారి నుంచీ కాపాడుకోవటానికి నా గోకులాన్నంతా నేను యమునవడ్డునుంచీ దూరంగా తీసుకెళ్ళాల్సివచ్చింది*..

*అప్పుడు పిరికివాడుగా పారిపోయానన్న చెడ్డపేరు నాకొచ్చింది*..

*సరే ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకో నీకు మంచిపేరు వస్తుంది*...

*అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు...పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకూ నేనే కారణం అన్న నింద వేస్తారు అందరూ నాపైన*...

*ఒకటి గుర్తుంచుకో కర్ణా*..

*జీవితంలో సమస్యలు, సవాళ్ళు అందరికీ ఉంటాయి*..

*జీవితం ఏ ఒక్కరికీ పూలబాట కాదు..అన్నివేళలా అంతా సవ్యంగానే ఉండదు*..

*దుర్యోధనుడు అవనీ, యుధిష్టరుడు అవనీ అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసినవారే*..

*ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకి నీ బుద్ధికి తెలుసు*..

*మనకు ఎంత అన్యాయం జరిగినా*..

*మనకు ఎన్ని పరాభవాలు జరిగిన*..

*మనకు రావల్సినది మనకు అందకపోయినా*...

*మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం...అదే చాలా ముఖ్యమైనది*..

*జీవితం ఆటుపోట్లు భరించామనో, మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయనో..అనే కారణాలు మనకు అధర్మమార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా (licence ) అనుకోకూడదు..మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించకూడదు...ఏ పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని వదులుకోకూడదు..అని కర్ణునికి కృష్ణుడు బోధించాడు*..

--((***))--
సముద్రస్నానం 

ఒకసారి సముద్రుడు భగవంతుని కోసం తపస్సు చేశాడంట , తపస్సు పరిపూర్ణం అయిన వెంటనే భగవంతుడు ప్రత్యక్షం అయ్యారు , వరం కోరుకోమన్ని అడిగితే నాలోని నీరంతా తియ్యగా చేయమన్నాడంట , దానికి భగవంతుడు అది కాక వేరేదేదైన కోరిక కోరమంటే ,నాకు ఎందుకు ఈ వరం ఇవ్వడంలేదు స్వామి , నా సందేహం ఏమిటంటే ఇంత నీరుండి ఒక మానవునికి కాని ,పశుపక్షాదులకుగాని ఉపయోగపడడంలేదు అప్పుడు ఇంత లోతు , ఇంత వైశాల్యం , ఇంత నీరు నాకెందుకు దయచేసి చెప్పండి స్వామి అని అడిగాడంట , అప్పుడు భగవంతుడు చిరునవ్వును నవ్వి ఎవరు చెప్పారు నీకునీవల్ల ఎవరికి ఉపయోగం లేదని , నీ వల్ల సృష్టికి అధిక ఫలధాయకం , నీ నీటిలో ఉప్పు ఉండడం వల్ల జలచరాలు సురక్షితంగా వున్నాయి కారణం విషపదార్థాలను నీ ఉప్పునీరు పరిశుద్ధం చేస్తుంది , ఎప్పుడైన ఆలోచించావా లెక్కలేనన్ని జీవులు నీ జలగర్భంలో వున్నాయి , నీవు అందరిని ఆరోగ్యవంతులను చేస్తున్నావు , నీ నుండి మాత్రమే ఉప్పు లభిస్తుంది , అది మానవకోటి ఆహారంలో ప్రధానపాత్ర అవ్వబడింది , అది వారిని ఆరోగ్యకరంగా వుంచుతుంది , ఇక పక్షులు నీ ఒడ్డున నివాసం వుండి నీ జలచరాలను ఆహారంగా తీసుకొని జీవిస్తున్నాయి , మానవుల విపరీతధోరణిలో సృష్టిని అసంతులితం చేస్తూ విషవాయువులను వెదజల్లితే నీవు ఉగ్రరూపంలో ఉప్పొంగి ఆ విషాన్ని నీ గొప్పగుణమైన ఉప్పుతో పరిశుద్ధం చేస్తావు , రాబోవు కాలంలో నీ అలల అలజడితో ఎందరికో మోదాన్ని ఇస్తావు , నీవు నిరంతర ఆహ్లాదజరివి , జలధన్వాంతరుడవు , స్వామివారి మాటతో సంతోషించిన సాగరుడు స్వామివారి పాదాలను తన అలలతో కడిగి వాటిని తీర్థంగా తీసుకున్నాడంట , స్వామి అంతరార్ధం అయ్యాడంట , నాటి నుండి అలలు ఎంత వేగంగా వస్తాయో అంతేవేగంతో సాగరాన్ని చేరుతాయి , భగవంతుడి పాదనీరు కాబట్టి సముద్రస్నానం పరమపావన తీర్థస్నానంగా నేటికి భావిస్తారు 

మూడుకోతులు :

ఒక అడవిలో మూడు కోతులు ఉండేవి. మూడు కోతులూ ఒకసారి 'చెడు వినకూడదు; చెడు మాట్లాడకూడదు; చెడు చూడకూడదు' అని నిర్ణయించుకున్నాయి.

సరిగ్గా ఆ సమయానికి ప్రక్క కొమ్మ మీద గూడు కట్టుకొని ఉన్న కోకిలమ్మ తన పిల్లలను గూటిలోనే వదిలి, మేతకోసం బయటికి వెళ్ళింది. అది అటు వెళ్ళగానే పరదేశం నుండి వచ్చిన గద్ద ఒకటి ఆ పిల్లల్ని ఎత్తుకు పోయేందుకు వచ్చి వాలింది. "ఓ! చెడు! చెడు! నేను దీన్ని చూడలేను!" అని ఒక కోతి కళ్ళు మూసుకున్నది.

ఊఊఊ " అంటూ నోరు మూసుకున్నది మరొక కోతి.

"నేను ఈ అరుపులు వినలేను! వినలేను!" అంటూ‌ చెవులు మూసుకున్నది మూడో‌ కోతి.



సంతోష పడిన గద్ద కోకిల పిల్లలకు ఇంకా దగ్గరికి వచ్చింది. కోకిల పిల్లలు ప్రాణ భయంతో అరవటం మొదలెట్టాయి. అంతలో మూడు కోతులకూ‌ చాలా సిగ్గు వేసింది. "అసలు మంచి అంటే ఏమిటి?! చెడు అంటే ఏమిటి?! ఇతర జంతువులకూ, పక్షులకూ, కీటకాలకూ అబద్ధాలు చెప్పడం చెడు. అట్లాగే తోటి పక్షులను, జంతువులను ఆపదల్లోకి నెట్టటం చెడు. అసలు అక్రమాలను చూడకుండా, వాటిని గురించి వినకుండా, వాటిని గురించి మాట్లాడకుండా ఉండకూడదు! చెడును అర్థం చేసుకొని, ఎన్ని కష్టాలెదురైనా సరే, పోరాడి చెడును అరికట్టాలి! మనం 'చెడును వినకూడదు,చెడు మాట్లాడ కూడదు, చెడును చూడకూడదు' అనుకోవడం అసలు సరైనది కాదు! పోరాటమే మేలు!" అనుకున్నాయి.


చటుక్కున కోకిల పిల్లలను అవి ఉండే గూటితో సహా- తీసుకెళ్ళి చెట్టు తొర్రలో పెట్టి, తొర్రకు అడ్డంగా నిలబడ్డాయి. బెదిరించబోయిన గద్దను మూడూ కలిసి తరిమేసాయి. కోకిల పిల్లల్ని కాపాడాయి.

--((***))--

ప్రాంజలి ప్రభ - పాత కధ -  మోహినీ భస్మాసుర :

అనగనగా భస్మాసురుడు అనే రాక్షసుడొకడు, అడవిలో కఠోర తపస్సు చేస్తున్నాడు- "ఓం నమ శివాయ" అంటూ! భస్మాసురుడి ఘోర తపస్సుకు మెచ్చిన శంకరుడు భస్మాసురుడి ముందు ప్రత్యక్షమైనాడు: "నాయనా! ఏమి కావాలో కోరుకో" అంటూ.
"శంకరా! నాకు మరణం లేకుండా వరం ఇవ్వండి" అన్నాడు భస్మాసురుడు.

అప్పుడు శివుడు నవ్వాడు- "ఒరే, నాయనా! పుట్టిన జీవి చావక తప్పదు; చచ్చిన జీవి మళ్ళీ పుట్టకా తప్పదు. అందుకని నువ్వడిగిన ఆ వరం ఇచ్చేకి వీలు కాదు. అది కాకుండా ఇంకొకటి ఏదైనా కోరుకో" అని చెప్పాడు.

భస్మాసురుడు ఆలోచించాడు. "ఈ వరం ఇవ్వడట- దీని లాగానే ఇంకోటి ఏదైనా అడగాలి!" అనుకున్నాడు. "సరే! నేను ఎవరి తల మీద చేయి పెడతానో వాళ్ళు తక్షణం భస్మం అయిపోవాలి!" అని అడిగాడు. 
"ఇది పర్లేదు. ఈ వరం అయితే ఇవ్వచ్చు" అనుకున్నాడు శంకరుడు. "తథాస్తు" అనేసాడు.
శివుడు తథాస్తు అనగానే భస్మాసురుడు నవ్వి "ఇప్పుడు చిక్కావు నాకు!" అన్నాడు."ఏంటి, చిక్కటం?" అన్నాడు శివుడు.
"ఏమీ లేదు; నువ్వు అసలు శివుడివో, దొంగ శివుడివో ఎలా తేల్చుకునేది?" అని అడిగాడు భస్మాసురుడు.

"అదేం అనుమానం? నువ్వడిగిన వరం ఇచ్చేసాను. నువ్వు ఎవరి తలమీద చెయ్యి పెడితే వాళ్లు నిజంగా భస్మం అయిపోతారు" అన్నాడు శివుడు. "ముందు నీ తలమీద చెయ్యి పెడతాను. నీకు ఏమౌతుందో‌ చూస్తాను" అని మీదికొచ్చాడు భస్మాసురుడు. శివుడికి చాలా భయం వేసింది. "వీడెవడో మరీ‌ ఇంత మొరటు వాడు అనుకోలేదే!" అని గబుక్కున వెనక్కి తిరిగి పరుగు పెట్టాడు.
"ఆగు! ఆగు! వరాన్ని పరీక్షించుకోనీ!" అంటూ శివుడి వెంట పడ్డాడు భస్మాసురుడు.శివుడు ఎటు పోతే అటు వస్తున్నాడు వాడు. శివుడంతటివాడికే అలసట మొదలైంది.
అంతలో నారదుడు ఎదురయ్యాడు. "ఆగు ఆగు శంకరా!" అన్నాడు.

"భస్మాసురుడు వెంట పడుతున్నాడు. తప్పించుకునేకి ఏదైనా‌ ఉపాయం చెప్పు- త్వరగా" అన్నాడు శివుడు, పరుగెత్తుతూనే. నారదుడు కూడా ఆయనతోబాటు పరుగు పెడుతూ అంతా విన్నాడు.
"అయ్యో! ఎంత పనైంది! అయినా వీళ్లకు ఇట్లాంటి వరాలు ఇచ్చేదెందుకు, తర్వాత కష్టాలు కొని తెచ్చుకునేదెందుకు? అయినా అన్ని ఉపాయాలూ ఉన్న విష్ణువు ఉన్నాడుగా! ఆయన్ని తలుచుకో స్వామీ- వెంటనే ఏదో ఒక రకంగా కాపాడతాడు!" అన్నాడు నారదుడు.
అట్లా పరుగు పెడుతూనే విష్ణువుని తల్చుకున్నాడు శివుడు. సంగతి తెల్సుకున్న విష్ణువు ముందుగా తన మాయని భస్మాసురుడి మీదికి వదిలాడు. దాని ప్రభావం వల్ల వాడికి శివుడు కనిపించలేదు. ఆయన స్థానంలోనే విష్ణువు- మోహిని అనే సుందరి రూపంలో కనిపించటం మొదలు పెట్టాడు వాడికి.

తనకు శివుడిచ్చిన వరాన్నీ, తను ఆ శివుడి వెంట పడటాన్నీ అంతా మర్చిపోయాడు భస్మాసురుడు- ఇప్పుడు వాడికి కనబడుతున్నదల్లా మోహిని ఒక్కతే. ఆమె ఎంత చక్కగా ఉన్నదంటే, ఇప్పుడు వాడికి ఆమెను పెళ్ళి చేసుకోవాలని గట్టి కోరిక కలిగింది.
మెల్లిగా ఆమె దగ్గరికి వెళ్ళి- "సుందరీ! నీ పేరేంటి? నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా?" అని అడిగేసాడు వాడు.

మోహిని కిలకిలా నవ్వింది. ఆ నవ్వు చూసి ఇంకా మురిసిపోయాడు భస్మాసురుడు. మోహిని అన్నది- "నువ్వు కూడా నాకు చాలా నచ్చావు. అయితే నాకో చిన్న సమస్య ఉంది- ముందు ఈ సంగతి చెప్పు- నీకు నాట్యం చేయటం వచ్చా?" అని.

"ఓ! చాలా బాగా వచ్చు" అన్నాడు భస్మాసురుడు. "అయితే ఇక పెళ్ళి అయినట్లే! నువ్వు నేను చేసినట్లు నాట్యం చెయ్యి- నాకంటే బాగా చెయ్యాలి మరి! నాట్యంలో నన్ను ఓడించిన వాడినే నేను పెళ్ళి చేసుకుంటాను అని నా జాతకంలో ఉందట" వంకరగా చెప్పింది మోహిని.
"ఓస్! దానిదేముంది. మొదలుపెట్టు నాట్యం!" అన్నాడు భస్మాసురుడు.
మోహిని నాట్యం మొదలెట్టింది. ఆమె ఎట్లా ఆడితే అట్లా ఆడసాగాడు భస్మాసురుడు. క్రమంగా నాట్యం వేగం పుంజుకున్నది. మోహిని తన తలమీద చెయ్యి పెట్టుకొని నాట్యం చేసింది. "ఈ నాట్యం బలే ఉందే" అనుకున్నాడు భస్మాసురుడు. ఆ మొరటు వాడికి తన వరం సంగతి గుర్తే లేదు- ఆమె మాదిరే తనూ తన తలమీద చెయ్యి పెట్టుకున్నాడు- మరుక్షణంలో వాడు కాస్తా భస్మం అయిపోయాడు!

లోకానికి భస్మాసురుడి పీడ విరగడైంది. తనను, లోకాన్ని కాపాడిన విష్ణువుకు ధన్యవాదాలు చెప్పుకున్నాడు శివుడు. "పాత్రత లేని వాళ్ళకు ఇట్లాంటి వరాలు దొరికితే ఎలాగ?" అని నవ్వాడు విష్ణువు..

1 కామెంట్‌: