బుద్ధి బలం: (ఒకనాటి కధ )
అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. సింహం చాలా బలమైనది. రోజు రోజూ ఒక జంతువును చంపేసి తినేసేది. ఒకొక్క సారి ఆకలి లేకపోయినా ఆట కోసం వేరే జంతువులను చంపేసేది.
అడవిలో జంతువులన్నీ ప్రాణ భయంతో ఉండేవి. ఈ సమస్యని ఎడురుకోవడం ఎలా అని ఒక రోజు అన్ని జంతువులూ కలిసి అలోచించాయి. అందరూ సింహాన్ని కలిసి సంధి చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి.
అనుకున్న ప్రకారం నక్క చేత సింహానికి కబురు పెట్టాయి. ఒక పెద్ద చెట్టు కింద జంతువులన్నీ సింహాన్ని కలవడానికి వచ్చాయి. సింహం కూడా కొద్ది సేపటికి వచ్చింది.
ఒక ముసలి కోతి సింహంతో ఇలా అంది, “మీరు మమ్మల్ని కలవడానికి వచ్చినందుకు చాలా థాంక్స్.” సింహం దర్జాగా తల ఊపింది.
కోతి అంది, “మీరు భోజనానికి రోజుకొక్క జంతువుని చంపడం సమంజసమే. మీకు ఆహారం కావాలి. కాని అవసరానికి మించి మీరు జంతువులను చంపడం న్యాయం కాదు. మీరు ఒప్పుకుంటే ఈ రోజు నుంచి మేమే మాలో ఒక్కళ్ళని చీటీలు వేసుకుని ఎంచుకుంటాము. ఆ చీటీలో ఏ జంతువు పేరు ఉంటుందో, ఆ జంతువు నేరుగా మీ గుహకు వచ్చి మీకు ఆహరం అవుతుంది. ఈ ఒప్పందం మీరు ఒప్పు కుంటే అడవిలో జంతువులు ప్రశాంతంగా ఉండొచ్చు”
సింహం కి ఐడియా నచ్చింది. అడివిలో జంతువులు వాటంతట అవే బలవుతుంటే రోజూ వేటకి వెళ్ళే పని ఉండదు, హాయిగా ఉండచ్చు అనుకుని సింహం ఒప్పుకుంది.
రోజుకొక జంతువు అనుకున్న దాని ప్రాకారం సింహానికి బాలి అవ్వడం మొదలెట్టాయి.
కొన్ని రోజులకి ఒక కుందేలు వంతు వచ్చింది. పాపం కుందేలు చాలా భయ పడిపోయింది. దానికి బలి అవ్వాలని అస్సలు లేదు. ఎలాగ రా భగవంతుడా అని చాలా ఆలోచించింది. ఎలాగో గుండెను గట్టి చేసుకుని ఆ సింహం గుహ వైపుకు బయలుద్యారింది. దారిలో ఒక నుయ్యి కనిపించింది. నూతిలో నీళ్ళు చూస్తే ఒక ఐడియా వచ్చింది. అక్కడే పొద్దు పోయే దాకా కూర్చుని, సాయంత్రానికి ప్రశాంతంగా లేచి పరిగెత్తుకుంటూ సింహం దెగ్గిరకి వెళ్ళింది.
పొద్దుటి నుంచి ఆహారం కోసం ఎదురు చూస్తున్న సింహం బాగా రుస రుసలాడుతూ, కోపంగా గుహ ముంగిట్లో పచార్లు చేస్తోంది.
కుందేలుని చూడంగానే “ఎమిటి ఇంత ఆలస్యం?” అని కోపంగా గర్జించింది.
కుందేలు గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ, “క్షమించండి మహారాజా! నేను పొద్దున్నే మీ వద్దకు రావటానికి బయలుద్యారాను. కానీ దారిలో ఇంకొక సింహం కనిపించింది. అది నన్ను తినబోతుంటే, ఈ రోజు నేను మీకు ఆహారాన్ని అన్న విషయం చెప్పాను. ఆ సింహం అస్సలు మాట వినలేదు. ఈ అడివికి నేనే రాజుని, అని నాతొ చెప్పి నా పైకి దుంకి నన్ను పట్టుకుందామని ప్రయత్నించింది. నేను ఎలాగో ప్రాణాలు కాపాడుకుని మీ దెగ్గరకు వచ్చాను!” అని చెప్పింది.
అసలే కోపం మీద ఉన్న సింహానికి ఇంకా భగ్గున మండింది. “ఎక్కడ ఆ సింహం! చూపించు నాకు!” అంది.
కుందేలు సింహాన్ని నూతి దగ్గరకు తీసుకుని వెళ్ళింది. మరో సింహం నూతిలో ఉంటుందని చెప్పింది.
సింహం నూతిలోకి చూసింది. నీళ్ళల్లో తన ప్రతిబింబం చూసి మరో సింహం అని అపోహ పడి గర్జించింది. ఆ గర్జన నూతిలో ప్రతిధ్వనించింది. సింహం తన ప్రతిబింబం తోనే యుద్ధం చేయడానికి నూతిలోకి దుంకేసింది. అందులోని నీళ్ళల్లో మరణించింది.
కుందేలు ప్రాణాలతో ఇలా తప్పించుకుంది. అడివిలో మిగిలిన జంతువులకు జరిగినది చెప్పింది. జంతువులన్నీ కుందేలు చాతచక్యం మెచ్చుకున్నాయి. ఆ రోజునుంచి ప్రశాంతంగా అడవిలో నివసించాయి.
బలం కన్నా బుద్ధి గొప్పదని నిరూపించడానికి ఈ కథ మరో నిదర్శనం.
ఇటువంటి కథలను కదిలే బొమ్మల రూపంలో యానిమేషన్ జోడించి వీడియో చేయటం జరిగింది. ఆ కదిలే బొమ్మలు చూడాలంటే ఈ క్రింద లింక్ మీద నొక్కండి.
--((***))--
--- మలుపు కొరకు --- ప్రాంజలి ప్రభ - నేటి కధ
లాసవంతమైన జీవితాన్ని మెడలో వేసుకొని కులాసాగా తిరుగుతున్నాను, నాన్న కష్టపడి చదువుని కొనిస్తుంటే.. నేను చదువుకోవడం మానేసాను, రోజుకో డ్రస్ వేస్తూ పగటి వేషగాడిలా పచార్లు కొడుతున్నాను, చిన్నప్పటినుంచి ఇప్పటి వరకూ నాన్న చేసే హితబోధ ఒక్కటే,,
" ఒరేయ్ రాజు,, జీవితంలో గెలుపోటములు సమంజసం, కానీ ఎంత బాధవున్నా చివరికి గెలవాలి, మన వంశంలో దేనిలోను ఓడిపోయిన వాళ్ళు లేరు, బాగా గుర్తుపెట్టుకోరా.. "
అంటున్న నాన్న మాట అప్పుడప్పుడు నా మస్తిష్క గూడులో తళుక్కున మెరుస్తుండేది, ఐనా అలవాటు పడిన మనసు ఒకవైపే ఒరిగిపోతుంటే ఆపే శక్తిని కోల్పోయాను.
మాది చాలా ఉన్నతమైన కుటుంబం డబ్బులోనే కాదు, పరపతిలోను గౌరవంలోను పెట్టింది పేరు, మా ఊరిపైన మాదే పెద్ద ఇల్లు, నేను ఒక్కగానొక్క కొడుకుని, గారాబంగా పెంచుతున్నారు, నాకు జలుబు చేస్తేనే చాలు అమ్మ అన్నం తినడం మాని నా బాగోగులు గురించే మదనపడేది, బాగా చదివించాలనే నాన్న పట్టుదలకు అవధులుండేవి కావు, పదవతరగతి పబ్లిక్ పరీక్ష రాయడానికి బయలుదేరిన ముందు నాన్న ఒక మాటన్నాడు,
" రాజు.. మీ పెదనాన్న కొడుకు విజెయ్ లేడూ,, పదవతరగతి ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాడని ఊరాళ్ళందరు మెచ్చుకున్నార్రా.. అలాగే నువ్వు కూడా పరీక్షల్లో గెలవాల, "
అనిన నాన్న ఆశయాన్ని నెరవేర్చాను, కన్నవారి కళ్ళల్లో ఆనందాన్ని చూసిన నాకు, నా జవితం ధన్యమైందనుకున్నాను, చదువులోనే కాదు ఆటల్లోను మేటిగా గెలుపొందాను, అన్నింటిలోను గెలుపును సాధిస్తున్న నన్ను చూసి అమ్మానాన్నలో సంతోషం హద్దులు చెరిపేసుకుంది,
" ఏమయ్యా సుందరం.. మీవాడు చదువులోనే కాదయ్యా మునుముందుకు అన్ని రంగాల్లోను గెలుస్తాడు "
ప్రిన్సిపాల్ భక్తవత్సలం నాన్నతో అంటుంటే చెట్టు చాటున వుండి విని ఎగిరి గంతేసాను,
ఇన్నాళ్లు నాన్న తెచ్చింది తీసుకునేవాన్ని, ఇప్పుడు నేను కోరింది నాన్న తెచ్చిపెడుతున్నాడు, ఇంటర్ పూర్తి కాగానే డిగ్రీ చేయడానికి పట్టణం వెళ్ళాను, అక్కడే వుండి కాలేజ్ కు వెళ్ళాల్సి వచ్చింది. శెలవుల్లో కూడా ఇంటికి వెళ్ళడానికి తీరిక వుండేది కాదు, కావలసినంత డబ్బు నాన్నే పంపేవాడు,
యుక్త వయసు మీదపడి లోకజ్ఞానం బాగా ఒంటబట్టించుకున్నాక విజ్ఞానంతో బాటు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాను, కొత్త కొత్త స్నేహాలు, సరికొత్తగా కలసి వాళ్ళతో మెసలాకా.. కాలేజీ హాజరు పట్టీలో పర్సెంటేజీ తగ్గిపోయింది, ర్యాగింగ్ లు కామెంట్రీల జాడల్లో అడుగేసాక, అల్లరి గ్యాంగ్ లో నా పేరు మొదటికి చేరింది, సెల్ ఫోన్ కావాలని నాన్న కు తెలిపిన తక్షణం డబ్బు ఆగమేఘాలమీద దూసుకొచ్చింది.. సెల్ వాడకం మొదలయ్యాక అక్కడి నుండి మలుపు తిరిగింది,
కాలేజీలో దివ్యశ్రీ అనే అమ్మాయిని ప్రేమించాను, అంతే నాలో ఒక కొత్త మనిషి తయారయ్యాడు, మనసును మార్చేసాడు, ఆకల్ని దహించాడు. నిద్రని కోల్పోయి ప్రేమాన్వేషణలో తీరిక లేక ప్రతిక్షణం అలసిపోవాల్సి వచ్చింది, గంటల తరబడి సెల్ ఫోన్ లో దివ్యశ్రీతో మాట్లాడ్డానికి కరెన్సీని మంచినీళ్ళు లెక్కన ఖర్చు చేసాను, లేనిపోని అపద్దాలను నిజాలుగా నమ్మించి నాన్న పైకి అసత్యాల అస్త్రాలను సంధించి అధిక మొత్తంలో డబ్బు లాక్కొన్నాను,
క్లాసులు ఎగ్గొట్టి క్రికెట్ ఆటలో ఎక్కువ శాతం నిమగ్నం అయ్యాను. బెట్టింగ్ లో వేలకు వేలు డబ్బులు పోగొట్టాను, మందుకు, విందుకు, షికార్లకు తీరిక లేక వెళ్ళి, తీవ్రంగా నష్టపోయాను, చెడు వ్యసనాలు నా చుట్టూ చేరి పీడించడం మొదలు పెట్టాకా విద్యార్థికున్న లక్షణాలన్నింటిని కోల్పోవాల్సి వచ్చింది, బంద్ లకు రాస్తారోకోలకు వెళ్ళవద్దని నాన్న చాలా సార్లు ఫోన్ చేసి చెప్పాడు ఐనా ససేమిరా అంటూ ముందుకు కదిలాను,
ఒకరోజు దివ్యశ్రీకి ఒంట్లో నలతగా వుందని ఫోన్ చేసిన అరనిమిషంలోనే నాన్న ఫోన్ చేసి
" బాబు... మీ అమ్మకు ఒళ్ళు బాగోలేదు. నిన్ను చూడాలంటోంది ఒకసారి వచ్చిపోరా... "
అన్నాడు, ఎటు వెళ్ళాలో దిక్కుతోచడం లేదు, ప్రియురాలిపైగల ప్రేమ ముందు అమ్మపై గల ప్రేమ ఓడిపోయింది, అంతే... ఆరోజునుండి నాన్న ఫోన్ చేయడం మానేసాడు, ఇదివరకే నాన్న పంపిన డబ్బులు సంవత్సరం పాటు నా విలాసవంతమైన జీవితానికి పనికొచ్చాయి, చాలా రోజులకు అమ్మ నాన్నను చూడాలనిపించింది, సెల్ ఫోన్ విక్రయించగా వచ్చిన డబ్బుతో ఊరికి బయలుదేరాను.
సొంత ఊర్లో బస్సు దిగి రెండడుగులు ముందుకు వేయగానే మాసిపోయిన చొక్కా.. చిందరవందరగా వున్న జుత్తు, ముక్కుల్లోకి దుమ్ము పడకుండా అర్దం ముఖాన్ని కప్పుతూ చుట్టుకున్న గుడ్డ.. ఆటోలో రెడీగా కూర్చుని వున్నాడు వెళ్ళి
" ఏమయ్యా... టవర్ క్లాక్ పక్క వీధికి వస్తావా " అనడిగాను
" ఎక్కండి బాబు " అన్నాడతను ఎక్కి కూర్చున్న.... ఆటో కదిలింది.. దారిలో వైన్ షాప్ ముందు ఆపించాను.
" మందు అలవాటుందా...? "
అనడిగాను.. లేదన్నట్టు తలూపాడు అతను. నేను చక చకా బార్లోకి వెళ్ళి ఒక పెగ్గు మందు లాగించి. తిరిగి ఆటో ఎక్కి కూర్చున్నాను. సిగరెట్ ముట్టిస్తుంటే అతను ఆటో నడుపుతూనే నన్ను గమనిస్తున్నాడు.
" సిగరెట్ తాగుతావా,, " అనడిగాను.. " వద్దు బాబు అలవాటు లేదు " అన్నాడు అస్పష్టంగా..
" మనిషన్నాక ఏదో ఒక వ్యసనం వుండి తీరాలి " తాగేసిన సిగరెట్ పారేస్తూ అన్నాను. దీనికి సమాధానం రాలేదు అతని నుండి.. నేరుగా వెళ్లి ఒక పూరి గుడిసె ముందు ఆటో ఆపాడు.నాకేమీ అర్థం కాలేదు అలాగే కూర్చుని వున్నాను.
" మీ ఇల్లు వచ్చింది దిగు బాబు " అన్నాడాయన, " ఏమయ్యో... తాగింది నువ్వా నేనా.. నేను తాగితే నీకు మతి పోయిందేంటీ " కాస్త కోపంగా అంటునే .
" సర్లే... మా ఇల్లు చూసావా ఇంతకూ పేద్ద మేడ, తాగాడు కదాని పూరి గుడిసె చూపి ఫూల్ ని చేయకు " వెంటనే ఇలా అన్నాను " కాదు బాబూ పొరబడుతున్నావ్ ఇది మీ ఇల్లే దిగండి " అతని మాటకు నాలో ఓపిక చచ్చిపోయింది.
" పెద్దవాడివి కదాని ఇందాకట్నుంచి మర్యాదిస్తుంటే వెటకారమాడుతావా.. "
అంటూ ఆటో దిగి అతన్ని బయటికి లాగి చెంప ఛెల్లుమనిపించాను, అతను ముఖానికి చుట్టుకున్న కండువా జారిపోయింది. అంతే నా గుండె ఆగిపోయినంత పనైంది. అతను ఎవరో కాదు మా నాన్నే... కొట్టిన దెబ్బకు నాన్న చెంప ఎర్రగా కందిపోయింది. ఈ షాక్ లో తాగింది మొత్తం దిగిపోయింది నాకు.. ముఖానికి గుడ్డ చుట్టుకొని వుంటే ఎవరో అనుకున్నాను. స్వయానే నాన్నే నన్ను తీసుకొచ్చాడని తెలిసాకా నాలో బాధకు అంతులేకుండా పోయింది. ఆ క్షణాన ఏమి అర్థం కాలేదు నాకు చూస్తూ నిలబడిపోయాను, నోరు పెగల్లేదు.
రోజు పట్టుచీర కట్టి దర్జాగా తిరిగే అమ్మ దర్బారు నావల్లనే ఈరోజు అనగారిపోయింది. పాత చీర కట్టుకుని పూరింటి పంచన దిగాలుగా నిలుచున్న అమ్మను చూసి నా గుండె తరుక్కుపోయింది. నాన్న వైపు తిరిగి తల దించుకున్నాను.
" తల దించుకోవాల్సింది నువ్వు కాదు బాబూ మేము... కొడుకు పైచదువులు చదివి.. గొప్ప ఉద్యోగం సంపాదించి మూడు పూటలా కాస్త తిండి పెడతాడనుకున్నాము. ఇలా నోటికాడ ముద్దను లాగేస్తాడనుకోలేదు. తల్లిదండ్రులు అమాయకుల్లే అనుకొని మాయ చేసావు, మాది అమాయకత్వం కాదు బాబూ నమ్మకం.. ఈ నమ్మకం వమ్ము అవుతుందని కలలో కూడా ఊహించుకోలేదు. 'నాన్నా డబ్బులు కావాలి'అంటే రెక్కలు ముక్కలు చేసి పంపించాను. అందరూ సెల్ ఫోన్ వాడుతున్నారంటే అదీ తీయించాను, నా కొడుకు అందరిలో మేటిగా వుండాలని కోరిన బట్టలు తీయించాను. ఉన్న ఆస్తులు అమ్మి లక్షలు లక్షలు డొనేషన్ లు కట్టానురా.. ఇంజనీరు చదువుకు ఉన్న ఇల్లు కూడా అమ్మేసానురా.. చివరికి మిగిలింది ఈ ఆటో.. ఆ గుడిసె కూడా మనది కాదు..అక్కడ నువ్వు గ్యాంగ్ లు కట్టి ర్యాగింగ్ లు చేస్తూ ధర్నాల్లో చేరిపోతు. పబ్బులు పబ్బాలంటూ అమ్మాయిలను వెంటేసుకొని ప్రేమదోమా అంటూ తిరిగితే... కన్నవాళ్ళు మీపై ప్రేమనంతా దారపోసి ఒక్క పూట తిని మీకు మూడు పూటలా పెడతార్రా... పెడతారు "
అంటూ నాన్న కళ్ళల్లో నీళ్ళు తుడుచుకుంటూ ఆటో వద్దకు వెళుతుంటే ..నా గుండెల్లో బాధ కన్నీళ్ల రూపంలో బయటికి తన్నుకొచ్చింది. వెళ్ళి నాన్న పాదాల మీద పడ్డాను.
" నన్ను క్షమించు నాన్న నా వలన ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయాయి. కన్నుమిన్ను కానకుండా తిరిగినందుకు దేవుడు తగిన శాస్తి చేసాడు. "
అంటూనే అమ్మ దగ్గరకు వెళ్ళాను. కడుపు పుష్టితో ఆరోగ్యంగా వుండే అమ్మ ఒట్టి కట్టెలా తయారైంది.
కన్నవారి పరిస్థితి చూసి కన్నుల్లో నీరు ఆగలేదు
" అమ్మా.. మిమ్మల్ని నేను బాగా చూసుకుంటాను. ఆటో నేనే నడిపి సంపాదిస్తాను. చిన్నప్పుడు నాన్న చెప్పిన మాట గుర్తుందమ్మా.. ఇకనుండి దాన్ని అక్షరాలా పాటిస్తాను. ఇంటిపట్టునే వుండి చదువును గెలుస్తాను. ఆటో నడుపుకొంటూ జీవితాన్ని గెలుస్తాను. మీకు కావల్సింది గెలుపు అది నేను సాధిస్తాను ధైర్యంగా వుండండి "
అంటుండగానే నాన్న నా భుజం తట్టి పైకి లేపి. ముఖంలో ఆనందాన్ని వ్యక్తం చేయగానే నాలో ధైర్యం పుంజుకుంది. కానీ నేను కోరుకునేది ఒక్కటే ప్రతి విద్యార్థి వ్యసనపరులు కాకుండా.. ప్రేమలో మునిగి కన్నవారి ఆశయాలు నట్టేట ముంచకుండా.. చదువుపై ఆశక్తిని చూపి గెలుపును ఆస్వాదించాలి.. సాధించాలి.
ఇంకా నాలో ఓపిక ఉన్నది, మా పరిస్థితిని గూర్చి జాలి పడనవసరం లేదు ఇక మేము నీకు ఇచ్చే స్థితి లీడు ఓపిక లేదు , నీవు చదువుకొని ప్రయోజకుడవై బతుకుతావని ఆశిస్తున్నాను ఏంటో ఆశతో వచ్చావు కదా ఈ పూరి గుడిసెకు వచ్చినవారు అన్నం తినకుండా పోరు కాస్త ఎంగిలినపడి పో బిడ్డా
నాన్నా అంతేనా
అంతకన్నా నేను ఏమి మాట్లాడ లేను, నీవు బాగుపడి మమ్ము ఉద్ధరిస్తావని మేము అనుకొనే కాలము పోయింది
నాన్న నేను కష్ట పడి మిమ్మల్ని పోషిస్తాను
ఇంతకీ ని ప్రేమ ఎనవరకు వచ్చింది
ఒక్కసారి అటు చూడు ఇప్పటిదాకా నిన్ను పోషించాను మరో ఇద్దరిని పోషిస్తాను అన్నాడు
దివ్యశ్రీ ఇక్కడ నీవు
నీతో పంచుకున్నా కదా పెరుగుతున్న వాని బాటుకు చూసుకున్నా
వచ్చారు కదా భోజనం చేసి వెళ్ళండి ........
--((***))--
ప్రయాణం..లో గత స్మృతులు
పెద్దతనం, ముసలి తనం, వృద్ధాప్యం అని అందరూ హడలగొట్టి చంపేసే ఆ దశ వచ్చేసిందా? అప్పుడే వచ్చేసిందా?
నిన్నగాక మొన్ననేగా మావయ్య కొనిచ్చిన కొత్త ఓణీ చూసి మురిసి ముక్క చెక్కలయిందీ !
ఎదురింట్లో అద్దెకున్న స్టూడెంట్ కుర్రాడు ఇంకా కాలేజీకి వెళ్ళడేమిటా అని విసుక్కున్నదెప్పుడూ… నాలుగు రోజుల క్రితమేగా!
ప్రతి పెళ్ళిచూపులకి సింగారించుకుని కూచుని, తీరా వాళ్లు జాతకాలు నప్పలేదని కబురు పెడితే తిట్టరాని తిట్లన్నీ అందరం కలిసి తిట్టుకుంటూ ఎంజాయ్ చేసింది నిన్న మొన్నేగా!
నాన్నని కష్టపెట్టకూడదని కూడబలుక్కుని, ఇంటి అరుగుమీద పెళ్ళి, పెరట్లో కొబ్బరి చెట్టుకింద బూందీ, లడ్డూ, కాఫీలతో రిసెప్షనూ ఇచ్చి, ఇంటి ఇల్లాలినయి ఎన్నాళ్ళయిందనీ !
అందుకు తగ్గట్టే పెళ్లివారు ఒకే పట్టుచీర తెచ్చి అన్నిటికీ దాన్నే తిప్పితే, నలుగురూ నవ్వినందుకు పౌరుషం వచ్చి, ‘మేం బొంబాయిలో కొనుక్కుంటాం’ అని గొప్పలు పోయింది ఈ మధ్యనేగా !
అయినా ఏం లోటయిందని ?
వాయిల్సూ, జార్జెట్ లూ, బిన్నీలూ, బాంబే డయింగులూ, విమలలూ, వెంకటగిరి , ఉప్పాడ, గద్వాల, గుంటూరు, బెనారసు, కంచి, మైసూరు, ధర్మవరం, మహేశ్వరం, ఒరిస్సా, అస్సాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్… అబ్బ.. అబ్బబ్బ ఎన్ని రాష్ట్రాలని పాలించాం! ఎన్ని చీరలు కట్టాం!
ముగ్గురు పిల్లల్నేసుకుని రిక్షాలెక్కుతూ దిగుతూ, హాస్పిటళ్లూ, స్కూళ్లూ, పెళ్లిళ్లూ, పేరంటాలూ, పురుళ్లూ, తద్దినాలూ, నోములూ, వ్రతాలూ…ఎన్నెన్ని పండగలూ, ఎంతెంత హైరానాలూ….ఒక్కరోజయినా నడుం నొప్పని పడుకుని ఎరుగుదుమా, ఎవరైనా పలకరించడం విన్నామా?!
పాపాయ్, నానీ, చిట్టితల్లీ, బంగారం, అక్కా, వదినా, ఇదిగో, కోడలమ్మా, పిన్నీ, అత్తా, చిన్నమ్మా. అమ్మా, పెద్దమ్మా, అమ్మమ్మా, నానమ్మా, పెద్దమ్మమ్మా, పెద్ద బామ్మా, జేజమ్మా… అమ్మో ఎన్ని మెట్లెక్కాం! ఎన్నెన్ని పిలుపులకి పలికాం !
ఇంతట్లోకే పెద్దయిపోయామా! అప్పుడే అందరూ అమ్మగారనడం మానేసి మామ్మగారంటున్నారు!
అంటే అన్నారుగాని పాపం లేవబోతుంటే చేయందిస్తున్నారు!
చేతనున్న చిన్న బ్యాగు తామే తెస్తామని లాక్కుంటున్నారు….
పదికిలోల బియ్యం అవలీలగా వార్చిన వాళ్లం! ఈ బరువొక లెక్ఖా, వాళ్లంత ముచ్చట పడుతుంటే కాదనడం ఎందుకని గానీ?
పెద్దయితే అయ్యాంగానీ ఎంత హాయిగా ఉంటోందో!
మండే ఎండల తర్వాత వాన చినుకు పడ్డట్టు…
ముసుళ్ల వానల ముజ్జిడ్డులు దాటి, వెన్నెల మోసుకొచ్చే చందమామ కనపడ్డట్టు…
గజ గజ లాడే చలి వణుకులు వణికాక వెచ్చటి కమ్మటి మట్టిగాలి పలకరించినట్టు…
ఎంత హాయిగా వుందో!
ఒకటే ఇడ్లీ తింటే గంటకే ఆకలేస్తుంది.. పోనీ అని రెండు తింటే అపరాహ్నమయినా అన్నానికి లేవబుధ్ధి కాదు!
ఆవకాయని చూస్తే బీపీ, మామిడి పండుని తల్చుకుంటే సుగరూ, పగలు కాస్త రెండు ముద్దలెక్కువయితే
రాత్రికి మజ్జిగ చాలు… ఎంత తేలిక అవసరాలు!
సగం భోజనం మిగతా సగం మందులు .. అవి ఉండ బట్టే కదా ఇంకా మనగల్గుతున్నాం!
ఇంకొక పెద్ద విశేషం ఉందండోయ్, ఎవరికీ తెలియనిదీ మనం పైకి చెప్పనిదీ ..
మనం ఎవరికీ అక్కర్లేదు కాబట్టి మనకీ ఎవరూ అక్కర్లేదు!
ఎవరూ మన మాట వినిపించుకోరు కాబట్టి మనమూ ఎవరి మాటా వినిపించుకోనక్కర్లేదు !
అంతా నిశ్శబ్ద సంగీతం!
ఏరుని ఎప్పుడూ గలగలా ప్రవహించమంటే కుదుర్తుందా? సముద్రం దగ్గర పడుతుంటే హాయిగా నిండుగా హుందాగా అడుగులేస్తుంది కదా!
అయినా ఎపుడేనా మనకి తిక్క పుట్టినపుడు అడ్డంగా, అర్ధం పర్ధం లేకుండా వాదించి ఇవతల పడచ్చు. ఇంత వయసు వచ్చాక ఆ మాత్రం చేయ తగమా !
ఈ మధ్యనే నేను కనిపెట్టాను ఇంకొక పెద్ద విశేషం…అస్తమానం ప్రవచనాలు వింటూ హైరానా పడక్కర్లేదు. మనకి చెప్పడం రాదు గానీ వాళ్ళు చెప్పేవన్నీ మనకూ తెలుసు!
కాబట్టి హాయిగా పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తూ కుళ్లు జోకులకి కూడా గట్టిగా నవ్వుకోవచ్చు. ఎవరూ ఏమీ అనుకోరు.
అవునూ… మనం కనపడగానే మొహం ఇంత చేసుకుని ఆనంద పడిపోయే మన పిన్నిలూ, బాబాయిలూ, అత్తయ్యలూ, మామయ్యలూ ఏమయిపోయారు? ఎప్పుడెళ్లిపోయారు?
’ పిచ్చిపిల్లా కొత్త మాగాయలో వేడన్నం కలుపుకుని, ఈ నూనె చుక్కేసుకుని రెండు ముద్దలు తిను’ అంటూ వెంటబడే వాళ్లెవరూ లేరే?
అంటే మనమే పెద్దవాళ్లయిపోయామన్నమాట!
చూస్తూండగానే సాటివాళ్లు కూడా కనిపించడం మానేస్తున్నారు. కొందరుండీ లేనట్టే. లేకా వున్నట్టే. జీవితానికి విశ్రాంతి దానంతటదే వస్తోంది.
అయినా రైలెక్కాక కిటికీ పక్కన కూచుని దారిలో వచ్చే పొలాలూ, కాలవలూ, కుర్రకారూ, పల్లెపడుచులూ, టేకు చెట్లూ, భవనాలూ, వాటి పక్కనే గుడిసెలూ, అక్కడాడుకుంటూ చేతులూపే చిన్నారులూ, ఉదయిస్తూ అస్తమిస్తూ అలుపెరగక డ్యూటీ చేసే సూర్యనారాయణమూర్తులూ, మిణుకు మిణుకుమని హొయలుపోయే చుక్కలూ చూస్తూ ప్రయాణం ఎంజాయ్ చెయ్యాలి గానీ స్టేషనెప్పుడొస్తుందో అని ఎదురుచూడడం ఎందుకూ?
తీరా అదొస్తే ఏముందీ! జీవితమంతా పోగేసిన సామాన్లన్నీ వదిలేసి దిగిపోవడమేగా!
శ్లో॥ అహింసా సత్య మక్రోధః
త్యాగః శాంతి రపై శునం।
దయా భూతేష్వ లోలుప్త్వం
మార్దవం హ్రీర చాపలం॥ (2)
తా॥ అహింస, సత్యం, కోపం లేకుండుట, త్యాగం, శాంతి, చాడీలు చెప్పకుండుట, భూతదయ, విషయలోలత్వం లేకుండుట, మృదుస్వభావం, సిగ్గు, చపలత్వం లేకుండుట - (దైవీసంపద)
వ్యాఖ్య:- క్రిందటి శ్లోకంలో 9 లక్షణాలు చెప్పి ఇప్పుడు మరొక 11 లక్షణాలు చెప్పబోతున్నారు. వీటిలో ఏవో కొన్ని లక్షణాలను అలవరుచుకోవాలి. అప్పుడే మనలో దైవీసంపద పెరుగుతుంది. ఆసురీసంపద దూరమై పోతుంది.
(10) అహింస :- హింస చేయకుండా ఉండటమే అహింస. హింస అంటే కొట్టటం, నరకటం, చంపటం మాత్రమే కాదు; తిట్టటం, దుష్ప్రచారం చేయటం, నిందలు వేయటం, ఇతరులను తమ చర్యల ద్వారా బాధించటం కూడా హింసయే. శరీరంతోగాని, వాక్కుతోగాని, మనస్సుతోగాని, సాధ్యమైనంత వరకు ఇతరులకు బాధ కలిగించకుండా ఉండటమే అహింస, ఒక్కొక్కప్పుడు ఏది హింసయో, ఏది అహింసయో చెప్పటం కూడా కష్టమే.
కాయకూరలు తరిగేటప్పుడు, చిమ్మేటప్పుడు, వంట చేసేటప్పుడు, నడిచేటప్పుడు ఎన్నో సూక్ష్మజీవులు చనిపోతాయి. హింస చేసినట్లేనా? నేను ఉపన్యాసం చేస్తుంటే మాటల ఉరవడికి వేడి పుడుతుంది. ఆ వేడిలో కొన్ని సూక్ష్మజీవులు చనిపోతాయి. హింస చేసినట్లేనా? డాక్టరు సూదితో ఇంజెక్షన్ చేసేటప్పుడు, కత్తులతో ఆపరేషన్ చేసేటప్పుడు ఎంతో బాధ. హింస చేసినట్లేనా? తల్లిదండ్రులు బిడ్డలను తిట్టి, కొట్టి మంచి మార్గంలో పెట్టాలనుకుంటారు. హింస చేసినట్లేనా? ఇదంతా హింస క్రిందకు రాదు. అలాగే యజ్ఞాలలో పశుహింస, యుద్ధాలలో శత్రునాశనం హింస క్రిందకు రాదు. స్వార్థంతో చేసే హింసయే హింస. సొమ్ముల కోసం దొంగలు గొంతుపిసికి చంపితే హింస అవుతుంది. మత కల్లోలాలు రెచ్చగొట్టి రాజకీయ నాయకులు చేసేది హింస అవుతుంది. ఉగ్రవాదులు బాంబులుపెట్టి అమాయకులను చంపితే హింస అవుతుంది.
అందుకే ఇళ్ళు తగలబెట్టిన వారిని ఆతతాయినులు అంటారు. మరి హనుమంతుడు ఒకటీ రెండు కాదు మొత్తం లంకా నగరాన్నే తగులబెట్టాడు. ఆయనను దేవుడుగా పూజిస్తున్నాం.
ఒకడు ఎవరినైనా హత్యచేస్తే ఉరిశిక్ష పడుతుంది. అదే యుద్ధంలో శత్రుసేనలను చీల్చిచండాడిన వాడికి పరమవీర చక్ర బిరుదు నిచ్చి సత్కరిస్తాం. 18 రోజులలో 18 అక్షౌహిణుల సైన్యాన్ని సర్వనాశనం గావించిన శ్రీకృష్ణుని భగవంతునిగా పూజిస్తాం. మరి ఆయన అహింసామూర్తి ఎలా అయ్యాడు? ఈ జగత్తంతా విరాట్ పురుషుని శరీరం. ఆ శరీరంలో కౌరవులనే ఒక అంగం కుళ్ళి చెడిపోయింది. అది సంధులు, రాయబారాలు, రాజీలు అనే మందులతో తగ్గే జబ్బుకాదు. ఆపరేషన్ చేయాల్సివచ్సింది. మంచి కాంపౌండరు కావాల్సి వచ్చింది. అందుకు అర్జునుడే తగిన వాడని నిశ్చయించి జగద్ వైద్యుడైన శ్రీకృష్ణుడు చక్కగా ఆపరేషన్ నిర్వహించాడు. చెడిపోయిన - కుళ్ళిపోయిన అంగాన్ని తీసివేసి మిగిలిన దేహాన్ని ఆరోగ్యంగా ఉంచాడు. అందుకే శ్రీకృష్ణుడు అహింసావాది అయ్యాడు.
ఈ యుగంలో మనకు ముగ్గురు గొప్ప అహింసా మూర్తులు కనబడుతున్నారు. ఒకరు గౌతమబుద్ధుడు, రెండవవారు ఏసుక్రీస్తు. మూడవవారు మహాత్మాగాంధి.
భయంకరమైన అంగుళీమాలుడనే రాక్షసుడు ఎదురుపడినా, నిర్భయంగా నిలిచి తన ప్రశాంత వదనంతో అతడిలో మార్పు తెచ్చిన మహాత్ముడు బుద్ధుడు. అహింసయే పరమ ధర్మమని బోధించిన మహాత్ముడు. తనను రాజభటులు హింసిస్తున్నా - శిలువ వేస్తున్నా ఈ పాపులను రక్షించమని ప్రార్థించిన అహింసామూర్తి ఏసుక్రీస్తు. రాజకీయాలలో శాంతి అహింసలను ప్రవేశపెట్టి, రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యాన్ని ఎదుర్కొని భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిన మహాపురుషుడు గాంధీ మహాత్ముడు.
ఈనాడు ఎక్కడ చూచినా హింసా ప్రవృత్తియే. రాజకీయం అంతా హింసామయం. వినోదాన్నందించే సినిమాలు హింసామయం. ఇప్పుడు టి.వి. లలో ప్రసారమయ్యే సీరియల్స్ అన్నీ కుట్రలు - కుతంత్రాలు - మోసాలు - హింసలతో నిండిపోయాయి. ఇక ఆధ్యాత్మిక ముసుగులో దొంగ బాబాలు, సన్యాసులు, స్వామీజీలు ధనకాంక్షతో హింసాప్రవృత్తిని పెంచి పోషిస్తున్నారు. ఒక బాబాను కోర్టు ఆజ్ఞపై అరెస్టు చేయాలంటే 14000 మంది పోలీసులను, బుల్ డోజర్లను ఉపయోగించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఏ స్థాయికి పోయిందో తెలుస్తుంది. కొందరు స్వామీజీలు ఉపన్యాసాలతో జనాన్ని హింసిస్తారు. కొందరు శిష్యులు గురువులపై చాటుగా నిందలువేస్తూ హింసిస్తారు అంతా హింసామయం. హింస ఏ రంగానికీ అతీతం కాకుండా పోయింది.
దైవానికి దగ్గర కావాలంటే అహింసా మార్గంలో ప్రయాణించాలి. సంపాదించుకున్న పుణ్యఫలం వ్యర్థం కాకుండా ఉండాలంటే అహింసయే పరమధర్మం.
--((***))--
ఈ రోజు మీకు పరిచయం చేస్తున్న ఆయుర్వేద మొక్క...
అక్కలకర్ర (అకారకరభ):
ఈ మొక్క యొక్క వేర్లు,కాండం,పూలు ని మందులుగా వాడుతారు.
1. పార్శ్వపు నొప్పి:
అక్కలకర్రని గంధంగా తీసి లేపము చేసిన పార్శ్వపు నొప్పి, తల నొప్పి తగ్గును.
2. టాన్సిల్స్:
దీని కాషాయము నోటిలో నింపి కొద్దిసేపు పుక్కిలించిన టాన్సిల్స్ వ్యాధులు తగ్గును. బొంగురు గొంతు, గొంతులో ఒరిపిడి మొదలైన ఖంఠ సంబంధ వ్యాధులు తగ్గును.
3. దగ్గు:
దీని కషాయము ను 30 మి. లీ. మోతాదులో త్రాగుచున్నా పురాణ దగ్గులు తగ్గును.
4. పక్షవాతం:
దీని చూర్ణమును ఆవనూనెలో కానీ నువ్వుల నూనెలో కానీ కలిపి మర్దన చేయుచున్న పక్షావతము నందు హితకారి.
5. కామోద్దీపనం:
అక్కలకర్ర,అశ్వగంధ,సఫీద్ ముసలి సమానంగా పొడి చేసి ఉదయం సాయంత్రం 1స్పూన్ మోతాదు పాలతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
6. సాయటికా:
వేళ్ళ చూర్ణాన్ని అఖ్రొట్ తైలం తో కలిపి మర్ధనం చేస్తే సాయటికా నొప్పి తగ్గుతుంది.
7. మందబుద్ది:
అక్కలకర్ర, బ్రహ్మీ సమానంగా కలిపిన చూర్ణాన్ని 1/2 స్పూన్ మోతాదులో ప్రతిరోజు తీసుకుంటే బుద్ది తీవ్రము అవుతుంది.
8. నత్తి:
వేరు చూర్ణాని కి మిరియాల పొడి,తేనె కలిపి నాలుకపై రుద్దుచున్న మాటలు స్పష్టంగా వస్తాయి.
9. ఎక్కిళ్ళు:
10గ్రా చూర్ణానికి తేనె కలిపి నాకిన తక్షణమే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.
10.పుప్పి పంటి:
దీనిని నీటి తో నూరి పెట్టినను లేదా చూర్ణమును పుప్పి పంటి పై అంటించిన మంచి ఫలితం ఉండును.
ముఖ్య గమనిక: ఈ విలువైన సమాచారాన్ని అందరికి షేర్ చేయడం వల్ల పదిమందికి ఉపయోగపడుతుంది. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కూడా తెలుపగలరు.
మీ సమస్య ఎలాంటిదైన ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. మా సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడుతాయి. మా సిబ్బంది మీకు సేవలు అందించుటకు 24×7 అందుబాటులో ఉంటారు.
మా ఫోన్ నెంబర్ : 6304579630
మా వాట్సాప్ నెంబర్ : 9705569901
మా మెయిల్: ayurvedaamrutham123@gmail.com
సముద్ర అలలు ఎగుడు దిగుడు వలే
ఆవర్తన రూపమున జరుగుతుంటాయి !
అలల వలే అందరి జీవితములలో
సుఖ దు:ఖాలు వెంబడిస్తూ తుంటాయి !
నిరంతరం నదీ ప్రవాహము సుడులు
తిరుగుతూ సముద్రంలో చేరుతుంటాయి !
మనశరీరములోని ప్రతి భాగము
క్షణ క్షణం ఆరోగ్యంలో మారుతుంటాయి !
చెట్లు ప్రకృతి అనుసరించి ఆకులు రాల్చి,
మరల ఆకులు చిగురిస్తుంటాయి !
మన శరీరములో భాగాలకు అనారోగ్యముతో
శాంతి అశాంతి ల మధ్య నలుగుతుంటాయి !
మెట్టు మెట్టు కాలు మార్చి పైకి ఎక్కి
నెమ్మదిగా పైమెట్టు వరకు చేరటమోయి !
ఇల్లాలు, పిల్లల కోరికలు తీర్చికుంటూ
సంసార నావను నడిపించటమోయి !
సైకిలు ఓపికున్నంతవరకు తొక్కుకుంటూ
ముందుగా గమ్యం చేరాలోయి !
ఎట్టి పరిస్థితిలో ఎవ్వరూ కూడ ఆధేర్య
పడకుండా, ధర్మమార్గమున నడవాలోయి !
సముద్రములో సుడిగుండాలు ఏర్పడి
ప్రతి వస్తువును తనలోకి లాకుందోయి !
వ్యసనము అనే కొత్త అలవాట్లు నేర్చుకొని
కొందరి మనస్సును భాదపెడుతుంటారోయి !
భూమిలో బంగారం ఖనిజాలు ప్రయత్నము
మీద కొందరి దొరుకు తుంటాయి !
ఒక్కోసారి కష్టపడి కష్టమునకు ఫలితం ,
అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తుందోయి !
మనుష్యులకు ఎప్పుడు ఉండకూడదు
నిరంతరం మానసిక వ్యధలోయి !
మానసిక వ్యధవలన కుటుంబలో
ఉన్న అందరికి కలుగును భాదలోయి !
భాద వలన కుటుంబములో ఎ పని
చెయ్యలేక మానసిక రోదనలోయి !
ఇది ఒక జివితచక్రం అని తలచి
ఓర్పుతో, వినయంతో బ్రమించాలోయి !
--((***))--
గురు పౌర్ణమి సందర్భముగా ప్రాంజలి ప్రభ శుభాకాంక్షలు తెలియ పరుస్తున్నది
సేకరణ మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
ఇవి మీకు తెలుసా ?
తెలియక పోయిన ఒక్కసారి చదవండి చదవమని చెప్పండి
🌹 అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
🌹కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
🌹నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
🌹గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
🌹అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.
🌹జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.
🌹 బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.
🌹 సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
🌹మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.
🌹బీట్ రూట్.. బీపీని క్రమబద్దీకరిస్తుంది.
🌹 మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
🌹 దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.
🌹ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.
🌹 అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.
🌹 కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.
🌹 మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.
🌹ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.
🌹 బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.
🌹 క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
🌹మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.
🌹ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.
🌹 అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.
🌹 పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.
🌹సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.
🌹 దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.
🌹ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.
🌹 చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
🌹కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.
🌹 క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.
🌹యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.
🌹వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.
🌹 పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.
🌹 ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.
🌹 ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
🌹ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.
🌹జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
🌹ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.
🌹నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
🌹మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.
🌹మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.
యూజ్ ఫుల్ ఇన్ఫర్ మేషన్ కాబట్టి దీనిని మిగతావారికీ కూడ షేర్ చేయండి
ఈ రోజు మీకు పరిచయం చేస్తున్న ఆయుర్వేద మొక్క...
అక్కలకర్ర (అకారకరభ):
ఈ మొక్క యొక్క వేర్లు,కాండం,పూలు ని మందులుగా వాడుతారు.
1. పార్శ్వపు నొప్పి:
అక్కలకర్రని గంధంగా తీసి లేపము చేసిన పార్శ్వపు నొప్పి, తల నొప్పి తగ్గును.
2. టాన్సిల్స్:
దీని కాషాయము నోటిలో నింపి కొద్దిసేపు పుక్కిలించిన టాన్సిల్స్ వ్యాధులు తగ్గును. బొంగురు గొంతు, గొంతులో ఒరిపిడి మొదలైన ఖంఠ సంబంధ వ్యాధులు తగ్గును.
3. దగ్గు:
దీని కషాయము ను 30 మి. లీ. మోతాదులో త్రాగుచున్నా పురాణ దగ్గులు తగ్గును.
4. పక్షవాతం:
దీని చూర్ణమును ఆవనూనెలో కానీ నువ్వుల నూనెలో కానీ కలిపి మర్దన చేయుచున్న పక్షావతము నందు హితకారి.
5. కామోద్దీపనం:
అక్కలకర్ర,అశ్వగంధ,సఫీద్ ముసలి సమానంగా పొడి చేసి ఉదయం సాయంత్రం 1స్పూన్ మోతాదు పాలతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
6. సాయటికా:
వేళ్ళ చూర్ణాన్ని అఖ్రొట్ తైలం తో కలిపి మర్ధనం చేస్తే సాయటికా నొప్పి తగ్గుతుంది.
7. మందబుద్ది:
అక్కలకర్ర, బ్రహ్మీ సమానంగా కలిపిన చూర్ణాన్ని 1/2 స్పూన్ మోతాదులో ప్రతిరోజు తీసుకుంటే బుద్ది తీవ్రము అవుతుంది.
8. నత్తి:
వేరు చూర్ణాని కి మిరియాల పొడి,తేనె కలిపి నాలుకపై రుద్దుచున్న మాటలు స్పష్టంగా వస్తాయి.
9. ఎక్కిళ్ళు:
10గ్రా చూర్ణానికి తేనె కలిపి నాకిన తక్షణమే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.
10.పుప్పి పంటి:
దీనిని నీటి తో నూరి పెట్టినను లేదా చూర్ణమును పుప్పి పంటి పై అంటించిన మంచి ఫలితం ఉండును.
ముఖ్య గమనిక: ఈ విలువైన సమాచారాన్ని అందరికి షేర్ చేయడం వల్ల పదిమందికి ఉపయోగపడుతుంది. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కూడా తెలుపగలరు.
మీ సమస్య ఎలాంటిదైన ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. మా సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడుతాయి. మా సిబ్బంది మీకు సేవలు అందించుటకు 24×7 అందుబాటులో ఉంటారు.
మా ఫోన్ నెంబర్ : 6304579630
మా వాట్సాప్ నెంబర్ : 9705569901
మా మెయిల్: ayurvedaamrutham123@gmail.com
ఓటమే గెలుపు ::\
కుంతలదేశ రాజు రాజేంద్రుడు ఏటా సైనికుల్ని ఎంపిక చేయడానికి కష్టమైన పోటీలు పెట్టి అందులో ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చి సైన్యంలో చేర్చుకునేవాడు. ఒక్కోసారి ఒక్కో కొత్తరకం పోటీ పెట్టి యువకుల్ని పరీక్షించేవాడు. ఈసారి కూడా విభిన్నంగా ఓ పోటీ పెట్టాలనుకున్నాడు. రాజుగారు ఎలాంటి పద్ధతిలో ఎంపిక చేస్తారోననే ఆసక్తితో ప్రజలు కూడా తండోపతండాలుగా వచ్చారు.
రాజు ఎంపిక స్థలానికి రాగానే నలభై మంది ఓ పెద్ద రాతిబండను మోసుకుంటూ వచ్చి మైదానంలో ఉంచారు. రాజు యువకులకేసి చూసి ‘మీలో ఎవరు ఈ బండను ఎత్తగలుగుతారో వారే విజేతలు’ అన్నాడు.
అందరూ ఆశ్చర్యపోయారు. కళ్లముందు ఎంతోమంది మోసుకొచ్చిన బండను ఎవరు మాత్రం ఒక్కరిగా ఎత్తగలరు? ఇదేం పరీక్ష? అనుకున్నారు. యువకుల్లో కొందరు అసలు ముందుకు రానేలేదు. కొందరు మాత్రం వచ్చి ఆ బండను ఎత్తడానికి ప్రయత్నించి నవ్వులపాలయ్యారు. ఎవరూ ఆ బండను కదపలేకపోయారు.
ఎవరూ గెలవకపోవడంతో ఈసారి సైనికుల ఎంపిక రద్దవుతుందనే అనుకున్నారు అక్కడున్నవారంతా. రాజు నిర్ణయం ఏంటో తెలుసుకోవడానికి ఎదురుచూడసాగారు.
ఇంతలో ‘ఆ బండను ఎత్తడానికి ప్రయత్నించిన యువకులందర్నీ సైన్యంలో చేర్చుకుంటున్నా’ అని రాజు ప్రకటించాడు.
ఎవరికీ సాధ్యంకాని పరీక్ష పెట్టి చివరికి ఓడినవారినే ఎంపిక చేసుకోవడం విచిత్రంగా ఉందే అని గుసగుసలాడుకున్నారు.
ఎంపిక కాని యువకుల్లో ఒకరు ముందుకు వచ్చి ‘మహారాజా! ఇలా అడుగుతున్నందుకు మన్నించండి. మీరు పెట్టిన పోటీ ప్రకారం ఆ బండను ఎత్తలేని వారిని సైన్యంలో చేర్చుకోవడం న్యాయమేనా?’ అన్నాడు.
రాజు చిరునవ్వు నవ్వి.. ‘బండను ఎత్తలేమన్నది అందరికీ తెలిసిందే. అందుకే కొందరు అసలు ముందుకే రాలేదు. ఓటమిని ఎదుర్కోవడానికి భయపడ్డారు. కొందరు యువకులు మాత్రం పోటీ నియమం ప్రకారం తమ వంతు ప్రయత్నం చేశారు. ఓడిపోతామని తెలిసినా ఓటమి పట్ల భయాన్ని లక్ష్యపెట్టని వారి గుణమే వారిని విజేతలను చేసింది. రాజాజ్ఞ ప్రకారం అవసరమైనప్పుడు రాజ్య రక్షణ కోసం ముందుకు రాగలిగే ఇలాంటి యువకులే కదా సైన్యానికి కావాలి.’ అన్నాడు.
ప్రజలంతా ఆనందంతో చప్పట్లు కొట్టారు.
--((***))--
న్యాయం:
అవ్వ వడలు చేయడానికి అన్నీ సిద్ధం చేసుకొని పొయ్యి వెలిగించబోయింది. కర్రలు తడిగా ఉండటం వల్ల వెలగలేదు. పొయ్యి వెలిగించడానికి అవ్వపడుతున్న కష్టాన్ని చెట్టుమీదున్న కాకి
చూసింది.
వెంటనే చుట్టు పక్కలున్న ఎండు పుల్లలను, ఆకులను తీసుకొని వచ్చి అవ్వ ముందుంచసాగింది. అలా కొంతసేపటికి అవ్వకు కావలసిన పుల్లలు ఆకులు పోగవ్వడంతో వాటిని ఉపయోగించి పొయ్యి వెలిగించింది.
అవ్వ వడలు తయారు చేయడం ప్రారంభించింది. మొదటి వడను ప్రేమతో కాకికి ఇచ్చింది. కాకి ఆ వడను తీసుకొని సంతోషంతో చెట్టుపైన కూర్చుంది.
ఇంతలోఎక్కడి నుంచో ఒక జిత్తుల మారి నక్క వచ్చి చెట్టు పైనున్న కాకిని చూసింది. కాకి నోట్లో ఉన్న వడను చూడగానే ముందులాగా కాకిని పొగుడుతూ ఒక పాట పాడమని చెబితే, ఆ అమాయకపు కాకి పాడటం కోసం నోరు తెరవగానే కింద పడిన వడను తినాలని నిర్ణయించుకుంది.
'కాకి బావా....' అంటూ చెప్పబోతుండగా, 'ఏరు నక్కా ఇలారా' అంటూ అవ్వ పిలిచింది.
'ఈవేళ బయలుదేరుతున్నప్పుడు వేరొక నక్క తోక తొక్కి వచ్చి వుంటాను. నాకు వడలు ఇవ్వడానికి అవ్వ పిలుస్తోంది అని మురిసిపోతూ అవ్వ వైపు వెళ్లి నిలబడింది.'పోయిన సారి నీవు ఆ కాకికి మాయ మాటలు చెప్పి వడను కిందపడేలా చేసినా నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నేను కష్టపడి చేసిన వడను ఆ కాకి దొంగిలించి తీసుకెళ్లింది. ఈ రోజు వడలు చెయ్యడంలో నాకన్నా ఆ కాకి ఎక్కువగా శ్రమించింది. ఆ కాకి శ్రమకు విలువ కట్టలేకపోయినా ఒక వడను సంతోషంతో ఇచ్చాను. ఆ అమాయకపు కాకి కష్టాన్ని నీవు దోచుకోవడం నేను సహించను. ఆ కాకితో మరొక్క మాట మాట్లాడటానికి ప్రయత్నించావంటే ఈ మండుతున్న కర్రతో నీ నడుము విరగ్గొడతాను. కష్టపడి పని చేసే వారికి న్యాయం జరగాలి 'అంటూ కోపంతో మండుతున్న కర్రను చేతితో తీసుకొని చూపించగానే, జిత్తుల మారి నక్క తుర్రుమని పారిపోయింది.
--((***))--
సౌజన్యం: ప్రజాశక్తిలో ప్రచురితమైన ఓట్ర ప్రకాష్‌రావు గారి రచన.
యండమూరి వీరేంద్రనాధ్ గారి చెప్పిన అద్భుతమైన పాఠాలు ......🙏🙏
నా మిత్రుడి బంధువు ఒకాయనకి ఒకడే కొడుకు. వాడికీ ఒకడే కొడుకు. అమెరికాలో శాశ్వతంగా సెటిలై అక్కడే కోట్లు సంపాదిస్తున్నాడు. అక్కడి నుంచి వాడు పంపే డబ్బుతో ఇక్కడ ఇతడు భూములు కొంటూ ఉంటాడు. భార్య మరణించింది. ఇండియాలో ఒక్కడే ఉంటాడు. డెబ్భై ఏళ్ళు. ఒక రోజు రాత్రి తమ ఎకరం భూమిని ఎవరో పొలిటీషియన్ తాలుకు మనుష్యులు ఆక్రమించుకున్నారని తెలిసింది. ఆ రాత్రి గుండెపోటు వచ్చి ఆస్పత్రి పాలయ్యాడు. పాతిక లక్షలు ఖర్చు. ఆ పైన ఆర్నెల్లకి మరణించాడు. తండ్రికి గుండె జబ్బు వచ్చి మరణించినప్పుడు మాత్రం కొడుకు విదేశాల్నుంచి వచ్చి ఓ నాలుగు రోజులు వెళ్ళాడు.
ఈ సందర్భంగా బుద్ధుడి కథ ఒకటి చెపుతాను. ఒక ఇల్లు తగలబడి పోతోంది. జనం చుట్టూ చేరి చూస్తున్నారు. యజమాని దూరoగా నిల్చుని రోదిస్తున్నాడు. ఎంతో అందమైన ఇల్లు. పది రోజుల క్రితం ఎవరో రెట్టింపు ధర ఇస్తామన్నా అమ్మలేదు. అందుకే దుఃఖం. ఇంతలో పెద్ద కొడుకు వచ్చాడు. "నీకు తెలీదా నాన్నా? మూడు రెట్లు ధర వస్తే, ఇల్లు నిన్నే అమ్మేసాను. నీకు చెప్పేటంత సమయం లేక పోయింది" అన్నాడు. చేత్తో తీసేసినట్టు ఒక్క సారిగా వేదన పోయింది. గుండెల్నిండా సంతోషంగా గాలి పీల్చుకున్నాడు. ఆ తరువాత తనూ ఒకడిగా మంటల్ని చూస్తూ పక్క వారి సంభాషణలో పాలు పంచుకొనసాగాడు…!
అదే ఇల్లు. అవే మంటలు. క్షణం క్రితం వరకూ ఉన్న అటాచ్‌మెంట్ పోయింది. ఇప్పుడు నిజం చెప్పాలంటే, కా... స్త ఆనందిస్తున్నాడు కూడా. ఇంతలో రెండో కొడుకు వచ్చాడు. "నువ్వు సంతకం పెట్టకుండా అమ్మకం ఎలా పూర్తి అవుతుంది నాన్నా. ఆమాత్రం తెలీదా?" అన్నాడు. అంతే. తిరిగి దుఃఖం చుట్టు ముట్టింది. ఈ లోపులో మూడో కొడుకు వచ్చి, "మాట మీద నిలబడే నిజాయితీ గల మనిషి ఆయన. మాటతోనే అమ్మకం జరిగిపోయిందన్నాడు. సగం డబ్బు చెల్లించేశాడు కూడా" అన్నాడు. తిరిగి సంతోషం పెనవేసుకుంది.
‘ఇది నాది’ అనుకున్నప్పుడు దుఃఖం వస్తోంది. కాదనుకున్నప్పుడు పోతోంది. నిజానికి ఏమీ మారలేదు. ఇదే బుద్ధుడు చెప్పిన నిర్వికార నిర్వాణ యోగం. అప్పుడు దుఃఖం మిమ్మల్ని వదిలేస్తున్నందుకు దుఃఖిస్తుంది.
తాపత్రయ విమోచనం గురించి మరో కథ. అయిదేళ్ళ వయసులో ఒక కుర్రవాడు హిమాలయ పర్వత శిఖరాగ్రాల మీద ఉండే బౌద్ధారామాలకి విద్యాభ్యాసం కోసం పంపబడ్డాడు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా సంవత్సరాల తరబడి సిద్ధాంత మూలసార జ్ఞానాన్ని సముపార్జించుకున్న తరువాత, ఆ జ్ఞానాన్ని ప్రజలకు పంచమన్న గురువు ఆదేశంతో, ఆ భిక్షువు పర్వతశ్రేణుల మధ్య నుంచి దిగి మొట్ట మొదటిసారి నాగరిక ప్రపంచంలో అడుగుపెట్టాడు. అప్పటి వరకూ ఆశ్రమం దాటి బయటకురాని ఆ పద్దెనిమిదేళ్ళ యువకుడికి అంతా కొత్తగా ఉంది. బౌద్ధసాధువులకు సాంప్రదాయకమైన భిక్షాటన నాశ్రయించి, ఒక ఇంటి ముందు నిలబడి మధుకరము అర్థించాడు. ఇంటి యజమాని యువ సాధువు కాళ్ళు కడిగి సగౌరవంగా లోపలికి ఆహ్వానిoచి, భిక్ష వేయమని కూతుర్ని ఆదేశించాడు. ఒక పదహారేళ్ళమ్మాయి లోపల్నుంచి ఏడు రోజులకి సరిపడా బియ్యాన్ని తీసుకొచ్చి అతడి జోలెలో నింపింది. ఆమెని చూసి యువకుడు చకితుడయ్యాడు. అప్పటివరకూ పురుషులనే తప్ప ‘స్త్రీ’ని చూడలేదతడు. ఆమె గుండెల కేసి చూపించి తామిద్దరి మధ్య తేడా గురించి గృహస్థుని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి తండ్రికి కోపం రాలేదు. ఎదుట ఉన్నది మనుష్యుల మధ్యకి తొలిసారి వచ్చిన సన్యాసి అని తెలుసు. స్త్రీ పురుషుల తేడా గురించి చెపుతూ, ‘...వివాహం జరిగి తల్లి అయిన తరువాత పాలు ఇచ్చి పిల్లల్ని పోషించవలసిన బాధ్యత స్త్రీకి ఉన్నది కాబట్టి ప్రకృతి ఆమెకు ఆ విధమైన అవయవాలను సమకూర్చింది’ అని వివరణ ఇచ్చాడు.
సుదీర్ఘమైన ఆలోచనలో పడిన యువకుడు, ఆ రోజుకు సరిపడా బియ్యం మాత్రం ఉంచుకొని, మిగతా ఆరు రోజుల దినుసులు వెనక్కి ఇచ్చి తిరిగి తన గురువు దగ్గరకు చేరుకున్నాడు. ‘అలా ఎందుకు చేశావ’ని అడిగాడు గురువు.
“తర్వాతెప్పుడో దశాబ్ద కాలం తరువాత ప్రపంచంలోకి అడుగిడబోయే బిడ్డ కోసం తగు ఏర్పాట్లన్నీ ప్రకృతి ముందే సమకూర్చినప్పుడు, రేపటి ఆహారం గురించి ఈ రోజు తాపత్రయపడటం ఎంత నిష్ప్రయోజనమో నాకు అర్థమయింది స్వామీ..!” అన్నాడా భిక్షువు.
“బౌద్ధం గురించీ, బంధం గురించీ సంపూర్ణమయిన జ్ఞానం నీకు లభించింది నాయనా" అంటూ శిష్యుణ్ణి కౌగిలించుకొని అభినందించాడు ఆచార్యుడు.
ఆపదసమయం:
ఒక అడవిలో ఒక కుందేలు దట్టమైన పొదల్లో నివాసముండేది. దానికి ఆ పొద మంచి రక్షణ కల్పిస్తుంది. ఒక రోజు ఒక తోడేలు ఆహారం వెతుక్కుంటూ కుందేలు పొద దగ్గరకు వచ్చింది. ఆ సమయంలో కుందేలు పొద నుంచి బయటకు వచ్చి కంద దుంపలు తింటూ ఉంది. కుందేలును చూడగానే తోడేలుకు నోరూరింది. దాని ఆకలి రెట్టింపైంది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ నడవసాగింది తోడేలు. అలా నడుస్తూ అది ఒక ఎండుటాకు మీద కాలు వేసింది.
ఆ ఆకు శబ్దానికి కుందేలు ఉలిక్కిపడింది. వెనక్కు తిరిగి చూస్తే మృత్యువు రూపంలో దానికి తోడేలు కనిపించింది. కుందేలుకు గుండెలు అవిసిపోయినట్లు అనిపించింది.
‘దేవుడా! ఇప్పుడెలా?’ అనుకుంది కుందేలు. అయినా అధైర్యపడకుండా ఆలోచించింది. దాని బుర్రకి ఒక చక్కటి ఆలోచన తట్టింది. వెంటనే తోడేలును చూస్తూ ‘నీకెంత ధైర్యం?’ అంది కుందేలు.
తోడేలుకు కోపం వచ్చింది. ఆకలి సంగతి మర్చిపోయింది. ఒక అల్పప్రాణి తనను ధిక్కరించడమా! అది దానికి తలవంపుగా తోచింది. కోపంతో ముందుకు దూకి ‘ఏం? నన్ను చూస్తే నీకెలా ఉంది? నీ ప్రాణం చిటికెలో తియ్యగలను. నీలాంటి అల్ప ప్రాణులు నన్ను చూసి భయపడతాయి. అలాంటి నువ్వు నన్నే హెచ్చరిస్తావా?’ అంటూ మండిపడింది తోడేలు.
‘అయ్యో అదేం లేదు తోడేలు మామా! మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. నీకెంత ధైర్యం అంటే నా ఉద్దేశం అది కాదు. నువ్వు చాలా ధైర్యవంతుడవని’ అంటూ సంజాయిషీ ఇచ్చింది కుందేలు.
‘ఇప్పుడు నా ధైర్యం ప్రసక్తి దేనికి నీకు?’ చిరాగ్గా అడిగింది తోడేలు.
‘అదేంటి తోడేలు మామా! నీకు విషయం తెలిసి కూడా ఇంత ధైర్యంగా బయట తిరుగుతున్నావంటే మరి నీ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఎలా ఉండేది’ అంది కుందేలు.
‘విషయమా! ఏంటది?’ ఆశ్చర్యంగా అడిగింది తోడేలు.
‘నీకు తెలియదా? నేను తెలుసనుకున్నానే! అయితే విను. కొద్దిసేపటి క్రితం సింహరాజు రెండు చిరుత పులులకు వేట పందెం పెట్టాడట. పొద్దు పోయే సమయానికి ఎవరెక్కువ జంతువులను వేటాడుతారో వాళ్లని తన కొలువులో సైన్యాధిపతిని చేస్తాడట. ఆ విషయం తెలిసి పెద్ద జంతువులతో పాటు చిన్నాచితకా జంతువులంతా ఊపిరి శబ్దం కూడా వినిపించకుండా ఎక్కడివాళ్లం అక్కడ నక్కి కూర్చున్నాం. వాళ్లు ఎప్పుడు ఎటు వస్తారో ఎవరికీ తెలియదు. ఆ పొదల్లో గాలి ఆడకా ఏదో ఊపిరి పీల్చుకుందామని నేనిలా ఇప్పుడే బయటికొచ్చాను అంతే’ అంది కుందేలు.
ఆ మాట వినడంతోనే తోడేలు గుండె ఝల్లుమంది. పైకి మేకపోతు గాంభీర్యం నటిస్తూ...
‘ఓహో ఆ విషయమా! నాకు తెలుసల్లుడూ. నువ్వు అలా బయట కనిపించే సరికి నీకు ఆ విషయం తెలియదేమో చెబుదామని ఇలా వచ్చానంతే. నువ్వన్నట్లు నాకు కాస్త ధైర్యం ఎక్కువేలే. నువ్వు పొదల్లోకి వెళ్లి దాక్కో అసలే అల్ప ప్రాణివి.’ అంది తోడేలు.
‘హమ్మయ్య’ అనుకుంటూ పొదల్లోకి వెళ్లిపోయింది కుందేలు. తోడేలు అటూ ఇటూ చూసి బ్రతుకు జీవుడా అనుకుంటూ తోక ముడుచుకొని మెల్లగా జారుకుంది.
ఈనాడు లో ప్రచురితమైన బి.మాన్‌సింగ్ నాయక్ గారి కథ
గురు పౌర్ణిమి విశిష్టత
ఏకరాశిగా ఉన్న వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించి వ్యాసుడు వేదవ్యాసుడిగా పేరొందారు. అష్టాదశ పురాణాలను, 18 ఉప పురాణాలను, విజ్ఞాన సర్వస్వమైన మహాభారతాన్ని, బ్రహ్మసూత్రాలను, భక్తి, జ్ఞాన మార్గాలను ఉపదేశించే భాగవతాన్ని అందించారు. ప్రాపంచిక, ఆధ్యాత్మిక జీవన విధానాలను సమన్వయం చేసుకోవడంలోనే మానన జీవిత వికాసం ఉందని వ్యాసుడు బోధించారు. ‘వ్యాసాయ విష్ణు రూపాయ..’ అని పేరొంది గురుపరంపరలో ప్రముఖుడిగా కీర్తిగడించారు. సప్త చిరంజీవులలో ఈయన కూడా ఒకరు. ఈయన జన్మించిన ఆషాఢ శుద్ధ పౌర్ణమినే ‘వ్యాస పౌర్ణమి’గా ‘గురుపౌర్ణమి’గా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది.
గురుకుల సంప్రదాయంలో గురుపౌర్ణమికి విశేష ప్రాధాన్యం ఉంది. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువును దైవంగా భావిస్తూ వ్యాసపౌర్ణమి రోజున వారికి పూజలు నిర్వహించేవారు. భక్తి మార్గంలో నేటికీ ఈ విధానం కొనసాగుతోంది. ఆధ్యాత్మిక గురువులను, మంత్రోపదేశం గావించిన పెద్దలను గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేకంగా సత్కరించి గురువుపై తమ భక్తిప్రపత్తిలను చాటుకుంటారు.
గు అంటే చీకటి, రు అంటే తొలగించువాడని అర్థం. అంటే గురు శబ్దానికి అంధకారం తొలగించువాడని అర్థం ఉంది. ఇందులో సార్థక్యం ఏమిటి? శిష్యుని ఆత్మవస్తువు గురువులో ఉన్నదానికి భిన్నమైనది కాదు. కాని శిష్యునిలోని అజ్ఞానం, కర్మఫల సంస్కారాలతో ఆచరించి ఉండటం వల్ల అతనికి ఆత్మతేజోదర్శనం జరగదు. జ్ఞానోపదేశం, సాధన, మార్గదర్శకత్వం, అందుకు కావాల్సిన సహాయమును అందించేవాడే గురువు. ఈ క్రియల్లో సమర్ధుడైన గురువు ఆత్మను ఆవరించిన, మనోబుద్ధులను ఆవరించిన అంధకారాన్ని తొలగించి గురువు అనే శబ్దానికి అర్హుడు అవుతున్నాడు. ఇందుకు శిష్యుని స్వయం కృషి, సహకారం, నిగ్రహం, ధర్మ ప్రవర్తన తోడైతే ఆ గురుశిష్యుల వల్ల సమాజానికి మేలు కలుగుతుంది.
ఓం శ్రీ గురుభ్యో నమః
గురుపౌర్ణమి సందర్భముగా -నేటి కవిత
ఒక్కసారి చదవండి జీవిత చక్రం సముద్ర అలలు ఎగుడు దిగుడు వలే
ఆవర్తన రూపమున జరుగుతుంటాయి !
అలల వలే అందరి జీవితములలో
సుఖ దు:ఖాలు వెంబడిస్తూ తుంటాయి !
నిరంతరం నదీ ప్రవాహము సుడులు
తిరుగుతూ సముద్రంలో చేరుతుంటాయి !
మనశరీరములోని ప్రతి భాగము
క్షణ క్షణం ఆరోగ్యంలో మారుతుంటాయి !
చెట్లు ప్రకృతి అనుసరించి ఆకులు రాల్చి,
మరల ఆకులు చిగురిస్తుంటాయి !
మన శరీరములో భాగాలకు అనారోగ్యముతో
శాంతి అశాంతి ల మధ్య నలుగుతుంటాయి !
మెట్టు మెట్టు కాలు మార్చి పైకి ఎక్కి
నెమ్మదిగా పైమెట్టు వరకు చేరటమోయి !
ఇల్లాలు, పిల్లల కోరికలు తీర్చికుంటూ
సంసార నావను నడిపించటమోయి !
సైకిలు ఓపికున్నంతవరకు తొక్కుకుంటూ
ముందుగా గమ్యం చేరాలోయి !
ఎట్టి పరిస్థితిలో ఎవ్వరూ కూడ ఆధేర్య
పడకుండా, ధర్మమార్గమున నడవాలోయి !
సముద్రములో సుడిగుండాలు ఏర్పడి
ప్రతి వస్తువును తనలోకి లాకుందోయి !
వ్యసనము అనే కొత్త అలవాట్లు నేర్చుకొని
కొందరి మనస్సును భాదపెడుతుంటారోయి !
భూమిలో బంగారం ఖనిజాలు ప్రయత్నము
మీద కొందరి దొరుకు తుంటాయి !
ఒక్కోసారి కష్టపడి కష్టమునకు ఫలితం ,
అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తుందోయి !
మనుష్యులకు ఎప్పుడు ఉండకూడదు
నిరంతరం మానసిక వ్యధలోయి !
మానసిక వ్యధవలన కుటుంబలో
ఉన్న అందరికి కలుగును భాదలోయి !
భాద వలన కుటుంబములో ఎ పని
చెయ్యలేక మానసిక రోదనలోయి !
ఇది ఒక జివితచక్రం అని తలచి
ఓర్పుతో, వినయంతో బ్రమించాలోయి !
--((***))--
గురు పౌర్ణమి సందర్భముగా ప్రాంజలి ప్రభ శుభాకాంక్షలు తెలియ పరుస్తున్నది
సేకరణ మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
ఇవి మీకు తెలుసా ?
తెలియక పోయిన ఒక్కసారి చదవండి చదవమని చెప్పండి
🌹 అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
🌹కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
🌹నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
🌹గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
🌹అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.
🌹జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.
🌹 బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.
🌹 సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
🌹మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.
🌹బీట్ రూట్.. బీపీని క్రమబద్దీకరిస్తుంది.
🌹 మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
🌹 దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.
🌹ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.
🌹 అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.
🌹 కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.
🌹 మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.
🌹ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.
🌹 బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.
🌹 క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
🌹మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.
🌹ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.
🌹 అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.
🌹 పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.
🌹సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.
🌹 దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.
🌹ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.
🌹 చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
🌹కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.
🌹 క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.
🌹యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.
🌹వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.
🌹 పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.
🌹 ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.
🌹 ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
🌹ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.
🌹జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
🌹ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.
🌹నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
🌹మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.
🌹మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.
యూజ్ ఫుల్ ఇన్ఫర్ మేషన్ కాబట్టి దీనిని మిగతావారికీ కూడ షేర్ చేయండి
--((**))--
ఒకరోజు పశు వధ శాలలో ఒకడు గోవును చంపడానికొచ్చినపుడు.....
గోవు వానిని చూసి నవ్వింది.
దాన్ని చూసి కసాయి అడిగాడు.
నేను నిన్ను చంపడానికి వచ్చాను, అది తెలిసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావ్?
అని అడిగాడు.
.
అప్పుడు గోవు ఇలా చెప్పింది.
.
నేను ఎప్పుడూ మాంసాన్ని తినలేదు.
.
అయినా నా చావు ఇంత ఘోరంగా ఉండబోతోంది.
ఏ తప్పూ చేయక, ఎవరికీ హాని కలిగించని నన్ను, నువ్వు చంపి, నా మాంసాన్ని తినే
నీ చావు ఎంత ఘోరంగా ఉంటుందో అని ఆలోచించి నేను నవ్వాను.
.
పాలిచ్చి మిమ్మల్ని పెంచాను. మీ పిల్లలకూ పాలిస్తున్నాను. కానీ నేను తినేది మాత్రం గడ్డి.
పాలతో వెన్న చేసుకున్నారు.వెన్నతో నెయ్యి చేసుకున్నారు.
నా పేడతో పిడకలు చేసుకుని వంటకు వాడుకున్నారు.
అలాగే నా పేడతో ఎరువు తయారు చేసి పంటలు పండించుకున్నారు.
ఆ డబ్బుతో సుఖంగా జీవిస్తున్నారు. కానీ నాకు మాత్రం కుళ్లిపోయిన కూరలను ఎండి పోయిన గడ్డిని పెట్టారు. నా పేడతో గోబర్ గ్యాస్ తయారు చేసుకుని మీ ఇంటిని చీకటి నుంచి వెలుగులోకి తెచ్చుకున్నారు.
కానీ నన్ను కసాయివాడిలా చంపడానికొచ్చావ్.....
నా పాలనుంచి వచ్చిన శక్తితోనే నన్ను చంపడానికి ఆయుధాన్ని ఎత్తగలిగావ్.
ఆ ఆయుధాన్ని ఎత్తే శక్తి నీకు వచ్చింది నా నుంచే.
నా వల్ల బాగా సంపాదించి ఇల్లు కట్టుకున్నావ్.
కానీ నన్ను మాత్రం ఒక గుడిసెలో ఉంచావ్.
నిన్ను కన్న తల్లికంటే నేనే నీకు ఎక్కువ ఆసరాగా నిలిచాను.
శ్రీకృష్ణుని ఇష్టురాల్ని నేను.
నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్న నీ గతి ఏమౌను?
నా సంతతిని ,నా జాతిని ఇలా మీరు చంపుతూ పోతూ ఉంటే
మీకు ,మీ ముందు తరాలకు మేము సేవ చేసుకునే భాగ్యం ఉండదేమో
మాకే ... భవిష్యత్తులో ఉనికి లేనప్పుడు ..మీ కెక్కడి మనుగడ,అందుకే
నీ భవిష్యత్తు గురించి ఆలోచించి నేను నవ్వాను. అని చెప్పింది.
🌼🌿శివ మానస పూజ ఎలా చేయాలి?🌼🌿
శివార్చన, లేదా ఏ దేవతార్చనైనా మానవులకు మంచి ఫలితాలనిస్తాయంటారు. అయితే అనేక కారణాలవల్ల అందరికీ ప్రతి రోజూ యధావిధిగా పూజ చేయటం కుదరకపోవచ్చు. వృధ్ధాప్యంవల్ల, అనారోగ్యంవల్ల, ప్రయాణంలో, ఇలా కూర్చుని అభిషేకమూ, అర్చనా చేసే అవకాశం లేక పోయినా, చెయ్యాలనే తపన మాత్రం వున్నవాళ్ళు మరి ఏం చెయ్యాలి? దీనిపై మన ధర్మ గ్రంధాలు ఏం చెబుతున్నాయి?
అసలు భగవంతుని పూజలో మానసిక పూజే విశేషమయినది. మనసులో భగవంతుని నిలుపుకోవటం అలవాటు చేసుకోవటానికి, మనసు నిశ్చలంగా వుండటానికి ప్రత్యక్షంగా విగ్రహాన్ని పూజించాలి. అలా కుదరనప్పుడు, మన మానసిక శక్తిని పరీక్షించుకోవటానికి, భగవంతుణ్ణి మన మనసులో నిలుపుకోవటానికి భగవంతుడు కల్పించిన అవకాశంగా దాన్ని భావించి మానసిక పూజ చేసుకోవాలి. అది ఎలా చెయ్యాలి? భగవంతుడు అక్కడ వున్నాడని భావించి ఆయనకి రత్నసింహాసనం వెయ్యాలి. ఆకాశగంగని తెచ్చి మనసారా అభిషేకించాలి. వివిధ రకాల ఆభరణాలతో అలంకరించాలి.
సుగంధ భరితమైన పూవులతో, మారేడ దళాలతో పూజించాలి. ధూపం, దీపం అన్నీ సమర్పించాలి. షడ్రషోపేతమైన వివిధ భక్ష్యభోజ్యాలను, మధుర ఫలాలను నివేదించాలి. స్వామీ, నేను చేసిన వివిధ సపర్యలు స్వీకరించి నాపై దయచూపమని వేడుకోవాలి. బాహ్యంగా విశేష పూజ చేసే అవకాశం లేనివారు బాధపడకుండా భగవంతుడు అది మనకిచ్చిన అవకాశంగా తీసుకుని భగవంతుని మనసులో నిలుపుకుని పూజించవచ్చు...
🌼🌿 ఓం నమః శివాయః🌼🌿
-((***))__ దారిద్య్రం రాకుండా మగవారు పాటించాల్సిన నియమాలు👇
దేహశుద్ధి కాకుండా సూర్యుడిని చూడరాదు.
ఉదయించే/అస్తమించే సూర్యుడిని చూడరాదు, అర్ఘ్యప్రధానాలు, నమస్కారములు సమర్పించవచ్చు.
సూర్యుడిని నీటిలోగానీ/అద్దంలోగానీ చూడరాదు.
తలకి నూనె రాసుకుని, మలమూత్రాదులకు పోరాదు.
మలమూత్రాదుల అనంతరమే తలకు/దేహానికి నూనె రాసుకుని, తలంటుస్నానము చెయ్యాలి.
మగవారు బుధవాంనాడు తలంటు స్నానం ఐశ్వర్య కారకం.
తుమ్మేటపుడు/ఆవులించేటపుడు/భోజనం చేసేటప్పుడు భార్యవైపు చూడరాదు. భోజనం చేసేటప్పుడు మౌనం వహించాలి తప్ప మాట్లాడరాదు.
మొలత్రాడు లేకుండా మగవాడు వుండరాదు.
నీళ్ళు/పాలు త్రాగే జంతువులను అదిలించరాదు.
--((***))--
*గుడిలో అర్చన చేయించుకుని హారతి ఎందుకు తీసుకుంటాము?*
ఆలయంలో ప్రదక్షిణ చేసి గంట కొట్టి స్వామి వారికి భక్తుడు అర్చన చేయించుకుంటాడు. ఇక్కడ కొంత మంది మన గోత్రనామాలతో పూజ చేయించుకోవాలా? దేవునికి అన్నీ తెలుసు కదా మరల మనం మన గోత్రం, వగైరా చెప్పి పూజ చేయించుకోవాలా అని అడుగుతారు. నిజమే...భగవంతునికి అన్నీ తెలుసు. ఈ గోత్రనామాలు చేపుకోవడం మన ఆర్తి స్వామివారికి ఒక పద్ధతి ప్రకారం చెప్పుకోవడం. అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. అక్కడ వరకు వచ్చి నీకు ఏమి కావాలో చెప్పుకోవడంలో తప్పేమిటి? అయినా అంతటా ఉన్న భగవంతునికి ఇక్కడకొచ్చి నువ్వేమి చెప్పాలి అంటే ఇక్కడ భగవంతుని శక్తి ప్రతిష్టితమై ఉంది. అసలు భగవంతుని ప్రాణప్రతిష్ట గురించి మరొక టపాలో వివరణ ఇతః పూర్వం ఇచ్చాను, తదుపరి టపాలో మరల ఇస్తాను. నీకు దేహభ్రాంతి ఉన్నంత కాలం, నీకు ఆకలిదప్పులు తెలిసినంత కాలం, నేను అనే స్పృహ ఉన్నంతకాలము నువ్వు నీ గురించి ప్రార్ధించాలి. కాబట్టి నీ గోత్రనామాలు చెప్పుకుని నీ పేర పూజ జరిపించుకోవాలి., సహకుటుంబస్య, సహబాంధవస్య అని చెప్పుకుంటే చాలు మొత్తం వంశవృక్షం చదవాల్సిన పని లేదు. దేవాలయంలో అష్టోత్తరమో, శతనామమో, సహస్రమో స్వామి వారికి అర్చన చేయిస్తాము. నవవిధభక్తి మార్గాలలో అర్చన చాలా విశిష్టమైనది. అర్చన మీద మరొక పోస్ట్ పెడతాను.
తీర్ధం ప్రసాదం గురించి ఎన్నో చర్చలు జరిగాయి. స్వామి అభిషేక తీర్థమో లేక తులసి దళాలు, కర్పూరం కలిపిన తీర్థం ఇవ్వడం సాంప్రదాయం. లోపలున్న దేవుని అభిషేక జలం సహజంగా శక్తివంతమైనది, మనలో ఉన్న పాపభారాన్ని దూరం చేసే ఈ తీర్థం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మనల్ని ఆశ్రయించి ఉన్న పాపాలు, చెడు తలంపులు, నెగటివ్ ఎనర్జీ స్వామి తీర్థం తగలగానే తొలగుతాయి. సాంఘికంగా ఆలోచిస్తే తులసి, కర్పూరం కలిపిన తీర్థం మనలో ఉన్న కఫ పిత్త దోషాలను తీరుస్తాయి. అందరికీ ఈ విషయం చెప్పి వారి చేత తప్పక రోజు తాగించడానికి అందరినీ ఆలయ దర్శనం చేసుకుని తీర్థం తీసుకోమని చెప్పారు. అందువలన ఆ వైద్యలక్షణాలున్న తీర్థం వారిలో ఉన్న తాపాలను దూరం చెయ్యడానికి దోహదపడుతుంది. అదే విధంగా ఎన్నో ఆయుర్వేద లక్షణాలున్న తీర్థప్రసాదాలు భక్తులకున్న భౌతిక తాపాలు తీర్చగలవు.
పూర్తి అర్చన అయిన తరువాత దేవునికి హారతి ఇవ్వడం సాంప్రదాయం. ఏక వర్తి హారతి, కుంభ హారతి, నక్షత్ర హారతి, లక్ష్మీ హారతి, కర్పూర హారతి ఇలా ఎన్నో రకాల హారతులు ఇవ్వడం సాంప్రదాయం. ఒకొక్క వర్తితో ఇచ్చే హారతికి ఒకొక్క గొప్పదనం. ఉదాహరణకు రెండు వర్తుల హారతి జీవాత్మ పరమాత్మ సంబంధితం అని చెబుతుంటే, త్రివర్తి హారతి మనకున్న సంచిత, ఆగామి, ప్రారబ్ధ కర్మలను తీర్చేది అని అనుకుంటే, నక్షత్ర హారతి ఏ మనిషైనా పుట్టే ఈ 27 నక్షత్రాల సాక్షిగా నిత్యం ఉన్న పరమాత్మ ఆ విగ్రహంలో ఉన్న దైవం అని చెప్పేది. ఇప్పటి విద్యుద్దీపాల వెలుగు లేని నాటికాలంలో ఈ హారతి ఇచ్చే సమయంలో విగ్రహాన్ని సంపూర్ణంగా దర్శించగలిగే అవకాశం కలిగేది. మరొక వివరణ ప్రకారం స్వామి వారి వైభవానికి కలిగే నరదృష్టి ఈ హారతిచ్చి తీసివేస్తారని చెబుతారు. దీప హారతి ఇవ్వడం అంటే అజ్ఞానతిమిరాంధకారాన్ని అంతం చేసే వెలుగును స్వామి అనుగ్రహంగా స్వామిని చూడడం అని. మనలో ఉన్న వాసనలు, ఇచ్చే హారతి వర్తి మన అహంకారం గా చెబితే అహాన్ని వెలిగించి అక్కడ వచ్చే దీపజ్యోతి లో పరమాత్మ దర్శనం చేసుకుని తరించడానికి ఈ హారతి తతంగం. స్వామికిచ్చిన హారతిని కళ్ళకు అడ్డుకోవడం ద్వారా స్వామి అనుగ్రహానికి నువ్వు పాత్రుడవు అయ్యావని చెప్పడం, ఆయన అనుగ్రహాన్ని గ్రహించడం ఆధ్యాత్మికంగా చెప్పుకుంటే, భౌతికంగా హారతి కర్పూరం కళ్ళకు మంచిది, ఒంటికి మంచిది.
గుడిలో మనం చేసే ప్రతీ విషయం సామాజికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా భక్తుడిని ఉన్నతి వైపు నడిపించేవే.
!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!
--((***))--
*శయన నియమాలు*
పడుకోవాలంటే పాటించే పదహారు సూత్రాలు:
1. *నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో* ఒంటరిగా పడుకోవద్దు.
*దేవాలయం* మరియు *స్మశానవాటికలో* కూడా పడుకోకూడదు.
*(మనుస్మృతి)*
2. పడుకుని ఉన్న వారిని *అకస్మాత్తుగా* నిద్ర లేపకూడదు.
*(విష్ణుస్మృతి)*
3. *విద్యార్థి, నౌకరు, ద్వారపాలకుడు* వీరు అధిక సమయం నిద్రపోతున్నచో, వీరిని మేల్కొలపవచ్చును.
*(చాణక్య నీతి)*
4. ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం *బ్రహ్మా ముహూర్తం* లో నిద్ర లేవాలి.
*(దేవీ భాగవతము)*
పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు.
*(పద్మ పురాణము)*
5. *తడి పాదము* లతో నిద్రించవద్దు.
పొడి పాదాల తో నిద్రించడం వలన లక్ష్మి(ధనం) ప్రాప్తిస్తుంది.
*(అత్రి స్మృతి)*
విరిగిన పడకపై, ఎంగిలి మొహంతో పడుకోవడం నిషేధం.
*(మహాభారతం)*
6. *నగ్నంగా, వివస్త్రలులై* పడుకోకూడదు.
*(గౌతమ ధర్మ సూత్రం)*
7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన *విద్య,* పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన ప్రబల చింత, ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన *హాని, మృత్యువు,* ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించినచో *ధనము, ఆయువు* ప్రాప్తిస్తుంది.
*(ఆచార మయూఖ్)*
8. *పగటిపూట* ఎపుడు కూడా నిద్రించవద్దు.
కానీ *జ్యేష్ఠ మాసం* లో
1 ముహూర్తం(48నిమిషాలు) నిద్రిస్తారు.
(పగటిపూట నిద్ర రోగహేతువు మరియు ఆయుక్షీణత కలుగచేస్తుంది)
9. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు *రోగి* మరియు *దరిద్రులు* అవుతారు.
*(బ్రహ్మా వైవర్తపురాణం)*
10. సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు గంటల) తరువాతనే *పడుకోవాలి*
11. ఎడమవైపు పడుకోవడం వలన *స్వస్థత* లభిస్తుంది.
12. దక్షిణ దిశలో *పాదములు* పెట్టి ఎపుడు నిద్రించకూడదు.
*యముడు* మరియు *దుష్ట గ్రహము* ల నివాసము ఉంటారు.
దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది.
*మెదడుకు రక్త సరఫరా* మందగిస్తుంది. *మతిమరుపు, మృత్యువు* లేదా
*అసంఖ్యాకమైన రోగాలు* చుట్టుముడుతాయి.
13. గుండెపై చేయి వేసుకుని, *చెత్తు యొక్క బీము* కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.
14. పడక మీద *త్రాగడం- తినడం* చేయకూడదు.
15. పడుకొని *పుస్తక పఠనం* చేయడానికి వీల్లేదు. (పడుకొని చదవడం వలన *నేత్ర జ్యోతి* మసకబారుతుంది)
16. నుదుటన బొట్టు లేదా తిలకం ధరించి నిద్రించడం *అశుభం* కావున పడుకొనే ముందు తీసివేయండి.
*ఈ పదహారు నియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి, దీర్ఘాయుష్మంతులు అవుతారు.*
--((***))--
*వైరాగ్యం నాలుగు విధాలు (గరుడ మహా పురాణం)*
1. *ప్రసూతి వైరాగ్యం:*
గర్భస్థ శిశువుకు గర్భములోపడిన ఏడవ మాసంలో, గతజన్మ స్మృతి కలుగుతుంది. ఆ జన్మలో చేసిన పాపములకు చాలా చింతించి, ఇక రాబోయే జన్మలో ఏ పాపములూ చేయకూడని తలంచుతాడు. కానీ, భూమిపై పడగానే, అదంతామరచి మామూలుగా వ్యవహరిస్తారు. ఇదే ప్రసూతి వైరాగ్యం.
2. *వ్యాధి వైరాగ్యం:* ఉదాహరణకు, వ్యాధి లక్షణాలతో వైద్య పరీక్షలు చేయించుకున్న రోజు, ఆహార విహారాది నియములలో ఇకపై ఎంతో జాగ్రత్తగా ఉండాలని, రెండు రోజుల తర్వాత మామూలే. ఇదే వ్యాధి వైరాగ్యం.
3. *పురాణ వైరాగ్యం:*
పురాణ ప్రవచనం వింటున్నప్పుడు, ఇకపై దైవ భక్తితో, అరిషడ్వర్గాలను వదిలి ఎటువంటి పాపములు చేయకుండా వుండాలని నిర్ణయించుకుని, ఆ గంట గడవగానే ??? ఇదే పురాణ వైరాగ్యం.
4. *శ్మశాన వైరాగ్యం:*
చనిపోయిన వారిని దేహంతో శ్మశానానికి వెళ్ళి చితిపై కాలే ఆ దేహాన్ని చూస్తూ, జీవితమంటే ఇంతేకదా అనే నిర్వేదానికి లోనవుతారు. ఇంటికి వచ్చి స్నానమాచరించాక ???
ఇదే శ్మశాన వైరాగ్యం.
ఈ నాలుగే కాక లోకంలో *'శునక వైరాగ్యం'* కూడా చూస్తూంటాం.
కుక్క దాలిలో పడుకుని, ఎవరింటికి వెళ్లి ఇకపై దెబ్బలు తినకూడదు అనుకుంటుంది. లేచాకా, మామూలే.
అలాగే, మనంకూడా. ఉదా. ఒక విద్యార్థికి పరీక్షలో చాలా తక్కువ మార్కులు రాగా, ఇకపై బాగా చదివి రానున్న పరీక్షలో మంచి మార్కులు సాధించాలనుకోవడం,ఆ తరువాత విధానం మనకి తెలుసు.
ఇదే శునక వైరాగ్యం.
శ్రీ మహావిష్ణువు గరుడుని తో, కష్టకాలంలో కలిగిన పరివర్తన నిలుపుకోగలిగితే, మానవుడు నరకానికి పోవలసిన అవసరం ఉండదు కదా వైనతేయా అంటారు.
--((***))--
_*చక్కని సంతానాన్నిచ్చే గరుడ పంచమి*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
కశ్యప ప్రజాపతికి వినత .. కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వినతకి గరుత్మంతుడు జన్మించగా, కద్రువ కడుపున సర్పజాతి జన్మించింది. అందువలన సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి ... 'నాగ పంచమి'గా పిలవబడుతోంది. ఇక ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కనుక, శ్రావణ శుద్ధ పంచమిని 'గరుడ పంచమి' అని కూడా పిలుస్తుంటారు.
శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పజాతి ఆవిర్భవించింది కనుక సర్పభయం లేకుండా వుండటం కోసం ఈ రోజున అంతా నాగపూజ చేస్తుంటారు. అలాగే ' గరుడ పంచమిగా చెప్పుకునే ఈ రోజున, గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తుంటారు. అయితే సోదరులు వున్న స్త్రీలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం వుంది.
సౌభాగ్యంతో పాటు చక్కని సంతానాన్ని ఇచ్చే ఈ వ్రతంలో గౌరీదేవి పూజలు అందుకుంటుంది. విశేషమైనదిగా చెప్పబడుతోన్న ఈ వ్రతాన్ని పది సంవత్సరాల పాటు ఆచరించి, ఆ తరువాత ఉద్యాపన చెప్పుకోవలసి వుంటుంది. సాధారణంగా ఏ తల్లి అయినా తన కొడుకు తాను గర్వించేలా ... లోకం మెచ్చేలా వుండాలని అనుకుంటుంది.
అలా తన తల్లికి దాస్యం నుంచి విముక్తి కలిగించడం కోసం గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత కలశం తీసుకువచ్చాడు. అందుకోసం దేవేంద్రుడితోనే పోరాడాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అభినందనలను అందుకుని ఆయన వాహనంగా ఉండిపోయాడు. అలాంటి ఈ రోజున గరుడ పంచమి వ్రతాన్ని ఆచరించడం వలన, ఆరోగ్యవంతులైన ... ధైర్యవంతులైన సంతానం కలుగుతుందని చెప్పబడుతోంది.
--((***))--
చిన్నకధలు
ఒక పాము చాలా హుషారుగా పాకుతూ,దొర్లుతూ అటువైపుగా వెళ్తోంది.దాని హుషారుతనాన్ని చూసిన ఒక కోతి దాన్ని పట్టుకుంది...ఆ పాము కోతిని కాటు వేయబోయింది...భయంతో కోతి ఆ పాము పడగను గట్టిగా పట్టుకుంది... గట్టిగా అరవసాగింది కోతి.. చుట్టుకున్న మిగతా కోతులన్నీ ఇలా అనుకున్నాయి.
ఇక ఈ కోతి బ్రతకడం కష్టం..కోతి పామును వొదిలితే కచ్చితంగా కాటు వేస్తుంది...మనం దగ్గరికెళితే మనం కూడా పాము కాటుకు బలి కావాల్సిందే...మనం దూరంగానే ఉండటం మంచిది అని వెళ్లిపోయాయి...
తనవాళ్ళంతా తనని రక్షిస్తారేమో అని ఎదురుచూసిన
కోతికి నిరాశే ఎదురయ్యింది...అలాగే భయంతో కూర్చుంది.అటువైపుగా ఒక ముని వెళుతూ కోతి స్థితిని
అర్థం చేసుకుని కోతితో ఇలా అన్నాడు..
' నీ చేతిలోని పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఊపిరి ఆడక చచ్చింది..వదిలేస్తే నిన్ను కాటు వేస్తుందని భయపడి ఇబ్బంది పడుతున్నావు.దాన్ని వదిలేయి" అన్నారు ముని...కోతి ఆ పామును వదిలి ఒక్క గెంతుతో చెట్టు ఎక్కేసింది...ఇందులోని నీతి ఏంటంటే...
నీకు కష్టం వచ్చినప్పుడు దాని గురించే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం నిన్ను వదిలి పోదు...కష్టాన్ని దూరంగా విసిరి కొట్టే పరిష్కారం వెతకాలి.
అలాగే నువ్వు ఇబ్బందిలో ఉంటే నీ బంధువులు,ఎవ్వరూ నిన్ను రక్షించడానికి నీ కష్టం తీర్చడానికి ముందుకు రారు.
ఆ కష్టం తమను అంటుకుంటాయని దూరంగా వెళ్ళిపోతారు... నువ్వు కష్టం వచ్చినప్పుడు ఎవరిసహాయం కోసం చూడకూడదు..కష్టాన్ని భూతద్దంలో చూడకూడదు...కష్టాన్ని మంచి పరిష్కారంలో తరిమికొట్టాలి అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు..
నిజమే కదా! పాత కథే అయినా ధైర్యాన్నిచ్చే చక్కని కథ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి