7, అక్టోబర్ 2019, సోమవారం

కవితలు రాధాకృష్ణ లీలలు

రాధాకృష్ణ లీలలు 
ఓం
ఓం కృష్ణాయనమ: - శ్రీ మాత్రేనమ: 

 సర్వేజనా సుఖినోభవంతు 

Radha Krishna by D'signer Jatin Meshram by meshramjatin

*1. గోపాల కృష్ణుడు 


 రారమ్మ రారయ్యా చూడాలి చిన్న గోప బాలుడు 

నిర్మల మైన వాడు, మన మువ్వ గో పాలుడు 
శ్రీ రమ్య మైన వ్రేపల్లెలో, కాంతులు పంచు వాడు
చేరి కొలుతుము, మనసు ప్రశాంత పరుచు వాడు


ఎప్పుడు పున్నమి, వెన్నెల, వెలుగు నందించే వాడు       

ఎప్పటి కప్పుడు, మదిలో ప్రశాంతత, కల్పించే వాడు 
తప్పులు చేసిన, మానవులను సరిదిద్ది కాపాడే వాడు
చెప్పుడు మాటలలో నిజము ఉండదని, చెప్పిన వాడు 


మరి మరీ, కని వినీ, ఎరగని కళ్ళతో ఆకర్షించే వాడు

మురిసే యశోదమ్మకు ముద్దుల అల్లరి పిల్ల వాడు 
కరితో ఆడుకొని పైకిఎక్కి, ఆనందం అనుభవించే వాడు 
సిరి కల్పించి, సంతోష  పంచిన చిన్మయ స్వ రూపుడు


అరుణో దయ, వెలుగు, అందరికి సమంగా పంచు వాడు 

కరుణ చూపి ప్రాదించుచున్న వారిని కాపాడిన వాడు 
వరములు కోరిన వారికి వెంటనే సహకరించిన వాడు 
పరుష వాక్కులకు 100 తప్పుల వరకు రక్షించిన వాడు    
--((*))--      
   
*1. మధురిమల -  గోపాల కృష్ణుడు లీల  

రారమ్మా రారయ్యా  - రారమ్మా రారయ్యా 
గోపబాలుని లీలయ్య - గోపబాలుని లీలయ్య

చూడాలి గోప బాలుడు,-  చేరీ కొలుతుము రండు  
మనసు శాంత పరుచు వాడు, - అందరికీ చిక్కనోడు 

నిర్మల మైన మన  వాడు, - చిన్న మువ్వ గో పాలుడు 
శ్రీ రమ్య చరితపు వాడు - కాంతుల్నీ  పంచు వాడు

ఎప్పుడు పున్నమీ వాడు - వెలుగు నందించే వాడు       
దోచును ఎప్పటి కప్పుడు - దొంగ చూపులున్నవాడు 

మదిలో నుండె ప్రశాంతుడు - మేలు కల్పించే వాడు 
తప్పుల్ని దిద్దేవాడు -  మానవులలొ ఉండు వాడు 

కాపాడు చుండే  వాడు - చెప్పుడు మాటలు నమ్మాడు  
నిజము ఎపుడు చెప్పు వాడు - మరీ మాయ చేయు వాడు 

నయనాలతొ మెరవు వాడు-  ఆకర్షణ కలిగి నోడు
గోపిలతో తిరుగు వాడు - నవ్వి నవ్వించే వాడు  

యశోదమ్మ కు గారభుడు - అల్లరినే చేయు వాడు
ముద్దులు కురిపించువాడు - మనసంతా పంచు వాడు 

కరితో ఆడుకొను వాడు - నిత్యము ఆనంద పరుడు 
సిరిని  కల్పించే వాడు - నిత్యము సంతోష పరుడు
  
చిన్మయ ఆనందపరుడు - సార్వాంతర్యామి అతడు 
నిత్యమూ అరుణో దయుడు - సర్వమూ గ్రహించు వాడు 

కరుణతోను చూచు వాడు -  సమంగాను పంచు వాడు
అందరిలోన ప్రేమికుడు - అందరికి అందని వాడు    

వరములను ఇచ్చే వాడు  - సహకరమందించు వాడు 
వాక్కులు మన్నించువాడు -  తప్పుల్ని క్షమించువాడు    

రారమ్మా రారయ్యా  - రారమ్మా రారయ్యా 
గోపబాలుని లీలయ్య - గోపబాలుని లీలయ్య

--((*))--      

We need one of these on the compound. Purple LED Christmas Tree by tamara
2 .* శ్రీకృష్ణ లీలలు 


వినరమ్మా, చూడడండమ్మా, మన కృష్ణయ్య తీరు

పనిఁబూని మనం సేవించిన సిరులు కురిపించే తీరు
కన్నీరు తుడిచి మమకారం అందించే నవ్వుల తీరు
ఆన్న వారికి  సుఘంద పరిమళాలు అందించే తీరు


ఆల పాలకడలిలో ఊయల శేషశయ్యపై ఉన్న తీరు

కలలు సఫలీ కృతము చేసి శుభములందించే తీరు 
పలుకులో ధర్మ మార్గమున ఉండి ఉండమన్న తీరు
అలుకలో కూడా ఆనందము ఉన్నదని చూపినతీరు


నీల మేఘ శ్యాముడైన కృష్ణ కళ్ళకు  కాటుక తీరు

వలదు వలదు అంటూ పింఛము పెట్టుకున్న తీరు 
తలచుకున్న వెంటనే కృష్ణుఁడు ప్రత్యక్షమైన తీరు 
పాలు త్రాగి యశోదకు నోటిలో లోకాలు చూపిన తీరు


పద్ధతులనుచూసి పక పక నవ్వి ఏడి పించిన తీరు

పడుకున్న వారి కొంగులు ముడివేసి  ఆడిన తీరు
తడబడుతూ నవ్వులు కురిపిస్తూ ఆదుకున్న తీరు 
అడగకుండా తలచిన వెంటనే కోరిక తీర్చే తీరు    
          
 --((*))---


☆ white Xmas tree ☆ | © 2008 All rights reserved by JulioC. … | Flickr

  3 *  శ్రీకృష్ణ లీలలు . 


ఎనలేని సిరులను అందించు శ్రీకృష్ణ ప్రేమ 

కనరాని కడు ఈతిభాదలను తొలగించే ప్రేమ
మునులు నిత్యమూ త్రివిక్రముని ఆరాదించే ప్రేమ 
కనుల చూపులతో కలతలు తొలగించే కమ్మని ప్రేమ 


నెల నెలా మూఢు వానలు కురిపించే ప్రేమ 

కల కళలాడుతూ పైరును ఏపుగా పెంచే ప్రేమ 
కలువల పూలతో పూజించే నిస్వార్ధ ప్రేమ 
అలల తాకిడిలా సాగె జీవితంలో ఉండే ప్రేమ 


కడిగి కూర్చుండి పొంకపు చన్నుల పాల ప్రేమ 

ఒడిసి పట్టి పాలు త్రాగుతూ రక్కసిని చంపిన ప్రేమ 
బండి రూపములో వచ్చిన రాక్షసుని చంపిన ప్రేమ
కడవలు ఆవుపాలను అందించి ఆరగించే ప్రేమ        
--((*))--




* 4 శ్రీకృష్ణ లీలలు . 


నరులకు అకాలమున - దప్పికను  గనిరో  

కురియును సకాలమున - వర్షములు దయతో 
పయనమున ఒంటరిగ - వేదనలు గొలుతున్
కలత తొలగించియును - హర్షమును దెలుపున్    


జలనిధిలో జొర బడిన సర్పమును సంహరించి 

జలమును శుభ్రపరిచి త్రాగుటకు సహకరించి 
తలలు మార్చే దుష్ట రాక్షసులను సంహరించి  
కలకాలం శ్రీకృష్ణ ప్రార్ధించిన వారిని కాపాడుచుండెన్ 

సుందర బాహువులతో పిల్లన గ్రోవిని ధరించి 

పొందిన ఆనందము తో వేణుగానము చేసి 
అందరిని ఆనందపారవశ్యములో ముంచి 
వందనాలు స్వీకరించి మనస్సు ప్రశాంత పరిచే     
 --((*))---


Home Health Holidays Christmas Container Gardening Lighting Illumination Patio Backyard Kitchen pillows eclectic decorations Halloween Valentines day Easter

5 * శ్రీ కృష్ణ లీలలు . 


చెప్పరే చెప్పరే శ్రీకృష్ణ నామమ్ములు

ఒప్పుల కుప్పగా ఉన్న ఓ వనితలారా  
తప్పక చూచును మన స్థితిగతులు
ఎప్పుడో చేసిన తప్పులను రక్షించును 

కళ్యాణదీప్త మైన వాని కనికరములు

అల్లన మెల్లగా ధ్యానించి పొందు దామురా 
తల్లి కడుపున చల్లగా వెలిగేటి వానిని 
సల్లలిత సుమము లర్పించి వేడుకొందుమరా 

హాయిగా యమునా నదిన విహరించువానిని 

మాయను తొలగించే మధురాపురికి రేడైన వానిని
భయము వదలి పరమాత్మునిని ప్రార్ధించి
తీయని పువ్వులతో సేవించి ప్రార్ధించెదమురా                 

 --((*))---


I found a White Light-Up LED Deer Family, 3-Piece Set at Big Lots for less. Find more at biglots.com!

ప్రాంజలి ప్రభ
 6.*  శ్రీకృష్ణ లీలలు

తెలవారు తున్నది లేవే లేవవే 

కల కల కూసే కోయిల పాటలు
అల కృష్ణని గుడి గంటలు మ్రోగెనే 
పిలిచెనే సుప్రభాత సేవలకు

ఓలి విషపు చను బాలు త్రాగిన వానిని

లాలి పాడుతున్న మాయారక్కసి చంపిన వానిని
గాలిలో మాయా శకటములను కూల్చిన వానిని 
నిల మేఘశ్యాముని దర్శించుదాము లేవవే

మేలుకొని ఋషులు,మునులు కొలిచేటి 

మలుపు మాయానుండి మమ్ము రక్షించేటి
గెలుపు కోసం చేసిన ప్రార్థనలను చూసేటి
చలువ రాతిపై ఉన్న గోపాలా నీవే నాకు దిక్కు 
--((*))--

Have to have it. Outdoor LED Wisemen Lighted Display - Set of 3 - $1200.95 @hayneedle

Pranjali Prabha

7 .గోపికల లీలలు

విన లేదేంటి వెర్రి జవరాలా 

కన లేదుటే కృష్ణ లీలలు
తనితనిగా తెల్లవారి గోలలా 
వినియే హాయిగా పవళించితివా 

ఘల్లు ఘల్లుమని ఘంటల శబ్దాలు

చల్లగా శుఘంధ పరిమళ వాసనలు 
పెళ్ళుగా చల్లకుండ కవ్వం కదలికలు  
మెల్ల మెల్లగా ఆవు మువ్వల కదలికలు 

ఆలకించవె ఆలమందల గోలా

పాలధారలు కృష్ణుఁడికి పట్టవే
గోల చేయకే కృషుడిని వేడుకోవే 
బాలకృష్ణుడిని ముద్దుగా ఆడించవే  
  
 --((*))--




8. Pranjali Prabha8 * గోవింద లీలలు  . 

ఒకటే కోరిక మాకిక గోవిందా 

మకుటముతోనున్న రాజువు గోవిందా 
ఇక మాకు దిక్కువు నీవే గోవిందా 
ఒక పరి మా విన్నపములు వినవా గోవిందా

మనసు నీకు తెలియదనా 

మనవి చేయుట నావంతు 
ఏనాటికి నిన్ను వదలి ఉండలేను 
నన్ను ఎప్పుడూ కాపాడేవాడవు గోవిందా 

తెల వారక ముందే నీ సన్నిధిన ఉన్నా 

కలల కోరికలను తీర్చమని కోరుతున్నా 
తలపులు తెలుసుకొని ఆదుకుంటున్నావు
కలువ పూలతో నిను కొలుస్తూ ఉన్నా గోవిందా 


చెలులను వదలి మాకోసం ఉన్నావా 

చల్లని నీ చూపులు మా కందిస్తున్నావా 
మెల్లగా నిన్ను అర్థిస్తూ ప్రార్ధిసున్నాను దేవా
మల్లి మళ్ళీ నీ దర్శనం చేస్తే మన: శాంతి గోవిందా    


--((*))-- 


 

Pranjali Prabha
9 * గోవింద లీలలు  .

అల్లదే చూడు  మేలుకొలుపు తూరుపు సింధురం

తెల్లవారే  దేవాలయ భక్తుల  ఘంటల శబ్దం
మెల్లగా వినబడు చుండెనే దైవ సుప్రభాతం
మేళంతో ఊరేగుతున్నాడు దేవుడ్ని చూద్దాం పదా


కూరిమితో దేవుడు కృపను మనపై చూపునే

క్రూర రక్కసులందర్నీ సంహరించి కాపాడునే
అరుణోదయ కాంతిని అందించి ఆదుకొనునే
కరములతో వేడుకుందాము గోవిందునీ  పదా


కోనేరులో స్నానమాడి గోవిందుడ్ని కొలుద్దాం

అనేక భాధలు తొలగించమని వేడుకుందాం
ఔనే  తక్షణం గోవిందా అంటూ అంటూ  కదులుదాం  
మన అహాన్ని వదలి గోవిందుని చూద్దాం పదా


--((*))--



ప్రాంజలి ప్రభ 

10. *.శ్రీకృష్ణ లీలలు

మేలుకో మేలుకో
చాలించి నీ నిద్దుర నుండి  మేలుకో
ఏలికా నంద గోపాలా మేలుకో
మేలెంచి మమ్ము ఏలుకో


తల్లి యశోదమ్మ పిలుస్తుంది మేలుకో

అల్లన మేలుకో నంద గృహ దీపమా
మేలెంచి మా  మనవి ఏలుకో
తలచిన ప్రత్యక్షమయ్యే గోపాలా మేలుకో

భువిని దివిని రక్షించే ఓ నాయకా

భవ్య మైన వెలుగులు పంచె నాయకా
శ్రావ్య సంగీతమును ఆలకించు నాయకా
దివ్య చరితముగల గోపాలకృష్ణ మేలుకో 

.--((*))--



☀ SHRI KRISHNA ॐ ☀“Krishna is My life and soul. Krishna is the treasure of My life. Indeed, Krishna is the very life of My life. I therefore keep Him always in My heart and try to please Him by rendering service. That is My constant meditation.”~Chaitanya Charitamrita Antya 20.58

Pranjali prabha

11.  *శ్రీకృష్ణ లీలలు

పలుకవా నళి నేత్రా

పలుకవా నవ మోహనా
పలుకవా ముద్దు గోపాలా
అలక మాని కుచములనుండి లేవవా

తళ తళ మెరిసి మంచముపై

లలితా సుమధుర సువాసనలతో ఉన్న
తల్పంపై పవళించి ఉన్న నాయకా
ఆలసింపక నన్ను వదలి లేవవా

ఘడి అయినా ప్రియురాలును వదలవు

తడవైన గాని నిద్దుర లేవవు
మడి అన్న సొగసుకన్నులదానందువు
కొంగుముడి కదలవా గోపాలా    

 .--((*))--

Lord Krishna Beautiful Images - #2196 #krishna #littlekrishna #hindugod

12. కృష్ణం కలయ సఖి సుందరం! 

(నారాయణ తీర్థులవారి కృతి...రాగం: ముఖారి .) 
కృష్ణం కలయ సఖి సుందరం 
బాల కృష్ణం కలయ సఖి సుందరం 
కృష్ణం కథవిషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం 
సదా బాలకృష్ణం కలయ సఖి సుందరం 
నృత్యంతమిహ ముహురత్యంతమపరిమిత భృత్యానుకూలం అఖిల సత్యం 
సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం 
ధీరం భవజలభారం సకలవేదసారం సమస్తయోగిధారం 
సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం 
శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరికేళ సంగం సదా బాల 
కృష్ణం కలయ సఖి సుందరం 
రామేణ జగదభిరామేణ బలభద్రరామేణ సమవాప్త కామేన సహ బాల 
కృష్ణం కలయ సఖి సుందరం 
దామోదరం అఖిల కామాకరంగన శ్యామాకృతిం అసుర భీమం 
సదా బాలకృష్ణం కలయ సఖి సుందరం 
రాధారుణాధర సుతాపం సచ్చిదానందరూపం జగత్రయభూపం 
సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం 
అర్థం శితిలీకృతానర్థం శ్రీ నారాయణ తీర్థం పరమపురుషార్థం 
సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం

Pranjali Prabha 

Hare krishna

13.  గోపికల -శ్రీ కృష్ణ లీలలు



చీకాకు పడకు

చిడిముడి పడకు
చిందులు వేయుకు
చిన్న తనముకోకు



మాకోసమేకాదా

మా పున్నెము వలన కాదా
మా గోపాలుడివి కదా
మమ్ము కరుణతో ఆదుకున్నావుకదా
మా అందరి రక్షగా గోవిందుడవై ఉన్నావు కదా



గోవులవెంబడి తిరిగావు కాదా

కోణల వెంబడి తిరిగావు కాదా
గొల్ల పిల్లలతో ఆడావు కాదా
గోపికలతో సరస మాడావు కాదా
అయినా మమ్ము రక్షించే కృష్ణుడివి కదా



చిన్ని చిన్ని మాటలన్నాము

ఎన్నోసార్లు నిన్ను భాదపెట్టాము
మనది జన్మ జన్మల బంధము
గోపాల నిన్ను వీడి ఉండలేము
గోపాల నిన్ను చూసిన పుణ్యము
గోపాల నిశక్యతే మాకు స్వర్గము



--((*))--

 
Hare krishna
ప్రాంజలి ప్రభ
14 * రాధా కృష్ణ మనోహరం

ఒక మాటైనా అనవు గానీ రాధా

ఒక్క సారి నీ దర్శనంతో నా మనసుని
ఒకే విధముగా లేకుండా చేసావు కానీ
చిక్కావు నా ఉహల ప్రపపంచమ్ లోకి
      
వెన్నెల రాణివైతే ఈ జాబిల్లికోసం రావా
మెరుపుల తీగవైతే ఈ నింగి కోసం రావా
వానదేవతవయితే వనరాజును చూడవా
జల దేవత అయితే కడలిలో కలువవా

ఎలా కనిపించెదవో ఊహలకందుటలేదు

ఎలా కవ్వవించెదవో మనసుకు చిక్క లేదు
ఎక్కడున్నా వో  ఏమీ  అర్ధం ఆవుట లేదు
ఎం చేస్తున్నావో ఏమిటో తెలియుటలేదు

నా ప్రేమ నాయిక వైనావు నీవే రాధా
భోగములు అందించ గా రావా రాధా
నోరారా పలకరించుటకు రావా రాధా
తలపు వలపు కోసం వేచి ఉన్నా రాధా  



--((*))--

షేర్ చేయండి -దేవుని స్మరించండి

Krishna

15.  గోవింద లీలలు



అందమగు నీ దివ్య దర్శనమునకు
అందరము మానాభిమానములు వీడి 
సుందరమగు నీపాదాల క్రింద బృందములై
చందమున ఉన్న, మా డెందములు చల్ల బడే

నీ ఒక్కసారి మా ఒంక చూసిన చాలును
నీ దయా వీక్షణాలు కురిపించినా చాలును
నీ కనుపాప కదలిక మాపై చూపినాచాలును
మా పాపములు తొలగి, తాపము చల్లారును


చిరునగవు మోము గల ఓ వైకుంఠ వాసా 

ఏడు కొండలపై వెలసి ఉన్న ఓ వేంకటేశ
నీలాలు అర్పించి నీచెంతను మేము చేరాము
మా మొక్కులు స్వీకరించి, నీ వీక్షణాలు      
మా కురిపంచి మా జన్మ చరితార్ధము చేయు దేవా
 --((*))--



Photo

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:శ్రీ కృష్ణాయనమ:


16. ప్రాంజలి ప్రభ (రాధ కృష్ణ లీల -1) 

"గోవిందా" గోవిందా


ఊహల ఊయల సడిలో
ఆకలి ఆరాట మదిలో
తియ్యని తలపుల తడిలో
నీరూపే నా మదిలో నిలిచింది



లతలా అల్లుకోవాలని
పరిమళాలందించాలని
విరిసిన పువ్వగా ఉండాలని
నీ తలుపు నన్ను పులుస్తున్నది

కురిసేను విరిజల్లులు
మెరిసెను హరివిల్లు సౌరభములు
నాట్యమాడెను మయూరములు
నామది ఆనందంతో ఉన్నది

మదిలో నిండే మధుర భావాలు
పెదాలు పలికే మధుర గీతాలు
నాలో చెరగని నీ ప్రతి రూపాలు
అడుగుల సవ్వడికే పరవసిస్తున్న ముకుందా

నీ మధుర పావన తలపులు
ఈ రాధను వరించే కళలు
అందుకో పూల మకరందాలు
ఆదుకో ఆరాధించిన  వారిని గోవిందా

--((*))--

Mahabharatham - The Great Indian Epic...                                                                                                                                                      More

17. ప్రాంజలి ప్రభ 
భక్తులు శ్రీకృష్ణుని ఈవిధంగా ప్రార్ధించుతున్నారు 

అంతర్మధనానికి అర్ధం ఏమిటో 
ఆంత రంగాల భావ మేమిటో
అనురాగ బంధాల భేదమేమిటో 
మాకు తెలపవయ్యా కృష్ణయ్యా 

కాలమార్పుకు అవసర మేమిటో
కాపురానికి కాంచనానికి ప్రమఏమిటో
కాని దవుతుంది, అవ్వాల్సింది కాదేమిటో 
మాకు తెలపవయ్యా బాల కృష్ణయ్యా 

అకాల వర్షాలకు కారణాలేమిటో 
ఆత్మలకు తృప్తి కలుగుట లేదేమిటో
ఆకలి మనిషికి తగ్గకున్నదేమిటో 
మాకు తెలపవయ్యా ముద్దులకృష్ణయ్యా 

గాలిలో మాటలు తరలి వస్తున్నాయేమిటో 
గాఁపు లేకుండా ప్రార్ధించినా కరుణించవేమిటో 
గిరి గీసినా దాటివచ్చి మనిషి ప్రశ్న లేమిటో       
మాకు తెలపవయ్యా గోపాల కృష్ణయ్యా 

చిత్తశుద్ధి కల్పించి నిగ్రహాన్ని ఇవ్వవేమిటో 
చింతలు తొలగించి ఐక్యత్వజ్ఞానమివ్వమేమిటో
చిరునవ్వులతో జితేంద్రియత్వము కల్పించవేమిటో 
మాలో తప్పులు తెలపవయ్యా మువ్వగోపాలయ్యా 

ఇంద్రియసుఖములందలి 
ఆసక్తిని విడువలేకున్నావేమిటో 
కర్మల యందలి అభిమానము వదలి లేకున్నావేమిటో 
సమస్త వాసనలను, సుఖాలను మరువలేకున్నావేమిటో 
మాతప్పులు మన్నించి నీలో ఐక్యం చేసుకో కృష్ణయ్యా    



Lord Krishna
18 ప్రాంజలి ప్రభ

కన్నెల మనసు సుతారం
రంజిల్లును నిత్య సుకుమారం
రంగు బంగారం, రసరమ్య సౌభాగ్యంతో
రమా రమ మనసు నర్పించే శ్రీకృష్ణకు

తాంబూల పెదాల ఎరుపు దనంతో
వంటిమీద పుత్తడిపూత మెరుపుతో 
వెన్నెల వెలుగులో కళ్ళ చూపులతో
కవ్వించి నవ్వించి సంతోషం పంచె శ్రీకృష్ణకు   

ఆనందపు మాటలన్ మిపుల నందపు టాటాలన్
బాటలాన్ ముద మందంచుచు సుఖంబులన్
సందియము ఏమి లేక సర్వంబు అర్పించుటకున్
పోటీపడి ప్రియంబు కల్పించే కన్యలు బాలకృష్ణకు

లలిమనోహర రూప విలాస హావా భావములచే
యతిశయాను భవవిద్యా గోచర పరమార్ధముచే
గాత్ర కంపన గద్గదా లాపవిధులవయ్యారములచే  
కన్యలందరు నింపారు గాచి ప్రేమను పంచె శ్రీకృష్ణకు 

__((*))--  
The Radha Krishna( Divine Couple) - by RituHandmadeArts  
19 ప్రాంజలి ప్రభ  

చిరు  నగవుల  చిన్మయ రూపం
చింతలు తొలగించే విశ్వరూపం 
చంచలాన్ని తొలగించే రూపం 
చిరస్మరణీయులకు దివ్య రూపం 

ఆత్మీయుల ఆదుకొనే ఆదర్శ రూపం   
అంధకారాన్ని తొలగిన్చే రత్న రూపం 
అక్షయ పాత్ర నందించిన రూపం 
అన్నార్తులను ఆదుకొనే రూపం 

ఉజ్వల భవషత్తును చూపే రూపం 
ఉత్తేజాన్ని శాంతపరిచే రూపం 
ఉన్మత్త, అప్రమత్తలను మార్చేరూపం
ఉషోదయ వెలుగును పంచె రూపం 

దృఢసంకల్పాన్ని పెంచే రూపం 
దుష్టత్వాన్ని అరికట్టే రూపం 
దుర్మార్గులను సంహరించే రూపం 
దు:ఖాలను దరి చేర నీయని రూపం  

పరబ్రహ్మపరమాత్మ ప్రాప్తి రూపం
అపరిమితానంద హాయిగొలిపే రూపం
ఆత్మా పరమాత్మా యందె లగ్న పరిచే రూపం
అఖిలాండకోటికి ఆనందం పంచే శ్రీ కృష్ణ రూపం
Deepika.dks pinboard trails~*~ अधूरा है मेरा इश्क़ भी...                   आपके नाम के बिना,  जैसे अधूरी है......                    ,राधा श्याम के बिना,    ।। जय श्री राधे कृष्णा ।। 
ప్రాంజలి ప్రభ
20
అమ్మా యశోదమ్మా
అల్లరి తట్టుకోలేకున్నామమ్మా
ఆలూమగలమధ్య తగువులమ్మా
ఆ అంటే ఆ అంటూ పరుగెడుతాడమ్మా

పాలు, పెరుగు, వెన్న, ఉంచడమ్మా
పాఠాలు నేర్పి మాయ మౌతాడమ్మా
పాదాలు పట్టుకుందామన్న చిక్కడమ్మా
పాదారసాన్ని అయినా పట్టుకోగలమామ్మా
కానీ కృష్ణుడి ఆగడాలు ఆపలేకున్నామమ్మా

అల్ల్లరి చేసినా అలుపనేది ఎరుగని వాడమ్మా 
ఆడపడుచులతో ఆటలాడుతాడమ్మా
ఆశలు చూపి అంతలో కనబడడమ్మా
అల్లరి పిల్లలతో చేరి ఆడుతాడమ్మా

తామరాకుమీద నీటి బిందువుల ఉంటాడమ్మా
వజ్రంలా మెరిసే కళ్ళతో మాయను చేస్తాడమ్మా
మన్ను తింటున్నాడు ఒక్కసారి గమనించమ్మా
బాల కృష్ణ నోరు తెరిచి చూస్తే తెలుస్తుందమ్మా

అమ్మ చూడమ్మా వాళ్ళ మాటలు నమ్మకమ్మా
సమస్త సుఖాలకు కారణం పుణ్యం కదమ్మా          
పాపం చేసిన వారికి దుఃఖం వాస్తుంది కాదమ్మా    
నా నోరుని చూడమ్మా ఏమి తప్పు చేయలేదమ్మా

కృష్ణుని నోటిలో సమస్తలోకాలు చూసింది యశోదమ్మా 
ఆనంద పారవశ్యంతో మునిగి పరమాత్మను చూసిదమ్మా 



ముద్దుగారే యశోదముంగిట ముత్యము
ప్రార్ధించిన వారికి మన:శాంతి నిత్యము
ఓర్పుతో ప్రార్ధిస్తూ చేయాలి పత్యము
శ్రీకృష్ణుని పలుకులు ఎప్పుడు సత్యము



ఆపద వచ్చినప్పుడు ధైర్యము కల్పించు
శ్రేయస్సు కలిగినపుడు సహనం వహించు
వాక్చాతుర్యంతో మనస్సును  ఆకర్షించు
శ్రీకృష్ణుని పలుకులు ఎప్పుడు సత్యము




ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

ప్రాంజలి ప్రభ

బాల కృష్ణుడు తల్లి ని గూర్చి ఈవిధముగా చెప్పుట
అమ్మా నన్ను చూస్తే
నీ కేమనిపిస్తుందమ్మా
నీ మాటను దాటే ఏమైనా చేస్తే
నీకు శిక్షించే హక్కు ఉన్నదమ్మా

మనసు  మల్లెపూల తోట
పలుకు తేనెలూరు ఊట
మమత బ్రతికించే బాట
అమృతం పంచె ఆమ్మవు కదమ్మా



బిడ్డకోసం శ్రమించే మాత
అన్నార్తులకు ఎప్పుడు దాత
జీవితానికి దారిచూపే నేత
మనుష్యులకు శాంతి దూత అమ్మా

పనియందు ఎప్పుడూ చూపు ఓర్పు
అది తెస్తుంది మనలో కొంత మార్పు
సమస్యలనుండి తొలగించుటలో నేర్పు
ప్రతి ఒక్కరికి శిరోధార్యం అమ్మ తీర్పే


       

ప్రాంజలి ప్రభ
రెండు మనసుల్ని ఒక టి చేసేది
రెండు వర్గాలను ఒకటిగా కల్పేది
రెండు దేశాల్ని ఒకటిగా మార్చేది
ఇద్దరి మనుష్యులను కలిపేదే స్నేహం

కృతజ్ఞతకు మించినది స్నేహం
స్నేహానికి మించినది కృతజ్ఞత
స్నేహం వలన సహ్రుద్బావ వాతావరణం
ఒకరిపై ఒకరికి ఏర్పడు ఆహ్లాదభరితం

జీవన సౌందర్యాన్ని విపులీకరిస్తూ
ప్రాకృతి వైపరీత్యాన్ని తెలియపరుస్తూ
పంచభూతాలను బట్టి అనుకరిస్తూ
అనుబంధం ప్రేమబంధంగా మార్చేది స్నేహం

స్నేహితుని సమాగమనం సహజ సిద్ధం
కోరికలేని ముల్లును చేరితే యుద్ధం
స్నేహం అనుమానమా మారితే నరకం  
ప్రేమను ఇచ్చి పుచ్చుకుంటే సుఘంధమ్
  
ఒకరి కొక్కరు తోడైతే కొండత ధైర్యం
విజ్ఞానం పంచుకుంటే మనసు ప్రశాంతం
స్నేహానికి కులమతాలకడ్డురాని ప్రపంచం
బంధం వదిలిన ఆస్తిపోయినా వీడనిది స్నేహం 

కృష్ణ కుచేలుని స్నేహం సుస్థిరం
గుప్పెడు అటుకళులకు మోక్షం
సకల ఉపచార గౌరవ పర్వం
స్నేహానికి జీవితాలే సంతర్పణం  
 --((*))--



రాధ కృష్ణునికోసం వేచి ఉంటూ భావం తెలిపే

మహాద్భుతముగా గాలితో
కలసి కనబడకుండా గగుర్పాటు చేయుట ఎందుకు
ఎండలో నావెంట పయనించి
నీడగా నన్ను అనుకరించి అంతలో మాయమౌతావెందుకు

సంద్రపు కెరటం పొంగులా
ఎగసిపడుతూ నావెంట వచ్చి చల్లగా జారుకున్నావెందుకు
అడవిలో కారుచిచ్చులా
నా వెంట పడుతూ చిరుజల్లుకే చల్లబడి పోయా వెందుకు  

నింగి లోన నక్షత్రము లా
నను చూస్తూ, నావెంట వస్తూ, ఇంతలో నాకన్ను దాటావెందుకు
నింగిలోని మేఘము లా
కదులుతూ చిరునవ్వు చూపిస్తూ గాలికే ననుదాటి వెల్లావెందుకు

రాధా నన్ను వెదుకుట ఎలా
నిరంతరమూ నీ మదిలోనే వెలసి ఉన్నాను కదా వేదికు టెందుకు
రాధా నా ప్రాణము అంతయు
నీప్రేమ చుట్టూ తిరుగుటయే ఈ కృష్ణలీలను తెలుసుకో లేవెందుకు



శ్రీ కృష్ణుని చరితము వినుము

ఆ దేవదేవుని కొలిచి మోక్షము పొందుము
రంగ రంగ వైభవముగా
దేవకీ వసుదేవులకు పెళ్లి చేసి, స్వయాన సారధి వహించగా, ఆకాశవాణి దేవకీ వసుదేవులకు, పుట్టే అష్టమ గర్భము నీ మృత్యువని తెలిపే.
కంసునికి కంటి కునుకు రాదు, ఎవరు ఏమిచెప్పినా బోధపడదు, చేసిన పాపము అనుభవింపక తప్పదు, మృత్యువుని జయించే మార్గాలను వెతకక తప్పదు అని భావించి దేవకీ వసుదేవులకు కారాగారమునందు సకల సదుపాయాలూ కల్పించి పుట్టిన బిడ్డను నాకు అందించాలని హెచ్చరించి. తగిన రక్షక భటులను ఏర్పాటు చేసి చీమ చిటుక్కుమన్న తెలుపమని తెలిపి అజాగర్తగా ఉన్న వారెవరైనా సరే  వారికి మరణదండనమని తెలిపి వెనుతిరిగెను.



కాల గర్భాన సంవత్సరములు దొర్లిపోవు చుండెను. వసుదేవుడు పుట్టిన బిడ్డను కంసునికివ్వడం దేవకీ విలపించటం జరుగుతున్నది, ఆబిడ్డను పైకి ఎగరవేసి కత్తికి బలివ్వడం జరుగుతున్నది, ఈ విధముగా 7 (ఏడుగురిని మగపిల్లలను సంహరించెను).



అష్టమ గర్భము ఇప్పుడా అని అతృతతో కంసుడు ఉండెను, భయముతో రక్షకభటులను హెశ్చరించెను,



శ్రీ కృష్ణుని చరితము వినుము

ఆ దేవదేవుని కొలిచి మోక్షము పొందుము

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం
 సర్వేజనా సుఖినోభవంతు 

ఎందరో మహానుభావులు అందరికి వందనములు 
*--
 ఓం శ్రీ రామ్    ఓం శ్రీ రామ్     ఓం శ్రీ రామ్ 
ప్రాంజలి ప్రభ - గోకులాష్టమి ( పాటల సంగీత రూపకం)
వినండి - వినమని చెప్పండి 
వ్యాఖ్యానం: మల్లాప్రగడ రామకృష్ణ

ఒకారో టిక్ చేసి సంగీత రూపకం వినండి
సర్వేజనా సుఖినోభవంతు
--((*))--

- రాధాకృష్ణ  ప్ర్రేమ లీలలు 
*సుఖసౌఖ్యాలు పొందవాకృష్ణా

శ్రీ కృష్ణ  నీవు నాకు కనబడకున్నావు 
నా మనసు నీ  వెంట ఉన్నది 
అయినా ఈ రాధను 
కొన్ని శబ్దాలు తాకు తున్నాయి కష్ణా 
నా మనస్సును ఓదార్చుటకు రావా కృష్ణా 

జలపాతాల శబ్దం ఒక నాదాలుగా   
కెరటాల ఉరవడి ఒక వాదనలుగా   
తరంగాల లాస్యాలు ఒక స్పందనలుగా 
చినుకుల విన్యాసాలు ఒక వందనాలుగా 
నన్ను తాకు తున్నాయి కృష్ణా  
    
ఆకుల గల గల శబ్దం ఒక కలగా 
ఊగే చెట్ల కొమ్మలు ఒక గాలిగా  
వాయు తరంగ గాలులు ఒక లాలిగా 
స్వర విహారాలు మనసుకు ఒక జాలిగా 
నన్ను వెంబడిస్తున్నాయి కృష్ణా 



మబ్బుల గర్జనలు ఒక స్వరాలుగా 
హృదయ శబ్దాలు  ఒక ప్రేమలుగా  
స్నేహాల భావాలు ఒక చిహ్నాలుగా 
మాటల కలయకలు ఒక ఆందాలుగా 
నామనస్సును లాగుతున్నాయి కృష్ణా

ఈ రాధను అందుకొని
కనీ వినీ ఎరుగని సుఖ సౌఖ్యాలు 
పొందవాకృష్ణా 
ఈ  తనువు నీకే అర్పించాలని ఉంది కృష్ణా 
ఈ రాధ కోరిక తీర్చగ రావా కృష్ణా
--((*))--



 *రాధా కృష్ణ మనోహరం



కాలి మువ్వలై- నవ్వులు పువ్వులై 

వెన్నెల రాత్రులై -  సవ్వడి చేయవే రాధా



మనసు మంగళమై

తనువు తుంబుర నాదమై
శ్వాస సప్త స్వరమై
ద్యాస దివ్య ధ్యానమై
నాట్య  సుందరి వైన్నావు రాధా



నీ కోసం ఆటు పోట్లతో చిక్కి ఉన్నాను

కుంగుతూ, పొంగుతూ అల్లాడుతూ యున్నాను 
నీ అడుగుల సవ్వడికోసం విలపిస్తూ ఉన్నాను
నీవు ఉండి ఉండ నట్లుగా ఎందుకు ఉంటావు మాధవా



నీ స్పందనలు నా ఊహలై 

నీ ఆలాపనలు నాకు ప్రాణాలై
నీ ప్రణయ చూపులు వరాలై
నీ ప్రేమను నాకు అందించవే రాధా  



నీ కోసం సుధా చందన తాంబూలాలను ఉంచాను

నీ కోసం కళ్ళు విప్పారి ఎదురు చూసాను 
నీ కోసం మనో వనాన పుష్పాలను ఉంచాను 
నీవు స్వప్నంలో కనిపిస్తావు, తెరుస్తే ఉండవు మాధవా   



నీ సుమ సౌరభ రాగాలను వినిపించేవే

నీ లాస్య లీలల్ని  నాకు చూపించవే
నీ హావ భావాలు నన్నుఆకర్షించు తున్నవే
నీ హృదయతాపాన్నినాకోసం ఉంచానే రాధా



నీ  మధురాతి మధుర స్పర్శ కోసం వేచి ఉన్నా

నీ  కౌగిలిలో చిక్కి  తన్మయం చెందాలని ఉన్నా
నిన్నే ఆరాధిస్తూ వేయికళ్ళతో ఎదురుచూస్తున్నా
నామనసులోని కోర్కలను తీర్చవా మాధవా  
--((*))--


* రాదా మాధవ మనోహరం

రాదా నీ మనసు నాకు తెలుసు
మాధవా నీ మనసు నాకు తెలియదా!
అలా సరదాగా పూల సరస్సు ఒడ్డున
విశ్రమించి సరదాగా ఉందామా! ఓ అలాగే !

రాధ ఇటు చూడు
కలువలు రెండు
కల్లప్పగించి చూస్తున్నాయి మనల్ని 
కనికరము చూపుట కొరకా
కార్యసాధనం కొరకా
కాలంతో కలవ లేకా
కోపానికి చెదిరాయ చెప్పు రాధా 

"సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నాయి మాధవా"

మాధవా ఇటు చూడు
చామంతి పువ్వులు రెండు
బుగ్గలు రాసుకుంటూ ఉన్నాయి
చెప్పుకున్న కధల కా
చెలిమి సంభాషణల కా
తన్మయత్వం చెందుట కా
జలచరాల సవ్వాడి కా చెప్పు మాధవా

"తన్మయత్వ తపనలతో తపిస్తున్నాయి రాధా "

రాధ ఇటు చూడు
మల్లెలు మరువం రెండు
పెన వేసుకొని ఉన్నాయి
మనసుని పరవసింప చేయుటకా
మది తలపులను తెలుపుటకా
మృదు మాధుర్యాన్ని అందు కొనుటకా
మాయను చేదించుటకా, చెప్పు రాధా 

"తడి పొడి తపనలతో తపిస్తున్నాయి మాధవా"

మాధవా ఇటు చూడు
గులాబీలు గుభాలిస్తున్నాయి
స్త్రీల కొప్పులో చేరటానికా
కోపానికి నలిగి పోవటానికా
కోరుకున్నవాడి కోరిక తీర్చటానికా
బంతుల్లా ఆడుకోవటానికా చెప్పు మాధవా

"పవలింపులో నలిగి పోవాలని ఉన్నాయి రాధా "

"రాధా పోదామా గూటికి చలికాచు కుందాము
అట్లాగే మాధవా వెచ్చని కబుర్లు చెప్పుకుందాము" 

--((*))--


రాధామాధవ మనోహరం -3



మనసు లయమై తే 

తనువంతా తేలిపోతుంది రాధా  

వయసు ముదిరిపోతే
గుర్తింపు లే ఉండవు రాధా 

మనసు కు ఖాళీ లేకపోతే 

పరుష వాక్యాలు వచ్చును రాధా  

సొగసు మరిగి పొతే 

గుర్తింపే కష్టమై పోవును రాధా 



సరసులో నీరు ఎండిపోతే 
జల చరాలు బ్రతకలేవు రాధా 
కోరికలు తీర్చు కోక పోతే  
బ్రతుకుట కష్టమై పోవును రాధా 

ప్రేమ మనసులో ఉండిపోతే

కళ్ళులేని దాన వవుతావు రాధ 

దురుసు తనం నీలో పెరిగితే

మాటలు తడబడక తప్పవు రాధా 



అలుసు చూసి పోరాడితే 

అను కున్నట్లు గెలవ లేవురాధా 

తెలుసుకున్న నిజంచెప్పితే

కష్టాలు వచ్చినా నిగ్రహించు కోవాలి రాధా           

  

ఉషస్సు ఇచ్చే మనస్సుతో 


తేజస్సుతో ప్రకాశించితే

యశస్సు సొంత మైతే      

మనస్సు ఉల్లాసమగా 

ఉత్సాహముగా ఉంటుంది 
కదా మాధవా    
అవును రాధా
--((*))--


*రాధాకృష్ణ ప్రణయ సాగరము 
శ్రీకృష్ణ లీలలు - (ప్రాంజలి ప్రభ ) 


రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ 

వలపుల తలపులు తెలుపవా 
మెరుపుల సొగసులు చూపావా 
మనుసున మమతలు పంచవా 
ఓ రాధికా నీ మనసు నాదికా     

గంధము పూసెద, చందనం పూసెద  
తులసి మాలను వేసెద,    
మేఘశ్యామ రూప 

శిఖ పింఛమౌళి ముకుందా 



ద్రాక్షాపాకం త్రాగెదవా 

కదళీ ఫలములను గ్రోలెదవా

మదన కదన కుతూహలము కొరకు

మనసును రంజింప చేయుటకు   

ఓ రాధికా నీ మనసు నాదిక



నారి కేళములు కావలెనా

కదళీ ఫలములు కావలెనా 

నవనీతము కావలెనా

ఇక్షు రసములను కావలెనా  

శిఖ పింఛమౌళి ముకుందా



మూగ మనసుతో కోరుతున్నావు  

మౌన గీతములు పాడుతున్నావు  

నుదుటి రాతలు గురించి చూస్తున్నావు  

ప్రేమను పంచు తున్నావు 
ఓ రాధికా నీ మనసు నాదిక

మోహన మురళి నీకోసమే ఉన్నా 
యదు వంశీకృష్ణ నిన్ను ప్రార్ధిస్తూఉన్నా  
అధరామృతాములను అందించాలని ఉన్నా
నంద గోపాల కృష్ణ, గోకులానందా 
ఈ రాధిక ఆరాటం తగ్గించుకు రావా 
      ;
వలపుల తలపులు తెలుపవా  రాధిక 
మెరుపుల సొగసులు చూపావా కృష్ణ 
--((*)--






శ్రీకృష్ణ లీలలు - (ప్రాంజలి ప్రభ ) 

రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ 

 దిగువగల (గోపికా కృష్ణుల) చిత్రానికి అనువయిన నేను వ్రాసిన పద్యాలు


యమునా తటియే మురిసెను
కమనీయమ్మైన వేణు గానము వినుచున్
సుమకోమలి తా జేరగ
సుమధుర ప్రణయమ్ము విరిసి శోభను గూర్చెన్



ఎదలో నిలిచిన కృష్ణుడె
యెదురుగ తా వచ్చినిలిచె నేమని తెలుపన్
సుదతిని ప్రేమగ హత్తుకు
నెదసడి వినిపింప రాధ యెదపొంగెనుగా.
అష్ట భార్యలున్న నతివ రాధయనిన
వల్లమాలినంత వలపు జూపు
శాశ్వతముగ వీరు జంటయై నిలిచెడు
ప్రేమ జంట నిజము విశ్వమందు.

చల్లలమ్మెడు దానవో సన్నుతాంగి
చెంత చేరగ రావేమె చింతమాని
కాచువాడనె నేనైతి, గరుణ జూపి
ముద్దుతీర్చవె దయతోడ ముగ్ద నీవు

పిల్లన గ్రోవి నూదుచును ప్రేమగ జేరుచు గొల్లభామల
న్నల్లరి పెట్టువాడు జన యాతన దీర్చెడు గోపబాలుడే
చల్లని వాడనంచు సరసాంగియె చేరెను ప్రేమమీరగ
న్నుల్లము దోచినాడని మహోన్నత మూరితి నందనందనున్
--((**))--


శ్రీకృష్ణ లీలలు - (ప్రాంజలి ప్రభ ) 
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ 

ఏమో ! నాకెందుకు 
-------- 
చాల మందికి జీవించడం తెలియదు 
జీవితాన్ని ప్రేమించడం తెలియదు 
జీవన మకరందం గురించి 
ఆ మాధుర్యం గురించి 
వారికి అసలు తెలియదు రాధికా 

ఏమో ! నాకెందుకు 

తెల్లవారిన దగ్గరనుంచి 
బరువైన దేహాన్ని మోసుకొంటూ 
పరుగు తీస్తుంటారు 
ఉదయాన్నే ఏదో మత్తు 
నెత్తి కెత్తుకొని మసలుతుంటారు 
ఆ మత్తులో ఎదురైన వారిని
చూచి మొరుగు తుంటారు రాధికా  


ఏమో ! నాకెందుకు 

చిరు నవ్వు గురించి వారెప్పుడు విని ఉండరు 
చిటపటలతో కాలం గడుపుతుంటారు 
అతడికి తనతో పని లేదని అవసరం లేదని 
అతడి మనసెప్పుడో పారి పోయి ఉంటుంది 
తెలుసా రాధికా 


ఏమో ! నాకెందుకు 

ఒక పీడకల అతడిని 
ఎప్పుడు అంటిపెట్టుకొని ఉంటుంది 
ఎన్నో సిరిసంపదలు 
అతడి చుట్టూ పోగుపడుతుంటాయి 
అయితే అన్నిటికన్నా మిన్న అయిన ఆనందం 
కనుచూపు మేరలో కనిపించదు 
హాయి గొలిపే నిద్ర దరిదాపుల్లో ఉండదు 
తెలుసుకో రాధికా 
ఏమో ! నాకెందుకు 

ఎందుకొచ్చాడో ఈ భూమి మీదకి 
అతడికే తెలియదు 
కడ ఊపిరిలోనైనా కొట్టుమిట్టాడుతూ అలోచిస్తాడేమో 
ఆఖరి శ్వాసలోనైనా 
అతని సందేహం నివృత్తి ఔతుందో లేదో 
లక్షల.. కోట్ల మందిలో 
ఒకడిగా మిగిలిపోవడం లోని ఔన్నత్యం 
అమాయకంగా జీవిక ముగించి 
అర్దాంతరంగా రాలిపోయే అతనికి అర్ధం కాదు 
తెలుసుకో రాధికా 


ఏమో ! నాకెందుకు 

ఈ లోకం లోకి 
అతడొచ్చిన ఆనవాళ్ళు 
తనవారికైనా 
మరెవరికైనా ఎప్పుడైనా 
అసలు గుర్తోస్తాయో లేదో .. 
తెలుసుకో రాధికా 

ఏమో ! నాకెందుకు 
కృష్ణా నీవెన్నయినా చెప్పు  
నీ మీదఉన్న ప్రేమమాత్రం మారదు 
నీ మీద ఉన్న ప్రేమమాత్రం మారదు  
--((**))--



ప్రాంజలి ప్రభ 
శ్రీ కృష్ణ లీలలు 
రచయిత : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ 

కృష్ణుని మాటలు ఒక్కసారి చదవండి 

అర్ధం కొరకు ప్రపంచ మంతా
వెంపర్లాడుతు ఉండు రాధికా 
వెంపర్లాడే గుణం ప్రపంచమంతా
జీవించుతూనే ఉండు రాధికా 

జీవితం తప్పదు ప్రపంచ మంతా
ప్రశ్నార్ధకము గానే ఉండు రాధికా 
ప్రశ్నలపై ప్రశ్నలు ప్రపంచ మంతా
నిగురు కప్పిన నిప్పు లాగుండు రాధికా 

నిగురు కప్పిన ప్రపంచ మంతా
ప్రశాంతతకు వెతుకు చుండు రాధికా 
ఏమి లేకుండా ప్రపంచమంతా
బంధానికి చిక్కి తిరుగు చుండు రాధికా 

బంధపు ప్రేమలు ప్రపంచ మంతా
ప్రశ్నల మనసుతో నలుగు చుండు రాధికా 
మనసు లేని ప్రపంచమంతా
సమయాన్ని వ్యర్ధము చేయు చుండు రాధికా 

సమయ విజ్ఞానము ప్రపంచ మంతా 
విశ్వశాంతికి తోడ్పడు చుండు రాధికా  
విశ్వశాంతి కోసం ప్రపంచ మంతా 
దైవాన్ని ప్రార్ధించుతూ ఉండు రాధికా  

కృష్ణా నిన్ను మించిన ప్రపంచం లేదు 
నీ ప్రేమను ఆశించని ప్రపంచం లేదు  
ప్రేమతత్వం పంచని ప్రపంచం లేదు 
నీప్రేమే నాకు సొంతం ప్రపంచం తో పనిలేదు 

అంటూ రాధికా కృష్ణ ప్రేమ తత్త్వం లో 
మునిగి తన్మయత్వం చెందింది  
కృషుడు రాధిక ప్రేమలో మునిగి పోయాడు 

--((**))--


శ్రీ కృష్ణ లీలలు 
రచయత: మాలాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ   

కాలం ఆగదు - కావ్యం దాగదు
క్షణం ఆగదు - వీక్షణం దాగదు
నిర్ణయం మారదు - స్వేశ్చ దాగదు
దక్షత మారదు -  దీక్ష దాగదు
తెలుసుకో రాధికా  

ప్రేమ ఆగదు  - ఫలం దాగదు
పకృతి మారదు - ఆకృతి దాగదు
స్థితి మారదు - ప్రజ్ఞ దాగదు
శిక్షణ మారదు - సంస్కారం దాగదు
తెలుసుకో రాధికా 

లక్ష్యం మారదు - ధైర్యం వీడదు
సమయం చాలదు - సౌఖ్యం మారదు
బద్ధకం చేరదు -   నిద్రా మారదు
నిర్మలం చెదరదు - మౌనం వీడదు
తెలుసుకో రాధికా 

ప్రేమ మారదు - ప్రయత్నం వదలదు 
శక్తి చెదరదు - యుక్తి మారదు  
భక్తి చెదరదు - ముక్తి మారదు 
ఓర్పు చెదరదు - తీర్పు మారదు 
తెలుసుకో రాధికా

కృష్ణుని మాటలకు 
తన్మయత్వంలో మునిగి
హృదయానందం పొందింది రాధికా 

--((**))--


ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ 
రాధను ఉడికిస్తూ గోపాలుని వాక్కులు 

కళ్ళుంటే చూసి, వాక్కుంటే మాట్లాడి
మనసుంటే, అందించి ప్రేమను పొంద లేవా రాధా 
ప్రతి రాత్రి, వసంత రాత్రి, మనసును పంచె రాత్రి
మమతను పంచి, ప్రేమను పొంద లేవా రాధా  

ప్రతి గాలి, పైర గాలి, మల్లె పూల గాలి
వయసుని పంచి, శాంతి పొంద లేవా రాధా 
లేలేత చెక్కిళ్ళు, గులాబీ పువ్వుళ్లు
ముద్దు నందించి ఆనందం పొంద లేవా రాధా 

మొక్కజొన్న తోటలో, మురిసిన చీకట్లలో
మంచెకాడ కావల్సినది, పొంద లేవా రాధా
కొండమీద సుక్కలన్ని, సోకు చేసుకొనే వేళ
అవేళ వచ్చి నీక్కావల్సింది, పొంద లేవా రాధా

గాలి వరవడికి, పకపకా నవ్వుకునే వేళ
చక్కిలి, గిలి పెట్టి, కావాల్సింది పొంద లేవా రాధా
ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై
నవ్వులో నవ్వునై, ఉన్న నన్ను పొంద లేవా రాధా

చలిగాలిలో, నీకోసం ఎదురు చూసేవేళ  
వెచ్చని కౌగిళ్లు, నాకు పంచి సుఖ పడ లేవా రాధా
నీ నీడలో, తోడునై కలిసి మురిసే వేళ
మనసు అర్పించి, మమత పొంద లేవా రాధా

వెన్నెలంతా, మేసి ఏరు నెమరెసినా వేళ
సొగసంతా, ఏటి పాలుకాకుండా, ఆప లేవా రాధా
గాలి నన్ను ఆవరించి, కమ్ము కొనే వేళ
గాలిగా ఆలింగనం, చేసుకొని తృప్తి పడలేవా రాధా

--((*))--




*.రాధ కొరకు కృష్ణుని -పారవశ్యం

కలల అలలపై తేలేను మల్లెపూవై
వలపు వయ్యారంగా మందారమై
మనసు సువాసనల సంపెంగమై
కలలో తేలుతు కలిసే పారిజాతమై

వయసుకు గుబాళింపు అందించే మకరందమై
తనువు తనువు తపింపచేసే మొగలి పూవై
వలపు తలపు మెరుపు చల్లబరిచే నంది వర్ధనమై
స్వప్నంలో కనిపించే ముద్దాడే ముద్ద బంతివై

మక్కువకు హాయి గొలిపే విరజాజివై
జలకాలాటలకు సైఅన్న కలువ పూవువై
మకరందాన్ని దోచు అన్న తామర పూవువై
ఆధరాలు అందాలను తలపించే గులాబీవై       

చిరునగవులు చిందింస్తూ కదిలే పూల దండవై
వయసు అందాలు చూపిస్తూ బూరుగ పూవువై
తేన రసాలతో తృప్తి పరిచే మధుర మమ్మిడివై
నా మనసుదోచుకున్న అందాల సుందరివై 
నామదిలో నిలిచిన రాధవు నీవై 
నాహృదయంలో ఉన్నావు పుష్పమై  
--((*))--


ప్రాంజలి ప్రభ 

* గోవిందా గోవిందా గోవిందా
గోవిందా గోవిందా గోవిందా 

చిరునవ్వుల  చిన్మయ రూపంలో
చూస్తూ ఉంటే తరించు పోవు నా హృదయం
ఊహలు అనంత వాయువులలో
ఉన్నా తన్మయ రూపానికి
పరవశం చెందింది నా హృదయం   

అక్షర దీప దివ్య వెలుగులలో
ఆత్మీయంగా ఆదరించిన దివ్యరూపం 
ఆనంద బాష్పాల కాంతులలో
కావ్య నాయకుడైన అద్భుత రూపం 

కాలానికి అతీతమైన పసిడి కాంతులలో
మనస్సును ఆహ్లాద పరచిన దివ్య రూపం
మనసు తన్మయత్వం పొందే కాలంలో 
సుఖాన్ని అందించే చిద్విలాసం రూపం 

రేయి పగలు ఆవహిస్తున్న నిట్టూర్పులలో
కనుపాపాను ఒదార్చిన నీ మంగళ స్వరూపం 
విశ్రాంతి ఎరుగని నీ ఆకర్షించే చూపులలో
చిక్కని మానవులు లేరు ఈ కలియుగం లో

ఓదార్పుకోసం గాయ పడిన హృదయాలలో
నిరంతరం నీ స్వరణామం చేస్తున్న మాయాలోకం
సర్దుకుంటూ సాగిపోతున్న ఈ సమయంలో
ఆత్మ సంతృప్తినిచ్చే నీ దివ్యమంగళ స్వరూపం

మానసిక మదిని తొలిచే మౌన భాషలలో
మానవులను ఆదుకుంటున్న ఆత్మ స్వరూపం  
కమ్ముకు వస్తున్న కష్టాలలో, తీరని ఆశలలో
మరువని ప్రాణానికి ప్రాణమైన దివ్యాభరణ రూపం 

విధిరాత ఎలాఉన్నా నిన్ను మరువలేదు ఏ క్షణంలో
కాలానుగుణంగా నడుస్తున్న ధర్మ ప్రవర్తనలో  
దుష్ట శక్తులు ఎన్నో కమ్ముకు వస్తున్న ఈ తరుణంలో
నివేదిక్కు ఆపద్భాంధవా, అనాదరక్షకా, ఆత్రుతతో
ఆదుకొనే వేంకట రమణా గోవిందా గోవిందా గోవిందా   

గోవిందా గోవిందా గోవిందా 
గోవిందా గోవిందా గోవిందా 
గోవిందా గోవిందా గోవిందా 
   --((*))--


రాధా గోపాలం 
గోపాల గోపాలా  ; గోపాల గోపాలా
గోపాల గోపాలా  ; గోపాల గోపాలా

నమ్మినాను, చేరి కొలిచినాను 
నల్లని వాడవైనను, మనోహరుడవని 
మనసును దోచిన అతి సుదరుడవని
మనసు అర్పించటానికి పిలుస్తున్నాను 'గోపాలా'   

పిలిచినా పలుకవు, నా మీద అలకా 
నిన్నే నమ్మినానని, ఎక సెక్కముతో నవ్వులాటా 
కపటము నాలో లేదు, నంద కుమారా 
కళ్ళు కాయలు కాచినవి, నన్ను చూడవా 'గోపాలా' 

మురళి విని నంతనే, పరుగెడి వత్తును     
అల్లరేల చేయుదువురా, వెన్నముద్దలు తెచ్చి ఇచ్చెద 
ముద్దులివ్వమని కోరే బేలను, నేను బాలను కాను 
నా మనసులోని కోరికను తీర్చుటకు రా 'గోపాలా '

ఈ రాధ నీ కోసమే వేచియున్నది మరువకుమా  
నీ తనువు నా తనువు పెనవేసుకొని కలసి పోదామా 
ఒకరి కొకరు ఐక్యమై స్వర్గధామాన్ని చేరు  కొందుమా 
హృదయాలతో పారవశ్యము చెంది పరవశించుదామా ' గోపాలా'   

గోపాల గోపాలా  ; గోపాల గోపాలా 
గోపాల గోపాలా  ; గోపాల గోపాలా
గోపాల గోపాలా  ; గోపాల గోపాలా
--((*))--


  


*రాధ కృష్ణుని కోసం ఆలాపన 

నా ఏకాంతపు నుదుట గీతలపై
నవ మన్మధాకారునికి లొంగి పోతానని
ఆ బ్రహ్మ వాసి యుండవచ్చు   

నా యద కాగీతం పై నీ సుఖస్పర్శ ఉందని 

నిత్య సౌభాగ్యం పొందు తానని 

విరంచి విపులంగా వివరించ వచ్చు  



నా నవ్వులు నీ  కోసం దాచి వుంచ మని  

ప్రాణయా నందము పొందుటకు వీలని 

సృష్టికర్త  వెన్నలను కురిపించ వచ్చు    



నా బ్రతుకు నిత్య వసంత మౌతుందని 

నల్లనయ్యే నవ మన్మధుడై వస్తాడని 

విధాత విపులీ కరంగా చెప్పవచ్చు       



గోమాతలతో కూడి గోపాలుడు వస్తాడని 

ఆదమరచి నిదురించక వేచి ఉండమని 

పకృతి మాత హెచ్చరించ వచ్చు  



మురళితో సరాగాలు పాడుతావని 

నీ గాన మాధుర్యంలో నాట్యమాడాలని
పుడమి తల్లి కరుణించవచ్చు

నవనీతము అందించి ముద్దు లాడాలని 

నవ మాలికలతో నిన్ను అలంకరించాలని 

నా మనసును నీకె అర్పించు కోవాలని

నీవే సర్వ భూతములకు నాయకుడవని

సుగుణ పురుషోత్తమ రూపుడ వని
లీలా మానుష రూపములో ఘనుడవని
ఆశ్రీత అంతర్ధాన రూపుడ వని
అక్షరుడవని, శాస్వి తుడవని  ఈ రాధకు 
ఆ పరబ్రహ్మ భగవత్ప్రాప్తికి, మోక్షానికి 
కృష్ణుడుగా సరియైన ప్రేమికుడిని
చెప్పియుడవచ్చు 

ఈ  రాధ మనస్సును ఊరడించుటకు
కృష్ణుడెప్పుడు వచ్చును, 
ఈ కలల కోరికలు ఎప్పుడు తీర్చును,
సర్వదా నిన్నే తలుస్తూ నీప్రేమ పొందాలని
 ఆహ్వానిస్తూ వేచి ఉన్నాను కృష్ణా...                
ఈ   రాధను కరుణించి కటాక్షించవా కృష్ణా
--((*))--


*రాధ కృష్ణుని కోసం ఆలాపన

ఎవరో కాదు కృష్ణుడే వస్తాడని
నాలో ఆశలు  తీరుస్తాడని
ఎదురు చూపులతో ఉన్నాను

నవ నాటక సూత్రధారుడై వస్తాడని
ఈ అమాయకురాలి చూపులను
ఆదు కుంటాడని ఆశతో ఉన్నాను   

నిను విడజాలనునేను, నీ  మనసునై,
నీ ప్రియసఖినై, నీ ప్రేమను పొందుటకై
కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నను

న్యాయమో అన్యాయమో నాకేమి తెలుసు
ఈ విశాల హృదయాన్ని నీకే అర్పించాలని
నీ ఆశలకు నేను బానిస నవ్వాలని ఆశిస్తున్నాను 

పవిత్ర భావముతో నిన్నే ఆరాధిస్తూ ఉంటానని
సర్వ ధర్మములను ఆచరిస్తూ ఉంటానని
భక్తి భావముతో నీ పొందు కోసం వేచి ఉంటాను
కృష్ణా, కృష్ణా , కృష్ణా

ఈ  రాధను కనికరించుటకు మోహనరూపడవై
నా మనసును ఊరడించుటకు రావా కృష్ణ
కృష్ణా, కృష్ణా , కృష్ణా  
 --((*))--



*రాధ కృష్ణ ప్రేమ తత్త్వం 

'శ్రీ కృష్ణ 'నీ చిరునగవుల  మోము చూస్తుంటే
నా మనసులో ఉన్న ఆలోచనలన్నీ మటుమాయం 
'శ్రీ కృష్ణ 'నీ చిరి మువ్వల గజ్జలు నాదం వింటుంటే 
నా మనసు ఆహ్వానిస్తూ తెలియని స్వరమయం 

'శ్రీ కృష్ణ 'నీ భావ ప్రకంపనలు చూస్తూ ఉంటే 
నా మనసులో ఉన్న కల్లోలాలు ఆవిరి మయం 
'శ్రీ కృష్ణ ' నీ మది నుండి వీణ శబ్దాలు వింటుంటే 
నా మనసులో అనురాగంతో విచ్చే పుష్ప మయం  

'శ్రీ కృష్ణ ' నీ మాటలు కవితాక్షరాలుగా మారుతుంటే 
నా మనసులో ప్రభా ప్రశాంతత చేకూర్చే మయం      
'శ్రీ కృష్ణ' నీ పెదవులపై గమకాలూ నాట్య మాడుతుంటే 
నా మనసంతా  ఆనంద  పారవశ్య నిలయం    

'శ్రీ కృష్ణ ' నీ వలపు పూల వానజల్లులా కురుస్తుంటే 
నా మనసంతా ఉష్ణం తగ్గి నవ వసంత మయం  
'శ్రీ కృష్ణ 'నీకు ప్రేమతో పూజించేపువ్వు పరిమళిస్తూ ఉంటే  
నా మనసులోని ప్రేమంతా సర్వ వ్యాపక మయం

'శ్రీ కృష్ణ' నీవు సత్యం జ్ఞానం ప్రేమతత్వం తో ఉంటే 
ఈ రాధ హృదయం నీకే అర్పిస్తున్నాను ఇక నీకు సొంతం      

--((*))--  


*రాధాకృష్ణ ప్రణయ సాగరము

వలపుల తలపులు తెలుపవా 
మెరుపుల సొగసులు చూపావా 
మనుసున మమతలు పంచవా 
ఓ రాధికా నీ మనసు నాదికా

గంధము పూసెద,
 చందనం పూసెద 
తులసి మాలను వేసెద, 
మేఘశ్యామ రూప 
శిఖ పింఛమౌళి ముకుందా

మదన కదన కుతూహలముకొరకు
మనసును రంజింపచేయుటకు 


ద్రాక్షాపాకం త్రాగెదవా 
కదళీఫలములను గ్రోలెదవా
ఓ రాధికా నీ మనసు నాదిక

నారికేళములు కావలెనా
కదళీఫలములుకావలెనా 
నవనీతము కావలెనా
ఇక్షు రసములను కావలెనా 

శిఖ పింఛమౌళి ముకుందా


మూగ మనసుతో కోరుతున్నావా  
మౌన గీతములు పాడుతున్నావా 
నుదుటి రాతలు గురించి చూస్తున్నావా 
ప్రేమను పంచుతున్నావా 


ఓ రాధికా నీ మనసు నాదిక

మోహనమురళి నీకోసమే ఉన్నా 
యదు వంశీకృష్ణ నిన్ను ప్రార్ధిస్తూఉన్నా 
అధరామృతాములను అందించాలని ఉన్నా
నంద గోపాల కృష్ణ, గోకులనందా 

ఈ రాధిక ఆరాటం తగ్గించుకు రావా 



వలపుల తలపులు తెలుపవా రాధిక 

మెరుపుల సొగసులు చూపావా కృష్ణ


వలపుల తలపులు తెలుపవా రాధిక 

మెరుపుల సొగసులు చూపావా కృష్ణ


. --((*))--


                               

  స్త్రీ  ఒక దివ్య మణి

1 .  నయన మనోహర కలువల అపరంజి  మణి !
2 . మనసును దోచే, నవ నవోన్మష రక్తి స్వరూపిణి !
3 . కోరికలు తీర్చి, యశస్సును పెంచే, యసశ్విణి  !
4 . మనోధైర్యం, తేజస్సును వృద్ధి పరిచే, తేజస్విణి  !

5 . ధర్మశాస్త్రములు తెలిపి, ఆదు కొనే అంతర్వా ణి  !
6 . కొన్ని విషయాలు తెలిసుకోనుటకు,  సహాయపడే అన్వేషిణి !
7 . మనసును మెప్పించిన, వారి కోర్కెలు తీర్చిన, అభిలాషిణి !
8 . అంతరాత్మను ప్రభోదించి, అవసరమునకు సలహాఇచ్చె, ఆత్మజ్ఞాణి !

9 . ఆస్తిని, అదాయమును,పెంచి ఆహారమును అన్దిమ్చ్, అన్నప్రదాయిణి !  
10 . పురాణములు, వేదములు అనర్గాలముగా వర్ణించి చెప్పే, అవృత్తిణి !   
11 . ఇంటిని, సభను, పిల్లలను,  హుందాగా తీర్చి దిద్దన, అస్థాణి !
12 . కామాందులకు, దుర్మార్గులకు, దుష్టులకు, చిక్కిన ఆహుతిణి !

13 . పరిమళాలు వెదజల్లి, మనస్సును ఉల్లాసపరిచే, ఇష్ట ఘంధిణి !
14 . రౌద్రరసమును చూపి, శత్రువుల గుండెలలో ఉండే, ఉగ్రరూపిణి !
15 . మనో భిష్టమును నెరవేర్చి, ఉచ్చాహమును పెంచే, ఉజ్వల రాణి ! 
16 . తెలివితో తెలియనివి తెలియపరిచే ఉపన్యాసిణి !

17  ఉపవాసములు ఉండి ఉపాయములు తెలియపరిచే ఉపచారిణి !
18 . భర్త దుర్వసనములు లోనైతే వ్యసనములను మాన్పిమ్చే ఉపాధ్యాయిణి !
19 . ఉరొభాధను భరించి ఉష్ణమును పెంచి ఉన్మాదునికి ఊరట కలిగించే విలాసిణి !
20  బలము, ధెర్యము, మనోనిగ్రహ శక్తి పెంచే తేజస్సుగల ఓజస్వి ణి !

21 . అనారోగ్య భర్తను ఆరోగ్య్యవంతునిగా మార్చుటకు శ్రమించే ఔషదణి ! 
22 . నవనీత హృదయ వేణి , మంజుల మధుర వాణి ! 
23 . నవ్వులతో మనస్సు అర్పించి సుఖపరిచే దర్శిని!   
24 . కళలు సర్వం వ్యక్తపరిచే కళా రూపిణి  
-((**))--



==((++))--
ఓం రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్రభ (ఆనందం - ఆరోగ్యం -ఆధ్యాత్మికం ) 
రచయిత : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ 


 ప్రేమకు ప్రేమే సాక్షి-23
*ప్రాంజలి ప్రభ (ఆనందం - ఆరోగ్యం -ఆధ్యాత్మికం ) 
రచయిత : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ 

సీతారాములు ఇంటర్ లో చేరారు, ఇద్దరు ఒకే క్లాసులో చదువుతున్నారు, అప్పుడు తెలుగు మాష్టర్ మొదటి క్లాసుగా ఈ వివిధంగా భోదించారు. నాలో మిలో అనేక మార్పులు వస్తాయి , ముఖ్యంగా మార్పుగురించి వివరిస్తాను అంటూ  ప్రారంభించాడు     

పదహారేళ్ళ వయసులో పిల్లలకు శరీరములొ మార్పు
చదివే చదువు యందు శ్రద్ధలో పెరుగుటలో మార్పు
మాటలు చేతలు బుద్ధులలో ఏదో తెలియని మార్పు
దేహ వృద్ధిలో నవభావ గుణాల పొంగుల్లో మార్పు

మదనుడు ప్రవెశిమ్చుటవల్ల మదిలో తెలియని మార్పు
జనకులకు పుత్రులను, పుత్రికలను కట్టుదిట్టంల్లో మార్పు
పిల్లలను అదుపులో పెట్టుటకు చేసే ప్రయత్నంలో మార్పు
యువతీ యువకులకు శక్తిలో ఆలోచనలో కల్గును మార్పు

పిల్లల ఆట పాటలయమ్దు శ్రద్ధ చూపుటలో మార్పు
తోటివారి మాటలు వినుటయమ్దు తెలివిలో మార్పు
శ్రుంగారపు మాటలయందు ఆశక్తి చూపుటలొ మార్పు
 దైవప్రార్దనలో అనుకొనివిధముగా కలిగే మార్పు

వేలకు తిండి తినక, నిద్రపోక, తిరుగుటలో మార్పు
నడకలో, చూపులో, పని చేయుటలో మార్పు
పెద్ద పెద్ద విషయాలలో తలదూర్చుటలొ మార్పు
పెద్ద చిన్న అని తేడా తెలియక మాట్లాడే మాటల్లో మార్పు

యువకులు యువతుల కోరకు పరితపిమ్చుటలో మార్పు
విషయాలు తెలుసు తల్లి తండ్రులను వాదిమ్చుటలో మార్పు
పిల్లలను అదుపు పెట్టాలని తల్లి తండ్రుల మాటల్లో మార్పు
ప్రకృతిలో యవ్వనంలో వచ్చేమార్పు దేవుడిచ్చిన తీర్పు

--((**))--

 ప్రేమకు ప్రేమే సాక్షి-22
*ప్రాంజలి ప్రభ (ఆనందం - ఆరోగ్యం -ఆధ్యాత్మికం ) 


రచయిత : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ 

శుద్దిగాని మనసు చూడలేదు వెలుగు 
బద్దకించు వాని మనస్సు నలుగు  
వృద్ధికోరు వానియందు శోధన కలుగు  
శ్రద్ధతోడ చదివే చదువు మనసుకు వెలుగు 

నిద్దురమ్భనందు నియమం పాటించు 
హద్దు లందు గమనించి నటించు
వృద్దులందు వినయం చూపించి జీవించు 
మొద్దు లందు చదువు బోధించి బతికించు 
  
నిముషమైనా కూడా అసంతృప్తిగా ఉండకు 
కాలగమనాన్ని బట్టి నడవటం మరవకు 
ప్రేమ పొందే వరకు నిగ్రహాన్ని వదలకు    
పొంచిఉన్న ప్రమాదాన్ని తలచి బాధపడకు 

అవకాశములనన్ని నందిపుచ్చుకో 
పరువాన్ని పదిలంగా ఉంచుకో  
నిత్య సంకల్పాన్ని సాధించుకో 
తరుణాన్ని సద్విని యోగ పరుచుకో 

అలా శివాలయంలో ఉన్న 
ఒక సన్యాసి సీతారాములను దీవించే 
జీవన యానంలో చదువే ముఖ్యమని 
భావించి ఇతర చదువుటకు కదిలారు 

--((**))--


ec2
 ప్రేమకు ప్రేమే సాక్షి-21*ప్రాంజలి ప్రభ (ఆనందం - ఆరోగ్యం -ఆధ్యాత్మికం ) 
రచయిత : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ 

ఈశ్వరా నీవే మాకు దిక్కు అంటూ శివాలయములో సీతారాములు ప్రార్ధించి చదువుకు నేందుకు వెళదామని నిశ్చయించుకొన్నారు. అంతలో
  
అక్కడ ఉన్న కొందరు శివభక్తులు ఇట్లా పాడుతున్నాడు

ఈశ్వరా, పరమేశ్వర, జగదీశ్వరా, పాహిమాం, పాహిమాం 
మమ్ము కాపాడే త్రిలోకేశ్వరా, పార్వతీపరమేస్వరా పాహిమాం,పాహిమాం    

నమ: శివాయ, నమ: శివాయ, నమ: శివాయ 
నమ: శివాయ, నమ: శివాయ, నమ: శివాయ
నమ: శివాయ, నమ: శివాయ, నమ: శివాయ

వేదవిహారా! హరా! జీవేశ్వరా 
నాదమై అనురాగమై అమరేశ్వరా
సామ దాన బేధ దండమేశ్వరా
సంగీత సాహిత్య  నటరాజేశ్వరా 

నమ: శివాయ, నమ: శివాయ, నమ: శివాయ

రాగం తానం పల్లివి పరమేశ్వరా
 సంతోష సన్నిధి నింపే ఈశ్వరా
కాలం ప్రకృతి ఆధీనే శ్వరా
ఆత్మానంద పరమానందేశ్వరా

నమ: శివాయ, నమ: శివాయ, నమ: శివాయ

ప్రేమ త్యాగం రక్ష సద్గుణేశ్వరా
 ఆశా పాశ ఆతీత లింగే శ్వరా
పుడమి అమ్బరం ఏకమేశ్వరా 
 సూర్య చంద్ర నింగి దౌహిత్యేశ్వరా

నమ: శివాయ, నమ: శివాయ, నమ: శివాయ

కర్షక కార్మిక హృదయేశ్వరా
ఋషి, యోగ, భక్తి, సంసారేశ్వరా       
సతి, పతి, సంసార, సుఖేశ్వరా
ధర్మ సన్నిహిత సద్భోదేశ్వరా
   
నమ: శివాయ, నమ: శివాయ, నమ: శివాయ

భక్తిపై నమ్మకం నింపే ఈశ్వరా   
మన:శాంతిని కల్పించే ఈశ్వరా  
అనారోగ్యులను మాపే ఈశ్వరా 
ఐస్వర్యముతో శాంతికల్పే ఈశ్వరా 

నమ: శివాయ, నమ: శివాయ, నమ: శివాయ 
నమ: శివాయ, నమ: శివాయ, నమ: శివాయ
నమ: శివాయ, నమ: శివాయ, నమ: శివాయ

అంటూ భక్తులందరూ పరవశించి నాట్యము చేయుచున్నారు 
అందులో సీతారాములు కూడా వంత పలికి దేవుణ్ణి ప్రార్ధించి వెనుతిరిగారు 
--((**))--






 ప్రేమకు ప్రేమే సాక్షి-20*ప్రాంజలి ప్రభ (ఆనందం - ఆరోగ్యం -ఆధ్యాత్మికం ) 
రచయిత : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ 
సీత రావణ కాని రమణకు ఉత్తరం వ్రాసి పంపింది 

వృధాచేయబోకు సమయం  
నీ నిగ్రహ: శక్తిని మరువకు 
మరచి ప్రవర్తించుట వ్యర్ధము 
నీ తోబుట్టువులను గుర్తించుకో 

మనుష్యజన్మ సదా రాదు నీకు 
జన్మ సార్ధకం మరువకు
చదువుని వ్యర్ధము చేయకు 
యవ్వనము ఎప్పుడు స్థిరము 

ఊరక వాదులాడబోకు
నిన్ను నీవు ముందు గుర్తించుకో 
స్త్రీని గౌరవించటం నేర్చుకో
సిద్ధి పొందే సమయం చాలా ఉంది 
       
గుణాలకు అతీతుడుగా ఉన్నావు 
నీ అనుకరణ మార్చుకో 
నీపై ఆధారపడిన వారిని గమనించు 
స్త్రీని పొందటం నీ లాంటి వాడికి తేలికే 
కాని సుగుణాల రాశి దొరకటం కష్టము 
బుద్ది మార్చుకో తెలివిగా నడుచుకో 
                  మీ శ్రేయోభిలాషి 





ప్రాంజలి ప్రభ
రచయిత:మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

ధరణి ధరణంతా దద్దరిల్లి 
అగ్నిపర్వతపు జ్వాల విజృంభించి 
హిమవన్నగము జలముగా కరిగి   
ప్రచండ మారుతము ఆవహిస్తున్నది దేవా

పాతాళం లోతుగా పాతుకొని 
గండుకోయిల కూత ఆగి 
జలపాత సవ్వడి ఆగి 
మనసునే గాయంచేస్తున్నది దేవా 

పరుగులన్నీ ఆగి తూలి
మాటలన్ని  మూగపోయి
ఒళ్ళంత వేడిగాలికమ్మి 
కాళ్ళలో కదలిక ఆగిపోయింది దేవా 

కళ్ళలో నీరు వరదలై 
కోపాన ఒళ్ళంత ఊగి
బిడ్డలు పుట్టుక  ఆగి
వృక్షములన్ని మండిపోతున్నాయి దేవా  

ప్రేమ, నిద్దర, కరువాయి  
గొంతులోకి తిండి కరువాయి 
పశుసంపద, నీరు కరువాయి  
ఆశలు చిగురించే దారిచూపవా దేవా 

కలియుగ మాయను 
చేధించు మహాదేవా 
మూడోకన్ను తెరచి 
మమ్ము కాపాడు శివా 

--((**))--

ప్రాంజలి ప్రభ
రచయిత:మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

కనురెప్పల మాటున వచ్చే కన్నీరు
చెవి దొప్పల మాటున వినే శబ్ధాలు
మోకాలి చిప్పలు అరిగేటి నడకలు
మాకున్న తిప్పలు తొలగించవా దేవ

అడుగులలో తడబాటు
మాటలలో పొరబాటు
చేతలలో  తొందరపాటు
మా గ్రహబాటు తొలగించు దేవా

మనసులోని మూగరొద
అర్ధం చేసుకోలేని బాధ
ఎవ్వరికీ చెప్పలేని వ్యధ
మా వ్యాధి తొలగించు దేవా 

తిరిగి తిరిగి అలసితి
వగచి వగచి తెలిపితి
మనసుతో కదలి చేరితి 

నీవేగతి దేవా శ్రీ శ్రీ నివాస
__((**))--

ప్రాంజలి ప్రభ-(4)
రచయిత: మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

మనసు మనసులో లేదు
భవ బంధాలకు చిక్కి ఉన్నా
గుండె ధైర్యం నాకు లేదు
నిన్నే ప్రార్ధిస్తూ ఉన్నా శ్రీ శ్రీ నివాసా

మిన్నును అందు కొనే శక్తి లేదు
మన్నును నమ్ముకొని ఉన్నా
నీవు హృదయంలో ఉన్నా తెల్వలేదు
ప్రశ్నలకే చిక్కి ఉన్నా శ్రీ శ్రీ నివాసా 

మచ్చలేని వ్యక్తిత్వం కనబడ లేదు
సమన్వయం తో పోరాడు తున్నా
నిచ్చెన ఎక్కినా,  దారి కనబడ లేదు
జ్ణానతేజస్సు కోరుతున్నా శ్రీ శ్రీ నివాసా 

సేవా దృక్పథం నాలో మార లేదు
నిర్లక్ష్యముతో నలిగి పోయి ఉన్నా
నాకుకష్టాలు మారే మార్గము లేదు
నిన్నే నమ్ముకొని ఉన్నా శ్రీ శ్రీ నివాసా 
--((**))--

ప్రాంజలి ప్రభ - నేటి కవితలు 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

1. జీవితము! 

చేయకూడని పనులు, చేయలేని పనులు,
అర్ధం కోసం, ఆరాటపడే  పనులు, నివారించడమూ!

మంచి పనులు, శ్రమకు తగ్గ ఫలిత మిచ్చే పనులు,
నలుగురు మెచ్చే పనులు, ప్రేరే పించడమూ!

రహస్యాలు, భాధలు, కుటుంబ విషయాలు,
స్త్రీద్వారా వచ్చే కలహాలు, దాచటమూ !

మంచిగుణముతో ధర్మభుద్ది, చిత్తశుద్ధి,
కలిగి జ్ఞానమును, వ్యాప్తి చేయటమూ!        

గాలిలోగాని, నీటిలోగాని, భూమి మీదగాని, అగ్నిలోగాని,
ఆపదలు వచ్చిన అందరితో, కలసి ఉండటమూ!

నీవెంట నేనున్నానని, నిన్ను విడిచి నే నుండ లేనని, 
ఒకరి కొకరు అర్ధంచేసుకొని బ్రతకటమే జీవితమూ!

ఆపదలలో ఆదుకొంటానని, సేవలు చేయడమే ఋణమని,
ఈ లోకం యే మన్నా నీకు నేను, నాకు నీవు అనుకుంటేనే, జీవితము!

అనుమానాలకు తావివ్వక, ఆశలకు పోక, ఆశయాలతో   
సుఖదుఃఖాలు కలసి మెలసి పంచుకుంటేనే నిజమైన జీవితం.   
-((**))--
ప్రాంజలి ప్రభ - నేటి కవితలు 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
       
2. శ్రేయోభిలాషి (2/64)

మావటివాడు అంకుశము తో పొడిచిన ఎగరలేని ఏనుగులా!
తుఫాను వచ్చి నదులు, సముద్రములో కలసిన తలవంచే గడ్డిపరకలా! 
ఎన్ని అడ్డంకులు వచ్చినా, పల్లమునకు జాలువారు నీటిలా!
పెనుగాలికి వృక్షాలు, పడిపోకుండా అడ్డుగా ఉండే, మఱ్ఱి వృక్షములా !
సమిధలు వేసి, నేయి పోసి, మండించినా దాహము తీరని అగ్నిలా !
దుఖం, వేదన, ఓటమి, నష్టము, సమ్మేళనాలు జీవితంలో క్షనికములా !
సుఖం,సంతోషం,గెలుపు,లాభం సమ్మేళనాలు జీవితమే సముద్రములా!
కంటికి కనురెప్పలా, పవిత్రమైన సలహాలు ఇచ్చి, కాపాడే యోగిలా !
సత్యమ్, ధర్మం, న్యాయం, ప్రకృతి ననుసరించి సూర్య చంద్రులు లాగా నిత్యమూ కష్టపడుటకు చేయూత  నిచ్చువాడు,  భేదము   లేకుండా  ఆపదలో ఆదు కునేవాడు అందరి కష్టాలను తీర్చి, అవసరానికి ఆదుకొనే వాడే నిజమైన శ్రేయోభిలాషి . 
-((**))--
ప్రాంజలి ప్రభ - నేటి కవితలు 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
3. ఆమె ఓ అమ్మ !(3/64)

సంతాన, సంతోష,  సౌభాగ్యాలు, ఆమె గుండె చప్పుళ్ళు !
శ్రీపతి మృదు మధుర పలుకులు,  ఆమె పెదవుల ముచ్చట్లు !
మనవుడు చేసే ఆకతాయి పనులు, ఆమెకు తెలియని ఇక్కట్లు !
చివరి రక్తపుబొట్టు వరకు శ్రమించిన, ఆమెకు తరగని కన్నీళ్ళు !

సంతానము కోసం ఆమె సర్వేంద్రియములు ఖర్చు చేసినట్లు !
తల్లి తండ్రులకోసం, మమకారం పంచలేక ఆమె మనోవేదన చెందినట్లు !
అత్తమామల కోసం ఆమె జీవితాంతం అణిగి మణిగి ఉండినట్లు  !
భర్త కన్నాముందు  సౌభాగ్య వతిగా శివసానిధ్యం పొందాలనుకొన్నట్లు !

స్నేహితులకోసం, ప్రేమను పంచలేక  ఆమె మౌనం వహించినట్లు !
ఒక చుట్టు లాగా సర్వం అర్పించేది ఒక్క తల్లిమాత్రమే, ఆమె అందరిని ఒకదత్రాటిపై నడిపించుటకు నిత్యమూ ప్రయత్నమూ చేసినట్లే 
--((**))--

ప్రాంజలి ప్రభ - నేటి కవితలు 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
మాతృ భాష !(4/64)

కోకిల మాతృ భాష  "కుహు కుహు"  సంగీత భాష !
లెగదూడ మాతృ భాష" అంబా " కేరింత అరుపు భాష !
కప్పు మాతృ భాష "బెక బెక" లాడు ముచ్చటిమ్చ్ భాష ! 
పిల్లల మాతృ భాష "అమ్మా అమ్మా" అని మరువలేని స్వర భాష !

మాతృ భాష మారేది లేదు, మరోభాష వచ్చేది లేదు !
మనుగడకు మాతృభాష, బ్రతుకు తెరువుకు మర భాష !
ఎన్నివేషాలు వేశిన, ఏ విద్య నేర్చు కున్న మారదు తల్లి భాష ! 
భవిషత్తుకు పునాది, మార్గదర్శికి పెన్నిధి, మాతృభాష !

మనోవికాసానికి భాష, భావావేశాన్ని తెలిపే  మాతృభాష !
విదేశి భాషకు పట్టం కట్టకు,   చేయకు ద్రోహం మాతృభాషకు! 
--((**))--

ప్రాంజలి ప్రభ - నేటి కవితలు 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

5. వ్యసనాలు         

కామానికి రావణుడు, వాలి, కీచకుడు, ఏమైనారో తెలుసుకొ !
జూదమునకు  నలమహారాజు, ధర్మరాజు ఏమైనారో తెలుసుకొ!
మత్తుకు బానిసై శుక్రాచార్యులు, ఇంద్రుడు ఏమైనారో తెలుసుకొ!
వేటవల్ల దశరధుడు, పాండురాజు, ఏమైనారో తెలుసుకొ!

పలుకు ప్రల్లదనువల్ల శిశుపాలుడు, దూర్వాశుడు ఏమైనారో తెలుసుకొ!
వృధా వ్యయం చేసి రాజులు, మహారాజులు, ఏమైనారో తెలుసుకొ!
కామానికి బలి కాకుండా జీవతము సరిదిద్దుకొ !
జూదము అనేది మనస్సులోకి రానీక సంసారం సరిదిద్దుకొ !

ఇల్లు,వళ్ళు గుల్లచేసే మత్తు పానీయం త్రాగాట ఎందుకొ !
కోపముతో అనరాని మాటలు పలికి భాదపడుట  ఎందుకొ !   
నలుగురుకు సహాయపడుతూ జేవితం సాగించు ముందుకు ! 
--((**))--

ప్రాంజలి ప్రభ - నేటి కవితలు 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
                                  
. నిశ్శబ్దం 

జాలువారు నదులు కడలిలో 
కలుయును, నిశబ్ధముగా  !
సంఘటనలు కొన్ని కాలంతోపాటు, 
సమసి పోవును, నిశబ్ధముగా  !

ఇరువురు పారవశ్వముతో జరుపును, 
సృష్టి కార్యము నిశబ్ధముగా  !
కలవరింతలు, అనుకోని శబ్ధాలు,
నిద్ర పాడుచేయు నిశబ్ధముగా  !

సూర్య-చందృలు ఒకరి తరువాత
ఒకరు విధిగా మారుతారు, నిశబ్ధముగా  !
సత్యం, ధర్మం, న్యాయం, అనేవి 
తెలుపు కాలము ఉండు నిశబ్ధముగా  !

పిలిచినట్లు మనస్సు కలువ పువ్వులా
విచ్చుకుంటుంది,  నిశబ్ధముగా  !
శబ్ధములతో పగటిపూట సంసారం సాగు,
రాత్రికి సర్దు కొంటుంది నిశబ్ధముగా  !

భూమి అలుపెరుగగా తిరుగుతూ 
సమస్త జీవాలాను భరించుతూ నిశబ్ధముగా  !
ప్రతిఒక్కరు శారీరక సంభంధాలు
వీడి పరమానంద ప్రాప్తిని పొందేది నిశ్శబ్దం . 

--((**))--

బాధ

ఒక నరకము అనుకోవలదు !
ఇల్లాలు పంచే సుఖం 
ఎనాటికి  మరువ వలదు !

అవసరాలకు మించిన 
ధనమున్న సుఖములేదు !
ఒక అభద్ధాన్ని నమ్మించటానికి
 ప్రయత్నం చేయవలదు !

భాదలోకూడా వ్యర్ధముగా,
 అతిగా మాట్లాడ వలదు !
సత్యం పలుకుతూ ఉండి ,
బాధలోకూడా  అసత్యం పలకకూదదు !   

బాధతో పరుగులు తీసె వాళ్లకు,
 ప్రశాంతత ఉండదు !
ప్రేమలేని చోట, 
బాధవ్యక్తముచేసిన ఫలితము ఉండదు !

కోపము వచ్చినవారికి,
 ఎదుటివారి బాధ పడుతారని తెలీదు !
బాధను భరించి తగినమందు
 తీసుకోని ఉండుట తెలీదు !

--((**))--  

ప్రాంజలి ప్రభ - నేటి కవితలు

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ


8. మనిషి *



మట్టిలోకి  యంత్రమై

మట్టిని పైకి నెట్టుతూ

ముందుకు దూసుకుపోతూ !



గాలిలోకి యంత్రమై

గాలి తేమను పైకి నెట్టుతూ

ముందుకు సాగి పోతూ !



కొత్తదారులు దొరకక,

 పాతదారిలో బ్రతకలేక,

మంచులా కరిగిపోతూ !



మనిషిగా నిజం  మాట్లాడితే,

 మృగాన్ని తరిమినట్లు

తరుముతూ !



ఆశల వలయాల్లో చిక్కి,

మనిషి కట్టిన కోటలు,

పేక మేడల్లా కూలిపొతూ !



కోకిల గానాన్ని వింటూ,

 మనిషి శబ్ధ కాలుష్యాన్ని,

 జీవితములో  భరిస్తూ !



అర్ధంలేని  అర్ధం కోసం,

ఇతరుల మేప్పుకోసం,

పనులు చేసి విలపిస్తూ  !



వినగూడని మాటలు వింటూ,

విన్నది చేప్పలేక, మౌనంగా బ్రతుకుతూ !

ఒక వేపు మారణహోమం సాగిస్తూ,



మరో వైపు తర్పణాలు వదులుతూ !

మనిషి కామాన్ని అదుపులో ఉంచుకోలేక,

మృగ జాతికి జీవం పోస్తూ !



జీవిత చివరి ఘడియలలో

ఒక్కరూ ఆదుకోలేక,

వీధి కుక్కలా విలపిస్తూ !



కొందరు చేసిన

పుణ్య ఫలమో,  దానఫలమో,

అందరి ముందు స్వాస విడుస్తూ !



మంచిని పెంచి,

వంచనను త్రుంచి, మంచిమాటలతో,

మనస్సును త్రుప్తిపరుస్తూ !



నిన్నటి గురించి ఆలోచించక,

రేపటి గురించి విచారించక,

నేడే  సంతోషముగా జీవిస్తూ !



దేశ మంటే మట్టి కాదోయ్

దేశమంటే మనుష్యు లోయ్

సొంతలాభం కొంత మానుకొని

పొరుగువాడికి సాయపడే వాడే మనిషి



భవ బంధాలను భరిస్తూ,

ఈ దేశంకు, భూ దేవికి భారం,

కాక జీవించేవాడే నిజమైన మనిషి.



--((**))--

 ప్రాంజలి ప్రభ - నేటి కవితలు

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ


9. లీల       



ప్రకృతి పరవశించే వేళ,

యువజంట తన్మయత్వంతో లీల !

పున్నమి వెన్నల వేళ,

పరవసించి పరువాలు పంచుకొనే లీల !



మల్లెపూల పరిమళాల వేళ,

కోరికలు సద్విని  యొగంచేసుకొనే  లీల !

సూర్యోదయం శుభవేళ,

వ్యాయామమే ఆరోగ్యం మార్పులీల !



అమృతఘడియలవేళ,

దైవాణ్ని ప్రార్ధిస్తే మనసుకు ప్రశాంతి లీల !

పరుల దోషము నెంచు వేళ,

ప్రకోపము బయట పెట్టు లీల!

   

పరులను హింసించు,

నీచ గుణము లేకుండు లీల !

అదేపనిగా ప్రతి విషయంలో,

లంపటత్యం లేకుండు లీల !



దురభిమానము, ద్రోహము,

అనుమానము లేకుండు లీల !

ప్రతిఒక్కరిలొ అభిజనమదం,

విద్యామదం,ధనమదం లేకుండు లీల ! 



యవ్వరికి ఆనాడు  అర్థంకాలేదు,

శ్రీకృష్ణ పరమాత్ముని లీల.

లీలను గురించి వర్ణించటం నాతరమా ఈ వేళ.

--((**))--


ప్రాంజలి ప్రభ

నిత్య భక్తి ముక్తి మార్గము
భక్తి శక్తి యుక్తి మార్గము
శక్తి విద్య స్పార్తి
మార్గము
విద్య స్పూర్తి సేవ
మార్గము
స్పూర్తి సేవ సత్య
మార్గము
సేవ సత్య ధర్మ
మార్గము
సత్య ధర్మ న్యాయ
మార్గము
ధర్మ న్యాయ శిక్షణ
మార్గము
న్యాయ శిక్షణ కూర్పు
మార్గము
త్రిపురాంతకం దర్శన
శుభమార్గము

తకధిం తకధిం తోం తోం థా
వినయం జననం లేదు లేదు అనకు
తరుణం మరణం లేదు లేదు అనకు

తోం తౌం థా తకధిం తకధిం
లేదు లేదు అనకు జంఝాటం బంబాటం
లేదు లేదు అనకు తన్నుకోటం నమ్ముకోటం

తకధిం తకధిం తోం తోం థా
కోపము లోపము లేదు లేదు అనకు
శోకము తాపము  లేదు లేదు అనకు
తకధిం తకధిం తోం తోం థా
వినయం జననం లేదు లేదు అనకు
తరుణం మరణం లేదు లేదు అనకు

తోం తౌం థా తకధిం తకధిం
లేదు లేదు అనకు ఆరాటం పోరాటం
లేదు లేదు అనకు కోలాటం సల్లాపం


తోం తౌం థా తకధిం తకధిం
లేదు లేదు అనకు ఆరాటం పోరాటం
లేదు లేదు అనకు కోలాటం సల్లాపం
--((*))--
PRANJALI PRABHA
Mallapragada Sridevi Ramakrishna

ఊపిరి సలపని ఊహై నిలిచావు
ఊహల కందని ఉనికై మిగిలావు
ఊసరవెల్లిలా రంగులను మార్చావు
ఊయల్లో ఊపి ఆనందాన్ని అందించావు

మాటల కందని మనసై నలిగావు
మనసును దోచి మమతందించావు
జాబిల్లి కందని తారవై  జరిగావు
జాము రాతిరి నిద్రపోనియ్యదన్నావు

ఆకలి తీర్చని అరుగై అలిగావు
ఆశలు తీర్చి అలుపును మార్చావు
వాకిలి తెర్చిన పొదుపై మిగిలావు
కావడి మోసిన మనిషై మరిచావు

కౌగిలి చిక్కక చినుకై తడిపావు
కలసి కలవని బతుకై కలిసావు
తలచి తలవని తలపై తడిపావు
మరచి మరవని మెరుపై మురిసావు

కళలు కరగని నిజమై నిలిపావు
కలల పండించి మాతో ఉన్నావు

--((*))--
ప్రాంజలి ప్రభ - నేటి కవితలు
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
తెలుపు

కలువపూలు తెలుపు, కమలములు తెలుపు,  కల్పవృక్షం తెలుపు !
కసేరుక తెలుపు, కళానిధి తెలుపు, కామ ధెనువు తెలుపు !
కనికరము తెలుపు, కర్తవ్యం తెలుపు, కర్పూరం తెలుపు, !
కళ దేతుం తెలుపు,  కళ త్రం తెలుపు,  కల్యాణం తెలుపు, !

కాదమ్బరీ తెలుపు,   కామేశ్వరీ తెలుపు, కారుణ్యం తెలుపు, !
కళ్ళు తెలుపు, కుతూహలమ్ తెలుపు, కిరణం తెలుపు, !
అన్నం తెలుపు , అన్నపూర్ణ  తెలుపు, ఆనందం తెలుపు, !
ఉప్పు తెలుపు , ఉమ్మి తెలుపు , ఉషోదయం తెలుపు, ! 

సన్నాయి తెలుపు, సన్నజాజి తెలుపు, సన్నికల్లు తెలుపు !
నువ్వులు తెలుపు, నవ్వులు తెలుపు, నవరత్నాలు తెలుపు !
కెరటాలు తెలుపు, కన్నీరు తెలుపు, కనికరం తెలుపు !
కాపురం తెలుపు, కామితార్ధం తెలుపు, కాషాయం తెలుపు !
--((**))--  

ప్రాంజలి ప్రభ - నేటి కవితలు
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
వద్దు   

అనువు కానిచోట అధికుల మని, సంబరపడవద్దు !
ఎవ్వరూ అపసకునాల మాటలు అనవద్దు, వినవద్దు !
నిత్యం అధరామృతము కోసం ఆరాట పడవద్దు !
అగ్ని జ్వాలలు కుటుంబములో రగిలించ వద్దు !

అగ్ని హృదయాన్ని  దాహిస్తుందని,  మరువవద్దు !
అనా వృష్టి ఏర్పడినప్పుడు, దుక్కి దున్న వద్దు !
కుటుంబములో అనుమానము అనేది, ఉండవద్దు !
గాది  క్రింద పందికుక్కులు ఉన్నా భయ పడవద్దు !

వెన్నలను చూపి, వెన్నముద్ద కోరుతాడను, కోవద్దు !
చిరుతలా పరిగెత్తవద్దు, ఏ విషయానికి  కంగారు పడవద్దు !
జీవితం కత్తి మీద సాము లాంటిదని మరువ వద్దు !
అందరిలో మంచివాడని అనిపించుకోవటం కద్దు !
--((**))--

సత్వగుణంబది నిర్మలంబు పాప రహితంబు
సత్య జ్ఞాన దాయకం వికార భావ రహితం
నిత్య సుఖ సాంగత్య స్ఫూర్తి ప్రదాయకం
జాతి జ్ఞానాభిమాన జీవ దేహబంధ కారకం

రాగభరిత బహు కామ జనితం రజోగుణం
భోగాసక్త మోహ అహంభావ పూరితం
భాగ్య వాంఛిత మానస నిత్య ప్రయాసం
యోగ్య రహిత కర్మసంగ జీవ బంధనం

షడ్వికార అజ్ఞాన జనితం తమోగుణం
జడత్వ మూఢ అవివేక దోష కారణం
గాఢ వాంఛా ప్రమాద నిద్రాలస్య ఫలం
రూఢిగ ఇంద్రియ ప్రేరిత దేహ బంధనం

సత్వరజస్వమో గుణ గణ పరిణామం
సర్వ జీవులకు మానసిక దేహ బంధకం
నిర్వహించిన మది మాధవ భక్తి పూర్వకం
పర్వము జీవనము పరమపద సాధకము

--((**))--

జీవన మార్గం (1 )
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

బ్రతుకు బండి కుంటు బడింది 
నేనున్నా అంటూ ముందు కొచ్చింది 
ఎవరు ఏమన్నా తల వంచింది 
ధైర్యాన్నే నమ్ముకొని అడుగేసింది 

నానమ్మకమే నాకు జయమన్నది
కన్నీరు తుడిచే దారి ఇదేనన్నది 
కలువృత్తి చేయుట తప్పు కాదన్నది 
క్షురకర్మ చేయుట కర్మ కాదన్నది 
  
తండ్రే గురువుగా భావించింది 
వృత్తి కత్తి మీద సామైనది 
కలము పట్టె చేయి కత్తి పట్టింది 
అదే చదువనుకొని నిష్ణాతగా మారింది

కూడు, గుడ్డ కొరకు స్త్రీ అని భయపడక 
మగవారి గడ్డాన్ని సుందరంగా తీర్చి దిద్దింది 
స్వేద బిందువులు రాలిన  
రక్త బిందువులు రానివ్వక 
విధాత కల్పించిన విద్యగా భావించి 
తల్లి తండ్రుల కన్నీరు తుడిచే 
కూతురుగా ఎందరికో ఆదర్శకురాలయింది
హిమబిందువు కాదు 
అమృత బిందువైనది.    
 --((**))--

జీవన మార్గం (2) ప్రాంజలి ప్రభ 
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

మరదలను బుట్టలో వేసుకొనుటకు 
బావ పడ్డ పాట్లు 

నవ జీవన సుకుమారమా 
నవ భావన మాధుర్యమా 
నవ రత్నపు నక్షత్రమా 
నవ రాగపు రత్నమా 
ఓ నా మరదలా 

నా మనసును దోచిన గంధమా 
నాకు పరిమళాలు అందించే పుష్పమా 
నన్ను వరించిన ధన గుణ సంపెంగమా  
నా మనసంతా శాంతి నింపే అమృతమా 
ఓ నా మరదలా 

నవ నవ నాడే నడుమున్నా భామా 
నయన మనోహరములు గల సుమా 
నటన తెలియని ముద్దా మందారమా 
నిత్యాను భూతుల తొ  రంజిల్లిదామా 
ఓ నా మరదలా 

నిర్మల హృదయంతో నేమ్మదౌదామా  
నిర్విరామంగా  అనుభవిమ్చుదామా 
వలపు తలపు అంటూ ఎకమౌదామా 
నువ్వు నేను కలసి ఒకటై జీవిద్దామా 
ఓ నా మరదలా 

అంత ప్రాధేయ పడకు 
నేను చదువుకున్నా 
నీవు పూజారివై యున్నా
నీ మంచితనము నన్ను ఆకర్షించి 
నేనూ పూజారిగా నీ చేదోడుగా ఉంటా 

--((**))--

మితిమీరిన  ఖర్చు  ...
                    🌿 పేదరికం పాలు చేస్తుంది. ☘☘

🌱🌱మితిమీరిన  పొదుపు  ..
                🌿 కష్టాల పాలు చేస్తుంది.☘☘

🌱🌱మితిమీరిన  సంపాదన  ...
                🌿మనశ్శాంతిని లేకుండా చేస్తుంది.

☘☘
మితిమీరిన  కర్తవ్యం  ...
                అగచాట్ల పాలు చేస్తుంది.

🌱🌱మితిమీరిన  క్రమ శిక్షణ  ...
                 🌿 రక్త సంబధీకులను దూరం చేస్తుంది.☘☘

🌱🌱మితిమీరిన  బాధ్యతలు  ...
                🌿  అప్పుల పాలు చేస్తుంది.☘☘

🌱🌱మితిమీరిన  హాస్యం  ...
                🌿  నవ్వుల పాలు చేస్తుంది.☘☘

🌱🌱మితిమీరిన  కోపం  ...
                🌿 శతృవులను వృద్ధి చేస్తుంది.☘☘

🌱🌱మితిమీరిన  ఆలోచనలు  ...
                🌿 జీవితాన్ని దుర్భరం చేస్తుంది.☘☘

🌱🌱మితిమీరిన  వ్యసనాలు  ...
                🌿అప మృత్యు పాలు చేస్తుంది.☘☘

🌱🌱మితిమీరిన  స్వార్ధం  ...
                🌿 అందరినీ దూరం చేస్తుంది.☘☘

🌱🌱మితిమీరిన  పోటీ  ...
                🌿 నష్టాల పాలు చేస్తుంది. ☘☘

🌱🌱మితిమీరిన  లాభార్జన  ...
                🌿వ్యాపార ఉనికికే మోసం తెస్తుంది .☘☘

🌱🌱మితిమీరిన  వస్తుత్పత్తి  ...
                🌿 నాణ్యతా ప్రమాణాలను దెబ్బ తీస్తుంది.☘☘

🌱🌱మితిమీరిన  గర్వాహంకారం  ...
                🌿 ఆపదలు కొని తెస్తుంది.☘☘

 🌱🌱మితిమీరిన అలంకారం  ...
                🌱 వెగటు పుట్టిస్తుంది.☘☘

🌱🌱మితిమీరిన  శృంగారం  ...
                🌱  వైరాగ్యాన్ని కలిగిస్తుంది.☘☘

🌱🌱మితిమీరిన  కామాంధకారం  ...
                🌿జీవచ్ఛవాన్ని చేస్తుంది.

🌱🌱మితిమీరిన  అత్యాశ   ..
                🌿  నేరాల పాలు చేస్తుంది.☘☘

🌱🌱మితిమీరిన  అధికార దాహం  ...
                🌿 హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తుంది.☘☘

🌱🌱మితిమీరిన  త్యాగం  ...
                🌿  కడగండ్ల పాలు చేస్తుంది.☘☘

🌱🌱మితిమీరిన వ్యవసాయకోత్పత్తి  ...
                🌿భూమిని నిస్సారం చేస్తుంది.☘☘

🌱🌱మితిమీరిన  జనాభా పెరుగుదల  ...
                🌿 దేశ ప్రగతిని త్రొక్కేస్తుంది. ☘☘

🌱🌱మితిమీరిన  స్నేహాలు  ...
                 🌿 అభిప్రాయ భేదాలను సృష్టిస్తుంది.☘☘

🌱🌱మితిమీరిన  గారాబం  ...
                 🌿చెడు స్నేహాల పాలు చేస్తుంది.☘☘

🌱🌱మితిమీరిన  వేదాంతం  ..
                .🌿  వెటకారం పాలు చేస్తుంది.☘☘

🌱🌱మితిమీరిన  ఈర్షా ద్వేషాలు  ..
                🌿  నిద్రా సుఖాన్ని దూరం చేస్తుంది.☘☘

🌱🌱మితిమీరిన   భక్తి  ...
                🌿  మూర్ఛల పాలు చేస్తుంది.☘☘

🌱🌱మితిమీరిన  తీర్ధ యాత్రలు  ...
                🌿 నాస్తికత్వానికి నాంది పలుకుతుంది.☘☘

 🌱🌱మితిమీరిన  ఉపవాసాలు  ...
                🌿 నిస్త్రాణతకు దారి తీస్తుంది.☘☘

🌱🌱మితిమీరిన  ప్రేమ  ...
                🌿అనుమానాలకు దారి తీస్తుంది.☘☘

🌱🌱మితిమీరిన  నమ్మకం  ..
                🌿  ద్రోహానికి దోహదం చేస్తుంది.☘☘

🌱🌱మితిమీరిన  విశ్వాసం  ..
                .🌿  లోకువ పాలు చేస్తుంది.☘☘

🌱🌱మితిమీరిన  ఋణం  ...
                 🌿మరణం పాలు చేస్తుంది.☘☘

🌱🌱మితిమీరిన  అభిరుచి  ...
                 🌿 దుబారాకు దారి తీస్తుంది.☘☘

🌱🌱మితిమీరిన  కీర్తి దాహం  ...
                🌿  ఆదాయాన్ని మింగేస్తుంది.☘☘

🌹🌹🌹అతి సర్వత్రా వర్జేయత్ 
 తస్మాత్  ...🌹🌹🌹             
 జాగ్రత్త  ...   🌹
జాగ్రత్త  ...  🌹
జాగ్రత్త .🌹

🎨 మితా హారం  ... 🌹
🎨 మిత భాషణం  ...🌹
🎨 మితమైన నిద్ర  ...🌹
🎨 మిత సంసారం  ...🌹
🎨 మిత సంపాదన🌹
🎨 మనో కాలుష్య రహితంగా ...🌹
🎨 జీవన యానం సాగిస్తే  ...🌹
_🎨 పరిపూర్ణమైన జీవితానంద   ప్రక్రియకు  అదే రాచబాట... 🌹

_💦 ప్రశాంతమైన మనశ్శాంతికి
అదే పూల తోట._🌹🌹🌹

మూర్తీభవించిన
మానవతా విలువలకు 
అదే పెట్టని కోట.

  • మీ శ్రేయోభిలాషి...




     ప్రాంజలి ప్రభ
ఈ వారం కధ కిదు నిజం(2)

           *మన ఆలోచనలు ఎలాగో*🦜
       *మన జీవితం అలాగే సాగిపోతది*💜

           *నీ మనసును ఎప్పుడు*🌻
         *ప్రేమతో ప్రశాంతత తో నింపు*...💛

           *పెదవులపై చిరునవ్వు నీ*🌼
            *వెలిగిస్తూ వుండు*... 💚😀

         *నీ జీవితాన్ని నీకు నచ్చినట్టు*🌷
           *సాగేలా ఆ ప్రకృతి మొత్తం*
            *నీకు తోడుగా వుంటది*.. ❤

        *నీవు ఎలా ఆలోచిస్తావో*🏵
        *అదే నీ జీవితంగా మారుతది*🦋

     🌷🌻 *స్వచ్చమైన శుభోదయం*☘🌷
             🌹🌸 *హ్యాపీ సండే*🌸🌹
🌷దేశబాషలందు తెలుగు లెస్స🌷
💪జై జవాన్🙏జై కిసాన్🤝
🙏భారత్ మాతాకి జై🙏🌹



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి