4, అక్టోబర్ 2019, శుక్రవారం

అమ్మపాటలు



భక్తి లీల  -   10
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ప్రేమించినా నీ ప్రాబల్యమేనమ్మా 
కామించిన నీ ప్రోత్సాహమేనమ్మా
మోహించినా నీ ప్రోద్బలమేనమ్మా   
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా   ..... 1

మరులుగొన్న మనసు నీదమ్మా
భగ్నమైన హృదయం నీదేనమ్మా  
ఉద్విగ్నమైన ధేయం నీదేనమ్మా
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా .... 2

రోదించిన రోజులు నీదరిమ్మా 
ద్వేషించిన రోజులు నీదరిమ్మా
దూషించిన రోజులు నీదరిమ్మా
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా...... 3

సాధించిన రోజులు నీకృపమ్మా 
స్నేహించిన రోజులు నీకృపమ్మా 
ప్రేమించిన రోజులు నీకృపమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా...... 4

ప్రసవ వేదన మా పాపమమ్మా 
బ్రతుకు వాదన మా దూషణమ్మా   
మెతుకు రోదన మా శాపమమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా .....  5

అక్షర సాధన నీ జ్ఞానమమ్మా 
జీవన సరళి నీ మోక్షమమ్మా 
మధుర భావన నీ రూపమమ్మ 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ...... 6

హృదయ లాలన నీ ధ్యేయమమ్మా 
సాహితీ సాధన నీ ప్రార్ధనమ్మా 
విరహ వేదన నీ వరమమ్మా
నేను వ్రాయుట నీ లక్ష్యమేనమ్మా ..... 7

వినోద ధ్యేయమే నీ కర్తవ్యమమ్మా 
జన్మల ఫలమే  కర్మత్వమమ్మా 
జీవన వేదమే సంసారమమ్మా      
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ...... 8

మనసు మనసు కల్పినావమ్మా 
వయసు వయసు కల్పినావమ్మా
తేజస్సు తేజస్సు కల్పినావమ్మా  
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ....... 9

విద్యా కకార రూపవతివమ్మా 
సమస్త కళ్యాణ రూపిణివమ్మా 
గుణాల నిర్ణయ సుశీలవమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 10

భక్తిని పంచేటి జననివమ్మా 
త్రిమూర్తి కళా స్వరూపిణివమ్మా  
కమల నయన భవానివమ్మా        
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ..... .. 11

పాపాన్ని భరించే కల్మషివమ్మా 
కరుణామృత పరాంబికవమ్మా 
లత లందించిన లలితవమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా...... 12

కదంబ వృక్షాల నివాసివమ్మా  
పంచాక్షరీ మంత్రం నందించావమ్మా 
మన్మధభాణం సంధించవమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా .....  13 

కనక గిరి జగన్మాత వమ్మా 
రత్నాల దీప నివాసిని వమ్మా     
ఇరువైఐదు ప్రాకారాల్లో అమ్మా
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా...... 14 
   
నానా ఫలవృక్షాలలో నీ వమ్మా
నవరత్న మండపాల్లో నీ వమ్మా
మూడు కూపాల్లో శోభిల్లుతా వమ్మా
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ...... 15
  
చంద్రవదన తపస్విని వమ్మా   
మహాపద్మముపై కూర్చున్నా వమ్మా 
శ్రీపుర నివాసిని విన్నా వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ....... 16

కాంచిపురాన నివాసితి వమ్మా   
చాతుర్వర్ణాలకు దేవత వమ్మా 
యజ్ఞ లక్ష్యాన్ని తీర్చేది నీ వమ్మా
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 17

హయగ్రీవ రూపాన్ని కొలిచా వమ్మా 
అగశ్యకి సాక్షాత్త్కరించా వమ్మా    
ఉపదేశించిన లలిత వమ్మా   
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 18

ఏకామ్ర నాధుని నాయకి వమ్మా 
దూర్వాసు నారాధించే తల్లివమ్మా 
అభీష్ట సిద్ధుల్ నొసగి  నావమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 19

అద్యేత సిద్ధాంత రూపిణివమ్మా 
ఆత్మజ్ఞాన నంద రూపిణివమ్మా 
రక్షించు శ్రీ చక్ర వాసిణివమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 20

పృద్వి బీజ నివాస మాతవమ్మ 
అణిమాది సిద్ధు లందించావమ్మా
బ్రహ్మీ శక్తులను మంత్రిమ్చా వమ్మా  
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 21

సర్వ సంక్షోభిణీ రక్షిత వమ్మా 
ముల్లోకాల్ని మోహింప చేస్తావమ్మా 
జాగ్రదా వస్థకు సాక్షి  వైనావమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 22

శివబీజాంశీ భూత మాత వమ్మా  
అష్టదళ పద్మ వాసితి వమ్మా  
సుషుప్తికి సాక్షి భూతురాలమ్మా  
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 23

కామ కళా బీజ రూపిణి వమ్మా 
నిత్య సంప్రదాయ యోగిణి వమ్మా 
పరివేష్టించే సిద్ది మాత వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 24

సర్వ వశంకరుల శక్తి వమ్మా 
సర్వసౌభాగ్య ప్రసాదిత వమ్మా  
బ్రహ్మజ్ఞాన చైతన్య మాత వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 25

విష్ణు బీజ రూపిణి మాత వమ్మా 
త్రిపురా చక్ర నిలయతి వమ్మా    
కులో తీర్ణ యోగినీ మాత వమ్మా
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 26

సర్వసిద్ధుల నిచ్చు ధాత్రి వమ్మా 
వశిత్వ సిద్ధి రూపిణి  నీవమ్మా 
శ్రీ విద్యా దేవతవు నీవేనమ్మా  
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 27

అగ్ని బీజ రూప ధారిణి వమ్మా 
నిత్య ప్రకృతి స్వరూపిణివమ్మా 
త్రిపుర మాలినీ దేవత  వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 28

ప్రాకామ్య సిద్ధి వరూపిణి వమ్మా 
మహాంకుశ ముద్రాధారిణివమ్మా 
సమస్త భక్తుల్ని రక్షిత వమ్మా  
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 29

శ్రవనేంద్రియ రూపవతి వమ్మా   
సృష్టి స్థితి లయ మూలం నీవమ్మా 
త్రిశక్తి బీజ త్రిపురాంబ వమ్మా  
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 30

అతి రహస్యంతో యోగిని  వమ్మా 
ఆయుధాలతో కామేశ్వరి వమ్మా
బీజాలలో వసించుమాత వమ్మా
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 31

సిద్ధిలను ఇచ్చే శ్రీ దేవి వమ్మా     
సమాధి చైతాన్య రూపిణి వమ్మా 
సర్వ కామ సిద్ధి రూపిణి వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 32

సర్వ త్రిఖండ ముద్రవాసి వమ్మా   
తురీయ విద్యా రూపిణి నీవమ్మా 
ధర్మార్ధ కాల స్వరూపిణి వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 33

కొల్చె మహా నిత్య దేవత వమ్మా 
శ్రీ విద్యాత్మ స్వరూపిణి వమ్మా 
త్రికోణమందు శ్రీ లక్ష్మి నీవమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 34

మునులు ఆరాధించే మత వమ్మా 
ఋషులు ప్రార్ధించే దేవత వమ్మా 
దేవతలే కొలిచే దేవి వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 35

వంశ పారం పర్య దేవత వమ్మా 
గురువుల కే మాత వైనవమ్మా  
ముప్పది సోపానాలు దైవమమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 36

జీవకోటికి సృష్టి కర్తవమ్మా 
బ్రహ్మాండానికి గాత్రనాదమమ్మా 
లోకల్లో స్వేచ్ఛా విహారిణి వమ్మా   
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 37

అహాన్ని తొలగించు తావమ్మా 
సత్యం ధర్మం న్యాయంకు దైవమమ్మా
 పూజకే సంతృప్తి కారుణి వమ్మా  
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 38 


--((***))--

అమ్మపాట -9

సత్వగుణ సంపద నందించి 
స్వచ్ఛత తో స్వేచ్ఛ ను కల్పోంచి
స్వార్ధం లేని హృదయం పంచిన
శ్రీ మాతా లలితా దేవికి వందనమ్ము

సర్వానంద మయం చేసి
సర్వ సిధ్ధులను అందచేసి
సర్వరోగ హర అయిన
శ్రీ మాతా లలితాదేవి కి వందనమ్ము

సర్వ రక్షణలను కల్పించి
సర్వార్ధక సాధనలను అందించి
సర్వ సౌభాగ్యాలు ఏర్పరిచిన
శ్రీ మాతా లలితాదేవికి వందనమ్ము

సర్వ సంక్షోభాన్ని తొలగించి
సర్వత్రా ఉత్కంఠ ను తొలగించి
సమ్మోహం పెంచి ప్రేమను అందించే
శ్రీ మాతా లలితా దేవి కి వందనమ్ము

సందేహాన్ని నివృత్తి పరచి
సంసయాలన్ని తొలగించి
సంస్కార వంతులుగా మార్చిన
శ్రీ మాతా లలితా దేవికి వందనమ్ము

సంప్రదాయాలను మాకు తెలియపరిచి
సద్బుధ్ధి మాకందరికి అందించి
సద్భావల సమ్మోహ ప్రేమను అందించిన
శ్రీ మాతా లలితా దేవికి వందనమ్ము
--(())--

అమ్మపాట -8

అమ్మా, అమ్మా పసుపు కుంకుమతో 
గాజులు వేసి పూజిస్తున్నామమ్మా 
నీ మాహిమలూ మాకు చూపి
మా తప్పులు తిద్ధి మమ్ము ఆదుకోవమ్మా 

బ్రహ్మ సృష్టికి నీవేమూలం కదమ్మా 
మా శక్తి సామర్ధ్యాలకు నీ తేజమేనమ్మా 
మా ఆలోచన అంతా నీ కరుణయేనమ్మా 
మాబిడ్డల పోషణ భాధ్యతనీవేనమ్మా 

మా బిడ్డల విద్యా బుద్ధులకు 
గురువుగా సరస్వతి వైనవమ్మా 
మాకు ఆరోగ్యసంపాదన కల్పించి 
క్రమ బుద్ధి కల్పిచే మహాలక్ష్మివమ్మా   

కుటుంబానికి పౌష్టిక ఆహారాన్ని అందించి 
ఆత్మానందం అందించే అన్నపూర్ణవమ్మా 
మాకు దృఢ సంకల్పం  శక్తినిచ్చి 
సన్మార్గంలో నడిపించే పార్వతివమ్మా 

సహాయసహకారు అందిస్తూ దుష్టులను 
ఎదుర్కొనే శక్తినిచ్చే మాహాకాళివమ్మా 
దుర్మార్గాన్ని అణిచే శక్తినిచ్చి 
న్యాయ మార్గంలో ఉంచే దుర్గవమ్మా   

ప్రకృతిలో సహకరించి వికృతి 
చేష్టలు, మాటలను మార్చే మర్దినివమ్మా 
స్త్రీని అగౌరపరచి పరస్త్రీవ్యామోహంలో 
ఉన్న వారిని మార్చే చండివమ్మా  

అమ్మా, అమ్మా పసుపు కుంకుమతో 
గాజులు వేసి పూజిస్తున్నామమ్మా 
నీ మాహిమలూ మాకు చూపి
మా తప్పులు తిద్ధి మమ్ము ఆదుకోవమ్మా 

--((***))----


అమ్మపాట -7


ఓం శుద్ధలక్ష్మ్యై బుద్ధిలక్ష్మై వరలక్ష్మై నమో నమః |

నమస్తే సౌభాగ్యలక్ష్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౧

వశోలక్ష్మై కావ్యలక్ష్మై గానలక్ష్మ్యై నమో నమః |
నమస్తే శృంగారలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౨ ||

ధనలక్ష్మ్యై ధాన్యలక్ష్మ్యై ధరాలక్ష్మ్యై నమో నమః |
నమస్తే అష్టైశ్వర్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౩ ||

గృహలక్ష్మ్యై గ్రామలక్ష్మ్యై రాజ్యలక్ష్మ్యై నమో నమః |
నమస్తే సామ్రాజ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౪ ||

శాంతిలక్ష్మ్యై దాంతిలక్ష్మ్యై క్షాంతిలక్ష్మ్యై నమో నమః |
నమో అస్త్వాత్మానందలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౫ ||

సత్యలక్ష్మ్యై దయాలక్ష్మ్యై సౌఖ్యలక్ష్మ్యై నమో నమః |
నమ పాతివ్రత్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౬ ||

గజలక్ష్మ్యై రాజలక్ష్మ్యై తేజోలక్ష్మ్యై నమో నమః |
నమో సర్వోత్కర్షలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౭ ||

సత్త్వలక్ష్మ్యై తత్త్వలక్ష్మ్యై భోధలక్ష్మ్యై నమో నమః |
నమస్తే విజ్ఞానలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౮ ||

స్థైర్యలక్ష్మ్యై వీరలక్ష్మ్యై ధైర్యలక్ష్మ్యై నమో నమః |
నమస్తేస్త్వౌదార్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౯ ||

సిద్ధిలక్ష్మ్యై రుద్ధిలక్ష్మ్యై విద్యాలక్ష్మ్యై నమో నమః |
నమస్తే కళ్యాణలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౧౦ ||

కీర్తిలక్ష్మ్యై మూర్తిలక్ష్మ్యై వర్ఛోలక్ష్మ్యై నమో నమః |
నమస్తేత్వనంతలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౧౧ ||

జపలక్ష్మ్యై తపోలక్ష్మ్యై వ్రతలక్ష్మ్యై నమో నమః |
నమస్తే వైరాగ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౧౨ ||

మంత్రలక్ష్మ్యై తంత్రలక్ష్మ్యై యంత్రలక్ష్మ్యై నమో నమః |
నమో గురుకృపాలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౧౩ ||

సభాలక్ష్మ్యై ప్రభాలక్ష్మ్యై కళాలక్ష్మ్యై నమో నమః |
నమస్తే లావణ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౧౪ ||

వేదలక్ష్మ్యై నాదలక్ష్మ్యై శాస్త్రలక్ష్మ్యై నమో నమః |
నమస్తే వేదాంతలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౧౫ ||

క్షేత్రలక్ష్మ్యై తీర్థలక్ష్మ్యై వేదిలక్ష్మ్యై నమో నమః |
నమస్తే సంతానలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౧౬ ||

యోగలక్ష్మ్యై భోగలక్ష్మ్యై యజ్ఞలక్ష్మ్యై నమో నమః |
క్షీరార్ణవపుణ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౧౭ ||

అన్నలక్ష్మ్యై మనోలక్ష్మ్యై ప్రజ్ఞాలక్ష్మ్యై నమో నమః |
విష్ణువక్షోభూషలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౧౮ ||

ధర్మలక్ష్మ్యై అర్థలక్ష్మ్యై కామలక్ష్మ్యై నమో నమః |
నమస్తే నిర్వాణలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౧౯ ||

పుణ్యలక్ష్మ్యై క్షేమలక్ష్మ్యై శ్రద్ధాలక్ష్మ్యై నమో నమః |
నమస్తే చైతన్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౨౦ ||

భూలక్ష్మ్యై తే భువర్లక్ష్మ్యై సువర్లక్ష్మ్యై నమో నమః |
నమస్తే త్రైలోక్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౨౧ ||

మహాలక్ష్మ్యై జనలక్ష్మ్యై తపోలక్ష్మ్యై నమో నమః |
నమః సత్యలోకలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౨౨ ||

భావలక్ష్మ్యై వృద్ధిలక్ష్మ్యై భవ్యలక్ష్మ్యై నమో నమః |
నమస్తే వైకుంఠలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౨౩ ||

నిత్యలక్ష్మ్యై సత్యలక్ష్మ్యై వంశలక్ష్మ్యై నమో నమః |
నమస్తే కైలాసలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౨౪ ||

ప్రకృతిలక్ష్మ్యై శ్రీలక్ష్మ్యై స్వస్తిలక్ష్మ్యై నమో నమః |
నమస్తే గోలోకలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౨౫ ||

శక్తిలక్ష్మ్యై భక్తిలక్ష్మ్యై ముక్తిలక్ష్మ్యై నమో నమః |
నమస్తే త్రిమూర్తిలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౨౬ ||

నమః చక్రరాజలక్ష్మ్యై ఆదిలక్ష్మ్యై నమో నమః |
నమో బ్రహ్మానందలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౨౭ ||

--((***))--


అమ్మ పాట-5
శరన్నవరాత్రులలో ఈనాటి అవతారం బ్రహ్మచారిణి

అమ్మా బ్రహ్మచారిణి
నీ ముసిమసి నవ్వుల పెదాలు
పెద్ద పెద్ద కళ్ళతో చూసే చూపులు
నా మనసును ఆకర్షిస్తున్నాయి
నన్ను కాపాడే బ్రహ్మచారిణివమ్మా

కాలం అనేది తెలియలేదు నీసన్నిధిలో
నిన్ను పిలుస్తున్నట్లు నీపలకరింపు పెదాలే
నీచూపులో మర్మమేదో తెలియుటలేదమ్మా
నాధ్యాస అంతా అందరికీ శుభాలే అందిస్తావమ్మా
అందుకే నీవు మాకు బ్రహ్మచారిణి వమ్మా

ఎన్నెన్నో ఊహలతో నీదరిచేరామమ్మా
మనస్సుకు శాంతి సౌభాగ్యాలు కల్పించే
అమ్మలుగన్న అమ్మవునీవేనమ్మా
చరిత్రనే తిరిగి రాసే శక్తి మాకు కల్పించే
నిజమైన బ్రహ్మచారిణి వమ్మా

హృదయ తాపాన్ని తీర్చి ఉల్లాస ఉత్సాహ
పరిచే మాకుల దేవత బ్రహ్మచారిణి వమ్మా
అందుకే నీసన్నిధినుండి వేడుకుంటున్నామమ్మా
అమ్మా అమ్మా బ్రహ్మచారిణివి నీవేనమ్మా

--((***))--
ఈరోజు అమ్మవారి అవతారము బ్రహ్మచారిణికి వందనమ్ము 

లోకానికి బ్రహ్మచారిణి
మా కలల స్వరూపిణి
మా యింట నివాసిని 
మా మనసుకు మాత్రిని 

జ్ఞానాజ్ఞాములు నందించి 
సర్వలక్షణాలను కల్పించి 
సకల సంపదలందించి 
సర్వం ప్రకాశింప చేస్తున్న 
బ్రహ్మచారిణికి వందనమ్ము 
బ్రహ్మచారిణికి వందనమ్ము 

శ్రీ శబ్దము మాకు అందించి 
వాక్కే వాక్పరము  గావించి  
సత్వరజోతమో గుణాలు నుంచి 
మాతృశబ్దముచేత సత్త్వాన్నే 
పంచిన బ్రహ్మచారిణికి వందనమ్ము    
బ్రహ్మచారిణికి వందనమ్ము 

శ్రీమాతగా శ్రీచక్రము నందించి       
సమస్త లోకరక్షణకు సహకరించి
సర్వులకు సామర్ధ్యమును కల్పించి 
దు:ఖమును పోగొట్టి సంతోషాన్ని పంచే  
బ్రహ్మచారిణికి వందనమ్ము 
బ్రహ్మచారిణికి వందనమ్ము 

లోకానికి బ్రహ్మచారిణి
మా కలల స్వరూపిణి
మా యింట నివాసిని 
మా మనసుకు మాత్రిని 
బ్రహ్మచారిణికి వందనమ్ము 
బ్రహ్మచారిణికి వందనమ్ము 
--((***))--

అమ్మా ఈనాడు శైలపుత్రివమ్మా
నీకు ముత్యాలు రత్నాలు మురిపంతో 
మణులు మాణిక్యాలు మనసుతో
అర్పించాలనుకున్నాను  కానీ 
పూలతో నిన్ను అలంకరిస్తున్నాను 
అమ్మ ఈనాడు శైలపుత్రి వమ్మా
మాకుల దేవత నీవేనమ్మా

ఇష్టాలకు అయిష్టాలకు  
భావాలకు మేలు కొలుపు  
నిశీధిలో తళుకు మనుటకు    
రాగద్వేషాలకు బానిసనై 
నిన్ను కొలుస్తున్నా శైలపుత్రి గా

విధివిసిరిన బాణాలకు చిక్కి  
రెక్కలు విరిగిన పక్షిలా ఉండి
కాంక్ష ఆకాంక్షల మధ్య నలిగి
ఆశగా కలం వైపు చూస్తూ   
నిన్ను కొలుస్తున్నా శైలపుత్రి గా

కృత్రిమ నవ్వు విన్యాసాలకు చిక్కి 
భవ బంధాల బందీలకు దక్కి 
పేనుతుఫానుకు రాలే ఆరాతిలా ఉండి 
సంస్కారమనే ముసుగును చేరి     
నిన్ను కొలుస్తున్నా శైలపుత్రిగా

చిగురుటాకుల్లా విల విల లాడి 
సీతాకోకచిలకల్లా రంగులు మార్చి 
అగ్నికి మంచులా కరిగి పోయి 
శక్తివంచన లేకుండా నిన్నే ఆరాధించి  
నిన్నే కొలుస్తున్నాను శైలపుత్రిగా

అమ్మా ఈనాడు శైలపుత్రివమ్మా
నీకు ముత్యాలు రత్నాలు మురిపంతో 
మణులు మాణిక్యాలు మనసుతో
అర్పించాలనుకున్నాను  కానీ 
పూలతో నిన్ను అలంకరిస్తున్నాను 
అమ్మ ఈనాడు శైలపుత్రి వమ్మా

మాకుల దేవత నీవేనమ్మా

--((***))--

--((***))-- అమ్మ పాట-1
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

అమ్మా భవానీ అమ్మలుగన్నమ్మా భవానీ
నీ మధురస్మృతులను నెమరువేసుకుంటూ
నిదుర పట్టని రాత్రులను గడుపుతుంటూ
హృదయపు మదిలో ఆవిష్కరించు కుంటూ
నిన్నే ఆరాధిస్తున్నాము అమ్మా భవానీ

అమ్మా భవానీ అమ్మలుగన్నమ్మా భవానీ
అంతరంగంలో నిన్నే ఆవిషరించుకుంటూ
అనంత విశ్వంలో ఆనందం కల్గించమంటూ
ఆదర్శంతో ఆత్మీయత ప్రేమను పంచుకుంటూ
ఉన్నా నిన్నే ఆరాధిస్తున్నాము అమ్మా భవానీ

అమ్మా భవానీ అమ్మలుగన్నమ్మా భవానీ
అలలులా ఉరకలు వేసే మా ఆశలను తుంచమంటూ
గాలికి కదిలే మేఘంలా బంధాలను పెనవేసుకుంటూ
తరువుల్లా సమస్తము అందరికి అందుబాటు కల్పిస్తూవుంటూ
ఉన్నా నిన్నే ఆరాధిస్తున్నాము అమ్మా భవానీ

అమ్మా భవానీ అమ్మలుగన్నమ్మా భవానీ
బుద్ధినీ సక్రమముగా ఉంచమని వేడుకుంటూ
పరధ్యాస లేకుండా మనస్సు నీపైఉండాలంటూ
అర్ధాలను వెతుక్కుంటున్న భక్తి పిపాసిని నేనేనంటూ
ఉన్నా నిన్నే ఆరాధిస్తున్నాము అమ్మా భవానీ

--((***))--

దయచేసి పాటగా రికార్డు చేస్తే పెట్టగలరు
--((***))--

అమ్మపాట -2
రచయిత : మల్లాప్రగడ  శ్రీదేవి రామకృష్ణ 

అమ్మా దుర్గమ్మా కనకదుర్గమ్మ 
ఇంద్ద్రకీలాద్రిపై ఉన్న పెద్దమ్మా 
మమ్ము కాపాడే కృష్ణవేణమ్మా
అమ్మా అ్మమ్మా  అమ్మవునీవమ్మా 

కవితాధారలకు ఆలంబనమై 
మనస్సు ఉల్లాసమునకు మూలమై 
మనోనిగ్రహశక్తికి ఆధారమై 
జీవశక్తి  ప్రతి బంధాలను తొలగించే 
అమ్మా  దుర్గమ్మా కనకదుర్గమ్మా 
మమ్ము కాపాడే కృష్ణవేణమ్మా  

సంకల్ప తేజం అక్షరమై
దు:ఖపుముడులను మాయమై 
సత్యాన్వేషణ మార్గమై 
అద్భుతమై న అమ్మతనమై  
మనసే ఒక మందిరమై  
వేడుకుంటున్నామమ్మా దుర్గమ్మా  
మమ్ము కాపాడే కృష్ణవేణమ్మా  

నవ్యతా భావాలు ఏకమై 
కాలానుగుణముగా పూజలై
కాంతి మార్గంలో జీవమై 
అవిశ్రాంతై ఉన్న అక్షరమై 
సందర్భాలను సమం చేసుకొని 
నిత్యం ప్రార్ధించు తున్నాను దుర్గమ్మా  
మమ్ము కాపాడే కృష్ణవేణమ్మా

మనుష్యుల్లో ఉన్న  రక్షాస్వత్వాన్ని,
స్వార్ధపూరిత ఆలోచనలన్నీ 
కల్ముష భావజాలాన్ని చితిమివేసి
ఆత్మఘోష అమృతవాక్కుగా మార్చి 
ప్రాణులకూ ప్రాణంపోసే దుర్గమ్మా 
మమ్ము కాపాడే కృష్ణవేణమ్మా 

అమ్మా దుర్గమ్మా కనకదుర్గమ్మ 
ఇంద్ద్రకీలాద్రిపై ఉన్న పెద్దమ్మా 
మమ్ము కాపాడే కృష్ణవేణమ్మా
అమ్మా అ్మమ్మా  అమ్మవునీవమ్మా 

--((***))--

అమ్మపాట -3
రచయిత : మల్లాప్రగడ  శ్రీదేవి రామకృష్ణ 

సర్వం సమస్త హృదయం
సర్వ మంగళ దాయకం కల్పించే 
అమ్మలుకన్నఅమ్మవు నీవేనమ్మా  
మహాలక్ష్మీ, మాహేశ్వరీ, దుర్గమ్మా 

భోగవస్తువుల మాయకు చిక్కి 
మమతానురాగ ద్వేషానికి చిక్కి
వెలుగును తరిమే చీకటికి చిక్కి
కుటుంబ హోరుకు చిక్కామమ్మా 
కనురెప్పలా కాపాడుమమ్మా  
అమ్మలుకన్నఅమ్మవు నీవేనమ్మా  
మహాలక్ష్మీ, మాహేశ్వరీ, దుర్గమ్మా 
  
అయస్కాతంలా ఆకర్షించలేక 
పారిజాత పుష్పములా ఉండలేక
నూనె కాగుతున్నట్లు గుండెకాగుతూ 
కుటుంబ హోరుకు నల్గిపోతున్నామమ్మా 
చీకటితరిమే వెలుగులా కాపాడుమమ్మా  
అమ్మలుకన్నఅమ్మవు నీవేనమ్మా  
మహాలక్ష్మీ, మాహేశ్వరీ, దుర్గమ్మా 
  
కావడి కుండల్లా కదులుతూ  
గడకర్రలా జీవితాన్ని నెట్టుకుంటూ 
దూదిపింజంలా, నీటిబుడగలా ఉంటూ 
కుటుంబ హోరుకు యంత్రమైనామమ్మా  
మనుషుల ఆశలుతీర్చి కాపాడుమమ్మా  
అమ్మలుకన్నఅమ్మవు నీవేనమ్మా  
మహాలక్ష్మీ, మాహేశ్వరీ, దుర్గమ్మా 

సర్వం సమస్త హృదయం
సర్వ మంగళ దాయకం కల్పించే 
అమ్మలుకన్నఅమ్మవు నీవేనమ్మా  
మహాలక్ష్మీ, మాహేశ్వరీ, దుర్గమ్మా 

--((***))-- 

🌿శరన్నవరాత్రులు ,పూజా విధానం🌼🌿
పూజ మొదలు పెట్టడం..
ముందుగా పసుపు గణపతిని పూజించి నిర్విఘ్నంగా మీ నవరాత్రి పూజ జరగాలి అని కోరుకోవాలి . కలశాన్ని మీకు అలవాటు ఉంటే పెట్టండి లేకపోతే ఉద్దరిణిలో పువ్వు వేసి దానిపై చై పెట్టి కలశంగా భావించి మంత్రం చదివి ఆ నీటిని పూజ ద్రవ్యాల పైన చల్లి సంకల్పమ్ చెప్పుకుని ఆచనం చేసి ఏ రోజు ఏ దేవత రూపాన్ని పూజించాలి ఆ దేవతకు సంబంధించిన అష్టోత్తరం , స్త్రోత్రం తో ఆర్చన చేసి నివేదన చేసి హారతి ఇవ్వాలి... కలశం, సంకల్పమ్, ఆచమనం అన్ని వ్రత పుస్తకాలు లో లభిస్తుంది... గమనించండి.
శరదృతువులో వస్తుంది కాబట్టి ‘శరన్నవరాత్రులు’ అంటారు. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ అశ్వయుజ శుద్ధ పాడ్యమినుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర. మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడట.
నవదుర్గలు గా పూజించే వారు ఆ రూపంలో , ఆ రోజుల్లో వివిధ రూపాల్లో పూజించే వారికి ఆ రూపంలో వివరాలు ఉన్నాయి చూడఁడి. ప్రతి రోజూ లలితా సాహస్త్ర నామం పారాయణ చేయాలి..కుంకుమతో అర్చన చేయడం ఇంకా మంచిది.
ప్రధమంశైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి

తృతీయం చంద్రఘంటేతి, కూష్మాంతేతి చతుర్ధామ్||
పంచమం స్కంధమాతేతి షష్ఠమం కాత్యాయనీ తిచ
సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం
నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||
🌼🌿1 శైలపుత్రి (బాలా త్రిపుర సుందరి): దుర్గాశరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే మొదటి అవతారం శైలపుత్రి. దక్షుని ప్రథమ పుత్రిక. శిరస్సున అలంకారంగా బాల చంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్నీ చేత బట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు పతికావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మిం చింది. ఆమె వాహనం ఎద్దు. ఎద్దులా మొద్దు స్వరూపాలై పోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కల్గించడానికి సంకేతం శైలపుత్రి.
ఈ రోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది.
శ్లో|| వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం| వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||
బాలా త్రిపుర సుందరి దేవి గా గృహంలో పూజించే వారు తల్లి స్త్రోత్రం , అష్టోత్తరం తో అర్చన చేయాలి లలితా సహస్త్ర నామం చదివి నివేదించి హారతి ఇవ్వాలి
🌼🌿2. బ్రహ్మచారిణి ( గాయత్రి , రెండవ రూపం అయిన గాయత్రి గా పూజించే వారు శత గాయత్రీ జపించాలి, గాయత్రి ఉపదేశం లేని వారు అష్టోత్తరం , లలితా సహస్త్ర నామం తో పూజ పూర్తి చేయాలి) : దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోరతపస్సు చేస్తుంది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. ఆమెకే కన్యాకుమారి అనే మరోపేరుంది. ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రాసిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి.

శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ | దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||
పాయసం నివేదించాలి
🌼🌿3. చంద్రఘంట ( అన్నపూర్ణ,: అన్నపూర్ణగా ఆరాధించే వారు అష్టోత్రం, లలితా సహస్త్ర నామంతో అర్చించాలి ) : అమ్మవారి మూడవ అవతారం చంద్రఘంట ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం. శిరస్సుపై ధరించిన అర్థచంద్రుడు అర్ధాకృతలో ఉండటం వల్ల ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ తల్లిని శరణుజొచ్చినవారికి ఎల్లప్పుడూ అభయఘంట మోగుతూ ఉంటుంది.

శ్లో|| పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా| ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||
పులిహోర, పెసరపప్పు పాయసం నివేదించాలి
🌼🌿4. కూష్మాండ ( కామాక్షి స్త్రోత్రం): అమ్మవారి నాలుగవ అవతారం కూష్మాండ అంటే బూడిద గుమ్మడికాయ ఈమె తేజోమయి. ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండటం వల్ల ఈమెను ‘అష్టభుజదేవి’ అని కూడా అంటారు.

శ్లో|| సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ| దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||
కూరగాయలు వేసి చేసిన కాదంబం నైవేద్యం పెట్టాలి
🌼🌿5. స్కందమాత ( లలిత అష్టోత్తర, సహస్త్ర నామంతో): అయిదో అవతారం స్కందమాత స్కంధుడు అనగా కుమార స్వామి. స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు. ఈ తల్లి వాహనం కమలాసనంపై పద్మాసనంగా శ్వేతపద్మంతో శోభిల్లుతుంది. తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా ఆ అమ్మ ఉద్ధరిస్తుందునటానికి సంకేతమే ఇది.

శ్లో|| సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా| శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||
గోధుమ రవ్వతో చేసిన కేసరి, మిర్యాల పొంగలి నివేదించాలి
🌼🌿6. కాత్యాయని (లక్ష్మి అష్టోత్తరం, సహస్త్ర నామం): దుర్గామాత ఆరో అవతారం కాత్యాయని. ‘కొత్స’ అనే రుషి తనకు పార్వతీమాత కుమర్తెగా జన్మించాలని తపస్సు చేశాడు. అతనికి కూతురుగా జన్మించింది. కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ని వధించడానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అశంతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్టమొదట ఈ కాత్యాయనిని మహర్షి పూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమినాడు మహిషాసురుణ్ని వధిస్తుంది.

శ్లో||చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా | కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||
బెల్లం అన్నం, అన్నం ముద్దు పప్పు, నైవేద్యం
🌼🌿7. కాళరాత్రి ( సరస్వతి స్త్రోత్రం ,లలితా సహస్త్ర నామం ): దుర్గామాత ఏడో అవతారం కాళరాత్రి. ఈమె శరీరం ఛాయ చీకటివలె నల్లగా ఉంటుంది. ఇందుకే ఈదేవికి కాళరాత్రి అని పేరు. ఈమె వాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు.

శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా| లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |
వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా| వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||
దద్దోజనం, చక్కెర పొంగలి నైవేద్యం
🌼🌿8. మహాగౌరి ( దుర్గ అష్టోత్రం,విజయ దుర్గా స్త్రోత్రం, లలితా సహస్త్ర నామం) : అమ్మవారి ఎనిమిదవ అవతారం మహాగౌరి. ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది. దీని కారణంగా ఈమె దేహం నల్లబడుతుంది. ఆమె తపస్సుకుమెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. దాని వలన ఆమె శరీరం గౌరవర్ణతో విద్యుత్తు కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధి కెక్కింది.

శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః| మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||
గారెలు, పులిహోర నైవేద్యం
🌼🌿9. సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని స్త్రోత్రం, లలితా సహస్త్ర నామం ) ( రాజ రాజేశ్వరి స్త్రోత్రం ): దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిధాత్రి. ఈమె అన్ని సిద్ధులనూ ప్రసాది స్తుంది. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈదేవీ కృపతో పొందాడని దేవీ పురాణాలు చెబుతున్నాయి.

శ్లో|| సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి| సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||
కొబ్బరి అన్నం, నిమ్మకాయ పులిహోర.
విజయ దశమి నాడు యాదశక్తి పూజ చేసి ఆయుధ పూజ, శమీ వృక్షం పూజ, దానం, బ్రాహ్మాన సత్కారం ఎవరి శక్తి కొద్దీ వారు చేయాలి..పైన చెప్పిన నైవేద్యాలే చేయాలని నియమం లేదు మీ శక్తి కొద్దీ మీకు ఉన్నది భక్తిగా సమర్పించండి..
🌼🌿శమీవృక్షం ప్రార్థన:🌼🌿

శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ,

అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ.

శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా,
ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ.
కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా,
తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే.''

పైన చెప్పిన మంత్రార్థం ఏమిటో చూద్దాం.
"శమీ వృక్షము అనేది పాపాన్ని శమింపచేసేది. శత్రువులను నాశనం చేస్తుందిది. ఇది నాడు అర్జునుని ధనువును కల్గి ఉండింది. శ్రీరాముడికి ప్రియాన్ని కల్గించింది.
యాత్రార్థులకు సౌఖ్యాన్నిస్తుంది. పనులన్నిటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది."
ఈ విధంగా శక్తి కొద్దీ అమ్మవారి కి పూజ చేసుకోవాలి, శ్రీ మాత్రే నమః అని నిరంతరం జపించాలి.
🌼🌿 ఓం శ్రీమాత్రే నమః 🌼🌿

చిత్రంలోని అంశాలు: 1 వ్యక్తి, నవ్వుతున్నారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి